subbarayudu
-
ఐపీఎస్ సుబ్బారాయుడుపై కూటమి సర్కారు ఎనలేని ప్రేమ
-
ఐపీఎస్ అధికారిపై చంద్రబాబు ప్రభుత్వం ప్రేమ
అమరావతి: బదిలీ చేసి 10 రోజులు కాకుండానే ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడికి పోస్టింగ్ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం. కనీసం తిరుపతి తొక్కిసలాట ఘటనలో జరిగిన మరణాలపై విచారణ కూడా కాకుండానే తిరిగి పోస్టింగ్ ఇవ్వడం తీవ్ర చర్చకు దారి తీసింది. తిరుపతి వెంకటేశ్వరస్వామి భక్తుల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా అంటూ భక్తులతో పాటు రాష్ట్ర ప్రజలు విస్తు పోతున్నారు. ఈ విధంగా సుబ్బారాయుడిపై చంద్రబాబు మరోసారి తన మమకారం చాటుకున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటన సమయంలో అధికారులను తిట్టినట్టు బాబు పెద్ద హైడ్రామా చేసిన విషయం తెలిసిందే. కానీ ఇలా బదిలీ చేసిన ఎస్పీకి 10 రోజులు కాకుండానే పోస్టింగ్ ఇవ్వడంపై తీవ్ర ధుమారం రేపుతుంది. -
తిరుపతి తొక్కిసలాట.. ఎస్పీ సుబ్బారాయుడు ఎస్కేప్..?
-
హిజ్రాతో ప్రేమ.. నంద్యాలలో విషాదం
బొమ్మలసత్రం (నంద్యాల): హిజ్రాల చర్యలతో ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దంపతులు కోలుకోలేక మంగళవారం మృతిచెందారు. నంద్యాల ఎస్బీఐ కాలనీకి చెందిన సుబ్బరాయుడు(43), సరస్వతి(37) దంపతుల కుమారుడు సునీల్ బీటెక్ మొదటి సంవత్సరం ఫెయిలై ఆటో డ్రైవర్ల జత కట్టాడు. ఈనేపథ్యంలో హిజ్రాలతో తిరుగుతూ ఓ హిజ్రాతో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సునీల్‌ను తీసుకొచ్చి బంధువుల వద్దకు పంపారు. అప్పటి నుంచి హిజ్రాల బృందం సుబ్బరాయుడు దంపతులు నడుపుతున్న దుకాణం వద్దకు వచ్చి వికృత చేష్టలతో వేధించడం, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురై పురుగు మందు తాగారు. స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో బంధువులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి్పంచినా కోలుకోలేక దంపతులిద్దరూ మృతి చెందారు. ఏరియా ఆస్పత్రిలో గర్భిణి మృతి -
జగన్ ను కలిసిన తర్వాత ధైర్యం వచ్చింది..
-
నంద్యాలలో సుబ్బారాయుడి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్ (ఫొటోలు)
-
పోలీసులు పక్కనే ఉన్న రక్షణ లేదు మాకు...
-
పోలీసులకు లొంగిపోయిన టీడీపీ హంతకుడు..
-
‘మహాప్రస్థానం’ అనువాదకుడు సుబ్బారాయుడు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: విప్లవ రచయిత శ్రీశ్రీ రచించిన ‘మహా ప్రస్థానం’ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించిన రిటైర్డ్ ఆంగ్ల లెక్చరర్ వడ్డీ సుబ్బారాయుడు (84) శుక్రవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన కడప ఆర్ట్స్ కాలేజీలో ఆంగ్ల లెక్చరర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. సుబ్బారాయుడు అంత్యక్రియలను శనివారం హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు డాక్టర్ వి.సూర్యప్రకాశ్ తెలిపారు. సుబ్బారాయుడు పలు తెలుగు కథలను ఇంగ్లిష్‌లోకి అనువదించి ప్రశంసలు పొందారు. -
‘ఫ్యాక్షన్ రాజకీయాలను సహించేది లేదు’
సాక్షి, కర్నూలు: దళిత న్యాయవాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుబ్బరాయుడుని దారుణంగా హత్య చేయడాన్ని ఎమ్మెల్యే శిల్ప రవీంద్ర కిషోర్ ఖండిస్తూ.. టీడీపీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దళిత న్యాయవాది సుబ్బరాయుడిని టీడీపీ నాయకులు హత్య చేస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దళితులపై దాడులు జరుగుతున్నాయని గగ్గోలు పెట్టే చంద్రబాబు ఈరోజు దళిత న్యాయవాది టీడీపీ నాయకుల చేతిలో హత్యకు గురైతే ఎక్కడున్నారని మండిపడ్డారు. ఆళ్లగడ్డ ఫ్యాక్షన్ రాజకీయాలు నంద్యాలలో చేస్తే సహించేది లేదని ధ్వజమెత్తారు. ప్రశాంతంగా ఉన్న నంద్యాల ప్రాంతాన్ని భూమా కుటుంబం వారి రాజకీయ లబ్ధి కోసం అరాచకాలు, హత్యా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. న్యాయవాది హత్య కేసుపై మరింత సమగ్ర దర్యాప్తు జరిపి హత్య కుట్ర వెనక ఉన్న నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలని ఆయన పోలీసులను కోరారు. సుబ్బరాయుడు హత్య కేసులో ప్రధాన నిందితుడైన మనోహర్ గౌడ్ భూమా కుటుంబానికి ఆర్థికంగా, రాజకీయంగా నమ్మిన బంటు అన్నారు. ఈ హత్యకు భూమా కుటుంబం ఆజ్యం పోసిందనేది ప్రజలందరూ గమనిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
సుబ్బారాయుడి హత్య మిస్టరీ వీడింది!
సాక్షి,కర్నూలు: జిల్లాలోని మెట్టుపల్లి గ్రామంలో 2015, డిసెంబర్ 5న జరిగిన సుబ్బారాయుడు దారుణ హత్య కేసును పోలీసులు తాజాగా ఛేదించారు. ఈ కేసులోని నలుగురు నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలను ఈ సందర్భంగా పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఇన్సూరెన్స్ డబ్బు కోసం తన వద్ద పనిచేస్తున్న సుబ్బారాయుడు అనే పనివాడిని.. అవుకు మండల టీడీపీ నాయకుడు సీ జే భాస్కర్ రెడ్డి హతమార్చినట్టు పోలీసులు తెలిపారు. సినీ ఫిక్కీలో పథకం ప్రకారం ఇన్సూరెన్స్ డబ్బును కాజేయడానికి ఈ హత్య చేశారని, మృతి చెందిన సుబ్బారాయుడిపై నిందితుడు అప్పటికే రెండు ఇన్సూరెన్స్ పాలసీలను చేశాడని, ఆ ఇన్సూరెన్స్ డబ్బును క్లెయిమ్ చేసుకోవడానికిగాను సుబ్బారాయుడిని దారుణంగా హతమార్చి యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని పోలీసులు వివరించారు. -
పిచ్చికుక్క స్వైరవిహారం
పిచ్చికుక్క దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీరాంనగర్‌లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన చక్రవర్తి, సుబ్బారాయుడు, పెంకయ్య, హుసేనమ్మతో పాటు మరో వ్యక్తిపై పిచ్చికుక్క దాడి చేసి గాయపర్చింది. దీంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
