Hijra
-
హిజ్రాతో ప్రేమ.. నంద్యాలలో విషాదం
బొమ్మలసత్రం (నంద్యాల): హిజ్రాల చర్యలతో ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దంపతులు కోలుకోలేక మంగళవారం మృతిచెందారు. నంద్యాల ఎస్బీఐ కాలనీకి చెందిన సుబ్బరాయుడు(43), సరస్వతి(37) దంపతుల కుమారుడు సునీల్ బీటెక్ మొదటి సంవత్సరం ఫెయిలై ఆటో డ్రైవర్ల జత కట్టాడు. ఈనేపథ్యంలో హిజ్రాలతో తిరుగుతూ ఓ హిజ్రాతో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సునీల్‌ను తీసుకొచ్చి బంధువుల వద్దకు పంపారు. అప్పటి నుంచి హిజ్రాల బృందం సుబ్బరాయుడు దంపతులు నడుపుతున్న దుకాణం వద్దకు వచ్చి వికృత చేష్టలతో వేధించడం, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురై పురుగు మందు తాగారు. స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో బంధువులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి్పంచినా కోలుకోలేక దంపతులిద్దరూ మృతి చెందారు. ఏరియా ఆస్పత్రిలో గర్భిణి మృతి -
ఆధిపత్యం కోసమే అంతమొందించారు
నెల్లూరు (క్రైమ్): ఆధిపత్యం, పాత కక్షల నేపథ్యంతోనే హిజ్రా సంఘ నాయకురాలు మానికల హాసిని హత్య జరిగినట్లు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ చెప్పారు. ఈ కేసులోని 15 మంది నిందితుల్లో 12 మందిని అరెస్ట్ చేశామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో హాసిని హత్యకు దారి తీసిన పరిస్థితులు, నిందితుల వివరాలను ఎస్పీ ఆదివారం వివరించారు.తోటపల్లిగూడూరు మండలం చిన్నచెరుకూరుకి చెందిన హాసిని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటుగా కర్ణాటకలోని బళ్లారి, రాయచూర్, ధార్వాడ్, చిక్‌మగ్‌ళూరు, హుబ్లీ జిల్లాల్లోని ట్రాన్స్జెండర్లకు నాయకురాలు. నెల్లూరు జిల్లాకు చెందిన హిజ్రా సంఘ మాజీ నాయకురాలు అలేఖ్య అలియాస్ అనిల్‌కుమార్‌కు హాసిని మధ్య విభేదాలున్నాయి. ఇద్దరి మీద నెల్లూరు, తిరుపతి జిల్లాలో పలు కేసులున్నాయి. హాసినికి బోడిగాడితోటకు చెందిన షీలా, సులోచనతోనూ విబేధాలున్నాయి. ఇవి తారస్థాయికి చేరుకోవడంతో హాసినిని అంతమొందించాలని వీరందరూ నిర్ణయించుకుని సుందరయ్యకాలనీకి చెందిన రౌడీషిటర్ చింతల భూపతిని,నెల్లూరు రూరల్ మండలానికి చెందిన మరో రౌడీషిటర్‌ను సంప్రదించారు.వీరి ద్వారా కొందరిని సమీకరించుకుని సుపారీ ఇచ్చి అదను కోసం వేచి చూడసాగారు. గత నెల 26న రాత్రి హాసినిని టపాతోపు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నిందితులు హత్య చేశారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను గుర్తించారు. కోవూరు అండర్ బ్రిడ్జి వద్ద కార్లలో వెళ్తున్న నిందితులైన రౌడీషిటర్ వంశీకృష్ణ అలియాస్ నాని, రాము, కార్తీక్, సుబ్రహ్మణ్యం, షేక్ మస్తాన్ వలీ అలియాస్ వలీ, వెంకటాద్రి, రాజే‹Ù, వంశీ, షీలా అలియాస్ శ్రీనివాసులు, అలేఖ్య అలియాస్ అనిల్ కుమార్, చింతల భూపతి, ఓ బాలుడిని అరెస్ట్ చేశారు. -
హిజ్రాగా మారిన భార్య స్నేహితురాలితో సహజీవనం..
సాక్షి, చైన్నె: అదృశ్యమైన తన భార్య తిరునంబీగా (హిజ్రా) మారి స్నేహితురాలితో సహజీవనం చేస్తుండడం ఓ భర్తకు షాక్‌గా మారింది. ఈ వ్యవహారంపై ఆ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం వివరాలు.. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి సమీపంలోని అర్థనారీ పాళయానికి చెందిన 27 ఏళ్ల యువకుడికి ఏడు నెలల క్రితం సమీపంలోని మరో గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతితో వివాహం జరిగింది. ఓ మూడు నెలలు అత్తారింట్లో ఉన్నా గంటల తరబడి తన స్నేహితురాలైన యువతితో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. భర్తను దూరం పెట్టడమే కాకుండా, ఆమె నడవడిక మారడంతో కుటుంబ సభ్యులు అందరూ విస్మయం చెందారు. ఆ తర్వాత ఓ రోజున ఆమె అదృశ్యమైంది. తన భార్య కనిపించడం లేదంటూ ఆలియూరు పోలీసులను ఆ భర్త ఆశ్రయించాడు. పోలీసులు యువతి కోసం మూడు నెలలు తీవ్రంగానే గాలించారు. చివరకు విచారణలో ఆ యువతి తిరునంబీ (హిజ్రా)గా మారి చైన్నెలో తన స్నేహితురాలితో కలిసి భార్య, భర్తలుగా జీవనం సాగిస్తున్నట్లుగా గుర్తించారు. గత వారం రంగంలోకి దిగిన పోలీసులు హిజ్రాగా మారిన ఆ యువతిని, ఆమె స్నేహితురాలిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఇద్దర్నీ విడదీశారు. హిజ్రాగా మారిన తన భార్యను చూసిన ఆ భర్తకు షాక్ తప్పలేదు. హిజ్రాగా మారిన ఆ యువతిని ఆమె భర్తతో పోలీసులు పంపించేశారు. స్నేహితురాలిని చైన్నెకు వెళ్లమని ఆదేశించారు. ఇక్కడే అసలైన ట్విస్టు ఆ భర్తకు ఎదురైంది. హిజ్రాగా మారిన తన భార్య మూడు నెలల గర్భవతి అని తేలడంతో తలలు పట్టుకున్నారు. ఆ నోటా... ఈ నోటా పడి చివరకు గ్రామానికి ఈ సమాచారం తెలియడంతో శనివారం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇదే అదనుగా హిజ్రాగా మారిన ఆ యువతి, చైన్నెలోని తన స్నేహితురాలి వద్దకే మళ్లీ ఉడాయించడం గమనార్హం. దీంతో తన మానసిక పరిస్థితి ఏమిటో అంతు చిక్కక ఆ భర్త మళ్లీ పోలీసుల వద్దకు వచ్చి తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేయడం కొసమెరుపు. -
మత్తు మాత్రలు ఇచ్చి హిజ్రాపై లైంగిక దాడి
తమిళనాడు: మత్తుమాత్రులు మింగించి హిజ్రాపై లైంగిక దాడి చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై పెరంబూరు ప్రాంతానికి చెందిన జన్నీ, బ్లసికా హిజ్రాలు. వీరిద్దరూ సోమవారం రాత్రి మధురవాయిల్ పూందమల్లి హైవే రోడ్లు జీసస్ కాల్స్ వద్ద నిలబడి ఉన్నారు. ఆ సమయంలో ఆటోలో వచ్చిన మద్యం మత్తులో వున్న ఇద్దరు బ్లసికాతో మాటలు కలిపారు. తర్వాత హఠాత్తుగా కత్తిని చూపెట్టి బ్లసికాను ఆటోలు బలవంతంగా తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇది చూసి జన్నీ వెంటనే మధురవాయిలు పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఇన్స్పెక్టర్ సుబ్రమని సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా సెట్టియార్ అగరం ప్రాంతంలో వున్నట్టు గుర్తించారు. అక్కడికి వెళ్లి మద్యం మత్తులో ఉన్న ఆవడికి చెందిన జగన్, రామాపురానికి చెందిన దినేష్ లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి బ్లసికాను విడిపించారు. ఆ సమయంలో మత్తు మధ్యలో యువకులు సబ్ ఇన్స్పెక్టర్ మహారాజాపై దాడి చేసి తప్పించుకుని పోవడానికి ప్రయతి్నంచారు. పోలీసులు వారిని పట్టుకుని అరెస్టు చేశారు. బ్లసికాను చికిత్స కోసం కీల్పాక్కం ఆస్పత్రికి తరలించారు. -
నాడు యాచక వృత్తి.. నేడు సూపర్వైజర్
నందిగామ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి మేలు జరుగుతోంది. ఇందుకు తానే ఉదాహరణ అని ఎన్టీఆర్ జిల్లా నందిగామకి చెందిన ట్రాన్స్‌జెండర్ ఇనపనుర్తి సహస్ర అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం వల్లే యాచక వృత్తి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు సూపర్వైజర్గా రాణిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా సహస్ర మాట్లాడుతూ.. ‘నా అసలు పేరు సురేష్. చిన్నతనం నుంచి మహిళగా మారాలని కోరిక. పదవ తరగతి పూర్తికాగానే ఢిల్లీకి వెళ్లాను. అక్కడ హిజ్రాగా మారి నందిగామ వచ్చాను. అందరూ నన్ను దూరంగా పెట్టారు. చేద్దామంటే పని దొరకలేదు. దీంతో యాచించడం తప్ప మరోమార్గం దొరకలేదు. నేను డిగ్రీ పూర్తి చేశాను. ఉద్యోగం కోసం ప్రయత్నించినా రాలేదు. 2019లో సీఎం జగన్ ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు ద్వారా ఏపీఎస్‌బీసీఎల్‌కు చెందిన మద్యం దుకాణంలో సూపర్వైజర్గా ఉద్యోగం వచ్చింది. తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాను. సీఎం జగన్ చలవతోనే నేడు నాకు గౌరవం దక్కుతోంది’ అని తెలిపింది. ఇది కూడా చదవండి: కాకినాడ తునిలో దారుణం: మహిళా చిరు వ్యాపారిని డబ్బు కోసం బెదిరించి.. -
రూ.6కోట్ల చిట్టీ డబ్బులతో ఉడాయించిన హిజ్రా
యాదగిరిగుట్ట రూరల్: చిట్టీ డబ్బులు రూ.6కోట్లతో ఉడాయించిన హిజ్రాను బాధితులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన యాదగిరిగుట్ట పట్టణంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం.. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన ఓ హిజ్రా గత 25 సంవత్సరాల నుంచి ప్రజలతో మమేకమై చిట్టీల వ్యాపారం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో పట్టణానికి చెందిన సుమారు 50 మంది వ్యక్తులు సదరు హిజ్రా వద్ద చిట్టీలు వేశారు. ఎత్తిన చిట్టీలు ఇవ్వకుండా తర్వాత ఇస్తానని చెప్పి, సుమారుగా రూ.6కోట్లతో ఎవరికీ నాలుగు రోజల క్రితం ఆమె పారిపోయింది. విషయం తెలుసుకున్న బాధితులు హిజ్రా కోసం గాలించి పట్టుకుని ఆదివారం యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో అప్పగించారు. కాగా హిజ్రా ముందుజాగ్రత్తగా ఐపీ పెట్టుకుని పారిపోయిందని, ఆమె మీద కేసు చేయడానికి వీల్లేదని, ఆమెతో మాట్లాడి డబ్బులు సెటిల్ చేసుకోవాలని పోలీసులు బాధితులకు సలహా ఇచ్చారు. -
నకిలీ హిజ్రా హల్చల్
యశవంతపుర: విలావంతమైన జీవనం కోసం మారువేషం వేసి వీధుల్లో భిక్షం అడుగుతున్న వ్యక్తిని బాగలగుంట పోలీసులు అరెస్ట్ చేశారు. బాగలగుంటకు చెందిన చేతన్ హిజ్రా వేషంలో భిక్షాటన చేయటం ప్రారంభించాడు. పెళ్లి చేసుకున్న చేతన్‌కు పిల్లలున్నారు. విలాసవంతమైన జీవనానికి అలవాటు పడిన చేతన్ డబ్బుల కోసం మహిళ వేషం వేసి హిజ్రాలతో కలిసి నాగసంద్ర మెట్రోస్టేషన్ వద్ద భిక్షాటన చేస్తున్నారు. డబ్బులివ్వని వారిపై దౌర్జన్యం చేసేవాడు. నాగసంద్ర మెట్రోస్టేషన్ వద్ద ఆక్రమంగా షెడ్ వేసుకున్నాడు. ఈనెల 13న బీఎంఆర్సీఎల్ అధికారులు షెడ్‌ను తొలగించే విషయంపై పరిశీలన చేయగా అధికారులపై కూడా దౌర్జన్యం చేశాడు. స్థానికులు పట్టుకొని చేతన్‌ను చితకబాది అసలు విషయాన్ని బహిరంగం చేశారు. అనంతరం బాగలగుంట పోలీసులు చేతన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఆర్టీసీ బస్‌లో హిజ్రాలకు ఫ్రీ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
రాయచూరు రూరల్: శఽక్తి పథకంలో ట్రాన్స్జెండర్ల(హిజ్రా)కు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కండక్టర్‌తో హిజ్రా వాదించిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. బుధవారం ఆర్టీసీ బస్టాండ్‌లో రాయచూరు నుంచి యాదగిరి వెళ్లే బస్సులో లక్ష్మి అనే హిజ్రా ప్రయాణానికి బయల్దేరింది. ఉచిత టికెట్ కోసం ప్యాసింజర్ లక్ష్మి తన ఆధార్ కార్డును తీసి కండక్టర్‌కు ఇచ్చింది. అయితే కండక్టర్ ఈ ఆధార్ చెల్లదని టికెట్‌కు డబ్బులివ్వాలన్నాడు. లక్ష్మి తాము కూడా మహిళల విభాగంలోకి వస్తామని సీఎం తెలిపారని బదులివ్వడంతో వివాదం సద్దుమణిగింది. హిజ్రా లక్ష్మి చొక్కా, జీన్స్ ప్యాంట్ ధరించడంతో పురుషుడు అనుకుని కండక్టర్ వాదనకు దిగాడు. కాగా లక్ష్మిని యాదగిరి జిల్లా శహపుర తాలూకా తడబడి గ్రామ నివాసిగా గుర్తించారు. -
పోలీస్ స్టేషన్లోనే తన్నుకున్న హిజ్రాలు
-
చేతులెత్తేసిన పోలీసులు.. పీఎస్‌లో హిజ్రాల రణరంగం
సాక్షి, నల్లగొండ: మిర్యాలగూడ వన్ పోలీస్ స్టేషన్ రణరంగంగా మారింది. పోలీస్ స్టేషన్లోనే హిజ్రాలు రెచ్చిపోయారు. రెండు గ్రూప్‌లుగా విడిపోయి తీవ్రంగా కొట్టుకున్నారు. ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గం హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం స్టేషన్‌కు చేరుకుంది. రెండు వర్గాలు ఎదురెదురు పడటంతో తీవ్ర వాగ్వివాదం జరిగింది. పోలీస్ స్టేషన్లోనే రెండు వర్గాలు కొట్టుకున్నాయి. రాళ్లతో దాడి చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఏం చేయాలో అర్థంకాక పోలీసులు చేతులెత్తేశారు. దీంతో పీఎస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హాజ్రాలు తన్నుకున్న వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. చదవండి: కేసీఆర్ సారు సల్లంగుండాలె బిడ్డా.. -
Bangalore : అడిగినంత ఇస్తారా? లేదా? గృహ ప్రవేశంలో హిజ్రాల గొడవ
యశవంతపుర: ఇంటి గృహ ప్రవేశానికి అడగకుండానే వచ్చి అడిగినంత డబ్బులు ఇవ్వలేదనే కోపంతో హిజ్రాలు అసభ్యంగా ప్రవర్తించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. వయాలికావల్ సమీపంలో ఒక కుటుంబ బుధవారం గృహ ప్రవేశం చేసుకున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ముగ్గురు హిజ్రాలు ఒక్కసారిగా ఇంటిలోకి చొరబడ్డారు. వారికి ఇంటి యజమానులు భోజనం తినాలని ఆహ్వానించారు. మాకు అన్నం వద్దు, డబ్బులు ఇవ్వాలని హిజ్రాలు కిరికిరి పెట్టారు. ఐదు వందల రూపాయలు ఇవ్వబోగా, ఒక్కొక్కరికి రూ. ఐదు వేలు ఇవ్వాలని గొడవకు దిగారు. అందరినీ నోటికొచ్చినట్లు తిట్టి అసభ్యంగా ప్రవరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందింది. కాగా హిజ్రాలపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవలి కాలంలో ఈ తరహా కేసులు వీపరీతంగా పెరిగాయని బెంగళూరు వాసులు వాపోతున్నారు. డబ్బులు డిమాండ్ చేయడం, ఇవ్వకపోతే దాడికి దిగడం, డబ్బు/ వస్తువులు బలవంతంగా లాగేసుకోవడం జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. కొందరయితే పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. -
హిజ్రాను పెళ్లి చేసుకున్న యువకుడు!
సాక్షి, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, వాటి పరిసరాల్లో వివాహాలు చేసుకోకూడదన్న నిబంధనను ధిక్కరించి మరీ వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన హిజ్రా పింకి, హైదరాబాద్‌కు చెందిన యువకుడు శ్రీనివాస్ ఒకరినొకరు ఇష్టపడి శనివారం ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఐదేళ్లుగా కలిసే ఉంటున్న వీరి పెళ్లికి ఇరువురు పెద్దలూ అంగీకరించడంతోనే ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, అమావాస్య పేరుతో అధికారులెవరూ విధులకు హాజరుకాకపోవడం కూడా ఈ జంటకు కలిసొచ్చింది. చదవండి: బస్సులోనే చనిపోయిన ప్రయాణికుడి మృతదేహాన్ని అదే బస్సులో ఇంటికి చేర్చిన సిబ్బంది -
హిజ్రా పెళ్లి అదిరిపొయ్యింది
-
వీడిన సనత్ నగర్ బాలుడి హత్య కేసు మిస్టరీ.. అదే కారణం!
సాక్షి, హైదరాబాద్: సనత్ నగర్లో ఎనిమిదేళ్ల బాలుడు వహీద్ హత్య కేసు మిస్టరీ వీడింది. మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు బాలుడి హత్యకు నరబలికి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. వహీద్ హత్యకు ఆర్ధిక వివాదాలే కారణమని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలను బాలనగర్ డీసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. వహీద్‌ను ఇమ్రాన్ అనే ట్రాన్స్ జెండర్ హత్య చేసినట్లు డీసీసీ చెప్పారు. బాలుడి తండ్రి, ఇమ్రాన్ మధ్య చిట్టి విషయంలో గొడవలు ఉన్నట్లు తేలిందన్నారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం బాలుడిని ఆమె ఎత్తుకెళ్లి చంపేసినట్లు తెలిపారు. మహీద్‌ను హత్య చేసి మృతదేహాన్ని బకెట్లో కుక్కినట్లు పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ సాయంతో మృతదేహన్ని గోనెసంచిలో మూటకట్టి నాలాలో పడేశారని చెప్పారు. బాలుడి కిడ్నాప్‌కు నలుగురు వ్యక్తులు సహకరించారని.. ఈ హత్యకేసులో అయిదుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా హత్యపై వివరాలు సేకరించామని.. వహీద్ హత్యపై విస్తృత దర్యాప్తు జరుగుతోందన్నారు. చదవండి: Ramadan 2023: పాతబస్తీ, సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు -
హైదరాబాద్‌లో దారుణం.. అమావాస్య రోజున బాలుడిని బలిచ్చిన హిజ్రా?
సాక్షి, హైదరాబాద్: సనత్‌నగర్‌లో దారుణం వెలుగుచూసింది. అల్లావుద్దీన్ కోటి ఏరియాలో గురువారం ఏనిమిదేళ్ల బాలుడు అబ్దుల్ వహీద్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. బాలుడి మృతదేహం సమీపంలోని ఓ నాలాలో గుర్తించారు. అయితే అమావాస్య రోజున బాలుడిని ఓ హిజ్రా నరబలి ఇచ్చిన్నట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. నాలుగో తరగతి చదువుతున్న అబ్దుల్ వహీద్ (8) గురువారం సాయంత్రం నమాజ్ చేయడానికి వెళ్లి తప్పిపోయాడు. అయితే రాత్రి అవుతున్న బాలుడి ఇంటికి చేరుకోకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అనంతరం సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రాత్రి 8.30 గంటలకు బకెట్లో కుక్కి ఉన్న బాలుడి మృతదేహాన్ని జింకలవాడ నాలాలో స్థానికులు గుర్తించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నాలా నుంచి వెలికితీశారు. కాగా వహీద్ ఇంటి పక్కనే ఉంటున్న ఇమ్రాన్ అనే మహిళ(హిజ్రా).. బాలుడిని మజీద్ నుంచి నేరుగా తనతో తీసుకెళ్లిన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. బాలుడిని చంపి ఓ బస్తాలో వేసుకొని ఆటోలో తీసుకువెళ్లిన్నట్లు చెబుతున్నారు. ఆటోలో మృతదేహాన్ని తీసుకువెళ్లిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అవ్వడంతో స్థానికులు ఆటో డ్రైవర్‌ను పట్టుకొని చితకబాదారు. హిజ్రా ఇంటిపై బాలుడి బంధువులతోపాటు స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. (చదవండి: పాతబస్తీ, సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు) విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానాకి చేరుకుని పరిస్థితిని ఆదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నరబలి ఇచ్చిన్నట్లుగా అనుమానిస్తున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బాలుడి మృతికి హిజ్రాయే కారణమా? మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మంత్రి తలసాని విచారం.. సనత్ నగర్ బాలుడి మృతి ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఎనిమిదేళ్ల బాలుడు వహీద్ హత్యకు గురువ్వడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసు అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. దోషులు ఎంతటి వారైనా చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. (Hyderabad: బాత్రూమ్లో జారిపడి గర్భిణి మృతి ) -
హిజ్రాల తెగింపు.. రోజంతా హోటల్లో ఉంచి.. అర్థనగ్నంగా వీడియో తీసి!
సాక్షి, బెంగళూరు: బెంగళూరు నగరంలో ఓ వ్యక్తిని హిజ్రాలు నిలువు దోపిడీ చేశారు. ఒక రోజు పాటు ఓ హోటల్లో ఉంచుకుని రూ. 4 లక్షలు వసూలు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితుడు షేక్ శ్రీనివాససన్ అశోక్‌నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వివరాలు... ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ శ్రీనివాసన్ (49) గత నెల 30న రాత్రి నగరంలోని ఓ హోటల్లో భోజనం చేసి ఇంటికి బయలుదేరాడు. ఈ సమయంలో ఇద్దరు హిజ్రాలు శ్రీనివాసన్‌ను బలవంతంగా ఆటోలో ఎక్కించుకున్నారు. ఆటోలో తిప్పుతూ 31 తేదీ రాత్రి వేకువజామున రెసిడెన్సీ రోడ్డులోని హోటల్‌కు తీసుకెళ్లారు. మరో ఇద్దరు హిజ్రాలను పిలిపించుకుని శ్రీనివాసన్‌ను అర్దనగ్నంగా వీడియో తీసి అతడి వద్ద గల గడియారం, ఉంగరం, డెబిట్ కార్డు, బంగారుచైన్, రూ.40 వేల నగదు లాక్కుని బెదిరించి వీడియో వైరల్ చేస్తామని గూగుల్‌పే ద్వారా లక్ష రూపాయలు, డెబిట్‌కార్డు పిన్ నెంబరు తెలుసుకుని రూ.2.90 లక్షలు నగదు డ్రా చేసుకుని ఉడాయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ప్రభుత్వ టీచర్‌గా హిజ్రా.. చదువుపై ఇష్టంతో.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా..
రాయచూరు రూరల్(కర్ణాటక): అవకాశాలు ఇస్తే ఏ రంగంలోనైనా ప్రతిభ చాటుకుంటామని హిజ్రాలు రుజువు చేస్తున్నారు. అశ్వత్థామ అలియాస్ పూజా (26) అనే ట్రాన్స్‌జెండర్ ప్రభుత్వ పాఠశాల టీచర్‌గా ఎంపికయ్యారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఉపాధ్యాయ పరీక్షలలో పూజా కి ఉద్యోగం దక్కింది. మాన్వి తాలూకా నీరమాన్విలో ప్రభుత్వ పాఠశాలలో సోషల్ టీచర్‌గా ఇప్పుడు పనిచేస్తున్నారు. హిజ్రా కోటాలో ఉద్యోగం లభించినట్లు పూజా తెలిపారు. ఆమె నీరమాన్విలోనే టెన్త్ వరకూ కన్నడలో విద్యనభ్యసించింది. తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తారు. పూజా మాట్లాడుతూ 16 ఏళ్ల వయసులో ఉండగా హిజ్రాగా మారినట్లు తెలిపారు. చదువుపై ఇష్టంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకుని బీఏ, బీఈడీ పూర్తి చేసినట్లు చెప్పారు. చదవండి: Hyderabad: మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ కొంపముంచిన ‘చిత్రాలు’ -
Banjara Hills: ఆశీర్వాదం కోసం వచ్చి హిజ్రా సెల్‌ఫోన్ చోరీ
సాక్షి, హైదరాబాద్: హిజ్రావద్ద ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చి సెల్‌ఫోన్ తస్కరించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం–12లోని ఎన్బీటీనగర్లో నివాసం ఉంటున్న ఆర్తి అగర్వాల్ అనే హిజ్రా వద్దకు శనివారం సాయంత్రం గుర్తుతెలియని యువకుడు వచ్చాడు. తనను ఆశీర్వదించాలని హిజ్రాను కోరాడు. ఆమె ఆశీర్వదిస్తున్న సమయంలో పక్కనే ఉన్న సెల్‌ఫోన్‌ను తస్కరించాడు. కాసేపటికి ఈ విషయాన్ని గుర్తించి ఆర్తి అగర్వాల్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
Hyderabad: వ్యభిచారం అంటూ హిజ్రాకు బెదిరింపులు.. తోటి హిజ్రాలతో కలిసి..
బంజారాహిల్స్: ఆన్లైన్ వ్యభిచారం నడిపిస్తున్నారంటూ ఓ హిజ్రా ఇంటికి వెళ్లిన నలుగురు విలేకరులకు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... భారత్ తెలుగు న్యూస్‌లో న్యూస్ రిపోర్టర్ పి.సాయికిరణ్ రాజు, టీజీ 24/7 న్యూస్ రిపోర్టర్ కె.సంపత్ విజయ్ కుమార్, యాకుబ్‌పాషా, ప్రీలాన్స్ రిపోర్టర్ కె.ప్రశాంతి తదితరులు ఆదివారం అర్ధరాత్రి వెంకటగిరి సమీపంలోని హైలం కాలనీలో నివసించే హిజ్రా(26) ఇంటికి వెళ్లారు. ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారంటూ ఆమెతో చెప్పగా అందుకు సదరు హిజ్రా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి వాగ్వాదానికి దిగింది. రూ. 2 లక్షలు డిమాండ్ చేయడమే కాకుండా తన సెల్ఫోన్లు ధ్వంసం చేశారని బాధిత హిజ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు విధాలా బెదిరించడంతో బాధితురాలు సహచర హిజ్రాలతో కలిసి ఈ నలుగురు విలేకరులను చితకబాది పోలీసులకు అప్పగించారు. (చదవండి: భయమేస్తోంది! చార్జింగ్ పెట్టిన గంటకే పేలిన ఎలక్ట్రికల్ బైకులు) -
Hyderabad: జేబులో ఉన్న డబ్బులు లాక్కున్న హిజ్రాలు.. ఇదేంటని ప్రశ్నిస్తే..
సాక్షి, బంజారాహిల్స్: యువకుడి నుంచి డబ్బులు లాక్కోవడమే కాకుండా రాయితో కొట్టి గాయపర్చిన ఘటనలో ఇద్దరు హిజ్రాలపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాలివీ... గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత మదీనా వద్ద నివసించే సయ్యద్ షాబాజ్(26) కృష్ణానగర్ వైపు నుంచి ఇందిరానగర్ వైపు బైక్‌పై వస్తుండగా ఇద్దరు హిజ్రాలు అడ్డగించారు. ఆయనతో మాటా మాటా కలిపారు. మాటల్లోకి దింపి ఆయన జేబులో ఉన్న రూ. 500లు లాక్కున్నారు. ఇదేమిటని ఆ యువకుడు ప్రశ్నిస్తుండగానే మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వారి నుంచి తప్పించుకొని వెళ్తుండగానే ఓ హిజ్రా రాయితో కొట్టడంతో షాబాజ్‌కు గాయాలయ్యాయి. అదే రాత్రి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హిజ్రాల కోసం గాలిస్తున్నారు. చదవండి: తాత కళ్లముందే దారుణం.. హైదరాబాద్‌లో మరో పరువు హత్య? -
బంజారాహిల్స్: హిజ్రాల కోసం వచ్చి కత్తులు చూపి బెదిరించి..
సాక్షి, బంజారాహిల్స్: హిజ్రాలపై కత్తులు చూపి దాడికి యత్నించిన ఇద్దరు యువకులను జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలివీ.. జూబ్లీహిల్స్ రోడ్ నెం.7లో సోమవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఎస్ఐ కృష్ణవేణి పెట్రోలింగ్ చేస్తుండగా ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వారిని ఆపాలని చూడగా తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వెంటనే సిబ్బందితో కలిసి వారు పరారవుతున్న బైక్‌ను ఆపి తనిఖీలు చేయగా వారి వద్ద ఓ కత్తి దొరికింది. ఇక్కడ హిజ్రాల కోసం వచ్చిన వీరిద్దరూ కత్తులు చూపి వారిని బెదిరించేందుకు యత్నిస్తున్నట్లుగా విచారణలో వెల్లడైందని ఎస్ఐ కృష్ణవేణి పేర్కొన్నారు. వీరి గురించి ఆరా తీయగా ఇందులో ఒకరు చిలకలగూడ జామియా మసీదు సమీపంలో నివసించే ఇమామ్(18)తోపాటు రసూల్‌పుర గన్‌బజార్‌కు చెందిన ఓ బాలుడు(17)గా తేలిందన్నారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 25(1) ఆరమ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు. చదవండి: ఏడో తరగతి నుంచి ప్రేమ.. కాదనడంతో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం -
హైదరాబాద్‌లో హిజ్రాల హల్చల్.. డబ్బులు డిమాండ్.. ఆపై!
