
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లా దీన్‌దయాళ్‌నగర్‌లో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు హిజ్రా గ్రూపుల మధ్య తలెత్తిన వివాదం చివరకు దాడులకు దారి తీసింది. ఈ రోజు ఉదయం కొందరు హిజ్రాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. అలేఖ్య, శీలా అనే రెండు వర్గాలు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు.
ఈ ఘటనలో ముగ్గురు హిజ్రాలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దాడికి సంబంధించి ముగ్గరు హిజ్రాలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద కత్తులు, మారణాయుధాలు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment