Transgenders Behave Rudely With Guests At Housewarming Ceremoney In Bengaluru, Demands Money - Sakshi
Sakshi News home page

Bangalore Transgenders Incident: అడిగినంత ఇస్తారా? లేదా? గృహ ప్రవేశంలో హిజ్రాల గొడవ

Published Thu, Jun 29 2023 12:40 AM | Last Updated on Thu, Jun 29 2023 3:29 PM

రగడ చేస్తున్న హిజ్రాలు (వృత్తంలో)   - Sakshi

రగడ చేస్తున్న హిజ్రాలు (వృత్తంలో)

యశవంతపుర: ఇంటి గృహ ప్రవేశానికి అడగకుండానే వచ్చి అడిగినంత డబ్బులు ఇవ్వలేదనే కోపంతో హిజ్రాలు అసభ్యంగా ప్రవర్తించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.

వయాలికావల్‌ సమీపంలో ఒక కుటుంబ బుధవారం గృహ ప్రవేశం చేసుకున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ముగ్గురు హిజ్రాలు ఒక్కసారిగా ఇంటిలోకి చొరబడ్డారు. వారికి ఇంటి యజమానులు భోజనం తినాలని ఆహ్వానించారు.

మాకు అన్నం వద్దు, డబ్బులు ఇవ్వాలని హిజ్రాలు కిరికిరి పెట్టారు. ఐదు వందల రూపాయలు ఇవ్వబోగా, ఒక్కొక్కరికి రూ. ఐదు వేలు ఇవ్వాలని గొడవకు దిగారు. అందరినీ నోటికొచ్చినట్లు తిట్టి అసభ్యంగా ప్రవరించారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వ్యాప్తి చెందింది. కాగా హిజ్రాలపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇటీవలి కాలంలో ఈ తరహా కేసులు వీపరీతంగా పెరిగాయని బెంగళూరు వాసులు వాపోతున్నారు. డబ్బులు డిమాండ్ చేయడం, ఇవ్వకపోతే దాడికి దిగడం, డబ్బు/ వస్తువులు బలవంతంగా లాగేసుకోవడం జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. కొందరయితే పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement