విజయ్‌ సేతుపతిని అరెస్ట్‌ చేయండి.. | Transgenders demand must be arrest of Hero Vijay Sethupathi | Sakshi
Sakshi News home page

విజయ్‌ సేతుపతిని అరెస్ట్‌ చేయండి..

Published Thu, Apr 4 2019 9:32 AM | Last Updated on Thu, Apr 4 2019 9:45 AM

Transgenders demand must be arrest of Hero Vijay Sethupathi - Sakshi

సాక్షి, చెన్నై:  ప్రముఖ హీరో విజయ్‌ సేతుపతి అరెస్ట్‌ చేయలంటూ హిజ్రాలు డిమాండ్‌ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే విజయ్‌ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ, ఫాహత్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ’సూపర్‌ డీలక్స్’‌. ఇటీవల విడుదలైన ఈ సినిమా పలు విమర్శలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా విశ్లేషకులు, నెటిజన్లు ఈ చిత్రాన్ని విమర్శనలతో బంతాడుకుంటున్నారు. తాజాగా హిజ్రాలు... చిత్ర హీరో విజయ్‌ పేతుపతి, దర్శకుడు త్యాగరాజు కుమారరాజాలపై మండిపడుతున్నారు. హిజ్రాల సంఘం నిర్వాహకులు రేవతి, ప్రేమ, కల్కి సూపర్‌ డీలక్స్‌ చిత్రాన్ని తీవ్రంగా ఖండిస్తూ, విజయ్‌సేతుపతిని అరెస్ట్‌ చేయాలంటూ డిమాండ్‌ చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.

ఆ వీడియోలో విజయ్‌ సేతుపతి అంటే తమకు గౌరవం ఉందని, అయితే సూపర్‌ డీలక్స్‌ చిత్రంలో హిజ్రాగా నటించిన తరువాత ఆయనపై ఉన్న గౌరవం తగ్గిపోయిందన్నారు. హిజ్రాలు పిల్లలను కిడ్నాప్‌ చేస్తున్నట్లు చిత్రంలో చూపించారని ఆరోపించారు. చిత్రంలో విజయ్‌ సేతుపతి పోషించిన శిల్పా పాత్రను ముంబైలో పిల్లలను కిడ్నాప్‌ చేసి బిక్షం ఎత్తించేవారికి విక్రయించినట్లు చూపించారన్నారు. నిజానికి హిజ్రాలు పిల్లలపై ప్రేమ చూపుతారని, వారు ఎన్నటికీ పిల్లలను కిడ్నాప్‌ చేయరని అన్నారు. ఇక బెదిరింపులకు భయపడి హిజ్రాలు ఎలాంటి అత్యాచారాలకు పాల్పడడం లేదని తెలిపారు. అయితే అలాంటి సన్నివేశాలు చిత్రంలో చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఇకపోతే హిజ్రాలకు పిల్లలు పుట్టే భాగ్యం లేదన్నది విజ్ఞానపరమైన నిజం అన్నారు. అలాంటిది  ఒక పిల్లాడికి తండ్రి అయిన విజయ్‌ సేతపతి హిజ్రాగా మారినట్లు చూపించారన్నారు. ఇలాంటి పలు అంశాలు చిత్రంలో తమను అవమానానికి గురి చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారణం అయిన చిత్ర దర్శకుడు, అందులో నటించిన నటుడు విజయ్‌ సేతుపతిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement