TDP MLA
-
కావలి నియోజకవర్గ టీడీపీ నేతలు జూద శిబిరం నిర్వహణ!
-
టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనయుడు హల్ చల్
-
రూపాయికి పది రూపాయాలు అత్త ఇలాకాలో అల్లుడి అరాచకాలు
-
పార్వతీపురంలో అక్రమంగా భూములు లాగేసుకుని.. టీడీపీ ఎమ్మెల్యే అరాచకాలు
-
ఎమ్మెల్యే యరపతినేని హింస రాజకీయం
-
దెందులూరులో చింతమనేని కనుసన్నల్లో రెడ్ బుక్ రాజ్యాంగం
-
మరోసారి కక్షసాధింపుకు దిగిన కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి
-
అతిగా రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా.. : ఎమ్మెల్యే గుమ్మనూరు
సాక్షి ప్రతినిధి, అనంతపురం/గుంతకల్లు: పత్రికల్లో ఇష్టమొచ్చినట్టు రాసుకుంటూ వెళితే రైలు పట్టాలపై పడుకోబెడతానని అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ పాత్రికేయులను హెచ్చరించారు. గుంతకల్లులో టీడీపీ ప్రతినిధుల సమక్షంలో ఆయన మాట్లాడిన వీడియో టేపులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక టీవీ చానల్ (సాక్షి టీవీ కాదు)లో గుమ్మనూరు జయరాం సోదరులు రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతున్నారన్నట్టుగా వార్తలొచ్చాయని, వాటిని నిరూపించాలని అన్నారు. తనకు మీడియా అంటే లెక్కలేదని, ఏదైనా అతిగా రాస్తే నిజంగానే రైలు పట్టాలపై పడుకోబెడతానని హెచ్చరించారు. ‘నేను అన్నీ చేసి వచ్చాను. ఇది నాకు పెద్ద లెక్క కాదు’ అని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తన సోదరులు రాజకీయ పెత్తనం చేస్తున్నారని చాలామంది అంటున్నారని, అవసరమైతే వారిని పక్కనపెట్టి తానే రాజకీయం చేస్తానని అన్నారు. తనపై వార్తలు రాస్తే తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చారు. తనపై కొంతమంది పనిగట్టుకుని వ్యతిరేక వార్తలు రాస్తున్నారని, వాటిని నిరూపించలేకపోతే నిజంగానే రైలు పట్టాలపై పడుకోబెడతానని అన్నారు. తాను ఫ్రెండ్లీగానే అడుగుతున్నానని, ఏదైనా రాసేట్టయితే చెప్పండని, తాను వెళ్లిపోయాక ఏవేవో రాయొద్దని అన్నారు. బుధవారం సాయంత్రం గుంతకల్లులో మీడియాతో మాట్లాడుతూ.. తనపై మీడియా చానళ్లు అసత్య ప్రసారాలు చేస్తున్నాయని, రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతానంటూ ప్రసారాలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. ఇలాంటి ప్రసారాలను చేస్తే ఇదే తరహాలో ప్రవర్తించాల్సి వస్తుందని మీడియాకు వార్నింగ్ ఇచ్చారు. -
మీడియాపై నోరుపారేసుకున్న జయరాం
అనంతపురం, సాక్షి: జర్నలిస్టులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన గుంతకల్లు(Guntakal) టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై జర్నలిస్టు సంఘాలు భగ్గుమంటున్నాయి. తనపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతానంటూ బహిరంగంగా ఆయన హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో.. ‘‘జర్నలిస్టులను(Journalists) రైలు పట్టాలపై పడుకోబెడతా అంటూ గుమ్మనూరు జయరాం వార్నింగ్ ఇవ్వడం దుర్మార్గం. తక్షణమే ఆయన మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పాలి’’ అని ఏపీయూడబ్లూజే జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ చౌదరి డిమాండ్ చేశారు. ఒకవేళ ఆయన క్షమాపణలు చెప్పకపోతే ధర్నాకు దిగుతామని జర్నలిస్టులు హెచ్చరిస్తున్నారు. ‘‘నాపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా. నాకు అన్నీ తెలుసు.. నేను ఏదైనా చేస్తా. నాపైన, నా కుటుంబ సభ్యులపైనా వార్తలు రాస్తే ఖబడ్దార్.. తాట తీస్తా. నేను అన్నీ చేసి వచ్చినోడ్ని.. ఏం రాసుకుంటారో రాసుకోండి’’ అంటూ ఓ కార్యక్రమంలో జర్నలిస్టులపై గుమ్మనూరు హెచ్చరికలు జారీ చేశారు.జయరాం ఆగడాలు మితిమీరిపోతున్నాయ్!జర్నలిస్టులపై టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం(Gummanur Jayaram) వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి స్పందించారు. ‘‘మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే జయరాం వార్నింగ్ ఇవ్వడం దుర్మార్గం. వాస్తవాలు రాసే జర్నలిస్టు లను రైలు పట్టాలపై పడుకోబెతారా?. ఆయన ఆగడాలు రోజురోజుకీ మితిమీరి పోతున్నాయి. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై గుంతకల్లు పోలీసుల దాడి చేశారు. రాష్ట్రంలో లాండ్ అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది. బాధితులపైనే హత్యాయత్నం కేసు కేసులు నమోదు చేస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల చెప్పు చేతుల్లో పోలీసులు పనిచేస్తున్నారు అని అనంతవెంకటరామిరెడ్డి మండిపడ్డారు. -
శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరుల బరితెగింపు
-
ఎమ్మెల్యే వచ్చి బూటు కాళ్లతో తంతుంటే పోలీసులు మాత్రం.. కొలికిపూడి శ్రీనివాస్ పై బాధితుడు ఫైర్
-
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దౌర్జన్యం
-
మందేసి చిందేసిన టీడీపీ ఎమ్మెల్యే
-
TDP ఎమ్మెల్యే మాధవిరెడ్డి దౌర్జన్యం
-
దళితులపై టీడీపీ దమనకాండ
-
మద్యం షాపులపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్
-
పార్వతీపురం ఎమ్మెల్యే నయా దందా.. లోకలోళ్లు వద్దు.. గెంటేయండి!
అమెరికా నుంచి దిగుమతి అయిన వాడిగా చెప్పుకుంటున్న పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే స్థానిక నేతలను దగ్గరకు రానివ్వడంలేదు. తన కోసం కొద్దిమంది లీడర్లను బయటినుంచి తెచ్చుకుని వారితోనే దందాలు చేస్తున్నారు.. సెటిల్మెంట్స్.. లిక్కర్ ఇవన్నీ వాళ్లతోనే చేయిస్తున్నారు. స్థానిక టీడీపీ నేతలకు ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా పోయింది. పార్వతీపురం (ఎస్సీ) నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే విజయ చంద్ర ఎన్నారై అనే బ్రాండ్ వేసుకొని లోకేష్ తాలూకా అని చెప్పుకుంటూ జస్ట్ ఎన్నికలకు ముందు పార్టీలో చేరారు. వస్తూనే హడావుడి చేసి అందర్నీ కలుపుకొని వెళ్తున్నట్టు నటించి గెలిచేశారు.తెలిసిన మరుక్షణం నుంచి తన గురువు చంద్రబాబు పంథాలోనే వెళుతున్నారు. అంటే గెలిచిన తర్వాత అదంతా తన గొప్పతనమేనని స్థానికంగా ఎవరు తనకు సపోర్ట్ చేయలేదని, తన సామర్థ్యం.. తన తెలివితేటలే తనని గెలిపించాలని చెప్పుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి ఆయనకు మొన్నటి ఎన్నికల వరకు నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఎన్ని పంచాయతీలు ఉన్నాయి అన్నది కూడా స్పష్టంగా తెలియదు. ఎక్కడో వ్యాపారం చేసుకుంటూ భారీగా డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని అకస్మాత్తుగా ఎమ్మెల్యే అభ్యర్థి అయిపోయారు గెలిచేసారు. మాజీ ఎమ్మెల్యే చిరంజీవి.. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్.. ఇంకా గొట్టపు వెంకట్ నాయుడు.. తదితరులంతా ఆయన కోసం పనిచేసి.. ఆయన్ని గెలిపించారు. అయితే తాను మాత్రం కార్యకర్తల ను ఏ మాత్రం లెక్క చేయకపోగా స్థానిక నాయకత్వాన్ని కూడా పూర్తిగా ఇగ్నోర్ చేశారు.సరికొత్త టీం దిగుమతిఇదిలా ఉండగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే అని ఎవరైనా స్థానికంగా అప్పటికే ఉంటున్న టీడీపీ క్యాడర్‌తో కలిసి మెలిసి పనిచేసుకుంటూ పోతారు. వారు చెప్పినట్లు చేయాలని లేకుండా వారిని కూడా కలుపుకొని పోవడం అనేది రాజకీయంగా ఒక ఆరోగ్యకరమైన వాతావరణం. కానీ విజయ్ చంద్ర మాత్రం ఎక్కడెక్కడో వేరే జిల్లాల నుంచి కొంత మందిని తీసుకొచ్చి తన చుట్టూ ఉంచుకొని వాళ్ల ద్వారా నియోజకవర్గంలో దందా చేస్తున్నారు. రెండు మూడు సార్లు ఎంపీపీలు జడ్పిటిసిలుగా చేసిన వాళ్ల సైతం విజయ్ చందన కలవాలంటే ముందు ఆ కోటరీని కలవాల్సి ఉంటుంది. వాళ్లను సంతృప్తి పరిస్తే తప్ప ఎమ్మెల్యే దర్శనం దక్కదు.. ప్రతి చిన్న విషయంలోనూ ఎమ్మెల్యే ఆయన బ్యాచ్ ఇన్వాల్వ్ అయిపోతూ బెదిరింపులు బ్లాక్ మెయిల్ వసూళ్లకు దిగుతున్నట్లు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ఎక్కడి నుంచో వచ్చాడని గెలిపిస్తే ఇలా పీక మీద కత్తి పెడితే ఎలా అని వారు భీతిల్లిపోతున్నారు.లిక్కర్ దందా మనదేమొన్నామధ్య లాటరీల లిక్కర్ షాపులు దక్కించుకున్న వాళ్లని సైతం ఎమ్మెల్యే పేరట అనుచరులు బెదిరించి 20 శాతం వాటా ఇస్తారా 10% కమిషన్ ఇస్తారా తేల్చుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికీ మార్జిన్లు లేక నష్టాల బాటలో షాపులు నడుపుతుంటే రాబందుల్లా ఎమ్మెల్యే బ్యాచ్ దిగిపోయిందని పెట్టుబడి పెట్టకపోయినా వ్యాపారం వాటా ఇవ్వాల్సిందిగా బెదిరిస్తున్నారని లిక్కర్ లైసెన్సీలు ఆవేదన చెందుతున్నారు.ఇదీ చదవండి: ఓరి మీ యేశాలో!.. కాకినాడ పోర్టు కబ్జాకు బాబు, పవన్ ఎత్తులుఇది కాకుండా రియల్ ఎస్టేట్.. ఇసుక.. కన్స్ట్రక్షన్ వంటి అన్ని వ్యాపారాల్లోనూ విజయ చందర్ జోరుగా జోకింగ్ చేసుకుంటూ కమిషన్లు నొక్కుతున్నారు. గట్టిగా మాట్లాడితే దాని దళిత ఎమ్మెల్యే అని అంటూ సరికొత్త బ్లాక్ మెయిల్‌కి దిగుతున్నారు. మాటకు మన ఉద్యోగులు బదిలీల విషయంలో కూడా సిఫార్సు లెటర్స్ కు రేటు పెట్టి మరి వసూలు చేసుకున్నారని.. గ్రామస్థాయి ఉద్యోగాల బదిలీల్లోనూ ఆయన డబ్బులు తీసుకుని లెటర్ ఇచ్చారని ఉద్యోగులు గొల్లుమంటున్నారు. రాజకీయాలకు కొత్తగా అయినా దందాలు చేయడంలో ఆరు నెలల్లోనే ఆరితేరిపోయారని మున్ముందు ఆయన ఇంకెంత రెచ్చిపోతారో తెలీదని స్థానిక వ్యాపారుల సైతం భయపడుతున్నారు.-సిమ్మాదిరప్పన్న -
మా ఎమ్మెల్యేకు నెలనెలా రూ.30 లక్షలు ఇవ్వాలట..
మదనపల్లె: ‘మా ఎమ్మెల్యే నన్ను పనిచేసుకోనివ్వట్లేదు. ప్రతినెలా రూ.30 లక్షలు కప్పం కట్టమంటున్నారు. ఆయన పురమాయించిన పనులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ చేసి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఆయన అక్రమాలకు సహకరించకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. నేను అవినీతిపరురాలినని.. పార్టీ అనుకూల పత్రికల్లో వార్తలు రాయించి వేధింపులకు గురిచేస్తున్నారు’.. అంటూ అన్నమయ్య జిల్లా మదనపల్లె తహసీల్దార్ ఖాజాబీ ఏకంగా సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను స్వయంగా కలిసి చెప్పుకున్న గోడు ఇది.తాను ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే పరిస్థితులు కల్పించాలని ఆమె వారిని వేడుకున్నారు. అధికార పారీ్టకి చెందిన మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాపై అక్కడి తహసీల్దార్ నేరుగా ముఖ్యమంత్రినే కలిసి ఆరోపించడం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. పాలనా వ్యవహారాల్లో టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల అరాచకం ఈ సంఘటనకు అద్దంపడుతోంది. తన ఫిర్యాదులో తహసీల్దార్ ఖాజాబీ ఇంకా ఏం పేర్కొన్నారంటే.. ఆఫీసుకు రాకుండా అడ్డుకుంటున్నారు..‘ఆయన చెప్పిన పనులు వీలుకాక పోయినా చేసి తీరాల్సిందేనంటున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో జరిగే ప్రతీపని తనకు చెప్పి చేయాలని బెదిరిస్తున్నారు. మండలంలోని బసినికొండ గ్రామం సర్వే నంబర్లు 718/8ఎ, 774/3, 510/1ఏ/2, వెంకప్పకోట సర్వే నంబర్.71/2కు సంబంధించి రెవెన్యూ చట్టం ప్రకారం సరిగ్గా ఉండడంతో మ్యుటేషన్ చేశానని, ఎమ్మెల్యేకు చెప్పకుండా ఎందుకు చేశావంటూ బెదిరిస్తూ, నన్ను ఆఫీసుకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇక కోళ్లబైలు గ్రామం సర్వే నంబర్ 965/5, 595లో 1.80 ఎకరాల్లో లేఔట్ వేసి రెండు సెంట్ల చొప్పున ఎమ్మెల్యే మనుషులకు ఇవ్వాలన్నారు. కానీ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండు సెంట్లు ఇచ్చే అవకాశంలేదని చెబితే వినిపించుకోలేదు.ల్యాండ్ కన్వర్షన్లు, మ్యుటేషన్లు తదితర రెవెన్యూ సేవలు ఎమ్మెల్యేకు చెప్పకుండా చేయరాదని హుకుం జారీచేశారు. అలాగే, తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ అస్లాం బాషాను ఎమ్మెల్యే తన చెప్పుచేతల్లో ఉంచుకుని, రికార్డులను సబ్ కలెక్టరేట్, కలెక్టరేట్‌కు పంపకుండా, పాలనాపరమైన పనులు జరగనీయకుండా అడ్డుకుంటూ, మానసికంగా నన్ను తీవ్ర ఒత్తిడులకు గురిచేస్తున్నారు. పైగా.. టీడీపీ అనుకూల పత్రికలో నాపై అసత్యాలు ప్రచారం చేయించారు’.. అంటూ ఆమె సీఎం, లోకేశ్ వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. -
ఏపీ అంతటా కొత్తగా ఎల్ఎం ట్యాక్స్! లేకుంటే పని జరగదు!!: అంబటి
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, అవినీతి, దోపిడీలపైనే కూటమి నేతలంతా దృష్టి పెడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాజా పరిణామాలపై శనివారం సాయంత్రం గుంటూరు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సంపద సృష్టించడం కంటే సంపద సృష్టించుకుంటాం.. అంతా మేమే దోచుకుంటాం’’ అన్నట్లుంది వాళ్ల తీరు ఉందని సెటైర్లు వేశారు. ఈ క్రమంలో పవన్ కాకినాడ పోర్టు పర్యటనపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులు వచ్చాయి. మద్యం షాపులకు లాటరీలు పెట్టారు. కానీ, మద్యం షాపులు దక్కించుకున్న వారిని బెదిరించి వాటాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీ లేదు. కూటమి నేతలు ఇసుకను దోచుకుంటున్నారు. చివరకు బూడిద కోసం కూడా కొట్టుకుంటున్నారు. ఆది నారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి బూడిద కోసం కొట్టుకుంటున్నారు. అక్రమార్జన కోసం టీడీపీ నేతలు వెంప్లరాడుతున్నారు. అవినీతి చేయడానికి కూటమి నేతలు పోటీ పడుతున్నారు. నియోజకవర్గాల్లో ఎల్ఎం (లోకల్ ఎమ్మెల్యే) ట్యాక్స్ నడుస్తోంది. ప్రతీదానికి లోకల్ఎమ్మెల్యే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఎవరైనా వ్యాపారం చేయాలన్నా.. ఏ పని జరగాలన్నా ట్యాక్స్ కట్టాల్సిందే. చివరకు.. కూటమి నేతలు అరాచకాలు చేస్తుంటే.. చంద్రబాబు పంచాయితీ పెట్టే స్థాయికి దిగజారారు. ఇన్నీ పాపాలు చేసే మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు.పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టు పర్యటనపై అంబటి సెటైర్లు సంధించారు. ఆల్రెడీ కలెక్టర్ పట్టుకున్న రేషన్ బియ్యంను చూడడానికి పవన్ సాహసోపేతంగా వెళ్లారు. తీరా ఒడ్డుకు వచ్చాక విచిత్రమైన ఆరోపణలు చేశారు. రెండు నెలల నుంచి ఆయన అక్కడికి వెళ్తానంటే అధికారులు అడ్డుపడుతున్నారంట. అధికారులు సహకరించలేదు అంట. ఆయన అసలు ప్రభుత్వంలో ఉన్నారో లేదంటే ప్రశ్నించే పక్షంలో ఉన్నారో అర్థం కావడం లేదు. కాకినాడ పోర్టుకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఎగుమతులు అవుతాయి. అందులో బియ్యం కూడా ఉంటుంది. అయితే ఆ బియ్యంలో పీడీఎస్ రైస్ కలిపి పంపించడమే స్కాం ఎప్పటి నుంచో నడుస్తోంది. గత ప్రభుత్వాలు కూడా కట్టడి చేసే ప్రయత్నాలు జరిగాయి. మరి అరికడతామని చెప్పిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. ఇప్పుడు ఆ బాధ్యత తీసుకుంటారా?. బియ్యం అక్రమ రవాణా అడ్డుకునే చిత్తశుద్ధి లేదు. ఇక.. అధికారులు తనను అడ్డుకుంటున్నారని పవన్ అంటున్నారు. బహుశా.. చంద్రబాబు, లోకేష్ చెబితేనే అధికారులు అలా చేశారేమో అనే అనుమానం కలుగుతోంది. అసలు డిప్యూటీ సీఎంకు అంతలా ప్రాధాన్యం ఇవ్వొద్దనే అధికారులు అలా ప్రవర్తించారేమో. ఇక్కడ ఇంకో విషయం.. కూటమి నేతల సహకారంతోనే ఈ స్కాం నడుస్తోంది. ఎమ్మెల్యే కొండ బాబుకు మామూళ్ళు లేకుండానే ఇదంతా జరుగుతుందా?. బియ్యం అక్రమ రవాణాకు బాధ్యత వహిస్తూ నాదెండ్ల మనోహర్, ఆ తర్వాత పవన్ ఇద్దరూ రాజీనామా చేయాలి. అంతేకాదు.. .. పవన్‌కు తన డైలాగ్‌కు తగ్గట్లే.. లెక్కలేనంత తిక్క ఉంది. అందుకే.. కాకినాడ పోర్టు నుంచి ఆర్డీఎక్స్ రావొచ్చని, కసబ్ లాంటోళ్లు వస్తారని, హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉన్నారా ఇంకా ప్రశ్నించే ధోరణిలో ఉన్నారా?. పవన్ కల్యాణ్ పెద్ద అసమర్థుడు అని అర్థం అవుతుంది అని అంబటి చురకలంటించారు. -
‘బుడమేరు వరద సాయం ఇదేనా బాబూ?’
విజయవాడ, సాక్షి: ఏపీలో చంద్రబాబు పాలన ఎంత అధ్వానంగా ఉందో చెప్పే పరిస్థితి ఇది. విజయవాడ ఎంపీతో పాటు కూటమి ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రభుత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. బుడమేరు వరద సాయం ఇంకా పూర్తి స్థాయిలో అందలేదంటూ బహిరంగంగానే పెదవి విరిచారు. ఈ క్రమంలో.. ఇవాళ జరిగిన తొలి డీఆర్సీ సమావేశంలో సమస్యలను ఏకరువు పెట్టారు వాళ్లు.బుడమేరు వరద సాయం ఇంకా చాలామందికి అందలేదంటూ డీఆర్సీలో ఎంపీ కేశినేని శివనాధ్(చిన్ని),ఎమ్మెల్యేలు నిజాలు ఒప్పుకున్నారు. బుడమేరు వరద ముంపు బాధితుల్లో బాధితులకు ఇంకా నష్టపరిహారం అందలేదు. మరోమారు ఎన్యుమరేషన్ చేయాలి అని ఎంపీ కేశినేని శివనాధ్(చిన్ని) అన్నారు. కొండచరియలు విరిగిపడి చనిపోయిన వారికి పరిహారం ఇవ్వలేదు. కొండ ప్రాంత ప్రజలను ఆదుకోవాలి అని ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు.వరద బాధితులను ఇంకా కొంత మందికి నగదు అందలేదు. మేము బయటకు వస్తుంటే ప్రజలు అడుగుతున్నారు. అన్ని ప్రాంతాల్లో వాటర్ డ్యామేజ్ జరిగింది. బుడమేరు డైవర్షన్ చర్యలు తీసుకోవాలి. పట్టి సీమ నీళ్లు వదిలినప్పుడు బుడమేరులోకి వస్తున్నాయి. బుడమేరు వల్ల మైలవరం నియోజకవర్గం పూర్తిగా దెబ్బతింది. జి.కొండూరులో 13,800 ఎకరాల రైతులు ఇబ్బది పడుతున్నారు. 1 కోటి 20 లక్షల మోటార్లు రిపేర్లు ఉన్నాయి అని మైలవరం ఎమ్మెల్యే,వసంత కృష్ణప్రసాద్ అన్నారు.నందిగామ ఎమ్మెల్యే,తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. నందిగామలో పంట పూర్తిగా దెబ్బతింది. రైతులకు నష్ట పరిహారం అందించాలని అన్నారు.గన్నవరం ఎమ్మెల్యే,యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. విజయవాడ, అంబాపురం , గన్నవరంలో 200 కోట్లు అభివృద్ధి పనులు చేయాలి. అభివృద్ధి పనులకు నిధులు కేటాయంచాలి. విజయవాడ రూరల్ మండలంలో అభివృద్ధి చేయాలి అని అన్నారు.ఇక జగ్గయ్యపేట ఎమ్మెల్యే,శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ.. త్రాగునీరు విషయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యను తక్షణమే పరిష్కరించాలని అన్నారు.ధాన్యం కనుగోలు విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తిరువూరు,ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఆలోచన చేయాలి. తిరువూరులో పత్తి పంట కొనేవారు లేదు. పత్తి పండుతున్నా ఇక్కడ కొనుగోలు కేంద్రం లేదు..గుంటూరులో ఉంది అని గుర్త చేశారాయన.ఇక.. పీడీఎఫ్ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ.. కండ్రిక, జక్కంపూడి ప్రాంతంలో ఇంకా ఆటో డ్రైవర్లకు పరిహారం అందలేదన్నారు. అలాగే.. ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా దెబ్బతిన్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. -
బాబుకు షాక్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే.. స్పష్టమైన ప్రభుత్వ వైఫల్యం..
-
ఏపీ అసెంబ్లీలో మంత్రుల తీరుపై TDP MLA కూన రవి విమర్శలు
-
ధూళిపాళ్ల నరేంద్రకు చంద్రబాబు మొండిచేయి..
-
పబ్లిక్ లో ఎమ్మెల్యే ఏం చేసిందో చూడండి
-
కౌన్సెలర్స్ కొనుగోలు చేసిన బాలకృష్ణ..
-
టీడీపీ ఎమ్మెల్యేకి అనంతపురం మేయర్ స్ట్రాంగ్ కౌంటర్
-
కడప కార్పొరేషన్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే హల్ చల్
-
‘టీడీపీ ఎమ్మెల్యే కూనరవితో ప్రాణహాని’
శ్రీకాకుళం, సాక్షి: టీడీపీ నేతల దాడులు, బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఎమ్మెల్యే కూనరవితో తనకు ప్రాణహాని ఉందని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస స్వతంత్ర అభ్యర్థి సనపల సురేష్ తెలిపారు. ఆయన ఓ సెల్ఫీ వీడియో ద్వారా ఎమ్మెల్యే దాడి, బెదిరింపుల విషయాన్ని బయటపెట్టారు. ‘‘ఎమ్మెల్యే కూనరవి నుంచి నాకు ప్రాణహాని ఉంది. అక్రమ ఇసుక రవాణా అడ్డుకుంటున్నానని దాడి చేశారు. ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారు. జిల్లా ప్రభు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదు. దెబ్బలు తగిలినా రిపోర్టు నార్మల్ అని ఇచ్చారు. పోలీసులతో కలిసి నన్ను చంపేందుకు రవి కూమార్ స్కెచ్ వేశారు. దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాల్సిందే. నాపై దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు’’ అని వీడియోలో తెలిపారు. -
మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన కోనేటి ఆదిమూలం
-
ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పై రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే
-
అడ్డంగా నరుకుతా.. రెచ్చిపోయిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
సాక్షి, నెల్లూరు జిల్లా: అడ్డంగా నరుకుతా అంటూ సొంత పార్టీ నేతలపైనే కావలి టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రెచ్చిపోయారు. వార్డు ఇంఛార్జ్ స్థాయికి కూడా పనికిరాని కొందరు తనపై లోకేష్‌కి ఫిర్యాదు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కావలి అడ్డాలో ఎక్కసెక్కాలు ఆడితే.. అడ్డంగా నరుకుతా అంటూ టీడీపీలోనే ప్రత్యర్థి వర్గానికి కావ్య వార్నింగ్ ఇచ్చేశారు. ఇటీవలే కావ్య కృష్ణారెడ్డిపై చంద్రబాబు, లోకేష్‌కు మాజీ ఇంచార్జ్ మాలేపాటి సుబ్బానాయడు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: దురుద్దేశంతో మహాపచారంకాగా, ఇటీవల కావలి తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై మాజీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైల్లో ఉంటే టపాసులు కాల్చిన నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దగదర్తి మండలంలో తన వర్గాన్ని కొందరు ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని చంద్రబాబు,లోకేష్ వద్దే తేల్చుకుంటానని కార్యకర్తల సమావేశంలో మాలేపాటి వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం రూ.17 కోట్లు ఖర్చు పెట్టానంటూ మాలేపాటి వ్యాఖ్యానించారు. -
ఎమ్మెల్యే బొజ్జల నుంచి ప్రాణహాని ఉంది: స్క్రాప్ వ్యాపారి
-
సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో కీలక పరిణామాలు
-
ఆళ్లగడ్డలో అఖిలప్రియ అనుచరుడి అరాచకాలు..
-
టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు
సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి : చిత్తూరు జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై అదే పార్టీకి చెందిన నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని.. ఎవరికైనా చెబితే అంతుచూస్తానని బెదిరించారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలనే తాను ఆయన లీలలను పెన్ కెమెరాలో రికార్డు చేశానని చెప్పారు.తనవద్ద బలమైన సాక్ష్యాలున్నాయనే ఆయన తనకు అనేకమార్లు ఫోన్లుచేశారని.. రాత్రిపూట మెసేజ్‌లు పెట్టి బెదిరిస్తున్నారని.. గురువారం హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆమె మీడియా సమక్షంలో వెల్లడించారు. ఇదే విషయమై పార్టీ అధినేత సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు, మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ విషయాలన్నీ విధిలేని పరిస్థితుల్లో వెల్లడించాల్సి వస్తోందన్నారు.వరలక్ష్మి ఇంకా ఏమన్నారంటే..ఇద్దరం ఒకే పార్టీకి చెందిన వారం కావడంతో పార్టీ కార్యక్రమాల్లో ఇద్దరం పాల్గొనే వారం. కొద్దిరోజులకు నా ఫోన్ నెంబర్ తీసుకుని పదేపదే ఫోన్లు చేయడం ప్రారంభించారు. ఎన్నికలు ముగిసే వరకూ నన్ను సోదరిగా సంభోదించారు. ఆ తర్వాత ఆయన తన నిజస్వరూపం బయటపెట్టారు. ఆయనతో సన్నిహితంగా ఉండాలంటూ బెదిరింపులకు దిగారు. తమ మాట వినకపోతే భర్త, ఇద్దరు పిల్లల్ని చంపేస్తానని, పార్టీ పరంగా ఎలాంటి లబ్ధి చేకూరకుండా చేస్తాననే వారు.చివరకు.. మాట్లాడుకుని విషయం సెటిల్ చేసుకుందామంటూ నమ్మబలికిన ఆదిమూలం.. ఈ ఏడాది జూలై 6న తిరుపతి భీమాస్ ప్యారడైజ్ హోటల్‌కు పిలిపించాడు. అక్కడి రూమ్ నెం.109లో నాపై లైంగిక దాడికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబితే కుటుంబంలో అందరినీ చంపేస్తానంటూ బెదిరించడంతో మిన్నకుండిపోయా. ఆయన అంతటితో ఆగకుండా వేళగాని వేళల్లో ఫోన్లు, సందేశాలతో వేధించేవారు. దీంతో.. అర్థరాత్రి సమయంలో ఎమ్మెల్యే నుంచి పదేపదే ఫోన్లు రావడాన్ని గమనించిన నా భర్త నన్ను ప్రశ్నించడంతో జరిగిందంతా ఆయనకు చెప్పేశాను. కామాంధుడైన ఎమ్మెల్యే ఆదిమూలానికి బుద్ధిచెప్పాలని నిర్ణయించుకున్నాం. అదే నెల పదో తేదీన అదే హోటల్లో రూం నెం.105కి ఆయన మళ్లీ రమ్మనడంతో రహస్య కెమెరాలతో వెళ్లాను.ఆ రోజు ఎమ్మెల్యే నాపై మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ తతంగం మొత్తం రహస్య కెమెరాల్లో రికార్డు అయింది. మరోసారి అదే నెల 17న అదే హోటల్లో రూమ్ నెం.105కి రమ్మని మళ్లీ అత్యాచారం చేశాడు. నా వద్ద ఆయన ఆడియోలు, వీడియోలు ఉన్నాయని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిమూలం నాపై నిఘా ఉంచి, నా చుట్టూ ఆయన మనుషులను మోహరించాడు. మరోవైపు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టీడీపీ మహిళా నేతను లైంగికంగా వేధించిన దృశ్యాలు ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా రావడంతో ఆయనను పార్టీ నుంచి టీడీపీ సస్పెండ్ చేసింది. -
ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగికంగా వేధించారు
-
17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు నేరచరితులు!
సాక్షి, న్యూఢిల్లీ: 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు నేరచరితులని, వీరిపై మహిళలపై నేరాలకు పాల్పడ్డ అభియోగాలు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారŠమ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు వెల్లడించాయి. 17 మంది నేరచరితులతో టీడీపీ దేశంలోనే మూడో స్థానంలో ఉందని స్పష్టం చేశాయి. మనదేశంలో 755 మంది సిట్టింగ్ ఎంపీలు, 3,938 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 151 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని తెలిపాయి. ఈ మేరకు దేశంలో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల 4,809 ఎన్నికల అఫిడవిట్‌ల్లో 4,693ను విశ్లేషించి రూపొందించిన నివేదికను బుధవారం విడుదల చేశాయి.16 మంది ఎంపీలు, 135 మంది ఎమ్మెల్యేలపై కేసులు 2019 నుంచి 2024 మధ్య జరిగిన ఎన్నికల సమయంలో అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘానికి సమరి్పంచిన అఫిడవిట్ల ఆధారంగా ఈ నివేదికను ఏడీఆర్, ఎలక్షన్ వాచ్ సిద్ధం చేశాయి. 16 మంది ఎంపీలు, 135 మంది ఎమ్మెల్యేలు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్నారు.మహిళలపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం మహిళలపై నేరాలను రాష్ట్రాల వారీగా చూస్తే పశ్చిమ బెంగాల్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 25 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయి. రెండో స్థానంలో 21 మందితో ఆంధ్రప్రదేశ్ ఉంది. 17 మందితో ఒడిశా మూడో స్థానంలో నిలిచింది. కాగా తెలంగాణ 11వ స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో ఐదుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు నమోదయ్యాయి. కాగా దేశంలో మొత్తం 151 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 16 మందిపై అత్యాచారానికి సంబంధించిన కేసులు ఉన్నాయి. వీరిలో ఇద్దరు ఎంపీలు కాగా, 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మహిళలపై నేరాలకు సంబంధించి కేసులు ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు..1) చింతమనేని ప్రభాకర్, దెందులూరు 2) చదలవాడ అరవిందబాబు, నరసరావుపేట 3) చింతకాయల అయ్యన్నపాత్రుడు, నర్సీపట్నం 4) నంద్యాల వరదరాజులురెడ్డి, ప్రొద్దుటూరు 5) ఎస్.సవిత, పెనుకొండ 6) జి.భానుప్రకాశ్, నగరి 7) కందికుంట వెంకటప్రసాద్, కదిరి 8) బోనెల విజయచంద్ర, పార్వతీపురం 9) పొంగూరు నారాయణ, నెల్లూరు సిటీ 10) ప్రత్తిపాటి పుల్లారావు, చిలకలూరిపేట 11) కృష్ణచైతన్య రెడ్డి, కమలాపురం 12) తంగిరాల సౌమ్య, నందిగామ 13) సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సర్వేపల్లి 14) వంగలపూడి అనిత, పాయకరావుపేట 15) బండారు సత్యానందరావు, కొత్తపేట 16) ఎం.ఎస్.రాజు, మడకశిర 17) బండారు సత్యనారాయణమూర్తి, మాడుగుల జనసేన పార్టీ ఎమ్మెల్యేలు 1) పంతం నానాజీ, కాకినాడ రూరల్ 2) కందుల దుర్గేశ్, నిడదవోలు -
మహిళలపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యంతరకర వ్యాఖ్యలు
అనకాపల్లి, సాక్షి: ఇచ్చిన హామీల ఊసెత్తడం లేదు. గత ప్రభుత్వాన్ని తిట్టిపోయడమే రోజూ పనిగా పెట్టుకున్నారు. పైగా అరాచకాలతో ఏపీని రావణ కాష్టంగా మార్చేశారు. దీనికి తోడు ఇప్పుడు ఓ అధికార ఎమ్మెల్యే మహిళలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. చోడవరం టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు అనవసరంగా స్కీములు పెట్టారని, ప్రజల ఖాతాల్లో డబ్బులు వెయ్యొద్దని తాను సీఎంకు చెప్పానని అన్నారాయన. ప్రజల ఖాతాలో డబ్బులు వేస్తే డాబాలకు వెళ్లి బిరియానీలు తింటున్నారు. ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసి మందు తాగుతున్నారు అని అన్నారాయన. అక్కడితో ఆగకుండా.. ‘‘పథకాల వల్లే.. ఆడవాళ్లు ఇంట్లో వంట మానేస్తున్నారు. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీకి అలవాటు పడుతున్నారు. ఇచ్చిన డబ్బులతో చిల్లర ఖర్చులు చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా బట్టలు కొనుక్కుంటున్నారు అంటూ తన నోటి దురుసును కొనసాగించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళలకు ఎమ్మెల్యే రాజు క్షమాపణలు చెప్పాలని రాజకీయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. -
బుడ్డా గారి.. చెడ్డ మాటలు
-
‘బాబుతో మాట్లాడతా.. పేకాట ఆడిస్తా..’!
సాక్షి, అనంతపురం: అనంతపురం ఆఫీసర్స్ క్లబ్లో పేకాట ఆడిస్తానంటూ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పేకాట ఆడకపోవడం వల్ల కరోనా సమయం లో 22 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్లబ్బుల్లో పేకాట ఆడేందుకు కృషి చేస్తానంటూ ఎమ్మెల్యే ప్రసాద్ సెలవించారు.ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ప్రజలు మండిపడుతున్నారు. అభివృద్ది మరిచి.. పేకాట కోసం సీఎంను కలుస్తారా? అంటూ విమర్శిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.పోలీసుల సమక్షంలోనే తన్నుకున్న టీడీపీ నేతలుఉరవకొండ: స్థానిక పోలీస్టు స్టేషన్ ఎదుటనే టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు. పరస్పర దాడులతో రెచ్చిపోయారు. వివరాలు.... ఉరవకొండ మండలం నింబగల్లు వద్ద ఉన్న సమ్మర్ స్టొరేజీ ట్యాంక్ పరిశీలనకు సోమవారం ఉదయం మంత్రి పయ్యావుల కేశవ్ వెళ్లారు. అనంతరం కొనకొండ్లకు వెళుతున్న మంత్రి కాన్వాయ్ వెంట వాహనాల్లో టీడీపీ నేతలూ అనుసరించారు. ఉరవకొండలోని పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వెళుతున్న వై.రాంపురం గ్రామ టీడీపీ నేత సంజీవరాయుడు వాహనాన్ని వెనుకనే ఉన్న అదే గ్రామానికి చెందిన మరో టీడీపీ నేత వాహనం ఢీకొంది.ఆ సమయంలో వాహనాలను ఆపి ఇరువర్గాల నాయకులు వాదులాటకు దిగారు. వారి అనుచరుల మధ్య తోపులాట జరిగింది. అదే సమయంలో లత్తవరం గ్రామ మాజీ సర్పంచ్ గోవిందు కలుగజేసుకుని నడి రోడ్డు మీద తోపులాటకు దిగిన టీడీపీ నాయకులను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో సంజీవరాయుడు వర్గం గోవిందుపై తిరగబడింది. వెంటనే గోవిందు అనుచరులు వారితో కలబడ్డారు. పరస్పర దాడులతో ఆ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పి ఇరువర్గాలను అక్కడి నుంచి సాగనంపారు. -
చంద్రగిరి రాజకీయం.. సై అంటే సై..
-
Political Corridor: ఇక జనంతో పనిలేదు.. ఓన్లీ దోచుకోవడమే..
-
గంటా ఆస్తులు వేలానికి పెట్టిన ఇండియన్ బ్యాంక్
-
దుష్ట సంప్రదాయానికి తెరలేపిన కొండపి టీడీపీ ఎమ్మెల్యే స్వామి
తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు కులాల మధ్య చిచ్చుపెట్టడం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకే చెల్లుతుంది. ఆయన శిష్యబృందం కూడా అదే దారిలో పయనిస్తోంది. నాలుగు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనివిధంగా టీడీపీ కొండపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి ఒక దుష్ట సంప్రదాయానికి తెరతీశారు. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగ సమ్మేళనం పలు విమర్శలకు తావిస్తోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కొండపి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా టీడీపీ ఎమ్మెల్యే డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి దుష్ట కుల రాజకీయానికి తెరలేపడంపై నియోజకవర్గంలోని మాదిగ సామాజికవర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జరుగుమల్లి మండలం వావిలేటిపాడు వద్ద ఇటీవల టీడీపీ ఆధ్వర్యంలో మాదిగ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కొండపి నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భవించిన 40 సంవత్సరాల నుంచి ఏ రోజూ ఈ విధంగా కుల రాజకీయాలు చేయలేదు. కానీ, దళితులైన మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టే విధంగా మాదిగ ఆత్మీయ సమావేశం పెట్టి సరికొత్త కుటిల రాజకీయానికి ఎమ్మెల్యే స్వామి తెరతీయడంపై మాదిగ సామాజికవర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నియోజకవర్గంలో ఇప్పటివరకు మాదిగలను పట్టించుకోని ఎమ్మెల్యే స్వామి.. వైఎస్సార్ సీపీ తరఫున కొండపి నుంచి మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పోటీ చేస్తుండటంతో మాల, మాదిగ అంటూ కుల ప్రస్తావన తెస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అందులో భాగంగానే మాదిగల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారని అంటున్నారు. ఇటీవల మంత్రి సురేష్ మాల, మాదిగ అని వేరు చేయకుండా సింగరాయకొండలో దళితుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మాల, మాదిగలు తనకు రెండు కళ్లు లాంటివారని స్పష్టం చేశారు. టీడీపీకి మాదిగలు దూరమవుతున్నారని, అందుకు ఆ పార్టీ అవలంబిస్తున్న విధానాలే కారణమని అన్నారు. మాదిగల మనుగడను, ఆత్మగౌరవాన్ని కాపాడటానికి కొండపి నియోజకవర్గానికి మంత్రి సురేష్ వచ్చారని భావిస్తున్నామని మాదిగలు కూడా అంటున్నారు. కొండపికి వైఎస్సార్ సీపీ ఇన్చార్జిగా మంత్రి సురేష్ వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషిని గమనించి మాదిగ సామాజికవర్గం టీడీపీకి దూరం అవడాన్ని గమనించిన ఎమ్మెల్యే స్వామి.. ప్రస్తుతం దుష్ట కుల రాజకీయానికి తెరలేపారని మాదిగ సామాజికవర్గం ఆరోపిస్తోంది. ఇన్నాళ్లు మాదిగ సామాజికవర్గాన్ని పట్టించుకోని ఎమ్మెల్యే స్వామి.. గత పదిహేను సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏనాడూ మాదిగల అభివృద్ధికి చర్యలు తీసుకోలేదని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో ఇప్పటివరకు సెమీక్రిస్మస్ వేడుకలు నిర్వహించని ఏకై క ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా అంటే.. అది ఎమ్మెల్యే స్వామి అని మాదిగలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. అదే సమయంలో మంత్రి సురేష్ నియోజకవర్గంలో బాధ్యతలు స్వీకరించిన వెంటనే సెమీక్రిస్మస్ వేడుకలు నిర్వహించారని మాదిగలు గుర్తుచేస్తున్నారు. కొండపిలో మంత్రి సురేష్ పోటీ చేస్తుండటంతో ప్రస్తుతం మాదిగలపై టీడీపీ కల్లబొల్లి ప్రేమ ఒలకబోస్తోందని, ఇదే ప్రేమ మొదటి నుంచి చూపించి ఉంటే మాదిగలు టీడీపీకి దూరమయ్యే పరిస్థితి ఉండేది కాదని విశ్లేషకులు అంటున్నారు. ఏదిఏమైనా ఎన్నికలు దగ్గరపడుతున్నందున టీడీపీకి మాదిగలు గుర్తుకురావడం బాధగా ఉందని మాదిగ సామాజికవర్గం వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులు ఓట్ల కోసం ఎన్ని ఆత్మీయ సమావేశాలు పెట్టినా నమ్మే పరిస్థితిలో లేమని మాదిగలు తెలియజేస్తున్నారు. కొండపి నియోజకవర్గంలో సుమారు 30 వేల మంది మాదిగ సామాజికవర్గం వారు ఉన్నారు. టీడీపీ ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి మాదిగల ఆత్మీయ సమావేశానికి సుమారు రెండు వేల మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో మాదిగలు కేవలం 1,500 మంది మాత్రమే ఉన్నారు. టీడీపీకి మాదిగలు దూరంగా ఉన్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని మాదిగలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే స్వామి నియోజకవర్గంలో దళితుల అభివృద్ధికి కృషిచేయాలేగానీ.. ఈ విధంగా కుల విభజన రాజకీయాలు చేస్తే కలిసికట్టుగా టీడీపీకి, స్వామికి గుణపాఠం చెబుతామని దళితులు స్పష్టం చేస్తున్నారు. -
AP Assembly: టీడీపీ సభ్యుల రచ్చ.. సభ నుంచి సస్పెండ్
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో రెండో రోజు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల సందర్భంగా టీడీపీ సభ్యులు మళ్లీ ఓవరాక్షన్ చేశారు. దీంతో, టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక్కరోజు సస్పెండ్ చేశారు. కాగా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా టీడీపీ సభ్యులు తమ తీరును మార్చుకోలేదు. ప్రతీసారి చేసిన విధంగానే ఈసారి కూడా అసెంబ్లీలో రచ్చరచ్చ చేశారు. రెడ్‌లైన్ దాడి స్పీకర్ తమ్మినేని పోడియంను టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. సభా నిబంధనలకు విరుద్దంగా టీడీపీ సభ్యులు ప్రవర్తించారు. సభ జరుగుతుండా విజిల్స్ వేస్తూ అరాచకం సృష్టించారు. అంతటితో ఆగకుండా ప్రజాప్రతినిధులనే స్పృహ మరిచిపోయి టీడీపీ సభ్యులు పేపర్లు చింపి స్పీకర్‌పై విసిరారు. స్పీకర్ తమ్మినేని పట్ల అవమానకరంగా ప్రవర్తించారు. స్పీకర్‌ను అవమానపరిచేలా నినాదాలు చేశారు. దీంతో, టీడీపీ సభ్యుల తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ..
తిరువూరు: టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఈ నెల 7న టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరు రానున్న సందర్భంగా ఏర్పాట్ల పరిశీలనకు విచ్చేసిన నాయకుల నడుమ ప్లెక్సీ వివాదం ఘర్షణకు దారితీసింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రాంమోహన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, టీడీపీ నేత నాగుల్‌మీరాలతో కలిసి కేశినేని నాని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈలోగా పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి దేవదత్ ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఎంపీ నాని ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. ఉద్దేశపూర్వకంగానే ఎంపీ ఫొటో ప్లెక్సీలో లేకుండా చేశారని ఆరోపిస్తూ కార్యాలయం బయట నాని వర్గం బైఠాయించింది. ఇందుకు నియోజకవర్గ ఇన్చార్జి దేవదత్ కారణమని ఆరోపిస్తూ ఆయనపై దాడికి యత్నించారు. స్థానిక నేతలు దేవదత్‌ను ఒక గదిలో ఉంచి తలుపులు వేశారు. బహిరంగ సభాస్థలిని పరిశీలించిన అనంతరం నాని సోదరుడు చిన్ని కూడా పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. చిన్నీ గో బ్యాక్ అంటూ నాని వర్గం గేటు వద్ద బైఠాయించగా, పోలీసులు చిన్నీని కార్యాలయంలోకి తీసుకెళ్ళారు. ఏర్పాట్లపై సమీక్ష జరిపే అవకాశం లేకుండా ఇరు వర్గాల కార్యకర్తలు టీడీపీ కార్యాలయ ఆవరణలో కుర్చీలు విసురుకుంటూ దాడులకు పాల్పడుతూ గందరగోళం సృష్టించారు. జిందాబాద్, గో బ్యాక్ నినాదాలతో సుమారు రెండు గంటల పాటు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ఆఫీసులో కుర్చీలు విసురుకుంటున్న కార్యకర్తలు ఎస్ఐపై కార్యకర్తల దాడి.. టీడీపీ వర్గవిబేధాల నేపథ్యంలో బుధవారం తిరువూరు పార్టీ కార్యాలయంలో ఘర్షణ పడిన కార్యకర్తలు పోలీసులపైనే దాడులకు పాల్పడ్డారు. రణరంగాన్ని తలపించే రీతిలో కార్యాలయంలో ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్నిల వర్గీయులు దాడికి తెగపడి కుర్చీలు విసురుకున్నారు. పరిస్థితి అదుపు చేయడానికి, శాంతిభద్రతల పరిరక్షణకు సీఐ అబ్దుల్ నబీ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను చెదర గొట్టినప్పటికీ రెచ్చగొట్టే ధోరణిలో నాని, చిన్నీల అనుచరులు బీభత్సం సృష్టించారు. చేతికందిన వస్తువుల్ని విసురుకుంటూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఇరువర్గాలను పోలీసులు శాంతింపజేసే యత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. గాయపడిన ఎస్ఐ సతీష్ తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు, విస్సన్నపేట మండలాల నుంచి నియోజకవర్గ స్థాయి సమావేశానికి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ సంఘటనతో భయాందోళనలకు గురై పరుగులు తీశారు. దాడులకు పాల్పడవద్దని, శాంతియుతంగా వ్యవహరించాలని పదే పదే కోరినా ఫలితం లేకపోవడంతో లాఠీఛార్జీ చేసి అల్లరిమూకలను చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపై కొందరు కుర్చీలు విసిరారు. ఈ దాడిలో తిరువూరు ఎస్ఐ సతీష్ తలకు బలమైన గాయమైంది. ఎట్టకేలకు ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఎస్ఐ సతీష్‌ను ఆసుపత్రికి తరలించారు. కవ్వింపు చర్యలకు పాల్పడిన ఇరువర్గాలు.. పార్టీ కార్యాలయంలో పరిస్థితి చేయి దాటుతున్నప్పటికీ ఎంపీ నాని, చిన్ని ఏమాత్రం వెనక్కు తగ్గకుండా మీడియాతో మాట్లాడేందుకు అత్యుత్సాహం ప్రదర్శించడంతో పోలీసులు సైతం అదుపు చేయలేకపోయారు. తోపులాటలో ఒక మహిళా కార్యకర్తకు సైతం గాయాలయ్యాయి. చంద్రబాబు పర్యటన గురించి ఏమాత్రం సమీక్షించకుండానే గద్దె రామ్మోహన్, తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు తదితరులు వెళ్ళిపోయారు. దళితుడిని కాబట్టి షటప్, గెటవుట్ అంటారా.. ‘నేనొక దళిత నాయకుడిని. నన్ను షటప్, గెటవుట్ అంటారా. నాలుగు గోడల మధ్య మీరు అంటే సరిపోయిందా. బయటకు వచ్చి అందరి ముందు ఇవే మాటలు అనండ’ని తిరువూరు టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి ఎస్.దేవదత్తు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేశినేని నాని, ఆయన వర్గీయులు తాను ఏర్పాటు చేసుకున్న టీడీపీ కార్యాలయానికి వచ్చి పరుష పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేశినేని చిన్ని తన వర్గీయులతో కలిసి పక్కనే ఉండగా దేవదత్తు మాట్లాడిన అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన మాటల్లోనే.. ‘దళితుడినైన నేను ఉన్నత విద్యను అభ్యసించి, 15 సంవత్సరాలు వివిధ దేశాల్లో పనిచేసి జ్ఞానం పొందా. నేనేదో సమావేశంలో మాట్లాడబోతుంటే నా ఆఫీసుకే వచ్చి నన్ను షటప్, గెటవుట్ అని కేశినేని నాని అంటారా.. నా ఆఫీసులో నాకు మాట్లాడే హక్కు లేదా? రెండు సార్లు గెలిచిన మీకే హక్కు ఉందా? మీరేనా నియోజకవర్గ నాయకులు. మేము కాదా. మాకు అవకాశం లేదా. మాకు చెప్పుకునే అర్హత లేదా. ఇంకా ఎంతకాలం మీరు దళితులపై ఇలా హీనంగా మాట్లాడతారు. ఏడు నియోజకవర్గాలను గెలిపిస్తామంటున్నారు. ఎక్కడ గెలిపించారు. మీరు మాత్రమే గెలిచారు. తక్కినవి ఓడిపోయారు’. దాడి సంఘటనపై కేసు నమోదు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తిరువూరు ఎస్ఐ సతీష్‌పై దాడికి పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ రమేష్ తెలిపారు. తిరువూరు పోలీసుస్టేషన్లో బుధవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఇరువర్గాలు దాడికి పాల్పడుతుండగా అదుపు చేయడానికి యత్నించిన ఎస్ఐ సతీష్‌కు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఎస్ఐపై దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామన్నారు. నిందితులను అరెస్టు చేస్తాం.. తిరువూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎస్ఐ సతీష్‌పై దాడికి పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేశాం. నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు. శాంతిభద్రతలు కాపాడటానికి యత్నించిన పోలీసులపై విచక్షణా రహితంగా దాడి చేయడం శోచనీయం. సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను గుర్తించి అరెస్టు చేస్తాం. – కాంతి రాణా టాటా, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ -
'రేయ్.. నేను రెడీగున్నా! అరెస్ట్ చెయ్‌రా.. చెయ్!'
తాడిపత్రి అర్బన్, సాక్షి: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మళ్లీ రెచ్చిపోయారు. 'రేయ్.. అరెస్టు చెయ్.. నీయమ్మా.. ఖాకీ డ్రెస్సులేసుకుని సిగ్గులేదు.. రేయ్ నేను రెడీగున్నా.. అరెస్ట్ చెయ్.. చెయ్ రా చెయ్' అంటూ పోలీసులను దుర్భాషలాడారు. రోడ్డుపై పడుకుని హంగామా సృష్టించారు. రెండు రోజుల కిందట జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టణ సుందరీకరణ పేరుతో సీబీ రోడ్డులోని విద్యుత్ స్తంభాలకు డెకరేషన్ బల్బులను ఏర్పాటు చేసేందుకు మునిసిపల్ కమిషనర్ జి.రవిని అనుమతి కోరారు. తర్వాత మునిసిపల్ సిబ్బందితో కలసి దగ్గరుండి డెకరేషన్ లైట్లు వేయించడానికి బయలుదేరారు. అయితే స్తంభాలకు ఉన్న వైఎస్సార్సీపీ జెండాలను పనిగట్టుకుని తొలగిస్తుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని జేసీ ప్రభాకర్.. తన అనుచరులతో కలిసి నడిరోడ్డుపై బైఠాయించి నానా హంగామా సృష్టించాడు. ట్రైనీ డీఎస్సీ హేమంత్ కుమార్, ఎస్ఐలు రామకృష్ణ, గౌస్మహ్మద్లు అక్కడికి చేరుకుని మునిసిపల్ కమిషనర్‌తో మాట్లాడి జెండాలను తొలగింపజేస్తామంటూ హామీ ఇవ్వడంతో జేసీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ బుధవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఆర్డీవో వెంకటేష్‌ను టీడీపీ కౌన్సిలర్లు కలసి సీబీ రోడ్డులోని విద్యుత్ స్తంభాలకు ఉన్న వైఎస్సార్సీపీ జెండాలు తొలగించాలంటూ వినతిపత్రం ఇవ్వడమే కాకుండా.. అక్కడే బైఠాయించారు. ఇది తన పరిధిలోని అంశం కాదని, అనవసరంగా రాద్దాంతం చేయకుండా మునిసిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని ఆర్జీవో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. బుధవారం సాయంత్రం జేసీ జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలసి అర్బన్ పోలీస్ స్టేషన్ వద్దకొచ్చారు. వచ్చీ రాగానే గట్టిగా కేకలు వేస్తూ నానా హంగామా సృష్టించాడు. ఎస్పీ ధరణీబాబు, రామకృష్ణ, గురుప్రసాద్‌రెడ్డి వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. వారిపై తిట్ల దండకాన్ని అందుకున్నారు. పోలీసులు సంయమనం పాటిస్తూ నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా వినలేదు. చివరకు ఆయనను అరెస్ట్ చేసేందుకు జీపును తీసుకొచ్చేందుకు పోలీసులు సిద్ధమవగా నడిరోడ్డుపై పడుకుండిపోయాడు. పోలీసులు అతన్ని జీవులోకి ఎక్కించుకుని స్థానిక పుట్లూరు రోడ్డులో వదిలేయడంతో అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. జేసీపై కేసు నమోదు పోలీసులతో అనుచిత ప్రవర్తకు గానూ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం.. విధులకు ఆటంకం కలిగించడం, దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించడంపై జేసీతో పాటు ఆయన ముగ్గురి అనుచరులపై కేసు నమోదు చేశారు. -
హిందూపురంలో బాలకృష్ణకు షాక్..
-
టీడీపీ ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు స్ట్రాంగ్ వార్నింగ్
-
ఎమ్మెల్యేలను కించపరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు
రాప్తాడు రూరల్: అధికార పార్టీ ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ చేస్తున్న ముగ్గురు టీడీపీ కార్యకర్తలపై అనంతపురం రూరల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వివరాలను సీఐ విజయభాస్కర్‌గౌడ్ గురువారం వెల్లడించారు. అనంతపురం మండలం సోములదొడ్డి గ్రామానికి చెందిన చల్లా రాఘవేంద్రనాయుడు, సిండికేట్‌నగర్‌కు చెందిన బత్తల మంజునాథ్, కట్టా లోకేష్... టీడీపీలో క్రియాశీలక కార్యకర్తలుగా చెలామణి అవుతున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి విరుద్ధంగా వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టేలా ఇటీవల టీడీపీ రాష్ట్ర కార్యాలయం వేదికగా సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వివిధ పోస్టులను వీరు వైరల్ చేశారు. దీనిపై నందమూరినగర్‌కు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త ఇర్ఫాన్‌బాషా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో చల్లా రాఘవేంద్రనాయుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పార్టీలో చురుకుగా ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలు, స్థానిక నాయకులు, కార్యకర్తల పేర్లు, ఫొటోలతో ఎమ్మెల్యేను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ సిద్ధం చేసిన పోస్టులు తమకు ‘టీంపోస్ట్’ అనే డీపీ ఉన్న మొబైల్ నంబరు ద్వారా అందాయని, వీటిని టీడీపీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు వైరల్ చేస్తూ వచ్చామని నిందితుడు అంగీకరించాడు. రాఘవేంద్ర నాయుడు తెలిపిన మేరకు అతనితోపాటు బత్తల మంజునాథ్, కట్టా లోకేష్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పోస్టులను వైరల్ చేస్తే శాంతిభద్రతల దృష్ట్యా వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని ఈ సందర్భంగా సీఐ విజయభాస్కర్‌గౌడ్ హెచ్చరించారు. -
అసెంబ్లీ నుంచి 14 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్..
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఓవరాక్షన్ చేశారు. బడ్జెట్ ప్రవేశపెడుతుండగా ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియంపై పేపర్లు విసిరారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు సీఎం సిఫార్సు చేశారు. బడ్జెట్ ప్రసంగానికి అడ్డు తగలడంతో టీడీపీ నేతలపై స్పీకర్ తమ్మినేని సీతారాం చర్యలు తీసుకున్నారు. 14 మంది టీడీపీ సభ్యులను ఒక్కరోజు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ. 2,79,279 కోట్తో 2023,24 వార్షిక బడ్జెట్ రూపొందించారు. రెవెన్యూ వ్యయం రూ. 2,28,540 కోట్లు.. మూలధన వ్యయం రూ. 31,061 కోట్లుగా పేర్కొన్నారు. చదవండి: రూ.2 లక్షల 79వేల 279 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ -
బస్సులో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల ఓవరాక్షన్.. కౌంటర్ ఇచ్చిన మహిళలు!
పాలకొల్లు అర్బన్/పోడూరు: ఆర్టీసీ బస్సులో మహిళలపై పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దౌర్జన్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాలకొల్లు నుంచి పెనుగొండ వరకు ఆదివారం అమరావతి పాదయాత్ర సాగింది. ఈ మార్గంలో ఓ ఆర్టీసీ బస్సు ఎక్కిన ‘నిమ్మల’.. ప్రయాణికులతో మాటామంతీ కలుపుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైన, సీఎం జగన్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపైన బురదజల్లే ప్రయత్నం చేయబోయారు. దీంతో ఆ మహిళలు.. సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని, ఇంటి స్థలాలు ఇస్తున్నారని వాదించడంతో ఎమ్మెల్యే అవాక్కయ్యారు. ఈ దృశ్యాన్ని ఒక మహిళ వీడియో తీసింది. దీంతో, రెచ్చిపోయిన ఎమ్మెల్యే రామానాయుడు ఆ మహిళ చేతిలోని సెల్‌ఫోన్ బలవంతంగా లాక్కున్నారు. ఆ దృశ్యాలను తీసేస్తాను తన సెల్‌ఫోన్ తనకు ఇవ్వాలని ఆ మహిళ ప్రాథేయపడుతున్నా ఎమ్మెల్యే వినకుండా సెల్‌ఫోన్‌ను పక్కనే ఉన్న మరో టీడీపీ నేతకు ఇవ్వడం.. ఆ మహిళ ఎమ్మెల్యే మెడలోని పచ్చకండువాను, చొక్కాను లాగడం.. ఎమ్మెల్యే కేకలు వేయడం ఆ వీడియోలో స్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో ఆయన మహిళల ముందు అభాసుపాలయ్యారని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. పితాని, నిమ్మలకు ఝలక్.. మరోవైపు.. ఇదే జిల్లా పోడూరు మండలం కవిటం లాకుల వద్ద కూడా బస్సు ప్రయాణికుల నుంచి పాదయాత్రలోని మాజీమంత్రి పితాని, ఎమ్మెల్యే నిమ్మలకు ఝలక్ తగిలింది. పాదయాత్ర పేరుతో టీడీపీ నాయకులు బలప్రదర్శనకు దిగడం.. ట్రాఫిక్ స్తంభించడంతో ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు వారిపై మండిపడ్డాడు. గతంలో టీడీపీ హయాంలో చంద్రబాబు రాష్ట్రానికి చేసిన అన్యాయం, ఆ ప్రభుత్వం చేసిన మోసం చాలదా? ఇప్పుడు రైతుల ముసుగులో పాదయాత్ర చేస్తూ ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారంటూ టీడీపీ నేతలను నిలదీశాడు. దీంతో పాదయాత్ర చేస్తున్న పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీమంత్రి పితాని సత్యనారాయణ తదితరులు కంగుతిన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించినట్లుగా మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు తెలుపుతామని ప్రయాణికులు తెగేసి చెప్పారు. -
టీడీపీ నేత కొండబాబు కు ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్
-
బాలయ్యా... గుర్తున్నామా!
సాక్షి, పుట్టపర్తి: హిందూపురం నియోజకవర్గం...టీడీపీకి అండగా ఉన్న ప్రాంతం. నందమూరి తారక రామారావుతో పాటు ఆయన తనయులు హరికృష్ణ, బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నందమూరి బాలకృష్ణ హిందూపురంలో రెండోసారి విజయం సాధించి ప్రస్తుత అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే తమను ఇంతలా ఆదరిస్తున్న హిందూపురం వాసుల గురించి మాత్రం బాలయ్య పట్టించుకోవడం లేదు. సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూ నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నారు. గత 8 నెలల కాలంలో బాలకృష్ణ ఒకట్రెండు సార్లు మాత్రమే హిందూపురంలో కనిపించారు. అది కూడా గృహ ప్రవేశాలు, వివాహాల్లో హాజరయ్యేందుకు వచ్చారు. అంతేకానీ ప్రజలు ఎలా ఉన్నారు.. నమ్మి ఓట్లేసిన ప్రజల యోగ క్షేమాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ నేపథ్యంలో రెండు రోజుల పర్యటన కోసం బాలకృష్ణ బుధవారం హిందూపురం వస్తుండగా...జనం ఇన్నాళ్లకు గుర్తొచ్చామా? అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ హయాంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై అప్పటి సీఎం చంద్రబాబు వివక్ష చూపించారు. నిధులు విడుదల చేయకుండా ఇబ్బందులు పెట్టారు. అయితే ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ప్రాంతాలు, కులాలు, మతాలు, పారీ్టలు చూడకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా జనరంజక పాలన సాగిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాల అభివృద్ధికీ నిధులు కేటాయిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈ క్రమంలో హిందూపురం నుంచి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్నా.. ప్రభుత్వం ఈ ప్రాంతంపై ఎలాంటి వివక్ష చూపలేదు. అన్ని రకాల సంక్షేమ పథకాలు, అన్ని వర్గాల వారికి అందజేస్తున్నారు. దీనికి తోడు ప్రజలకు ఎలాంటి కష్టమొచ్చినా.. పార్టీ చూడకుండా.. ఎమ్మెల్సీ ఇక్బాల్ సాయం చేస్తున్నారు. దీంతో బాలకృష్ణతో జనానికి పనిలేకుండా పోయింది. గత ఆరు నెలల్లో బాలకృష్ణ ఇలా.... జనవరిలో ఓసారి కూడా హిందూపురం రాలేదు. ఫిబ్రవరి 3,4 తేదీల్లో హిందూపురం జిల్లా సాధన పేరుతో ధర్నా చేసేందుకు వచ్చారు. మార్చి 27వ తేదీన హిందూపురంలో ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏప్రిల్‌లో ఒక్కసారి కూడా హిందూపురం సందర్శించలేదు. మే 27వ తేదీన హిందూపురం విచ్చేసి ఓ వివాహానికి హాజరయ్యారు. జూన్ 2వ తేదీన హిందూపురంలో ఓ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. జూలైలో హిందూపురంలో పర్యటించలేదు. తాజాగా 17, 18 తేదీల్లో పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. బాలకృష్ణ స్థానిక వ్యవహారాలన్నీ పీఏ (వ్యక్తిగత కార్యదర్శి)కి అప్పగించారు. వారు ఎలా చెబితే అలా డైలాగులు చెప్పేసి వెళ్లిపోతారు. కనీసం పార్టీ కార్యకర్తలెవరో కూడా తెలియని పరిస్థితి. ఎవరైనా అభిమానంతో దగ్గరకు పోయినా లాగి లెంపకాయ కొట్టడం అలవాటు చేసుకున్నారు. దీంతో ఆయన దగ్గరకు వెళ్లే సాహసం ఎవరూ చేయడం లేదు. పోనీ ఆయన పీఏలనైనా నమ్ముకుందామంటే... గత టీడీపీ హయాంలో అప్పటి పీఏ శేఖర్ పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం పీఏగా వ్యవహరిస్తున్న బాలాజీ హైటెక్ పద్ధతిలో జూదం ఆడుతూ పోలీసులకు గత మార్చి 21వ తేదీన పట్టుబడ్డాడు. ఇలా బాలకృష్ణ అందుబాటులో లేక, ఆయన పీఏలు పట్టించుకోకపోవడంతో జనం ఎమ్మెల్యే గురించే మరచిపోయారు. ఈ చిత్రంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ పరామర్శిస్తున్న వ్యక్తి పేరు తిమ్మారెడ్డి. ఎన్టీఆర్ వీరాభిమాని. మొదటి నుంచీ టీడీపీలో క్రియాశీలక కార్యకర్త. గత ఏడాది తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. ఏళ్లుగా పారీ్టకి సేవ చేసినా టీడీపీ నేతలు గానీ, స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణగానీ తిమ్మారెడ్డి గురించి పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ 2021 మే 5వ తేదీన తిమ్మారెడ్డి ఇంటికే వెళ్లి పరామర్శించారు. వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం చేశారు. అంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.2,70,000 మంజూరు చేయించారు. ప్రస్తుతం తిమ్మారెడ్డి ఆరోగ్యంగా ఉన్నారు. లేపాక్షికి చెందిన ఓ టీడీపీ కార్యకర్తకు ఇటీవల ఓ పెద్ద కష్టం వచ్చింది. సాయం కోసం బాలకృష్ణను సంప్రదించాలని చూడగా ఆయన అందుబాటులో లేరు. ఎమ్మెల్యే పీఏను కలిస్తే చీదరించుకున్నారు. ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తే తన పరిస్థితి ఇలా అయ్యిందని సదరు కార్యకర్త మనస్తాపం చెందారు. చివరకు విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఇక్బాల్ అతన్ని పిలిపించుకుని విషయం ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి సదరు కార్యకర్తకు అండగా నిలిచారు. ...ఇలా టీడీపీ నాయకులు, కార్యకర్తలే కాదు. హిందూపురం వాసులంతా బాలయ్య అందుబాటులో లేక ఇబ్బంది పడ్డారు. అయితే అధికార వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పారీ్టలకు అతీతంగా పథకాలు అమలు చేయడంతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల అభివృద్ధికీ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుండటంతో జనంతో పాటు టీడీపీ నేతలూ ఇప్పుడు ఆ పార్టీ వెంట నడుస్తున్నారు. అందువల్లే హిందూపురం వాసులు కూడా బాలయ్యతో తమకేం పెద్దగా పనిలేదంటున్నారు. (చదవండి: వారంతా చంద్రబాబుతో చేతులు కలిపారు: ఎంపీ గోరంట్ల మాధవ్) -
ప్రతీ దానికి పిల్ ఏంటి!?.. టీడీపీ ఎమ్మెల్యేకు ఏపీ హైకోర్టు చీవాట్లు
సాక్షి, అమరావతి: విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు హైకోర్టు చీవాట్లు పెట్టింది. ప్రతీ దానికీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడమేనా? అంటూ ప్రశ్నించింది. ప్రభుత్వ చర్యలు, ఉత్తర్వులపై అభ్యంతరముంటే బాధిత వ్యక్తులు కోర్టుకు వస్తారని.. వారికిలేని అభ్యంతరం మీకెందుకని రామకృష్ణ బాబును హైకోర్టు నిలదీసింది. బాధితులు కోర్టుకు రాకుండా మీరెందుకొచ్చారని అడిగింది. ప్రభుత్వ చర్యలు, ఉత్తర్వులపై అభ్యంతరముంటే వాటిని అసెంబ్లీలో ప్రస్తావించుకోవాలని ఆయనకు స్పష్టంచేసింది. చదవండి: ఏపీ వాసులకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్.. రెండు, మూడు రోజుల్లో.. ప్రతీ వ్యవహారంలో పిల్ దాఖలు చేస్తామంటే కుదరదని తేల్చిచెప్పింది. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ విషయంలో సర్కారు ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఆయన దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజుల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆక్రమణలో ఉన్న అభ్యంతరంలేని ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించేందుకు 2017లో జారీచేసిన జీఓ–388ని ప్రభుత్వం అమలుచేయడంలేదని, దీని ప్రకారం భూములను క్రమబద్ధీకరించేందుకు లక్షల మంది పెట్టుకున్న దరఖాస్తులను అనుమతించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రామకృష్ణబాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్. ప్రణతి వాదనలు వినిపిస్తూ.. 2017లో జారీచేసిన జీఓ ప్రకారం ఎంతోమంది తమ స్వాధీనంలో ఉన్న భూములను క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారని.. ఇలాంటి వారు లక్షల్లో ఉన్నారని తెలిపారు. అయితే.. ఈ జీఓను అమలుచేయకుండా ప్రభుత్వం కొత్త జీఓ జారీచేసి భూములను క్రమబద్ధీకరిస్తోందని, దీనివల్ల గతంలో దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వ చర్యలు ఇబ్బందిగా ఉంటే బాధితులు ఎందుకు కోర్టును ఆశ్రయించలేదని ప్రశ్నించింది. బాధితులకు లేని ఇబ్బంది పిటిషనర్‌కు ఎందుకని నిలదీసింది. ప్రతీ దానికి ఇలా పిల్ దాఖలు చేయడమేనా? అంటూ అసహనం వ్యక్తం చేసింది. -
టీడీపీ ఎమ్మెల్యే నోటి దూల మాటలకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ అదిరిపోయే కౌంటర్
-
టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఫైర్
-
వైన్ వీర ‘అనితా’... మాటలు జాగ్రత్త...! : మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలని మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావ్ అన్నారు. తండ్రి సమానుడైన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కత్తెర చూపిస్తూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని... బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే రాష్ట్ర ప్రజలంతా కత్తితో నీ నాలుక చీరేస్తారని వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం ఆయన ఎంవీపీ కాలనీలో గల తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. సజ్జల కష్టపడి తన ప్రతిభతో ఈ స్థాయికి ఎదిగారని, అలాంటి వ్యక్తిని బ్రోకర్ అని సంబోధిస్తావా..? అసలు పవిత్రమైన టీచర్‌గా పనిచేసిన నీవు పాయకరావుపేట ఎమ్మెల్యే స్థాయికి ఎలా ఎదిగావో నియోజకవర్గ ప్రజలను అడిగితే చెబుతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే మద్యం బ్రాండ్లు మంచివి కాదని చెబుతున్న వైన్ వీర వనితకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయాలన్నారు. ఏలేరు కాలువ అవకతవకల్లో జైలుకు వెళ్లాల్సి వస్తుందని ముందస్తుగా స్టే తెచ్చుకున్న విషయం గుర్తు చేసుకోవాలన్నారు. కాపు కులస్తులపై కపటప్రేమ ఇటీవల చంద్రబాబు, వైన్ వీర ‘అనిత’ కాపు కులస్తులపై కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు. కాపు కులస్తుడైన తన భర్తను పోలీస్‌స్టేషన్‌లో చెప్పుతో కొట్టడమే కాకుండా... జైలుకు పంపించిన ఘనత ఈ వీర వనితదని గుర్తుచేశారు. ఇక చంద్రబాబు అయితే కాపు నాయకుడు వంగవీటి మోహన్‌రంగాను హత్య చేయించారన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడైన వంగవీటి రాధను చంపాలని కుట్ర పన్నుతున్నాడని తెలిపారు. తండ్రిని హతమార్చినట్టే.. అమాయకుడైన వంగవీటి రాధని హతమార్చి కాపుల ఓట్లతో సీఎం అవ్వాలని చంద్రబాబు మరో కుట్ర పన్నుతున్నాడన్నారు. ఈ కుట్రపై సీఐడీ విచారణ చేయించాలని సీఎం జగన్మోహన్రెడ్డిని కోరతానన్నారు. అప్పుడే వీరి కుట్ర బయటపడుతుందన్నారు. చదవండి: Crime: పగలు రెక్కీ.. రాత్రికి చోరీ! తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా.. -
ఎక్కడయ్యా.... బుల్ బుల్ బాలయ్యా ?
