- అవినీతి-అక్రమార్జనలో కూటమిలో కుమ్ములాట
- అడ్డుకోకుండా.. పంచాయితీలకు దిగజారిన సీఎం చంద్రబాబు
- ఊరురా బెల్ట్‌షాపులు
- ఉచితమంటూనే కూటమి సర్కార్ దోపిడీ
- పవన్.. అసలు ప్రభుత్వంలో ఉన్నారా?
- అధికార ఎమ్మెల్యేలే రేషన్ బియ్యం స్కాంలో భాగం
- ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, అవినీతి, దోపిడీలపైనే కూటమి నేతలంతా దృష్టి పెడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాజా పరిణామాలపై శనివారం సాయంత్రం గుంటూరు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సంపద సృష్టించడం కంటే సంపద సృష్టించుకుంటాం.. అంతా మేమే దోచుకుంటాం’’ అన్నట్లుంది వాళ్ల తీరు ఉందని సెటైర్లు వేశారు. ఈ క్రమంలో పవన్ కాకినాడ పోర్టు పర్యటనపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులు వచ్చాయి. మద్యం షాపులకు లాటరీలు పెట్టారు. కానీ, మద్యం షాపులు దక్కించుకున్న వారిని బెదిరించి వాటాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీ లేదు. కూటమి నేతలు ఇసుకను దోచుకుంటున్నారు. చివరకు బూడిద కోసం కూడా కొట్టుకుంటున్నారు.
ఆది నారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి బూడిద కోసం కొట్టుకుంటున్నారు. అక్రమార్జన కోసం టీడీపీ నేతలు వెంప్లరాడుతున్నారు. అవినీతి చేయడానికి కూటమి నేతలు పోటీ పడుతున్నారు. నియోజకవర్గాల్లో ఎల్‌ఎం (లోకల్ ఎమ్మెల్యే) ట్యాక్స్ నడుస్తోంది. ప్రతీదానికి లోకల్‌ఎమ్మెల్యే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఎవరైనా వ్యాపారం చేయాలన్నా.. ఏ పని జరగాలన్నా ట్యాక్స్ కట్టాల్సిందే. చివరకు.. కూటమి నేతలు అరాచకాలు చేస్తుంటే.. చంద్రబాబు పంచాయితీ పెట్టే స్థాయికి దిగజారారు. ఇన్నీ పాపాలు చేసే మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు.
పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టు పర్యటనపై అంబటి సెటైర్లు సంధించారు. ఆల్రెడీ కలెక్టర్ పట్టుకున్న రేషన్ బియ్యంను చూడడానికి పవన్ సాహసోపేతంగా వెళ్లారు. తీరా ఒడ్డుకు వచ్చాక విచిత్రమైన ఆరోపణలు చేశారు. రెండు నెలల నుంచి ఆయన అక్కడికి వెళ్తానంటే అధికారులు అడ్డుపడుతున్నారంట. అధికారులు సహకరించలేదు అంట. ఆయన అసలు ప్రభుత్వంలో ఉన్నారో లేదంటే ప్రశ్నించే పక్షంలో ఉన్నారో అర్థం కావడం లేదు. కాకినాడ పోర్టుకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఎగుమతులు అవుతాయి. అందులో బియ్యం కూడా ఉంటుంది. అయితే ఆ బియ్యంలో పీడీఎస్ రైస్ కలిపి పంపించడమే స్కాం ఎప్పటి నుంచో నడుస్తోంది. గత ప్రభుత్వాలు కూడా కట్టడి చేసే ప్రయత్నాలు జరిగాయి.
మరి అరికడతామని చెప్పిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. ఇప్పుడు ఆ బాధ్యత తీసుకుంటారా?. బియ్యం అక్రమ రవాణా అడ్డుకునే చిత్తశుద్ధి లేదు. ఇక.. అధికారులు తనను అడ్డుకుంటున్నారని పవన్ అంటున్నారు. బహుశా.. చంద్రబాబు, లోకేష్ చెబితేనే అధికారులు అలా చేశారేమో అనే అనుమానం కలుగుతోంది. అసలు డిప్యూటీ సీఎంకు అంతలా ప్రాధాన్యం ఇవ్వొద్దనే అధికారులు అలా ప్రవర్తించారేమో. ఇక్కడ ఇంకో విషయం.. కూటమి నేతల సహకారంతోనే ఈ స్కాం నడుస్తోంది. ఎమ్మెల్యే కొండ బాబుకు మామూళ్ళు లేకుండానే ఇదంతా జరుగుతుందా?. బియ్యం అక్రమ రవాణాకు బాధ్యత వహిస్తూ నాదెండ్ల మనోహర్, ఆ తర్వాత పవన్ ఇద్దరూ రాజీనామా చేయాలి. అంతేకాదు..
.. పవన్‌కు తన డైలాగ్‌కు తగ్గట్లే.. లెక్కలేనంత తిక్క ఉంది. అందుకే.. కాకినాడ పోర్టు నుంచి ఆర్డీఎక్స్ రావొచ్చని, కసబ్ లాంటోళ్లు వస్తారని, హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉన్నారా ఇంకా ప్రశ్నించే ధోరణిలో ఉన్నారా?. పవన్ కల్యాణ్ పెద్ద అసమర్థుడు అని అర్థం అవుతుంది అని అంబటి చురకలంటించారు.
Comments
Please login to add a commentAdd a comment