సాక్షి, హైదరాబాద్: నేరేడ్మెట్ ప్రాంతంలో కొందరు హిజ్రాలు హల్చల్ చేశారు. స్థానికంగా పెళ్లి జరుగుతున్నఇంట్లోకి ప్రవేశించి ఏకంగా 50 వేల రూపాయలు డిమాండ్ చేశారు. అంత మొత్తంలో డబ్బులు పెళ్లి వారు ఇవ్వకపోవడంతో వారితో అసభ్యంగా ప్రవర్తించారు. డబ్బులు ఇవ్వాల్సిందేనని బట్టలు విప్పి హిజ్రాలు నానా హంగామా చేశారు. అంతటితో ఆగకుండా పెళ్లి వారిపై దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో బాధితులు పోలీసులకు సమాచారమివ్వగా.. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు హిజ్రాలను అదుపులోకి తీసుకొని నేరేడ్మెట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే హిజ్రాలు పోలీస్ స్టేషన్లో సైతం బట్టలు విప్పి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడంతో వారిపై 506, 448 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. స్టేషన్లో హంగామా చేసినందుకు ఐపీసీ 188, 51 (బి) డిజాస్టర్ మేనెజ్మెంట్ కింద మరో కేసు నమోదు చేశారు. -
ఇష్టపడి హిజ్రాను పెళ్లి.. మరో అమ్మాయిపై మోజు పెంచుకొని
సాక్షి, కుషాయిగూడ: ఇష్టపడి ఓ హిజ్రాను పెళ్లి చేసుకొని వేధింపులకు గురిచేస్తున్న భర్తపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన శుక్రవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేపల్లికి చెందిన బండారి నాగేందర్ (32), మల్లాపూర్, నేతాజీనగర్‌కు చెందిన గుత్తికొండ దివ్య (32) అనే హిజ్రాకు స్నేహం కుదిరింది. 2019 వరంగల్ మేడారం జాతరలో దివ్యను చూసిన నాగేందర్ 2019 నవంబరులో బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో వివాహం చేసుకున్నాడు. ఏడాది పాటుగా ఆనందంగా గడిపారు. గత కొన్ని రోజులుగా వైష్ణవి అనే అమ్మాయిపై మోజు పెంచుకొని తనను వేధించడం మొదలుపెట్టాడని దివ్య పోలీసుల ఎదుట వాపోయింది. ఆమెను వివాహం చేసుకొని తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటానని అందుకు అంగీకరించమంటూ మానసికంగా, శారీరకంగా వేధించినట్లు పోలీసులకు తెలిపింది. అంతే కాకుండా నాగేందర్ తల్లి శోభ, అక్క అఖిలవాణి తరచుగా ఫోన్ చేసి అసభ్య పదజాలంతో తనను దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వేంధిపులకు పాల్పడుతున్న నాగేందర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
మద్యం మత్తులో నిప్పంటించుకున్న హిజ్రా
సాక్షి, తిరువొత్తియూరు: మద్యం మత్తులో హిజ్రా నిప్పు అంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చెన్నై వ్యాసార్పాడిలో సోమవారం సాయంత్రం జరిగింది. చెన్నై వ్యాసార్పాడి బి.కల్యాణపురం ఆరవ వీధికి చెందిన నాగప్పన్ భార్య రాజకళ. వీరికి వున్న నలుగురు పిల్లలు. పెద్ద కుమారుడు సూర్య అనే లారా (29). నాలుగేళ్ల ముందు హిజ్రాగా మారాడు. మద్యం అలవాటు వున్న లారా రోజూ మద్యం తాగి వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని ఇరుగుపొరుగుతో చెప్పేవాడు. సోమవారం సాయంత్రం మద్యం తాగి వచ్చిన లారా ఇంటిలో ఉన్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. గాయపడ్డ అతన్ని చెన్నై కీల్పాక్కం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. చదవండి: పరారైన మోస్ట్ వాంటెడ్ హైదరాబాద్‌లో? -
వాడుకొని.. వదిలేశాడంటూ హిజ్రా హల్చల్
కుషాయిగూడ: పెళ్లి చేసుకొని తనను అన్ని విధాలా వాడుకొని ముఖం చాటేస్తున్నాడంటూ ఓ హిజ్రా శనివారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలంటూ హల్చల్ చేసింది. వివరాలివీ... మల్లాపూర్ నెహ్రూనగర్‌కు చెందిన దివ్య అనే హిజ్రాతో మెహిదీపట్నం, మల్లేపల్లికి చెందిన నాగేందర్ అనే యువకుడికి పరిచయం ఏర్పడింది. తరచు జాతరలు వెళ్తున్న క్రమంలో నాగేందర్‌కు తారసపడ్డ దివ్యతో పరిచయం పెంచుకొని కొన్ని రోజులు స్నేహం చేశాడు. వారితో తిరుగుతూ మద్యం తాగుతూ సరదాగా గడపడానికి అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించి 2019 నవంబర్‌లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి వారితోనే ఉంటున్నాడు. కుటుంబ సభ్యులను కలిసేందుకు అప్పుడప్పుడు వెళ్లి వచ్చేవాడు. గడిచిన ఏడాదిన్నరగా నాగేందర్ ఖర్చులతో పాటుగా అతడి ఇంటి పోషణకు కావాల్సిన డబ్బులు కూడా తానే ఇచ్చానని దివ్య చెబుతోంది. తీరా మరో అమ్మాయి మోజులో పడి నన్ను వదిలించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడని నాకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయంపై కుషాయిగూడ ఇన్స్పెక్టర్ మన్మోహన్‌ను వివరణ కోరగా ఫిర్యాదు వచ్చింది వాస్తవమేనన్నారు. ఇరువురితో మాట్లాడి మొదట కౌన్సిలింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ( చదవండి: ప్రేమ పేరుతో మోసం; యువతిని లైంగికంగా వాడుకొని.. ) -
నా పేరు శ్రీలేఖ.. ఓ యువకుడ్ని ప్రేమించా..
సాక్షి, మహబూబ్ నగర్ : హిజ్రాగా మారిన ఓ కుర్రాడు.. బంధువుతో వాట్సాప్ వీడియోకాల్ మాట్లాడుతూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. తనతోపాటు మరో ముగ్గురు జడ్చర్ల యువకులు హిజ్రాలుగా మారినట్టు అతను బయటపెట్టడం స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పురపాలిక పరిధి నక్కలబండ తండాకు చెందిన శ్రీకాంత్ (18) తల్లిదండ్రులు చనిపోయారు. తమ్ముడితో కలిసి అమ్మమ్మ దగ్గర పెరిగిన అతను ఏడాది కిందట అదృశ్యమయ్యాడు. అప్పట్నుంచి శ్రీకాంత్ ఆచూకీ లభ్యం కాలేదు. ఈ నెల 4వ తేదీ గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తండాలో ఉంటున్న మేనమామ కుమారుడు వినోద్‌కు శ్రీకాంత్ వాట్సాప్ వీడియో కాల్చేశాడు. ‘‘ నేను ప్రస్తుతం కడప పట్టణం ఏఎస్ఆర్ కాలనీలో ఉంటున్నా. కొందరు నన్ను హిజ్రాగా మార్చారు. ఇప్పుడు నా పేరు శ్రీలేఖగా మార్చారు. కడపలో నివాసం ఉంటున్న ఓ యువకుడిని ప్రేమించా. ( ఐఎఫ్ఎస్ భర్తపై ఐపీఎస్ భార్య ఫిర్యాదు ) అతను వేరే వివాహం చేసుకున్నాడు. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నా’’ అని చెబుతూనే పురుగుల మందు తాగాడు. వెంటనే తండాలోని బంధువులు విషయాన్ని మహబూబ్‌నగర్ జడ్పీ వైస్ ఛైర్మన్ యాదయ్య, టీఆర్ఎస్ నాయకుడు ఇంతియాజ్ దృష్టికి తీసుకెళ్లారు. వారు జడ్చర్ల పోలీసుల సాయంతో కడప పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు శ్రీకాంత్ అలియాస్ శ్రీలేఖను గుర్తించి అదేరోజు కడప రిమ్స్‌లో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. శ్రీకాంత్ తనతో మాట్లాడుతున్న సందర్భంలో జడ్చర్లకు చెందిన మరో ముగ్గురు యువకులు హిజ్రాల చెరలో ఉన్నట్టు, వారు కూడా హిజ్రాలుగా మారినట్టు చెప్పాడని వినోద్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. -
హిజ్రాతో ప్రేమ: సహజీవనం..అంతలోనే..
సాక్షి, చెన్నై : హిజ్రాపై మనసుపారేసుకున్న యువకుడు పెద్దలను ఎదిరించి నెలరోజుల క్రితం వేరు కాపురం పెట్టాడు. సహజీవనం సాగిస్తున్న ప్రేమికులిద్దరూ ఇంతలోనే శనివారం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కారైక్కాల్ సమీపం తిరునల్లారుకు చెందిన దిలీప్ (26) అనే యువకునికి నిరావీ ప్రాంతానికి చెందిన షివానీ (30) అనే హిజ్రాకు మధ్య ఆరునెలల క్రితం ఏర్పడిన స్నేహం కొద్దిరోజులకు ప్రేమగా మారింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా ఘాటైన ప్రేమికులుగా మారిపోయారు. (జర జాగ్రత్త.. జేబులోకి చొరబడుతున్నారు ) ఈ ప్రేమ వ్యవహారం దిలీప్ ఇంట్లో తెలియడంతో గట్టిగా మందలించారు. అయితే షివానీపై ప్రేమను వదులుకునేది లేదని స్పష్టం చేసిన దిలీప్ సుమారు నెలరోజుల క్రితం ఇల్లువదిలిపెట్టి వెళ్లి కారైక్కాల్ ఒడుదురై ప్రాంతంలో షివానీతో కాపురంపెట్టాడు. ఇంతలా ప్రేమను పంచుకున్న ఇద్దరి మధ్య వేరుకాపురం పెట్టిన తరువాత ఏమైందో ఏమో శనివారం ఇద్దరూ ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. (నందిగామలో దారుణం : హత్య చేసి ఆపై..) -
అన్నలారా బయటకు రావద్దు
కర్ణాటక, గంగావతి రూరల్: కొప్పళ నగరంలో లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి బైక్‌లపై బయట తిరిగే వారికి సోమవారం మంగళముఖిలు (హిజ్రాలు) వినూత్నంగా జాగృతి కల్పించారు. రాఖీ కట్టి, బొట్టు పెట్టి, అనవసరంగా తిరగవద్దు, కరోనాకు గురికావద్దు అని హితబోధ చేశారు. కోరనా వైరస్ నివారణ కోసం ప్రపంచమే లాక్డౌన్ పాటిస్తోందన్నారు. అయినా ప్రజలు గుంపులుగా తిరగడం మానలేదన్నారు. బైక్ చోదకులు అనవసరంగా నగర వీధులలో తిరగడం మానాలని హిజ్రాలు విన్నవించారు. అన్నలారా బైకులపై తిరగకండి, కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతుంది, అందువల్ల ప్రస్తుతం దేశ ప్రధాని పిలుపును మనం అందరం పాటించి కరోనా నివారణలో భాగం కావాలని యువతకు సూచించారు. నగరంలోని అశోక సర్కిల్ ఈ జాగృతికి వేదికైంది. డీఎస్పీ వెంకటప్ప నాయక, సీఐ మౌనేశ్వర పాటిల్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. -
ప్రేమ విఫలమై హిజ్రా ఆత్మహత్య
చెన్నై,అన్నానగర్: ఈరోడ్ సమీపంలో మంగళవారం ప్రేమ ఓటమి వల్ల హిజ్రా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈరోడ్ సమీపం మూలప్పాలైయమ్ వినాయకుడి ఆలయ వీధికి చెందిన మురుగేషన్ అనే సుస్మితా (22) హిజ్రా. ఈమె తన అమ్మ చిన్నపొన్నుతో నివసిస్తూ వచ్చింది. సుస్మితాకి, ఈరోడ్ వీరప్పన్ చత్రమ్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. తరువాత సుస్మితా ఆ యువకుడిని ప్రేమిస్తూ వచ్చింది. అనంతరం సుస్మితా, ఆ యువకుడి వద్ద తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది. కానీ ఆ యువకుడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇందువల్ల సుస్మితా కొన్ని రోజులుగా మనస్తాపంతో బాధపడుతోంది. ఈ స్థితిలో మంగళవారం ఎవరు ఇంట్లో లేని సమయంలో సుస్మితా ఫ్యాన్‌కి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీన్నిచూసి దిగ్భ్రాంతి చెందిన ఆమె తల్లి, స్థానికుల సహాయంతో రక్షించి చికిత్స కోసం ఈ రోడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్క డ పరిశోధన చేసిన డాక్టర్లు అప్పటికే సుస్మితా మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. -
యాసిడ్ పోస్తానంటూ ప్రియుడు బెదిరింపు
తమిళనాడు ,పెరంబూరు: యాసిడ్ పోస్తానంటూ ప్రియుడు బెదిరిస్తున్నాడని హిజ్రా నటి అంజలి అమీర్ తెలిపింది. తమిళం, మలయాళం భాషల్లో నటిస్తున్న ఈమె ఆ మధ్య పేరంబు అనే తమిళ చిత్రంలో నటుడు మమ్ముట్టితో కలిసి నటించింది. అంజలీ అమీర్ మలయాళ బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో ద్వారా ప్రాచుర్యం పొందింది. ఈమె తన ఫేస్బుక్లో తన ప్రియుడు యాసిడ్‌తో దాడి చేస్తానని బెదిరిస్తున్నాడని పేర్కొంది. అతను రెండేళ్లుగా తాను సంపాదించుకున్న డబ్బును రూ.4 లక్షలకు పైగా దోచుకున్నాడని, ఇప్పుడు యాసిడ్ పోస్తానంటూ బెదిరిస్తున్నాడని కంటతడి పెడుతూ వీడియోను పోస్ట్ చేసింది. అందులో తనకు అండగా ఎవరూ లేరని, తల్లిదండ్రులు కూడా దగ్గర్లో లేరని చెప్పింది. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయానికి కూడా వచ్చానని చెప్పింది. తనను ఆదుకునే వారు లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. కాగా ఈమె తన బయోపిక్‌ను సినిమాగా రూపొందించనుందట. ఈ చిత్రాన్ని 2020 మేలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొంది. అయితే తన ప్రియుడు ఎవరో, అతని పేరు కూడా అంజలి అమీర్ పేర్కొనలేదు. -
హిజ్రాకు చికిత్స చేసేందుకు డాక్టర్ల నిరాకరణ
చెన్నై,తిరుత్తణి: అనారోగ్యంతో ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన హిజ్రాకు చికిత్స చేసేందుకు ప్రభుత్వ వైద్యులు నిరాకరించిన ఘటన తిరుత్తణి ప్ర భుత్వాస్పత్రిలో బుధవారం చోటుచేసుకుంది. తిరుత్తణి పెరియార్‌నగర్‌కు చెందిన కావ్య(40) అనే హిజ్రాకు జ్వరంతో పాటు వాంతులు, విరేచనాలు రావడంతో చికిత్స కోసం తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి వెళ్లింది. అయితే హిజ్రాకు చికిత్స చేసేందుకు వైద్యులు నిరాకరించారు. సుమారు 2 గంటల పాటు అనా రోగ్యంతో బాధపడుతున్నా కనీసం వైద్యులు పలకరించేందుకు సైతం ముందుకు రాకపోవడంతో తోటి హిజ్రాలు ఎందుకు వైద్యం చేయరని ఆస్పత్రి చీఫ్ డాక్టర్ రాధికను ప్రశ్నిం చారు. వారి ప్రశ్నలను డాక్టర్ పట్టించుకోకపోవడంతో హిజ్రాలు ఆస్పత్రి ప్రాంగణం వద్ద బైఠాయించారు. అక్కడికి వచ్చిన తిరువళ్లూరు జిల్లా ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర దయాళన్‌కు సమస్యను వివరించారు. చివరకు జాయింట్ డైరెక్టర్ ఆదేశాలతో వైద్యులు హిజ్రాకు చికిత్స చేశారు. -
హిజ్రాల ముసుగులో చోరీ
మల్లాపూర్: హిజ్రాల వేషంలో ఆటోల్లో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను సీసీఎస్ మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం నాచారం సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో రాచకొండ క్రైమ్ అడిషనల్ డీసీపీ సలీమా వివరాలు వెల్లడించారు. బోడుప్పల్ కళానగర్‌కు చెందిన తూర్పాటి యాదయ్య, సదుల ఆంజనేయులు, హిజ్రాలుగా వేషం వేసుకొని కల్లెం బాబయ్య ఆటోలో తిరుగుతూ భిక్షాటన చేసేవారు. ఇటీవల చర్లపల్లిలో ఓ మహిళ దృష్టి మరల్చి రూ.50 వేల నగదు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ మల్కాజిగిరి, కుషాయిగూడ పోలీస్ అధికారులు సీసీ ఫుటేజీల ఆధారంగా ఆటోను గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు.వారి నుంచి రూ.42 వేల నగదు, ఆటోను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో ఏసీపీ శివకుమార్, ఇన్స్పెక్టర్లు లింగయ్య, జగన్నాధరెడ్డి, మక్బుల్ జానీ, భాస్కర్, డీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
హిజ్రా చంద్రముఖి ఫిర్యాదు..
బంజారాహిల్స్: తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హిజ్రా చంద్రముఖి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఇందిరానగర్‌లో ఉంటున్న చంద్రముఖి శుక్రవారం సాయంత్రం బయటికి వెళ్తుండగా సనమ్ అనే మరో హిజ్రా ఆమెను అడ్డుకుని ప్రతిరోజూ తమ కదలికలను పోలీసులకు చేరవేస్తున్నావంటూ అసభ్యంగా దూషించింది. దీంతో మనస్తాపానికి గురైన చంద్రముఖి తన గదిలోకి వెళ్ళి చేతిపై బ్లేడ్‌తో గాట్లుపెట్టుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తోటి హిజ్రాలు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న అనంతరం శనివారం రాత్రి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన చంద్రముఖి తనను దూషించిన సనమ్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
హిజ్రాను వివాహమాడిన యువకుడు
చిత్తూరు : తిరుచానూరు అమ్మవారి ఆలయం ముందు బెంగళూరుకు చెందిన మనోజ్ శుక్రవారం రాత్రి సబీ అనే హిజ్రాను వివాహం చేసుకున్నాడు. ఆలయం ముందు వివాహ తంతు జరుగుతుంటే స్థానికులు, భక్తులు ఆశ్చర్యపోయి చూశారు. హిజ్రాలే పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. అవును..వాళిద్దరూ ఒకటయ్యారు... మరోవైపు ఓ హిజ్రాను మరో హిజ్రా పెళ్లాడిన సంఘటన తిరుపతిలోని దామినేడులో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఇందిరమ్మ గృహాల్లో నివసిస్తున్న హిజ్రాలలో ఓ ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఇదేంటి ఒక హిజ్రా, ఇంకో హిజ్రాను పెళ్ళి చేసుకోవటం ఇదేమి విచిత్రం అనుకున్నా సరే వారిద్దరూ పెళ్ళి అనే బంధంతో ఒకటయ్యారు. కేవలం దాంపత్య సుఖం మాత్రమే కాదని, ఒకరికి ఒకరు కష్టాల్లో, సుఖాల్లో తోడు నీడగా ఉండాలని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. -
వాళిద్దరూ ఒకటయ్యారు...
-
హిజ్రా ఆత్మహత్య
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలోని బాబన్ సా పహాడ్‌లో ఓ హిజ్రా ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో తాడుతో ఉరేసుకొని చనిపోయారు. ప్రేమ వ్యవహారమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా సమాచారం తెలుసుకున్న తోటి హిజ్రాలు సంఘటన స్థలానికి ఆందోళనకు దిగారు. విచారణ జరపాలని కోరుతూ ఆరో టౌన్లో ఫిర్యాదు చేశారు. -
హిజ్రాతో ఎస్ఐ సహజీవనం!
సాక్షి, చెన్నై : హిజ్రాతో సబ్ ఇన్స్పెక్టర్ కుటుంబం నడిపారా? అనే విషయంపై పోలీసు అధికారులు విచారణ జరుపుతున్నారు. తిరునెల్వేలి జిల్లా, బావూరుసత్రం సమీపానగల రామచంద్రపట్టినం ప్రాంతానికి చెందిన బబితారోజ్ హిజ్రా. ఈమె హిజ్రాల సంక్షేమం కోసం అనేక సాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల హిజ్రాలు లైంగిక వృత్తిని చేపట్టరాదని తెలుపుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇందుకు పలువురు హిజ్రాలు వ్యతిరేకత తెలిపి బబితారోజ్ ఇంటి ముందు ధర్నా జరిపారు. ఇందుకోసం భద్రతా పనుల నిమిత్తం బావూరుసత్రం పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ బబితారోజ్ ఇంటికి తరచూ వెళ్లేవాడు. ఆ సమయంలో ఎస్ఐకు, హిజ్రా బబితారోజ్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇదివరకే వివాహమై భార్య పిల్లలతో ఉన్న ఎస్ఐ హిజ్రా బబితారోజ్‌తో కుటుంబం నడిపినట్లు సమాచారం. ఇటీవల సదరు ఎస్ఐ సమీపానగల మరో పోలీసుస్టేషన్‌కు బదిలీపై వెళ్లారు. ఆ తర్వాత అతను బబితారోజ్‌తో సంబంధం వదులుకున్నారు. హిజ్రా బబితారోజ్ అతన్ని సెల్ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించినా మాట్లాడేందుకు వీలుకాలేదు. దీంతో బబితారోజ్ తిరునెల్వేలి జిల్లా ఎస్పీ అరుణ్ శక్తికుమార్కు ఫిర్యాదు చేశారు. ఎస్ఐకు వివాహమై పిల్లలు ఉన్నప్పటికీ దాన్ని దాచిపెట్టి తనతో కుటుంబం నడిపాడని, అనేకసార్లు ఎస్ఐకు బంగారు నగలు, నగదు అందజేసినట్లు పేర్కొన్నారు. దీంతో తనను మోసగించిన ఎస్ఐపై చర్యలు తీసుకుని, తన నగలు, నగదు తిరిగి ఇప్పించాలని కోరారు. దీనిపై విచారణ జరపాల్సిందిగా ఎస్పీ అరుణ్ శక్తికుమార్ ఉత్తర్వులిచ్చారు. తాళయూత్తు డీఎస్పీ బబితారోజ్, సంబంధిత ఎస్ఐ వద్ద ఆదివారం విచారణ జరిపారు. ఇదిలాఉండగా ఎస్ఐ, హిజ్రా ఒకటిగా కలిసి ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నాయి. -
హిజ్రాగా మారలేదన్న ఆవేదనతో
టీ.నగర్: హిజ్రాగా మారేందుకు తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో ఆవేదనకు గురైన యువకుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నై విరుగంబాక్కంకు చెందిన కూలి కార్మికుడు మహేంద్రన్. ఇతని కుమారుడు పార్థసారథి (21) బీసీఏ చదివాడు. ఇతని వైఖరిలో ఇటీవల కాలంగా కొంత మార్పు కనిపించింది. మహిళలకు సంబంధించిన హావ భావాలు, వస్త్రాలు ధరించి కనిపించేవాడు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు అతన్ని మందలించారు. అయినప్పటికీ పార్థసారథి తన వైఖరిని మార్చుకోలేదు. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి పార్థసారథి బయటకు వెళ్లాడు. తల్లిదండ్రులు అతని కోసం అనేక చోట్ల గాలించారు. ఇలా ఉండగా, మనలిలో అతడు హిజ్రాలతో కలిసి ఉన్నట్లు తెలిసింది. తల్లిదండ్రులు తన కోసం గాలిస్తున్నట్లు తెలుసుకున్న అతను, తనను ఇంటికి తీసుకెళతారన్న భయంతో శనివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీని గురించి సమాచారం అందుకున్న మనలి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పార్థసారథి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
హిజ్రా పాత్రలో అదా శర్మ
నితిన్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన భామ ఆదాశర్మ. గ్లామర్‌తో ఆకట్టుకున్న అదాశర్మ అవకాశాలను అందిపుచ్చుకోవటంతో మాత్రం ఫెయిల్ అయ్యారు. క్షణం, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్ సినిమాలో నటించినా.. ఆ సక్సెస్ కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. దీంతో బాలీవుడ్ మీద దృష్టి పెట్టిన అదా శర్మ అక్కడ కూడా స్టార్ స్టేటస్ అందుకోలేకపోయారు. తాజాగా ఈ భామ ఓ చాలెంజింగ్ రోల్‌కు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. అబీర్ సేన్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ సినిమా ‘మేన్ టు మేన్’లో అదా హిజ్రా పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటి వరకు హిజ్రా పాత్రల్లో మేల్ ఆర్టిస్ట్‌లు మాత్రమే కనిపించారు. తొలిసారిగా ఓ నటి హిజ్రా పాత్రలో నటిస్తుండటంతో ‘మేన్ టు మేన్’ సినిమా కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. -
విజయ్ సేతుపతిని అరెస్ట్ చేయండి..
సాక్షి, చెన్నై: ప్రముఖ హీరో విజయ్ సేతుపతి అరెస్ట్ చేయలంటూ హిజ్రాలు డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ, ఫాహత్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ’సూపర్ డీలక్స్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా పలు విమర్శలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా విశ్లేషకులు, నెటిజన్లు ఈ చిత్రాన్ని విమర్శనలతో బంతాడుకుంటున్నారు. తాజాగా హిజ్రాలు... చిత్ర హీరో విజయ్ పేతుపతి, దర్శకుడు త్యాగరాజు కుమారరాజాలపై మండిపడుతున్నారు. హిజ్రాల సంఘం నిర్వాహకులు రేవతి, ప్రేమ, కల్కి సూపర్ డీలక్స్ చిత్రాన్ని తీవ్రంగా ఖండిస్తూ, విజయ్‌సేతుపతిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో విజయ్ సేతుపతి అంటే తమకు గౌరవం ఉందని, అయితే సూపర్ డీలక్స్ చిత్రంలో హిజ్రాగా నటించిన తరువాత ఆయనపై ఉన్న గౌరవం తగ్గిపోయిందన్నారు. హిజ్రాలు పిల్లలను కిడ్నాప్ చేస్తున్నట్లు చిత్రంలో చూపించారని ఆరోపించారు. చిత్రంలో విజయ్ సేతుపతి పోషించిన శిల్పా పాత్రను ముంబైలో పిల్లలను కిడ్నాప్ చేసి బిక్షం ఎత్తించేవారికి విక్రయించినట్లు చూపించారన్నారు. నిజానికి హిజ్రాలు పిల్లలపై ప్రేమ చూపుతారని, వారు ఎన్నటికీ పిల్లలను కిడ్నాప్ చేయరని అన్నారు. ఇక బెదిరింపులకు భయపడి హిజ్రాలు ఎలాంటి అత్యాచారాలకు పాల్పడడం లేదని తెలిపారు. అయితే అలాంటి సన్నివేశాలు చిత్రంలో చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఇకపోతే హిజ్రాలకు పిల్లలు పుట్టే భాగ్యం లేదన్నది విజ్ఞానపరమైన నిజం అన్నారు. అలాంటిది ఒక పిల్లాడికి తండ్రి అయిన విజయ్ సేతపతి హిజ్రాగా మారినట్లు చూపించారన్నారు. ఇలాంటి పలు అంశాలు చిత్రంలో తమను అవమానానికి గురి చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారణం అయిన చిత్ర దర్శకుడు, అందులో నటించిన నటుడు విజయ్ సేతుపతిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
నేను మీ ప్రియాంక !
కర్ణాటక, యశవంతపుర: బెంగళూరుకు చెందిన హిజ్రా ప్రియాంక రేడియో జాకీగా పనిచేస్తున్నారు. రేడియో అక్షీవ్ సీఆర్ 90.4లో ఆమె రోజు వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఒక హిజ్రా దేశ చరిత్రలో రేడియో జాకీగా కావటం ప్రియాంకనే ఫస్ట్. దీంతో పాటు మహిళ సబలీకరణ కోసం ఆమె ఎంతోగాను కృషి చేస్తున్నారు. -
హిజ్రా దారుణ హత్య
తమిళనాడు ,అన్నానగర్: తూత్తుకుడిలో శుక్రవారం ఓ హిజ్రా దారుణహత్యకు గురైం ది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆలయ పూ జారి సహా ఇద్దరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వివరాలు.. తూత్తుకుడి ఎస్ఎస్ మాణిక్యపురానికి చెందిన ఆంథోని పిళ్లై. ఇతని కుమారుడు రాజామాన్‌సింగ్ అనే రాజాత్తి (38). హిజ్రా అయిన ఈమె తాళముత్తునగర్ సునామి కాలనీ ప్రాంతంలో ఉంటోది. తూత్తుకుడి తాళముత్తునగర్ సమీపం మురుగన్ థియేటర్ ప్రాంతంలో ఉన్న సమయపురత్తు మారియమ్మన్ ఆలయంలో పూజారిగా ఉంటూ వచ్చింది. ఈ ఆలయంలో ఇంతకు ముందు భూపాల్ రాయర్‌పురానికి చెందిన పాండి కుమారుడు మరుదు (26) పూజారిగా ఉన్నాడు. రాజాత్తి పూజారిగా వచ్చినప్పటి నుంచి మరుదుకి ఆమెకు గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆలయంలో త్వరలో కొడై ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో కానులకు వసూలు చేసే పనిలో రాజాత్తి నిమగ్నురాలైంది. శుక్రవారం సాయంత్రం ఆలయం ముందు రాజాత్తి నిల్చుంది. అప్పుడు అక్కడికి వచ్చిన మరుదు అతని స్నేహితుడితో కలసి రాజాత్తితో గొడవ పడ్డాడు. ఆవేశం చెందిన మరుదు కత్తితో రాజాత్తిని విచ్చలవిడిగా నరికి, హఠాత్తుగా ఆమె తలని తెగించారు. తరువాత తలని త్రేస్‌పురం సముద్రతీర ప్రాంతంలో ఉన్న ఓ ఆలయం ముందు పెట్టి పరారయ్యారు. సమాచారం అందుకున్న తూత్తుకుడి జాయింట్ పోలీసు సూపరిటెండెంట్ ప్రకాష్, సహాయ పోలీసు సూపరింటెండెంట్ ఆల్భర్ట్‌జాన్, ఇన్స్పెక్టర్లు పార్తీబన్, తంగకృష్ణన్,సబ్ ఇన్స్పెక్టర్లు రాజామణి, జ్ఞానరాజ్, పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తూత్తుకుడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. -
హిజ్రా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
టీ.నగర్: హైకోర్టులో పోరాడి ఉద్యోగం సాధించిన హిజ్రా పోలీసు కానిస్టేబుల్ అధికారుల వేధింపులు భరించలేక సోమవారం విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఉన్నతాధికారులు తనను వేధింపులకు గురిచేయడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపి ఎలుకల మందు తాగిన వీడియో ప్రస్తుతం వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. వివరాలు.. రామనాథపురం జిల్లా, పరమకుడి వసంతపురానికి చెందిన నజ్రియా (22) హిజ్రా. ఈమె నాలుగు నెలల క్రితం పోలీసు ట్రైనింగ్ పూర్తి చేసుకుని రామనాథపురం సాయుధ దళంలో పోలీసుగా చేరారు. విధుల్లో చేరినప్పటి నుంచి ఉన్నతాధికారులు ఆమెను వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. గత కొద్ది రోజులుగా ఆమె విధులకు హాజరుకావడం లేదు. ఇదిలాఉండగా ఆమె మళ్లీ విధులకు సోమవారం హాజరుకాగా ఉన్నతా«ధికారులు వేధించినట్లు తెలిసింది. దీంతో సోమవారం రాత్రి ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించింది. సహ పోలీసులు ఆమె ను వెంటనే రామనాథపురం ప్రభుత్వ ఆస్పత్రి లో చేర్చారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి ముందు నజ్రి యా తీసిన వీడియోలో ప్రస్తుతం వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. సాయుధ దళంలోని సీని యర్ రైటర్ పార్థిపన్, ఎస్ఎస్ఐ జయశీలన్, ఇన్స్పెక్టర్ ముత్తురామలింగం తనతో అనుచితంగా ప్రవర్తించినట్లు అందులో పేర్కొంది. ఇదిలాఉండగా హిజ్రా నజ్రియా హైకోర్టులో పోరాటం సాగించి పోలీసు ఉద్యోగంలో చేరింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆమెకు ప్రత్యేకంగా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి పోలీసుగా ఎంపిక చేశారు. -
ఔటర్ రింగ్ రోడ్డులో రెచ్చిపోయిన హిజ్రాలు
-
మోక్షం కోసం ఆత్మహత్య చేసుకోండి
మండ్య: మోక్షం లభిస్తుందంటూ నమ్మించి ఓ క్షుద్రపూజల మాంత్రికురాలు దేశరాజధానిలో ఒకే కుటుంబానికి చెందిన 11 మందిని ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటన తరహాలోనే హిజ్రా మాంత్రికురాలు ఓ కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకోవాలంటూ వేధించిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. మండ్య తాలూకాలోని మారగౌడనహళ్లి గ్రామానికి చెందిన అనిత అనే మహిళ కుటుంబానికి కొద్ది రోజుల క్రితం మైసూరు నగరానికి చెందిన క్షుద్రపూజలు చేసే మాంత్రికురాలైన హిజ్రా పరిచయమైంది. తమ కుటుంబంలో ఎదరుయ్యే ప్రతీ సమస్యకు పరిష్కారం కోరుతూ అనితా భర్త తరచూ హిజ్రాను ఆశ్రయించేవారు. దీంతో సదరు కుటుంబ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న హిజ్రా సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం కోసం దేవుడిని తలచకుంటూ కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్యకు పాల్పడాలంటూ అనితా భర్తకు సూచించింది. ఇదే విషయాన్ని వ్యక్తి తన కుటుంబ సభ్యులకు కూడా తెలుపగా మొదట భర్త వాఖ్యలను అనిత కుటుంబ సభ్యులు తేలికగా తీసుకున్నారు. అయితే మోక్షం సిద్ధించాలంటే సామూహిక ఆత్మహత్యకు పాల్పడాలంటూ హిజ్రా అనిత కుటుంబ సభ్యులపై రోజురోజుకు ఒత్తిడి తీవ్రతరం చేస్తుండడంతో అనిత మాంత్రికురాలి నుంచి వస్తున్న వేధింపులపై హుణుసూరు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి యత్నించారు. అయితే అనిత ఫిర్యాదు గురించి పట్టించుకోని హుణుసూరు పోలీసులు అనితను బయటకు గెంటివేయడంతో తమ సమస్య గురించి అనిత ప్రసార మాధ్యమాలను ఆశ్రయించారు. దీంతో విషయం వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన జిల్లా పోలీసు యంత్రాంగం హిజ్రా కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
దేశంలో తొలి హిజ్రా న్యాయవాది
సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ హిజ్రాకు బార్ కౌన్సిల్లో సభ్యత్వం లభించింది. 36 ఏళ్ల సత్యశ్రీ శనివారం మద్రాసు హైకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో చెన్నైలోని తమిళనాడు న్యాయవాదుల సంఘం కార్యాలయంలో తన పేరును నమోదు చేసుకున్నారు. న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న 11 ఏళ్ల తర్వాత బార్ కౌన్సిల్లో సభ్యత్వం పొందగలిగానని ఈ సందర్భంగా సత్య శ్రీ ఆవేదన చెందారు. జడ్జిగా ఎదగడమే తన కల అని చెప్పారు. రామనాథపురం జిల్లా పరమకుడికి చెందిన సత్యశ్రీ జన్మతః బాలుడు. చిన్నప్పుడే శరీరంలో స్త్రీగా మార్పులు ప్రారంభమవడంతో కుటుంబాన్ని వదిలి వచ్చి చెన్నై దగ్గర్లోని చెంగల్పట్టులో పెరిగారు. 2007లో సేలం కేంద్రీయ లా కాలేజీ నుంచి లా పట్టా తీసుకున్నారు. 2014లో సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వుల ప్రాతిపదికన జాతీయ న్యాయ వ్యవహారాల కమిషన్ హిజ్రాలు సైతం లాయర్లుగా బార్ కౌన్సిల్లో పేర్లను నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేయడంతో సత్యశ్రీకి బార్ కౌన్సిల్ సభ్యత్వం లభించింది. -
హిజ్రాల మధ్య ఘర్షణ
పోలీస్‌స్టేషన్ ముట్టడి చెన్నై, తిరువణ్ణామలై: మామూళ్ల వసూళ్లలో హిజ్రాల మధ్య జరిగిన ఘర్షణలో ఐదుగురు హిజ్రాలు గాయాలతో తిరువన్నామలై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తిరువణ్ణామలై ఎళిల్ నగర్‌కు చెందిన అన్బు అలియార్ అన్బరసి హిజ్రా. ఈమె సహ హిజ్రాలతో బస్టాండు, గిరివలం రోడ్డు తదితర ప్రాంతాల్లోని దుకాణాల్లో మామూళ్లు వసూళ్లు చేస్తుండేది. దీనిపై మరో వర్గానికి చెందిన హిజ్రాలు అన్బరసిని మంగళవారం నిలదీశారు. అన్బరసి వర్గీయులు మరో సంఘానికి చెందిన హిజ్రాల మధ్య ఘర్షణ ఏర్పడింది. అన్బరసి వర్గీయులు ముందుగానే తెచ్చుకున్న కత్తులు, రాడ్లతో వ్యతిరేక వర్గ హిజ్రాలపై దాడిచేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో వేలూరు, తిరువణ్ణామలై, విల్లుపురం జిల్లాల హిజ్రాలతో బాధితులు పోలీస్స్టేషన్లను ముట్టడించారు. అన్బరసి వర్గీయులపై చర్యలు తీసుకోవాలని, లేదంటే బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 32 జిల్లాల్లో ఎస్పీ కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తామన్నారు. -
హిజ్రా ఇంట్లో యువకుడి ఆత్మహత్య కలకలం
సాక్షి, చోడవరం (విశాఖ): స్థానిక వెంకన్నపాలెం గ్రామంలో అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు.. హిజ్రా ఇంటిలో ఫ్యాన్‌కి ఉరివేసుకుని మృతి చెందాడు. తన తల్లి పాపలక్ష్మి చిన్నతనంలో వదిలివేయడంతో సంగం సురేష్‌కుమార్(18) అనే యువకుడు శివాలయం వీధిలో ఉంటున్న వరసకు పెద్దమ్మ అయిన కర్రిసూరమ్మ వద్ద పెరిగాడు. గాయత్రీ పాన్‌షాప్‌లో ఇతను పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి 11గంటల వరకూ సురేష్ ఇంటికి చేరలేదు. దీంతో పెద్దమ్మ నిద్రపోయింది. విశాఖపట్నం జిల్లా వెంకన్నపాలెంలో నివాసముంటున్న లోవ అనే హిజ్రా తెల్లవారుజామున తన రూమ్‌కు వెళ్లగా తలుపు లోపల గడి పెట్టి ఉంది. కిటికిలోంచి చూడగా సురేష్ ఫ్యాన్‌కి ఉరేసువేసుకుని మృతి చెంది ఉన్నాడు. వెంటనే సురేష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అదనపు ఎస్ఐ మునాఫ్, ఏఎస్ఐ భాస్కరరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందజేశారు. గత వినాయక నవరాత్రుల నుంచి హిజ్రా లోవతో సురేష్‌కు స్నేహం ఏర్పడింది. అప్పటి నుంచి వెంకన్నపాలెంలో ఆమె రూమ్‌కు తరుచూ వెళుతున్నాడు. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో వచ్చి ఇలా జరిగి ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఇంటర్మీడియెట్ వరుకూ చదివిన సురేష్ ప్రస్తుతం పాన్‌షాప్‌లో పనిచేస్తున్నాడని అతని పెద్దమ్మ సూరమ్మ చెప్పింది. నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మునాఫ్ తెలిపారు. -
రోడ్డుపై ఉన్న హిజ్రా... నేను ఒక్కటే
సృష్టిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వాటిలో మనిషిది ప్రత్యేక స్థానం. మనుషుల్లో ఆడ, మగ అని...ఇవి రెండు మాత్రమే సహజ సిద్ధమైనవనీ... ఆడ, మగ కాకుండా మూడో రకాన్ని ఈ సమాజం చిన్న చూపు చూడటం జరుగుతోంది. సగం ఆడ, సగం మగ లక్షణాలతో ఉన్న వారి పట్ల లోకువే ఈ లోకానికి. మారుతున్న కాలంలో గే, లెస్బియన్స్, ట్రాన్స్‌జెండర్స్ అంటూ కొత్త లక్షణాలు వస్తున్నాయి. వీటన్నింటిని సమాజం అంగీకరించాలి. ఎందుకంటే వారు మనుషులే కదా. పాకిస్థాన్‌లో మొదటిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్.. న్యూస్ యాంకర్ స్థాయికి ఎదిగింది. తను ఆస్థాయికి ఎదిగిన ప్రయాణాన్ని, ఎదురైన కష్టాలను ఎదురొడ్డిన తన అనుభవాల్ని పంచుకుంది. అయితే తను ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలను పడాల్సి వచ్చిందనీ, తను చదువుకునే సమయంలో సెలూన్లో పనిచేస్తుండగా తనను గెంటేశారనీ, చేతి ఖర్చులకు కూడా తనవద్ద డబ్బులుండేవి కావనీ, అలాంటి సమయంలో రోడ్డుపై యాచిస్తూ ఉండే హిజ్రాలకు నాకు తేడా లేదనిపించిందంటూ తను పడిన వేదనను వివరించింది. మార్వియ మాలిక్ పాకిస్థాన్‌లో న్యూస్ యాంకర్ అయిన మొదటి ట్రాన్స్‌జెండర్. శనివారం మార్వియ చదివిన న్యూస్ బులిటెన్ వైరల్ అయ్యింది. దీంతో తనకు పాజిటివ్ కాల్స్, మెసేజ్‌లు వస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. జరా చంగేజీ అనే ట్రాన్స్‌జెండర్ గొప్ప నటిగా గుర్తింపు పొందిన తరువాత, పాకిస్థాన్ సెనేట్ వీరిని కూడా మూడో జెండర్‌గా గుర్తించింది. డ్రైవింగ్ లైసెన్సులపై ఎక్స్(x) జెండర్‌గా ముద్రిస్తున్నారు. మొదటిసారిగా 2009లో పాక్ సుప్రీంకోర్టు మూడో జెండర్‌ను ఎక్స్(x) జెండర్‌గా గుర్తించడం జరిగింది. గతేడాది పాక్ ప్రభుత్వం మొదటిసారిగా ట్రాన్స్‌జెండర్ కేటగిరిలో పాస్‌పోర్ట్‌ను ఇచ్చింది. పైగా గతేడాది మొదటిసారిగా జనాభా లెక్కల్లో వీరిని కూడా చేర్చింది. దేశంలో 10,418 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నట్లు పేర్కొంది పాక్ ప్రభుత్వం. -
హిజ్రాగా భాగమతి హీరో
జనతా గ్యారేజ్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన మళయాల నటుడు ఉన్ని ముకుందన్. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు ప్రతినాయకుడిగా నటించిన ఈ యువ నటుడు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఉన్ని ముకుందన్ లీడ్రోల్లో తెరకెక్కుతున్న మళయాల సినిమా చాణక్య తంత్రం మాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో ఉన్ని ముకుందన్ హిజ్రా కరిష్మా పాత్రలో కనిపించనున్నాడు. తాజా కరిష్మా క్యారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌తో పాటు మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. లేడీ గెటప్ లో కనిపించేందుకు ఉన్ని ముకుందన్ ఎంత కష్టపడ్డాడో ఈ వీడియోలో చూపించారు. మిరాకిల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కన్నన్ తామరకుల్లం దర్శకుడు. శివదా, శృతి రామచంద్రన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అనూప్ మీనన్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. -
హిజ్రాల వీరంగం
హైదరాబాద్: ఇద్దరు హిజ్రాలు శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌లో వీరంగం సృష్టించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో ఓ హిజ్రా మద్యం సేవించి కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. కృష్ణ అనే హిజ్రా తాగిన మైకంలో కారు డ్రైవ్ చేస్తుండగా పోలీసులు ఆపి శ్వాస విశ్లేషణ పరీక్షలు నిర్వహించగా.. ఆల్కహాల్ 99 పాయింట్ల మోతాదుగా రికార్డైంది. దీంతో ఆ హిజ్రాపై కేసు నమోదు చేసి కారును సీజ్ చేశారు. అదే సమయంలో పక్క సీట్లో కూర్చున్న మరో హిజ్రా రెచ్చిపోయి పోలీసుల్ని, వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధులను దూషించారు. అసభ్య పదజాలంతో హడలెత్తించారు. అరగంట పాటు బీభత్సం సృష్టించారు. మీడియా ప్రతినిధులపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. కెమెరాలు లాక్కొని నేలకేసి కొట్టారు. అంతటితో ఆగక తిట్ల దండకం అందుకున్నారు. ఈ హడావుడిలో కొందరు కెమెరామెన్ అదుపుతప్పి కింద పడిపోయారు. అరగంటపాటు అటు మీడియాపైనా, ఇటు ట్రాఫిక్ పోలీసులపైనా హిజ్రాలు విరుచుకుపడ్డారు. మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయింది. వీరి ధాటికి వెనుక ఉన్న వాహనదారులు కూడా హడలెత్తిపోయారు. కొంతమంది భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో బెంబేలెత్తిపోయిన పోలీసులు అర్ధంతరంగా తనిఖీలను ముగించి మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్ : హిజ్రా వీరంగం
-
హిజ్రా గ్రూపుల మధ్య ఫైట్.. ఉద్రిక్తత
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లా దీన్‌దయాళ్‌నగర్‌లో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు హిజ్రా గ్రూపుల మధ్య తలెత్తిన వివాదం చివరకు దాడులకు దారి తీసింది. ఈ రోజు ఉదయం కొందరు హిజ్రాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. అలేఖ్య, శీలా అనే రెండు వర్గాలు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు హిజ్రాలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దాడికి సంబంధించి ముగ్గరు హిజ్రాలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద కత్తులు, మారణాయుధాలు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. -
హిజ్రా సజీవదహనం
అనకాపల్లి టౌన్: పట్టణానికి చెందిన హిజ్రా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గాంధీనగరం 1వవీధిలో నివాసముంటున్న హిజ్రా కాలపర్తి వెంకట సూర్యనారాయణ అలియాస్ దేముడమ్మ (50) ఇంటిలో నుంచి ఆదివారం తెల్లవారుజామున ఐదుగంటల సమయంలో మంటలు రావడాన్ని గమనించిన ఇంటి యజమాని కోరిబిల్లి శంకరరావు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తుండగా ఇంట్లో దేముడమ్మ మృతి చెంది ఉండడాన్ని గమనించారు. యజమాని శంకరరావుæ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ కె.వెంకటరమణ, క్రైం డీఎస్పీ అలియాస్ సాగర్ ఆధ్వర్యంలో క్లూస్, డాగ్‌స్క్వాడ్ బృందాలు వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్బృందం కొన్ని చోట్ల వేలిముద్రలను సేకరించింది. దేముడమ్మ హత్యకు గురైందా..? లేక షార్ట్‌సర్క్యూట్ కారణంగా మృతి చెందిందా? అనే విషయంపై పోలీసులు దృష్టి పెట్టారు. మృతిపై అనుమానాలు ఐదేళ్ల క్రితం అనకాపల్లి పట్టణానికి వచ్చిన దేముడమ్మకు ఎవరితోనూ ఎటువంటి తగాదాలు లేవు. తోటి హిజ్రాలతో ఎటువంటి సత్సంబంధాలు లేవని స్థానికులు చెబుతున్నారు. అయితే వెంకటేశ్వరస్వామి పూజలు ఎక్కువుగా చేస్తుండడంతో పలువురు ఆమె వద్దకు వచ్చి గ్రహస్థితిపై ఆరా తీస్తుంటారు. వారిచ్చే నగదుతో కాలం వెళ్లదీస్తుంది. వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదం కూడా చేస్తుంటుంది. ఆరు నెలల క్రితం ఆమె ఇంటిలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. శనివారం విజయరామరాజుపేట గౌరీపరమేశ్వరుల మహోత్సవం సందడిలో చోరీకి యత్నించిన ఆగంతకులు నగదు, బంగారం దోచుకునే ప్రయత్నంలో అడ్డొచ్చిన ఆమెను హతమార్చి ఉంటారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్‌తోనే మృతి చెందింది తెల్లవారుజామున నిద్ర నుంచి లేచిన దేముడమ్మ ఇంట్లో లైట్ స్విచ్ ఆన్‌చేయగా మంటలు వ్యాపించి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది. ఆమె ఉంటున్న గదికి మంటలు వ్యాపించి మృతి చెందింది. ఇంటి యజమాని శంకరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. – విద్యాసాగర్, సీఐ -
అనకాపల్లిలో హిజ్రా దారుణహత్య
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి గాంధీనగర్‌లో హిజ్రా దేవుడమ్మను గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం వేకువజామున దారుణంగా హత్యచేశారు. హత్యచేసిన ఆధారాలు దొరకకుండా మృతదేహంపై కట్టెలుపేర్చి కిరోసిన్ పోసి నిప్పుపెట్టి కాల్చివేశారు. బంగారు నగల కోసమే హిజ్రా దేవుడమ్మను హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సామథనికుల సమాచారంతో సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాలకోసం గాలిస్తున్నారు. ఎవరితోనేనా గొడవలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. -
