![50 percent injured person](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/221.jpg.webp?itok=cqrllGgq)
ప్యాట్నీ సెంటర్‌లోని ఓ వస్త్రదుకాణంలో ఘటన
సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెనుముప్పు
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్) : భార్యతో గొడవ పడిన భర్త..ఆమె పనిచేసే దుకాణానికి వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దోమలగూడ తాళ్లబస్తీకి చెందిన శ్రవణ్‌కుమార్ రాణిగంజ్‌లోని బేరింగ్ షాపులో పనిచేస్తున్నాడు. ఇతనికి మౌనికతో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఆమెపై అనుమానంతో కొట్టడం, తిట్టడం చేస్తుండటంతో ఎనిమిదేళ్లుగా ఇద్దరూ విడిగా ఉంటున్నారు. శ్రవణ్‌కుమార్ తాళ్లబస్తీలో ఉంటుండగా మౌనిక దోమలగూడలో నివసిస్తూ ప్యాట్నీ సెంటర్‌లోని కామాక్షి సిల్‌్క్సలో రెండున్నరేళ్లుగా క్యాషియర్‌గా పని చేస్తోంది. విడివిడిగా ఉంటున్నా ఇద్దరూ అప్పుడప్పుడూ మాట్లాడుకునే వారు. అలాగే కుమార్తె కూడా గత 8 నెలల నుంచి శ్రవణ్‌కుమార్ వద్దే ఉంటోంది.
పెట్రోల్ బాటిళ్లతో వచ్చి..
ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ప్యాట్నీ సెంటర్‌లోని కామాక్షి సిల్‌్క్సకు కుమార్తెతో సహా వచి్చన శ్రవణ్‌కుమార్ భార్యతో గొడవ పడ్డాడు. షాపులో పనిచేసే సిబ్బంది అతడిని వారించి బయటకు పంపించారు. మళ్లీ 8.15 గంటలకు షాపు వద్దకు వచి్చన శ్రవణ్‌కుమార్ తనతో పాటు వాటర్ బాటిళ్లలో పెట్రోల్ తీసుకుని వచ్చాడు. రావడం రావడమే ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని బాటిల్‌లోని పెట్రోల్‌ను కింద పోశాడు. సిబ్బంది అతడిని వారిస్తుండగానే చేతిలో ఉన్న లైటర్‌తో నిప్పంటించాడు. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగి అతనికి అంటుకున్నాయి. అక్కడ ఉన్న కొన్ని చీరెలు, సామగ్రితో పాటు సిబ్బంది మొబైల్ ఫోన్లు కాలిపోయాయి.
50 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రికి...
సిబ్బంది వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, మార్కెట్ పోలీసులు, షోరూం సిబ్బంది కలిసి మంటలను ఆరి్పవేశారు. సకాలంలో మాల్‌లోని సిబ్బంది తమ దగ్గర ఉన్నఅగ్నిమాపక పరికరాలతో మంటలను కొద్దిగా అదుపులోకి తేవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శ్రవణ్‌కుమార్ 50శాతంకు పైగా కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహంకాళి ఏసీపీ సర్ధార్‌సింగ్, మార్కెట్ ఎస్‌ఐ శ్రీవర్ధన్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment