బొమ్మలసత్రం (నంద్యాల): హిజ్రాల చర్యలతో ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దంపతులు కోలుకోలేక మంగళవారం మృతిచెందారు. నంద్యాల ఎస్‌బీఐ కాలనీకి చెందిన సుబ్బరాయుడు(43), సరస్వతి(37) దంపతుల కుమారుడు సునీల్ బీటెక్ మొదటి సంవత్సరం ఫెయిలై ఆటో డ్రైవర్ల జత కట్టాడు. ఈనేపథ్యంలో హిజ్రాలతో తిరుగుతూ ఓ హిజ్రాతో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సునీల్‌ను తీసుకొచ్చి బంధువుల వద్దకు పంపారు.
అప్పటి నుంచి హిజ్రాల బృందం సుబ్బరాయుడు దంపతులు నడుపుతున్న దుకాణం వద్దకు వచ్చి వికృత చేష్టలతో వేధించడం, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురై పురుగు మందు తాగారు. స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో బంధువులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి్పంచినా కోలుకోలేక దంపతులిద్దరూ మృతి చెందారు.
ఏరియా ఆస్పత్రిలో గర్భిణి మృతి
Comments
Please login to add a commentAdd a comment