‘మూడో’గళం నినాదం
సాక్షి, బెంగళూరు: ప్రస్తుతం ట్రాన్స్‌జెండర్ హక్కులపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఇదే అంశంపై శుక్రవారం ఢిల్లీలో ఒబామా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న సదస్సులో బెంగళూరు ట్రాన్స్‌జెండర్ అకాయ్ పద్మశాలి ఒబామాను వివిధ విషయాల పై ప్రశ్నించడమే కాకుండా తమ వర్గం సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలపై ప్రసంగించనున్నారు. ఎవరీ అకాయ్.... అకాయ్ పద్మశాలి బెంగళూరులో పుట్టి పెరిగాడు. ఇక్కడే పదో తరగతి వరకు చదివాడు. తను ఉండాల్సింది ఇలా కాదని అనిపించి ట్రాన్స్‌జెండర్‌గా మారారు. సమాజం నుంచి చీత్కారాలు పై చదువులకు దూరంచేశాయి. తనలాంటి థర్డ్‌జెండర్స్‌కు సమాజంలో ఎదురవుతున్న అవమానాలను దీటుగా ఎదుర్కొనేందుకు, హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. ఈమె కర్ణాటక ప్రభుత్వ రాజ్యోత్సవ అవార్డుతో పాటు పలు జాతీయ పురస్కారాలనూ పొందారు. ఒబామాతో భేటీకి నిరీక్షణ: అకాయ్ ఒబామాతో భేటీ విషయమై అకాయ్ పద్మశాలి ‘సాక్షి’తో మాట్లాడుతూ....‘ ఈ సదస్సులో పాల్గొనడం కోసం ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాను. ఒబామా ఇప్పటికే అమెరికాలో లైంగిక అల్ప సంఖ్యాకుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఈ విషయాలపై నేను ఆయనను ప్రశ్నించనున్నాను’ అని తెలిపారు. -
హిజ్రాలకు ప్రత్యేక మరుగుదొడ్లు
తిరువళ్లూరు: తిరువళ్లూరు బస్టాండ్‌లో హిజ్రాల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లను ఏర్పాటుచేశారు. వీటిని బీసీ సంక్షేమ శాఖ అధికారి మీనా గురువారం ప్రారంభించారు. తిరువళ్లూరు బస్టాండులో స్త్రీలు, పురుషులకు, దివ్యాంగులకు మరుగుదొడ్లు నిర్మించారు. స్త్రీల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను హిజ్రాలు ఉపయోగించే వారు. అయితే ఇటీవల హిజ్రాలను అనుమతించకపోవడంతో వారు మున్సిపల్ కమిషనర్ సెంథిల్కుమారన్ను కలిసి ప్రత్యేక మరుగుదొడ్డి నిర్మించాలని విన్నవించారు. దీనిపై స్పందించిన కమిషనర్ హిజ్రాల కోసం ప్రత్యేక మరుగుదొడ్డిని నిర్మించారు. దీనిని బీసీ సంక్షేమ శాఖ అధికారి మీనా గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమిళనాడులో హిజ్రాల కోసం ప్రత్యేక మరుగుదొడ్లను గతంలో సేలం జిల్లాలో ప్రారంభించారని, ప్రస్తుతం తిరువళ్లూరులో ప్రారంభించడం రెండో ప్రాంతమని వివరించారు. -
దేశంలోనే తొలిసారి హిజ్రాకు వైద్య సీటు
సాక్షి, చెన్నై: దేశంలోనే ప్రపథమంగా తమిళనాడుకు చెందిన హిజ్రా తారిఖా భాను సిద్ధ వైద్య సీటును దక్కించుకున్నారు. ఆమెకు సీటు కేటాయించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు సోమవారం ఆదేశించింది. అలాగే, హిజ్రాలకు అన్ని కళాశాలల్లో కొన్ని సీట్లను కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని కూడా న్యాయమూర్తి కృపాకరణ్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తూత్తుకుడికి చెందిన హిజ్రా తారీఖా భాను చెన్నై అంబత్తూరులోని పెరుంతలైవర్ కామరాజర్ బాలికల మహోన్నత పాఠశాలలో ఈ ఏడాది ప్లస్‌టూ మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది. డాక్టర్ కావాలన్న ఆశతో తమిళనాడు ప్రభుత్వ పరిధిలోని సిద్ధ వైద్య కళాశాలలో సీటు కోసం ప్రయత్నించగా నిరాకరించారు. తనకు అర్హతలు ఉన్నా హిజ్రా అన్న కారణంతో సీటు నిరాకరించారంటూ మద్రాసు హైకోర్టు తలుపు తట్టారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి కృపాకరణ్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. వారం రోజుల్లోపు తారీఖా భానుకు వైద్య సీటును ఆమె కోరిన కళాశాలలో ఇవ్వాలని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ ఉత్తర్వులతో దేశంలోనే తొలి సిద్ధ వైద్య విద్యార్థిగా తారీఖా భాను నిలిచారు. తారీఖా భానును చెన్నై అంబత్తూరుకు చెందిన మరో హిజ్రా గ్రేషి భాను (ఇంజినీరు) దత్తతకు తీసుకుని చదివిస్తుండటం విశేషం. -
ఇది ‘ఆమె’ విజయం
సమాజంలో తన తోటి వారి నుంచి నిత్యం ఎదురయ్యే చీత్కారాలు, అన్నింటా వివక్ష, కుటుంబం నుండి కూడా అందని సాంత్వన, అయినా ఇవేవీ అవరోధాలుగా మారలేదు. నాటక కళాకారిణిగా, నృత్యకారిణిగా, స్వచ్ఛంద కార్యకర్తగా తను నచ్చిన జీవితం సాగిస్తోంది కాజల్ (27). సామాజికంగా వివక్షను ఎదుర్కొంటున్న హిజ్రాల్లో కూడా విశేష ప్రతిభ దాగుందంటూ కర్ణాటకలో దక్షిణ కన్నడ జిల్లా రేవు నగరం మంగళూరులో కాజల్ అనే హిజ్రా నిరూపించారు. ఇప్పటికే వివిధ రంగాల్లో తన ప్రతిభను చాటుకున్న కాజల్ తాజాగా (రేడియో జాకీ) ఆర్జేగా మారింది. మంగళూరులోని 107.8 ఎఫ్ఎం రేడియోలో ఆమె ఈ నెల 21 నుంచి ప్రసారం కానున్న ‘శుభమంగళ’కు ఆర్జేగా వ్యవహరించనున్నారు. విభిన్న రంగాల్లో ప్రతిభ...... కర్ణాటకలోని మండ్య జిల్లాకు చెందిన కాజల్ నిజానికి ఒక అబ్బాయి. చిన్నతనంలోనే తనలో వస్తున్న మార్పులను గుర్తించి, కుటుంబంతో విభేదించి ఇంటా, బయటా అనేక అవమానాలను ఎదుర్కొన్నాడు. ఇక మండ్యలో ఉండలేనని భావించి, ముంబై వెళ్లిపోయాడు. అక్కడే కొంత మంది తనలాంటి వారితో కలిసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ కొంతకాలం జీవనం సాగిస్తూ ట్రాన్స్‌జెండర్‌గా మారి కాజల్ అయ్యింది. తొమ్మిదేళ్ల క్రితం ఉడుపి జిల్లా బ్రహ్మావరకు చేరుకున్న కాజల్ మళ్లీ చదువులపై దృష్టి సారించింది. ఇంటర్ పూర్తి చేసిన కాజల్ డిగ్రీ చేయడానికి నిర్ణయించుకోగా అందుకు స్థానిక ఎంజీఎం కాలేజ్ ప్రొఫెసర్ మంజునాధ కామత్ సహకారం అందించారు. దూరవిద్య విధానంలో డిగ్రీ పూర్తి చేసింది. నాటకాల్లో కూడా పాల్గొంటూ ఉండగా, ప్రముఖ దర్శకుడు రవిరాజ్ ఆమె ప్రతిభను గమనించి ప్రోత్సహించారు. అలా నాట్యం, నాటకం, బుల్లితెరపై తనదైన ప్రతిభను కాజల్ కనబరిచింది. వాక్చాతుర్యంతో అవకాశం విభిన్న రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న కాజల్‌కు రేడియో సారంగ్ అసిస్టెంట్ డైరెక్టర్ మెల్విన్ పింటోతో పరిచయం ఏర్పడింది. కాజల్‌లోని వాక్చాతుర్యాన్ని గమనించిన ఆయన మంగళూరు 107.8 రేడియో ఎఫ్ఎంలో కాజల్‌కు రేడియో జాకీ అవకాశం కల్పించారు. కాజల్ ప్రతి మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు శుభమంగళ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. – షెహనాజ్, సాక్షి, బెంగళూరు: స్ఫూర్తిగా నిలవాలనే ప్రయత్నం హిజ్రాలంటే సమాజంలో చాలా చిన్నచూపు ఉంది. అలాంటి వివక్షత నుండి ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కేవలం భిక్షాటనలకు, సెక్స్‌వర్కర్లుగా మిగిలిపోతున్న నాలాంటి ఎంతో మందికి స్ఫూర్తినివ్వాలనే ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాను. అంతేకాదు నాకు వీలైనంత వరకు నాలాంటి మరికొంత మందికి గౌరవప్రదమైన జీవితాన్ని అందజేసేందుకు కృషి చేస్తాను. – కాజల్ -
వరంగల్‌లో హిజ్రా హల్చల్
సాక్షి, వరంగల్ అర్బన్: వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ చౌరస్తాలో బుధవారం ఓ హిజ్రా హల్చల్ చేసింది. చౌరస్తాలో షాపింగ్ చేస్తున్న యువకులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసింది. అక్కడ పోలీసులు ఉన్నా చూసీ చూడనట్లు వ్యవహరించడంతో రెండు గంటల పాటు నానా హంగామా చేసింది. హిజ్రాల చర్యల పట్ల స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. -
హిజ్రాకు పోలీసు ఉద్యోగం
కేకే.నగర్: దీర్ఘ పోరాటం అనంతరం హిజ్రా నజ్రియాకు పోలీసు ఉద్యోగం లభించింది. ఉన్నతాధికారి కావడమే తన లక్ష్యం అని ఆమె తన కోరికను వెలిబుచ్చారు. రామనాథపురం జిల్లా పరమకుడి సమీపంలో గల ఎస్.దావనూర్ గ్రామానికి చెందిన రాజపాండి, శాంతమ్మాళ్ దంపతుల పెద్ద కుమారుడు జగదీశ్వరన్ (21) పరమకుడిలో గల పాఠశాలలో ప్లస్‌టూ చదువుతున్నప్పుడు శరీరంలో మార్పులు కలిగాయి. దీంతో ఇంటి నుంచి వెలుపలికి వచ్చి అదే ప్రాంతంలో నివసిస్తున్న హిజ్రాలతో కలిసిపోయాడు. శస్త్ర చికిత్స ద్వారా హిజ్రాగా మారి తన పేరును నజ్రియాగా మార్చుకున్నారు. దూర విద్య ద్వారా డిగ్రీ చదువుతున్న నజ్రియా తమిళనాడు యూనిఫాం సర్వీసెస్ తరఫున రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. శరీర దారుఢ్య పోటీలో పాల్గొనడానికి రామల్థోపురం వెళ్లినప్పుడు హిజ్రా సర్టిఫికెట్ లేదని అధికారులు పోటీలకు నిరాకరించారు. అనంతరం ఆమె మదురై ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని హిజ్రా సర్టిఫికెట్‌ను, హిజ్రాల సంక్షేమ గుర్తింపు కార్డును పొందారు. అప్పటికే గడువు ముగియడంతో తనను పోటీల్లో పాల్గొనడానికి అనుమతి ఇప్పించాలని, దీనిపై అధికారులను ఆదేశాలు జారీ చేయాలని నజ్రియా మదురై ధర్మాసనాన్ని ఆశ్రయించింది. కోర్టు అనుమతితో ఆగస్టు 24వ తేదీ పోటీల్లో పాల్గొని గెలుపొంది ఉద్యోగ నియామక ఆదేశాలను నజ్రియా సొంతం చేసుకుంది. దీనిపై నజ్రియా మాట్లాడుతూ తాను పోలీసు పదవికి ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పోటీల్లో రాత పరీక్షలకు హాజరు కానున్నట్లు అందులో ఉత్తీర్ణత సాధించి పోలీసు ఉన్నతాధికారి పదవిని సొంతం చేసుకుంటానని నజ్రియా ధీమా వ్యక్తం చేసింది. సమాజంలో హిజ్రాలకు గౌరవ మర్యాదలు లభించే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఆమె కోరింది. -
రెండేళ్ల క్రితం మాయమై..
చెన్నై(అన్నానగర్): రెండేళ్ల క్రితం మాయమైన యువకుడు హిజ్రాగా తిరిగి వచ్చిన సంఘటన తమిళనాడులోని తిరుపూర్‌లో చోటుచేసుకుంది. కె.సెట్టిపాళయం వోసి నగరానికి చెందిన తామరై సెల్వన్‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇతని చిన్న కుమారుడు ముత్తుకుమార్ (20)తిరుపూరులోని బనియన్ సంస్థలో పని చేస్తున్నాడు. 2015 మార్చి నెలలో పనికి వెళ్లిన ముత్తుకుమార్ హఠాత్తుగా మాయమయ్యాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందంతో వెతుకుతున్న క్రమంలో ముత్తుకుమార్ చెన్నై వ్యాసర్పాడిలో ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు అక్కడి చేరుక్నున్నారు. హిజ్రాగా మారిన అతన్ని విచారణ చేయగా మహిళగా మారాలనే ఇంటి నుంచి బయటకి వచ్చానని, పేరును కీర్తనగా మార్చుకున్నానని తెలిపాడు. చెన్నైలో ఒకరి సహాయంతో మదురైకి వెళ్లి శస్త్రచికిత్స ద్వారా హిజ్రాగా మారానన్నాడు. ఇలా ఉండటమే తనకు ఇష్టమని పోలీసుల విచారణలో చెప్పాడు. ముత్తుకుమార్ దొరికాడన్న సంతోషంతో పోలీసుస్టేషన్‌కు వెళ్లిన కుటుంబ సభ్యులు హిజ్రాగా మారిన అతన్ని చూసి దిగ్భ్రాంతి చెందారు. అనంతరం పోలీసులు ముత్తుకుమార్‌ను తిరుప్పూరు కోర్టులో హాజరు చేశారు. ముత్తుకుమార్ తన ఇష్ట ప్రకారం ఉండవచ్చని మెజిస్ట్రేట్ నిత్యకళ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ తర్వాత తల్లిదండ్రులతో అతను చెన్నైకి వచ్చాడు. -
వేషం కట్టి దొరికాడు..చితక్కొట్టి సాగనంపారు
హైదరాబాద్ : సులువుగా డబ్బులు సంపాదించాలన్న దుర్బుద్ధితో ఓ యువకుడు హిజ్రా వేషం కట్టాడు. దిల్సుఖ్నగర్ చౌరస్తాలోని దుకాణాల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తుండగా.. అసలైన హిజ్రాలకు పట్టుబడ్డాడు. కోపోద్రిక్తులైన వారు నకిలీ హిజ్రాను పట్టుకుని చెప్పులతో చితకొట్టారు. అతడి ఒంటిపై ఉన్న దుస్తులను చింపి బండారం బయట పెట్టారు. దీంతో వేషం కట్టిన సదరు యువకుడు మరెప్పుడూ ఇలాంటి పని చేయనని కాళ్లావేళ్లా పడ్డా వదిలి పెట్టలేదు. ఇది గమనించిన ఓ కానిస్టేబుల్ హిజ్రాల నుంచి ఆ యువకుడిని తప్పించి అక్కడి వెళ్లిపోవాలని ఆదేశించడంతో యువకుడు కాళ్లకు బుద్ధి చెప్పాడు. -
హిజ్రాలకు ప్రేమికుల రోజు కానుక
పెరంబూర్ : మహిళా దర్శకురాలు కృతిక ఉదయనిధి స్టాలిన్ హిజ్రాలకు ప్రేమికుల రోజు కానుకగా ఒక వీడియో ఆల్బం అందించారు. వడచెన్నై చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం అయిన కృతిక ప్రస్తుతం హి జ్రాల జీవన విధానం, వారి సాదకబాధకాలను ఆవిష్కరిస్తూ ఒక వీడియో ఆల్బం రూపొందించారు. 12 మంది హిజ్రాలు నటించిన ఈ ఆల్బంకు సదయై మీరి అనే పేరును నిర్ణయించారు. ఇందుకోసం వివేక్వేల్ మురుగన్ రాసిన పాటకు సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు. ఈ వీడియో ఆల్బం ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇటీవల చెన్నైలో నిర్వహించారు. దర్శకుడు పాండిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని సదయై మీరి ఆల్బంను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు హిజ్రాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృతికా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ఈ వీడియో ఆల్బంను హిజ్రాలకు కానుకగా అందిస్తున్నానన్నారు. వారు ఆనాదిగా గుర్తింపునకు నోచుకోకపోవడం బాధాకరమన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉంటాయని ఆమె తెలిపారు. అలాంటిది హిజ్రాలను పట్టించుకోకపోవడం ఖండించదగ్గ విషయంగా పేర్కొన్నారు. వారు ఎలా జీవించాలన్నది వారినే నిర్ణయించుకోనిద్దాం. అయితే వారికి మనం చేయాల్సింది ఒక్కటే అది ప్రేమను అందించడమే అని కృతిక ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. కార్యక్రమం లో ఉదయనిధిస్టాలిన్, నటుడు కలైయరసన్ పాల్గొన్నారు. -
భువనేశ్వర్‌లో భిన్నమైన వివాహం
-
లొల్లి చేస్తోందని నడుస్తున్న ట్రైన్ నుంచి..
-
బతుకుపోరులో హిజ్రా విజయగాథ
పుట్టుకలో లోపం లేదు... హార్మోన్ల మార్పు అతని శారీరక మార్పులకు కారణమయ్యాయి. పురుషుడిగా ఎదగాల్సిన తరుణంలో స్త్రీ లక్షణాలు చోటు చేసుకున్నాయి. వేషధారణలో మార్పు వచ్చింది. సమాజంలో ఛీత్కారాలు... ఈసడింపులు... బంధువులు, స్నేహితుల ఎద్దేవా మాటలు కొంత అసహనానికి లోను చేశాయి. అదే సమయంలో కుటుంబసభ్యుల ఆదరణ కొండంత అండగా నిలిచింది. ఛీత్కారాలు ఎదురైన చోటే తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చారు. సమాజంలో గౌరవప్రదంగా బతుకుతూ... మరో నలుగురుని పోషిస్తూ పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అతనే మారిన మనిషి గొల్ల మారెన్న. రాయదుర్గం మండలం కొంతానపల్లికి చెందిన గొల్ల సంజీవప్ప, హనుమక్క దంపతులకు ఆరుగురు సంతానం. వీరిలో రెండవ కుమారుడు మారెన్న. చిన్నప్పటి నుంచి పశువుల పోషణపై ఆసక్తి కనబరిచేవాడు. వయసు పెరుగుతున్న కొద్ది అతని శరీర ఎదుగుదలలో మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. క్రమేణ స్త్రీ లక్షణాలు చోటు చేసుకోవడంతో వేషధారణ పూర్తిగా మారిపోయింది. గొల్ల మారెన్న పేరు కాస్త... గొల్ల జోగమ్మగా మారిపోయింది. ఈ మార్పును సమాజంలోని తోటి స్నేహితులు.. బంధువులు జీర్ణించుకోలేక పోయారు. మనిషి ఎదురుగా విమర్శ చేయకపోయినా.. చాటుమాటుగా ఎద్దేవా మాటలతో గుసగుసలాడేవారు. ఈ విషయాలు తెలిసినా ఏనాడూ జోగమ్మ బాధపడలేదు. జీవితంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకోవాలనే తపనతో మౌనంగానే అన్ని భరిస్తూ వచ్చింది. పాడి పోషణతో... చిన్నప్పటి నుంచి పశువుల పోషణపై ఆసక్తి పెంచుకున్న జోగమ్మ... తన 24వ ఏట అతి కష్టంపై రూ. 1,500 సమకూర్చుకుని రెండు పాడి పశువులను కొనుగోలు చేసింది. నిత్యం వాటిని మేతకు తీసుకెళ్లడంతో పాటు పాలు, పెరుగు విక్రయిస్తూ సమాజంలో గౌరవంగా బతికేందుకు శ్రీకారం చుట్టింది. జోగమ్మ ఆశయాన్ని గుర్తించిన స్థానికుల్లో క్రమేణ మార్పు వచ్చింది. ఈసడింపులు... ఛీత్కారాలు చేసిన వారే... జోగమ్మ పట్ల గౌరవభావం ప్రదర్శించసాగారు. ఈ నేపథ్యంలోనే తాను నమ్ముకున్న పాడి పరిశ్రమలో జోగమ్మ విజయప్రస్థానం కొనసాగిస్తూ వచ్చింది. రెండు పాడి పశువులతో మొదలైన జీవనం... ప్రస్తుతం 40 పశువులకు చేరుకుంది. నిత్యం 15 లీటర్ల పాలు, మరో పది లీటర్ల పెరుగును విక్రయించడంతో పాటు తన ఇద్దరు తమ్ముళ్లు, వారి సంతానాన్ని పోషిస్తోంది. అలుపెరగని శ్రమ పాడి పోషణలో జోగమ్మ అవిశ్రాంతిగా శ్రమిస్తూనే ఉన్నారు. ప్రతి రోజూ ఉదయం పాలు పితికి తన గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయదుర్గానికి చేరుకుని ఇంటింటికి తిరిగి విక్రయిస్తుంటారు. అనంతరం మధ్యాహ్నం ఇంటికి చేరుకుని పశువులను మేపునకు సమీపంలోని అటవీ శివారు ప్రాంతంలోకి తీసుకెళతారు. ప్రస్తుతం 55వ పడిలో ఉన్న జోగమ్మ ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పశువుల పాకను శుభ్రం చేసుకోవడం, పశువులకు స్నానం చేయించడం, మేత వేయడం, నీళ్లు పెట్టడం తదితర అన్ని పనులు స్వయంగా తానే చేసుకుంటూ పలువురికి స్ఫూర్తిదాయకంగా ఉంటున్నారు. కరువు నేపథ్యంలో ఒకటి... రెండు పశువులను పోషించుకోలేక రైతులు విలవిల్లాడుతుంటే... జోగమ్మ ఏకంగా 40 పశువులను పోషిస్తున్నారు. వాటికి మేత సమకూర్చడం కొంత భారమే అయినా మొండి ధైర్యంతో ఏనాడూ పశు పోషణను నిర్లక్ష్యం చేయలేదు. పశుగ్రాసం దొరకడం కష్టంగా ఉంది వర్షం లేకపోవడంతో పశుగ్రాసం దొరకడం లేదు. పాడి రైతులకు ప్రభుత్వం పశుగ్రాసం అందించాలి. మాలాంటి వాళ్లను అన్ని విధాలుగా ప్రోత్సాహించాలి. లేకుంటే పాడి పశువులను అమ్ముకోవాల్సి వస్తుంది. – మారెన్న (జోగమ్మ), పాడి రైతు, కొంతానపల్లి -
ఎస్పీ వద్ద మనసులో మాట చెప్పిన హిజ్రా
సారూ.. ఎస్ఐ కావాలనుంది..! - ఎస్పీ రవికృష్ణను కోరిన హిజ్రా మాధురి నంద్యాల: ‘సారూ.. నాకు ఎస్ఐ కావాలనుంది, సాయం చేయండి’ అని మాధురి అనే హీజ్రా జిల్లా ఎస్పీ రవికృష్ణను కోరింది. దీనిపై ఆయన స్పందిస్తూ ఎస్ఐ సెలక్షన్లకు కోచింగ్ ఇప్పిస్తానని, పుస్తకాలు అందజేస్తానని చెప్పారు. నేత్రదానం కార్యక్రమంలో భాగంగా ఎస్పీ బుధవారం నంద్యాలలోని మహానంది రస్తా పాత కేసీ కెనాల్ భవన సముదాయంలో ఉన్న సమతా హిజ్రాల సంఘం కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ నందికొట్కూరు తాలూకా విపనగండ్ల గ్రామానికి చెందిన తాను డిగ్రీ వరకు చదివానని చెప్పారు. తర్వాత ఎంకాం చేయడంకోసం ఆర్యూ పీజీ సెట్ లో మంచి ర్యాంకు తెచ్చుకున్నా హిజ్రా అనే కారణంతో సీటు నిరాకరించారంటూ కన్నీరు పెట్టుకుంది. విషయంపై ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డిని కలిసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఈ ఏడాది మేలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన రాత పరీక్షకు హాజరైనట్లు చెప్పింది. హిజ్రాలకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నష్టపోతున్నట్లు చెప్పింది. తమిళనాడులో ఓ హిజ్రా ఎస్ఐ పోస్టుకు ఎంపికైందని, తాను కూడా అలా కావాలని చెప్పింది. దీనిపై ఎస్పీ రవికృష్ణ స్పందిస్తూ తమిళనాడులో హిజ్రా.. మహిళల కోటాలో ఎస్ఐ పోస్టు సాధించినట్లు చెప్పారు. ఎస్ఐ సెలక్షన్‌కు హాజరు కావడానికి సాయం చేస్తానని, మెటీరియల్ అందిస్తామని హామీ ఇచ్చారు. -
హిజ్రాను పెళ్లాడిన యువకుడు
గంగావతి(కర్ణాటక): హిజ్రాలను కూడా ఇష్టమైతే పెళ్లి చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కర్ణాటకలోని కొప్పళ నగరంలో ఓ యువకుడు హిజ్రాను వివాహమాడాడు. ఈ విషయం గురువారం వెలుగు చూసింది. కొప్పళ నగరంలోని గదిగేరి క్యాంపులో ఉండే శివకుమార్(25) అనే యువకుడు రాధిక (24) అనే హిజ్రాను మూడు రోజుల క్రితం వివాహం చేసుకున్నాడు. ఈ వివాహాన్ని శివకుమార్ కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో తమకు భద్రత కల్పించాలని రాధిక, శివకుమార్ గురువారం పోలీసులను ఆశ్రయించారు. తాను రాధికను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని శివకుమార్ తెలిపాడు. -
కుష్బుపై కేసు నమోదు
మదురై : మదురై కోర్టులో కాంగ్రెస్ ప్రచారకార్యదర్శి నటి కుష్బుపై హిజ్రా కేసు దాఖలు చేసింది. మదురై వడంపోక్కి వీధికి చెందిన భారతి కన్నమ్మ మదురై కేంద్ర నియోజకవర్గంలో పోటీ చేస్తోంది. ఈ హిజ్రా మదురై 4వ మెజిస్ట్రేట్ కోర్టులో దాఖ లు చేసిన పిటిషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారకార్యదర్శి నటి కుష్భు 2వ తేదీ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హిజ్రాలను కించపరిచే విధంగా మా ట్లాడినట్లు పేర్కొన్నారు. హిజ్రాలకు తగిన రాయితీలు, హక్కులు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విష యం అందరికీ తెలిసిందే. ఈ స్థితిలో ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా? లేదా? అనే విషయంపై హిజ్రాలు ఆలోచించాలి అనడం తమను అవమానించే విధంగా ఉందన్నారు. దీనిపై గత 13వ తేదీ మదురై తెర్కువాసల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినా ఇంతవరకు దానిపై చర్య తీసుకోలేదన్నారు. అందువలన కుష్బుపై చర్య తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ మెజిస్ట్రేట్ సబీనా సమక్షంలో శుక్రవారం విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున న్యాయవాదులు హాజరై వాదించారు. మెజిస్ట్రేట్ సబీనా కేసును 25వ తేదీకి వాయిదా వేశారు. -
హిజ్రాగా అంజలి
చాలెంజింగ్ పాత్రల్లో నటించాలని చాలామంది తారలు కోరుకుంటారు. అయితే అలాంటి పాత్రలు ఆశపడిన వారికంతరికీ అమరవు. అదే విధంగా కొన్ని పాత్రలు ధరించడానికి చాలా గట్స్ ఉండాలి. ఈ తరం నటీమణుల్లో అలాంటి దమ్మున్న హీరోయిన్లలో అంజలి ఒకరని చెప్పవచ్చు. అంజలి అంగాడితెరు చిత్రంతోనే నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. ఇటీవల తెలుగులో గీతాంజలి చిత్రంలో దెయ్యంగా భయపెట్టారు. తాజాగా హిజ్రాగా తన తడాఖా చూపించడానికి రెడీ అయ్యారు. అంజలికి ఇది అరుదైన అవకాశమే కాదు వెతుక్కుంటూ వచ్చిన ఛాన్స్ అని కూడా అనవచ్చు. కోలీవుడ్‌లో దర్శకుడు రామ్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. తంగమీన్‌గళ్ చిత్రంతో జాతీయ అవార్డును సాధించిన దర్శకుడీయన. తాజాగా మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి హీరోగా చిత్రం చేస్తున్నారు. ఇందులో కథానాయకి పాత్రకు చాలా మంది ప్రముఖ నటీమణుల పేర్లను పరిశీలించినా తన చిత్రంలో నాయకి పాత్రకు అంజలినే పర్ఫెక్ట్ అనే నిర్ణయానికి వచ్చారట. ఎందుకంటే ఇందులో మమ్ముట్టి కథానాయకుడు. ఆయనకు ధీటుగా నటించాల్సి ఉంటుందట. అంజలిది అసాధారణ పాత్ర అట. ఆమెను ఇందులో వేశ్య అయిన హిజ్రాగా చూపించనున్నారని సమాచారం. వేశ్యగా నటించడానికే గట్స్ కావాలి. ఇక హిజ్రా వేశ్య పాత్రకు అభినయించాలంటే ఆషామాషీ విషయం కాదు. ఈ పాత్రలో అంజలిని దర్శకుడు రామ్ ఎలా మలుస్తారో వేచి చూడాల్సిందే. అన్నట్టు ఈ చిత్రానికి పేరన్భు అనే పేరును నిర్ణయించారన్న విషయం తెలిసిందే. -
హిజ్రాలకు ప్రత్యేక కోటా కల్పించాలి
టీనగర్: హిజ్రాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ఎస్ఐగా ఎంపికైన హిజ్రా ప్రిత్తికాయాషిని డిమాండ్ చేశారు. ఐపీఎస్ కావాలన్నదే తన లక్ష్యం అని వివరించారు. ఈ రోడ్లో శనివారం జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో ప్రిత్తికాయాషిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ తన సొంతవూరు సేలం అని, ప్రస్తుతం చెన్నై కోవిలంబాక్కంలో నివశిసున్నట్లు తెలిపారు. ఎస్ఐకు పోస్టుకు జరిగిన పరీక్షలో తాను ఉత్తీర్ణత సాధించిన స్థితిలో హిజ్రా కావడంతో ఉద్యోగాన్ని కల్పించలేమని అధికారులు దరఖాస్తును నిరాకరించారని, తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో తనకు ఉద్యోగం ఇవ్వాలంటూ హైకోర్టు ప్రభుత్వానికి ఉత్తర్వులిచ్చిందన్నారు. తనను వైద్య పరీక్షల్లో పాల్గొనేందుకు తమిళనాడు యూనిఫామ్డ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆహ్వానించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవోలో ఓబీసీ విభాగంలో హిజ్రాలకు ఉద్యోగాలు కల్పించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలిపారు. ఇదివరకే ఓబీసీలో అనేక మంది ఉద్యోగాల కోసం వేచివున్న స్థితిలో హిజ్రాలకు పోస్టులు లభించడం కఠినతరమని అన్నారు. అందువల్ల ఈ ఉత్తర్వులను మార్చి హిజ్రాలకు ప్రత్యేక రిజర్వేషన్ల ప్రాతిపదికన అన్ని ఉద్యోగాల్లోనూ ప్రాధాన్యతనివ్వాలని కోరారు. చిన్ననాటి నుంచి ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో చదువుతూ వచ్చానని, ప్రస్తుతం ఎస్ఐ కావడానికే పెద్ద పోరాటం సాగించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ హిజ్రాలకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలనేదే తమ కోరికని తెలిపారు. తాను ఎస్ఐ అయితే లంచగొండితనం, అవినీతి, అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడుతానని అన్నారు. -
హిజ్రాకు ఎస్ఐగా పోస్టింగ్ ఇవ్వాల్సిందే
* చెన్నై హైకోర్టు తీర్పు * మూడో కేటగిరీలో ఉద్యోగ కల్పనకు ఆదేశం చెన్నై : రాష్ట్ర పోలీసు శాఖలో త్వరలో హిజ్రా ప్రితికా యాస్ని సబ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించబోతున్నది. ప్రితికాకు పోస్టింగ్ ఇవ్వాల్సిందేనని మద్రాసు హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డులో మూడో కేటగిరి(హిజ్రా)లకు ఉద్యోగ కల్పనకు విధి విధానాలను రూపొందించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ సూచించారు. ఇటీవల రాష్ట్ర పోలీసు యూనిఫాం రిక్రూట్ మెంట్ బోర్డు నేతత్వంలో రాత పరీక్షలు జరిగాయి. ఇందుకు హిజ్రా ప్రితికా యాస్ని దరఖాస్తులు చేసుకున్నారు. ఆ దరఖాస్తులో మూడో కేటగిరికి సంబంధించిన వివరాలు లేని దృష్ట్యా, స్త్రీగా పేర్కొన్న ప్రదేశంలో టిక్ చేశారు. అయితే, పరిశీలనలో ప్రితికా హిజ్రాగా తేలింది. దీంతో ఆమెను పరీక్షకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకునేందుకు సిద్ధం అయ్యారు. అయితే, కోర్టును ఆశ్రయించి మరీ పరీక్ష రాసిన యాస్ని హిజ్రాలకే ఆదర్శంగా నిలుస్తూ తన సత్తాను చాటుకున్నారు. అలాగే, ఫిజికల్ తదితర అన్ని రకాల టెస్టుల్లోనూ రాణించి సబ్ ఇన్స్పెక్టరు అయ్యేందుకు అవసరమైన అన్ని అర్హతలు సాధించారు. అయితే, ఆమెకు పోస్టింగ్ మాత్రం ఇవ్వలేదు. హిజ్రా అన్న ఒక్క కారణంతో ఆమెకు పోస్టింగ్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. దీంతో తనకు పోస్టింగ్ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వేడుకుంటూ మళ్లీ కోర్టు మెట్లను ప్రితికా యాస్ని ఎక్కారు. ఆమె పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, పుష్పా సత్యనారాయణన్ నేతత్వంలోని ప్రధాన బెంచ్ పరిగణలోకి తీసుకుంది. విచారణ చేపట్టింది. గురువారం రాష్ట్ర హోం శాఖకు ఆదేశాలు జారీ చేశారు. హిజ్రాలకే ప్రితికా యాస్ని ఆదర్శనంగా నిలుస్తున్నారని పేర్కొంటూ, మూడో కేటగిరిలో ఉన్న హిజ్రాలకు పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డులో ఉద్యోగాల కల్పనకు సంబంధించి విధి విధానాలను త్వరితగతిన రూపొందించి, అమలు చేయాలని సూచించారు. అప్పుడే ప్రితికా యాస్నిను ఆదర్శంగా తీసుకుని మూడో కేటగిరి వారు అన్ని రంగాల్లో రాణించేందుకు ముందుకు వస్తారని అభిప్రాయ పడ్డారు. రాత పరీక్షల్లో, ఫిజికల్ తదితర టెస్ట్‌ల్లో అర్హత సాధించిన ప్రితికా యాస్నికి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుకు సంబంధించిన నియామక ఉత్తుర్వులను త్వరితగతిన జారీ చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశంతో త్వరలో రాష్ట్ర పోలీసు శాఖలో ప్రితికా యాస్ని సబ్ ఇన్స్పెక్టర్ బాధ్యతలు చేపట్టిన తొలి హిజ్రా జాబితాలోకి ఎక్కబోతున్నారు. -
వివేక్ ఎక్స్ ప్రెస్‌లో హిజ్రాల బీభత్సం
శ్రీకాకుళం (టెక్కలి) : మంగళూరు నుంచి సత్రగచ్చి వెళ్తున్న వివేక్ ఎక్స్‌ప్రెస్ లో సోమవారం హిజ్రాలు బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే...కొంతమంది హిజ్రాలు సోమవారం వివేకానంద్ ఎక్స్ ప్రెస్ ఎక్కారు. ప్రయాణికుల వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేయసాగారు. అయితే అడిగినంత డబ్బులివ్వలేదని కదులుతున్న రైల్లో నుంచి ఓ ప్రయాణికుడిని బయటకు తోసేసి, మరో ప్రయాణికుడిని చితకబాదారు హిజ్రాలు. రైల్లో నుంచి కిందపడ్డ ప్రయాణికుడు అక్కడికక్కడే మరణించగా.. దాడిలో మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన టెక్కలి మండలంలోని నౌపడ రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. మృతుడు ఒడిస్సాలోని నయాగఢ్ జిల్లాకు చెందిన పూర్ణచంద్రసాహు(45)గా గుర్తించారు. గాయపడిన వ్యక్తి ఫకీర్ బెహ్రాగా గుర్తించారు. ప్రయాణికులను తోసేసిన అనంతరం హిజ్రాలు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్ఐ పోస్టు కోసం హిజ్రా తపన
-
నాకూ బిడ్డను కనాలని ఉంది!
పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు సోమనాథ్ బెనర్జీ. ఇద్దరు ఆడపిల్లల తరువాత పుట్టిన పుత్ర సంతానంగా మురిసిపోయారు తల్లిదండ్రులు. కొంత వయసు రాగానే తానసలు మగవాడినే కాదనీ, పురుష శరీరంలో చిక్కడిపోయిన స్త్రీనని తెలుసుకుని, ఆ శరీరం నుంచి విముక్తి కోసం, స్వాధీనత కోసం, స్వాతంత్రం కోసం పెనుగులాడి, పోరాడి చివరికి సెక్స్ మార్పిడి ఆపరేషన్‌తో సోమనాథ్ బెనర్జీ నుంచి ‘మానవి’గా మారింది. భారత దేశంలోనే మొదటి సారి కాలేజ్ ప్రిన్సిపాల్ గా ఒక ‘ట్రాన్స్ జెండర్’. శ్రీమతి మానవి బెనర్జీ... కాలేజ్ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు కూడా అనేక మంది మహిళా ప్రిన్సిపల్స్ మనకు తెలుసు. అయితే... మానవి గురించి ప్రత్యేకంగా గుర్తు చేసుకోవడం ఎందుకంటే...మనదేశంలో ఒక ట్రాన్స్‌జెండర్ కాలేజ్ ప్రిన్సిపల్ కావడం ఆమెతోనే మొదలు. మానవి బెంగాల్ లోని నదియ జిల్లా కృష్ణ నగర్ మహిళా కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత నేను వెళ్లి కలిసాను. బెంగాలీ సాహిత్యంలో పీ.హెచ్ డీ చేసిన ఆమెకు కథకళి, భరత నాట్యాలలో ప్రవేశం వుంది. ఆమె ప్రతి మాటలోనూ రవీంద్ర సంగీతం పెనవేసుకుని వుంటుంది. ‘సాంగ్’ అనే నాటక సమాజాన్ని స్థాపించారామె. హిజ్రాల దుఃఖాలకు నాటక రూపమిచ్చి దర్శకత్వం వహిస్తుంటారు. ‘అమానవ్’ అనే పత్రికకు సంపాదకత్వం వహిస్తూ, ‘అద్వితీయ’ అనే మరో స్త్రీల పత్రికలో ‘లజ్జావతి’ అనే కాలమ్ నిర్వహిస్తున్నారు. ఇవికాక దేశంలోనే మొట్ట మొదటిసారిగా పశ్చిమ బెంగాల్ సర్కార్ స్థాపించిన ‘ట్రాన్స్ జెండర్ డెవలప్మెంట్ బోర్డ్’కు వైస్ చైర్పర్సన్ మానవి. థర్డ్ జెండర్ వ్యక్తులతో మన సమాజం ఎలా వ్యవహరిస్తోంది? అనే ప్రశ్నతోపాటు అనేక సంఘటనలు, దృశ్యాలు మానవిని చూడగానే గుర్తుకు వచ్చాయి. చెదరని చిరునవ్వుతో చక చకా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమెను ‘థర్డ్ జెండర్’ గా అనేక ఒత్తిడుల మధ్య పీ.హెచ్డీ ఎలా చేసారు, ఇంత గొప్ప వృత్తిలోకి ఎలా వచ్చారు? తల్లిదండ్రుల సహకారమే కారణమా ?’’అని ప్రశ్నిస్తే అందుకు కూడా ఆమె నవ్వారు. మెల్లగా ప్రసన్నంగా నోరు విప్పారామె. ‘‘భారతీయ సమాజం, కుటుంబ వ్యవస్థలు భిన్నమైన పనిని ఎవరు చేసినా, అది మంచిదయినా సరే మొదట శంకించి, ఆ తర్వాత భయపడి ఆ భిన్నమైన దారిని ఎన్నుకున్న వారి మీద దాడి చేస్తుంది. నా కుటుంబమూ ఇందుకు అతీతం కాదు. నేను ఎన్నిసార్లు ఆత్మాహత్య వరకు వెళ్ళానో చెప్పలేను. అన్నిసార్లూ రవీంద్రుడి సంగీతమే ఆదుకుంది. ఈ ప్రపంచంలో ఏ బంధుత్వాలు లేని ఒంటరిని నేను. అయినా సరే బతికే తీరాలి అనుకున్నాను’’ అన్నారామె. ‘ఇలాటి పుట్టుక నా నిర్ణయం కాదు’ అని మానవి ఒక విలువయిన మాట చెప్పారు. ‘హిజ్రా ఆత్మ కథ’ పేరుతో తన జీవితాన్ని రాసిన రేవతి కూడా అదే భావాన్ని వ్యక్తపరుస్తారు. న్యాయాన్ని పాటించడమే నాగరకత! సుప్రీంకోర్ట్ దీనిని మానవ హక్కులకు సంబంధించిన విషయంగా గుర్తించి హిజ్రాలని థర్డ్ జెండర్‌గా గుర్తించడం భారతీయ సమాజం నాగరికత వైపుచురుకైన అడుగులు వేస్తుందని చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. వారికి ఓబీసీ రిజర్వేషన్‌ను కల్పించ మనడమే కాక వారికి సంబంధించిన ఏ అంశాన్నీ విడువకుండా విపులమైన తీర్పునిచ్చింది. దీని గురించి మాట్లాడుతూ మానవి ‘‘సుప్రీం కోర్టు తీర్పుకి సాల్యూట్ చేస్తున్నాం అలాగే మా సంక్షేమానికి కాక మా అభివృద్దికి దేశంలోనే మొదటి సారి ట్రాన్స్ జెండర్ డెవలప్మెంట్ బోర్డ్ పెట్టిన మమతా బెనర్జీకి కృతజ్ఞతలు’’ అన్నారు. మా సంభాషణ ముగింపులో మానవి ఒక మాట అన్నారు. ‘స్త్రీగా నా గర్భం నుంచి ఒక బిడ్డకి జన్మనివ్వాలి’ అనే బలమైన కోరిక వుంది. కానీ అది ఎప్పటికీ నెరవేరదు కదా. టాగోర్ ‘దుయి బిఘా జమీ...’ కవితలో తనకున్న అరెకరం పొలాన్ని కోల్పోయిన వ్యక్తి... ‘‘భగవంతుడు నన్నీ అరెకరం పొలానికే పరిమితం చేయ్యదలచుకోలేదు. అందుకే నన్ను నా భూమి నుంచి దూరం చేసాడు. మంచిదే ఇప్పుడీ పృథ్వి అంతా నాదే’’ అంటాడు. నా పరిస్థితీ అంతే... కాలేజ్ పిల్లలూ, బయటి పిల్లలూ నా పిల్లలే. సాధ్యాసాధ్యాలు, ఉచితానుచితాలను దాటుకుని వ్యక్తులు ఒక హక్కు కోసం ఉద్యమిస్తున్నారంటే అది తప్పనిసరిగా ఆలోచించదగిందే అది థర్డ్ జెండర్ విషయమైనా మరోటయినా. కదా...? - సామాన్య కిరణ్ -
అడిగినంత ఇవ్వలేదని హిజ్రాల దాడి
కేసు నమోదు చేసిన పోలీసులు అడ్డగుట్ట: అడిగినంత చందా ఇవ్వలేదని మొబైల్ షాపు యజమానిపై ిహ జ్రాలు దాడి చేసి, రూ. 30 వేలు విలువ చేసే బంగారు గొలుసు లాక్కొన్నారు. బాధితుడు వారి బారి నుంచి తప్పించుకొని పారిపోగా.. హిజ్రాలు షాపులోని కుర్చీలను విరగ్గొట్టడంతో పాటు వస్తువులను ధ్వంసం చేశారు. తుకారాంగేట్ పోలీస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం... అడ్డగుట్ట డివిజన్‌కు చెందిన శ్రీనివాస్ తుకారాంగేట్ మీనా హాస్పటల్ ఎదురుగా తిరుమల కమ్యునికేషన్స్ అండ్ మొబైల్ దుకాణం నడుపుతున్నాడు. అయితే, బుధవారం రాత్రి కొందరు హిజ్రాలు దుకాణానికి వచ్చారు. హోళీ సందర్భంగా తమకు చందా ఇవ్వాలని యజమాని శ్రీనివాస్‌ను అడిగారు. అతను రూ. 50 ఇవ్వగా.. తమకు రూ. 500 కావాలని పట్టబట్టారు. అంత ఇవ్వలేనని శ్రీనివాస్ అనడంతో హిజ్రాలందరూ కలిసి అతని పై దాడి చేసి మెడలోని గొలుసు లాక్కున్నారు. బాధితుడు వారి బారి నుంచి తప్పించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం హిజ్రాలు దుకాణంలోని వస్తువులన్నీ ధ్వంసం చేసి, కుర్చీలు విరగ్గొట్టి, స్టిక్కర్లను చింపేశారు. కౌంటర్లో ఉన్న డబ్బును కూడా హిజ్రాలు ఎత్తుకెళ్లారని బాధితుడు తెలిపారు. గురువారం ఉదయాన్నే బాధితుడు తుకారాంగేట్ పోలీస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పౌరులుగా గుర్తించండి
* నినదించిన హిజ్రాలు,ట్రాన్స్జెండర్లు * గోశాల నుంచి ఇందిరా పార్కు వరకూ ర్యాలీ * ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు కవాడిగూడ: ‘సమాజంలోని పౌరులలో మేమూ భాగమే. ఈ దేశంలోని పౌరులకు రాజ్యాంగం ద్వారా వచ్చే హక్కుల్లో మాకూ వాటా కావాలి. మాపై పక్షపాతం, హింసా ధోరణి విడనాడాలి’అంటూ ట్రాన్స్జెండర్లు, హిజ్రాలు నినదించారు. తమ హక్కుల కోసం గళమెత్తారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమానత్వం, చట్టపరమైన రక్షణ, స్వేచ్ఛ, వివక్షనుంచి రక్షణ, లింగ వ్యక్తీకరణకు స్వాతంత్య్రాన్ని కల్పించాలని కోరారు. విద్య, ఉద్యోగాలలో ప్రభుత్వం అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లోయర్ ట్యాంక్‌బండ్ గోశాల నుంచి గాంధీనగర్, అశోక్‌నగర్ మీదుగా ఇందిరా పార్కు ధర్నా చౌక్ వరకూ ‘హైదరాబాద్ క్వీర్ స్వాభిమాన్ కవాతు’ పేరుతో ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైనసామాజిక వేత్త, ప్రొఫెసర్ కంచె ఐలయ్య జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో వారు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లు, హిజ్రాలను తోటి పురుషులు, స్త్రీలతో సమానంగా చూడాలన్నారు. హిజ్రాలకు సమాన హక్కులు లేవంటే అంబేద్కర్‌ను అవమానపర్చినట్లేనని అభిప్రాయపడ్డారు. వారి హక్కులను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం వైజయంతి, చంద్రముఖి మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్ పౌరులకు సమానత్వం, చట్టపరమైన రక్షణ వంటి హక్కులు ఉంటాయని గతంలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితంగా ఆ తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ ట్రాన్స్‌జెండర్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. భౌతిక, లైంగిక దాడుల నుంచి రక్షణ ఉండేలా సమగ్ర అత్యాచారాల వ్యతిరేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. హిజ్రాల జనాభాను ప్రభుత్వమే అధికారికంగా లెక్కించాలని కోరారు. ఓయూ విద్యార్థి సంఘ నేత శరత్ వారికి సంఘీభావం తెలిపారు. నవదీప్, రచన, గ్రీష్మ, మిస్కాన్, అఖిల, బిట్టు, తమన్నా, అరునాంగే తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా ఏర్పాటు చేసిన పోతురాజులు, బోనాలు, బతుకమ్మ తదితర సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
హిజ్రాల క్వీర్ స్వాభిమాన యాత్ర
-
ఎవరీ తార?
వెండితెరను ఏలుతున్న అగ్రతారలకు దీటుగా... ప్రముఖ నర్తకీమణులకు తీసిపోని విధంగా హుషారైన డ్యాన్స్‌లతో అలరించిన ఈ తార ఎవరో తెలుసా? చైతన్యానికి.. విద్యార్థులు ఆడిపాడారు. మహమ్మారి ఎయిడ్స్ భూతాన్ని తరిమేయాలని నినదించారు. ప్రజల్లో చైతన్యం కలిగించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సోమవారం నిజాం కాలేజీ నుంచి లలిత కళాతోరణం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించింది. అనంతరం లలిత కళాతోరణంలో జరిగిన కార్యక్రమంలో హిజ్రాలు డ్యాన్స్ లతో అదరగొట్టారు. మీరు చూసిన ఆ తార కూడా ఓ హిజ్రానే. - సాక్షి, సిటీబ్యూరో