-
టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
శావల్యాపురం(వినుకొండ) : టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించడంతో టీడీపీ నాయకులపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ లేళ్ల లోకేశ్వరరావు సోమవారం మీడియాతో చెప్పారు. మండల కేంద్రం శావల్యాపురంలో టీడీపీ నాయకులు జాతీయ రహదారి మార్గంలో గుంపులుగా ఏర్పడి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దహనం చేయడమే కాకుండా.. ట్రాఫిక్, ఎన్నికల నిబంధనలు అతిక్రమించినందున మాజీ ఎమ్మెల్యేతో పాటు.. టీడీపీ నేతలు గుంటూరు సాంబశివరావు, గడుపూడి విశ్వనాథం, చెరుకూరి చౌదరి, గోరంట్ల హనుమంతరావు, యరమాసు కోటేశ్వరరావు, పారా చౌదరి, చింతా గంగయ్య, అమృతపూడి కోటయ్య, మాదాల చిరంజీవి, బొల్లా పేరయ్య, దొడ్డా ఏడుకొండలు తదితరులపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం
-
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కొయ్యూరు మండలం మర్రిపాలెం చెక్‌పోస్ట్ వద్ద ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేసి ఏలూరుకు తరలిస్తున్నట్లు సమాచారం. కాగా నిన్న దెందులూరులో పెట్రోల్ ధరలపై చింతమనేని ఆందోళన చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకుగాను దెందులూరు పోలీసులు కేసు నమోదు చేశారు. -
బుచ్చిరాజ్యంలో.. ఆదిపత్య పోరు
వందల ఏళ్ల చరిత్ర కలిగి.. రాజరాజనరేంద్రుడు ఏలిన పురాతన రాజమహేంద్రవరం నగరంలో ఆధిపత్యం కోసం ఇద్దరు సామంతులు ‘ఎత్తుల’ కత్తులు దూస్తున్నారు. ఒక సామంతుడు ‘బుచ్చి’రాజు. మరొకరు ‘ఆది’రాజు. రాజులు పోయినా.. రాజ్యాలు పోయినా రాచరికపు వాసనలు వారిని వీడటం లేదు. బుచ్చిరాజును సైన్యంతో సహా పదేళ్ల క్రితమే పొరుగు రాజ్యానికి ఆదిరాజు తరిమేశారు. అప్పటి నుంచీ కోల్పోయిన రాజ్యంలో పట్టు సాధించాలనే ఆరాటంతో.. అవకాశం వచ్చినప్పుడల్లా అలక పాన్పు ఎక్కేస్తున్నారు బుచ్చిరాజు. వందిమాగధులతో రకరకాల తంత్రాలు పన్నుతున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవంతో రాజకీయ మాయోపాయాలు పన్ని, ఆదిరాజును ఇరుకున పెట్టి, రాజ్యంలో పట్టు సాధించాలన్నది ఆయన వ్యూహం. సాక్షి,రాజమహేంద్రవరం: ఉత్తరాంధ్ర పరగణాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన ఆజానుబాహుడైన ఓ నాయుడికి స్వయానా బంధువైన ఆదిరాజు ఏమైనా తక్కువ తిన్నారా? బుచ్చిరాజు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తన రాజ్యంలో వేలు పెడితే యుద్ధం తప్పదని వేగుల ద్వారా బుచ్చిరాజుకు సందేశం పంపించారు. అలనాడు దుర్యోధనుడు చెప్పినట్టు ‘‘సూది మొన మోపినంత స్థలం కూడా వదులుకోన’’ని స్పష్టంగా చెప్పాడు. విషయం ఆ నోటా ఈ నోటా రాజ్యం నలుమూలలా పాకడంతో సామంతులు, ఆంతరంగికుల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. భటుల ద్వారా ఇది తెలుసుకున్న బుచ్చిరాజు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అలాగని వందిమాగధులతో యుద్ధానికి సై అని సాహసించడం లేదు. తన రాజ్యంలోని సైనిక సంపత్తి, మంత్రాంగం సరిపోదనే కారణంతో.. అలకబూని.. రాజప్రసాదం తలుపులు తెరవకుండా మూడు రోజులుగా అంతఃపురానికే పరిమితమైపోయారు. ఈ తరహా రాజకీయ తంత్రం బుచ్చిరాజుకు కొత్తేమీ కాదు. రాజమహేంద్రవర రాజ్యాన్ని కోల్పోయిన గాయం ఇంకా మానకున్నా.. ‘చంద్ర’వంశ రాజదర్బార్‌లో కనీస మర్యాద కూడా దక్కడం లేదని ఏడు పదుల వయస్సులో ఉన్న ఈ సామంతరాజు కుమిలిపోతున్నారు. గతంలో కూడా ఇలానే కనీసం వయస్సుకు కూడా విలువ ఇవ్వడం లేదంటూ అంతఃపురంలో ఏకాంతంగా అంతర్మధనం చెందిన సందర్భాలు చాలానే ఉన్నాయని ఆంతరంగికులు గుసగుసలాడుకుంటున్నారు. దాదాపు పదేళ్లుగా అవమాన భారంతో రగిలిపోతున్న బుచ్చిరాజు కోల్పోయిన చోటే వెతుక్కోవాలనే సూత్రాన్ని అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ ఆయన ఎత్తులు ఆదిరాజు రాజకీయ తంత్రం ముందు చిత్తవుతున్నాయి. భవిష్యత్‌లో రాజమహేంద్రవరంలోని 52 పరగణాలకు జరిగే పోరు కోసమే సామంతుల మధ్య ఇంతటి రాజ్యకాంక్ష నెలకొందనే చర్చ రాజదర్బారులో నడుస్తోంది. బుచ్చిరాజు రాజ్యంలోకి వచ్చే తొమ్మిది పరగణాలతో పాటు, మిగిలిన 43 పరగణాల్లో తన సుబేదారులకే పట్టు ఎక్కువ ఉండటంతో.. వారిని యుద్ధరంగంలోకి దింపాలనేది బుచ్చిరాజు వ్యూహం. అయినప్పటికీ ఆదిరాజు సిక్కో లు రాజుల బంధుత్వం దన్నుతో ధీమాగా ఉన్నారని ఆ రాజప్రసాదంలోని భటులు చెప్పుకొంటున్నారు. సామంతుల మధ్య సంధి కోసం ‘చంద్ర’వంశ రాజు పంపించిన దూతలు బుచ్చిరాజు అంతఃపురంలో గంటన్నర చర్చించినా చివరకు తలలు పట్టుకుని వచ్చిన దారినే పలాయనం చిత్తగించారు. పైకి మాత్రం సామంతుల మధ్య యుద్ధ వాతావరణం లేదని, బుచ్చిరాజుకు అసలు అసంతృప్తే లేదని చెప్పారు. ‘చంద్ర’వంశ సామంతులు నిమ్మకాయల చినరాజు, బెజవాడలో ‘గద్దె’నెక్కిన రామ్మోహనరాజు, రాజమహేంద్రవరం రాజ్యంలో గోదావరి అవతల ఒడ్డున ప్రజలకు చుక్కలు చూపించిన హర్రర్రాజు, అనపర్తి రెడ్డి రాజు వంటి దూతల సంధి విఫలమైంది. అసలు సామంతుల మధ్య చిచ్చు పెట్టిందే ‘చంద్ర’వంశ రాజు. సంధి కోసం వెళ్లిన దూతలు మధ్యలో అంతఃపురం బయట చెప్పుకొన్న మాటలను రహస్యంగా విన్న రాజభటులు బుచ్చిరాజు చెవిన వేశారు. నాడు పిల్లనిచ్చి, మంత్రిని చేసిన మామ రాజ్యాన్నే కూల్చేసి, సింహాసనం అధిíÙ్ఠంచి, ఇన్నేళ్లవుతున్నా.. తన వ్యతిరేక కూటమితో చేతులు కలిపిన బుచ్చిరాజును ఒకప్పటి ‘చంద్ర’వంశ రాజు ఇప్పటికీ వదిలిపెట్టలేదని వేగుల ద్వారా వచ్చిన సమాచారం. అందుకే ఈ సంధి యత్నాలు ‘చంద్ర’వంశ అంతఃపురం సాక్షిగా రక్తి కట్టిస్తున్న ఎత్తుగడగా కనిపిస్తున్నాయి. చక్రవర్తిగా బుచ్చిరాజు చలామణీ అయ్యే రోజుల్లో అతడికి ఆదిరాజు సామంతుడు కావడమే విచిత్రం. సామంతుల మ«ధ్య చిచ్చు చివరకు ఏ తీరానికి చేరుతుందోనని ఇరుగు, పొరుగు రాజ్యాల్లోని నాయకులు, ప్రజలు కోటగోడలెక్కి మరీ ఆసక్తిగా చూస్తున్నారు. -
వెలగపూడి వైరస్: పేదల ఫుడ్ కోర్టుపై ‘పడగ’
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు... ఈయన గారి నేర చరిత్ర ఎంత చెప్పుకున్నా తక్కువే. వంగవీటి మోహన రంగా హత్య కేసులో నిందితుడుగా పరారై ఇక్కడకు వలస వచ్చిన దరిమిలా విశాఖ నగరంలో విష సంస్కృతికి బీజం వేసిన ప్రబుద్ధుడీయన. కోడి పందేలు.. దౌర్జన్యాలు.. మద్యం మాఫియా ఆగడాలు, భూ దందాలు.. అక్రమార్జన.. ఇలా విశాఖకు మునుపెన్నడూ ఎరగని నయా మాఫియాకు తెరలేపిన ’పచ్చ’ నేత ఈయన. దాదాపు పదిహేనేళ్లుగా తూర్పు నియోజకవర్గాన్ని చెరబట్టిన ఈయన గారి నిర్వాకాలకు, దందాలకు గత రెండేళ్లుగా బ్రేక్ పడుతూ వస్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. వెలగపూడి బ్యాచ్ భూదందాలు, కోడిపందాలు, మద్యం మాఫియాకు దాదాపు అడ్డుకట్టపడిందనే చెప్పాలి. అయితే అక్రమార్జన అలవాటుపడిన సదరు వెలగపూడి బ్యాచ్ చివరికి చిరు వ్యాపారుల ఫుడ్ కోర్ట్‌పై కూడా పడిపోయారు. నగరమంతటా కోవిడ్ వైరస్ కలకలం సృష్టిస్తుంటే.. నైట్‌ఫుడ్ కోర్టులో మాత్రం వెలగపూడి వైరస్ ప్రబలింది. ఇంతకీ.. ఆ వైరస్ ఏంటి.. నైట్‌ఫుడ్ కోర్టులో అసలేం జరుగుతోందో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి రండి. మహా నగర పరిధిలోని స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కోసం జీవీఎంసీ 2019 ఫిబ్రవరిలో జైల్ రోడ్డులో 27 ఫుడ్ స్టాల్స్‌తో నైట్ ఫుడ్ కోర్టు ప్రారంభించింది. ఆ తర్వాత క్రాఫ్ట్ బజార్ కూడా ఇందులో ప్రారంభించాలని అధికారులు భావించారు. అయితే.. అదే ఏడాది మార్చి నుంచి కరోనా కలకలం మొదలవ్వడంతో లాక్‌డౌన్‌తో కొన్నాళ్లు వ్యాపారాలు మూతపడ్డాయి. పర్యవేక్షించాల్సిన జీవీఎంసీ అధికారులంతా కోవిడ్ నియంత్రణ చర్యల్లో 24‘‘7 బిజీగా అయిపోయారు. గతేడాది మే నుంచి నుంచి నెమ్మది నెమ్మదిగా కోలుకుంటున్నప్పటికీ.. వైరస్ వ్యాప్తి చెందకుండా నగర ప్రజల్ని కాపాడే బాధ్యతని జీవీఎంసీ భుజానికెత్తుకొని.. నైట్ ఫుడ్ కోర్టు విషయాన్ని పక్కన పెట్టేసింది. ఆ తర్వాత లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత అన్ని వ్యాపారాల మాదిరిగానే ఫుడ్ కోర్టు కూడా మొదలైంది. ఇదే అదనుగా ఎమ్మెల్యే వెలగపూడి అనుచరులు ఫుడ్‌కోర్టుని ఆక్రమించేశారు. పేదల కోసం ఏర్పాటు చేసిన ప్రాంతంలో పచ్చజెండా పాతేశారు. అనుమతి 27 స్టాల్స్‌కి.. ఉన్నవి 138 అప్పటివరకు ఎంవీపీ కాలనీ, బీచ్‌రోడ్డులో స్ట్రీట్‌ఫుడ్ దందా సాగిస్తున్న వెలగపూడి బ్యాచ్ జైల్‌రోడ్డులోని నైట్‌ఫుడ్ కోర్టుని ఆక్రమించేసింది. వెలగపూడి తన అనుచరుల ద్వారా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయించేశారు. అక్కడితో ఆగకుండా మహారాష్ట్ర, ఒడిశా, రాజస్తాన్, కర్ణాటక, తమిళనాడు ఇలా.. వివిధ రాష్ట్రాలకు చెందిన వారికీ స్టాల్స్ పెట్టుకోడానికి వాళ్లే సొంత అనుమతులిచ్చేశారు. వీరిని చూసి.. మిగిలిన మరికొందరు సైతం తమకు నచ్చినట్లుగా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారు. జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకురాకుండానే ఓ రకంగా. మొత్తం ఫుడ్ కోర్టుని తమ ఆధీనంలోకి తీసేసుకున్నారు. మొత్తం 27 స్టాల్స్‌కు మాత్రమే అనుమతులుండగా ప్రస్తుతం 138 వరకూ వచ్చేశాయి. ఇందులో సగానికి పైగా వెలగపూడి అనుచరులకు చెందిన ఫుడ్ స్టాల్స్ ఉన్నాయని అంటున్నారు. ఒక్కొక్కరూ తమ బంధువుల పేరుతోనే నాలుగైదు స్టాల్స్ ఏర్పాటు చేసుకొని చిరు వ్యాపారుల్ని మాత్రం వాటి దరి చేరకుండా తమ గుప్పిట్లోకి తీసేసుకున్నారు. జీవీఎంసీలో పెండింగ్‌లో 500 దరఖాస్తులు ఫుడ్ కోర్టు ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే మంచి స్పందన రావడంతో నగరంలోని వివిధ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ జీవీఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 500కి పైగా దరఖాస్తులు వచ్చాయని యూసీడీ విభాగాధికారులు చెబుతున్నారు. గతంలో ఉన్న 27 మందికి మాత్రమే ఇప్పటివరకు ఫుడ్ కోర్టులో స్టాల్స్ పెట్టుకోవాలని తాత్కాలిక అనుమతి ఇచ్చామనీ.. ఇంకెవ్వరినీ అనుమతించలేదని స్పష్టం చేస్తున్నారు. కోవిడ్ పరిస్థితుల నుంచి బయటపడిన తర్వాతే ఫుడ్ కోర్టు విషయమై ఏం చేయాలో ఆలోచిస్తామని అధికారులు అంటున్నారు. స్టాల్ స్టాల్‌కీ.. వసూళ్ల పర్వం జీవీఎంసీ తమ ఆదాయ వనరుగా నైట్ ఫుడ్ కోర్టుని ఏర్పాటు చేస్తే.. వెలగపూడి బ్యాచ్ దాన్ని తమకు అనుకూలంగా మలచుకున్నారు. ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయాలంటే లక్ష నుంచి రెండు లక్షల రూపాయిల వరకూ వసూలు చేశారు. పోనీ.. జీవీఎంసీకి వీటి వల్ల ఆదాయం వస్తుందా అంటే.. ఇప్పటివరకూ నైట్ ఫుడ్ కోర్టు నుంచి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదని అధికారులే చెబుతున్నారు. మొదట అధికారికంగా ఏర్పాటు చేసిన 27 స్టాల్స్ నుంచి కూడా ఫీజు వసూలు చేయలేదనీ.. కరోనా కారణంగా మినహాయింపునిచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. చిరు వ్యాపారులను తొక్కేసి.. రోడ్లపై చిరుతిళ్లు అమ్ముతూ బతుకులీడ్చుతున్న నగరానికి చెందిన చిన్న వ్యాపారుల అభివృద్ధికి ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్ చివరికి బడా వ్యాపారస్తుల కేంద్రంగా మారిపోయింది. ఆ ఫుడ్‌కోర్టులోకి అడుగు పెడితే కొన్ని స్టాళ్లలో పెద్ద హోటల్స్‌తో పోటీగా ధరలుంటాయి. మొత్తంగా ఫుడ్ కోర్ట్ ఏర్పాటు సదుద్దేశ్యాన్ని పక్కదారి పట్టించి... చిరు వ్యాపారులను మింగేసిన పచ్చ రాబందులపై జీవీఎంసీ అధికారులు ఇప్పటికైనా దృష్టిసారిస్తారో లేదో చూడాలి. చదవండి: టీడీపీ నేతకు షాక్: అక్రమ నిర్మాణం కూల్చివేత.. నేడే చూడండి.. గణబాబు ఆక్రమణ ‘చిత్రం’ -
రెక్కలు విరిగి.. నకనకలాడిపోతున్న వెలగ కోడి
రెక్కలు తొడిగి రెపరెపలాడి రివ్వంటోంది.... ముప్పై ఏళ్ల కిందట తెలుగు సినీ అభిమానులను ఓ రేంజ్లో ఉర్రూత లూగించిన ఈ పాటను ఇప్పుడు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విషయానికి వచ్చే సరికి ఇదిగో ఇలా చదువుకోవాలి– రెక్కలు విరిగి నకనకలాడి అల్లాడిపోతున్న వెలగకోడి... ఎక్కడైనా వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు పేరు చెబితే వెంటనే ఆ ప్రాంత అభివృద్ధి గుర్తుకు రావాలి... ఆ ప్రాంతంలో ఆయన ఆధ్వర్యంలో చేసిన మంచి పనులు జ్ఞప్తికి రావాలి.. నియోజకవర్గ ప్రజలకు చేసిన ఎన్నో మేళ్ళు స్ఫురణకు రావాలి.. కానీ మూడు దఫాలుగా విశాఖ తూర్పున వెలగబెడుతున్న రామకృష్ణ పేరు చెప్పగానే... కోడి పందేలు.. దౌర్జన్యాలు.. మద్యం మాఫియా ఆగడాలు, భూ దందాలు. పంచాయితీలు.. ఇంతకుమించి ఆయన వెలగబెట్టిందేమన్నా ఉందా అంటే సొంత పార్టీ నేతలు కూడా నిజాయితీగా ఠక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి.. ప్రభుత్వం ఉన్నా.. దాదాపు పదేళ్లు అడ్డగోలుగా నియోజకవర్గంపై పడిపోయి అందినకాడికి దోచేసిన వెలగపూడికి సరిగ్గా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి తారుమారైంది. అసలేమయింది అనుకుంటున్నారా... అయితే పూర్తి వివరాల కోసం లోపలికి రండి.. సాక్షి, విశాఖపట్నం : అధికారం దన్నుతో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గతంలో ఇష్టారాజ్యంగా చేసిన దందాలు, వ్యవహారాలు, దౌర్జన్యాలకు దాదాపు 20 నెలలుగా అడ్డుకట్ట పడింది. విజయవాడ మాజీ శాసనసభ్యుడు, దివంగత వంగవీటి మోహన్‌రంగా హత్యకేసులో మూడో నిందితునిగా పరారై ఇక్కడకి వలసొచ్చి.. ఆనక ’పరిస్థితులు’ కలసి రావడంతో ఎమ్మెల్యే గిరీ వెలగబెడుతున్న వెలగపూడి.. విశాఖ సంస్కృతికిపై తనదైన విషాన్ని చిమ్ముతూ వచ్చారు. ► ముందుగా చెప్పాలంటే కోడి పందేలు... గోదావరి జిల్లాల్లో పెద్ద పండక్కి ఆనవాయితీగా జరిగే సంప్రదాయ కోడి పందేలకు వెలగపూడి ఇక్కడ జూదం ముసుగు వేసి తెరలేపారు. ఉత్తరాంధ్ర సంప్రదాయాలకు భిన్నంగా అడ్డగోలుగా కోడిపందేలను దగ్గరుండి నిర్వహించేవారు. ఈ వ్యవహారాలపై 2018లో సాక్షిలో వచ్చిన వరుస కథనాల నేపథ్యంలో అదే ఏడాది కోడి పందేల కేసులో వెలగపూడి అభిమానం సంఘం నేతను పోలీసులు అరెస్టు చేశారు. ఇక 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ జూదం మాటున జరిగే కోడిపందేలకు పూర్తి స్థాయిలో అడ్డు కట్ట పడింది. ఐదారేళ్ళుగా కోడి పందేల బరులుతో విష సంస్కృతితో అల్లాడిన తూర్పు నియోజకవర్గంలో గతేడాది ఒక్క బరి కూడా గీయలేదు. ఇలా వెలగ’కోడి’కి పూర్తిగా రెక్కలు విరిగాయనే చెప్పాలి. ► ఇక వెలగపూడి బ్యాచ్ చేసే దందాలకు ఏడాదిన్నరగా పూర్తిగా బ్రేక్ పడింది. తూర్పున అడ్డు అదుపు లేకుండా వెలగపూడి అనుచరులు.. షాపులు, వాణిజ్య వ్యాపార సంస్థలకు పెట్టే ’ఇండెంట్స్’ లేకుండా పోయాయి. ► ఇది మరో భారీ దెబ్బ... దశాబ్దాల మద్యం మాఫియాకు ముకుతాడు పడింది. ఏడాదిన్నర కిందట వరకు ఒక్క తూర్పు నియోజకవర్గంలోనే కాదు.. నగరం మొత్తంమీద మద్యం మాఫియాకు వెలగపూడే నాయకత్వం వహించే వారు. లెక్కకు మించిన బార్ అండ్ రెస్టారెంట్లలో వాటాలున్నా... బినామీల పేరిట సొంతంగా నాలుగు షాపులు, రెండు బార్ అండ్ రెస్టారెంట్లు నిర్వహించే వారు. ఆరిలోవ, పెదగదిలి, ఎంవీపీ కాలనీ, జగదాంబ సెంటర్లలో షాపులు, ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట, ఓల్డ్ టౌన్లో బార్లు ఉండేవి. జగదాంబ సెంటర్లో షాపు స్వయంగా వెలగపూడి కుటుంబసభ్యుల పేరిటే ఉండేది. ఆయా షాపుల్లో కల్తీ మద్యం ఏరులై పారినా దాదాపు పదేళ్లు ఎవ్వరూ పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే ఎక్సైజ్ అధికారులు కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపారు. ఆ క్రమంలోనే వెలగపూడి చిట్టాలోని షాపుల్లో వరుసగా కల్తీ మద్యం విక్రయిస్తున్న దాఖలాలు బయటపడ్డాయి. కేసులు నమోదు చేసి పాత్రధారులను అరెస్టు చేశారు. వెంటనే సూత్రధారి వెలగపూడి బయటకు వచ్చి నానాయాగీ చేశారు. వెంకోజిపాలెంలో అక్రమ మద్యం విక్రయిస్తున్న విషయం బయటపడి కేసులు రాస్తే వెలగపూడి సీరియస్‌గా చేసిన ’యాక్షన్’ నవ్వులు పూయించింది. స్టేషన్ వద్దనే నిద్ర చేసి హడావుడి చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దరిమిలా నూతన మద్యం పాలసీ నేపథ్యంలో వెలగపూడి పూర్తిగా బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వహణను నుంచి తప్పుకున్నట్టే చెప్పాలి. అంటే దాదాపు 20ఏళ్లుగా మద్యం మహమ్మారితోనే వ్యాపారం.. కాదు కాదు... ఆ ముసుగులో దందాలు చేసిన వెలగపూడికి సరిగ్గా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే చెక్ పడింది. ► ఇక తాజాగా వెలగపూడి భూదందాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. వెలగపూడి భార్య పేరిట రుషికొండలో బీచ్ రోడ్డు సర్వే నెంబరు 21లో గెడ్డ పక్కన ఆక్రమించిన ఆరు సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని ఇటీవల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో వేసిన రేకుల షెడ్‌ను.. చుట్టూ ఉన్న ప్రహరీని తొలగించారు. ► ఈ వరుస పరిణామాల నేపథ్యంలో విశాఖ తూర్పు ప్రజలు హాయిగా స్వేచ్ఛావాయువులు పీలుస్తుంటే... అన్ని అక్రమాల రెక్కలు తెగిన వెలగ’కోడి’ మాత్రం గిల గిలా కొట్టుకుంటోందని అంటున్నారు. అందుకే సదరు వెలగపూడి... విశాఖ సమగ్రాభివృద్ధిని కాంక్షించే రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డిపై లేనిపోని ఆయాసంతో అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని పచ్చ బ్యాచే ఆఫ్ ది రికార్డ్‌గా అంగీకరిస్తున్నారు. ఇంకెవరికైనా ఎనీ డౌట్స్.?. -
‘బాలయ్య కరోనా మంత్రం’పై జోకులే జోకులు!
-
‘బాలయ్య కరోనా మంత్రం’పై జోకులే జోకులు!
సాక్షి, అనంతపురం: వివాదాస్పదమైన వ్యాఖ్యలు, ప్రవర్తనతో వార్తల్లో నిలిచే టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా ప్రజలకు ఉచిత సలహాలిచ్చి విమర్శలు కొనితెచ్చుకున్నారు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైన బాలయ్య 9 నెలలుగా అటువైపు కన్నెత్తైనా చూడలేదు. ఈక్రమంలో ఆయన తీరుపై స్థానికంగా విమర్శలు రావడంతో సోమవారం హిందూపురంలో పర్యటించారు. అయితే, భౌతికదూరం నిబంధనలను పాటించకుండా సమావేశంలో పాల్గొన్నారు. (దళితులు గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు) దాంతోపాటు.. కరోనాకు భయపడొద్దని, వేద మంత్రాలతో కరోనాను ఎదుర్కొందామని చెప్తూ లలిత త్రిపుర సుందరి మంత్రాన్ని చదివి వినిపించారు. కరోనా నివారణ కోసం ఈ మంత్రాన్ని పఠించాలని ప్రజలకు సూచించారు. తాను చెప్పిన మంత్రాన్ని 108 సార్లు చెబితే కరోనా దరిచేరదని బాలకృష్ణ పేర్కొన్నారు. కరోనా బారిన పడకుండా ప్రజలకు జాగ్రత్తలు చెప్పాల్సింది పోయి మంత్రాలు చదవమనడంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ‘బాలయ్య కరోనా మంత్రం’ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. (టీడీపీ నేతలు దండుపాళ్యం బ్యాచ్’) -
మాజీ ఎమ్మెల్యే తనయుడికి రెండో వివాహ యత్నం
-
బెజవాడకు అచ్చెన్నాయుడు తరలింపు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును అవినీతి నిరోధక శాఖ అధికారులు మరో రెండు గంటల్లో విజయవాడకు తీసుకురానున్నారు. ఇక్కడకు చేరుకోగానే ఈఎస్ఐ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి ఏసీబీ సెంట్రల్ ఆఫీసుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. అక్కడ రికార్డు వర్క్ పూర్తైన తర్వాత ఇంకా సమయం మిగిలి ఉంటే ఏసీబీ కోర్టులో ఆయనను హాజరుపరుచనున్నారు. ఒకవేళ కోర్టు సమయం ముగిసినట్లయితే ఏసీబీ న్యాయమూర్తి ఇంటి వద్దకు తీసుకువెళ్లనున్నారు. ఇక అచ్చెన్నాయుడుతో పాటు ఈఎస్ఐ స్కాంలో పాత్రధారులుగా ఉన్న మరో ఐదుగురిని ఏసీబీ అధికారులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు ప్రదేశాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా శుక్రవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.(కళ్లు బైర్లు కమ్మే అవినీతి, అక్రమాలు) ఇదిలా ఉండగా... అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై ఏసీబీ ప్రకటన చేయడంతో పాటు మీడియా సమావేశం కూడా నిర్వహించినప్పటికీ.. ఆయనను కిడ్నాప్ చేశారంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డ్రామాకు తెర తీశారు. అచ్చెన్నాయుడిని శుక్రవారం ఉదయం 7.30 గంటలకు ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుంటే.. అర్ధరాత్రి ఆయనను అరెస్ట్ చేశారంటూ చంద్రబాబు లేఖ విడుదల చేశారు. ఎక్కడకు తీసుకెళ్లారో, ఎందుకు తీసుకెళ్లారో తెలియదంటూ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఆయన ఈ విధంగా లేఖ విడుదల చేశారంటూ పలువురు మండిపడుతున్నారు. -
రెండో పెళ్లికి యత్నం; టీడీపీ నేతలే పెద్దలు
తెలుగుదేశం పార్టీ ప్రముఖులే పెళ్లి పెద్దలుగా కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుమారుడికి రెండో వివాహం చేసేందుకు జరిగిన యత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం : తెలుగుదేశం పార్టీ ప్రముఖులే పెళ్లి పెద్దలుగా ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడికి రెండో వివాహం చేసేందుకు జరిగిన యత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. మాజీమంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడి స్వగ్రామం తొండంగి మండలం ఏవీ నగరం ఈ వ్యవహారానికి వేదిక అయ్యింది. పోలీసులు, స్థానికులు, బాధితుల కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్తిబాబు దంపతుల కుమారుడు రాధాకృష్ణకు బుధవారం అర్ధరాత్రి రెండో వివాహం చేసేందుకు యత్నించారు. దీనికి మాజీమంత్రులు యనమల, చినరాజప్ప తదితర టీడీపీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే, రాధాకృష్ణ ఇదివరకే తనను పెళ్లి చేసుకున్నాడని, ఇద్దరు పిల్లలు పుట్టాక తనను మోసంచేసి, ఇప్పుడు రెండో వివాహం చేసుకుంటున్నాడని సామర్లకోట మండలం మాధవపట్నానికి చెందిన పిల్లి మంజుప్రియ బుధవారం కాకినాడ ‘దిశ’ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జారుకున్న యనమల, చినరాజప్ప ఇదిలా ఉంటే.. పోలీసులు వస్తున్నారనే సమాచారం తెలియడంతో యనమల, చినరాజప్ప, ఇతర టీడీపీ నేతలు అక్కడి నుంచి జారుకున్నారు. తాము వెళ్లేసరికి కల్యాణ వేదిక వద్ద పెళ్లి కుమారుడు, కుటుంబ సభ్యులు ఉన్నారని.. దీంతో వివాహాన్ని నిలిపివేశామని పోలీసులు తెలిపారు. కాగా, తనను వదిలించుకుని రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న రాధాకృష్ణపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని మంజుప్రియ డిమాండ్ చేశారు. అతడికి కొంతమంది మాజీమంత్రుల మద్దతు ఉందని ఆరోపించారు. దీనిపై నిర్దిష్టంగా ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
విశాఖలో టీడీపీకి షాక్!
మహారాణిపేట(విశాఖపట్నం): టీడీపీ విశాఖ అర్బన్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్ ఎస్ఏ రెహమాన్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను చంద్రబాబు వ్యతిరేకించడానికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తాను చరిత్ర హీనుడిగా మిగలదల్చుకోలేదని, చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నుంచి వైదొలగుతున్నట్లు తెలిపారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించాల్సిందిగా టీడీపీ ఆదేశించిందని, స్థానికంగా ఉంటూ విశాఖ అభివృద్ధిని ఎలా వ్యతిరేకిస్తామని ప్రశి్నంచారు. జాతీయ పౌరపట్టిక (ఎన్ఆర్సీ)పై చంద్రబాబు ద్వంద్వ వైఖరి కూడా తన రాజీనామాకు కారణమన్నారు. విశాఖకు నిధులు రాకుండా అడ్డుకున్న బాబు విశాఖను కార్య నిర్వాహక రాజధానిగా జీఎన్ రావు కమిటీ ప్రతిపాదించడాన్ని స్వాగతిస్తున్నట్టు రెహమాన్ పేర్కొన్నారు. చంద్రబాబు తన హయాంలో విశాఖకు చేసిందేమీ లేదని విమర్శించారు. విశాఖ ఎక్కడ అభివృద్ధి చెందుతుందోనని నగర కార్పొరేషన్‌కు కేంద్రం నుంచి నిధులు కూడా రాకుండా చేశారని ధ్వజమెత్తారు. లోకేష్ రాజకీయాల్లోకి ప్రవేశించాక చంద్రబాబు మరింత దిగజారిపోయారని, పార్టీ పూర్తిగా నాశనమైందని చెప్పారు. అమరావతిలో రాజకీయ డ్రామాలు నడిపిస్తున్న చంద్రబాబు ఇప్పటికైనా తప్పుడు రాజకీయాలు ఆపి అక్కడి రైతులకు క్షమాపణ చెప్పాలని రెహమాన్ డిమాండ్ చేశారు. రైతుల నుంచి 33 వేల ఎకరాలు తీసుకుని ఐదేళ్లు అధికారంలో ఉన్నా రాజధాని నిరి్మంచలేనందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఏ వర్గానికీ ఆయన మేలు చేయలేదన్నారు. అందుకే ఎన్నికల ముందు పసుపు – కుంకుమ పేరుతో డబ్బులు మళ్లించినా మహిళలు టీడీపీకి కాకుండా వైఎస్సార్సీపీకే ఓటు వేశారని చెప్పారు. తాను ఎన్టీఆర్ అభిమానినని, చంద్రబాబును నమ్మి తమ జీవితాలను ఫణంగా పెట్టి పాపం చేశానని రెహమాన్ పేర్కొన్నారు. విశాఖలో రాజధాని ఏర్పాటుపై చంద్రబాబుతో పాటు కొందరు టీడీపీ నేతలు కులాల ప్రస్తావన తేవటాన్ని ఖండించారు. జగన్‌కు మైనారిటీలు రుణపడి ఉంటారు ఎన్ఆర్సీ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడాన్ని రెహమాన్ స్వాగతించారు. రాష్ట్రంలో ఎన్ఆర్సీ అమలు చేయబోమని ప్రకటించిన సీఎంకు మైనారీ్టలంతా రుణపడి ఉంటారన్నారు. సీఎంపై విమర్శలు చేయాలంటూ చంద్రబాబు ఆదేశించారని, మైనార్టీలకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న సీఎం ప్రకటనను తాము ఎలా వ్యతిరేకిస్తామని ప్రశి్నంచారు. -
ఇసుక దోపిడీలో ఆయన జిల్లాలోనే ‘నంబర్ వన్’
సాక్షి, కాకినాడ: టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు బురద చల్లుడు రాజకీయాలు మానుకోవాలని డిప్యూటీ సీఎం సుభాష్ చంద్రబోస్ హితవు పలికారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఇసుక దోపిడీలో జిల్లాలోనే ప్రథమస్థానంలో నిలిచిన వ్యక్తి వేగుళ్ల జోగేశ్వరరావు అని..అటువంటి వ్యక్తి ఇవాళ ఇసుక కోసం మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయనను ఇసుక దోపిడీ సంఘానికి అధ్యక్షుడిగా పెట్టుకోవచ్చని ఎద్దేవా చేశారు. జిల్లాలోని టేకి గ్రామంలో ఒక వ్యక్తి తన వ్యక్తిగత కారణాల వల్ల మరణిస్తే...ఇసుక లభించక మృతిచెందాడని వేగుళ్ల బుద్ధిహీనమైన వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బురద చల్లాలనే తాపత్రయం తప్ప..వాస్తవ పరిస్థితులు చెప్పడంలేదని ధ్వజమెత్తారు. ‘ఇద్దరం కలిసి టేకి గ్రామం వెళదామని..ఇసుక కోసమే అక్కడ వ్యక్తి మరణిస్తే బహిరంగ క్షమాపణలు బెబుతామని..లేకపోతే జ్ఞానోదయం వచ్చిందని ప్రకటించాలని వేగుళ్ల జోగేశ్వరరావుకు సుభాష్ చంద్రబోస్ సవాల్ విసిరారు. -
టీడీపీ ఎమ్మెల్యేకు చుక్కెదురు
సాక్షి, గుంటూరు : రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌కు చుక్కెదురైంది. వరద సహాయంపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ జనాన్ని రెచ్చగొట్టిన ఆయన ప్రజల చేతిలో అభాసుపాలయ్యారు. గురువారం వరద ముంపు బాధితులను పరామర్శించేందుకు ఎమ్మెల్యే అనగాని పెనుమూడిపల్లెపాలెం వెళ్లారు. అక్కడ వరద సహాయంపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ జనాన్ని రెచ్చగొట్టారు. దీంతో ఆయనపై తిరగబడ్డ జనం అసలు మీరేం చేశారో చెప్పాలంటూ నిలదీశారు. గత ఐదేళ్లలో ఒక్కసారైనా మా ఊరు వచ్చారా అంటూ ప్రశ్నించారు. వరదలు వస్తే ప్రభుత్వం భోజనం పెట్టి ఆదుకుందని గ్రామస్తులు తెలిపారు. అనవసర రాజకీయాలు చేయొద్దని ఎమ్మెల్యేకు హితవు పలికారు. గ్రామస్తులు ఆగ్రహించటంతో చేసేదేమీలేక టీడీపీ ఎమ్మెల్యే అనగాని అక్కడినుంచి వెళ్లిపోయారు. -
‘ఇది ఎమ్మెల్యే కాలేజీ.. దిక్కున్నచోట చెప్పుకోండి’
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న వైజాగ్ డిఫెన్స్ అకాడమీ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. విద్యార్థి టీసీ ఇచ్చేందుకు సొమ్ములు డిమాండ్ చేయడంతోపాటు బెదిరింపులకు పాల్పడ్డారంటూ బాధితులు విశాఖ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన మారెడ్డి మణికంఠారెడ్డి విశాఖ నగరం 104 ఏరియాలో ప్రియదర్శిని జూనియర్ కాలేజీగా రిజిస్టరైన వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదివాడు. సబ్జెక్టులు చాలా మిగిలిపోవడంతోపాటు సరైన విద్యా ప్రమాణాలు లేవని, హాస్టల్ వసతి కూడా సరిగ్గా లేదని భావించిన మణికంఠ కుటుంబ సభ్యులు కాలేజీ నుంచి టీసీ తీసుకోవాలని భావించారు. విశాఖ నగరం 104 ఏరియాలోని వైజాగ్ డిఫెన్స్ అకాడమీ కళాశాల ప్రిన్సిపాల్ మంగళవాణిని సంప్రదించిన విద్యార్థి తల్లి మారెడ్డి ఆదిలక్ష్మి తన కుమారుడి టీసీ ఇవ్వాలని కోరారు. టీసీ ఇవ్వాలంటే రూ.30 వేలు చెల్లించాలని ప్రిన్సిపాల్ డిమాండ్ చేశారు. ఫస్టియర్ ఫీజు మొత్తం రూ.1.50 లక్షలు చెల్లించామని, టీసీ కోసం మళ్లీ రూ.30 వేలు అడగటం ఏమిటని ఆదిలక్ష్మి ప్రశ్నించారు. అంతమొత్తం చెల్లించలేమని స్పష్టం చేశారు. దీంతో కళాశాల సిబ్బంది ఒక్కసారిగా జులుం ప్రదర్శించారు. ‘డబ్బు కట్టకపోతే టీసీ ఇచ్చేది లేదు. బయటకు పొండి’ అంటూ బలవంతంగా గెంటివేశారు. ఇదేమిటని ఎదురు తిరిగిన వారిపై ‘ఇది ఎమ్మెల్యే గారి కాలేజీ. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి. మమ్మల్ని ఎవ్వరూ పీకలేరు. ఎక్కువ మాట్లాడితే మీరు గుంటూరు కూడా వెళ్లలేరు’ అని బెదిరింపులకు దిగారు. దీంతో భయభ్రాంతులకు గురైన ఆదిలక్ష్మి వెంటనే ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ప్రిన్సిపాల్, మేనేజ్మెంట్పై ఫిర్యాదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఫొటోతో ఉన్న అకాడమీ బోర్డు కేసు దర్యాప్తు చేస్తున్నాం ప్రియదర్శిని కాలేజీగా రిజిస్టరైన వైజాగ్ డిఫెన్స్ అకాడమీపై ఆదిలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ విజయ్‌కుమార్ శనివారం తెలిపారు. ఆదిలక్ష్మితో పాటు మరో ముగ్గురు విద్యార్థుల తల్లితండ్రులు కూడా తమపై కళాశాల ప్రతినిధులు బెదిరింపులకు పాల్పడినట్టు చెప్పారన్నారు. అయితే వారు లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వలేదని పేర్కొన్నారు. గతంలోనూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన విద్యార్థుల నుంచి ఇదే మాదిరి ఫిర్యాదులు సదరు అకాడమీపై అందాయని, సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ చెప్పారు. -
నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
సాక్షి, అమరావతి: సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్న నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. నదీ జలాల పంపకంపై సభలో చర్చ జరుగుతున్న సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు సభకు ఆటంకం కలిగించారు. దీంతో స్పీకర్ నలుగురు సభ్యులను ఒక్కరోజుపాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు. సభ నుంచి సస్పెండ్ అయినవారిలో అశోక్ బెందాళం, వాసుపల్లి గణేష్, వెలగపూడి రామకృష్ణ, డోలా బాలవీరాంజనేయులు ఉన్నారు. వారంతా సభ నుంచి వెళ్లాలని స్పీకర్ సూచించినప్పటికీ ఫలితం లేకపోవడంతో మార్షల్స్ సాయంతో బయటకు పంపించారు. మరోవైపు సస్పెన్షన్‌కు నిరసనగా చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. కాగా రెండురోజుల క్రితం ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యే(అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు)లను స్పీకర్ సమావేశాలు పూర్తయ్యేవరకూ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. -
డిప్యూటీ స్పీకర్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు
సాక్షి, అమరావతి : సస్పెండ్‌కు గురైన తమ సభ్యులను తిరిగి సభకు అనుమతించాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని టీడీపీ ఎమ్మెల్యేలు కోరారు. ఈమేరకు మంగళవారం టీడీపీ సభ్యులు గంటా శ్రీనివాసరావు, కరణం బలరాంలు డిప్యూటీ స్పీకర్‌ను కలిసి సస్పెన్షన్ ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి కారణాలు లేకుండానే సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల వినతిపై స్పందించిన డిప్యూటీ స్పీకర్.. ఈ అంశాన్ని అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్లారు. పార్లమెంట్ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ చీప్‌విప్ శ్రీకాంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. అధికార, విపక్షాల సభ్యులతో డిప్యూటీ స్పీకర్ చర్చలు జరుపుతున్నారు. (చదవండి : అసెంబ్లీ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్) -
‘రేయ్.. నీ అంతు చూస్తా’ : టీడీపీ ఎమ్మెల్యే
వెంకటగిరి (నెల్లూరు): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వ్యవహార శైలి ఏ మాత్రం మారలేదు. గతంలో సైదాపురం మండలంలో టీడీపీ నేతలకు మరుగుదొడ్లు, పింఛన్లు ఇవ్వాలని అధికారులపై తిట్ల దండకంతో విరుచుకుపడిన ఎమ్మెల్యే వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అది మరువకముందే రాపూరు ఉపాధి హామీ బే ఫుడ్ టెక్నికల్ అసిస్టెంట్ (బీఎఫ్‌టీఏ) వి.రామకృష్ణకు గురువారం ఉదయం ఫోన్ చేసి పోస్టల్ బ్యాలెట్ విషయమై ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక దశలో అసభ్య పదజాలంతో దూషించారు. ఎమ్మెల్యే కురుగొండ్ల, ఉపాధి హామీ ఉద్యోగి మధ్య సాగిన ఫోన్ సంభాషణ ఇదీ.. ఉద్యోగి: సార్.. సార్.. ఎమ్మెల్యే: రేయ్.. నేను రా.. నీకు కూడు పెట్టింది. లం.. కొడకా. కూడు పెట్టినోడికి ఈ పని చేస్తావా? అందరినీ గుంపుగా పెట్టి మాట్లాడి అందరివీ ఇప్పిస్తావా (పోస్టల్ బ్యాలెట్లు).. వాళ్లకి? ఉద్యోగి: సార్.. సార్.. అది తప్పు సార్. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎమ్మెల్యే: రేయ్.. నీ కథ నేను చూస్తారా. నీ అంతు చూస్తారా. వచ్చే గవర్నమెంట్ మాదే. నిలువునా.. నిలువునా నీ తాట తీస్తా. నీ అంతు చూస్తా. మొత్తం రాసిపెట్టాలే. ఐదు సంవత్సరాలు మేం ఉద్యోగం ఇచ్చి.. సాకితే మాకే ద్రోహం చేస్త్రారా మీరు. కడుపులో భయం ఉన్న వాళ్లయితే ఎవరికి ఇవ్వాలా. కడపులో భయం ఉందా నీకు? ఉద్యోగి: నిజం సార్. నాకు తెలీదు. ఎమ్మెల్యే: అబద్ధం చెప్పావంటే మెట్టుతో (చెప్పుతో) కొట్టేస్తా. నీకు ఇప్పుడు తెలియదులే.. తెలిసేరోజు తెలుస్తాదిలే. ఉద్యోగి: సార్.. సార్ ఒక్కరైనా నా దగ్గర ఇచ్చారని చెప్పమనండి సార్. నాకు నిజంగా తెలియదు సార్. ఎమ్మెల్యే: ఉండవురా నువ్వు. రేపు ఉండవు నువ్వు. నీకు ఎవరు ఇచ్చారో డైరెక్షన్ నీ అంతు చూస్తా. వాడికి బుద్ధి లేదు. నడమంత్రపు చావు చస్త్రారా మీరు. చూస్తాలే మీ కథ. నీవు ఏమేం చేస్తావో అంతా తెలుసు నాకు. అంతా పెట్టిస్తా. మీ అంతు చూస్తా. రేయ్.. రేపు ఉదయం రారా వెంకటగిరికి.. రేపు ఉదయం రా. ఉద్యోగి: సరే సార్! ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని వినతి తన పోస్టల్ బ్యాలెట్‌తోపాటు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తూ ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారి పోస్టల్ బ్యాలెట్లు తెచ్చివ్వకపోతే అంతు చూస్తానని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తనను ఫోన్లో బెదిరిస్తున్నారంటూ ఉపాధి హామీ ఉద్యోగి వి.రామకృష్ణ గురువారం వెంకటగిరి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈఎస్ మురళికి నెల్లూరులో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ గురువారం ఉదయం 10.44 గంటల సమయంలో ఎమ్మెల్యే రామకృష్ణ తనకు ఫోన్ చేశారని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్లు తెచ్చివ్వకపోతే శాఖాపరంగా అక్రమ కేసుల్లో ఇరికిస్తానని, అంతు చూస్తానని బెదిరించారని తెలిపారు. ఎమ్మెల్యే రామకృష్ణ రౌడీయిజం, గూండాయిజం, స్మగ్లింగ్ వంటి అనేక క్రిమినల్ కేసుల్లో నిందితుడని, తనకు ఆయన నుంచి ప్రాణహాని ఉందని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై పోలీస్ చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఇదిలావుండగా.. ఎమ్మెల్యే కురుగొండ్ల, ఉద్యోగిని బెదిరించిన ఫోన్‌కాల్ గురువారం సోషల్ మీడియాలో హల్చల్ చేయగా, పలువురు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. -
చింతమనేని ‘గప్‌చుప్’
