atrocities
-
Vidadala Rajini: కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా..?
-
అరాచకాలకు అడ్డాగా ఏపీ: మేరుగ నాగార్జున
సాక్షి,తాడేపల్లి:కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అరాచకాలకు అడ్డాగా మారిందని,దగ్గరుండి మరీ కూటమి నేతలే దాడులు చేయిస్తున్నారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.ఆదివారం(సెప్టెంబర్29) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మేరుగ మాట్లాడారు.‘పోలీసులు కూడా దాడి చేసే వారికే సలాం కొడుతున్నారు.ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది.కూటమి ఎమ్మెల్యేలు రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారు.ఇళ్లకు వెళ్లి జనాల చొక్కాలు పట్టుకుని బయటకు లాగుతున్నారు.అడ్డగోలుగా దాడులు చేస్తున్నారు.చంద్రబాబు వైఖరి వల్లే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి.ఈ దాడులను ఆపాలని ఏనాడూ చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు?జగన్ సీఎంగా ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలు తప్పుదారిలో నడిస్తే చర్యలు తీసుకున్నారు.చంద్రబాబు హయాంలో ప్రత్యర్థులు కదిలినా మెదిలినా కేసులు పెడుతున్నారు. మక్కెలు విరగ్గొడతానంటూ ఏకంగా సీఎం చంద్రబాబే మాట్లాడటం దేనికి సంకేతం?మూడు నెలల్లోనే ఇంతటి దారుణాలకు ఎవరు బాధ్యులు?ఎమ్మెల్యేలు దాడులు చేయటానికి చంద్రబాబు లైసెన్సులు ఇచ్చేశారు.తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి వ్యవహారశైలికి నిరసనగా సొంత పార్టీ వారే ధర్నాలు చేశారు.తనను వ్యతిరేకించే వారిని ఇంటికొచ్చి కొడతానంటున్న కొలికిపూడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?కాకినాడలో ప్రొఫెసర్ మీద ఎమ్మెల్యే నానాజీ దాడి చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?ఇంకో ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఏకంగా అంబేద్కర్ ఫ్లెక్సీనే తొలిగిస్తే ఏం చర్యలు తీసుకున్నారు?అఖిలప్రియ దాడులకు పాల్పడితే ఏం చేశారు?కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి వాల్మీకి కులస్తులపై దాడి చేస్తే ఏం చర్యలు తీసుకున్నారు?ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అరాచకాలపై ఏం చర్యలు తీసుకున్నారు?ఇన్ని దారుణాలు మీ ఎమ్మెల్యేలే చేస్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నట్టు?ఇవే పరిస్థితులు కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం’అని మేరుగ హెచ్చరించారు. -
తల్లిదండ్రులే.. టెక్ గురువులు!
ఆఫ్‌లైన్‌లో బాలికలు/మహిళలపై జరుగుతున్న దారుణాలను మించి ఆన్లైన్లో చోటుచేసుకుంటున్నాయి అంటున్నారు సైబర్ నిపుణులు. ప్రతి పది మంది బాలికల్లో ఒకరు సైబర్ బెదిరింపులకు గురవుతున్నారని, మహిళలను లక్ష్యంగా చేసుకొని నేరాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. తల్లిదండ్రులే ఆన్లైన్ గురువులుగా మారి బాలికలకు అవగాహన కల్పించాల్సిన అవసరం నేటి రోజుల్లో ఎంతో ఉంది.సైబర్ నేరస్థులు ప్రధానంగా బాలికలు, మహిళలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. నేరస్థులు బాలికలు, మహిళల చిరునామాలు, ఆర్థిక వివరాలు, వ్యక్తిగత సంభాషణల వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తుంటారు. బాధితులు తమ డిమాండ్లను ఒప్పుకోకపోతే బాలికలు/మహిళల వ్యక్తిగత డేటాను బయటపెడతామని, అందరిలో పరువు పోతుందని నేరస్థులు బెదిరిస్తుంటారు. దీంతో ఎవరికీ చెప్పుకోలేక బాలికలు/మహిళలు నేరస్థులకు డబ్బులు పంపడం లేదా ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాలకు రావడం జరుగుతుంటుంది. చాలా మంది బాధిత మహిళలు ఇలాంటి విషయాలు బయటకు చెప్పుకోవడానికి, పోలీసులకు కంపై్టంట్ చేయడానికి ఇష్టపడరు. ఇలాంటప్పుడు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు పెద్దలు కృషి చేయాల్సిన అవసరం ఉంది.టెక్నాలజీని పేరెంట్స్ నేర్చుకోవాలి... – పిల్లలను టెక్నాలజీ వాడకుండా అడ్డుపడకూడదు. పాజిటివ్ కోణంలోనే పిల్లలకు టెక్నాలజీని నేర్పాలి. పిల్లలతో పాటు పెద్దలూ టెక్నాలజీ జర్నీ చేయాలి. – పిల్లలకు ఫోన్ ఇవ్వడంతో పాటు ఒక హద్దును సృష్టించాలి. అదే సమయంలో వయసును బట్టి ఫిల్టరింగ్ సాఫ్ట్‌వేర్స్‌ను వాడాలి.– క్రీడల్లో కొన్ని బౌండరీస్ ఎలా ఉంటాయో టెక్నాలజీ బౌండరీస్‌ను పెద్దలే గీయాలి.– టెక్ఫోన్ ఫ్రీ జోన్స్ నిబంధనలను అమలు చేయాలి. (బెడ్రూమ్, డైనింగ్ ప్లేస్.. వంటి చోట్ల ఫోన్ వాడకూడదు..)– YAPPY (యువర్ అడ్రస్, యువర్ ఫుల్‌నేమ్, యువర్ పాస్‌పోర్ట్...ఇలా పూర్తి వివరాలు) ఆన్లైన్లో ఎవరికీ ఇవ్వకూడదని చెప్పాలి.– ఫొటోలు/డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకునే ముందు నిజనిర్ధారణ చేసుకోవాలి. డౌన్‌లోడ్స్‌కి వెళ్లకూడదు ∙పనిష్మెంట్గా లేదా రివార్డ్గానూ ఫోన్/ట్యాబ్.. వంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పిల్లలకు ఇవ్వకూడదు.– స్క్రీన్ టైమ్– గ్రీన్ టైమ్‌కి తేడా తెలియాలి. వర్చువల్ గేమ్స్, గ్రౌండ్ గేమ్స్‌కి కండిషన్స్ పెట్టాలి ∙వయసుకు తగ్గట్టుగా ఆడే ఆన్లైన్ గేమ్స్‌కి కొన్ని కంట్రోల్స్ ఉంటాయి. వాటిని పాటించేలా జాగ్రత్తపడాలి.మనో ధైర్యాన్ని పెంచుకోవాలి..ఏవరైనా వ్యక్తితో ఇబ్బంది ఉంటే ఆ వ్యక్తి అకౌంట్‌ని బ్లాక్ చేయాలి ∙మనోధైర్యాన్ని పోగొట్టుకోకుండా ఏవైనా వీడియోలు, ఫొటోలు, చాటింగ్ సంభాషణ ... వంటివి ఉంటే డిలీట్ చేయకుండా బ్యాకప్ స్టోరీజే చేసుకోవాలి. పెద్దలతో మాట్లాడి https://cybercrime.gov.inలో కంప్లైంట్ చేయాలి.బొట్టు బిళ్లతో కవర్ చేయాలి...∙ఏదైనా వెబ్సైట్ https:// (ప్యాడ్‌లాక్ సింబల్ ఉన్న సైట్‌నే ఓపెన్ చేయాలి. పాస్వర్డ్ ఎప్పుడూ (క్యాపిటల్, స్మాల్ లెటర్స్, నంబర్స్) ఉండే విధంగా సెట్ చేసుకోవాలి ∙ఫోన్ ఇతర గ్యాడ్జెట్స్ లొకేషన్ ఎప్పుడూ ఆఫ్ చేసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆన్ చేసి, మళ్లీ ఆఫ్ మోడ్‌లో ఉంచాలి ∙వెబ్ కెమరాను బొట్టు బిళ్లతో కవర్ చేసుకోవడం మేలు. ఫోన్లోనూ వెబ్ క్యామ్ అనేబుల్ క్యాప్షన్‌లో ఉంచాలి ∙తెలిసిన పరిచయాలు కాంటాక్ట్స్‌లో ఉండాలి. పరిచయస్తులతో మాత్రమే సంభాషణ జరపాలి ∙యాప్స్ కూడా ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ చేయాలి. ఆసక్తిగా కనిపించిన లింక్స్ అన్నీ ఓపెన్ చేయద్దు.భయపడకూడదు..మోసగాళ్లు అందుబాటులో ఉన్న మీ డేటాను, గత సోషల్‌మీడియా పోస్టింగ్‌లను, సోషల్ ఇంజనీరింగ్ నుండి సమాచారాన్ని ΄÷ంది, ఆన్లైన్ షేమింగ్ లేదా దోపిడీకి దారి తీస్తుంటారు. వాయిస్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా సంభాషణ జరిపి ఆ సమాచారంతో బెదిరింపులకు పాల్పడేవారి సంఖ్య పెరిగింది. మోసగాళ్లు మీలా నటిస్తూ నకిలీ ఖాతాను సృష్టిస్తారు. మీ పరిచయాల నుండి డబ్బు అడగడం, ద్వేషపూరిత మెసేజ్‌లు చేయచ్చు. ఆన్లైన్లో ఎవరి నుంచైనా అనైతిక ప్రవర్తనతో ఇబ్బంది పడితే భయపడకుండా కుటుంబ సభ్యులతో, టెక్నాలజీ మిత్రులతో పంచుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి. స్కూళ్లలోనూ టీచర్లు టెక్నాలజీ విషయాల్లో అమ్మాయిలకు అవగాహన కల్పించడం తప్పనిసరి.– అనీల్ రాచమల్ల, సైబర్ సేఫ్టీ నిపుణులు, ఎండ్ నౌ ఫౌండేషన్ -
తెగించిన కాలేజీ యాజమాన్యం విద్యార్థులను కొట్టి ఇంటికి పంపుతూ...
-
పొలం బర్త్ డే గిఫ్ట్ గా ఇవ్వమని ఎమ్మెల్యే భర్త దౌర్జన్యం
-
సీఎం పీఠం ఎక్కనేలేదు.. ఈలోపే మరీ ఇంతలానా?
ఆంధ్రప్రదేశ్ లో ఎంతలో ఎంత మార్పు చూడండి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టకముందే ఆ పార్టీకి చెందిన కొన్ని అరాచక శక్తులు విజృంభిస్తున్న వైనం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని చోట్ల ఇళ్లలోకి చొరబడి మరీ కత్తులతో నరకడం, వైఎస్సార్సీపీ జెండానే కనిపించకూడదని బెదిరించడం ఇవన్నీ ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగిస్తాయి. ప్రజాస్వామ్యంతో సంబంధం లేదని, తాము అనుకున్నది చేస్తామని అనుకుంటే అది మరింత ఉద్రిక్తతలకు దారి తీస్తుంది.పోలీస్ వ్యవస్థ ఎందుకు ఇంత సడన్ గా నిర్వీర్యం అయిందో అర్థం కావడం లేదు. కొన్ని చోట్ల వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపైకి దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. అసలు ఈ ఎన్నిక ఫలితాలు ఇలా ఉన్నాయేమిటి? ఏమైనా గోల్ మాల్ జరిగిందా అనే అనుమానాలు ఒక వైపు వ్యక్తం అవుతుంటే, మరో వైపు టీడీపీ, జనసేనలకు చెందినవారు చేస్తున్న అరాచకాలతో అట్టుడికే పరిస్థితి ఏర్పడుతుంది. చంద్రబాబు నాయుడు కానీ, ఆయన కుమారుడు లోకేష్ కానీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కానీ ఒక్కసారి కూడా ఇలాంటివాటిని ఖండించినట్లు కనబడలేదు. దాంతో వారు కూడా ఇలాంటి గొడవలను ప్రోత్సహిస్తున్నారని జనం అనుకునే అవకాశం ఉంటుంది.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక చిన్న ఘటన ఏమైనా జరిగినా, వ్యక్తిగత కారణాలతో ఘర్షణలు జరిగినా, వైఎస్సార్సీపీకి పులిమి నానా హడావుడి చేసిన టీడీపీ మద్దతు మీడియా ఇప్పుడు ఎక్కడా నోరుమెదపుతున్నట్లు లేదు. ప్రస్తుతం జరుగుతున్న హింసాకాండ వారి దృష్టిలో ప్రజాస్వామ్యబద్దంగా, రాజ్యాంగబద్దంగా జరుగుతున్నదని అనుకుంటున్నారేమో తెలియదు. టీడీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి రకరకాల రూపాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి యత్నాలు సాగాయి. కాస్త గట్టిగా ఉండే అధికారులను మార్చేయడం, టీడీపీ వైపు నుంచి జరిగే ఘర్షణలను పట్టించుకోకపోవడం, వైఎస్సార్సీపీ నుంచి ఏమి జరిగినా వెంటనే స్పందించడం, తీవ్రమైన చర్యలు తీసుకోవడం కనిపించింది. కొన్ని ఏరియాలలో టీడీపీ రిగ్గింగ్ అవకాశం ఉన్నచోట్ల పోలీసులను చాలా తక్కువ సంఖ్యలో పెట్టారట. తద్వారా యథేచ్చగా రిగ్గింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారన్నమాట. అదే వైఎస్సార్సీపీ వారు రిగ్గింగు చేసే చాన్స్ ఉందని అనుకున్నచోట మొత్తం బలగాలన్నిటినీ కేంద్రీకరించారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. పోలింగ్ మరుసటి రోజు మాచర్ల, తాడిపత్రి, తిరుపతి మొదలైన చోట్ల టీడీపీ వారు దాడులు చేసి గందరగోళాలు సృష్టించారు. విచిత్రం ఏమిటంటే పోలీసులే తాడిపత్రి అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిలోకి వెళ్లి సిసిటీవీని, కెమెరాలను పగులకొట్టి విద్వంసానికి పాల్పడడం, అయినా వారిపై ఏమి చర్య తీసుకున్నది తెలియదు.వీటిలో అత్యధికం తెలుగుదేశం గూండాలు చేసినవేనని వైఎస్సార్సీపీ చెబుతోంది. అది నిజమే అని దృవీకరించే విధంగా కౌంటింగ్ తర్వాత రచ్చ సాగుతోంది. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ విజయవాడలో ఒక హోటల్ లో టిఫిన్ చేస్తుంటే వచ్చి దాడి చేశారు. లోకేష్ ను విమర్శించే స్థాయి నీదా అని బూతులు తిడుతూ రెచ్చిపోయారు. పలువురు వైఎస్సార్సీపీ నేతలకు, వారిని సమర్ధించినవారికి ఫోన్ లు చేసి టీడీపీ మద్దతుదారులు బూతులు తిడుతున్నారు. అసభ్యకర మెస్సేజ్ లు పెడుతున్నారు. టీడీపీ వేధింపులకు తాళలేక ఏలూరు సమీపంలోని విజయరాయి వద్ద ప్రవీణ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడుకు చెందిన కళ్యాణ మండపంపై దాడి చేశారు. మాజీ మంత్రి విడదల రజనీ ఆఫీస్ లో విధ్వంసం సృష్టించారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కొండూరు తదితర చోట్ల వైఎస్సార్సీపీ వారి ఇళ్లపై కర్రలు, కత్తులతో దాడి చేశారు. వైఎస్సార్‌సీపీవారు ఊళ్లలో ఉండడానికి వీలు లేదని హెచ్చరికలు జారీ చేసి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మాజీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. పల్నాడులో ఒక యూట్యూబ్ చానల్ నడిపే వైఎస్సార్సీపీ అభిమాని ఇంటిపైకి వెళ్లి కత్తితో దాడిచేస్తే, అతని వృద్ద తల్లిదండ్రులు తల్లడిల్లుతూ ఏడుస్తున్న వీడియో వైరల్ అయింది.ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆఫీస్ పై దాడులు చేశారు. ఈ గొడవలలో టీడీపీతో పాటు, బీజేపీ, జనసేన కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద రాళ్లతో వీరంగం సృష్టించారు. రాయచోటి మండలం యండపల్లి అనేచోట మాజీ ఎంపీ పోల సుబ్బారెడ్డి ఇంటిపై పడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. గుంటూరులో ఒక హాస్టల్ పేరు చివరలో రెడ్డి అని ఉన్నందుకు హాస్టల్ యజమానితో కాళ్లు పట్టించుకున్నారట. కళ్యాణ దుర్గంలో వైఎస్సార్సీపీ నేత ఉమామహేశ్వరనాయుడు ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేసి కారు, ప్రచార రథం ధ్వంసం చేశారు.ఇలా వివిధ జిల్లాలలో సాగుతున్న ఈ అరాచకాలను పోలీసులు ఎప్పటికి అరికడతారో తెలియదు కానీ, దీనివల్ల సమాజంలో మరింత అన్ రెస్ట్ పెరిగిపోతుంది. ఈ దాడులకు ప్రతిగా వైఎస్సార్‌సీపీవారు కూడా ఏదో రకంగా తిప్పికొట్టడానికి యత్నించే అవకాశం ఉంటుంది. దానిని నివారించడం చాలా అవసరం. అధికారం వచ్చిన తర్వాత చాలా బాధ్యతగా ఉంటామని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు అనేప్పటికీ, పోలీసులకు ఈ ఘర్షణలపై గట్టి చర్యలు తీసుకోవాలని ఎందుకు సూచించలేదో తెలియదు. లోకేష్ తాము అధికారంలోకి వచ్చాక బదులు తీర్చుకుంటామని అనేమాటలను జనం గుర్తు చేసుకుంటున్నారు. దానికి తగినట్లే ప్రస్తుతం దాడులు సాగుతున్నాయి.గతంలో ఏవో జరిగాయని ప్రతీకారంతో రగిలిపోతున్నారని, అందుకే ఇలా చేస్తున్నారని టీడీపీకి మద్దతు ఇచ్చేవారు, వారి మీడియా ప్రచారం చేయవచ్చు. అందులో ఎంత నిజం ఉందన్నది వేరే విషయం. అధికారంలోకి వచ్చినవారు అన్నిటిని సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగాలి. అంతేకానీ కక్షపూరితంగా మరింత రెచ్చగూడదని చెప్పక తప్పదు. కానీ అప్పట్లో అరాచక పాలన అని ప్రచారం చేసినవారు ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి జరుగుతున్న అరాచకాలను ఎలా సమర్ధిస్తారు? ఈ దౌర్జన్యాలు, దాడుల ద్వారా టీడీపీ కూటమి ఇకపై ఇంకెంత అరాచకానికి పాల్పడుతుందో అని జనం భయపడుతున్నారు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
తెలంగాణలో రైతులకు గడ్డు పరిస్థితి
-
టీడీపీ గూండాగిరికి పోలీసుల వత్తాసు
సాక్షి, అమరావతి: యథేచ్ఛగా సాగుతున్న టీడీపీ శ్రేణుల దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసాన్ని అరికట్టేందుకు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా పక్కా పన్నాగంతో జరుగుతున్న దాడులను డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా దృష్టికి తెచ్చింది. పార్టీ నేతలు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, పేర్ని వెంకట్రామయ్య(నాని), లేళ్ల అప్పిరెడ్డి తదితరులు బుధవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీని కలసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో టీడీపీ గూండాలు దాడులకు తెగబడిన 21 ఘటనలకు సంబంధించి పూర్తి ఆధారాలను అందచేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి టీడీపీ విధ్వంసం సృష్టించే పన్నాగాన్ని అమలు చేస్తోందన్నారు. వైఎస్సార్సీపీ నేతలు శాంతియుతంగా వ్యవహరిస్తున్నా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ దాడులకు దిగుతోందని తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హింసాత్మక ఘటనలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి కారకులపై కఠిన చర్యలు చేపట్టి వీటికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ నేతలు డీజీపీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు.దౌర్జన్యాలకు కొమ్ముకాసిన పోలీసులు: అంబటి టీడీపీ గూండాలు బరితెగించి దాడులకు పాల్పడుతుంటే పోలీసులు చోద్యం చూశారు. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసు అధికారులను ఈసీ హఠాత్తుగా బదిలీ చేసింది. వారిని మార్చిన తరువాత కూడా హింసాత్మక సంఘటనలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దీనికి ఈసీ ఏం సమాధానం చెబుతుంది? అవగాహనలేని డీజీపీ, డీఐజీలు, ఎస్పీలు, ఇతర అధికారులను నియమించడంతోనే హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. ఈసీ తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రం రావణ కాష్టంలా మారింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలు, పురందేశ్వరి సూచనల ప్రకారం ఈసీ అడ్డగోలుగా వ్యవహరించింది. అసలు పోలీసు వ్యవస్థ ఉందా? అనే సందేహం కలుగుతోంది. కొందరు పోలీసు అధికారులు టీడీపీతో కుమ్మక్కయ్యారు. టీడీపీ గూండాలు పోలింగ్ బూత్‌లలో దౌర్జన్యం చేస్తున్నా, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల ఇళ్లపై పడి దాడులు చేస్తున్నా పోలీసు యంత్రాంగం ఏమాత్రం అడ్డుకోలేకపోయింది. ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో పోలీసు యంత్రాంగం విఫలమైంది. వైఎస్సార్సీపీ నేతలను హౌస్ అరెస్ట్‌లు చేసిన పోలీసులు టీడీపీ శ్రేణులు స్వైర విహారం చేసినా కన్నెత్తి చూడలేదు. నన్ను హౌస్ అరెస్ట్ చేసి నా ప్రత్యర్థిని మాత్రం యథేచ్ఛగా తిరగనిచ్చారు. నా నియోజకవర్గంలో రీపోలింగ్ అవసరం లేదని ఈసీ ఎలా చెబుతుంది? వెబ్ కెమెరా రికార్డింగ్‌లను పరిశీలించకుండా ఏకపక్షంగా నిర్ణయాన్ని ఎలా ప్రకటిస్తుంది? ఇందుకు ఈసీ సమాధానం చెప్పాలి.దాడులు.. ఆపై కేసులు: పేర్ని నానిటీడీపీ పక్కా పన్నాగంతో దాడులకు పురిగొల్పుతోంది. కర్రలు, కత్తులు, రాడ్లు చేతబట్టుకుని పచ్చ ముఠాలు దాడులకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. దీన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై తిరిగి కేసులు బనాయించడం దారుణం. పోలింగ్ అనంతరం హింసకు పోలీసుల వైఫల్యమే కారణం. పల్నాడు ఎస్పీకి ఎన్నిసార్లు ఫోన్లు చేసినా పట్టించుకోలేదు. రిటైర్డ్ అధికారిని పోలీస్ పరిశీలకుడిగా ఈసీ నియమించడం ఏమిటి? ఆయనకు ఏం జవాబుదారీతనం ఉంటుంది? బీజేపీ, టీడీపీ నేతలకు సహకరించాలంటూ ఆయన పోలీసు అధికారులను బెదిరించారు. మా కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెడుతున్నారు. పురందేశ్వరి చెప్పిన విధంగా పోలీసు అధికారులను మార్చిన చోటే హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. పక్కా కుట్రతో పోలీసు అధికారులను బదిలీ చేసి టీడీపీ, బీజేపీ, జనసేన విధ్వంసానికి పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది. దీనికి పోలీసులతోపాటు ఈసీ కూడా సమాధానం చెప్పాలి. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల భద్రత కోసం ప్రజాస్వామ్యయుతంగా పోరాడతాం.చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు’రాష్ట్రంలో హింస, దాడులు, అల్లర్లలో ప్రధాన ముద్దాయి చంద్రబాబేనని, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, జోగి రమేష్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, నంబూరు శంకరరావు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి బుధవారం ఎన్నికల సంఘం కార్యాలయంలో ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనాను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. గొడవలకు సంబంధించిన ఆధారాలు అందజేశారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఇటీవల చేసిన హింసాకాండపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ముఖ్యంగా పల్నాడులో ఉద్దేశపూర్వకంగా, ప్లాన్ ప్రకారం దాడులు చేశారని తెలిపారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కూటమి పార్టీలకు కొమ్ముకాస్తున్నారని వారు వివరించారు. -
బెజవాడ సెంట్రల్లో కాల్కేయుడు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: టీడీపీ ప్రభుత్వ హయాంలో బెజవాడలో బొండా ఉమామహేశ్వరరావు ఆయన అనుచరుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. భూకబ్జాలు, దౌర్జన్యాలు, కాల్‌మనీ, సెక్స్ రాకెట్.. ఆయన చేయని దందా లేదు. ఫలితంగా 2019 ఎన్నికల్లో ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు. ఇప్పుడు మళ్లీ ఓటర్లను మభ్యపెట్టి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అరాచకాలను సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ► 2014–19 మధ్య బెజవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్న బొండా ఉమా ఏకంగా ఓ అవినీతి సామ్రాజ్యాన్నే నిర్మించారు. నియోజకవర్గం మొత్తాన్ని కనుసైగతో శాసించారు. భూకబ్జాలు, దందాలు, దౌర్జన్యాలతో పేట్రేగిపోయారు. అధికార యంత్రాంగం కూడా ఆయన అవినీతి దందాకు వంతపాడింది. నియోజకవర్గ వ్యాప్తంగా రూ.వందల కోట్లు విలువైన భూమిని బొండా కబ్జా చేశారు. సెటిల్మెంట్లతోపాటు ప్రభుత్వంలో జరగాల్సిన పనులకు కూడా కప్పం వసూలు చేశారు. ప్రజల నుంచి రూ.వందల కోట్లు కొల్లగొట్టారు. ► కాల్‌మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారాల్లో బొండాపై అనేక ఆరోపణలు వచ్చాయి. కాల్‌మనీ కింగ్‌గా ఉమా పేరొందారు. ఎందరో బాధితులు బొండా కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడారు. ► సత్యనారాయణపురంలోని భువనేశ్వరి పీఠానికి చెందిన సీతారామ కల్యాణ మండప కబ్జాకు బొండా వర్గీయులు యతి్నంచారు. ► న్యూ రాజరాజేశ్వరిపేటలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా ఉన్న స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించి బొండా భంగపడ్డారు. ► రామకృష్ణాపురం బుడమేరులో బొండా ఉమా అనుచరులు, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు కలిసి వెంచర్ వేసి విక్రయించారు. స్థానిక టీడీపీ నేతలు కూడా బుడమేరు లోపలకు ఇళ్లు నిర్మించి విక్రయించారు. ► ముత్యాలంపాడులో ఇరిగేషన్ స్థలాన్ని టీడీపీ నేత కుమారుడి వ్యాయామశాలకు ధారాదత్తం చేశారు. ► అప్పటి 44వ డివిజన్ కార్పొరేటర్ రైల్వే, ప్రభుత్వ స్థలాలనూ విక్రయించారు. ► విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన రూ.30 కోట్లు భూదందాలో కూడా మాగంటి బాబు కీలక పాత్రధారి. ఈ వ్యవహారాన్ని అక్కడి ప్రజలు ఇప్పటికీ మరచిపోలేదు. ► కండ్రిక కాలనీలో జర్నలిస్టుల ఇళ్ల పేరిట ఎమ్మెల్యే అతని అనుచరులు కార్పొరేషన్‌కు చెందిన 1,720 గజాల స్థలాన్ని ఆక్రమించి, నిర్మాణాలు చేసేందుకు ప్రయతి్నంచారు. స్థానికుల ఆందోళనతో వెనక్కి తగ్గారు. ► పాయకాపురం బర్మాకాలనీ ప్రాంతంలో మూడు ఎకరాల వరకూ ఉన్న కాలనీ కామన్ సైట్‌ను తన అనుచరులతో ఆక్రమించి, వాటి కి ఇంటి పట్టాలను సృష్టించేందుకు తెగబడ్డారు. స్థానికులు అడ్డం తిరగడంతో తోకముడిచారు. గీతాంజలి కేసులో బొండా అనుచరుడి అరెస్ట్ ఇటీవల తెనాలికి చెందిన వివాహిత గీతాంజలి ఆత్మహత్య కేసులో బొండా అనుచరుడు పసుమర్తి రాంబాబు అరెస్టయ్యాడు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను ప్రశంసించిన గీతాంజలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాంబాబు ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ కామెంట్లు పెట్టాడు. అతడితో పాటు టీడీపీ కార్యకర్తల అనుచిత వ్యాఖ్యలకు మనస్తాపానికి గురైన గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొడుకులదీ అదే తీరు బొండా కుమారులు ఇద్దరూ దౌర్జన్యాలు చేయడంలో ఘనులే. బొండా కుమారుడు నిర్వహించిన కారు రేస్‌లో మనోరమ హోటల్లో పనిచేసే మేనేజర్ కుమారుడు మరణించాడు. అప్పట్లో ఈ విషయం సంచలనం సృష్టించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుక్క అడ్డురావడంతో కారు ప్రమాదం జరిగిందని కేసును తప్పుదారి పట్టించారు. తెనాలికి చెందిన రౌడీషిటర్ సుబ్బుతో బొండాకు సత్సంబంధాలున్నాయి. సుబ్బు హైదరాబాద్‌లో తుపాకీ కొనుగోలు చేస్తూ పట్టుబడి బొండా, మరికొందరి టీడీపీ నేతల పేర్లు బయటపెట్టాడు. ఆ తర్వాత విజయవాడలోని మాచవరంలో పట్టపగలే సుబ్బు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అధికార పార్టీ నేతల పేర్లు బయటకు రాకుండా పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు కేసును తారుమారు చేశారు. దుర్గాపురంలోని ఓ అపార్ట్మెంటులో క్యాన్సర్ బాధితురాలు మాదంశెట్టి సాయిశ్రీకి చెందిన ఫ్లాట్‌ను బొండా అనుచరులు కబ్జాకు యత్నించారు. ఆమె తన వైద్యం కోసం ఆ ఫ్లాట్ విక్రయానికి యత్నించగా జాలి లేకుండా బొండా అడ్డుకున్నారు. చివరకు వైద్యం అందక సాయిశ్రీ మరణించారు. బొండా ఉమాకు మాగంటి బాబు అత్యంత సన్నిహితుడు. అప్పట్లో స్వాతంత్య్ర సమరయోధుడి భూమిని తప్పుడు పత్రాలతో రిజి ్రస్టేషన్ చేసుకున్న వారిలో బొండా ఉమా భార్య సుజాతతోపాటు మాగంటి బాబు కూడా ఉన్నారు. బొండా ఉమా అక్రమ దందాలన్నింటిలో మాగంటి బాబు కీలకంగా వ్యవహరించారనేది బహిరంగ రహస్యం. అకృత్యాలెన్నున్నా కేసులు మూడే.. బొండా ఉమా మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. 2011 మార్చి1న సెక్షన్ 9, 9ఏఏ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం బొండాపై కేసు నమోదైంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్ఐఆర్ నంబర్ 462/2006పై సెక్షన్ 143 కేసు ఉంది. విజయవాడ 2వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో సెక్షన్ 143 కింద కేసు ఉన్నట్టు బొండా అఫిడవిట్లో పేర్కొన్నారు. -
అలా అయితే.. ఇజ్రాయెల్‌పై దాడి జరిగుండేది కాదు: ట్రంప్
జెరూసలెం: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను మాజీ ఆధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడులకు బైడెన్ బాధ్యత వహించాలంటూ దుయ్యబట్టారు. తాను అధ్యక్షునిగా పనిచేసిన కాలంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకున్నట్లు చెప్పారు. న్యూ హాంప్‌షైర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఈ మేరకు మాట్లాడారు. 'అమెరికాకు ఎందరో వస్తుంటారు.. పోతుంటారు. ఆ డేటా మనదగ్గర ఉండదు. చాలా కేసుల్లో ఇలా మనదగ్గర ఉండి వెళ్లినవారే వివిధ దేశాల్లో దాడులు చేస్తుంటారు. ఇజ్రాయెల్‌లోనూ ఇలాంటివారే దాడులకు పాల్పడుతున్నారు. బైడెన్ అమెరికాకు ఏమీ ప్రయోజనం చేకూర్చే పనులు చేయలేదు. నేను అధ్యక్షునిగా ఉంటే.. ఇజ్రాయెల్‌పై దాడి జరిగి ఉండేది కాదు.' అని ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్న హమాస్ దళాలు.. పిల్లలను, మహిళలను దారుణంగా హింసిస్తున్నారని ట్రంప్ తెలిపారు. తాను ప్రధానిగా ఉన్న కాలంలో స్థిరమైన శాంతిని నెలకొల్పినట్లు వెల్లడించారు. పెద్దన్నగా మారణోమాలకు అమెరికా అడ్డుకట్ట వేసేదని తెలిపారు. "హమాస్ దాడులు అవమానకరం. ఈ దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ ఎంతో పోరాడుతోంది. పాపం, అమెరికన్ పన్ను చెల్లింపుదారుల డాలర్లు ఈ దాడులకు నిధులు సమకూర్చాయి. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిన అనేక నివేదికలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. అమెరికా బలహీనమవుతుందని చెప్పడానికి ప్రస్తుత ఘటనలే నిదర్శనం" అని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రకటనలో తెలిపారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్య 1,200 దాటింది. హమాస్ మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెల్‌లో 700 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడిలో గాజాలో 500 మందికిపైగా మరణించారు. ఇరువైపులా వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. ఇజ్రాయెల్‌లో 130 మందికిపైగా పౌరులను బందీలుగా పట్టుకున్నామని, వారంతా తమ ఆధీనంలో ఉన్నారని హమాస్ ప్రకటించింది. ఇదీ చదవండి Israel–Palestinian conflict: గాజాపై నిప్పుల వర్షం -
జర్మనీ మహిళను నగ్నంగా ఊరేగించిన హమాస్
జెరూసలేం: ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి సందర్భంగా బందీలుగా పట్టుకున్న వారిపై హమాస్ మిలిటెంట్ల అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శని లౌక్ అనే జర్మనీ దేశస్తురాలిని శనివారం గాజా వీధుల్లో నగ్నంగా ఊరేగించి పైశాచికానందం పొందడం తెలిసిందే. ‘‘శని క్రెడిట్ కార్డును గాజాలో పూర్తిగా వాడేశారు. తను కనీసం ప్రాణాలతోనైనా ఉందని ఆశపడుతున్నాం’’అంటూ ఆమె తల్లి బావురుమంది. శనివారం ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతమైన కిబుట్జ్ సమీపంలో ఫెస్టివల్ ఆఫ్ పీస్ జరుగుతుండగా హమాస్ మిలిటెంట్లు మెరుపు దాడిచేసి పలువురిని బందీలుగా గాజాకు తరలించారు. -
Bangalore : అడిగినంత ఇస్తారా? లేదా? గృహ ప్రవేశంలో హిజ్రాల గొడవ
యశవంతపుర: ఇంటి గృహ ప్రవేశానికి అడగకుండానే వచ్చి అడిగినంత డబ్బులు ఇవ్వలేదనే కోపంతో హిజ్రాలు అసభ్యంగా ప్రవర్తించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. వయాలికావల్ సమీపంలో ఒక కుటుంబ బుధవారం గృహ ప్రవేశం చేసుకున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ముగ్గురు హిజ్రాలు ఒక్కసారిగా ఇంటిలోకి చొరబడ్డారు. వారికి ఇంటి యజమానులు భోజనం తినాలని ఆహ్వానించారు. మాకు అన్నం వద్దు, డబ్బులు ఇవ్వాలని హిజ్రాలు కిరికిరి పెట్టారు. ఐదు వందల రూపాయలు ఇవ్వబోగా, ఒక్కొక్కరికి రూ. ఐదు వేలు ఇవ్వాలని గొడవకు దిగారు. అందరినీ నోటికొచ్చినట్లు తిట్టి అసభ్యంగా ప్రవరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందింది. కాగా హిజ్రాలపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవలి కాలంలో ఈ తరహా కేసులు వీపరీతంగా పెరిగాయని బెంగళూరు వాసులు వాపోతున్నారు. డబ్బులు డిమాండ్ చేయడం, ఇవ్వకపోతే దాడికి దిగడం, డబ్బు/ వస్తువులు బలవంతంగా లాగేసుకోవడం జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. కొందరయితే పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. -
గుర్తింపునకు నోచని రక్తచరిత్ర.. మాన్‌గఢ్ ధామ్‌పై కేంద్రం కీలక ప్రకటన
ఆదివాసీల ప్రాబల్యమున్న మాన్‌గఢ్ ప్రాంతమది. బ్రిటిష్ పాలనలో రక్తమోడింది. జలియన్‌వాలాబాగ్ ఘటనకి ఆరేళ్ల ముందు ఇక్కడ తెల్లదొరలు మారణహోమం సాగించి అక్షరాలా 1500 మంది ఆదివాసీల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. ఈ దారుణానికి చరిత్రలో అంతగా గుర్తింపు లభించలేదు. ఈ ప్రాంతం రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లాలో గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది. సంఘ సంస్కర్త గోవింద్ గురు 1913లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీలను ఉత్తేజపరిచారు. ఈ ప్రాంతంలో నివసించే గిరిజనుల్ని భిల్ అని పిలుస్తాను. వీరు విలువిద్యలో ఆరితేరినవారు. బానిసత్వ వ్యవస్థ, పన్నుల భారాన్ని నిరసిస్తూ గోవింద్ గురు ఇచ్చిన పిలుపుతో గిరిజనులు ఉద్యమించారు. 1913 నవంబర్ 17న బ్రిటీష్ సైనికుల విచక్షణారహిత కాల్పుల్లో 1500 మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క దెబ్బకు మూడు రాష్ట్రాలు మాన్‌గఢ్ ధామ్‌ను నేషనల్ మాన్యుమెంట్గా ప్రకటించడం వెనుక ఆదివాసీల ఓట్లను ఆకర్షించే రాజకీయం దాగుంది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో గిరిజనులు మాన్‌గఢ్ ప్రాంతాన్ని అత్యంత పవిత్రమైన స్థలంగా భావిస్తారు. ఇక్కడ రాజకీయ లబ్ధికి బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. డిసెంబర్లో గుజరాత్, వచ్చే ఏడాది మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీలకు ఎన్నికలున్న నేపథ్యంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఇప్పటికే ఈ ప్రాంతాన్ని జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలంటూ ప్రధానికి రెండు లేఖలు రాశారు. ఆదివాసీల సంక్షేమం కోసం పని చేసే భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) నాలుగు రాష్ట్రాల్లోని 39 జిల్లాల్లో భిల్ ఆదివాసీల ప్రాంతాలతో ప్రత్యేక భిల్ ప్రదేశ్ ఏర్పాటు చేయాలని గళమెత్తుతోంది. గుజరాత్లో 16, రాజస్థాన్‌లో 10, మధ్యప్రదేశ్‌లో ఏడు, మహారాష్ట్రలో ఆరు జిల్లాలను కలిసి భిల్ ప్రదేశ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. రాజస్థాన్ జనాభాలో గిరిజనులు 13.48%, గుజరాత్లో 14.8%, మధ్యప్రదేశ్‌లో 21.1%, మహారాష్ట్రలో 9.35% ఉన్నారు. రాజస్థాన్‌లో 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భిల్ ఆదివాసీలు అధికంగా ఉన్నారు. ప్రస్తుతం వాటిలో కాంగ్రెస్ 13, బీజేపీ 8, బీటీపీ, స్వతంత్రులు చెరొక స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా 27 సీట్లలో 13 బీటీపీ నెగ్గింది. ఇక జాతీయ స్మారక చిహ్నం మాన్‌గఢ్ (రాజస్థాన్): మాన్‌గఢ్ ధామ్‌ను జాతీయ స్మారక చిహ్నంగా కేంద్రం ప్రకటించింది. మాన్‌గఢ్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ ముఖ్యమంత్రుల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ ప్రాంత అభివృద్ధికి రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర సీఎంలు రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే ఈ ప్రాంతానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందన్నారు. ‘‘మాన్‌గఢ్ ధామ్‌ను మరింతగా విస్తరించడానికి అభివృద్ధి చేయాలని మనందరికీ బలమైన కోరిక ఉంది. నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చించుకొని ఒక రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయండి’’ అని ప్రధాని అన్నారు. ఈ ధామ్ని అభివృద్ధిని చేస్తే కొత్త తరంలో స్ఫూర్తిని నింపిన వాళ్లమవుతామని ప్రధాని వ్యాఖ్యానించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ చదవండి: ‘మోర్బీ’ విషాదం చూశాకైనా మీరు మారరా? -
మైనార్టీలపై చైనా మారణకాండ.. ఐరాస నివేదికలో కీలక విషయాలు
జెనీవా: చైనా ప్రభుత్వం మైనార్టీలపై మారణహోమాన్ని సృష్టిస్తోందని గత కొంత కాలంగా అంతర్జాతీయ సమాజం వ్యక్తం చేస్తున్న ఆందోళనలకు ఐక్యరాజ్య సమితి (యూఎన్) స్వరం కలిపింది. ఉగ్రవాద నిర్మూలన పేరుతో పశ్చిమ జిన్ జియాంగ్ ప్రాంతంలో వీగర్లు, ఇతర ముస్లింలను నిర్బంధించి చైనా ప్రభుత్వం హింసకు పాల్పడుతున్న విషయం వాస్తవమేనని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం పేర్కొంది. నిర్బంధంలోకి తీసుకున్న మైనార్టీలపై కనీస మానవత్వం చూపించకుండా ఘోరమైన నేరాలకు పాల్పడే అవకాశాలను కొట్టి పారేయలేమని యూఎన్ తాజా నివేదిక స్పష్టం చేసింది. చాలా కాలం కిందటే ఈ నివేదిక బయటకు రావాల్సి ఉంది. కానీ చైనా ప్రభుత్వం ఒత్తిడితో ఇన్నాళ్లుగా యూఎన్ తన నివేదికను బయట పెట్టలేదు. యూఎన్ మానవ హక్కుల చీఫ్ మిషెల్లీ బచెలెట్ బుధవారం నాడు తన పదవీ కాలం ముగియడానికి కేవలం 13 నిముషాల ముందు ఈ నివేదిక బయట పెట్టడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. పశ్చిమ జిన్ జియాంగ్ ప్రాంతంలోని వీగర్లు, ఇతర ముస్లిం మైనార్టీలపై ఐదేళ్లుగా డ్రాగన్ ప్రభుత్వం హింసాకాండకు పాల్పడుతున్నట్టుగా మానవ హక్కుల సంస్థలు, పశ్చిమ దేశాలు గగ్గోలు పెడుతూనే ఉన్నాయి. 10 లక్షల మంది వీగర్లను నిర్బంధించినట్టుగా వార్తలు వచ్చాయి. యూఎన్ నివేదికను అమెరికా, మరికొన్ని పశ్చిమ శక్తుల కుట్రగా చైనా అభివర్ణించింది. చదవండి: బ్రిటన్‌లో ప్రచారానికి తెర -
Russia-Ukraine War: ఆగని దమనకాండ.. రైల్వే స్టేషన్‌పై రష్యా దాడి
చెర్నిహివ్: ఉక్రెయిన్‌లో పౌరులను తరలిస్తున్న ఒక రైల్వే స్టేషన్‌పై రష్యా జరిపిన రాకెట్ దాడిలో 39 మందికి పైగా మృతి చెందినట్లు స్థానిక గవర్నర్ పావ్లోవ్ కిరిలెంకో శుక్రవారం ప్రకటించారు. రష్యన్ సేనలు తూర్పు ఉక్రెయిన్ వైపుగా వెళుతూ ఖాళీ చేస్తున్న నగరాల్లో మరిన్ని దారుణాలు కనిపిస్తాయని అంచనా వేస్తున్నారు. డొనెట్స్క్ ప్రాంతంలోని క్రామటోర్స్క్ స్టేషన్లో వేలాది మంది ప్రజలు ఉన్నారని, ఆ స్టేషన్‌పై మిసైల్ దాడి జరిగిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ధ్వంసమైన రైల్ బోగీల దృశ్యాలను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాడిలో వందమందికి పైగా గాయపడి ఉండొచ్చని అంచనా. యుద్ధంలో తమను గెలవలేక రష్యా ఇలాంటి అమానవీయ చర్యలకు పాల్పడుతోందని జెలెన్స్కీ ఆరోపించారు. మారియుపోల్‌లో ఘోరాలు బయటపడితే రష్యా అకృత్యాలు మరింతగా తెలియవస్తాయన్నారు. రష్యా సైనికులు ఖాళీ చేసిన బుచా తదితర నగరాల్లో ఏం జరిగిందో ప్రపంచమంతా చూస్తోందని, రష్యా క్రూర నేరాలకు పాల్పడుతోందని చెప్పారు. బుచాకు దగ్గరలోని బొరొడైంకా నగరంలో మరింతమంది మృతులు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. రష్యా అమానవీయంగా వ్యవహరిస్తోందన్న కారణంగా ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు సరఫరా చేసేందుకు నాటో దేశాలు అంగీకరించిన సంగతి తెలిసిందే! అయితే ఇవన్నీ తప్పుడు ఆరోపణలని రష్యా పేర్కొంది. ఎదురుదెబ్బలు నిజమే ఉక్రెయిన్‌పై దాడిలో తమకు భారీగా నష్టం వాటిల్లినట్లు రష్యా అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ చెప్పారు. ఆపరేషన్ వీలైనంత తొందరగా ముగించేందుకు రష్యా సేనలు యత్నిస్తున్నాయని, తమ దాడి త్వరలో ముగుస్తుందని స్కైన్యూస్‌తో చెప్పారు. భారీగా సైనికులను నష్టపోవడం బాధాకరమన్నారు. రష్యా దాడితో ఉక్రెయిన్ నుంచి దాదాపు 65 లక్షల మంది నిరాశ్రయులయి ఉంటారని ఐరాస అంచనా వేసింది. ఐరాస మానవహక్కుల సంఘ అంచనాల ప్రకారం 43 లక్షలమంది శరణార్ధులయ్యారు. వీరిలో సగం మంది పిల్లలని అంచనా. దాడులు జరుగుతున్న ప్రాంతాల్లో ఇంకా 1.2 కోట్లమంది చిక్కుకుపోయి ఉంటారని ఐఓఎం అంచనా వేసింది. ఈ వారంలో కాల్పుల విరమణ కుదురుతుందన్న ఆశలేదని ఐరాస ప్రతినిధి చెప్పారు. ఉక్రెయిన్‌కు మరింత మద్దతునందించేందుకు ఇద్దరు ఈయూ అధికారులు, స్లోవేకియా ప్రధాని కీవ్‌కు చేరారు. అంతర్జాతీయంగా ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ఆహార ధరలు భారీగా పెరుగుతున్నాయని ఐరాస అనుబంధ సంస్థ తెలిపింది. ఫిబ్రవరితో పోలిస్తే పప్రంచ ఆహారధాన్యాల ధరల సూచీ మార్చిలో 12.6 శాతం పెరిగి 159.3 పాయింట్లకు చేరిందని తెలిపింది. రష్యా సేనలు వైదొలిగిన సుమి నగరంలో ప్రజలు అపమ్రత్తంగా ఉండాలని స్థానిక గవర్నర్ సూచించారు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై రష్యా దృష్టి సారిస్తోందని బ్రిటన్ రక్షణ మంత్రి అంచనా వేశారు. దేశ రక్షణకు విఘాతం కలిగిస్తున్నారంటూ 15 మంది రష్యన్లను డెన్మార్క్ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. రష్యాకు చెందిన అతిపెద్ద మిలటరీ షిప్ బిల్డింగ్, డైమండ్ మైనింగ్ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. అకారణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రయాణికులు -
అప్ఘన్లో ఆస్ట్రేలియా సైనికుల విధ్వంస క్రీడ!
కాన్బెర్రా: అఫ్ఘనిస్తాన్‌లో ఆస్ట్రేలియా సైనికులు జరిపిన దుశ్చర్యలు ఆలస్యంగా వెలుగులోనికి వచ్చాయి. ఆస్ట్రేలియా ప్రత్యేక దళాలు 39 మంది నిరాయుధ పౌరులను, ఖైదీలను చట్టవిరుద్ధంగా చంపినట్లు విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయని ఆస్ట్రేలియా జనరల్ గురువారం తెలిపారు. ఈ విషయాన్ని ప్రత్యేక యుద్ధ నేరాల ప్రాసిక్యూటర్‌తో ప్రస్తావించారు. 2005 నుంచి 2016 మధ్య ఆఫ్ఘనిస్తాన్‌లో సైనికుల దుష్ప్రవర్తనపై సంవత్సరాల తరబడి జరిపిన దర్యాప్తులో భయంకరమైన నిజాలను తెలుసుకున్నామని డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ అంగస్ కాంప్‌బెల్ తెలిపారు. ఒక దశాబ్దం పాటు సైనికుల్లోని ఉన్నత దళాలు శిక్ష మినహాయింపుకోసం "విధ్వంసకర"మైన సంస్కృతిని అవలంభించాయని, తప్పును కప్పిపుచ్చుకునే క్రమంలో హత్యలు జరిగాయని పేర్కొన్నారు. బయటకు వచ్చిన నిజాలు.. ‘నిఘా సిబ్బందిలో కొంతమంది చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. నియమాలను కాలరాశారు, కల్పిత కథలను సృష్టించారు. అబద్ధాలు చెప్పారు. పలు ఖైదీలను చంపేశారు’ అని కాంప్‌బెల్ తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పారు. కాగా 'బ్లడింగ్' (వేట) అని పిలువబడే వికృత క్రీడలో కొంత మంది నిఘా సిబ్బంది మొదటిసారిగా కాల్చే అవకాశం కోసం ఖైదీలను బలవంతంగా కాల్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనలు జరగడానికి జూనియర్ సైనికులే కారణమని ఆరోపించారు. మిలిటరీ ఇన్స్పెక్టర్ జనరల్ గురువారం 465 పేజీల అధికారిక నివేదికలో డజన్ల కొద్దీ హత్యలు జరిగాయని తెలిపింది. ఈ నివేదికలో బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని సిఫార్సుచేసింది. 39 మందిని చట్టవిరుద్ధంగా హత్య చేయడంతో రెజిమెంట్, సాయుధ దళాలు, ఆస్ట్రేలియాకు మాయని మచ్చ తెచ్చారని కాంప్‌బెల్ అన్నారు. యుద్ధ నేరాలకు సంబంధించిన ప్రత్యేక దర్యాప్తు అధికారికి ఈ వివరాలను పంపుతామన్నారు. సేవా పతకాలు తిరిగి వెనకీ.. కాంప్‌బెల్ 2007- 2013 మధ్య కాలంలో ఆఫ్ఘనిస్తాన్‌లో పనిచేసిన సైనిక దళాలకు ఇచ్చిన కొన్ని విశిష్ట సేవా పతకాలను ఉపసంహరించుకుంటామన్నారు. సెప్టెంబర్ 11, 2001 దాడుల తరువాత, తాలిబన్, అల్-ఖైదా, ఇతర ఇస్లామిస్ట్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా యుఎస్, మిత్రరాజ్యాల దళాలతో కలిసి పోరాడటానికి 26,000 మందికి పైగా ఆస్ట్రేలియా సైనికులను ఆఫ్ఘనిస్తాన్‌కు పంపారు. ఆస్ట్రేలియన్ సైనిక దళాలు అధికారికంగా 2013లో దేశంను విడిచి వెళ్లినా, ఉన్నత బలగాలు తరచూ క్రూరమైన పనులు చేసే వారని తెలిసింది. సైనికులు జరిపిన దాడిలో ఆరేళ్ల చిన్నారిని చంపినట్లు నివేదికలు వచ్చాయి. అంతేకాకుండా హెలికాప్టర్లో స్థలం లేకపోవడంతో ఖైదీని కాల్చి చంపేశారు.(చదవండి: లాక్డౌన్ నియమాలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా) ఆస్ట్రేలియా ప్రభుత్వ దిద్దుబాటు చర్యలు.. ఆస్ట్రేలియా ప్రభుత్వం నివేదిక తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నించిందనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు.. మోరిసన్ ప్రభుత్వం బుధవారం ఈ చర్యలను చాలా తీవ్రంగా పరిగణించిందని ఆఫ్ఘాన్ రాయబారికి తెలిపింది. ఇక సైనిక చర్యలపై ప్రధాని మోరిసన్ తన ప్రగాడ సానుభూతిని తన ట్వీట్లతో వ్యక్తం చేశారు. గత వారం, మోరిసన్ యుద్ధ నేరాలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక పరిశోధకుడిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. మీడియాపై దాడులు.. ఆస్ట్రేలియా ప్రభుత్వం గతంలో తప్పు చేసినట్లు తెలిపిన సంస్థ నివేదికలను అణిచివేసేందుకు ప్రయత్నించింది, పోలీసులు నివేదికలను వెలుగులోకి తెచ్చే విలేకరులపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం మొదట ప్రజల దృష్టికి ‘ఆఫ్ఘన్ ఫైల్స్’ పేరుతో 2017లో ఆస్ట్రేలియా జాతీయ మీడియా వెలుగులోకి తెచ్చింది. ఆస్ట్రేలియా దళాలు ఆఫ్ఘనిస్తాన్‌లో నిరాయుధ పౌరులను, పిల్లలను చంపారని ఆరోపించారు. ప్రతిస్పందనగా, ఆస్ట్రేలియా పోలీసులు ఇద్దరు రిపోర్టర్లపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును విరమించుకునే ముందు, గత సంవత్సరం సిడ్నీలో ఏబీసీ ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు. -
నాటి నుంచే నీగ్రోలపై దారుణాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆఫ్రికా మూలాలు కలిగిన అమెరికన్ నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‌ను శ్వేత జాతీయుడైన పోలీసు అధికారి అన్యాయంగా చంపేయడంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతున్న విషయం తెల్సిందే. అమెరికాలో నల్ల జాతీయులను శ్వేత జాతీయులైన పోలీసు అధికారులు చంపేయడం, హింసించడం ఇప్పుడే కొత్త కాదు. అమెరికా చరిత్రలో కోకొల్లలుగా జరుగుతూ వస్తున్నాయి. అమెరికా పోలీసు చట్టం కూడా అందుకు కొంత దోహద పడుతోంది. (చదవండి: జార్జ్‌ది నరహత్యే !) 1700 శతాబ్దంలో మొదలైన ‘స్లేవ్ పెట్రోల్స్’ కాలం నాటి నుంచి నల్లజాతీయులకు వ్యతిరేకంగా అమెరికా పోలీసుల అరాచకాలు కొనసాగుతున్నాయి. నాడు బానిసత్వంలో మగ్గుతున్న నల్లజాతీయులపైనా శ్వేతజాతీయ పౌరులు, పోలీసు అధికారులు ‘స్లేవ్ పెట్రోల్స్’ పేరిట దారుణాలకు పాల్పడేవారు. బానిసత్వానికి వ్యతిరేకంగా 1739, 1741లో నల్లజాతీయులు చేసిన తిరుగుబాట్లను అమెరికా పోలీసులు దారుణంగా అణచివేశారు. అమెరికాలో అంతర్యుద్ధం (1861–65) ముగిశాక ‘స్లేవ్ పెట్రోల్స్’కు సంబంధించిన చట్టాలను అమెరికా రద్దు చేసింది. అయినప్పటికీ నల్ల జాతీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులకు తెర పడలేదు. ‘1965లో వాట్స్ రైట్స్’ అందుకే జరిగాయి. మార్క్వెట్ ఫ్రై అనే నల్ల జాతీయుడు తన తల్లి, సోదరుడితో కలిసి కారులో వేగంగా వెళుతుండగా, శ్వేత జాతీయుడైన కాలిఫోర్నియా హైవే పెట్రోల్ ఆఫీసర్ ఆపి, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కింద అరెస్ట్ చేసి హింసించారు. 1991, మార్చి మూడవ తేదీన రోడ్నీ కింగ్ అనే నల్లజాతీయుడు కారులో వేగంగా వెళుతుండగా, శ్వేతజాతి పోలీసు అధికారులు ఆపి, కారులో నుంచి గుంజీ రోడ్నీ కింగ్‌ను చితక్కొట్టారు. ఆ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారులు 1992, ఏప్రిల్ నెలలో నిర్దోషులుగా విడుదలయ్యారు. అందుకు వ్యతిరేకంగా నిరసనలు, అల్లర్లు కొనసాగాయి. 2014, ఆగస్ట్‌లో 18 ఏళ్ల మైకేల్ బ్రౌన్ అనే నల్లజాతీయ యువకుడిని పోలీసు అధికారి అన్యాయంగా కాల్చి వేయడంతో దానికి వ్యతిరేకంగా ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం పుట్టుకొచ్చింది. అయినప్పటికీ సదరు పోలీసు అధికారికి శిక్ష పడలేదు. ఆ తర్వాత ఇప్పుడు జార్జ్ ఫ్లాయిడ్ అన్యాయంగా బలయ్యారు. అమెరికా పోలీసు చట్టం శ్వేత జాతీయులైన పోలీసులను అనుకూలంగా ఉండడమేనని విమర్శకులు చెబుతున్నారు. పోలీసు వ్యవస్థలో కూడా నల్లజాతీయుల పట్ల ఎంతో వివక్షత ఉందని వారంటున్నారు. (చదవండి: జార్జ్ హత్య : సత్య నాదెళ్ల స్పందన) -
పాక్‌లో హిందూ యువతులపై అకృత్యాలు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో మైనార్టీలపై ముఖ్యంగా హిందువులపై అకృత్యాలు పెచ్చుమీరుతున్నాయి. హిందూ యువతుల అపహరణ, మత మార్పిడి ఘటనలు నానాటికి పెరిగిపోతున్నాయి. సోమవారం ఒక్కరోజే ఒకే జిల్లాలో వేర్వేరు చోట్ల ఇలాంటివి రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. సాయుధులైన దుండగులు అక్రమంగా బాధితుల ఇంట్లో చొరబడి వారిని లాక్కెళ్లడం ఆందోళనలకు దారి తీసింది. వివరాలు.. సింధు ప్రావిన్స్‌లోని మీర్పూర్ ఖాస్ జిల్లా రాయీస్ నేహాల్ ఖాన్ గ్రామానికి చెందిన రాయ్ సింగ్ కోహ్లి తన కూతురు అపహరణకు గురైనట్లు వెల్లడించారు. పదిహేనేళ్ల సుంటారాను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిపోయారని.. దీంతో వెంటనే తాము స్థానిక పోలీస్ స్టేషనుకు వెళ్లి ఫిర్యాదు చేశామన్నారు. (లాక్డౌన్ ఎత్తివేత.. డబ్బు ఇవ్వలేం: ఇమ్రాన్ ఖాన్) ఈ క్రమంలో చాలా సేపటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా పోలీసులు తమను వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా తమ కూతురిని వెనక్కి తీసుకురావాలంటూ పోలీసులను వేడుకున్నారు. ఇక అదే జిల్లాలోని హాజీ సయీద్ గ్రామంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకోవడం గమనార్హం. వివాహిత అయినటువంటి 19 ఏళ్ల భగవంతిని కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు. ఇస్లాం స్వీకరించాలంటూ ఆమెను బలవంతపెట్టారు. ఈ క్రమంలో భగవంతి కుటుంబ సభ్యులు పోలీసు స్టేషనుకు వెళ్లి నిరసన తెలపగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న సదరు వ్యక్తులు.. భగవంతి మతం మారినట్లుగా కొన్ని పత్రాలను పోలీసులకు సమర్పించారు. దీంతో తమ కూతురి జీవితం నాశనమైందంటూ ఆమె కుటుంబ సభ్యులు పోలీసు స్టేషను ఎదుట ఆందోళనకు దిగారు. (పాకిస్తాన్లో వారు మాత్రమే ఆ పోస్టులకు అర్హులు) కాగా సింధు ప్రావిన్స్‌లోని థార్పర్కర్ జిల్లాలోని బార్మేలీలో నివసిస్తున్న హిందువులపై ఇదే రోజు హేయమైన దాడి జరిగింది. పురుషులు, మహిళలు, చిన్న పిల్లలు అనే తేడా లేకుండా వారిపై దాడిచేసిన దుండగులు ఇళ్లను నేలమట్టం చేశారు. ఇక కొన్నిరోజుల క్రితం మంత్రి సమక్షంలోనే పంజాబ్ ప్రావిన్స్‌లోని భవల్పూర్లో మైనారిటీల నివాసాలను బుల్డోజర్లతో నేలమట్టం చేసిన విషయం తెలిసిందే.(హిందువుల బస్తీ నేలమట్టం చేసిన పాకిస్తాన్) -
అరాచక పర్వం..
పెచ్చుమీరుతున్న ముఖ్య నేత తనయుడి దౌర్జన్యకాండ ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి వసూళ్లు వాటాలు ఇవ్వలేదని.. రైల్వే పనులు చేస్తున్న వారిపై దాడి కన్ను పడితే కబ్జాలు.. ల్యాండ్ కన్వర్షన్లు.. ఏ పనికైనా ఓ రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడతారు. ఆ రెండు నియోజకవర్గాల్లో రోడ్డు పనైనా, దేవాలయం అభివృద్ధి పనులైనా, చివరకు కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగే రైల్వే పనులైనా సరే వీరికి పర్సంటేజీ ఇవ్వాల్సిందే. లేదంటే పనులు జరగనివ్వరు... మొదట పోలీసులతో హెచ్చరికలు పంపుతారు. అప్పటికీ వినకపోతే తప్పుడు కేసులు బనాయిస్తారు. ఎదురుతిరిగితే దాడులకు సైతం తెగబడతారు.. ఇదీ జిల్లాలోని ఓ ముఖ్య నేత తనయుడి అరాచక పర్వం. సాక్షి, గుంటూరు: నడికుడి –శ్రీకాళహస్తి రైల్వే లైను నిర్మాణ పనులను అడ్డుకుని అక్కడ పనులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, కూలీలపై దాడులు చేయించి వాహనాలను ధ్వంసం చేసిన ఘటన ఆదివారం జరిగింది. రాజుపాలెం మండలం పెదనెమలిపురి గ్రామం వద్ద నుంచి నకరికల్లు మండలం మీదుగా రొంపిచర్ల వరకు 16 కిలోమీటర్ల మేర రైల్వే లైను నిర్మాణ పనులు ఐదు నెలలుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్య నేత తనయుడి కళ్ళు ఈ పనులపై పడ్డాయి. వెంటనే తనకు పర్సంటేజీ పంపాలంటూ రెండు నెలల క్రితం సదరు కాంట్రాక్టర్‌కు హుకుం జారీ చేశాడు. మాట వినకపోవడంతో అప్పట్లో వాహనాలను తీసుకెళ్ళి పనులు నిలిపి వేయించాడు. కాంట్రాక్టర్ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వద్ద పంచాయతీ పెట్టడంతో నెలపాటు పనులు యథావిధిగా జరిగాయి. అయితే ఆదివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో రైల్వే పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళిన ముఖ్య నేత తనయుడి అనుచరులు వాహనాలను ధ్వంసం చేసి, ఉద్యోగులు, కూలీలపై విచక్షణా రహితంగా దాడులు చేసి భయానక వాతావరణం సృష్టించారు. భయభ్రాంతులకు గురైన కూలీలు పరుగులు తీశారు. మా నాయకుడి అనుమతి లేకుండా పనులు చేయడానికి మీకెంత ధైర్యంరా.. అంటూ కర్రలు, రాడ్లతో వారిపై విరుచుకుపడ్డారు. పర్సంటేజీ ఇచ్చి పనులు చేసుకోవాలంటూ కాంట్రాక్టర్ తరఫున పనిచేసే సైటు ఇన్చార్జిలకు వార్నింగ్‌లు ఇచ్చారు. జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఏ పనిచేయాలన్నా ఆయన అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఏ ఫైల్‌పై సంతకం పెట్టాలన్నా, అధికారులు ఆయన గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూడాల్సిందే. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రెండు నియోజకవర్గాల్లో ముఖ్య నేత తనయుడు చేస్తున్న దౌర్జన్యకాండకు ఎందరో వ్యాపారులు, కాంట్రాక్టర్లు, చివరకు రైతులు సైతం బలైపోయి తీవ్రంగా నష్టపోయారు. ఈయనకు అధికార పార్టీ మంత్రులన్నా, చివరకు ముఖ్యమంత్రి మాటన్నా... లెక్కలేదు. ధనార్జనే ధ్యేయంగా వ్యాపారులు, కాంట్రాక్టర్ల వద్ద వసూళ్ళకు పాల్పడుతున్నారు. లాటరీ విధానంలో మద్యం దుకా ణం దక్కించుకున్న ప్రతి ఒక్కరి వద్ద ఒక్కో షాపునకు రూ.20 లక్షల చొప్పున వసూలు చేశారు. ఒక్క ఎకరా వ్యవసాయ భూమి ల్యాండ్ కన్వర్షన్ చేయాలన్నా ముఖ్య నేత తనయుడికి కప్పం కట్టాల్సిందే. బార్ లైసె న్సు రెన్యూవల్ చేయాలన్నా, వ్యాపార సముదాయాల నిర్మాణం జరగాలన్నా ఆయన వాటా ఆయనకు ఇస్తేనే ఫైల్ ముందుకు కదులుతోంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిధులతో జరిగే ఏ పనులకైనా సదరు కాంట్రాక్టర్లు ఆయన అడిగినంత పర్సంటేజీ ముట్టజెప్పిన తరువాత మాత్రమే పనులు నిర్వహించాల్సి ఉంటుంది. అలా కాదని ఎదురు తిరిగితే ఆయన అనుచరులు, కొంత మంది గూండాలతో కలిసి దౌర్జన్యంగా పనులను నిలిపివేయడం, అక్కడ ఉండే వాహనాలను ధ్వంసం చేయడం, చివరకు కూలీలు, అధికారులను సైతం కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. కొత్తగా పీబీటీ పేరుతో ప్రతి ఒక్కరి నుంచి టాక్స్ రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు ఈయన దౌర్జన్యాలపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
అకృత్యాలకు అంతం లేదా?
నిన్న అరుణ.. నేడు రేవతి.. రేపు ఇంకెవరో! దేశంలో అమ్మాయిల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. రెండేళ్ల పాటు ప్రేమించి, కాలక్షేం చేసి.. చివరకు పెళ్లి చేసుకొమ్మని అడిగినందుకు కిరోసిన్ పోసి తగలబెట్టేశాడో దుర్మార్గుడు. ఈ దారుణం నల్లగొండ జిల్లాలో జరిగింది. ఆ సంఘటనలో తీవ్రంగా గాయపడిన బీటెక్ విద్యార్థిని అరుణ.. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అసువులు బాసింది. ఇక మూడు నాలుగు రోజుల్లో పెళ్లి ఉందనగా, ఇంకా కాళ్ల పారాణి పెట్టుకోక ముందే, పట్టుబట్టలు కట్టుకోకముందే కాటికి పంపేశాడో నీచుడు. ప్రేమిస్తున్నానని వేధించాడు. కాదు, నేను చదువుకుంటున్నానని ఆమె తిరస్కరించింది. పెద్దలు కూడా మందలించారు. ఈలోపు ఆమెకు పెళ్లి కుదిరింది. అంతే, అతడిలోని రాక్షసుడు నిద్రలేచాడు. ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని, ఇంటికి వెళ్లి ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈమె కూడా బీటెక్ విద్యార్థినే. ఈ ఇద్దరు అమ్మాయిల ఉదంతాలు ఒకే సమయంలో.. ఒకేలా చోటుచేసుకున్నాయి. రోడ్డుమీదకు అమ్మాయి వెళ్లిందంటే ఎలా తిరిగొస్తుందోనని తల్లిదండ్రులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని భయపడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారి మానప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతోంది. కంటికి కాస్త నదురుగా కనపడితే చాలు.. ప్రేమిస్తున్నామంటూ వెంటపడుతున్నారు. కొంతమంది దాన్ని నిరాకరిస్తుంటే, మరికొందరు అమాయకంగా ఆ వలలో పడిపోతున్నారు. ఏం చేసినా చివరకు మాత్రం వారి కథలు విషాదాంతాలే అవుతున్నాయి. పాపం అరుణ, రేవతి ఆస్పత్రులలో నాలుగైదు రోజుల పాటు నరకయాతన అనుభవించారు. దాదాపు 60-70 శాతం వరకు శరీరంపై కాలిన గాయాలు అయినప్పుడు ఎంత నరకం అనుభవిస్తారో!! కాకినాడ ఆస్పత్రిలో రేవతి పెట్టిన కేకలు ఇప్పటికీ ఆ తల్లిదండ్రుల గుండెల్లోనే కాదు.. చూసిన ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నా అంతా అయిపోయిన తర్వాత నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామంటూ చెబుతున్నారు తప్ప.. వీటిని నిరోధించడానికి చర్యలు తీసుకున్న పాపాన పోవట్లేదు. పెప్పర్ స్ప్రేలు, లేజర్ గన్నుల్లాంటివి వచ్చాయని చెబుతున్నా.. అవి ఎంతమందికి అందుబాటులో ఉంటున్నాయో ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆ తల్లిదండ్రుల కడుపుకోతను ఎవరు తీరుస్తారు? చిన్నపిల్లలని కూడా చూడకుండా కామాంధులు కాటేస్తుంటే.. ఈ యంత్రాంగం మాత్రం కుంభకర్ణుడి వారసత్వం తీసుకుంటోంది. దేవుడా రక్షించు ఈ దేశాన్ని.. కామాంధుల నుంచి.. ప్రేమ ముసుగులోని కాళ రాక్షసుల నుంచి!!