ఏలూరు టౌన్ : సార్వత్రిక ఎన్నికలు సర్వత్రా ఉత్కంఠకు తెరలేపాయి. 30 రోజుల ఎన్నికల సంగ్రామంలో నువ్వానేనా అంటూ తలపడిన రాజకీయపక్షాలకు ఇప్పుడే అసలైన పరీక్ష మొదలైంది. ఆరు వారాల (42 రోజుల) నిరీక్షణ పార్టీ నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇవన్నీ ఇకవైపు ఉంటే పోలింగ్ రోజు రాజకీయపార్టీలు విజయానికి వూహ్యాలు రచిస్తూ వాటిని అమలు చేసేందుకు కష్టపడ్డాయి. జిల్లాలోనే వివాదాలకు పెట్టింది పేరైన దెందులూరు నియోజకవర్గంలో గొడవలు, దాడులు, అవాంఛనీయ సంఘటనలు ఏమీ లేకుండానే సాఫీగా సాగిపోగా.. అనూహ్యరీతిలో ఏలూరు నియోజకవర్గంలో ప్రత్యర్థి వర్గాలపై దాడులకు తెగబడుతూ, తెలుగుదేశం పార్టీ నేతలు రెచ్చిపోవటం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓటమి భయంతోనే ఇద్దరు టీడీపీ నేతలు ఇలా వ్యవహరించారా? ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ఇలా తమ వ్యక్తిత్వానికి భిన్నంగా ప్రవర్తించారా? అనే అంశాలపై ఇప్పుడు ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పోల్ మేనేజ్మెంట్లో దిట్టలుగా చెప్పుకునే టీడీపీ నేతలు ఇలా మారిపోవటం వెనుక అసలు కథ ఏంటనే అంశాలు ఓటర్ల మదిని తొలిచేస్తున్నాయి. ఇద్దరు నేతల తీరుపై టీడీపీ కేడర్లోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. బడేటి ‘బరితెగింపు’ పోలింగ్ రోజు ఏలూరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జి వ్యవహారశైలి వివాదాస్పదంగా మా రింది. గురువారం ఉదయం 7.30 గంటల నుంచే ఆయా పోలింగ్ బూత్‌ల వద్ద ఘర్షణలు, దాడులు, గొడవలు సృష్టిస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారనే అపవాదు మూటగట్టుకున్నారు. ఎ మ్మెల్యే బడేటి బుజ్జి తన వ్యవహారశైలికి భిన్నంగా ఎన్నికల్లో గొడవలు పెట్టుకోవటం చర్చనీయాం శంగా మారింది. ఏలూరులోని పలు పోలింగ్ బూత్‌ల వద్ద తన అనుచరులతో కలిసి దాడులకు తెగబడటం వెనుక కారణాలేమై ఉంటాయోనం టూ పలువురు చర్చిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ప్రశాంతంగా క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళుతూ.. ప్రతి స్థానిక నాయకుడినీ కలుస్తూ వారి మద్దతు కూడగడుతూ విజయం సాధించే దిశగా అడుగులు వేసిన బడేటి.. ఇప్పుడు భిన్నంగా వ్య వహరించటాన్ని ఆ పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. ఏలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని), జనసేన అభ్యర్థిగా రెడ్డి అప్పలనా యుడు పోటీలో ఉన్నారు. ఈ త్రిముఖ పోటీ నేపథ్యంలో మరింత వ్యూహాత్మకంగా, జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన బడేటి దుందుడుకు చర్యలకు పాల్పడటంపై కేడర్లోనే భిన్నస్వరాలు విని పిస్తున్నాయి. బడేటి దాడుల కారణంగా సొంత పార్టీలోని దళిత వర్గాలు, ఆర్యవైశ్యులు, ఇలా పలు సామాజికవర్గాల ఓట్లు గణనీయంగా చీలి పోయాయనీ, గెలిచే స్థితిలో నుంచి ఆత్మరక్షణలో పడ్దామంటూ ఆ పార్టీ నేతలే బాహాటంగా వ్యా ఖ్యానిస్తున్నారు. ఓటమి భయంతోనే ఎమ్మెల్యే బడేటి బుజ్జి రెచ్చిపోయి గొడవలకు దిగారని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్ సీపీ నేతలే లక్ష్యంగా.. గత ఎన్నికల్లో రెడ్డి అప్పలనాయుడు, ఎస్ఎంఆర్ పెదబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ వంటి వారు కొండంత అండగా ఉంటూ నియోజకవర్గంలో ద్వితీయశ్రేణి నాయకులను సమన్వయం చేస్తూ టీడీపీ విజయానికి బాటలు వేసిన నేతలు ఇప్పు డు బడేటికి దూరం కావటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని, పలువురు టీడీపీ స్థానిక నేతలు సైతం తనకు వ్యతిరేకంగా చాపకిందనీరులా పనిచేయటం, పలు ప్రాంతాల్లో స్థానిక నేతలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయకుండా చేతి వాటాన్ని ప్రదర్శించటం ఎమ్మెల్యే బడేటికి ఆగ్రహాన్ని తెప్పించాయంటున్నారు. తనకు అడ్డువస్తే సహించలేని బడేటి ఇటీవల టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి వచ్చిన నేతలే టార్గెట్‌గా దాడులు చేశారనే అభిప్రాయమూ ఉంది. ఓటమి భయంతోనే.. ఓటమి భయంతోనే ఎమ్మెల్యే బడేటి బుజ్జి రెచ్చిపోయి గొడవలకు దిగారని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే రౌడీరాజ్యం వస్తుందని ఆరోపణలు చేసే టీడీపీ నేతలు.. బడేటి బుజ్జి చేసిన దౌర్జన్యాలు, దాడులు, రౌడీయిజాన్ని ఏమంటారంటూ ఎదురుదాడికి దిగారు. ఐదేళ్లుగా ఏలూరు నియోజకవర్గంలో బడేటి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని, మరోసారి తన నిజస్వరూపాన్ని పోలింగ్‌రోజు బయటపెట్టుకున్నారంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వైఎస్సార్ సీపీ మద్దతుదారులు ఓట్లు వేసేందుకు వెళ్లకుండా భయపెట్టడానికే ఇలా బడేటి బుజ్జి దాడులకు పాల్పడ్డారని, అయినా వైఎస్సార్ సీపీ నేతలు, కేడర్ వారి వ్యూహానికి కళ్లెం వేస్తూ ఎదురుదాడులకు వెళ్లకుండా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా జాగ్రత్తపడ్డామని చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతాల్లోనే టీడీపీ నేతలు గొడవలు చేస్తూ ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు కుటిల యత్నాలు చేశారని అయినా అవేమి ఫలించలేదంటున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆళ్ల నాని గెలుస్తారనే విశ్వాసం ఉందని.. బడేటి దాడులు, దౌర్జన్యాలతో తమ మెజారిటీని భారీగా పెంచేశారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గొడవలు వద్దంటూ హితవు ఏలూరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జి శనివారపుపేటలో దాడులు చేసిన సందర్భంలో అక్కడికి చింతమనేనిని తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా చింతమనేని తాను రానంటూ చెప్పటం, పట్టుబట్టి బడేటి అక్కడికి తీసుకువెళ్లినా.. తన శైలికి భిన్నంగా హడావుడి చేయకుండానే చింతమనేని వెనుదిరగటం పరిస్థితికి అద్దంపడుతోంది. టీడీపీ కేడర్‌కు సైతం ఏమీ గొడవలు పెట్టుకోవద్దనీ.. ప్రజలు తమపై వ్యతిరేకతతో ఉన్నారంటూ స్వయంగా చింతమనేని హితబోధలు చేయటం గమనార్హం. ఎన్నికల్లో ఓట్లు వేయించుకునేందుకే ఇలా నటిస్తున్నారనీ.. అధికారం వస్తే రెచ్చిపోవటం ఆయనకు కొత్తేమీ కాదనే అభిప్రాయం ని యోజకవర్గ ప్రజల్లో గట్టిగా నాటుకుపోయింది. మొత్తానికి చింతమనేనిలో మార్పు ఓట్లు కోస మో.. భయమో.. ఆందోళనో.. ఏదైనా కానీ.. చింతమనేని గమ్ముగా ఉంటూ ప్రజల ముందు సైలెంట్‌గా ఉన్నా ప్రజలెవరూ విశ్వసించలేదనేది బహిరంగ రహస్యం. చింతమనేని ‘గప్‌చుప్’ ఆంతర్యమేంటీ చింతమనేని.. ఈ పేరు చెప్పగానే రాష్ట్ర ప్రజలకు ఠక్కున గుర్తుకు వచ్చేది.. గొడవలు, దౌర్జన్యాలు, దాడులు, వివాదాలే. పోలీసు అధికారులు, రెవెన్యూ, దళితులు, సామాన్యులు, వికలాంగులు, రాజకీయ నేతలు ఇలా ఒక్కరేమిటీ అన్నివర్గాల వారూ చింతమనేని చేతుల్లో దాడికి గురైనవారే. దెందులూరు నియోజకవర్గంలో ఈ ఐదేళ్లలో ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రతి చిన్న విషయానికి రెచ్చిపోవటం, కొట్టటం, తీవ్ర పదజాలంతో దూషణలకు దిగటం పరిపాటిగా మారింది. అయితే ఆయనకు ఏమయ్యిందో ఏమో గానీ తన స్వభావానికి భిన్నంగా మారిపోయారు. ఎవరైనా ఎదురు మాట్లాడితే రెండో కాలిపై.. అంతెత్తునలేస్తూ గొడవలు చేసే చింతమనేని.. ఓడిపోతాననే ‘చింత’తో సతమతమయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలింగ్ రోజు సైతం చింతమనేని నియోజకవర్గంలో నోరెత్తిన పాపానపోలేదంటున్నారు. ఆఖరికి తమకు అనుకూలంగా ఉండే ఒక వర్గంపై దాడి జరిగిందని తెలిసినా ఏమాత్రం రెచ్చిపోకుండా తన వ్యవహారశైలికి భిన్నంగా మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. చింతమనేనిపై 2010 నుంచి దెందులూరు, పెదవేగి, పెదపాడు, హనుమాన్‌జంక్షన్, ఏలూరు, గన్నవరం, భీమడోలు తదితర ప్రాంతాల్లో ఏకంగా 26 కేసులు ఉండగా, ఒక కేసుల్లో రెండేళ్ల జైలు కూడా పడింది. ఇలా వివాదాలకు ఆద్యుడుగా పేరొందిన చింతమనేని ఈనెల 11న పోలింగ్ రోజు గప్‌చుప్‌గా మారిపోవటం, హల్చల్ చేయకుండా బుద్ధిమంతుడిలా వ్యవహరించటంపై చర్చసాగుతోంది. పతనానికి పలు కారణాలు నియోజకవర్గంలో తన సొంత సామాజికవర్గం సైతం ఎన్నికల్లో మద్దతుకు ససేమిరా అంటూ తెగేసి చెప్పేయటం, ప్రధానంగా పట్టున్న గ్రామాల్లో కూడా ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బాహాటంగా మద్దతు తెలపటం చింతమనేనికి కంటిమీద కునుకు లేకుండా చేశాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి చింతమనేని పోటీ చేయగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీసీ నాయకులు కారుమూరి నాగేశ్వరరావు చివరి దశలో పోటీకి వచ్చారు. అప్పటివరకూ సొంత సామాజికవర్గంలోని అసంతృప్తి ఉన్నా.. ఎన్నికల నాటికి తమవాడే కదా అనే ధోరణిలో చింతమనేని వైపే మొగ్గుచూపారు. కానీ 2019 ఎన్నికల్లో ఆ పరిస్థితి లేకపోవటం, సొంత సామాజికవర్గంలోని స్థానిక నేతలు, ఆయా గ్రామాల్లో బాగా పట్టున్న నాయకులు, దళితులు, బీసీలు వైఎస్సార్ సీపీకి జై కొట్టటం చింతమనేని వ్యవహారశైలిలో మార్పులు తెచ్చాయి. కొప్పాక సొసైటీ అధ్యక్షుడు చల్లగొళ్ల వెంకటేశ్వరరావు (భూస్వామి), పర్వతనేని జగన్మోహనరావు, మోరు రామరాజు, పోకల రాంబాబు, దోసపాడు టీడీపీ ఎంపీటీసీ ఎస్.సుధాకర్, దెందులూరు మండల కాపు సంఘం అధ్యక్షులు కొండేటి గంగాధరబాబు వంటి నేతలు చింతమనేనితో విసిగిపోయి మరీ కొఠారు పక్షాన నిలవటం చింతమనేనికి ఓటమి కళ్లముందే కనిపించింది. చింతమనేని పేరు చెబితేనే బయటకు రావటానికి సాహసం చేయని నియోజకవర్గ ప్రజలు దెందులూరు వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొఠారు అబ్బయ్యచౌదరి నామినేషన్‌కు వేలాదిగా స్వచ్ఛందంగా తరలిరావడం, పలు సందర్భంగా యువత, ప్రజలు పెద్దెత్తున ఆయన వెంట కదలిరావడం చింతమనేని పతనానికి నిదర్శనాలుగా మారాయి. -
కొమ్మాలపాటి అవినీతిలో మేటి
సాక్షి, గుంటూరు : రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి ఇసుక దందా వరకు.. సదావర్తి సత్రం భూములను చేజిక్కించుకోవడం నుంచి ఎర్ర మట్టి దోపిడీ వరకు.. బెట్టింగ్ మాఫీయా నుంచి ‘నీరు–చెట్టు’లో అవినీతి వరకు.. కాదేది ఆయన అక్రమార్జనకు అనర్హం. కన్నుపడితే దౌర్జన్యం చేయడం ఖాయం. ఒక సామాన్య వ్యక్తి నుంచి నేడు రూ.కోట్లకు పడగెత్తిన రాజకీయ నాయకుడిగా పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సాగించిన అవినీతి కథలు రాయాలంటే పుస్తకాలే చాలవేమో. కృష్ణమ్మ నది గర్భంలో డ్రెడ్జర్లతో భారీ లోతులో ఇసుక తవ్వకాలు జరిపి.. అమాయక ప్రాణాలను బలిగొన్నా.. బినామీల పేరుతో గ్రావెల్ కొట్టేసినా ఆయనకే చెల్లింది. ఇలా ఇందు లేదు అందు లేదు.. ఎందెందు వెతికినా అందందే అవినీతిని విస్తరించి.. మద్యాన్ని ఎరులై పారించిన ప్రజాప్రతినిధి కొమ్మాలపాటి. రాజధాని ప్రాంతఎమ్మెల్యే కావడంతో ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ అండతో ఇసుక మాఫియాను నడుపుతూ వేల కోట్లు దోచేశారు కొమ్మాలపాటి శ్రీధర్. అందులో చినబాబు వాటాపోను సుమారు రూ. 500 కోట్లకుపైగా వెనకేసుకున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన ప్రతి చోటా ప్రభుత్వ, పోరంబోకు భూములను ఆక్రమించి రెవెన్యూ అధికారుల ద్వారా సొంతం చేసుకున్నారు. గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దశాబ్దాల క్రితం పట్టాలు ఇచ్చిన భూములను సైతం చెరబట్టారు. నీరు–చెట్టు పేరుతో మట్టిని బొక్కేయడంతోపాటు, అమరావతి మండలంలో అతి ఖరీదైన ఎర్ర మట్టిని తవ్వేసి సుమారుగా రూ. 100 కోట్లు దండుకున్నారు. నియోజవకర్గంలో మద్యం దుకాణాల వద్ద 20 శాతం వాటా గుంజేసుకుంటున్నారు. ఇసుక మాఫియా తీసిన గోతుల్లో పడి సుమారుగా 25 మందికిపైగా అమాయకులు బలయ్యారు. అయినా కొమ్మాలపాటి ధనదాహం మాత్రం తీర లేదు. అమరావతి, అచ్చంపేట మండలాల్లో అక్రమంగా ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేశారు. ఇసుక అక్రమ రవాణా కోసం కృష్ణా నది మధ్యలో నుంచి రోడ్డు నిర్మించారు. నీరు–చెట్టులో అవినీతి ప్రవాహం.. నీరు–చెట్లు కార్యక్రమం అధికార పార్టీ ఎమ్మెల్యే కొమ్మాలపాటికి బంగారు బాతుగా మారింది. పథకం పేరుతో నియోజకవర్గంలోని మండలాల్లో నిధులను ఎమ్మెల్యే భారీగా మింగేశారు. బెల్లంకొండ మండలంలో నందిరాజుపాలెం గ్రామానికి చెందిన ఎస్సీలు 28 సంవత్సరాలుగా 40 ఎకరాలు భూమిని సాగు చేసుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 40 ఎకరాలు ఆక్రమించుకొని వాటిలో 10 ఎకరాల్లో నీరు– చెట్టు కింద మట్టిని తవ్వి అవినీతికి పాల్పడ్డారు. పెదకూరపాడు, అమరావతి, అచ్చంపేట, క్రోసూరు మండలాల్లో కలుపుకుని జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే ఆయన అనుచరులు రూ. 30 కోట్ల వరకూ మట్టిని మింగేశారు. ప్రజల ప్రాణాలను బలిగొన్నారు... నాలుగున్నరేళ్లలో కొమ్మాలపాటి కనుసన్నల్లో నడుస్తున్న ఇసుక మాఫియా తీసిన గోతుల్లో పడి 25 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 2016 ఆగస్టు 16న కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు, గుంటూరు జిల్లా అమరావతి మండలం దిడుగు ప్రాంతాన్ని కలిపే కృష్ణా నది పాయలో పుష్కర స్నానానికి వెళ్లి ఐదుగురు విద్యార్థులు చనిపోయారు కృష్ణానదిలో తీసిన భారీ గోతిలో ఓ విద్యార్థి మునుగుతుండగా, పక్కన ఉన్న తోటి విద్యార్థులు అతనిని రక్షించేందుకు వెళ్ళి వారు సైతం మృత్యువాత పడిన సంఘటన ఐదు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అదే ఏడాది గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు శివారులో ఉన్న కృష్ణా నదిలో జరిగిన రెండు వేరువేరు ఘటనల్లో ఐదుగురు యువకులు ఇసుక కోసం తీసిన గోతుల్లో పడి జల సమాధయ్యారు. 2017 జనవరి 15న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు నీటిలో మునిగిపోయారు. ఇసుక కోసం తవ్విన గోతుల్లో పడి మృత్యువాత పడ్డ వారంతా 20 ఏళ్లులోపు. మీటరు (మూడు అడుగులు) లోతుకంటే ఎక్కువ తవ్వకూడదనే నిబంధన ఉన్నప్పటికీ కృష్ణానదిలో 20 అడుగులు తవ్వేశారు. ఇసుక తవ్వకాలకు యంత్రాలు వినియోగించరాదని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నా, ప్రభుత్వం జీవోలు జారీ చేసినా ఇసుకాసురులు మాత్రం అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. బెట్టింగ్ సామ్రాజ్యాన్ని విస్తరించి జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న కీలక బుకీ మాదినేని బాలజీ కొమ్మాలపాటి శ్రీధర్ మామ మాదినేని సుబ్బయ్య కుమారుడు కావడం గమనార్హం. బాలాజీ సొంతగా బోర్డు నడుపుతూ ఆన్లైన్ ద్వారా జిల్లాలోని అన్ని ప్రాంతాలకు లైన్ ఇస్తూ కోట్ల రూపాయల్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తుంటాడు. ఇతని జోలికి పోలీసులు వెళ్ళకుండా కొమ్మాలపాటి చూసుకుంటారు. బాలాజీ తమ వద్ద భూములు, స్థలాలు బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారంటూ అనేక మంది బాధితులు 2016 డిసెంబర్లో అప్పటి గుంటూరు అర్బన్, రూరల్ జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. క్రికెట్ బుకీల ఆట కట్టించేందుకు గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయారావు ఇద్దరు డీఎస్పీలు, ఎస్‌లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి బెట్టింగ్ బుకీల కోసం వేట సాగించారు. ఈ బృందం కీలక బుకీ బాలాజీతోపాటు, మరో నలుగురిని అదుపులోకి తీసుకుని వారిని పూర్తి స్థాయిలో విచారించడంతో కళ్ళు చెదిరే వాస్తవాలు బయటకు వచ్చాయి. వీరు ఇచ్చిన సమాచారంతో బాలాజీ సోదరుడు, అమరావతికి చెందిన మండల స్థాయి టీడీపీ నేతతోపాటు జిల్లాలోని అనేక మంది కీలక క్రికెట్ బుకీల పాత్ర ఉన్నట్లు తేలింది. బాలాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి బావమరిది కావడంతో వారి జోలికి వెళ్లొద్దంటూ అధికార పార్టీ ముఖ్యనేతల నుంచి పోలీసు ఉన్నతాధికారులకు ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో ఆ మరుసటి రోజు ఐదుగురు క్రికెట్ బెట్టర్లను అరెస్టు చూపించారు. అందులో కీలక బుకీ బాలాజీ ఎవరనేది కూడా విలేకరులకు చెప్పకుండా.. కనీసం కోర్టులో హాజరు పర్చకుండా 41 నోటీసు ఇచ్చి వదిలేశారు. అమరావతిలో గతంలో పేకాట కూడా నిర్వహించారు. ఎర్ర మట్టి దోపిడీ.. అమరావతి మండల పరిధిలోని ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లె గ్రామాలలో దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములలో కోట్లాది రూపాయల ఎర్ర గ్రావెల్ దోచుకున్నారు. ఎమ్మెల్యే బినామీలైన పెదకూరపాడు మండలం కంభంపాడుకు చెందిన మాదినేని సుబ్బయ్య కుమారుడు శ్రీనివాసరావు, పెదకూరపాడుకు చెందిన ఏటుకూరి గంగాధరరావు ఈ భూముల్లో తవ్వకాలు జరిపి కోట్ల రూపాయలు దండుకున్నారు. ఈ భూములు కలిగిన ఎండ్రాయి, లేమల్లె గ్రామాలకు చెందిన షేక్ మస్తాన్‌బీ డీకె పట్టా రద్దు చేయిస్తామని బెదిరించి సర్వే నెంబరు 95/1, 95/2లో ఉన్న 1.98 ఎకరాలు లేమల్లెలోని మేకల యేసోబుకు చెందిన 96/2లో ఉన్న ఎకరం భూమిని మాదినేని శ్రీనివాసరావు లీజుకు రాయించుకున్నాడు. దీంతోపాటుగా 2013 నవంబరు 23వ తేదీన చనిపోయిన కట్టెపోగు వందనం భార్య చిట్టెమ్మ పేరు మీద 96/2 నంబరులో ఉన్న 1.25 ఎకరాల భూమిని కూడా 2017 ఏప్రిల్ 1న నోటరీ అఫిడవిట్ ఇచ్చినట్లు ఏటుకూరి గంగాధరరావు పేరు మీద ఫోర్జరి చేసి లీజు అగ్రిమెంట్ సృష్టించినట్లు సమాచారం. రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఆర్సీ నెం.402/2017బీ అర్డరులో డీకే పట్టాగా పేర్కొన్న భూములు మైనింగ్ మెమో నెం.1418/టీపీలో మాత్రం పట్టా భూమి అని చూపించారు. మొత్తం మీద 6150 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వేశారు. ప్రస్తుతం కర్లపూడి ఎస్సీ కాలనీకి దగ్గరలో ఉన్న గంగమ్మచెరువు వద్ద ప్రత్తిపాటి బేబమ్మ, ప్రత్తిపాటి బూదమ్మలకు పూర్వార్జితంగా సంక్రమించిన రెండు ఎకరాల భూమిని కొమ్మాలపాటి బంధువులు కొనుగోలు చేసి అక్రమ తవ్వకాలకు తెర తీశారు. -
మద్దతు తెలపలేదని.. ఓట్లు తక్కువగా చూపుతారా?
సాక్షి,రాజంపేట: రాజంపేటలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని దిగుమతి చేసుకోవడం వల్లే అతనికి ఆశించినంత స్థాయిలో బలిజలు మద్దతు పలకడంలేదని కాపునేత, సీనియర్న్యాయవాది కృష్ణకుమార్ ఆరోపించారు. ఆదివారం తన స్వగృహంలో కాపుసామాజిక వర్గానికి చెందిన నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీకి బలిజలు మద్దతు తెలపకపోవడంతో ఆ కుల ఓట్లు తక్కువగా ఉన్నట్లుగా పచ్చపత్రికల్లో రాయడం సరికాదన్నారు. నిజాలు తెలుసుకొని రాయలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కేవలం బలిజ, కాపు ఉపకులాలతో అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కాపు ఓట్లు లేనిదే టీడీపీకి దిక్కులేదన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బలిజ ఓటర్లు సగం జనసేన వైపు, మిగిలిన సగం వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచారన్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పచ్చపార్టీలు తమ పత్రికల్లో బలిజ కులస్తులు తక్కువగా ఉన్నారని చూపించడం సహించలేనిది అన్నారు. రాజంపేట నియోజకవర్గంలో బలిజ కులస్తులు 26వేలు మాత్రమే ఉన్నట్లు ఓ పత్రికలో రాయడాన్ని ఆయన తప్పుపట్టారు. రాజంపేటటౌన్, మండలం కలిపి 15వేలు, నందలూరులో 8వేలు, ఒంటిమిట్టలో 4వేలు, సిద్దవటంలో 5వేలు , సుండుపల్లెలో 8వేలు, వీరబల్లిలో 3వేల ఓట్లు మొత్తం 42వేల బలిజ ఓట్లు ఉన్నాయన్నారు. రాజకీయ ఉద్దేశంతో తగ్గించి రాయడం చూస్తుంటేకాపు కులాన్ని కించపరిచడమే అవుతుందన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బలిజ కులస్తులు ఎక్కువ భాగం వైఎస్సార్సీపీ వెంట ఉన్నందు వల్లే ఇలా రాయడం అవివేకమన్నారు. టీడీపీ ఎన్ని గిమ్మిక్కులు చేసినా రాజంపేటలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని, అలాగే రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం, జగన్మోహన్రెడ్డి సీఎం కావడం తథ్యమని అభిప్రాయపడ్డారు. -
తమ్ముళ్లు కాదు తోడేళ్లు..
సాక్షి, మైలవరం : అధికారం అండతో నాలుగున్నరేళ్లలో అందినకాడికి దండుకున్నారు. కాదేదీ అవినీతికి అనర్హం అన్న చందంగా సాగిపోయాయి టీడీపీ నాయకుల లీలలు. ఇసుక రేవుల నుంచి చెరువుల్లో మట్టిదాకా ప్రతి చోట అవినీతే. నీరు చెట్టు పనుల్లో రూ.కోట్లు కొల్లగొట్టినా.. అభివృద్ధి పనులను తూతూ మంత్రంగా చేపట్టి రూ.కోట్ల ప్రభుత్వ ఖజానాకు గండిపెట్టినా అడిగే నాథుడే లేదు. దేవినేని, అతని అనుచరులు కలిసి నాలుగున్నరేళ్లుగా రూ.వేల కోట్లు దోచుకున్నారంటే అవినీతి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన దేవినేని ఉమామహేశ్వరరావు అవినీతి అక్రమాలు ఆయన పర్యవేక్షించిన శాఖ మాదిరిగానే భారీస్థాయిలో ఉండటం విశేషం. నియోజకవర్గంలో సహజ వనరులైన మట్టి, చెట్టు, ఇసుక, గ్రావెల్ ఇలా దేన్నీ వదలకుండా కోట్లు దండుకున్నారు. ఇక ఎత్తిపోతల పథకాల పేరుతో దేవినేనితో పాటు అతని అనుచరులు దోపిడీ అంతా ఇంతా కాదు. ఎందుకూ పనికిరాని వాగులు, వంకలపై 22 ఎత్తిపోతల పథకాలను నిర్మించి ప్రజాధనాన్ని తమ ఖాతాల్లో వేసుకున్నారు. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా మంత్రిగారి ఆజ్ఞలేనిదే పనులు మొదలు కాదంటే ఆయన ప్రభావం ఏవిధంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఎత్తిపోతల పథకాల్లో రూ.10కోట్ల అవినీతి మైలవరం నియోజకవర్గంలో రైతులకు సాగు నీరు అందించడమే లక్ష్యం అంటూ 22 ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారు. ఈ ఎత్తిపోతల పథకాలను దశాబ్దాలుగా నీరు ప్రవహించని ఎన్ఎస్పీ కాలువలు, బుడమేరు, వాగులపై నిర్మించారు. వీటి నిర్మాణాలకు గానూ రూ.22.57కోట్లను కేటాయించారు. నాసిరం పైపులు, తక్కు ఖరీదు మోటార్లు, షెడ్ల నిర్మాణం తదితర పనుల్లో రూ.10కోట్ల మేర అవినతీకి పాల్పడినట్లు తెలుస్తుంది. నీరు–చెట్టులో కోట్లు పోగేశారు నియోజకవర్గంలో నీరు–చెట్టు పథకం కింద రూ.118కోట్ల పనులు చేపట్టారు. ఈ పథకం కింద చెరువుల్లో పూడికతీత, కాలువల మరమత్తులు తదితర పనులన్నీ చేశారు. చెరువుల్లో పూడికతీసిన మట్టిని రైతులకు ఉచితంగా అందించాల్సి ఉండగా ఇటుక బట్టీలకు, రియల్ వెంచర్లకు తరలించి రూ.కోట్లు వెనకేసుకున్నారు. మొత్తం 48 చెరువులలో పనులు జరగ్గా మట్టిని విక్రయించి రూ.70కోట్ల వరకు పోగేసినట్లు అరోపణలు వినిపిస్తున్నాయి. మైలవరం మండలంలోని వెల్వడం సమీపంలో ఉన్న మోదుగుల చెరువులో దేవినేని అనుచరుడు కోమటి సుధాకర్ గతేడాది నీరు–చెట్టు పనులు చేపట్టారు. అయితే చెరువులో 32వేల క్యాబిక్ మీటర్లు మాత్రమే తవ్వడానికి అనుమతులు ఉండగా 1,42,875 క్యాబిక్ మీటర్ల మట్టిని తరలించినట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. రోజుకు రూ.2 లక్షల చొప్పున రూ.5కోట్ల విలువైన మట్టిని చుట్టుపక్కల గ్రామాల్లోని ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకున్నారు. అదే విధంగా జి.కొండూరు మండలంలోని వెల్లటూరు పడమర చెరువు 200 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ చెరువు నుంచి 2017–18 సంవత్సరంలో 2లక్షల క్యాబిక్మీటర్ల మట్టిని తవ్వి తరలించారు. ఒక్కొక్క ట్రక్కు మట్టిని రూ.400 నుంచి 600కు విక్రయించారు. ఈ విధంగా రెండేళ్లలో రూ.12కోట్ల మేర గడించారు. అదేవిధంగా గొల్లపూడి మేజర్ పంచాయతీ పరిధిలో నీరు–చెట్టు కింద రూ.1.80కోట్ల మేర పనులు జరిగాయి. ఇక్కడ కూడా మట్టిని విక్రయించి సొమ్ము చేసుకున్నారు. బుడమేరులో అక్రమాలెన్నో.. మైలవరం నియోజకవర్గంలో చండ్రగూడెం నుంచి వెలగలేరు వరకు విస్తరించి ఉన్న బుడమేరు ఆధునికీకరణ పనుల్లో దేవినేని అనుచరులు చేతివాటం చూపించారు. ఈ పనులకు గానూ రూ.45కోట్ల మేర కేటాయించారు. అయితే బుడమేరులోని మొక్కలు తొలగించి కేవలం రూ.10కోట్లతో పనులు ముగించి, అక్రమ బిల్లులతో రూ.35కోట్ల మేర కాజేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారం అండతో.. ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి ఇసుకరేవుల్లో దేవినేని అనుచరులు నిబందనలకు విరుద్ధంగా నది నుంచి అక్రమంగా డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుకతోడుతున్నారు. రోజుకు 4వేల క్యూబిక్ మీటర్లు నది నుంచి తోడి లారీలతో రవాణా చేస్తున్నారు. రోజుకు రోజుకు సుమారు రూ.6లక్షలు వరకు సంపాడించారు. మాజీ సర్పంచి మల్లెల పద్మనాభరావుకు చెందిన సీలింగ్ భూమిని రాష్ట్రాభివృద్ధిలో భాగంగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే నేపథ్యంలో తన వాటా దక్కించుకున్నారనే అపవాదు మూటగట్టుకున్నారు. గుంటుపల్లిలో కృష్ణానది నుంచి డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక అక్రమ తవ్వకాలు సర్వే నంబర్ 144, 147లో సుమారు 70 ఎకరాల్లో అమరావతి అమెరికన్ వైద్యశాలకు 26 ఎకరాలు కేటాయించి తెరవెనుక మంత్రాంగంతో తనవాటా దక్కించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఎన్టీటీపీఎస్ బూడిద చెరువులో సిమెంటు కంపెనీల పేరుతో అనుమతులు పొంది ప్రైవేట్ సంస్థలకు అక్రమంగా బూడిద తరలించి కోట్లు గడించారు. కేతనకొండ, మూలపాడు, కొండపల్లి రాతిక్వారీల్లోనూ పర్మిట్లు లేకుండానే అక్రమ మార్గాన నడిపిస్తున్నారు. -
కేశవ్..ఐదేళ్లలో ప్రజల వద్దకు ఎన్నిసార్లు వెళ్లావ్ ?
సాక్షి, కూడేరు: పయ్యావుల కేశవ్..ఈ ఐదేళ్ల పాలనలో ఉరవకొండ నియోజక వర్గంలో ఎన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉన్నావని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించారు. బుధవారం కూడేరు మండల పరిధిలోని అరవకూరు, కమ్మూరు గ్రామాల్లో పయ్యావుల కేశవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండడు. ఏమి అభివృద్ధి చేశాడని చేసిన వ్యాఖ్యలపై గురువారం కూడేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు నిప్పులు చెరిగారు. జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మ. ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మాదన్న, జిల్లా కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్‌లు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నీవు ప్రజలకు అందుబాటులో లేవని ఓటుతో ఓడించారన్నారు. ఓటమిని జీర్ణించుకోలేక రెండేళ్ల పాటు కనిపించకుండా పోయావు. ఎమ్మెల్సీగా ఎంపికయ్యాక కొద్గి రోజులకు నియోజక వర్గ కేంద్రానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోతున్నావు. కాని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం, అధికారులతో పోరాటాలు చేశాడని అన్నారు8. ఈ విషయం నియోజకవర్గ ప్రజలందరికి తెలుసన్నారు. నీ మాదిరి ఎమ్మెల్యే గిమ్మిక్కు రాజకీయాలు చేయడన్నారు. కూడేరు మండలంలో ముద్దలాపురం, ఇప్పేరు చెరువులకు నీటి విడుదల కోసం ఎమ్మెల్యే ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసింది తేదీలతో సహా చూపిస్తామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అడ్డంకిగా మారిన నీకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు తోపుదుర్తి రామాంజనేయులు, క్రిష్టప్ప, సంగప్పతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. -
దత్తత ఉత్తదయిన వేళ...
సాక్షి, పెదకూరపాడు : ‘ఈ గ్రామవాసిగా పెదకూరపాడును దత్తత తీసుకుంటున్నా. గ్రామ దశ, దిశలు మారుస్తా. ఎక్కడా జరగని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తా.. జన్మభూమి రుణం తీర్చుకుంటా’.. అంటూ పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగిన కొమ్మాలపాటి శ్రీధర్ హామీలు గుప్పించారు. అయితే ఆయన ఈ గ్రామానికి చేసింది మాత్రం శూన్యమని, సొమ్మొకరిది, సోకొకరిది అన్న చందంగా 13,14 ఆర్థిక సంఘం నిధులు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో కాలనీలో రోడ్లు వేసి తన నిధులతో చేసినట్లు బీరాలు పలకడం మినహా ఒరగబెట్టింది ఏమీ లేదని గ్రామస్తులు ఎద్దేవాచేస్తున్నారు. పెదకూరపాడు రైల్వేస్టేషన్లో జన్మభూమి, పల్నాడు ఎక్సెప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించాలన్నది గ్రామ ప్రజల చిరకాల వాంఛ. ఇందు కోసం ఎన్నోసార్లు రైల్వే అధికారులను కలసి విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎన్నికల సమయంలో పెదకూరపాడులో ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్ట్ కల్పించేందుకు కృషి చేస్తానంటూ తాజా మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, తాజా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు హామీ ఇచ్చారు కానీ నెరవేర్చలేదు. ఎక్సెప్రెస్ రైలుకు హాల్ట్ కల్పిస్తే హైదరాబాద్, విశాఖపట్నం వెళ్లేవారు గ్రామంలోనే రైలు ఎక్కొచ్చన్న ఆశ కలగానే మిగిలింది. మూతపడ్డ హాస్టళ్లు టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల సంఖ్య లేని కారణంగా పెదకూరపాడులో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహం, బీసీ బాలుర వసతి గృహాన్ని రద్దుచేశారు. ఎమ్మెల్యేగా కొమ్మాలపాటి శ్రీధర్ ఉన్నా ఈ హాస్టళ్లను కొనసాగించేందుకు తీసుకున్న చర్యలు ఏమీ లేవని ఎస్సీ, బీసీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సొమ్మొకరిది... సోకు ఒకరిది ఇరుకుగా ఉన్న పెదకూరపాడు ప్రధాన రహదారి తాజా మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి స్వగ్రామం పెదకూరపాడులో నిర్మించిన సీసీ రోడ్ల వ్యవహారం సొమ్మొకరది, సోకు ఒకరది అన్న చందంగా మారింది. ఈ గ్రామాన్నికి ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ.1.95 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఎస్సీ కాలనీల్లో సిమెంట్ రోడ్లు నిర్మించారు. ఈ నిధులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానివి. 13, 14 ఆర్థిక సంఘం నిధులు రూ.95 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతోనూ సీసీ రోడ్లు నిర్మించారు. పంచాయతీ నిధులు రూ.30 లక్షలు మంజూరయ్యాయి. వైఎస్సార్ సీపీకి చెందిన సర్పంచ్‌ను పక్కన పెట్టి ఆ నిధులతోనూ టీడీపీ వారే రోడ్లు వేశారు. అయితే కొమ్మాలపాటి శ్రీధర్ రహదారులు అంటూ బోర్డులు మాత్రం ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి ఎమ్మెల్యే నిధులు కింద పెదకూరపాడు గ్రామానికి వచ్చింది రూ.60 లక్షలు. వాటిలో రూ.40 లక్షలే వినియోగించారు. మిగిలిన రూ.20 లక్షలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్ హాల్ట్ ఏమైంది? ప్రజల చిరకాల కోరిక పెదకూరపాడులో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగాలన్నది. మేము అనేక సార్లు రైల్వే అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించాం. అయితే ప్రయోజనం లేదు. ఎమ్మెల్యేగా శ్రీధర్ రైళ్ల హాల్ట్ కూడా సాధించలేకపోయారు. – షేక్ బాలిసైదా, అడ్వకేట్, పెదకూరపాడు చేనేతలకు చేసింది శూన్యం పెదకూరపాడులో చేనేత కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు. వారికి కొమ్మాలపాటి చేసిన మేలు ఏమీ లేదు. సొంతూరు వ్యక్తి అయినా కనీసం చేనేత సమస్యలపై అసెంబ్లీలో కూడా మాట్లాడలేదు. కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా ఒక్కరికి కూడా రుణం ఇవ్వలేదు. – గాత్రం కాంతారావు,పెదకూరపాడు -
సమస్యలు కో‘కొల్లు’లు..
సాక్షి, మచిలీపట్నం : ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేసినా ఈ ప్రాంత అభివృద్ధికి కొల్లు రవీంద్ర చేసింది శూన్యమని ప్రజలు విమర్శిస్తున్నారు. కొల్లు స్వగ్రామంగా చెప్పుకునే ‘గరాల దిబ్బ’ సమస్యలతో సతమతమవుతోంది. ‘మంత్రి మనోడే’ నని సమస్యలు తీరకపోతాయా...? అని ఐదేళ్లు పాటు ప్రజలు ఆశగా ఎదురుచూసినప్పటకీ, మౌలిక వసతులు మెరుగపడలేదు. గ్రామంలో అంతా మత్స్యకారులే. నిరుపేదలైన వీరికి ప్రభుత్వపరంగా సంక్షేమ పథకాలు కూడా సవ్యంగా అందలేదు. తాగునీటికి తీవ్రమైన ఇక్కట్లు పడుతున్నారు. తమ ఇబ్బందులు చెబితే ఎక్కడ తమకు వచ్చే సంక్షేమ పథకాలకు అడ్డం పడతారేమోననే ఆందోళన ఇక్కడి ప్రజానీకంలో ఉంది. అర్హులకు అందని పథకాలు గ్రామంలో అర్హులకు రేషన్ కార్డులు లేవు. చదువులపై మంచి ఆసక్తి చూపే యువత ఉన్న గ్రామంలో ఒకప్పుడు 72 మంది ఉద్యోగులు ఇక్కడ ఉండేవారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇక్కడి వారు ఉద్యోగాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. గ్రామం చుట్టూ అసైన్డ్ భూములున్నా తాతలు, తండ్రులు నాడు ఇచ్చిన హక్కు పత్రాలే దిక్కయ్యాయి. ప్రస్తుతం ఎలాంటి పత్రాలు ఇవ్వకపోవటంతో ఒకే ఇంట్లో మూడేసి కుటుంబాలు నివసిస్తున్నారు. సీసీ రోడ్లు నిర్మించినా.. మురుగు వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు ఇళ్లవద్దనే నిల్వ ఉంటున్నాయి. విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలు అలంకార ప్రాయంగా మారాయి. దీంతో ప్రజలు గ్రామానికి వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. ప్రతీ రోజూ‘పానీ’ పాట్లే! గరాలదిబ్బ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామంలో చేతిపంపులు ఉన్నప్పటకీ, ఉప్పునీరు కావటంతో మునిసిపాలిటీ వారు సరఫరా చేసే తాగునీరే ఆధారం. ఇవి కూడా రోజు విడిచి రోజు వస్తుంటాయి. దీంతో నల్లాల నుంచి వచ్చే సన్నటి ధార కోసం బిందెలు పట్టుకొని పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. తాగునీటికి కష్టాలు బిందెడు మంచినీళ్లు పట్టుకునేందుకు పైపుల వద్ద గంటల తరబడి ఉండాలి. వీధుల్లో ఉన్న నల్లాల వద్ద మంచినీళ్లు పట్టుకునేందుకు బిందెలు ముందుగానే వరుసుగా పట్టాలి. రోజులో ఒక్కసారి అది కూడా ఒక గంట మాత్రమే నీళ్లు వస్తుంటాయి. చేతి పంపులు ఉన్నప్పటకీ, ఉప్పు నీరు కావడంతో తాగలేం. నల్లాల నుంచి వచ్చే నీరు రెండు రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. – కె.జయంతి ఆర్భాటపు ప్రచారం నిరుద్యోగ భృతి మంజూరు చేయాలంటూ అధికారులకు అర్జీ ఇచ్చాను. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. డిగ్రీ చదివి కుటుంబం గడువడానికి కూలి పనులకు వెళ్తున్నాను. ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారాలే తప్ప నాలాంటి అర్హులైన వారికి న్యాయం చేయటం లేదు. – ఒడుగు దుర్గారావు -
చింతలపాలెంపై ఎమ్మెల్యే శీతకన్ను!
సాక్షి, చింతలపాలెం (ప్రకాశం): పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత చింతలపాలెం గ్రామానికి వర్తిస్తుంది. ఓట్ల పండగ వచ్చినప్పుడు మినహా మిగతా సమయంలో ప్రజాప్రతినిధులకు ఈ గ్రామం గుర్తుకు రాదు. సమస్యలతో నేడు ఆ గ్రామస్తులు సహవాసం చేస్తున్నారు. ఇంకొల్లు, పావులూరు రెండు గ్రామ పంచాయతీల పరిధిలో ఈ గ్రామం ఉంది. దీంతో సమస్యలను పరిష్కరించటంలో రెండు పంచాయతీలు శ్రద్ధ చూపటం లేదు. దీంతో గ్రామంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయి. గ్రామంలో రోడ్లు ప్రధాన సమస్యగా మారింది. రోడ్డు నిర్మాణం సగంలో ఆగిపోయింది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి వెళ్లాలంటే ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా లేకుండా పోయింది. కనీసం విద్యార్థులు బడికి వెళ్లాలంటే మూడు కిలో మీటర్లు సైకిల్‌పై వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల, ఒక అంగన్వాడీ కేంద్రం ఉన్నాయి. గ్రామం మొత్తం పశుపోషణపై ఆధార పడి జీవిస్తున్నారు. కనీసం పశువులకు ఏదైనా బాగోలేక పోతే ఇంకొల్లు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. రక్షిత మంచి నీటి పథకం మూలన పడిపోయింది. గ్రామంలో పెద్ద చెరువు ఉన్నప్పటికీ రక్షిత నీరు గ్రామస్తులకు అందించిన పాపాన పోలేదు. కనీసం రేషన్ దుకాణానికి వెళ్లాలంటే ఇంకొల్లుకు వెళ్లి వేలిముద్ర వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో ఓటు వేయాలంటే ఇంకొల్లులోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గ్రామంలో రెండు సిమెంటు రోడ్లు వేశారు. కాలువలు ఏర్పాటు చేయలేదు. లింకు రోడ్లు ధ్వంసమయ్యాయి. డ్రైనేజి సమస్య తీవ్రంగా ఉండటంతో దోమలు కాటేస్తున్నాయి. గ్రామంలో రెండు తాగునీటి బావులు ఉన్నాయి. బావుల్లో ఫ్లోరిన్ శాతం అధికంగా ఉంటుందని గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. గ్రామం చింతలపాలెం జనాభా 150 కుటుంబాలు 35 ఓటర్లు 130 ప్రాథమిక పాఠశాల 1 అంగన్వాడీ సెంటర్ 1 రేషన్ దుకాణాలు లేవు చెరువు విస్తీర్ణం 25 ఎకరాలు వ్యవసాయం చెరువు ఆయకట్టు - 400 ఎకరాలు ఎన్నికలప్పుడే ఓటర్లు గుర్తుకు వస్తారు గ్రామంలో ఎన్నికలప్పుడే ఓటర్లు గుర్తుకు వస్తున్నారు. చిన్న గ్రామంలో ఓటర్ల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామానికి రోడ్డు ప్రధాన సమస్యగా ఉంది. పశుపోషణపై గ్రామంలో ఆధారపడి జీవిస్తున్నారు. బయటకు వెళ్లి బతకాలంటే జరగని పరిస్థితి కాదు. – పులికం రామకృష్ణారెడ్డి, యువకుడు గ్రామంలో సమస్యలు అలానే తిష్టవేసి ఉన్నాయి గ్రామంలో సమస్యలు అలానే ఉన్నాయి. చెరువులో మట్టి కావాల్సిన వారు అనుమతులు లేకుండా తోలు కుంటున్నారు. దీంతో రోడ్లు గుల్ల అవుతున్నాయి. రెండు గ్రామ పంచాయతీలకు ఈ గ్రామం కావటమే మేము చేసుకున్న పాపం. అభివృద్ధిపై దృష్టి పెట్టి గ్రామ సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. – మాదాసు సాంబశివరావు, గ్రామస్తుడు -
వాస్తు సరిగా లేదని జేసీ బంగ్లాను కాజేసిన టీడీపీ ఎమ్మెల్యే!
చెరువులను కబ్జా చేసిన వాళ్లను చూశాం.. పేదోడి భూమిని కాజేస్తున్న వాళ్లనూ చూస్తున్నాం. ఖాళీగా కనిపిస్తే ప్రభుత్వ స్థలాలనూ దర్జాగా దక్కించుకుంటున్న వాళ్ల గురించీ విన్నాం. వీటికి మించిన విచిత్రం చిత్తూరు పట్టణంలో చోటు చేసుకుంది. వాస్తు దోషాల నివారణ కోసం టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఒకరు ఏకంగా జాయింట్ కలెక్టర్ బంగ్లా స్థలాన్నే ఆక్రమించేశారు. విలువ రూ.3 కోట్లు! టీడీపీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ తన ఇంటి వాస్తు సరిగా లేదని పక్కనే ఉన్న దశాబ్దాల చరిత్ర కలిగిన జేసీ బంగ్లాకే ఎసరు పెట్టారు. దాదాపు రూ. 3 కోట్లు విలువ చేసే 7,200 చ.అడుగుల బంగ్లా స్థలాన్ని ఆక్రమించారు. రాత్రికి రాత్రే అందులో గోడ నిర్మించుకున్నారు. దీనికి అడ్డు రావడంతో పురాతన చింత చెట్లను కూడా నరికి వేయించారు. ఆక్రమించిన కొంత భూమిలో నాటు కోళ్ల ఫారం, లాన్, కార్ పార్కింగ్ ఏర్పాటు చేసుకున్నారు. వాస్తు దోష నివారణకు.. చిత్తూరు సర్వే నెంబర్ 311/ఏలో 3.47 ఎకరాల్లో జేసీ బంగ్లా ఉంది. దీని పక్కనే 309/1ఏలో 7,500 చదరపుటడుగులు, 306/2లో 3,500 చదరపుటడుగుల్లో టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభ నివాసం ఉంది. ఆమె ఇంటి వాస్తు సరిగా లేదని సిద్ధాంతి చెప్పడంతో దోషాల నివారణ కోసం ఉత్తరం వైపున్న జాయింట్ కలెక్టర్ బంగ్లా స్థలాన్ని ఆక్రమించుకుని గోడ కట్టేశారు. దీనిపై చర్యలు తీసుకోడానికి అధికారులు ప్రయత్నించినా పెద్దల నుంచి ఆదేశాలు రావడంతో వెనక్కి తగ్గారు. ఆక్రమించిన స్థలంలో ఏర్పాటు చేసుకున్ననాటుకోళ్ల ఫారం, కారు షెడ్డు, లాన్ మీరిస్తానంటే చెప్పండి...! ముఖ్యమంత్రి చంద్రబాబు అండతోనే ఎమ్మెల్యే సత్యప్రభ ఆక్రమణలకు పాల్పడటంతో... అప్పటి కలెక్టర్ సిద్దార్థజైన్, జేసీ భరత్‌గుప్తా బంగ్లా స్థలం కబ్జాకు గురైనా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని టీడీపీ నేతలు కొందరు సీఎం వద్ద మొరపెట్టుకున్నా... ‘ఎన్నికల సమయంలో చిత్తూరు జిల్లాకు ఫండింగ్ అవసరం. మీరు ఇస్తానంటే ఆమెపై చర్యలు తీసుకుంటా...!’ అని వ్యాఖ్యానించడంతో సైలెంట్‌గా వెళ్లిపోయినట్లు తెలిసింది. చింత దుంగలను ట్రాక్టర్లో తరలిస్తున్న దృశ్యం -
కొండబాబు ఎదురీత
సాక్షి, బోట్‌క్లబ్: ముందుగొయ్యి.. వెనుక నుయ్యి చం దంగా తయారయ్యింది కాకినాడ సిటీలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి కొండబాబు పరిస్థితి. కొండబాబుకు టికెట్ ఇస్తే తాము వ్యతిరేకంగా పనిచేస్తామని వారం రోజుల క్రితం 17 టీడీపీ కార్పొరేటర్లు రహస్యంగా సమావేశం పెట్టుకొని మరీ టీడీపీ అధిష్టానానికి తమ నిరసన తెలియజేశారు. గడిచిన ఐదేళ్లుగా పార్టీలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, అతని అన్నయ్య సత్యనారాయణ పెత్తనం పెరిగిపోవడంతో పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రతి పనికి డబ్బులు వసూలు చేయడంతో పార్టీకి చెడ్డపేరు వస్తోందని, కనీసం కొండబాబు సోదరుడిని మందలించకపోవడంపై పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఐదేళ్లు తాము కొండబాబు, అతని అన్నయ్య అరాచకాలు భరించామని, ప్రస్తుతం వారి అరాచకాలు భరించే స్థితిలో లేమని టీడీపీ కార్పొరేటర్లు చెబుతున్నారు. పార్టీ అధిష్టానం కొండబాబుపై మొగ్గు చూపి అతనికి సీటు కేటాయించినా ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం దీనిని జీర్ణించుకొనే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లోను అతని ఓడించేందుకు సిద్ధమవుతున్నారు సొంత పార్టీ నాయకులు. ఈ నేపథ్యంలో కొండబాబు ప్రస్తుత ఎన్నికల్లో ఎదురీత తప్పడం లేదు. అసమ్మతి వర్గం మద్దతిచ్చేనా? కొండబాబుకు టిక్కెట్టు ఇవ్వవద్దని, టీడీపీ ముద్దు, కొండబాబు వద్దని ముమ్మరంగా ప్రచారం చేసిన కార్పొరేటర్లు ప్రస్తుత ఎన్నికల్లో అతనితో కలుస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. నగరంలో పేకాట క్లబ్‌లు, గుట్కా మాఫియా, మద్యం సిండికేట్ నుంచి ముడుపులు తీసుకొంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో కొండబాబుపై పూర్తిగా ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం సామాజిక సమీకరణ నేపథ్యంలో కొండబాబుకు సీటు కేటాయించినా నగరంలో సొంత టీడీపీలోనే అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. తాము వద్దంటున్నా కొండబాబు కు సీటు కేటాయించడంపై కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. మా అవసరం లేకుండా ఎన్నికల్లో ఎలా విజయం సాధిస్తారో చూస్తామని వారు బహిరంగానే చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొండబాబు విజయంపై నీలినీడలు కమ్ముకొంటున్నాయి. మేము డమ్మీలమేనా? కార్పొరేషన్ ఎన్నికల్లో రూ.లక్షలు ఖర్చుచేసి విజయం సాధించినా తాము డమ్మీలుగానే మిగిలామని కార్పొరేటర్లు భగ్గుమంటున్నారు. తమ డివిజన్లో కూడా ఎమ్మెల్యే, అతని అన్నయ్య పెత్తనం ఏమిటని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. తమ డివిజన్లో జరిగే అభి వృద్ధిలో కూడా భాగస్వామ్యం లేకుండా చేస్తున్నారని కార్పొరేటర్లు సైతం పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం తమకు సమయం వచ్చిందని, తమ పవర్ ఏమిటో చూపిస్తామని కరాఖండీగా చెబుతున్నారు. పార్టీకి గుడ్‌బై చెబుతున్న టీడీపీ కేడర్ కొండబాబును టీడీపీ అధిష్టానం కాకినాడ సిటీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో పలువురు పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమతున్నారు. తమకు విలువ లేని చోట తాము ఇమడలేమని పార్టీ నుంచి పలువురు బయటకు వచ్చేందుకు సిద్ధమతున్నారు. ఇటీవల పలువురు జన్మభూమి కమిటీ సభ్యులు వైఎస్సార్ సీపీలో చేరారు. త్వరలో పలువురు కార్పొరేటర్లు సైతం పార్టీ వీడేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమ మాట లెక్క చేయకుండా పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలకు విలువేది? కార్యకర్తలే టీడీపీకి బలమని చెప్పుకోవడమే తప్ప పార్టీలో తమకు విలువ లేదని వారు మండిపడుతున్నారు. కార్యకర్తలు మనోభావాలను పట్టించుకొనకుండా ఏకపక్షంగా టీడీపీ అధిష్టానం సీటు ఇవ్వడంపై వారు భగ్గుమంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న తమకు పార్టీ పట్టించుకొనకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలువ లేని చోట తాము పనిచేయడం ఎందుకని బహిరంగంగానే వారు విమర్శిస్తున్నారు. మేయరు మద్దతిచ్చేనా? ప్రస్తుతం కాకినాడ సిటీ టీడీపీ సీటు వనమాడి కొండబాబుకు ఇచ్చిన నేపథ్యంలో కాకినాడ మేయర్ సుంకరపావని కూడా అయిష్టంగానే అయనతో ప్రచారంలో పాల్గొంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. మేయర్ స్థానంలో ఉన్నప్పటికీ తమకు విలువ లేకుండా చేయడంతో ఆమె గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. కార్పొరేషన్లో కూడా ఎమ్మెల్యే కొండబాబు, అతని కుటుంబ సభ్యులు పెత్తనంపై వారు మండిపడుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కొండబాబుకు మద్దతు ఇవ్వడంపై మల్లగుల్లాలు పడుతున్నట్టు వినికిడి. సొంత పార్టీలో నేతలతోనే సమస్యలు నెలకొన్న నేపథ్యంలో వారిని కలుపుకొని ఎలా ముందుకు వెళ్లాలో తెలియక కొండబాబు అయోమయ పరిస్థితిలో పడ్డారు. -
ఎవడబ్బ సొమ్మని మీ వాళ్లకే ప్లాట్లు ఇప్పిస్తారు?
సాక్షి, ఒంగోలు టౌన్: ‘గతంలో జరిగిన ఎన్నికల్లో మేమంతా ఓట్లు వేస్తే ఎమ్మెల్యేగా గెలిచాడు. ఐదేళ్లపాటు మమ్మల్ని పట్టించుకోలేదు. చివరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇళ్లను కూడా పేదలమైన మాకు రాకుండా చేశాడు. ఎవడబ్బ సొమ్మని మీ పార్టీ వాళ్లకే ఇప్పిస్తారు. మేము మనుషులం కాదా? మీకు ఓట్లు వేసి గెలిపించలేదా? మమ్మల్ని ఇంత దారుణంగా మోసగిస్తారా? అంటూ ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్ధన్‌రావు తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు నగరంలోని ప్రజలకు జీ ప్లస్ త్రీ కింద ఇళ్లు నిర్మిస్తామంటూ లబ్ధిదారుల నుంచి నగర పాలక సంస్థ డీడీల రూపంలో డబ్బులు కట్టించుకొంది. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో దామచర్ల జనార్ధన్‌రావు హడావుడిగా ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ నిర్వహించాలని నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. అయితే ఎక్కువ శాతం ప్లాట్లు తెలుగుదేశం పార్టీ అనుయాయులకే దక్కాయి. లబ్ధిదారులకు సంబంధించిన జాబితాను ఆ పార్టీ డివిజన్ అధ్యక్షులు తీసుకొని తమ పార్టీకి అనుకూలమైన వారికే ప్లాట్లు వచ్చేలా చేశారు. అయితే దీనికి మాత్రం ప్రజల సమక్షంలో లాటరీ వేసి ప్లాట్లు కేటాయిస్తామంటూ ప్రకటించారు. దాంతో పెద్ద సంఖ్యలో ప్రజలు నగర పాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. 14,656 ప్లాట్లకు సంబంధించి రూ.500, రూ.12,500, రూ.25 వేల చొప్పున లబ్ధిదారులను ఎంపికచేసి వారి నుంచి వాటా ధనాన్ని కట్టించుకున్నారు. అయితే స్థల సమస్యను సాకుగా చూపించి కేవలం 4512 మందిని మాత్రమే లబ్ధిదారులుగా గుర్తించారు. అయితే ప్లాట్ల కేటాయింపునకు సంబంధించి లాటరీ ప్రక్రియ చేపట్టినప్పటికీ ఆ 4512 మంది లబ్ధిదారులను ప్రకటించలేదు. ఉదయం నుంచి రాత్రి వరకు లబ్ధిదారులచే పడిగాపులు కాయించారు. నాలుగు రోజులు గడిచేసరికి ఎన్నికల కోడ్ వచ్చి పడింది. ఆ సమయానికే అధికారపార్టీ నాయకులు సూచించిన వారికే ఎక్కువ భాగం ఇళ్ల ప్లాట్లను కేటాయించేశారు. ఆదివారం ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ కారణంగా లబ్ధిదారుల ప్లాట్ల కేటాయింపుపై నగర పాలక సంస్థ అధికారులు వివరణ ఇవ్వలేదు. దాంతో అంతకు ముందుగా ప్రకటించినట్లుగా సోమవారం పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు నగర పాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు రావడంతో బుధవారం రావాలని చెప్పారు. దాంతో బుధవారం పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు చేరుకున్నారు. నగర పాలక సంస్థ కమిషనర్ చాంబర్ నుంచి బయట ఉన్న టౌన్ ప్లానింగ్ విభాగం వరకు భారీ క్యూ నిలబడింది. అవాక్కైన కమిషనర్ ఉదయం తన చాంబర్‌కు చేరుకున్న కమిషనర్ శకుంతల ఆ జనాన్ని చూసి అవాక్కయ్యారు. ఎందుకు ఇంతమంది వచ్చారని తన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అప్పటికే లబ్ధిదారుల్లో సహనం కోల్పోయి ఆగ్రహంతో ఉన్నారు. పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు ఉండటంతో వారిని నియంత్రించలేక పోవడంతో చివరకు పోలీసులను పిలిపించారు. పోలీసులు వచ్చిన తర్వాత నగర పాలక సంస్థ కమిషనర్ చాంబర్ పక్కన ఉన్న టెడ్కో విభాగం నుంచి బలవంతంగా బయటకు పంపించడంతో అప్పటి వరకు కొంతమేర శాంతంగా ఉన్న లబ్ధిదారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొంది. వెనుదిరిగిన కమిషనర్ దామచర్ల జనార్ధన్‌రావు తన పార్టీ వారికే ప్లాట్లు కేటాయించి తమకు అన్యాయం చేశారంటూ బాధితులు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. తాము మనుషులం కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా వాతావరణం వేడెక్కడంతో వారిని శాంతింపచేసేందుకు కమిషనర్ శకుంతల వచ్చారు. డబ్బులు కట్టిన వారందరికీ ప్లాట్లు ఇస్తామని, కొంచెం సమయం పడుతోందని, ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున ఏమీ చేయలేమంటూ చెప్పడంతో లబ్ధిదారులు రగిలిపోయారు. కమిషనర్‌తో వాగ్వాదానికి దిగారు. దామచర్ల తమకు అన్యాయం చేశారంటూ పలువురు కన్నీటి పర్యంతమైనారు. లబ్ధిదారులంతా ఒకే గొంతుక వినిపించడంతో కమిషనర్ సమాధానం చెప్పలేక వెనుదిరిగారు. నా భర్తను మసీదులో పెట్టారు నా భర్త మరణించడంతో అద్దె ఇంట్లో ఉంచనీయకపోవడంతో మసీదులో పెట్టారు. చివరిచూపు కూడా సరిగా చూసుకోనీయలేదు. అదే సొంత ఇల్లు ఉంటే ఇంటి వద్దనే కొంతసేపు ఉంచేవారు. ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే పట్టించుకోలేదు. ఓటు అయితే వేయించుకున్నారుగాని ఇళ్లు మాత్రం ఇవ్వలేదు. – షేక్ ఖాదర్‌బీ, కొండమిట్ట పార్టీ కార్యకర్తలకే ప్లాట్లు ఏడాది క్రితం ఇంటి కోసం డిపాజిట్ కట్టాను. అద్దె ఇళ్లల్లో బాడుగలు చెల్లించలేక ఎప్పుడు ఇళ్లు ఇస్తారా అని ఎదురు చూశాను. ప్లాట్ల కేటా యింపు లాటరీకి ప్రతిరోజూ ఇక్కడకు వచ్చాను. ఉదయం నుంచి రాత్రి వరకు ఉన్నప్పటికీ ప్లాటు రాలేదు. టీడీపీ కార్యకర్తలకే ప్లాట్లు కేటాయించారు. – గొల్లా పావని, సత్యనారాయణపురం నాలుగు రోజుల నుంచి పసిబిడ్డను వేసుకొని తిరుగుతున్నా నాలుగు రోజుల నుంచి పసిబిడ్డను చంకేసుకొని తిరుగున్నాను. నా పేరు పిలుస్తారని ఉదయం నుంచి రాత్రి వరకు ఎదురు చూశాను. కొంతమందికే ప్లాట్లు ఇచ్చారు. నా పేరు రాలేదు. మూడు రోజులు పసిబిడ్డతో ఆటోలో వచ్చాను. నాలుగోరోజు డబ్బులు లేక అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చా. – ఎం మల్లీశ్వరి -
ఇదేంటి సార్.. ఎన్నికల కోడ్ పట్టదా..?
సాక్షి, కిర్లంపూడి: సార్వత్రిక ఎన్నికలకు ముందే జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభధ్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసి వారం రోజులు దాటింది. ఎన్నికల నియమావళి ప్రకారం అధికార యంత్రాంగం పని చేయాలి. రాజకీయ నాయకులు సైతం ఎన్నికల నియమావళిని తూ.చ తప్పకుండా పాటించాలి. సార్వత్రిక ఎన్నికలు వస్తాయని ముందుగానే భావించిన అధికార పార్టీ నేతలు పలు గ్రామాల్లో హడావుడి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికలు నోటిఫికేషన్ రావడంతో మండలంలో చాలా గ్రామాల్లో అధికారులు ఆయా పార్టీల నాయకులకు సమాచారం అందించి ఫ్లెక్సీలు తొలగించాలని సూచించారు. కొందరు స్పందించకపోవడంతో పలు చోట్ల ఫ్లెక్సీలు తొలగించారు. కృష్ణవరం గ్రామంలో మాత్రం ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అధికార పార్టీ నాయకులు పెట్టిన ఫ్లెక్సీలు తొలగించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో గ్రామంలోని అధికార పార్టీ నాయకులకు అధికారులు కొమ్ము కాస్తున్నారని, అందువల్లే ఫ్లెక్సీలు తొలగించలేదని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎన్నికల నియమావళిని అమలు చేయకపోతే ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే ముప్పిడికి అసమ్మతి సెగ
సాక్షి, అమరావతి : టీడీపీ నేతలకు అసమ్మతి సెగ తగులుతోంది. ఇప్పటికే పలు చోట్ల తెలుగు తమ్ముళ్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎదురుతిరుగుతుండగా.. తాజాగా గోపాలపురం ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. ముప్పిడి వెంకటేశ్వర రావుకు ఎమ్మెల్యే సీటు ఇవ్వొద్దని అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో గ్రూపులను ప్రోత్సహిస్తూ.. పార్టీని బ్రష్టుపట్టిస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముప్పిడికి సీటు ఇస్తే.. ఓడిస్తామని అధిష్టానాన్ని హెచ్చరించారు. -
గులాబీ గూటికి సండ్ర!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగు కానుంది. టీటీడీపీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు అధికార టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్‡్షకు పదునుపెట్టింది. ఇందులో భాగంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శనివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును కలిశారు. శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలుపుతానని ఈ సందర్భంగా సండ్ర... కేసీఆర్‌కు వివరించినట్లు తెలిసింది. శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 12న జరగనుంది. ఆలోగా సండ్ర అధికారికంగా టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది. శాసనసభ్యుల కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఎంఐఎంతో కలిపి టీఆర్ఎస్ ఐదు స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. కాంగ్రెస్ సైతం ఒక స్థానానికి పోటీ చేస్తోంది. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ మద్దతు ఈ ఎన్నికల్లో కీలకం కానుంది. అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాల ప్రకారం టీడీపీ మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేల మద్దతు పొందేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మ రం చేసింది. ఇప్పటికే టీఆర్ఎస్కు దగ్గరగా ఉంటున్న సండ్ర వెంకటవీరయ్యతో ఈ పని ప్రారంభించింది. పోలింగ్‌లోగా మరో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్రావు (అశ్వారావుపేట) మద్దతు పొందేలా వ్యూహాలను అమలు చేస్తోంది. ఉమ్మడి ఖమ్మంపై నజర్... అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యంతో విజయం సాధించి కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తప్ప రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్కు అనుకూలంగా భారీ తీర్పు వచ్చింది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో మాత్రం టీఆర్ఎస్ కేవలం ఒకే ఒక స్థానాన్ని గెలుచుకుంది. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకుగాను 16 స్థానాల్లో (ఒక సీటులో మిత్రపక్షమైన ఎంఐఎం పోటీ చేయనుంది) గెలుపు లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్ఎస్... ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల్లో బలం పెంచుకునే వ్యూహాన్ని మొదలుపెట్టింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్తో సన్నిహితంగా ఉంటున్నారు. మరో ఎమ్మెల్యే నాగేశ్వర్రావుతో కలిసి టీఆర్ఎస్లో చేరాలని భావిస్తున్నారు. సండ్ర 1994లో సీపీఎం తరఫున పాలేరులో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999, 2004 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి గెలిచారు. ఖమ్మం జిల్లాకు సాగర్ ఎడమ కాల్వ నీరు ఖమ్మం జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పం టను కాపాడేందుకు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నుంచి వెంటనే నీరు విడుదల చేయా లని సీఎం కేసీఆర్ ప్రభుత్వ సీఎస్ ఎస్. కె. జోషిని ఆదేశించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విజ్ఞప్తి మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం ప్రగతి భవన్లో కేసీఆర్‌ను కలసిన సండ్ర... సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు, వైరా, మధిర నియోజకవర్గాల్లో రైతులు దాదాపు 2 లక్షల ఎకరాల్లో మెట్ట, ఆరుతడి పంటలు సాగుచేస్తున్నారని చెప్పారు. ఆ పంటలకు ప్రస్తుతం నీరు అవసరమని, 10 రోజులపాటు సాగర్ ఎడమ కాల్వ నుంచి నీరు అందించి పంటలను కాపాడాలని వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన కేసీఆర్ వెంటనే నీరు విడుదల చేయాలని ఆదేశించారు. -
ప్రకాశంలో టీడీపీకి బిగ్ షాక్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : నేతలంతా వరుస పెట్టి వెళ్లిపోతున్నారు. ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోంది. కేడర్ డీలా పడిపోయింది. అరకొరగా ఉన్న నేతలకు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇన్‌ఛార్జ్‌లతో పొసగడం లేదు. ఈ పరిస్థితుల్లో గట్టెక్కేదెలా..? అంటూ జిల్లా టీడీపీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో అధికార పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. ఆ పార్టీ నేతలు వరుస పెట్టి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో టీడీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. మరోవైపు ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో ఉన్న క్యాడర్ కాస్తా డీలా పడిపోయింది. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక టీడీపీ నేతలు మరింత ఆందోళన చెందుతున్నారు. కోట్లు కుమ్మరించి ఓటమి చెందాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు. అదే జరిగితే రెండు విధాలుగా నష్టపోవాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. తూర్పు, పశ్చిమల్లోనూ గడ్డు పరిస్థితే.. ఇప్పటి వరకు తూర్పు ప్రకాశంలో బలంగా ఉన్నామని అధికార టీడీపీ భావిస్తూ వచ్చింది. ప్రధానంగా పర్చూరు, చీరాల, అద్దంకి నియోజకవర్గాలతో పాటు మరి కొన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. పర్చూరు నుంచి దగ్గుబాటి కుటుంబం, చీరాల సిటింగ్ ఎమ్మెల్యే ఆమంచి వైఎస్సార్ సీపీలో చేరడంతో టీడీపీ ఆ సీట్లపైనా ఆశలు వదులుకుంది. అద్దంకి నియోజకవర్గంలో అటు సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం కుటుంబం అధికార పార్టీలోనే ఉన్నా ఇక్కడ వైఎస్సాసీపీ బలంగా తయారవుతోంది. ఒంగోలులో పార్టీ తిరుగులేని శక్తిగా మారింది. మాజీ మంత్రి, పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తనదైన శైలి వ్యూహాలతో దూసుకువెళ్తుండడంతో టీడీపీ దరిదాపుల్లోకి రాలేకపోతోంది. ఇక్కడ టీడీపీలో అసంతృప్తులు ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇక పశ్చిమ ప్రకాశం పరిధిలోని అన్ని సీట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారింది. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థుల విజయానికి తిరుగులేదన్నది పరిశీలకుల అంచనా. మాజీ మంత్రి మహీధర్‌రెడ్డి చేరికతో కందుకూరులో వైఎస్సార్సీపీ విజయం తథ్యమని టీడీపీలోని ఓ వర్గమే పేర్కొంటుండం గమనార్హం. ప్రస్తుత పరిస్థితిల్లో జిల్లాలోని 12 స్థానాల్లో వైఎస్సాసీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. చంద్రబాబు సర్కారుపై ప్రజాగ్రహం.. ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీని కుదిపేస్తోంది. అభివృద్ధి పథకాలు ప్రధానంగా నీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిగా ఆగిపోవడం, సంక్షేమ పథకాలు అర్హులకు కాకుండా అధికార పార్టీ కార్యకర్తలకు కమిషన్లు ఇచ్చే వారికే దక్కుతుండడంతో ప్రజల్లో మరింత వ్యతిరేక వ్యక్త మవుతోంది. రైతు రుణమాఫీ సక్రమంగా అమలు జరగక పోవడం, డ్వాక్రా రుణమాఫీ హామీని చంద్రబాబు పక్కన పెట్టడం, కౌలు రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందక పోవడంతో అన్ని వర్గాలు ఆగ్రహంతో ఉన్నారు. ఇన్ని ప్రతికూలాంశాల మధ్య టీడీపీ నుంచి పోటీ చేయడం సాహసంగానే మారిందని కొందరు అధికార పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. -
ఉరిమే ఉత్సాహం
జిల్లాలో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మానుగుంట మహీధర్‌రెడ్డితో ఆరంభమైన వైఎస్సార్ సీపీలో చేరికల పర్వం ఆ తర్వాత మరింత ఊపందుకుంది. పీడీసీసీబీ మాజీ చైర్మన్ ఈదర మోహన్, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, పారిశ్రామిక వేత్త మద్దిశెట్టి వేణుగోపాల్ ఇలా ఒకరి తర్వాత మరొకరు వైఎస్సార్ సీసీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. తాజాగా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు హితేష్ చెంచురామ్‌ల చేరికలతో ఇప్పటికే ప్రకాశం జిల్లాలో బలంగా ఉన్న వైఎస్సార్ సీపీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఇతర పార్టీల నుంచి ముఖ్య నేతల చేరికలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతోంది. తాజాగా బుధవారం చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్సార్ సీపీలో చేరారు. ఈనెల 13న హైదరాబాద్ లోటస్ పాండ్‌లో వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన ఆమంచి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. బుధవారం అమరావతిలో వైఎస్ జగన్ ఆమంచికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమంచితో పాటు ఆయన సోదరుడు స్వాములు, నియోజకవర్గానికి చెందిన అనుచర గణం పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. అదేవిధంగా ఇటీవల వైఎస్ జగన్‌ను కలిసి పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించిన సీనియర్ నేత, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు దగ్గుబాటి హితేష్ చెంచురామ్‌లు కూడా బుధవారం అమరావతిలో జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వారితో పాటు పర్చూరు నియోజకవర్గానికి చెందిన దగ్గుబాటి అనుచర గణం మొత్తం పార్టీలో చేరింది. అటు ఆమంచి, ఇటు దగ్గుబాటిలు బుధవారం ఉదయమే నియోజకవర్గం నుంచి వేలాది మంది కార్యకర్తలతో వైఎస్ జగన్ గృహ ప్రవేశం, పార్టీ కార్యాలయ ప్రారంభానికి తరలివెళ్లారు. అక్కడే జగన్ చేతుల మీదుగా కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. వీరి చేరికతో అటు చీరాల, ఇటు పర్చూరు నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమైంది. వీరందరి రాక జిల్లాలో వైఎస్సార్సీపీని తిరుగులేని శక్తిగా ఆవిర్భవించేలా చేస్తుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. జిల్లాలో క్లీన్ స్వీప్ అంటున్న కేడర్.. ఇప్పటికే కందుకూరుకు చెందిన మానుగుంట మహీధర్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆతర్వాత గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు టీడీపీని వీడి వైఎస్సార్‌లో చేరారు. వీరితో పాటు జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల పరిధిలో అధికార టీడీపీతో పాటు ఇతర పార్టీలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా దగ్గుబాటితో పాటు ఎమ్మెల్యే ఆమంచి సైతం వైఎస్ఆర్సీపీలో చేరడంతో కార్యకర్తల్లో రెట్టించిన ఉత్సాహం నెలకొంది. జిల్లాలోని 12 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయమని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. వీరితో పాటు జిల్లాకు చెందిన మరి కొందరు ముఖ్యనేతలు త్వరలోనే అధికార పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే జిల్లాలో వైఎస్సార్ సీపీకి తిరుగుండదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. డీలా పడిన టీడీపీ.. వైఎస్సార్ సీపీ జోష్‌తో అధికార టీడీపీ జిల్లాలో డీలా పడింది. వరుసపెట్టి ముఖ్య నేతలందరూ ఆ పార్టీని వీడుతుండడంతో ఏం చేయాలో పాలుపోక ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మిగిలి ఉన్న ఒకరిద్దరు ముఖ్యనేతలు ఆపార్టీని వీడితే వారు కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే ఒంగోలు పార్లమెంటు నుంచి టీడీపీ అభ్యర్థి«గా పోటీ చేసేందుకు అభ్యర్థి దొరకని పరిస్థితి నెలకొంది. ఎవరో ఒకరిని అభ్యర్థిగా నిలిపితే ఎన్నికలకయ్యే ఖర్చు తామే భరిస్తామని ముఖ్యమంత్రి ఆఫర్ ప్రకటించినట్లు ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. పోటీ చేసేందుకు అభ్యర్థే దొరకని పరిస్థితుల్లో ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీని ఎలా ఢీ కొట్టగలమని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. మొత్తంగా అధికార పార్టీతో పాటు ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున వలసలు పెరగడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. మాజీ మంత్రి మహీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబులకు పార్టీ కండువా కప్పుతున్న జగన్(ఫైల్) పీడీసీసీబీ మాజీ చైర్మన్ ఈదర మోహన్, మద్దిశెట్టి వేణుగోపాల్లను ౖÐð ఎస్సార్ సీపీలోకి ఆహ్వానిస్తున్న ఆపార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (ఫైల్) -
చింతమనేని వీడియో షేర్ చేశారంటూ..
-
చింతమనేని ఎఫెక్ట్: కత్తుల రవి జైన్ అరెస్ట్
సాక్షి, పశ్చిమగోదావరి : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కనీసం కేసు కూడా నమోదు చేయని పశ్చిమ పోలీసులు.. ఆయన తీరును నిరసించినందుకు దళితులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. దళితుల గురించి అసభ్య పదజాలం ఉపయోగిస్తూ చింతమనేని మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారంటూ వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, దళిత నేత కత్తుల రవి జైన్‌ను పెదపాడు పోలీసులు అరెస్టు చేశారు. దీంతో దళిత సంఘాలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రవిని వెంటనే విడిచి పెట్టకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.(మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు) కాగా ‘దళితులు.. మీకెందుకురా రాజకీయాలు’ అంటూ దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని దళిత వర్గాన్ని తీవ్రంగా అవమానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనపై కేసు నమోదు చేయాలంటూ దళిత నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. అయితే తన గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ చింతమనేని ఇచ్చిన ఫిర్యాదుపై మాత్రం వెంటనే స్పందించారు. ఆయన వీడియోను షేర్ చేశారంటూ రవిని అరెస్టు చేశారు. పోలీసుల పక్షపాత వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ల అండ చూసుకుని రెచ్చిపోతున్న చింతమనేనికి పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారంటూ ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయి(మరోసారి రెచ్చిపోయిన చింతమనేని.. ఉద్రిక్తత) జూపూడి, కారెం శివాజీలపై దళితుల ఆగ్రహం చింతమనేని ప్రభాకర్ వైఖరిని నిరసిస్తూ దళిత సంఘాలు తణుకులో ఆందోళన చేపట్టాయి. చింతమనేని అరెస్టు చేయాలంటూ తణుకు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగాయి. ఈ సందర్భంగా చింతమనేని వ్యాఖ్యలపై స్పందించని జూపూడి, కారెం శివాజీలపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల ధర్నాకు వైఎస్సార్ సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు మద్దతుగా నిలిచారు. ఆయన కూడా ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు.(చింతమనేనిపై భగ్గుమన్న దళితులు) -
‘సాక్షి’ కథనంపై చింతమనేని ఆగ్రహం
సాక్షి, ఏలూరు/పశ్చిమ గోదావరి : ‘మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు’ అంటూ దళితులను అసభ్య పదజాలంతో దూషించిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు) మరోసారి రెచ్చిపోయారు. దళితులను కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి ‘సాక్షి’ పత్రికలో కథనం రావడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుచరులతో కలిసి ఏలూరులోని సాక్షి కార్యాలయానికి చేరుకున్న ఆయన.. తన గురించి ఇష్టం వచ్చినట్లుగా వార్తలు ఎందుకు రాస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో విలేకరులు లేరని చెప్పడంతో మళ్లీ వస్తానంటూ వెనుదిగారు. దళిత సంఘాలు వర్సెస్ టీడీపీ కార్యకర్తలు.. ఫైర్ స్టేషన్ సెంటర్ : తమను అవమానపరిచిన దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌పై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ఆయన తీరును నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్ స్టేషన్లో దళితులు ధర్నా చేసేందుకు ఉపక్రమించారు. దీంతో అప్రమత్తమైన చింతమనేని అనుచరులు వీరిని అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలను భారీగా మోహరించారు. దీంతో ఫైర్ స్టేషన్లో ఉద్రిక్తత నెలకొంది. -
టీడీపీ ఎమ్మెల్యే కనుసన్నల్లో మైనింగ్ దోపిడీ
-
అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు
-
ఆయనకు టికెట్ ఇవ్వొద్దు; అమరావతిలో ఉద్రిక్తత
సాక్షి, అమరావతి : రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌పై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఆయన అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శ్రావణ్ కుమార్‌ను వ్యతిరేకిస్తూ వెంకటపాలెం నుంచి తుళ్లూరు వరకు ఆయన వ్యతిరేక వర్గం పాదయాత్ర చేపట్టింది. ఈ క్రమంలో వెంకటపాలెం చేరుకున్న ఎమ్మెల్యే అనుకూల వర్గం పాదయాత్రను అడ్డుకుంది. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.(టీడీపీ నేతల హెచ్చరికతో ఖంగుతిన్న మంత్రులు) కాగా గత కొంతకాలంగా తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌పై అసమ్మతి పెరిగిపోతోంది. దీనిని నివారించేందుకు ఏకంగా మంత్రులు రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆయన వ్యతిరేక వర్గం తుళ్లూరు మండలంలో శనివారం విస్తృత స్థాయిలో సమావేశాలు నిర్వహించింది. రానున్న ఎన్నికల్లో శ్రావణ్‌కుమార్‌కు టికెట్ ఇవ్వొద్దని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరుల మద్దతు కోరారు. వెంకటపాలెం గ్రామానికి చెందిన నాయకుడు బెల్లంకొండ నరసింహారావును తమ వర్గంలోకి రావాలని చర్చలు జరిపారు. రాజధాని ప్రాంతంలో వర్గాలను తయారు చేస్తున్న ఎమ్మెల్యే చేతుల్లో పార్టీని పెట్టడం సరైంది కాదని చెప్పారు. శ్రావణ్‌కుమార్‌కు టికెట్ ఇస్తే సహకరించేది లేదని తీర్మానించుకున్నారు. స్థానిక నాయకుల మాట కాదని అధిష్టానం వ్యవహరిస్తే ఇక్కడ ఓడిస్తామని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు నరేంద్రబాబు, సుధాకర్ తరదితరుల నివాసాలలో ఈ చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే వారు మంగళవారం పాదయాత్ర చేపట్టారు. -
టీడీపీ నేతల దౌర్జన్యం.. ఆదినారాయణ ఆత్మహత్యాయత్నం
సాక్షి, గుంటూరు: జిల్లాలోని గురజాలలో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ అనుచరులు మరోసారి రౌడీయిజం ప్రదర్శించారు. మాజీ ఎమ్మెల్యే గడిపూడి మల్లికార్జునరావుకు చెందిన క్వారీ ఆక్రమణకు సంబంధించి ఆయన కుమారుడు ఆదినారాయణ, యరపతినేని శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. దీంతో యరపతినేని అనుచరులు ఆదినారాయణపై దౌర్జన్యానికి దిగారు. టీడీపీ నేతల అమానుష ప్రవర్తనతో మనస్తాపానికి లోనైన ఆదినారాయణ ఆత్మహత్య యత్నం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆదినారాయణ సోదరుడు కోటి మీడియాతో మాట్లాడుతూ.. యరపతినేని వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆరోపించారు. యరపతినేని తమ క్వారీని బలవంతంగా లాక్కున్నారని మండిపడ్డారు. యరపతినేని ఆరాచాకాలపై పోలీసులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోటి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కూడా టీడీపీ నేతలు అతనిపై దౌర్జన్యానికి దిగారు. టీడీపీ నేతలు చికెన్ బాబు మరికొందరితో కలిసి కోటిని అక్కడి నుంచి బలవంతంగా లాక్కెళ్లారు. -
టీడీపీ నేతల దౌర్జన్యం.. ఆదినారాయణ ఆత్మహత్యాయత్నం
-
పెనుకొండ కోటకు.. అవినీతి సారథి
పెనుకొండ... పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతం. అరాచక రాజకీయానికి నిలయం... అవినీతి, అక్రమాలను ఎదురించలేక బిక్కుబిక్కుమంటూ గడిపే అమాయక ప్రజలున్న ప్రాంతం. 2004 వరకూ పరిటాల రవీంద్ర, ఆ తర్వాత బీకే పార్థసారథి గుప్పిట్లో ఉన్న నియోజకవర్గం. దశాబ్దాలుగా ఇక్కడి జనం పేదలుగానే ఉన్నా....నేతలు మాత్రం రూ.వందల కోట్లకు పడగలెత్తారు. గత నాలుగున్నరేళ్లలో ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఆర్జించిన మొత్తమే రూ.400 కోట్లు దాకా ఉంటే.... నియోజకవర్గంలోని టీడీపీ నేతలు సాగించిన దందా మరో రూ.400 కోట్ల మేర ఉంటుంది. ఎమ్మెల్యేతో పాటు ఆయన అల్లుడు శశిభూషణ్.. నియోజకవర్గాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని శాసిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా నుంచి కంకర క్వారీల దాకా...‘నీరు–చెట్టు’ పథకం పనుల నుంచి మరుగుదొడ్ల దాకా...ప్రభుత్వ భూముల నుంచి ఎస్సీల భూముల వరకు దేన్నీ వదల్లేదు. ప్రతీ పనిలోను ‘మాకేంటి? మా వాటా ఎంత?’ అనే రీతిలోనే దందా సాగిస్తున్నారు. నాలుగున్నరేళ్ల కిందట పార్థుడి ఆర్థిక పరిస్థితి, ప్రస్తుత స్థితి బేరీజు వేస్తే.... అందనంత ఎత్తుకు ఎదిగారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో పార్థుడితో పాటు ఆయన సైన్యం పెనుకొండ కోటను అడ్డాగా చేసుకుని సాగించిన అవినీతికాండపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్. సాక్షి ప్రతినిధి, అనంతపురం ఎస్సీల భూముల్లో ‘పార్థుడి’ క్వారీ రొద్దం మండలంలోని కంబాలపల్లి, శ్యాపురం గ్రామాల శివార్లలో ఎమ్మెల్యే బీకే పార్థసారథి క్వారీ నడుపుతున్నారు. తన కుమారుడు సాయి పేరు మీద నడుస్తున్న ఈ క్వారీ కోసం కొండ సమీపంలోని 16 మంది ఎస్సీ రైతులకు సంబంధించిన 40 ఎకరాల భూములను ఎమ్మెల్యే స్వాధీనం చేసుకున్నారు. వీరికి ఏడాదికి రూ.4 వేల చొప్పున లీజు ఇస్తామని బలవంతంగా లాక్కున్నారు. క్వారీ మిషనరీ ఈ పొలాల్లో ఏర్పాటు చేశారు. కొండ పైనుంచి రాళ్లు ఇక్కడికి తెచ్చి..కంకర చేసి విక్రయిస్తున్నారు. అయితే ఏడాదికి ఎకరాకు రూ.4 వేలు ఇస్తే తాము ఎలా బతకాలని ఎస్సీ రైతులు ప్రశ్నిస్తున్నారు. తాము పంటలు పండించుకుంటే కనీసం రూ.30 వేలు దాకా సంపాదించుకుంటామని..అందువల్ల రూ.4 వేల లీజుకు పొలాలు ఇవ్వమని తొలుత తేల్చిచెప్పారు. కానీ పొలాలు ఇవ్వకపోతే పూర్తిగా లాగేసుకుంటామని బెదిరించిన ఎమ్మెల్యే బీకే... వారి చేతిలో చిల్లర విదిల్చి క్వారీ పనులకు వినియోగిస్తున్నారు. ఎమ్మెల్యే పార్థసారథి భారీగా ఆర్జిస్తూ తమ పొట్ట కొడుతున్నారని ఎస్సీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పొలాల్లో క్వారీ పనులు జరుగుతున్న సమయంలో కంకర పొడి, దుమ్మ, ధూళి ప్రభావంతో చుట్టపక్కల వంద ఎకరాల్లోని పంటలు నాశనమవుతున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పనులు జరుగుతున్నపుడు దుమ్ము లేవకుండా ట్యాంకర్లతో నీళ్లు చల్లాలనే నిబంధన ఉన్నప్పటికీ...ఇక్కడ పాటించడం లేదు. దీంతోపాటు కేవలం 10 ఎకరాల్లో క్వారీ నడిపేందుకు అనుమతులు తీసుకున్న ఎమ్మెల్యే బీకే పార్థసారథి...అధికారం అండతో ఏకంగా 30 ఎకరాల్లో నడుపుతున్నారు. పగటి వేళల్లో కూడా క్వారీలో పేలుళ్లు నిర్వహిస్తున్నారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రోడ్డు పనుల్లో ఎమ్మెల్యే అల్లుడికి 6 శాతం కమీషన్లు రొద్దం మండలంలో 57 నెలల్లో రూ.90 కోట్ల మేర రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులన్నీ ఎమ్మెల్యే అల్లుడు శశిభూషణ్ కనుసన్నల్లోనే సాగాయి. రోడ్డు పనులు దక్కించుకోవాలనుకున్న వారు శశిని కలిసి కమీషన్ మాట్లాడుకుంటారు. కమీషన్‌పై అవగాహన కుదిరిన తర్వాత అస్మదీయ కాంట్రాక్టర్లు మినహా ఎవ్వరూ టెండర్లు వేయకుండా శశి హుకుం జారీ చేస్తారు. ఇలా నియోజకవర్గంలో రోడ్డు పనుల ద్వారా దాదాపు రూ.6 కోట్ల మేర కమీషన్ రూపంలో శశి ఇంటికి చేరినట్లు తెలుస్తోంది. పరిగి మండలంలో... ‘నీరు–చెట్టు’ పథకం కింద పరిగి మండలంలో రూ.5.04 కోట్లు ఖర్చుపెట్టారు. ఇందులో పనులే చేయకుండా రూ.3.87 కోట్లు దుర్వినియోగం చేశారు. చెరువుల్లో పూడికతీత, మరమ్మతులు, కాల్వల తవ్వకం, చెక్‌డ్యాం పనుల్లో రూ.38.71 లక్షల అవినీతికి పాల్పడ్డారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద గ్రామాల్లో సిమెంట్‌రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో కూడా టీడీపీ నేతలు ‘గుడ్‌విల్’ తీసుకున్నారు. ఊటుకూరులో 480.80 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. 2018లో సర్వే నంబర్ 240, 241లో 15.1 ఎకరాల విస్తీర్ణంలో చెన్నైకి చెందిన కేఐఎల్‌ఎం పరిశ్రమ పనులు చేపట్టింది. ఇందులో 9. 31 ఎకరాలకు తప్పుడు రికార్డులతో అనుమతులు పొందారు. ఇందులో ఎమ్మెల్యేకు భారీగా ముడుపులు అందినట్లు తెలుస్తోంది. చెరువు స్థలాన్ని మాజీ సర్పంచ్ ఈశ్వరప్ప 5 ఎకరాలు ఆక్రమించారు. మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా అవినీతికి పాల్పడ్డారు. శాసనకోటలో 85 మరుగుదొడ్లకు ఒక్కో యూనిట్ రూ.15 వేలతో 85 యూనిట్లకు కలిపి రూ.12.75 లక్షలకు టీడీపీ నేతలు తప్పుడు బిల్లులు చేసుకుని స్వాహా చేశారు. 15.80 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా రొద్దం మండలంలో ప్రభుత్వ జాగా కన్పిస్తే తమ్ముళ్లు పాగా వేస్తున్నారు. మండలంలోని రొద్దంకపల్లిలో సర్వే నంబర్ 23–1, 2, 3లో 11.65 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 23–1 లెటర్లో టీడీపీ నేత జనార్దన్ భార్య లక్ష్మీదేవి పేరుతో 5 ఎకరాలు, 23–2 లెటర్లో ఈశ్వరప్ప పేరుతో 2.65 ఎకరాలు, 23–3 లెటర్లో నాగరాజు భార్య సావిత్రమ్మ పేరుతో 4 ఎకరాలకు పట్టాలు చేయించుకున్నారు. దీంతో పాటు టీడీపీ నేత రామచంద్ర పేరుతో 1303–2లో 4.15 ఎకరాలకు పట్టాలు చేయించుకున్నారు. ఈ సర్వే నంబర్లలోని భూమి విలువ ప్రస్తుతం ఎకరా రూ. 10 లక్షల దాకా ఉంది. ఈ భూముల పట్టాలు బ్యాంకుల్లో పెట్టి రుణాలు కూడా పొందారు. ఇసుక దోపిడీనే రూ.438 కోట్లు పెనుకొండలో ఎమ్మెల్యే బీకే పార్థసారథి, ఎంపీ నిమ్మల కిష్టప్పతో పాటు టీడీపీ నేతలకు భారీ ఆదాయన వనరు ఇసుక. నియోజకవర్గ పరిధిలో పెన్నా, జయంగళీ, చిత్రావతి నదీ పరివాహక ప్రాంతాలున్నాయి. రోజూ వందల ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుక రవాణా అక్రమంగా సాగుతోంది. డ్వాక్రా మహిళల కనుసన్నల్లో ఇసుక రీచ్‌లు నడిచిన రోజుల నుంచి ...నేటి వరకూ ఇసుక రవాణా మొత్తం టీడీపీ నేతల కనుసన్నల్లోనే సాగుతోంది. ఎమ్మెల్యే సొంత మండలం రొద్దంలో పెన్నానది ఉంది. పరిగి, గోరంట్లలో పెన్నా, చిత్రావతితో పాటు జయమంగళి ఉన్నాయి. పెన్నా నుంచి ఒక టిప్పర్ ఇసుక కర్ణాటకు తరలిస్తే రూ.50 వేలు తీసుకుంటున్నారు. ట్రాక్టర్‌కు రూ.4 వేలు వసూలు చేస్తున్నారు. రొద్దం నుంచే రోజూ 20 టిప్పర్లు, 50 ట్రాక్టర్ల ఇసుక తరలిపోతోంది. గోరంట్ల, పరిగి నుంచి కూడా రోజూ 20 టిప్పర్ల చొప్పున ఇసుక తరలిపోతోంది. అంటే సగటున నియోజకవర్గం నుంచి 60 టిప్పర్ల ఇసుక ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఒక్కో టిప్పర్‌కు రూ.50 వేల చొప్పున రోజూ రూ.30 లక్షలు ఆర్జిస్తున్నారు. మరో రూ.10 లక్షలు ట్రాక్టర్ల ద్వారా ఆదాయం వస్తోంది. ఈ లెక్కన రోజుకు రూ.40 లక్షల చొప్పున టిప్పర్ల ద్వారా ఏడాదికి రూ.146 కోట్ల ఆదాయం వచ్చినట్లే. ఈ నాలున్నరేళ్లలో ఏడాదిన్నర పాటు ఇసుక తవ్వకాలు చేపట్టలేదనుకున్నా... మూడేళ్ల పాటు ఇసుక తవ్వకాలు జోరుగా సాగాయి. ఇసుక అక్రమ రవాణాతోనే రూ.438కోట్లు ఆర్జించి ఉంటారు. ఇందులో మెజార్టీ వాటా ఎమ్మెల్యే, ఎంపీల ఇళ్లకు చేరితే...మిగతా సొమ్మును టీడీపీ నేతలు, కార్యకర్తలు వాటాలు పంచుకున్నారు. మరుగుదొడ్ల పేరుతో రూ.2.50 కోట్ల దోపిడీ రొద్దం...ఎమ్మెల్యే బీకే పార్థసారథి సొంత మండలం. 19 గ్రామపంచాయతీలున్నాయి. వీటి పరిధిలోని 63 గ్రామాల్లో స్వచ్ఛభారత్ కింద 8,700 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. వీటిలో 6,533 పూర్తయినట్లు అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. ఇందుకు రూ. 9.79 లక్షల బిల్లులు చేశారు. అయితే 63 గ్రామాల్లో కూడా 35 శాతం మరుగుదొడ్లు చేయకుండానే చేసినట్లు తప్పుడు బిల్లులు చూపించి నిధులు స్వాహా చేశారు. ఇలా రూ.2.50 కోట్ల నిధులు టీడీపీ నేతల జేబుల్లోకి చేరాయి. జెడ్పీటీసీ సభ్యుడు చిన్నప్పయ్య తప్పుడు బిల్లులతో రూ.50 లక్షలు ఆర్జించినట్లు తెలుస్తోంది. పెద్దగువ్వలపల్లి, నాగిరెడ్డిపల్లి, చిన్నమంతూరు గ్రామాల్లో జెడ్పీటీసీ సభ్యులే పనులు చేశారు. దీంతో వారు పనులు చేయకుండానే ఎమ్మెల్యే బీకే పార్థసారథితో అధికారులకు ఫోన్లు చేయించుకుని, ఒత్తిడి తెచ్చి బిల్లులు చేయించుకున్నారు. దొంగబిల్లులు చేయడానికి నిరాకరించిన ఉపాధిహామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్‌ను జెడ్పీటీసీ సభ్యుడు బదిలీ చేయించారు. ‘నీరు–చెట్టు’ పనుల్లో భారీ దోపిడీ మండలవ్యాప్తంగా ‘నీరు–చెట్టు’ పథకం కింద 120 పనులు జరిగాయి. రూ.7 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో పూడిక తీత, సప్లయి చానల్స్, కంపచెట్ల తొలగింపు, చెరువుల మరమ్మతులు, తూముల మరమ్మతు పనులు చేపట్టారు. నాసిరకంగా పనులు చేసి, చేయని పనులు చేసినట్లు రికార్డుల్లో చూపించి రూ.2.79 లక్షలు దోచుకున్నారు. ఎమ్మెల్యే సోదరుడు సుధాకర్, టీడీపీ మండల కన్వీనర్ చంద్రమౌళి, శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ చలపతి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, మాజీ సర్పంచ్ నాగభూషణం, కొండయ్య ఈ పనులు చేశారు. సోమందేపల్లి మండలంలో... గుడిపల్లి పంచాయతీ పరిధిలో సర్వే నంబర్– 64లో ఎమ్మెల్యే బీకే పార్థసారథి కుమారై బీకే రోజ, అల్లుడు చంపకదామ పేరుతో 4.96 ఎకరాల్లో క్వారీ ఉంది. ఈ క్వారీ ద్వారా భారీగా అర్జిస్తున్నారు. సోమందేపల్లి చెరువు సమీపంలో రాయ్‌బహద్దూర్ నరసింహదాస్ వై పవర్ ప్రైవేట్ లిమిటెడ్ క్వారీ, వేలుపుకొండలోని ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ క్వారీల నుంచి ఎమ్మెల్యేకు భారీగా ముడుపులు అందుతున్నాయి. దీనికి రోడ్డు సౌకర్యం లేకపోతే ఎమ్మెల్యేనే జాతీయరహదారిని కలుపుతూ రోడ్డు వేయించారు. దీనికి ప్రతిఫలంగా క్వారీ యజమానులు ఎమ్మెల్యేకు మామూళ్లు సమర్పించుకున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఎవరు రోడ్డు పనుల టెండర్లు దక్కించుకున్నా...ఎమ్మెల్యేకు సంబంధించిన క్వారీల నుంచే కంకర తీసుకువెళ్లాల్సిన పరిస్థితి కల్పించారు. పాపిరెడ్డిపల్లిలోని ఐ పవర్ నేషన్ ప్రైవేట్ కంపెనీ నిర్వహిస్తోన్న క్వారీతో గిరిజనుల ఆరాధ్య దైవమైన వేలపుకొండ దెబ్బతింటోంది. బ్లాస్టింగ్‌తో సమీపగ్రామ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మండలంలో ‘నీరు–చెట్టు’ పథకం కింద రూ.12 కోట్ల పనులు చేశారు. 160 పనులకు రూ.4 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. తక్కిన రూ.8 కోట్లను పనులు చేయకుండానే తప్పుడు బిల్లుల సృష్టించి స్వాహా చేశారు. గుడిపల్లి పొలంలో సర్వే నంబర్ 117–2ఎలో ఎమ్మెల్యే కుమారై బీకే రోజ పేరుతో భూములు కొనుగోలు చేశారు. గోరంట్ల మండలంలో... గోరంట్ల మండలంలో రూ.5 కోట్లతో సిమెంట్ రోడ్లు వేశారు. ఈ పనులు ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులే చేస్తున్నారు. ఎంపీ నిమ్మల తన సొంత పొలాలు, కల్యాణమంటపాలకు ఎంపీ నిధులతో సిమెంట్‌రోడ్లు వేయించుకున్నారు. బీఎన్ తండా నుంచి హిందూపురం రోడ్డు వరకూ రూ.80 లక్షలు, కాటేపల్లి నుంచి రూ.40 లక్షలతో రోడ్డు పనులు చేశారు. ఈ పనులు టెండర్ ద్వారా కాకుండా నామినేషన్ పద్ధతిలో టీడీపీ నేతలకు కట్టబెట్టారు. చిత్రావతి నది నుంచి ఇసుకను తవ్వి అక్రమంగా కర్ణాటకకు రవాణా చేసి రూ.60 కోట్లు దాకా స్వాహా చేశారు. ఇసుక అక్రమ రవాణాలో ఎమ్మెల్యే బీకే పార్థసారథి, ఎంపీ నిమ్మలకు వాటాలు అందాయి. ‘నీరు–చెట్టు’ పథకం ద్వారా మండలంలో రూ.20 లక్షల వరకూ టీడీపీ నేతలు స్వాహా చేశారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్లతో నీరు సరఫరా చేసినట్లు తప్పుడు లెక్కలు చూపించి టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారు. గోరంట్లలో చిత్రావతి నదిపై రూ.4.75 కోట్లతో వంతెన నిర్మిస్తున్నారు. ఈ పనుల్లో కూడా కాంట్రాక్టర్ నుంచి ముడుపులు అందుకున్నారు. పెనుకొండ మండల పరిధిలో... శెట్టిపల్లిలో సర్వేనంబర్ 345–2లో ఎమ్మెల్యే బీకే... బినామీల పేరుతో గ్రానైట్ పరిశ్రమ ఏర్పాటు చేయించారు. ఈ క్వారీ నుంచి ఎక్కువగా ముంబయికి గ్రానైట్ సరఫరా అవుతోంది. గ్రానైట్ ద్వారానే ఎమ్మెల్యే బీకే రూ.70 కోట్లు ఆర్జించి ఉంటారు. ‘కియా’ కార్ల పరిశ్రమ వస్తుందని తెలిసి అమ్మవారిపల్లి, ఎర్రమంచి ప్రాంతాల్లో తన అనుచరుల పేరుతో బీకే పార్థసారథి భూములు భారీగా కొనుగోలు చేశారు. వీటి విలువ రూ. 50 కోట్ల దాకా ఉండొచ్చు. గుట్టూరులో కురబ కార్పొరేషన్ వైస్ చైర్మన్ సబితకు కంకర క్వారీ ఉంది. ఇందులో కూడా ఎమ్మెల్యేకు వాటా ఉన్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టు పనుల్లో గుడ్‌విల్, ల్యాండ్ సెటిల్మెంట్లలో ఎమ్మెల్యే అల్లుడు శశిభూషణ్ రూ.80 కోట్లపైనే ఆర్జించి ఉంటారని తెలుస్తోంది. పెనుకొండ మండలంలో చేపట్టిన ‘నీరు–చెట్టు’ పథకం పనుల్లో రూ.10 కోట్లు అవినీతి జరిగింది. ఈ వ్యవహారంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాసులు భారీగా లబ్ధిపొందారు. ‘కియా’ కార్ల పరిశ్రమ, గొల్లపల్లి రిజర్వాయర్‌లో భారీగా మామూళ్లు అందినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంపీ నిమ్మల కిష్టప్పకు కూడా వాటాలు అందినట్లు తెలుస్తోంది. పవర్ గ్రిడ్ కాంట్రాక్టర్లకు బెదిరింపులు పావగడ నుంచి దేవనహళ్లి వరకు పవర్ గ్రిడ్ ద్వారా విద్యుత్ టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా నాలుగు నెలల క్రితం పెనుకొండ నియోజకవర్గంలోని రొద్దం, సోమందేపల్లి మండలాల పరిధిలో టవర్లు ఏర్పాటు చేస్తుండగా.. ఎమ్మెల్యే బీకే అల్లుడు శశిభూషణ్ అడ్డుకున్నారు. పెనుకొండ ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వద్దకు కాంట్రాక్టర్లను పిలిపించి రూ.40 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో వారు తాము అంత మొత్తం ఇవ్వలేమని చేతులు ఎత్తేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వారు పెనుకొండ నియోజకవర్గంలో టవర్ పనులు నిలిపి గౌరిబిదనూరు వద్ద పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిశాక పెనుకొండ నియోజకవర్గంలో పనులు మొదలు పెడతామనీ, అప్పటి వరకు తాము అడుగుపెట్టమని కాంట్రాక్టర్లు ఎమ్మెల్యే అనుచరుల వద్ద స్పష్టం చేసినట్లు తెలిసింది. -
మెడపట్టి గెంటేసిన టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి, నరసాపురం రూరల్(పశ్చిమగోదావరి): ఎస్సీ యువకులపై నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు దురుసుగా ప్రవర్తించారు. ఓ యువకుడిని మెడపట్టి గెంటేశారు. దీంతో గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించారు. మండలంలోని సరిపల్లిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. అసలేం జరిగిందంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు రెండు రోజుల నుంచి హడావుడిగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టారు. నరసాపురం మండలం సరిపల్లి ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు స్వగ్రామం. ఇక్కడ గత పాలకుల హయాంలోనే పంచాయతీకి నూతన భవనం నిర్మించారు. అయితే ఈ భవనం ఎస్సీ సామాజిక వర్గం ఉన్న ప్రాంతంలో ఉండటంతో ఎమ్మెల్యే మాధవనాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పంచాయతీ కార్యాలయాన్ని తమ సామాజికవర్గం ఉన్న ప్రాంతానికి మార్చాలని యత్నించారు. దీనిలో భాగంగా ఎంపీ తోట సీతారామలక్ష్మి కొత్త పంచాయతీ భవన నిర్మాణానికి గతేడాది జూలైలో శంకుస్థాపన చేశారు. ఎస్డీఎఫ్, ఉపాధిహామీ నిధులు రూ.37.50లక్షలతో ఈ పనులు చేపట్టారు. అయితే అప్పట్లో శంకుస్థాపన సందర్భంలోనూ రెండు కులాల మధ్య వివాదం చోటు చేసుకుంది. అనంతరం వ్యవహారం కోర్టు పరిధిలోకి వెళ్లింది. అయినా ఎమ్మెల్యే మొండిగా కొత్త పంచాయతీ భవన నిర్మాణాన్ని పూర్తిచేశారనే విమర్శలు ఉన్నాయి. కోపంతో ఊగిపోయిన ఎమ్మెల్యే ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం కొత్తభవనాన్ని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే మాధవనాయుడు పోలీసులు, తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి అక్కడికి చేరుకున్నారు. దీంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గ్రామస్తులు గమిడి మధుబాబు, మైలాబత్తుల కృష్ణంరాజు తదితరులు భవన నిర్మాణ వ్యవహారం కోర్టులో పెండింగ్‌లో ఉందని, ప్రారంభించడం తగదని ఎమ్మెల్యేకు వివరించే యత్నం చేశారు. దీంతో రెచ్చిపోయిన ఎమ్మెల్యే మాధవనాయుడు కోపంతో ఊగిపోతూ ఆ ఎస్సీ యువకులను మెడపై చేయివేసి బయటకు గెంటారు. ఈ పరిణామం నుంచి ఎస్సీ యువకులు తేరుకునేలోపే రూరల్ఎస్సై మూర్తి, తెలుగుదేశం చోటా నాయకులు ఒక్కటై వారిని ఈడ్చి పక్కకు లాగేశారు. ఈ పెనుగులాటలో యువకుల దుస్తులూ చిరిగాయి. ఈ తతంగం ఇలా జరుగుతుండగానే ఎమ్మెల్యే తన అధికారదర్పాన్ని ప్రదర్శిస్తూ కొత్తపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామస్తుల ఆందోళన ఎమ్మెల్యేకు తీరుకు వ్యతిరేకంగా ఎస్సీ యువకులు గ్రామస్తులతో కలిసి నరసాపురం-భీమవరం రోడ్డుపై బైఠాయించారు. పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం ఈ యువకులు రూరల్‌పోలీసు స్టేషన్‌కు చేరుకుని తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఎమ్మెల్యే, టీడీపీ చోటా నాయకులు, రూరల్ ఎస్సై తదితరులు తమపట్ల అమానుషంగా ప్రవర్తించారని ఆవేదన చెందారు. అంతే కాకుండా ఎమ్మెల్యే మాధవనాయుడు తమను కులంపేరుతో దూషించారని ఆయనపై వెంటనే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని కోరుతూ రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసిన వారిలో మైలాబత్తుల రాజ్‌కుమార్, కేదాసు స్వరాజ్యకుమార్, మైలాబత్తుల కుటుంబరావు, ఏలూరి చంటి, ఉండ్రు స్టాలిన్, పి వెంకట్రావు, ఎం శరత్ తదితరులు ఉన్నారు. -
కరుణించని ఎమ్యెల్యే.. వ్యక్తి మృతి
తిరుపతి తుడా : ఎమ్మెల్యే నిర్లక్ష్యం ఓ నిడు ప్రాణాన్ని బలితీసుకుంది. సీఎం సహాయ నిధి కోసం ఏడాదిన్నరగా అర్థించి అలసిపోయిన ఓ రోగి చివరకు తనువు చాలించాడు. తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటి వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీలోని లింగేశ్వరనగర్‌కు చెందిన కరణప్రసాద్ (70) కొన్నేళ్లుగా నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. సమస్య తీవ్రం కావడంతో ఏడాదిన్నర క్రితం అప్పుచేసి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. 7నెలల క్రితం మళ్లీ సమస్య తలెత్తడంతో రెండోసారి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. చికిత్స నిమిత్తం రూ.6 లక్షలు వ్యయమైనట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో వడ్డీలు కట్టలేక కరణప్రసాద్ ఏడాదిన్నరగా సీఎం సహాయనిధి కోసం ఎమ్మెల్యే సుగుణమ్మను వేడుకుంటున్నాడు. నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో మరింత వేదనకు గురయ్యాడు. తాజాగా 4 రోజుల క్రితం మళ్లీ ఎమ్మెల్యేను కలిస్తే గురువారం రావాలని సూచించారు. దీంతో ఆయన గురువారం ఎమ్మెల్యే ఇంటికి చేరుకునాడు. ఎంతోసేపు నిరీక్షించిన కరుణప్రసాద్ నీరసంతో ఎమ్మెల్యే ఇంటి గుమ్మం ముందే కుప్పకూలిపోయాడు. అతన్ని 108 సిబ్బంది రుయా ఆస్పత్రికి తరలిచంగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
రాజంపేట ఎమ్మెల్యే మేడాపై సస్పెన్షన్ వేటు
సాక్షి, వైఎస్సార్ జిల్లా : మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తిన నేపథ్యంలో రాజుకున్న రాజంపేట గొడవ అమరావతికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజంపేట టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో టికెట్ ఆశావహులు వేమన సతీశ్ తన అనుచర వర్గంతో అమరావతికి తరలివెళ్లారు. మాజీ ఎమ్మెల్యే పసుపులేటి బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, చరణ్‌రాజ్ తదితరులు కూడా అక్కడికి చేరుకున్నారు. కాగా సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. (రాజంపేట టీడీపీలో రభస!) కాగా ఆర్అండ్బీ బంగ్లా వేదికగా జరిగిన సమావేశం సాక్షిగా రాజంపేట టీడీపీ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డికి తెలియకుండా మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి సమావేశం నిర్వహించడం, రాజంపేట నియోజకవర్గంలో మేడా కంటే బలమైన అభ్యర్ధిని రానున్న ఎన్నికల్లో పోటీకి దింపుతామని వ్యాఖ్యానించడంతో రభస జరిగింది. ఈ క్రమంలో సీఎంతో మాట్లాడిన తర్వాతే భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందంటూ మేడా పేర్కొన్న సంగతి తెలిసిందే. -
టీడీపీ ఎమ్మెల్యే సూరి చర్యపై మానవ హక్కుల సంఘాలు సమావేశం
-
కారెక్కేనా ?
సాక్షి, కొత్తగూడెం: టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా జిల్లా నుంచి కొందరు ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం అవుతోందనేది జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే మొదట గులాబీ బాస్ కేసీఆర్ టీడీపీ ఎమ్మెల్యేలపై నజర్ పెట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య కారెక్కడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కూడా గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు వస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేల తర్వాత కాంగ్రెస్ శాసన సభ్యులకు గాలం వేసేందుకు టీఆర్ఎస్ అధిష్టానం రంగం సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో భారీ మెజారిటీతో రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న టీఆర్ఎస్.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. భద్రా ద్రి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలో మరో మూడు నెలల్లో జరుగబోయే పార్లమెంటు ఎన్నిక ల్లో గులాబీ జెండా ఎగరేయాలంటే ఖమ్మం, మ హబూబాబాద్ లోక్‌సభ సెగ్మెంట్లలో గెలిచిన విపక్ష ఎమ్మెల్యేలను ‘కారు’లో ఎక్కించుకునేందు కు గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయని బహిరంగ చర్చ జరుగుతోంది. ఇప్పటికే సత్తుపల్లి ఎ మ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్లో చేర డం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో కొంత ఆలస్యంగానైనా మెచ్చా కూడా గులాబీ గూటికి చేరతారనే చర్చ సర్వత్రా జరుగుతోంది. అయితే ఈ నెల 17వ తేదీలోపే కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఎవరి ఆధ్వర్యంలో చేరుతారో.. అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఒకవేళ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటే ఎవరి ఆధ్వర్యంలో చేరుతారోననేది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రాములునాయక్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ వెంటనే పొంగులేటి వర్గీయులు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావుతో కూడా చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే కారెక్కేందుకు సండ్ర సిద్ధమైనప్పటికీ.. మెచ్చా మాత్రం సంశయిస్తున్నట్లు తెలుస్తోంది. వెంకటవీరయ్యతో కలిసి వెళితే ఆయనకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని, తనకు ప్రాధాన్యం ఉండదని మెచ్చా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మెచ్చాకు కూడా ప్రాధాన్యత కల్పించేలా నామినేటెడ్ పదవి ఇచ్చేందుకు టీఆర్ఎస్ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈనెల 8న మెచ్చా నాగేశ్వరరావు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. గెలిచిన తరువాత మర్యాదపూర్వకంగానే తుమ్మలను కలిశానని, ఇందులో ఎలాంటి రాజకీయ అంశాలకు సంబంధించిన చర్చలు లేవని మెచ్చా చెబుతున్నారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో మెచ్చా గులాబీ గూటికి చేరడం ఒకవేళ ఖాయమైతే.. ఎవరి ఆధ్వర్యంలో అనే ఉత్కంఠ టీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మెచ్చాకు చంద్రబాబు ఖరీదైన కారు..? మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్లో చేరే అవకాశాలు ఉండడంతో టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెచ్చాను పిలిపించుకుని పార్టీ మారవద్దని సూచించారు. సండ్ర టీఆర్ఎస్ గూటికి చేరినా మెచ్చాను మాత్రం వెళ్లవద్దని కోరినట్లు సమాచారం. టీడీపీలో కొనసాగితే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే చంద్రబాబు మెచ్చాకు ఖరీదైన కారు బహుకరించినట్లు నియోజకవర్గ వ్యాప్తంగా బహిరంగ చర్చ జరుగుతోంది. -
బట్టబయలైన అన్నదమ్ముల విభేదాలు
ఇంట గెలవరు గానీ... రచ్చ గెలుస్తామంటూ ప్రగల్భాలు. సొంత అన్నతోనే సయోధ్య ఉండదు గానీ... జిల్లాలోనే చక్రం తిప్పాలని యత్నిస్తున్నారు. ఇదీ గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు తీరు. ఇప్పుడు ఆయనకు సొంత అన్నే రెబల్‌గా మారుతున్నారు. అక్కడి టిక్కెట్కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తమ్ముడు చేసేవన్నీ అక్రమాలేనని బాహాటంగా చెబుతున్నారు. ఇదే విషయం పార్టీ అధినేత నుంచి జిల్లా నాయకుల వరకూ అందరికీ పనిగట్టుకుని మరీ వివరిస్తున్నారు. నిష్పాక్షికంగా అక్కడ అభివృద్ధి జరగాలంటే తనకే టిక్కెటివ్వాలంటూ కోరుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడుకి సొంత ఇంట్లోనే కుంపటి తయారైంది. తాను ఎమ్మెల్యే టిక్కెట్టు రేసులో ఉన్నట్టు ఎమ్మెల్యేకు స్వయానా అన్న, మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు ప్రకటించారు.. కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.. భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ పాలకవర్గం నియామకాన్న తమ్ముడు నియమిస్తే అతనికి వ్యతిరేకంగా అన్న కోర్టులో కేసు వేయించి ఇటీవల విజయం సాధించారు. ఆ ఉత్సాహంతోనే బహిరంగంగా తమ్ముడిని ఢీకొట్టడానికి సిద్ధమయ్యారు. టీడీపీలో చోటుచేసుకున్న ఈ పరిణామం జిల్లాలో హాట్ టాపిగ్గా మారింది. ఆది నుంచీ కుమ్ములాటలు 1982 నుంచి రాజకీయాల్లో ఉన్న కొండలరావు రెండుసార్లు ఎంపీపీగా, జిల్లా పార్టీ వైస్ ప్రెసిడెంట్‌గా, జిల్లా పార్టీ జాయింట్ సెక్రెటరీగా పనిచేశారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గజపతినగరం ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించారు. కానీ పార్టీ అతని సోదరుడైన కె.ఎ.నాయుడికి టిక్కెట్టు ఇచ్చింది. దీంతో కొండలరావు నామినేటెడ్ పోస్ట్‌కోసం తీవ్రంగా ప్రయత్నించారు. తమ్ముడు అడ్డుతగలడంతో వారి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. కనీసం భీమసింగి సుగర్‌ఫ్యాక్టరీ చైర్మన్ పదవి అయినా ఇవ్వాలని పార్టీపై ఒత్తిడి తెచ్చారు. దానిక్కూడా నాయుడు అడ్డుకట్ట వేశారు. వేరే పాలకవర్గాన్ని నియమించారు. తనను కాదని వేరొకరికి పదవి ఇవ్వడాన్ని తట్టుకోలేని కొండలరావు తాను తెరవెనుక ఉండి పాలకవర్గం నియామకంపై స్థానికుల చేత కోర్టులో కేసు వేయించారు. ఫలితంగా పాలకవర్గాన్ని నియమిస్తూ విడుదలైన జీఓను న్యాయస్థానం ఇటీవలే రద్దు చేసింది. తెరవెనుక ప్రయత్నాలు కొండపల్లి కొండలరావు తన తండ్రి దివంగత ఎంపీ కొండపల్లి పైడితల్లినాయుడు రెండు పర్యాయాలు ఎంపీగా చేసినప్పుడు, జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్నప్పుడు అన్నీ తానై చూసేవారు. తండ్రి మరణానంతరం కొండబాబు రెండు సార్లు ఎంపీపీగా చేశారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అనంతరం జరిగిన పరిణామాల్లో మరలా సొంత గూటికి చేరారు. ఆర్థిక పరంగానూ బలాన్ని సమకూర్చుకుంటున్నారు. కొండలరావుకు విజయనగరం ట్యాంక్ బండ్ రోడ్డులో హోటల్ కొండపల్లి గ్రాండ్తో పాటు ఇరవైకి పైగా లారీలు ఉన్నాయి. గంట్యాడ మండలంలో రైస్ మిల్లులను నిర్వహిస్తున్నారు. ఇక్కడ మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నడవనివ్వకుండా వారి ప్రైవేటు బస్సులనే నడిపిస్తున్నారు. పలు ప్రైవేటు విద్యా సంస్థల్లో వాటాలు ఉన్నాయి. వీటన్నిటినీ చూపించి తాను అభ్యర్థిగా సరిపోతానంటూ అధిష్టానానికి చెబుతున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి ఎ.ఎ.నాయుడు తన అన్నను పక్కన పెట్టారు. అప్పటి నుంచి కొండలరావు మండలాల్లో తనకుంటూ వర్గాలను తయారు చేసుకొని ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి పనులను సమయం వచ్చినపుడల్లా అధిష్టానానికి చేరవేస్తున్నారు. తన తమ్ముడు అవినీతిపరుడు కాబట్టి నియోజకవర్గంలో అతనికి జనం ఓట్లేసే అవకాశం లేదని చెబుతూ తాను టిక్కెట్టు పొందాలని చూస్తున్నారు. ఇంట గెలవలేని కె.ఎ.నాయుడు ఒక దశలో మంత్రి పదవికోసం ఎలా పాకులాడారన్న చర్చ ఇప్పుడు నియోజకవర్గంలో సాగుతోంది. ఎమ్మెల్యేగా పోటీచేస్తా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేస్తానని టీడీపీ సీనియర్‌నేత గజపతినరగం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు సోదరుడు కొండపల్లి కొండలరావు (కొండబాబు) శనివారం అతని కుమారుడు కొండపల్లి శ్రీనువాస్, వసాది మాజీ ఎంపీటీసీ కె.జగన్నాథం, టీడీపీ సీనియర్ నేత గుల్లిపల్లి ఆదినారాయణలతో కలిసి జామిలో విలేకరుల సమావేశం పెట్టి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులను టీడీపీ అధిష్టానం మార్చే అవకాశం ఉందని అదే జరిగితే గజపతినగరం నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీచేస్తానన్నారు. తన అభిమతాన్ని ఇప్పటికే పార్టీ అధిష్టానానికి, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు, జిల్లా ఇన్చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. -
టీడీఫీ ఎమ్మెల్యే అనిత పాదయాత్రకు సొంత పార్టీ నుంచే నిరసన
-
తెలంగాణలో టీడీపీకి ఝలక్
-
వారు కారెక్కుతారా..?
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు త్వరలోనే గులాబీ గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో వారికి ప్రభుత్వపరంగా ఎటువంటి అవకాశాలు లభిస్తాయనే దానిపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈనెల 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ.. కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో సత్తుపల్లిలో తమ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యను బరిలో నిలిపింది. ఆయన సుమారు 19వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా.. అశ్వారావుపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మెచ్చా నాగేశ్వరరావు 10వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ పోటీ చేసిన స్థానాల్లో కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెండు స్థానాల్లో విజయం సాధించడం.. వారిని టీఆర్ఎస్ గూటికి చేరిస్తే.. అసెంబ్లీలో టీడీపీకి ప్రాతినిధ్యమే ఉండ దన్న రాజకీయ వ్యూహంతో టీఆర్ఎస్ ప్రయ త్నిస్తోందని జిల్లాలో ప్రచారం హోరెత్తుతోంది. టీఆర్ఎస్ ఆహ్వానం మేరకు పార్టీలో చేరే అంశంపై టీడీపీ ఎమ్మెల్యేలు అంతర్గతంగా సమావేశమై.. చర్చించినట్లు తెలుస్తోం ది. ఉమ్మడి జిల్లాలో అసలే అంతంతమాత్రంగా ఉన్న టీడీపీలోని ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారి తే జిల్లాలో ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని ఆ పార్టీ వర్గాలే విశ్లేషిస్తున్నాయి. జిల్లా నుంచి కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో మూడు స్థానాల్లో పోటీ చేసి, రెండు స్థానాలను గెలుచుకోవడంతో పార్టీకి నూతన జవసత్వాలు వస్తాయని భావించిన కొద్దిరోజులకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఉత్కంఠ పార్టీ జిల్లా నేతల్లోనూ.. ద్వితీయ శ్రేణి నాయకుల్లోనూ నెలకొంది. ఇప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంకటవీరయ్య, మూడుసా ర్లు సత్తుపల్లిలో టీడీపీ నుంచి విజయం సాధించడంతో ఆయన ‘కారెక్కితే’ ప్రభుత్వంలో కీలక భూమిక పోషించే అవకాశం ఉంటుందని టీఆర్ఎస్ నేతలు భరోసా ఇచ్చారని, అయితే టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరూ కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. బాబును కలిసిన మెచ్చా.. ఈ నేపథ్యంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు జిల్లాలోని రాజకీయ పరిణామా లు, టీఆర్ఎస్ నుంచి అంది న ఆహ్వానం తదితర అంశాలను శనివారం అమరావతిలో చంద్ర బాబును కలిసి వివరించినట్లు తెలుస్తోంది. గతంలోనూ టీడీపీ ఎమ్మె ల్యేగా ఉన్న సండ్ర వెంకటవీరయ్య పార్టీ మారుతారని పలుమార్లు ప్రచా రం జరిగింది. అయితే జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు, ప్రభుత్వపరంగా అవకాశాలు అందిపు చ్చుకునే పరిస్థితి ఉందనే రాజకీయ వ్యూహం తో పార్టీ మారే అంశంపై టీడీపీ నేత లు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైరాలో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన రాములునాయక్ టీఆర్ఎస్లో చేరారు. అయితే ఆ పార్టీలో చేరడం వల్ల కలిగే రాజకీయ అవకాశాలపై స్పష్టత వచ్చేంత వరకు వేచి చూడాలని టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యేల ను కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఇది జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నెలాఖరులోపు పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్నా.. టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం నర్మగర్భంగానే వ్యవహరిస్తుండడం విశేషం. ఇక పార్టీ మారే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కార్యకర్తల తో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని పార్టీ శ్రేణులకు వారు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. -
టీడీపీ నేతల బరి తెగింపు!
సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్ల అరాచకాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ నేతులు రెచ్చిపోతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా మైనర్ ఇరిగేషన్ ఈఈ తిప్పేస్వామి పై శింగనమల టీడీపీ నేతలు ముంటి మడుగు కేశవరెడ్డి, రంగారెడ్డి దాడి చేశారు. తుంగభద్ర నీటి విషయంలో మేము చెప్పినా వినవా అంటూ ఇంజనీర్ తిప్పేస్వామిపై దాడికి పాల్పడ్డ టీడీపీ నేతలు. టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ల సమక్షంలో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు. టీడీపీ నేతల దౌర్జన్యానికి నిరసనగా విధులను బహిష్కరించిన ఇరిగేషన్ ఉద్యోగులు. జిల్లా చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఇంజనీర్ తిప్పేస్వామిపై దాడికి పాల్పడిన టీడీపీ నేతలను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
టీడీపీ ఎమ్మెల్యేపై కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫైర్
సాక్షి, అనంతపురం: జిల్లాలోని మొగలిచెట్లపల్లిలో రోడ్లను ధ్వంసం చేసిన టీడీపీ నేతలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్‌ను కలసి ఆయన వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరీ బీసీలపై కక్షసాధింపుతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మొగలిచెట్లపల్లి గ్రామస్తులు వైఎస్సార్సీపీలో చేరడంతోనే రోడ్లను ధ్వంసం చేయటం ఆటవిక పాలనేనని ఆయన విమర్శించారు. ఈ విషయంపై ఆధికారులు కఠినంగా వ్యవహరించకపోతే ప్రత్యక్ష ఆందోళకు దిగుతామని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. -
అశ్వారావుపేట:‘తమ్ముళ్ల’ తంటాలు !
సాక్షి, అశ్వారావుపేట: అశ్వారావుపేటలో టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు గెలుపును ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బాబు ఆదేశాలతో ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు నిత్యం ఇక్కడే తిష్ట వేస్తున్నారు. ఎలాగైనా గెలిపించాలని ఏపీ తెలుగు తమ్ముళ్లు సర్వశక్తులొడ్డుతున్నారు. అక్కడి నుంచి కోట్ల రూపాయలు అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. తాజాగా శనివారం సాయంత్రం ఏలూరు జెడ్పీ చైర్మన్ నగదుతో అశ్వారావుపేట చెక్‌పోస్టు వద్ద దొరికిన విషయం తెలిసిందే. తెలంగాణ పోలీసులు ఆయన వాహనాన్ని ఆపగా.. వెంటనే ఏపీ పోలీసులను చెక్‌పోస్టు వద్దకు పిలిపించుకుని తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న చెక్‌పోస్టు వద్దకు పొరుగు రాష్ట్రం పోలీసులు అనాలోచితంగా రావడం, కనీసం ఉద్యోగ భద్రత గురించి కూడా ఆలోచించకుండా రావడం ఏంటనే చర్చ జరుగుతోంది. అయితే జెడ్పీ చైర్మన్ ఎంట్రీ ట్రయల్ మాత్రమేనని, ఆయన ప్రయత్నం ఫలిస్తే నేరుగా హైవే మీదుగానే డబ్బు రవాణా చేయొచ్చని భావించినట్లు సమాచారం. ‘తెలుగుదేశం పార్టీ మీకు ఈ స్థానాన్నిచ్చింది.. అశ్వారావుపేట స్థానాన్ని గెలిపించి మీ విశ్వాసాన్ని చూపించండి..’ అని బాస్ ఆదేశించడంతో ఇసుక ర్యాంపులు, బాక్సైట్ గనులు, చేపల చెరువులు, కొల్లేరు ఆక్రమణలు.. ఇలా ప్రభుత్వ అండతో కోట్లకు పడగలెత్తిన ప్రబుద్ధులు అవసరమైన ఇం‘ధనాన్ని’ సమకూర్చుతున్నట్లు తెలుస్తోంది. రవాణాకు ఎన్ని మార్గాలో.. నియోజకవర్గంలో అశ్వారావుపేట, దమ్మపేట మండలం మందలపల్లి వద్ద మాత్రమే చెక్‌పోస్టులున్నాయి. అయితే అశ్వారావుపేట నుంచి ఏపీకి బదలాయించిన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల నుంచి సులభంగా డబ్బు సంచులు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు మండలాలను చేరుకోవాలంటే ఉన్న పలు మార్గాలను చెక్‌పోస్టులతో నియంత్రించాలంటే ప్రస్తుతం ఉన్న పోలీసు బలగాలు సరిపోవు. ఇదే అదనుగా ఇప్పటికే సంచులు సరిహద్దు దాటించారనే ప్రచారం జరుగుతోంది. అదేబాటలో మద్యం .. నగదు తరలించినట్లుగానే మద్యం బాటిళ్లను కూడా తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడులకు ప్రభుత్వ మద్యం రవాణా కావాలంటే ఏలూరు రైల్వే స్టేషన్ సమీపంలో మద్యం డిపో నుంచి అశ్వారావుపేట మీదుగా మాత్రమే వెళ్లాలి. అలాగే ఏలూరు నుంచి చింతలపూడి మీదుగా దమ్మపేట, అంకంపాలెం, తిరుమలకుంట, వినాయకపురం వచ్చి.. అక్కడ నుంచి ఏపీలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు వెళ్లొచ్చు. ఈ రెండు మార్గాల్లో ఎన్నికల సంఘం, పోలీసులు, ఎక్సైజ్ ఏ ఇతర శాఖాధికారులు తనిఖీ చేసినా.. ప్రభుత్వ బిల్లుతో ఆ రాష్ట్రానికి తెలంగాణ మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇదంతా అక్కడికి వెళ్లకుండా అవసరమైన మేరకు తెలంగాణలోనే ఆగుతోందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఏపీకి సరిహద్దులో ఉండడం.. అశ్వారావుపేట మండలానికి మూడు వైపులా ఏపీ ఉండడం ఈసారి బాగా కలిసొచ్చినట్లు చెప్పుకుంటున్నారు. తనిఖీలు చేస్తూనే ఉన్నాం.. రవాణా మార్గాలు అధికంగా ఉన్న అశ్వారావుపేటకు ఒక చెక్‌పోస్టు నిర్వహిస్తున్నాం. బీటీ రహదారులు రద్దీగా ఉండే చోట చెక్‌పోస్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం. సిబ్బంది, అనుమతి రావాల్సి ఉంది. ప్రత్యేక భద్రతా దళాలను విడివిడిగా వాడలేం. కేంద్ర ప్రభుత్వ దళాలు కావడంతో పూర్తిగా మన ఆధీనంలోకి తీసుకోలేం. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక పోలీసు బలగాలు రానున్నాయి. తనిఖీలు ముమ్మరం చేస్తాం. ఇప్పటికే మొబైల్ టీంల ద్వారా నిఘా ఏర్పాటుచేశాం.–ఎం.అబ్బయ్య, సీఐ, అశ్వారావుపేట -
కృష్ణానదిలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు
సాక్షి,తాడేపల్లిరూరల్: ‘మళ్లీ ఎప్పుడు అవకాశం వస్తుందో.. అందినకాడికి దోచుకుందాం.. అది ప్రమాదమైతే మనకేంటి.. ప్రభుత్వాలకు, ప్రజలకు నష్టం జరిగితే మాకేంటి.. మనం సుఖంగా ఉన్నామా లేదా..’ అనే భావనతో టీడీపీలోని ప్రజాప్రతినిధులుగా గెలిచిన వారు, వారి అనుచరులు వ్యవహరిస్తున్నారు. కృష్ణానది ఎగువ ప్రాంతంలో ఉచిత ఇసుక పేరుతో రోజూ కోట్ల రూపాయల ప్రజా సంపదను దోచుకుంటున్నారు. అంతటితో ఆగక నిషిద్ధ ప్రదేశాల్లో తవ్వకాలు నిర్వహిస్తున్నారు. అధికారులు ప్రశ్నించకపోవడంతో తవ్వకూడని ప్రదేశాల్లో కూడా తవ్వుతున్నారు. కృష్ణానది ఎగువ ప్రాంతంలో ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ నుంచి గుంటూరు జిల్లా వైపునకు 133కె.వి. విద్యుత్ లైన్ల టవర్లను కృష్ణానదిలో నిర్మించారు. ఆ టవర్లు నిర్మించిన ప్రాంతంలో ఇసుక ఎక్కువ మేట వేయడంతో అక్కడ కూడా డ్రెడ్జర్లను ఉపయోగించి భారీ స్థాయిలో ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఒక్కసారి కృష్ణానదిలో పడవకు అమర్చిన డ్రెడ్జర్ నుంచి ఇసుక తవ్వకాలు నిర్వహిస్తే 50 టన్నుల వరకు ఇసుక తీయవచ్చు. అదేపనిగా కొంతమంది పడవ యజమానులు ఇసుక క్వారీ నిర్వాహకులు నాణ్యమైన ఇసుక కోసం గప్‌చుప్‌గా టవర్లకు అతి సమీపంలో ఈ తవ్వకాలు నిర్వహిస్తున్నారు. డ్రెడ్జర్‌తో ఇసుక తోడేటప్పుడు ఒకేచోట 20 నుంచి 30 అడుగుల గొయ్యి ఏర్పడుతుంది. ఇలా టవర్ల వెంబడి ఇసుక తవ్వకాలు నిర్వహించడం వల్ల వరదలు వచ్చిన సమయంలో ఇసుక తీసిన చోట ఆ గోతుల్లో పెద్ద పెద్ద సుడిగుండాలు ఏర్పడతాయి. అలా ఏర్పడిన సమయంలో ఒక్కోసారి ఆ గొయ్యి మరింత లోతుకు వెళ్లి, విద్యుత్ టవర్ల కింద ఏర్పాటు చేసిన కాంక్రీట్ దిమ్మలను కోతలకు గురిచేయడమే కాకుండా, వాటి పునాదులు కూడా కదులుతాయి. ప్రస్తుతం కొన్ని సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన ఈ పునాదులు నీటి అడుగు భాగం నుంచి 15 నుంచి 30 అడుగుల లోపు ఏర్పాటు చేశారు. అప్పుడు కృష్ణానది ఇసుక మట్టాన్ని బట్టి వాటిని ఏర్పాటు చేసినట్లు 133కె.వి. సెక్షన్లో పనిచేసే ఓ సీనియర్ ఇంజనీర్ తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి ఇసుక తవ్వకాలను నిలిపివేయకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. టవరు కనుక కుంగితే వాటికి ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు సైతం తెగిపోయే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ఆ వైర్లు నీటిపై పడితే చాలా ప్రమాదమని, అలాంటి చోట మైనింగ్‌శాఖ అధికారులు తవ్వకాలు నిలిపివేయడం మంచిదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
టీడీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్.. ఎన్నిక చెల్లదని ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: అనంతరం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నకు హైకోర్టు షాక్ ఇచ్చింది. శాసనసభ సభ్యుడిగా ఆయన ఎన్నిక చెల్లదంటూ మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఆయనపై వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్ మోపురగుండు తిప్పేస్వామి విజయం సాధించినట్టు న్యాయస్థానం ప్రకటించింది. ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లో తప్పుడు సమాచారమిచ్చారనే ఆరోపణలపై హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తనపై ఉన్న నాలుగు క్రిమినల్ కేసుల గురించిన వివరాలు, అలాగే భార్య ప్రభుత్వ ఉద్యోగనే విషయాన్ని ఈరన్న అఫిడవిట్లో పేర్కొనపోవడాన్ని ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో ఈరన్న తప్పుడు సమాచారం ఇచ్చారని, కర్ణాటకలో తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను అఫిడవిట్లో తెలియజేయలేదని, ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనని వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసిన డాక్టర్ తిప్పేస్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న ఎన్నిక చెల్లదన్న హైకోర్టు.. ఆయన స్థానంలో డాక్టర్ తిప్పేస్వామి ఎమ్మెల్యేగా కొనసాగవచ్చునని ఆదేశాలు ఇచ్చింది. వివరాలు దాచి అఫిడవిట్..! టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నకి కర్ణాటకలో నమోదైన ఓ కేసులో శిక్ష కూడా పడింది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు కేసులు నమోదవ్వగా.. అందులో ఒక కేసులో చార్జిషీట్ దాఖలైంది. ఈరన్న భార్య కర్ణాటక అంగన్ వాడి విభాగంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ వివరాలను ఆయన తన అఫిడవిట్లో పొందుపరచలేదు. ఈ విషయాలన్నీ 2014 ఎన్నికల సమయంలోనే వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ తిప్పేస్వామి రిటర్నరింగ్ అధికారి దృష్టికి తెచ్చారు. కాని అప్పుడు పట్టించుకోలేదు. ఈ విషయమై ఆయన న్యాయపోరాటం చేసి ఇప్పుడు విజయం సాధించారు. -
ఆ రోజు పోలీస్స్టేషన్లపై దాడులు..పచ్చ నేతల ప్రకోపమే
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు గ్రామంలో సెప్టెంబర్ 23న మావోయిస్టులు మాటు వేసి కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలను దారుణంగా కాల్చి చంపారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఘటన జరిగితే సాయంత్రం వరకు లివిటిపుట్టుకు పోలీసులు వెళ్లలేకపోవడం, డుంబ్రిగుడ ఎస్సై అమ్మనరావు వివాదాస్పద వ్యవహారశైలి నేపథ్యంలో అప్పటికే వాతావరణం ఉద్రిక్తంగా మారింది. సాయంత్రం 4.30 గంటల సమయంలో కిడారి, సివేరిల మృతదేహాలను డుంబ్రిగుడ, అరకు పోలీస్స్టేషన్ల సమీపంలోకి తీసుకురావడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పింది. వందలాదిమంది పోలీస్స్టేషన్లపై దాడి చేశారు. కంప్యూటర్లు, రికార్డులు సహా ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. ఖాకీ చొక్కాలు కనిపిస్తే చాలు.. ముందూవెనుకా చూడకుండా చితక్కొట్టేశారు. ఎస్సై సురేష్ సహా మొత్తం 16మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత రెండు పోలీస్స్టేషన్లకు నిప్పు పెట్టారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యోదంతంతో భావోద్వేగానికి, ఆవేశానికి లోనైన గిరిజనులే ఇదంతా చేసి ఉంటారని అందరూ భావించారు. అయితే హత్యోదంతంపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణలో అసలు వాస్తవాలు బయటపడ్డాయి. కిడారి, సివేరిల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మావోలకు చేరవేసి టీడీపీ నేతలే వారి హత్యకు సహకరించారని బయటపడగా.. హత్యోదంతం తర్వాత పరిస్థితిని అదుపు చేయాల్సిన టీడీపీ నేతలే అమాయకులను రెచ్చగొట్టి దగ్గరుండి అరాచకాలు చేయించారని కూడా తేలింది. అరాచకం సృష్టించింది వీరే.. పోలీస్స్టేషన్లపై దాడి, ధ్వంసం, దహనం కేసుకు సంబంధించి అక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్న మొత్తం 111మందిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రధాన నిందితులు టీడీపీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులే కావడం గమనార్హం. కేసులో ఏ–2గా టీడీపీకి చెందిన అరకు జెడ్పీటీసీ కూన వనజ, ఏ–3గా ఆమె భర్త, టీడీపీ నాయకుడు కూన రమేష్, ఏ–4గా టీడీపీ ఎంపీటీసీ పి.అమ్మన్న, ఏ–5గా టీడీపీ ఎంపీటీసీ కిల్లో సాయిరాం, ఏ–6గా శెట్టి బాబూరావు, ఏ–8 గా సర్పంచ్ కిల్లో రఘునా«థ్, ఏ–9గా అరకు ఎంపీపీ శెట్టి అప్పాలు.. ఇలా 111 మంది నిందితుల్లో అత్యధిక శాతం టీడీపీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులే ఉన్నారు. మాపై పెట్రోలు పోసి కాల్చేయాలని చూశారు.. డుంబ్రిగుడ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ ‘ఆ రోజు పోలీస్‌స్టేషన్‌లో విధుల్లో ఉన్న నన్ను, సహచర కానిస్టేబుల్ భాస్కరరావును పట్టుకుని ఇష్టమొచ్చినట్లు కొట్టారు. బండబూతులు తిట్టారు. వీరిద్దరినీ చంపేయండి.. అని కేకలు వేస్తూ పెట్రోలు క్యాన్లు ఓపెన్ చేసి... పెట్రోలు చల్లారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి అతి కష్టం మీద బయటపడ్డాం. మమ్మల్ని పెట్రోలు పోసి కాల్చేందుకు ప్రయత్నించిన వాళ్ళను గుర్తుపడతాం,. ఘటనా స్థలంలో టీడీపీ జెడ్పీటీసీ సహా మొత్తం టీడీపీ నేతలే ఉన్నారు. పోలీస్స్టేషన్లకు నిప్పంటించి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి, మమ్మల్ని కాల్చి చంపాలని చూసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోండి’.. అని డుంబ్రిగుడ పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎన్.సత్యనారాయణ అదే పోలీస్‌స్టేషన్ ఎస్సైతో పాటు అరకు ఎస్సైకి ఫిర్యాదు చేశారు. అసలు దోషులు టీడీపీ నేతలని తేలడంతో కేసును తొక్కిపెట్టిన పోలీసు అధికారులు గిరిజనులే ఆవేశంలో ఇదంతా చేసి ఉంటారని తొలుత పోలీసులు కూడా భావించారు. అయితే విచారణలో ఫొటోలు, వీడియో ఫుటేజీల సాక్ష్యంగా మొత్తం టీడీపీ నేతలే దగ్గరుండి అరాచకం సృష్టించారని తేలడంతో పోలీసులు అధికారులు నివేదికను తొట్టిపెట్టేశారు. ఇప్పటివరకు అరెస్టుల్లేకుండా కేసు విచారణను నిలిపివేశారు. తాజాగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిడారి సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రావణ్ హోం మంత్రి చినరాజప్పను కలిసి పోలీస్‌స్టేషన్‌పై దాడి, దహనం కేసులో అరెస్టుల్లేకుండా చూడాలని కోరారు. బాధ్యత గల అధికార పార్టీ ప్రజాప్రతినిధులుగా పరిస్థితిని అదుపులోకి తేవాల్సిన టీడీపీ నేతలే దగ్గరుండి అరాచకం సృష్టించిన వైనం బట్టబయలు కావడంతో ప్రభుత్వం ఏమేరకు వ్యవహరిస్తుందో చూడాల్సిఉంది. -
కాటసాని అరెస్ట్.. బనగానపల్లెలో తీవ్ర ఉద్రిక్తత
-
బనగానపల్లెలో తీవ్ర ఉద్రిక్తత.. కాటసాని అరెస్ట్
సాక్షి, కర్నూల్ : జిల్లాలోని బనగానపల్లెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కాటసాని రామిరెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి బనగానపల్లెలో ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. వైఎస్సార్సీపీ నేతలను ముందస్తు అరెస్టు చేస్తున్నారు. రెండు రోజుల కిందట వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఎమ్మెల్యే సోదరులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలపై దాడి అనంతరం నేడు ఎమ్మెల్యే బీసీ జానార్థన్ రెడ్డి, కాటసాని నివాస కాలనీలో పర్యటన నిర్వహించేందుకు బీసీ వర్గీయులు ఏర్పాట్లు చేస్తోన్నారు. ఈ క్రమంలో డోన్ డీఎస్పీ ఖాదిర్ భాషా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించడమే కాకా ముందు జాగ్రత్తగా చర్యగా భారీగా పోలీసులను మోహరించారు. ఈ క్రమంలో తొలిసారి పట్టణంలోకి టియర్ గ్యాస్ వాహనాన్ని కూడా రప్పించారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియక పట్టణ ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. దాడికి దిగిన టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి సోదరులపై కాటసాని రామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికార టీడీపీ నేతలు తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేసినా.. వారిని అరెస్ట్ చేయని పోలీసులు.. తమ నేతను మాత్రం అరెస్ట్ చేయడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
ఎమ్మెల్యే బీసీ సోదరుల దౌర్జన్యం
కర్నూలు /బనగానపల్లె: ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి సోదరులు బీసీ రామ్‌నాథ్‌రెడ్డి, బీసీ రాజారెడ్డి దౌర్జన్యానికి దిగారు. వారి అనుచరుడు శంకర్‌తో పాటు పలువురితో కలిసి వైఎస్సార్సీపీ ప్రచార రథం డ్రైవర్ గోరే బాషాపై దాడి చేశారు. ఇందుకు నిరసనగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బనగానపల్లెలో శనివారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ‘రావాలి జగన్–కావాలి జగన్’ కార్యక్రమం చేపట్టారు. ఇందుకు సంబంధించిన ప్రచార రథం ఎమ్మెల్యే బీసీ ఇంటికి సమీపంలోని పాతబస్టాండ్ మీదుగా వెళ్తుండగా ఎమ్మెల్యే ఇంటి వద్ద నుంచి ఆయన సోదరులు, అనుచరులు వచ్చి తనపై దాడి చేసినట్లు డ్రైవర్ గోరే బాషా తెలిపారు. ఈ సమయంలో కాటసాని రామిరెడ్డి ఇక్కడికి సమీపంలోని 101వ బూత్‌లో ఇంటింటా నవరత్నాల గురించి వివరిస్తున్నారు. దాడి విషయం తెలిసిన వెంటనే పట్టణంలోని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పాతబస్టాండ్లోనే ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే బీసీకి, ఆయన సోదరులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు చేరుకుని ధర్నా విరమించాలని కోరారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేస్తేనే విరమిస్తామని వారు స్పష్టం చేశారు. ‘ఇక్కడికి వాహనం రాకూడదంటూ బీసీ సోదరులు నాపై విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. చొక్కా చింపారు. ప్రజాస్వామ్యం ఎక్కడుంది? నాకు ఏమైనా అయితే ఎమ్మెల్యేదే పూర్తి బాధ్యత. ఆయన కుటుంబంతో నాకు ప్రాణహాని ఉంది’ అంటూ డ్రైవర్ గోరేబాషా ఎస్ఐ సత్యనారాయణతో వాపోయారు. దాడికి పాల్పడడం తప్పేనని, పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని ఎస్ఐ సూచించారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ‘ఎమ్మెల్యే డౌన్‌డౌన్’ అంటూ ర్యాలీగా పోలీసుస్టేషన్ సమీపంలోని పెట్రోల్ బంకు వద్దకు చేరుకున్నారు. కాటసాని ఆధ్వర్యంలో రాస్తారోకో తమ వాహన డ్రైవర్‌పై దాడి జరిగిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కార్యక్రమా న్ని మధ్యలోనే ముగించి హుటాహుటిన పెట్రోల్ బంకు సర్కిల్‌కు వచ్చారు. అక్కడే కార్యకర్తలతో కలిసి రాస్తారోకో చేశారు. తరువాత పోలీసుస్టేషన్ లోపలకు వెళ్లి ఎస్ఐతో మాట్లాడారు. పట్టణంలో వారం రోజుల నుంచి రావాలి జగన్ –కావాలి జగన్ కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతోందని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండడంతో ఓర్వలేకనే ఎమ్మెల్యే బీసీ సోదరులు ప్రచారరథం డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఎమ్మెల్యే బీసీ సోదరులు బీసీ రామ్‌నాథ్‌రెడ్డి, బీసీ రాజారెడ్డితో పాటు మరికొందరిపై ఫిర్యాదు చేశారు. సీఐ లేదా డీఎస్పీ వచ్చి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటే తప్ప తాను ఇక్కడి నుంచి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. అనంతరం సీఐ సురేష్‌కుమార్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. వాహనంలో ఎదురుగా వచ్చిన ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డికి తమ పార్టీ కార్యకర్తలు జరిగిన ఘటన గురించి వివరించేందుకు యత్నించగా.. ఆయన వినకుండా గన్‌తో కాల్చివేస్తామంటూ బెదిరించారని తెలిపారు. ఈ విషయాన్ని కూడా తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఉద్రిక్త వాతావరణం ఒక దశలో సీఐ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఎమ్మెల్యే బీసీ వాహనంలో ఎదురు రాగా.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఎమ్మెల్యే వాహనాన్ని అక్కడి నుంచి పంపించి వేశారు. బీసీ సోదరులపై కఠిన చర్యలు తీసుకోవాలి డ్రైవర్ గోరేబాషాపై ఎమ్మెల్యే బీసీ సోదరులు వారి అనుచరులతో కలిసి కర్రలతో దాడి చేసి గాయపర్చడం హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా ప్రచారం చేసుకునే హక్కు ఉంది. రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఇలాంటి దాడులకు దిగుతున్నారు. ఎమ్మెల్యే బీసీ సోదరులు, వారి అనుచరులపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఈ కేసు విషయంలో పోలీసులు ఎలాంటి నిర్లక్ష్యాన్నీ చూపరాదు. – కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
అక్రమ రవాణా గుట్టు రట్టు..!
సాక్షి, గుంటూరు : పల్నాడు ప్రాంతంలో అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో నడుస్తున్న అక్రమ రవాణా గుట్టు రట్టు అయింది. ప్రకాశం జిల్లా నుంచి బిల్లులు లేకుండా తిరిగే గ్రానైట్ లారీలకు అధికార పార్టీ ఎమ్మెల్యే నేతృత్వంలో ఏర్పడిన ఓ బృందం అండగా నిలుస్తూ వారికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా రాష్ట్ర సరిహద్దు దాటిస్తున్నారు. అందుకు ప్రతిఫలంగా ఒక్కో లారీకి రూ.10వేలకు పైగా వసూలు చేస్తూ అక్రమ దందా నడుపుతున్నారు. అన్ని శాఖల అధికారులకు నెలవారీ మామూళ్లు ముట్టచెబుతూ వీటి జోలికి రాకుండా చేస్తున్నారు. గ్రానైట్ అక్రమ రవాణాపై మైనింగ్, పోలీసు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే దాఖలాలు లేకుండా పోయాయి. దీంతో బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రెండు గ్రానైట్ లారీలను పిడుగురాళ్ళ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జెడ్పీటీసీ వీరభద్రుని రామిరెడ్డి ఆధ్వర్యంలో అధికారులకు పట్టించారు. ఎటువంటి రాయల్టీ చెల్లించకుండా, జీఎస్టీ కట్టకుండా ప్రభుత్వ ఆదాయానికి భారీ స్థాయిలో గండి పడుతున్నప్పటికీ అధికార పార్టీ ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు ఎవరూ వారి జోలికి వెళ్లడం లేదు. గ్రానైట్ అక్రమ రవాణాపై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించినప్పటికీ అధికారులు మాత్రం కళ్లు తెరవలేదు. అక్రమంగా తరలిస్తున్న గ్రానైట్ లారీలను నిలిపి మైనింగ్, పోలీసు అధికారులకు ఫోన్లు చేసినా గంటన్నర వరకు ఎవరూ అక్కడకు రాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి మండలం పొందుగల వద్ద రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు ఉండటం, అధికార పార్టీ ఎమ్మెల్యేకు వరంగా మారింది. చెక్‌పోస్టు వద్ద ఉండే అధికారులను తన గుప్పెట్లో పెట్టుకుని అక్రమ దందాకు పాల్పడుతున్న విషయం బహిరంగ రహస్యమే. ఏకంగా 20 మందితో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి గ్రానైట్ లారీల నుంచి వేలల్లో డబ్బులు వసూలు చేస్తూ వాటికి ఎటువంటి బిల్లులు లేకపోయినా సరిహద్దు దాటిస్తూ దందా నడుపుతున్నారు. ఈ దందాపై అనేక సార్లు ‘సాక్షి’ కథనాలు ప్రచురించినప్పటికీ అధికారుల్లో మాత్రం చలనం లేదు. మైనింగ్, పోలీసు అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ మామూళ్ల మత్తులో జోగుతున్నారు. రోజుకు రూ.కోటి ప్రభుత్వ ఆదాయానికి గండి ప్రకాశం జిల్లా నుంచి వచ్చే గ్రానైట్ లారీలు ఎటువంటి బిల్లులు లేకుండా చిలకలూరిపేట మీదుగా నరసరావుపేట మార్గంలో అద్దంకి – నార్కెట్‌పల్లి హైవే నుంచి పొందుగల చెక్‌పోస్టు దాటి తెలంగాణ రాష్ట్రంలోకి వెళతాయి. ప్రకాశం జిల్లా నుంచి రోజుకు 30 లారీలు, సెలవు రోజుల్లో అయితే 60కు పైగా లారీలు సరిహద్దు చెక్‌పోస్టు దాటిపోతుంటాయి. వీటి ద్వారా ప్రతిరోజూ ప్రభుత్వానికి రూ.కోటికి పైగా ఆదాయం రావాల్సి ఉన్నప్పటికీ టీడీపీ నేత అక్రమ దందాతో ఖజానాకు రావాల్సిన సొమ్ము ఆయన జేబుల్లోకి మళ్లుతోంది. లారీలను పట్టిచ్చినా పట్టించుకోరా? ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి ఎటువంటి బిల్లులు లేకుండా గ్రానైట్‌తో వెళుతున్న రెండు లారీలను తుమ్మల చెరువు టోల్‌ప్లాజా, వీరాపురం వద్ద పిడుగురాళ్ళ జెడ్పీటీసీ వీరభద్రుని రామిరెడ్డి శనివారం తెల్లవారుజామున ఆపి అధికారులకు సమాచారం ఇచ్చారు. లారీలను నిలిపివేసిన గంటన్నర వరకు అటు మైనింగ్ అధికారులు గానీ, ఇటు పోలీసు అధికారులు గానీ, స్పందించని పరిస్థితి. దీంతో ఆయన ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడంతో చివరకు కానిస్టేబుళ్లు వచ్చి లారీలను పోలీసు స్టేషన్‌కు తరలించారు. జెడ్పీటీసీ రామిరెడ్డి స్వయంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లిఖిత పూర్వక ఫిర్యాదు చేసినా శనివారం రాత్రి వరకు కేసు నమోదు చేయడం గానీ, పెనాల్టీ వేయడం గానీ చేయలేదు. అదేమని ప్రశ్నిస్తే ప్రకాశం జిల్లా నుంచి బిల్లులు తెస్తున్నారని, వాటిని పరిశీలించిన తరువాత చర్యలు తీసుకుంటామంటూ అధికారులు చెబుతున్నారంటే వీరు ఏస్థాయిలో ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారో అర్ధమవుతోంది. వసూళ్ల దందా సాగుతోందిలా... గ్రానైట్ లారీలు పల్నాడు ప్రాంతం దాటి రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు ద్వారా తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్లాలంటే తమ అనుమతి తప్పనిసరి అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు హుకుం జారీ చేస్తున్నారు. లారీలో ఉన్న గ్రానైట్ టన్నేజ్ ఆధారంగా ధర నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారు. అధికార పార్టీ ముఖ్యనేత కనుసన్నల్లో 20 మంది యువకులను బృందంగా ఏర్పాటు చేసి పిడుగురాళ్ళ నుంచి పొందుగల చెక్‌పోస్టు వరకు వారిని అక్కడక్కడ ఉంచి, ఎక్కడా గ్రానైట్ లారీలకు ఇబ్బంది కలుగకుండా చూసుకుంటారు. అధికారులు పొరపాటున ఆపితే వెంటనే ముఖ్యనేత నుంచి ఫోన్ చేయిస్తారు. వీరికి డబ్బు చెల్లించకుండా వెళ్లే లారీలను మాత్రం మైనింగ్ అధికారులకు సమాచారం ఇచ్చి వారిపై కేసులు నమోదు చేయిస్తారు. అక్రమ తరలింపులు సరికాదు అవినీతి, అక్రమ దందా ఎక్కడ జరిగితే అక్కడే ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఉంటాడు. అక్రమ మైనిం గ్, ఇసుక మాఫియా, గంజాయి అక్రమ రవాణా, పేకాటక్లబ్బులు, గ్రానైట్ అక్రమ రవాణా...ఇలా ఎందులోనైనా ఆయన ప్రమేయం లేకుండా ఏమీ జరగవనే విషయం అందరికి తెలిసిందే. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పల్నాడు ప్రాంతాన్ని దోచేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ వందల కోట్ల అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అధికారులు సైతం అక్రమ రవాణాకు సహకరించడం సరైన పద్ధతి కాదు. నేను లారీలను అడ్డుకుని అధికారులకు సమాచారం ఇచ్చినా సిబ్బంది లేరంటూ గంటన్నర వరకు ఎవరూ ఆవైపునకు రాలేదు. –జెడ్పీటీసీ వీరభద్రుని రామిరెడ్డి -
టీడీపీ ఎమ్మెల్యేకి పరాజయం..
ఎమ్మిగనూరు: అధికార పార్టీలో భేదాభిప్రాయాలు భగ్గుమన్నాయి. అసంతృప్తులు రచ్చకెక్కాయి. ఆధిపత్యం కోసం కోర్టు మెట్లు ఎక్కేటట్లు చేశాయి. ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ పాలకవర్గం ఏర్పాటులో ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డికి పరాజయం ఎదురైంది. సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అధికార పార్టీ ప్రధాన నాయకుడు కాసులకు కక్కుర్తి పడి నామినేటెడ్ పోస్టులు అమ్ముకుంటున్నారంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఏం జరిగిందంటే.. ఎమ్మిగనూరు మార్కెట్ యార్డుకు పాలకవర్గాన్ని నియమిస్తూ గత నెల 17న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రధాన ప్రజాప్రతినిధికి రూ. 30లక్షలు ముడుపులు ముడితేనే ముహూర్తం ఖరారంటూ ఓ రిటైర్డ్ డీఈ ద్వారా పాలకవర్గంతో రాయబేరాలు జరిగాయి. చివరకు గురువారం ఉదయం 11.10 గంటలకు ప్రమాణ స్వీకారం ముహూర్తం ఖరారు చేశారు. ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో గత నాలుగేళ్లలో వివిధ మండలాల్లోని పార్టీ నాయకులు దూరమవుతూ వచ్చారు. తాజాగా మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంపికతో మరింత దుమారం రేగింది. ఈ వ్యవహారంపై జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ జె. పుష్పావతి, ఆమె భర్త నాగరాజుగౌడ్ తమ వర్గీయులతో హైకోర్టులో పిటిషన్ వేయించారు. పాలకవర్గం ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో అసంబద్ధంగా ఉందని, ప్రమాణ స్వీకారం చేయించరాదంటూ హైకోర్టు బుధవారం స్టే ఉత్తర్వులు ఇచ్చింది. పరువు పోతుందని.. హైకోర్టు నుంచి వచ్చిన స్టే ఉత్తర్వులను గురువారం ఉదయం 7.30 గంటలకు కలెక్టర్ సత్యనారాయణ, మార్కెటింగ్ శాఖ ఏడీకి పిటిషనర్ తరఫు లాయర్ అందజేశారు. మార్కెటింగ్ శాఖ నుంచి ఎమ్మిగనూరు మార్కెట్ యార్డుకు స్టే ఉత్తర్వులు మెయిల్ ద్వారా అందాయి. బుధవారం అర్ధరాత్రే స్టే ఉత్తర్వులు రావడం తెలుసుకున్న అధికార పార్టీ నేతలు గురువారం ఉదయం 8.30 గంటలకే చైర్మన్‌గా మాధవరావ్ దేశాయి బాధ్యతలు తీసుకుంటున్నట్లు సెక్రటరీ ఆర్. జయలక్ష్మి ద్వారా చెప్పించారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మిగనూరుకు చేరుకున్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి జిల్లా అధికారుల ద్వారా స్టే విషయం తెలియడంతో నొచ్చుకున్నట్లు తెలిసింది. ‘‘పార్టీలో ఉన్న క్యాడర్‌ను సమన్వయం చేసే సామర్థ్యం కూడా లేకపోతే ఎలా? టీడీపీ నేతలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేలు తీసుకురావడం ఏమిటి? పద్ధతులు మార్చుకోరా?’’ అంటూ స్థానిక ప్రధాన ప్రజాప్రతినిధిపై డిప్యూటీ సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు పార్టీ నాయకుడొకరు తెలిపారు. కార్యక్రమం జరగకపోతే నియోజకవర్గంలో తన పరువు పోతుందని, ఇలా పాల్గొని అలా వచ్చేద్దామంటూ ప్రజాప్రతినిధి బతిమిలాడడంతో కేఈ అయిష్టంగానే హాజరైనట్లు తెలుస్తోంది. అయితే మార్కెట్ యార్డు ప్రమాణ స్వీకార కార్యక్రమంటూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగాలు చేయడం కూడా కోర్టు ధిక్కారం కిందే వస్తుందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. అభాసుపాలు.. ఏదిఏమైనా కార్యక్రమం అభాసు పాలు కావడంతో ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ముభావంగా కనిపించారు. ఇంత ఖర్చు పెట్టి సాధించుకున్న చైర్మన్ గిరి ప్రమాణ స్వీకారం జరగకపోవడంతో మాధవరావ్ దేశాయ్ కూడా తీవ్ర కలత చెందారు. పైగా మాధవరావ్ దేశాయ్‌కు సభలో ఒక్క మాట కూడా మాట్లాడే అవకాశం కల్పించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు అవమానభారంతో రగిలిపోయారు. ఇదిలావుండగా.. స్టే కాపీ రాకముందే తాను చార్జ్ తీసుకున్నట్లు మాధవరావ్ మీడియాకు తెలిపారు. మార్కెటింగ్ శాఖ నుంచి జిల్లా స్థాయి, స్థానిక అధికారులే కాకుండా కనీసం అటెండర్లు కూడా కార్యక్రమానికి హాజరు కాలేదు. అధికార పార్టీలో విభేదాలకు ప్రమాణ స్వీకారోత్సవం అభాసుపాలు కావడమే నిదర్శమని పలువురు వ్యాఖ్యానించారు. అసంబద్ధ ప్రసంగం.. అధికార పార్టీ నేతలు స్టే తెస్తే ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మాత్రం.. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని, వారు ఎమ్మిగనూరులో అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ అసంబద్ధంగా ప్రసంగించారు. దీంతో సభలో ఆ పార్టీ నేతలే తెల్లముఖం వేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి మాట్లాడుతూ.. పాలకవర్గం ప్రమాణ స్వీకారం తాత్కాలికంగా బ్రేక్ పడిందని, లోపాలను సరి చేసి కొత్త జీవో తీసుకువస్తామని తెలిపారు. డిప్యూటీ సీఎం కేఈ మాట్లాడుతూ.. పార్టీలో అందర్ని సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యే ముందుకు పోవాలని, ఈ సమస్యను ఆయనే పరిష్కరించుకోగలరంటూ చలోక్తి విసిరారు. -
బుచ్చయ్యపై తమ్ముళ్ల గుస్సా
సాక్షి, రాజమహేంద్రవరం: ‘‘ఇళ్ల లబ్ధిదారులు ఎంపిక, ఫ్లాట్ల కేటాయింపు పారదర్శకంగా చేశాం. ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు. ఎవరైనా లంచాలు అడిగితే 1100కి ఫిర్యాదు చేయండి’’ అంటూ ఈ నెల 26వ తేదీన ఫ్లాట్ల కేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు పలువురు కార్పొరేటర్లలో ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి. అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, లబ్ధిదారుల వాటా, బ్యాంకు రుణం సహాయంతో జీ ప్లస్ 3 అపార్ట్మెంట్లు నిర్మించి ఇచ్చేందుకు పథకం రూపాందిం చారు. జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవ రం నగరపాలక సంస్థలు, పిఠాపురం, అమలాపురం, పెద్దాపురం, తుని, రామచంద్రపు రం, మండపేట, సామర్లకోట మున్సిపాలిటీల్లో 2015లో దాదాపు 21 వేల ఇళ్లను మంజూరు చేశారు. ఇందులో రాజమహేం ద్రవరం నగరపాలక సంస్థ వాటాగా 4,200 ఇళ్లు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణ అనంతరం 2016 మే నెలలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఒక్కొక్కచోట ఒక్కోలా ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో సుమారు 16 వేల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. నగరంలో ప్రభుత్వ భూమి లేకపోవడంతో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పరిధిలోని బొమ్మూరు, తొర్రేడు, శాటిలైట్‌సిటీ ప్రాంతాల్లో 4,200 ఇళ్లను నిర్మిస్తున్నారు. ఫలితంగా స్థలం మా పరిధిలోనిదంటూ రూరల్ ఎమ్మెల్యే ఇళ్లలో వాటా తీసుకున్నారు. 2,400 ఇళ్లు నగరపాలక సంస్థలోని డివిజన్లకు, మిగతా 1,800 రూరల్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ఇచ్చేలా నిర్ణయించారు. ఆ మేరకు 50 డివిజన్లలో డివిజన్‌కు 35 మంది చొప్పున లబ్ధిదారులను లాటరీ విధానంలో ఎంపిక చేశారు. ప్రజా ప్రతినిధులకు వాటాలు.. డివిజన్‌కు 35 ఇళ్ల చొప్పున 1,750 ఇళ్లకు లాటరీ తీయగా, రాజమహేంద్రవరం రూరల్‌లో ఏ విధంగా లబ్ధిదారులు ఎంపిక జరిగిందీ ఎవరికీ తెలియదు. లాటరీ అనంతరం అప్పటి కమిషనర్, ప్రజా ప్రతినిధులు ప్రతి కార్పొరేటర్‌కు తలా రెండు ఇళ్ల చొప్పున ఇచ్చారు. ఇవిగాక అధికార టీడీపీ కార్పొరేటర్లలో కొంతమందికి ఎంపీ మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్యే గోరంట్ల, నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఐదు ఇళ్లు చొప్పున ఇచ్చారు. వాటి లబ్ధిదారులను ఆయా కార్పొరేటర్లు ఎంపిక చేశారు. ఈ ఇళ్లను పలువురు రూ.50 వేల చొప్పున తీసుకుని ఇవ్వగా, మరికొందరు ఏమీ ఆశించకుండానే అర్హులైన వారిని సిఫార్సు చేశారు. నగదు వసూలు చేసే విషయమై పలుమార్లు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అంతర్గత సమావేశాల్లో ప్రస్తావించారని సమాచారం. అయినా పట్టించుకోని పలువురు యథావిధిగా తమపని తాము చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత ఫ్లాట్ల కేటాయింపు పత్రాల పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారులు ముందు ఎమ్మెల్యే గోరంట్ల లంచాలు ఇవ్వొద్దంటూ బహిరంగ ప్రకటన చేయడంతో పలువురు కార్పొరేటర్లు గరంగరంగా ఉన్నారు. ఆ వ్యవహారాల సంగతేంటీ..? ఎమ్మెల్యే గోరంట్ల తమను ఉద్దేశించి తమ డివిజన్ ప్రజల ముందు మాట్లాడడంతో కార్పొరేటర్లు తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టవద్దని కూడా చెప్పవచ్చుగా అంటూ సమావేశంలోనే పలువురు పక్కవారి వద్ద వ్యాఖ్యానించారు. అక్కడ ఖర్చు పెట్టిన డబ్బు ఎలా తిరిగి రాబట్టాలో సెలవిస్తే వింటామని సమావేశంలో కూర్చున్న పలువురు కార్పొరేటర్ల భర్తలు వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు హయాంలో ఆవరోడ్డులో కట్టిన ఇళ్లను గత ఏడాది పంపిణీ చేశారు. అక్కడ అనర్హులంటూ దాదాపు 600 మందికి మొండిచేయి చూపారు. ఆయా ఫ్లాట్లను గోరంట్ల బుచ్చయ్యచౌదరి అనుంగు అనుచరులు, కార్పొరేషన్లో పదవులు ఉన్నవారు గ్రౌండ్ ఫ్లోర్ రూ.6 లక్షలు, మొదటి అంతస్తు రూ.4 లక్షలు, రెండో అంతస్తు రూ.2.75 లక్షల చొప్పున విక్రయించుకున్నారని, మరి వాటి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. పోలీసు స్టేషన్లలో ఇన్స్పెక్టర్ల నియామకాలకు డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. ఇసుక ర్యాంపులు గుప్పెట్లో పెట్టుకుని రోజూ రూ.లక్షలు దండుకుంటున్న వైనంపై కూడా మాట్లాడాలని అధికార పార్టీ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. తాము చేస్తే ఒప్పు.. ఇతరులు చేస్తే తప్పు అన్న చందంగా కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడడంపై ప్రస్తుతం టీడీపీ కార్పొరేటర్లలో చర్చ జరుగుతోంది. ఇది ఎటు దారితీస్తుందో వేచి చూడాలి. మరో వైపు గోరంట్ల వ్యాఖ్యలు విన్న ఇతరులు.. ‘ఆవు చేలో మేస్తుంటే.. దూడ గట్టున మేస్తుందా?’ అంటూ చమత్కరించడం కొసమెరుపు. -
భూ బాగోతంలోఇద్దరు ఎమ్మెల్యేలకూ పాత్ర
ద్వారకాతిరుమల: కొందరు ప్రజాప్రతినిధులు భూ బకాసురుల పాత్రలను పోషిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పోరంబోకు భూములు కనుమరుగవుతున్నాయి. పేద ప్రజల నివాసాలకు ఇవ్వాల్సిన స్థలాలను వారు దళారుల ద్వారా దర్జాగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. నిస్వార్ధంగా ప్రజలకు సేవలందించాల్సిన ప్రజాప్రతినిధులే ఇలా అక్రమాలకు పాల్పడటం పట్ల ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ద్వారకాతిరుమలలోని వసంత్‌నగర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ పోరంబోకు భూముల కబ్జాలు, క్రయ విక్రయాలపై సాక్షి ప్రచురిస్తున్న వరుస కథనాలతో అక్రమార్కులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఈ భూబాగోతంలో ఉంది చిన్నచితకా ప్రజాప్రతినిధులు అయితే ఈ విషయం అంత హాట్ టాపిక్ అయ్యేది కాదు. సాక్షాత్తు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు ఇందులో పాత్ర ఉండటం సంచలనంగా మారింది. ఇందులో ఒక ఎమ్మెల్యే 25 సెంట్ల భూమిని తన అనుయాయుల ద్వారా విక్రయాలు సాగించి సొమ్ములు దండుకోగా... మరో ఎమ్మెల్యే తన కుమారుడి రియల్ ఎస్టేట్ వెంచర్లో అరెకరం భూమిని కలిపి దర్జాగా అమ్ముకుంటున్నారు. తేలుకుట్టిన దొంగల్లా వసంత్‌నగర్ కాలనీలోని ఆర్ఎస్ నంబర్ 1/2 లో మొత్తం 10.20 ఎకరాల భూమి ఉండగా అందులో 2.50 ఎకరాల భూమికి సంబంధించి తమకు డి ఫారం పట్టాలు ఇచ్చారని వర్దినీడి బసవరాజు అతని కుమార్తె ఎర్రంశెట్టి కరుణలు చెబుతున్నారు. అయితే ఇందులో అవకతవకలను గుర్తించిన నేతలు ఈ భూమిని ఆన్లైన్ కాకుండా అడ్డుపడ్డారు. అప్పుడే ఎమ్మెల్యే పాత్ర రంగప్రవేశం చేసింది. అధికారులను ఒప్పించి ఎలాగోలా ఆన్లైన్ చేయించారు. ఈ సెటిల్మెంట్ చేసినందుకు ఆ ఎమ్మెల్యేకు 25 సెంట్ల భూమిని కట్టబెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు నమ్మకంగా ఉన్న కొందరు నేతలు, దళారుల ద్వారా ఆ భూమిని విక్రయించినట్లు స్పష్టమౌతోంది. 25 సెంట్ల భూమిని పలు భాగాలుగా విభజించి రూ.16.80 లక్షల వరకు అమ్మకాలు జరిపినట్లు సమాచారం. కొనుగోలుదారులకు స్థలంలో ఉన్న వారి పేరున ఎంజాయ్మెంట్, పంచాయతీ మంచినీటి కుళాయిల ఏర్పాటు ఇలా అన్ని అనుమతులు ఇప్పిస్తామని దళారులు హామీలు గుప్పించడంతో, అది ప్రభుత్వ భూమి అయినప్పటికీ పలువురు వాటిని కొన్నారు. ఇప్పుడు ‘సాక్షి’ ఆ బాగో తాలను బట్టబయలు చేయడంతో అంతా తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారు. ఇదిలా ఉంటే మరో ఎమ్మెల్యే కుమారుడు వసంత్‌నగర్ కాలనీకి ఆనుకుని ఉన్న ఆర్ఎస్ నంబర్ 11లోని అరెకరం ప్రభుత్వ పోరంబోకు భూమిని తన రియల్ వెంచర్లో కలుపుకున్నారు. ఈ విషయాలన్నీ తెలిసినా.. అప్పటి తహసీల్దారు అన్ని విధాలా ఆక్రమిత దారులకు సహకరించి ఆ భూమిని వారికి కట్టబెట్టినట్లు తెలిస్తోంది. మణి పాత్ర ఎంత ద్వారకాతిరుమలలో ఒక తహసీల్దారు పనిచేసిన సమయంలో ఎక్కువగా అవకతవకలు జరిగినట్లు స్పష్టమౌతోంది. 2016 నుంచి 2017 వరకు ఎంహెచ్. మణి ఇక్కడ తహసీల్దారుగా పనిచేశారు. ఆ సమయంలో అనర్హుల వద్ద ఉన్న దొంగ పట్టాలను ఒక ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఆన్లైన్ చేసినట్లు తెలు స్తోంది. అలాగే అరెకరం ప్రభుత్వ భూమిని ఒక ఎమ్మెల్యే కుమారుడికి కట్టబెట్టినట్లు స్పష్టమౌతోంది. ఆయన ఇంకెంత మందికి ఇలా ఆన్లైన్లో మార్పులు చేశారన్నది తెలియాల్సి ఉంది. అడుగు ముందుకెయ్యలేని అధికారులు: ఈ భూ బాగోతంలో ఎమ్మెల్యేల పాత్ర ఉండటం వల్లే అధికారులు ముందుకు అడుగు వేయలేక పోతున్నారన్నది బహిరంగ సత్యం. సాదా సీదా టీడీపీ నేతలకే బెదిరిపోతున్న అధికారులు ఏకంగా ఎమ్మెల్యేలను ఎలా ధిక్కరిస్తారు..? ఒక వేళ ధిక్కరిస్తే వనజాక్షికి పట్టిన గతే తమకు పడుతుందన్న భయం వారిలో కలుగదా..? ఇలా సవాలక్ష భయాలతో అధికారులు ముందుకు అడుగేయలేక పోతున్నారు. దీంతో పాలకులకు అడ్డూ అదుపు లేక రెచ్చిపోతున్నారు. ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరిగింది వసంత్‌నగర్ కాలనీలో ప్రభుత్వ భూమి క్రయ, విక్రయాలు గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కనుసన్నల్లో జరిగాయన్న విషయం అందరికీ తెలుసు. అయితే అధికార పార్టీ వారితో ఎందుకని ఎవరికి వారు పట్టించుకోవడం లేదు. పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేలు సైతం ఇక్కడకొచ్చి భూములను ఆక్రమిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా అమ్మి, సొమ్ము చేసుకుంటూనే నీతిపరులమని నేతలు చెప్పడం విడ్డూరంగా ఉంది. ఎమ్మెల్యేలకు భయపడి అధికారులు కూడా ఈ భూ బాగోతాన్ని కప్పేస్తున్నారు. పేద ప్రజలకు ఇవ్వడానికి లేని భూమి, అమ్ముకోవడానికి ఎలా వచ్చిందో. – తలారి వెంకట్రావు, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి వసంత్‌నగర్‌లోని భూవివాదానికి సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించాల్సి ఉంది. వారి ఆదేశానుసారం అవసరమైతే ఎంజాయ్మెంట్ సర్వే చేస్తాం. సర్వేకు సంబంధించి ఇప్పటికే సర్వేయర్, ఆర్ఐ, వీఆర్వోలకు నోటీసులిచ్చాను. అలాగే పాత రికార్డులను చూస్తున్నాం. – టీడీఎల్ సుజాత, తహసీల్దారు, ద్వారకాతిరుమల -
టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా ఏపీ పోలీసులను మంగళవారం హైదరాబాద్ హైకోర్టు ఆదేశించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బోడె ప్రసాద్‌పై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసు నమోదుచేయకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బోడే ప్రసాద్‌పై కేసు నమోదు చేయకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, అతనిపై కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆమె ఆగస్టులో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో హోం శాఖ ముఖ్య కార్యదర్శి, విజయవాడ పోలీస్ కమిషనర్, పెనమలూరు ఎస్హెచ్ఓలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలు తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తూ ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని రోజా తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా నేడు రోజా పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం బోడె ప్రసాద్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా ఏపీ పోలీసులను ఆదేశించింది. ఈ పిటిషన్ విచారణలో రోజా తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. -
అక్రమ కేసులకు భయపడం
దెందులూరు: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్రమ కేసులు పెడితే భయపడేది లేదని దీటుగా ఎదుర్కొంటామని వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్ స్పష్టం చేశారు. శనివారం ఏలూరు పార్టీ క్యాంపు కార్యాలయంలో దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ కొఠారు అబ్బయ్యచౌదరి ఆధ్వర్యంలో నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు ఆళ్ల నాని, కోటగిరిని కలిశారు. ఇటీవల పెదవేగి మండలం సూర్యారావుపేటలో జరిగిన సంఘటనపై వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నాని, కోటగిరి మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా ఇసుక, గ్రావెల్ దోపిడీ జరుగుతుందన్నారు. అధికారులు సైతం ప్రభుత్వ సంపద కళ్లెదుటే దోచుకుపోతున్నా పట్టనట్టు వ్యవహరించటం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తే భయపడకుండా ఎదుర్కొంటామన్నారు. ఎమ్మెల్సీ నాని, కోటగిరిని కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమ్మ శివరామకృష్ణ, రాష్ట్ర యువజన విభాగం జనరల్ సెక్రటరీ కామిరెడ్డి నాని, జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు ఎం సూర్యనారాయణ, ఏలూరు పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండేటి గంగాధరరావు బాబు, జిల్లా కమిటీ సభ్యులు యలమర్తి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి తోట పద్మారావు, దెందులూరు నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు తొత్తడి వేదకుమారి, దెందులూరు నియోజకవర్గ బీసీ విభాగం అ«ధ్యక్షులు మేకా లక్ష్మణరావు, తాతా సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ ఏలూరు రూరల్ మండల అధ్యక్షులు తేరా ఆనంద్, మొండెం ఆనంద్, మొరవనేని భాస్కరరావు, పర్వతనేని నాగయ్య ఉన్నారు. -
‘రామానాయుడు బెదిరించారు’
సాక్షి, పాలకొల్లు: ఇరిగేషన్ పనుల్లో 20 శాతం కమీషన్ ఇవ్వలేదని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తనను బెదిరించి తనపై తప్పుడు కేసు పెట్టించారని కాంట్రాక్టర్ పృథ్విరాజ్ ఆరోపించారు. ఎమ్మెల్యే రామానాయుడు నుంచి తనకు రక్షణ కల్పించాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఏలూరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రవిప్రకాష్‌ను కలిసి ఎమ్మెల్యే రామానాయుడు, సీఐ కృష్ణకుమార్‌పై పృథ్విరాజ్ ఫిర్యాదు చేశారు. కమీషన్ ఇవ్వటంలేదని తన బిల్లులు నిలుపుదల చేయడమే కాకుండా రాష్ట్రంలో ఎక్కడా కాంట్రాక్టు పనులు చేయకుండా చేస్తానని బెదిరించడంతో పాటు తనపై తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించారు. ఆరు నెలలుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని, ఇప్పటికైనా తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు పాలకొల్లు పోలీస్ స్టేషన్‌కు తనను పిలిపించి సీఐ కృష్ణకుమార్ తీవ్రంగా బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్ధరాత్రి తన తండ్రికి కూడా ఫోన్లు చేసి హెచ్చరించారని వాపోయారు. తనను బెరిరించిన ఎమ్మెల్యే రామానాయుడు, తప్పుడు కేసులు నమోదు చేసిన సీఐ కృష్ణకుమార్ పై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. నరసాపురం డీఎస్పీని కలవాలని, ఈ వ్యవహారంపై విచారణ జరిపి న్యాయం చేస్తానని ఎస్పీ హామీయిచ్చినట్టు పృథ్విరాజ్ తెలిపారు. -
కమీషన్ కోసం టీడీపీ ఎమ్మెల్యే వేదిస్తున్నారు
-
పన్ను ఎగవేత కేసులో టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా
-
ఆంజనేయులు చరిత్ర అందరికీ తెలుసు
-
టీడీపీ ఎమ్మెల్యే.. స్మగ్లర్లకు డాన్
సాక్షి, గుంటూరు: వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదించారని, ఆయన స్మగ్లర్లకే డాన్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నేత బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. హత్యా రాజకీయాలు, శవరాజకీయాలు చేసే చరిత్ర ఆంజనేయులుదేనని మండిపడ్డారు. వ్యాపారంలో సొంత భాగస్వామిని హత్య చేయించిన వ్యక్తి ఆంజనేయులు అని అన్నారు. భాగస్వామి భార్యను బెదిరించి.. వారి ఆస్తులన్నీ బలవంతంగా ఆంనేయులు లాక్కున్నారని అన్నారు. ఆంజనేయులు వేలకోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై హత్య కేసు బనాయించడానికి ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని, ఈ మేరకు పోలీసులపై ఆయన తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. పోలీసులు పక్షపాతం లేకుండా ఈ కేసును విచారిస్తే వాస్తవం ఏమిటో తెలుస్తుందన్నారు. ఎమ్మెల్యే ఆంజనేయులు ముగ్గురిని చంపినట్టు వినుకొండలో ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వినుకొండలో వైఎస్సార్సీపీ గెలుస్తుందని అన్నారు. -
పరీక్ష లేకుండానే పాస్
సాక్షి, అనంతపురం : అనంతపురంలోని రవాణాశాఖ అధికారుల నిర్వాకం కారణంగా ఒక్కో వాహనదారుడి నుంచి అధికారులు రూ. 50 వేలు అదనంగా వసూలు చేస్తున్నారు. పరీక్షలు నిర్వహించకుండానే లెర్నింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. గడిచిన మూడు నెలల కాలంగా 30 వేలకు పైగా అక్రమ లైసెన్స్‌లు జారీ చేసినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేల కనుసన్నుల్లో ఎల్ఎల్ఆర్ మేళాను నిర్వహిస్తున్నారు. అధికారుల అవినీతి కారణంగా ఇప్పటి వరకు 15 లక్షల రూపాయాలు చేతులు మారినట్లు సమాచారం. రవాణాశాఖ ఇష్టారాజ్యం వల్ల రోడ్డు భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. అనర్హులకు లైసెన్స్ మంజూరు చేయడం మూలంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవాణా శాఖ అధికారుల అవినీతి తారాస్థాయికి పెరుగుతున్నా దీనిపై స్పందించడానికి జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషన్ సుందర్ నిరాకరించడం గమనార్హం. -
‘అడ్డగోలుగా దోచుకుంటున్నారు’
సాక్షి, గుంటూరు : జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దోచుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసినా యథేచ్చగా దోపిడీ చేస్తున్నారని తెలిపారు. మరో టీడీపీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ ఇసుక మాఫియాతో కోట్లు దోచుకుంటున్నారని, ధూళిపాళ్ల నరేంద్ర నీరు చెట్టు పథకంతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. మిగిలిన ఎమ్మెల్యేలు పంచభూతాలను వదలకుండా తినేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో ఎక్కడ చూసిన అవినీతి కంపు కొడుతుందన్నారు. గుంటూరు జిల్లాలో శాంతి భద్రతలే లేవన్నారు. రాష్ట్రంలో 400 మండలాలు కరువుతో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు రైతాంగం సంక్షోభంలో ఉంటే సీఎం చంద్రబాబు మాత్రం రూ.1600 కోట్లతో రెయిన్ గన్స్‌తో దోపిడీకి సిద్దమయ్యారని ఆరోపించారు. ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు మాత్రం గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. లక్షలాది ఎకరాల్లో సాగు తగ్గి, రైతులు పంట నష్టపోయినా ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. రైతాంగానికి తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇస్తున్నారని తెలిపారు. ఈ అరాచకాలు, దోపిడీ, అవినీతిపై తమ పోరాటం కోనసాగుతుందని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వంచనకు నిరసనగా రేపు గుంటూరులో వంచనపై గర్జన నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష ఉంటుదని, ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ మోసాలను ఎండగడతామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ నేతలంతా హాజరవుతారని పేర్కొన్నారు. -
పోలీసు అధికారులపై టీడీపీ ఎమ్మెల్యేల పెత్తనం
-
అడిగినంత ఇచ్చుకో.. అడ్డగోలుగా చేసుకో
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలోని ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యవహారం అటు అధికారులకు, ఇటు కాంట్రాక్టర్లకు ఇబ్బందికరంగా మారింది. కాంట్రాక్టు పనుల్లో తన కమీషన్‌తో పాటు అధికారుల వాటా తనకే ఇవ్వాలంటూ కాంట్రాక్టర్లకు తెగేసి చెబుతున్నారు. తనకు కమీషన్లు ఇవ్వకపోతే పనులు మొదలుపెట్టనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఎవరైనా టెండర్లో పనులు దక్కించుకుంటే.. సదరు కాంట్రాక్టర్ తనను కలిసేదాకా పనులు మొదలుపెట్టకుండా చూడాలని అధికారులకు సైతం హుకుం జారీచేస్తున్నారు. ఫలితంగా అటు కాంట్రాక్టర్లు, ఇటు అధికారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. సదరు ఎమ్మెల్యేకు దగ్గరగా ఉన్న కాంట్రాక్టర్లు మాత్రం కమీషన్ ఇచ్చామనే ధైర్యంతో పనులు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. వారిని అధికారులు సైతం ఏమీ అనలేని పరిస్థితి. టెండర్ దక్కించుకున్న ‘సాధారణ’ కాంట్రాక్టర్లు పనులు మొదలుపెడదామనుకుంటే.. ఎమ్మెల్యేను కలిసిన తర్వాతే ముందుకు సాగాలని నేరుగా అధికారులే చెబుతుండడంతో ఏమి చేయాలో వారికి పాలుపోవడం లేదు. సదరు ఎమ్మెల్యేను కలిస్తే.. అధికారుల వాటా కూడా కలిపి మొత్తం తనకే ఇవ్వాలని తేల్చిచెబుతుండడంతో కాంట్రాక్టర్లు నోరెళ్లబెడుతున్నారు. ఒకవేళ ఇచ్చేందుకు నిరాకరిస్తే నెలల తరబడి పనులు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని కాంట్రాక్టర్లతో పాటు అధికారులు వాపోతున్నారు. కక్కలేక..మింగలేక.. వాస్తవానికి ప్రభుత్వ శాఖలో ఏ పని చేయాలన్నా అధికారులకు అంతో ఇంతో కమీషన్ ఇచ్చుకోవడం రివాజుగా మారింది. ఇక అధికార పార్టీ నేతలకు కమీషన్ల వ్యవహారానికి వస్తే స్థానిక నేత వ్యవహారశైలిని బట్టి ఉంటుంది. అయితే, జిల్లాలో మాత్రం ఒక అధికారపార్టీ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటోంది. ఏ పనికి టెండర్ పిలిచినా.. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఆయన్ను కలిసిన తర్వాతే ముందుకు వెళ్లే పరిస్థితి. గతంలో కర్నూలు సర్వజన ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులు ఆయన్ను కలిసి.. ఆయన చెప్పినట్టుగా ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతే ముందుకు వెళ్లారు. రోడ్డు పనులతో పాటు వివిధ బిల్డింగ్‌ల నిర్మాణం విషయంలోనూ ఇదే పరిస్థితి. మునిసిపాలిటీలో చేపడుతున్న కాంట్రాక్టు పనులు కూడా ఇతరులకు ఎవ్వరికీ దక్కకుండా చేస్తున్నారు. ఒకవేళ ఇతరులకు దక్కినా.. సబ్ కాంట్రాక్టు కింద తాము చెప్పిన వారికే ఇవ్వాలని అంటున్నారని తెలుస్తోంది. పైగా సదరు సబ్ కాంట్రాక్టర్ల నుంచి ముందుగానే కమీషన్లు దండుకుంటున్నట్టు సమాచారం. వారు ఎటువంటి నాణ్యత లేకుండా పనిచేసినప్పటికీ అధికారులు మాత్రం చూసీచూడనట్టు వ్యవహరించాల్సి వస్తోంది. అటువైపు వెళితే ఒట్టు! అధికార పార్టీ ఎమ్మెల్యే సిఫారసుతో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కనీస నాణ్యత లేకుండానే పనులు కానిస్తున్నారు. అయినప్పటికీ అధికారులు కనీసం అటువైపుగా చూడడం లేదు. వాస్తవానికి అధికారులు పనులు జరుగుతున్న ప్రాంతంలోకి వెళ్లి.. టెండర్ నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నాయా, లేదా అనేది చూడాలి. ఒకవేళ నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే నోటీసు జారీచేయాలి. అయితే, సదరు ఎమ్మెల్యే నియోజకవర్గంలో జరుగుతున్న ఏ పనులనూ అధికారులు పరిశీలించే సాహసం చేయడం లేదు. -
కాపులను మభ్యపెడుతూ డ్రామాలాడుతున్నారు
-
గురజాల టీడీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు
-
ఇసుక మాఫియా : టీడీపీ ఎమ్మెల్యేపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై మైనింగ్ ఆరోపణల వ్యవహారంలో హైకోర్టు తీవ్ర వాఖ్యలు చేసింది. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ విషయమై బుధవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. మైనింగ్ చేస్తూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడం విషయమై హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనింగ్ పన్నులను ఎందుకు వసూలు చేయలేదో చెప్పాలని కోర్టు అధికారులను ప్రశ్నించింది. ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లిందో కాగ్ ద్వారా దర్యాప్తు జరిపిస్తామని స్పష్టం చేసింది. మైనింగ్ వ్యవహారంపై శ్రీనివాసరావుకు నోటీసులు కూడా జారీ చేసింది. సీబీఐ, కాగ్, కేంద్ర మైనింగ్ శాఖలను సుమోటోగా ప్రతివాదులుగా చేర్చింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పిటిషన్‌కు కోర్టు అనుమతి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరా యించిన టీడీపీ ఎమ్మెల్యేలు 12 మందిని ప్రతివాదులుగా చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్లో చేరి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పై సకాలంలో శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి చర్యలు తీసుకోలేదని, వారిరువురు విధులు నిర్వర్తించకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ జి.మల్లేశ్వరరావు దాఖలు చేసిన వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు 12 మందిని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా పరిగణిస్తూ శాసనసభ కార్యదర్శి బులిటెన్ జారీ చేయడాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది లేవనెత్తారు. తలసానిపై వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషనర్ మిగిలిన 12 మంది గురించి వాదిస్తే తాము ఎలా స్పందిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. దాంతో టీఆర్ఎస్లో చేరిన మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలందరినీ ప్రతివాదులుగా పేర్కొంటూ మరో అదనపు పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతినివ్వాలని న్యాయవాది కోరారు. గవర్నర్, స్పీకర్లను ప్రతివాదులుగా చేయడంతో హైకోర్టు రిజిస్ట్రీ వ్యాజ్యానికి నెంబర్ కేటాయించలేదు. ఈ అంశంపైనే ధర్మాసనం విచారణ జరుపుతోంది. -
అశ్లీల నృత్యాలు; ఆ హోటల్ టీడీపీ ఎమ్మెల్యేదే..!
సాక్షి, విజయవాడ: అధికార పార్టీకి చెందిన కొల్లూరు రామకృష్ణను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. విజయవాడలోని 47 డివిజన్‌కు అధ్యక్షుడిగా ఉన్న రామకృష్ణకు ముజ్రా పార్టీ నిర్వహణలో ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. భవానీపురంలో గల ఆలీవ్ ట్రీ హోటల్లో మహిళలతో అసభ్య నృత్యాలు (ముజ్రా పార్టీ) నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాడి చేసిన సంగతి తెలిసిందే. టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే బినామీ ఈ హోటల్ నిర్వహిస్తున్నాడని సమాచారం. పక్కా సమాచారంతో హోటల్‌పై దాడి చేసి ముజ్రా పార్టీలో పాల్గొన్న 53 మందిని అరెస్ట్ చేశామని జాయింట్ సీపీ రానా తెలిపారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ. 5 వేల నుంచి 10 వేల చొప్పున రూ. 5 లక్షల వరకు నిర్వాహకులు ఈ పార్టీ కోసం వసూలు చేశారని వెల్లడించారు. పోలీసుల దాడిలో దొరికిన ఐదుగురు అమ్మాయిలను వాసవ్య మహిళా మండలి సంరక్షణలో పెట్టామని చెప్పారు. ఇకపై నగరంలో ఇలాంటి పార్టీలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా, పట్టుబడిన వారిలో పలువురు ప్రముఖులు ఉన్నట్టు తెలుస్తోంది. నూతన కమిషనర్ ద్వారకా తిరుమలరావు చార్జి తీసుకున్న రోజునే ముజ్రా పార్టీ బాగోతం బయటపడడం గమనార్హం. -
నువ్వు ఐఏఎస్ అయితే నేను.. ఐపీఎస్!
టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు.. అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేవి రెండే రెండు విషయాలు.. మొదటిది విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నిందితుడైతే.. రెండోది మద్యం సిండికేట్ ముఠా నాయకుడు..కానీ వీటితో పాటు ఆయనకు ఇంకో అర్హత కూడా ఉందట!.. దాని గురించి స్వయంగా ఆ సారే ఈ మధ్య చెప్పుకున్నారు.. అదేంటంటే.. ఆయన ఐపీఎస్ అట?!..అదేంటి.. ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ కదా.. మరి అప్పట్లో రాష్ట్రాన్నే కుదిపేసిన ఓ సంచలన హత్య కేసులో మూడో ముద్దాయి వెలగపూడి ఐపీఎస్ కావడమేమిటి? అసలు దాన్ని ఎలా.. ఎప్పుడు చేశారు??.. ఈ అదనపు అర్హతను ఇన్నాళ్లూ ఎందుకు దాచేశారు???.. అన్న ప్రశ్నలు మీ మెదళ్లను తొలిచేస్తున్నాయి కదూ.. అంత మల్లగుల్లాలు పడకండి.. ఎందుకంటే ఆయనకు అంత సీన్ లేదు.. ఆయన చెప్పుకున్న ఐపీఎస్ వేరు.. పోలీసు అధికారులయ్యేందుకు చేసే ఐపీఎస్ వేరు.. ఐపీఎస్ అంటే ఇండియన్ పొలిటికల్ సర్వీస్ అని.. ఆయనగారు కొత్త భాష్యం చెప్పుకున్నారు. ఇలా ఐపీఎస్ అని ఆయన తన అనుచరుల వద్దో, సామాన్యుల వద్దో బిల్డప్ ఇచ్చారనుకుంటే పోనీలే అనుకోవచ్చు.. కానీ ఆయనగారు ఏకంగా జిల్లా పరిపాలనాధికారి వద్దే... ‘నువ్వు ఐఏఎస్ అయితే.. నేను ఐపీఎస్ అంటూ’.. తన అహాన్ని,, ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూశారు. తీరా సదరు అధికారి నేరుగా సీఎంకే ఫిర్యాదు చేయడంతో కడకు ఒకింత తగ్గారు.. కానీ ఆయనపై అధికారుల ఆగ్రహం మాత్రం నేటికీ చల్లారలేదు. తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారశైలి రచ్చ అయిన నేపథ్యంలో.. ఇటీవల చోటుచేసుకున్న ‘వెలగపూడి ఐపీఎస్’ ఎపిసోడ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : మంత్రి గంటా శ్రీనివాసరావు ఆనందపురం తహసీల్దార్‌ను ఇంటికి పిలిపించుకుని బండ బూతులు తిట్టిన వ్యవహారం రచ్చకెక్కిన నేపథ్యంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ‘ఐపీఎస్’ ఎపిసోడ్ ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. తనకు తెలయకుండా మండలంలోని భూములను టిడ్కోకు కట్టబెట్టిన విషయమై మంత్రి గంటా తహసీల్దార్‌ను దూషించిన వైనంపై ‘ఏం వేషాలేస్తున్నావా’ అనే శీర్షికన బుధవారం సాక్షిలో వచ్చిన కథనం రెవెన్యూ వర్గాల్లో మనోస్థైర్యం నింపింది. ఈ నేపథ్యంలో ఇటీవల టీడీపీకే చెందిన ఎమ్మెల్యే వెలగపూడి.. ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణ విషయంలో ఏకంగా జిల్లా ఉన్నతాధికారులనే నోటికొచ్చినట్లు ఆడిపోసుకున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో జేసీ నివాస్ ఇలానే ఎగిరిపోయాడంటూ బెదిరింపు ఎమ్మెల్యే ఒత్తిడికి లొంగని ఓ ఉన్నతాధికారి ధీటుగా సమాధానమిచ్చారు. ‘మిగిలిన వారి కంటే మీకే మూడు రెట్లు ఎక్కువిచ్చాం... కావాలంటే లిస్టు చూసుకోండి.. అని సూచించారు. ఆయన సమాధానంతో సంతృప్తి చెందని వెలగపూడి ఇంకా చాలా దరఖాస్తులు ఉన్నాయి కదాఅని అడగ్గా.. అవన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి.. అందుకే కొన్నింటిని తిరస్కరించాం, మరికొన్నింటిని పెండింగ్‌లో పెట్టాం.. అని ఆ అధికారి చెప్పుకొచ్చారు. కానీ ఎమ్మెల్యే ఇవేమీ పట్టించుకోకుండా ‘నువ్వు.. నువ్వు’.. అని ఏకవచనంతో సంభోదిస్తూ తీవ్రంగా మాట్లాడసాగారు. దీనికి సదరు అధికారి అభ్యంతరం చెబుతూ ‘సర్.. నేను ఐఏఎస్‌ను.. కాస్త, గౌరవంగా మాట్లాడండి’.. అని అన్నారు. దీంతో వెలగపూడి వ్యంగ్యంగా ‘నువ్వు ఐఏఎస్ అయితే నేను ఐపీఎస్.. ఇండియన్ పోలిటికల్ సర్వీస్.. అయితే ఏంటంట అని ఇష్టారాజ్యంగా మాట్లాడారు. అక్కడితో ఆగకుండా ‘ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణ విషయంలోనే గతంలో ఐఏఎస్ అధికారి అయిన జాయింట్ కలెక్టర్ నివాస్ కూడా ఇలానే రూల్స్ మాట్లాడాడు. మేం తలుచుకోగానే దెబ్బకు ఎగిరిపోయాడు.. నువ్వు కూడా అంతే’.. అని ఆ అధికారినుద్దేశించి వ్యాఖ్యానించారు. సదరు అధికారి కూడా అదే స్థాయిలో స్పందిస్తూ ‘నేను ఎక్కడికైనా వెళ్లేందుకు రెడీ.. అందుకు సిద్ధపడే ఈ ఉద్యోగంలోకి వచ్చా.. నిబంధనలకు విరుద్ధంగా పట్టాలు ఇచ్చే ప్రసక్తే లేదు.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి’.. అని స్పష్టం చేశారు. అందరి కంటే ఎక్కువే ఇచ్చినా.. జీవో నెంబర్ 388 ప్రకారం నగరంలో మూడో విడత క్రమబద్ధీకరణ భూ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని గత నెల 21న ఏయూ గ్రౌండ్స్‌లో అట్టహాసంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా లాంఛనంగా కొంతమందికి.. మొత్తంగా 8271 మందికి పట్టాలు పంపిణీ చేశారు. జీవీఎంసీ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి మొత్తం 48,137 దరఖాస్తులు రాగా.. 8271 దరఖాస్తులకు అధికారులు ఆమోదముద్ర వేశారు. ఆ మేరకు భీమిలి నియోజకవర్గంలో 340 దరఖాస్తులు, పెందుర్తిలో 876, గాజువాకలో 1045, విశాఖ పశ్చిమలో 1346, విశాఖ ఉత్తరలో 1049, విశాఖ దక్షిణలో 2 దరఖాస్తులకు ఆమోదముద్ర వేసిన అధికారులు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి మాత్రం అత్యధికంగా 3613 దరఖాస్తులకు ఆమోదముద్ర వేశారు. ఈ లెక్కన మిగిలిన ఎమ్మెల్యేల కంటే తూర్పు నియోజకవర్గంలోనే ఎక్కువ పట్టాలు అందజేశారు. కానీ దాంతోనే ఎమ్మెల్యే వెలగపూడి సంతృప్తి చెందలేదు. తన నియోజకవర్గం నుంచి 14,450 దరఖాస్తులు వస్తే 3,613 దరఖాస్తులకే ఓకే అంటే ఎలా?.. అని పట్టాల పంపిణీ కార్యక్రమానికి రెండురోజుల ముందు జిల్లా ఉన్నతాధికారులను నిలదీశారు. అన్ని దరఖాస్తులనూ ఆమోదించాలని ఒత్తిడి చేశారు. ఇంకా రగులుతున్న రెవెన్యూ వర్గాలు.. దీంతో అహం దెబ్బతిన్న వెలగపూడి రెండురోజుల పాటు పట్టాల పంపిణీ కార్యక్షకమ ఏర్పాట్లలో పాల్గొనలేదు. ఓ దశలో తోటి ఎమ్మెల్యేలను కూడగట్టి ఆ సభకు గైర్హాజరై సీఎంకు అధికారుల పట్ల తన అసమ్మతి తెలియజేయాలని భావించారు. అయితే ఇతర ఎమ్మెల్యేలు తోడు రాకపోవడం.. సరిగ్గా అదే సమయంలో జిల్లా ఉన్నతాధికారులు నేరుగా సీఎంకు ఫిర్యాదు చేసి.. ఆయన తీరును వివరించడంతో దిగివచ్చిన వెలగపూడి ఆ సభకు హాజరయ్యాడని అంటున్నారు. ఆ సభ చివరలో ముఖ్యమంత్రి స్వయంగా వెలగపూడి చేతుల మీదుగా జిల్లా అధికారులకు సన్మానం చేయించిన వైనం వెనుక ఇంత ఎపిసోడ్ నడిచిందని తెలిసింది. అయితే అప్పటికి ఆ వ్యవహారం సద్దుమణిగినా ఇప్పటికీ వెలగపూడి ‘ఐపీఎస్’ వ్యాఖ్యలు రెవెన్యూ వర్గాల్లో కాక పుట్టిస్తున్నాయని అంటున్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై మహిళల మండిపాటు
-
టీడీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం
సాక్షి, పి.గన్నవరం : తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట మండలం చిరతపూడిలో సమస్యలపై ఎమ్మెల్యే పూలపర్తి నారాయణమూర్తిని స్థానిక మహిళలు నిలదీశారు. పదేళ్లుగా రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సదుపాయాలు లేవన్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన మహిళలపై ఎమ్మెల్యే ఎదురుదాడికి దిగారు. మీరు ఓట్లేస్తేనే గెలిచామా అంటూ నోరుపారేసుకున్నారు. దీంతో సమస్యలు చెప్తే ఎదురుదాడికి దిగడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నించారు. ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తాం మమ్మల్ని ఎవరూ ప్రశ్నించకూడదన్న రీతిలో అధికార టీడీపీ నేతలు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం
-
‘పవన్ పోటీచేసినా నేనే గెలుస్తా’
సాక్షి, ఏలూరు/పశ్చిమ గోదావరి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో పవన్ పోటీ చేసినా.. తానే నెగ్గి తీరతానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘జనసేనాని పవన్ ఏలూరు నుంచి పోటీ చేసినా ఫర్వాలేదు. ఖచ్ఛితంగా నేనే గెలుస్తా. టీడీపీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పవన్ తన విలువ కోల్పోతున్నారు’ అని బుజ్జి కామెంట్లు చేశారు. కామినేని రాకతో.. ఇదిలా ఉంటే మంగళవారం జరిగిన దిగ్గజ నటుడు స్వర్గీయ ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఓ కలయిక చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే బడేటి బుజ్జి(ఎస్వీఆర్కు బుజ్జి బంధువు) ఆధ్వర్యంలో ఎస్పీ రంగారావు శత జయంతి వేడుకలు జరగ్గా.. ఆ కార్యక్రమానికి బీజేపీ నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ హాజయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడితో కలిసి ఎస్వీఆర్ విగ్రహావిష్కరణలో కామినేని పాల్గొన్నారు. దీంతో తీవ్ర దుమారం చెలరేగింది. అయితే ఎస్వీఆర్ కుమారుడు కామినేనికి క్లాస్మేట్ కావటం, పైగా తాను ప్రత్యేకంగా ఆహ్వానించటంతోనే ఈ కార్యక్రమానికి కామినేని హాజరైనట్లు ఎమ్మెల్యే బుజ్జి చెబుతున్నారు. -
‘పవన్ మీరు సినిమాల్లో మాత్రమే నటించాలి’
సాక్షి, విశాఖపట్నం: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై పెందుర్తి టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ... సీఎం చంద్రబాబుపై పవన్ అసత్యా ప్రచారాలు చేయిస్తున్నారని విమర్శించారు. ‘మీరు రాజకీయాల్లోకి కొత్తగా ఏమీ రాలేదు. మీ అన్న పార్టీలో పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీని మీరు కాంగ్రెస్ పార్టీకి ఎంతకు అమ్మేశారో అందరికీ తెలుసు’ అని అన్నారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా బీజేపీని మీరు ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నించారు. పవన్ కేవలం బీజేపీ స్క్రిప్ట్‌నే ఫాలో అవుతున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం విషయంలో పవన్ ప్రజలను రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు. మూడు నెలలుగా విశాఖలోనే ఉండి ఎందుకు రైల్వే జోన్ గురించి పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. మీరు సినిమాలో మాత్రమే నటించాలి కానీ రాజకీయాల్లో కాదని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో కేవలం వాస్తవాలు మాత్రమే మాట్లాడాలని అన్నారు. కేంద్రంపై విమర్శలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి వీరంగం..!
సాక్షి, రాజంపేట: వైఎస్సార్ జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అనుచరుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. రాజంపేటలో ఆర్టీసీ బస్సు ముందు తన వాహనాన్ని టీడీపీ ఎమ్మెల్యే మేడా అనుచరుడు మనోహర్‌రెడ్డి అడ్డంగా నిలిపేవాడు. దీంతో బస్సు డ్రైవర్ హారన్ కొట్టాడు. తన వాహనానికే హరన్ కొడతావా అంటూ మనోహర్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోతూ.. ఆర్టీసీ బస్సు డ్రైవర్ మల్లికార్జున్‌పై దాడికి దిగాడు. రక్తం వచ్చేలా డ్రైవర్‌ను కొట్టాడు. దీంతో బస్సు డ్రైవర్ ఆస్పత్రిలో చేరాడు. దాడి సమయంలో నిందితుడు 84శాతం అల్కాహల్ సేవించి ఉన్నాడని రాజంపేట అర్బన్ పోలీసులు తెలిపారు. -
త్వరలోనే ఎమ్మెల్యే బీవీ చిట్టా విప్పుతా
కర్నూలు(అర్బన్): రాజకీయ కుట్రలో భాగంగానే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తనను అరెస్ట్ చేయించి జైలుకు పంపించారని, త్వరలోనే ఆయన చిట్టా విప్పుతానని గోనెగండ్ల మాజీ సర్పంచ్ టి. నాగేష్‌నాయుడు అన్నారు. సోమవారం స్థానిక కార్యాలయంలో వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుభాష్ చంద్రబోస్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గోనెగండ్ల సొసైటీలో ఎన్నో అక్రమాలు జరిగాయని, ఇప్పటికీ రూ.40 లక్షల అవినీతికి సంబంధించి ఆదోని న్యాయస్థానంలో కేసులు నడుస్తున్నాయన్నారు. రాజకీయంగా ఎదుగుతున్న వాల్మీకులను అణగదొక్కేందుకు ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నారని వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 65 వేల మంది వాల్మీకుల ఓట్లు ఉన్నాయని.. ఎన్నికల్లో తమ సత్తా చూపించాల్సి వస్తుందన్నారు. సమావేశంలో వీఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడూరు గిడ్డయ్య, నాయకులు బోయ గోపీ, వీవీ నాయుడు, శివ, గోనెగండ్ల నాయకులు రంగస్వామి, మురళీనాయుడు, గుడికల్లు రంగన్న, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
పల్లె రఘునాథరెడ్డికు స్వల్ప గాయాలు
-
టీడీపీ బైక్ ర్యాలీలో అపశ్రుతి
సాక్షి, అనంతపురం: టీడీపీ బైక్ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. ర్యాలీలో ఏపీ మాజీ మంత్రి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి నడుపుతున్న బైక్‌ను మరో బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో పల్లె రఘునాథరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించినట్లు సమాచారం. జిల్లాలోని నల్లమడ మండలం దొన్నికోట వద్ద ఈ ప్రమాదం జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేపట్టిన సైకిల్ ర్యాలీలోనూ అపశ్రుతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాలోని యలమందల వద్ద సైకిల్ తొక్కుతూ కోడెల కిందపడిపోగా.. ఆయన తలకు స్పల్పగాయమైంది. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన సైకిల్ యాత్రను పూర్తిచేశారు.