'పోలవరంపై ఎంత ఖర్చు చేశారో చెప్పాలి'
-
నేటి నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్, కౌన్సెలింగ్ కన్వీనర్ సుబ్బారాయుడు తెలిపారు. ఈ నెల 17 నుంచి 21 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. అదే విధంగా ఈ నెల 20 నుంచి 24 వరకు ఆప్షన్ల ఎంపిక ప్రక్రి య కొనసాగుతుందని పేర్కొన్నారు. డిగ్రీలో 50శాతం మార్కులు కలిగిన ఓసీలు, 45శాతం మార్కులు గల ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాత్రమే అర్హులని తెలిపారు. ఓసీ, బీసీలకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.600, ఎస్సీ, ఎస్టీలకు రూ.300 ఉంటుందన్నారు. ఈ కౌన్సెలింగ్‌లో ఎంబీఏ, ఎంసీఏ విభాగాలకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. మొదటి రోజు 1నుంచి 25వేల ర్యాంకు వరకు కౌన్సిలింగ్ ఉంటుందన్నారు. విద్యార్థులు 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, విద్యార్హతకు సంబంధించిన అన్ని పత్రాలకు చెందిన 2 సెట్ల జిరాక్స్ కాపీలతో పాటు ఒరిజినల్స్ కూడా వెంట తీసుకురావాలన్నారు. కాగా జిల్లాలో ఒక్కటే కౌన్సెలింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
పేదోడి ఆరోగ్యంపై చిన్నచూపు
నాయుడుపేట, న్యూస్‌లైన్: పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడుకి చెందిన మరియమ్మ తన బిడ్డ తిరుపతమ్మను ఆసుపత్రికి తీసుకువచ్చింది. అలాగే సిద్ధవరం చెంచ మ్మ తన కుమారుడు సుబ్బరాయుడుకు వైద్యం చేయించేందుకు డాక్టర్ కోసం ఉదయం నుంచి ఎదురుచూస్తోంది. గొట్టిప్రోలుకి చెందిన వసంతమ్మ తన బిడ్డకు కడుపులో నొప్పిగా ఉండడంతో ఉదయం నుంచి వేచి చూస్తున్నారు. అయినా చిన్న పిల్లల వైద్యులు మాత్రం ఉదయం 11 గంటలైనా రాకపోవడంతో చిన్నారులను తీసుకువచ్చిన మహిళలు ఆసుపత్రి వరండాలోనే పడిగాపులు కాశారు. ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళకు ప్రసవ నొప్పలు వచ్చి ఇబ్బందులు పడుతున్నా అందుకు సంబంధించిన వైద్యాధికారిణి పట్టించుకోకపోవడం విశేషం. ఇవీ నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం కనిపించిన దృశ్యాలు. ఖరీదైన వైద్యం చేయించుకోలేక పేదలు ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తుంటారు. కానీ వారిని వైద్యాధికారులు, సిబ్బంది చిన్నచూపు చూస్తున్నారు. అసలు ైవె ద్యులు ఎప్పుడొస్తారో కూడా తెలియని పరిస్థితి. చక్కెర కర్మాగారంలో పనిచేసే కాండ్రేగులు వెంకటేశ్వరరావు కుమార్తె నాగవేణి గర్భిణి. ఆమె ఆసుపత్రికి వచ్చారు. రెండు రోజుల నుంచి నొప్పులు వస్తూ పోతూ ఉన్నాయి. దీంతో ఆమె ఆస్పత్రికి రాగా పట్టించుకున్న వారు లేరు. నాగవేణి తండ్రి వెంకటేశ్వరరావు వైద్యులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పే వారు కరువయ్యాయరు. కాన్పు సమయం దగ్గరపడిందా..లేక ప్రసవం అవుతుందా అనే విషయాలను బాధితులకు తెలపకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ విషయాన్ని తమకు చెబితే స్కానింగ్ చేసుకోవడం వంటి ఏర్పాట్లు చేసుకుంటామని ఏవైనా ఇబ్బందులు జరిగితే ఏం చేయాలని మండి పడ్డారు. సెలైన్పెట్టాలంటే బెడ్లు తెచ్చుకోవాల్సిందే 30 పడకల ఆసుపత్రిని ట్రామాకేర్ సెంటర్‌కు మార్చడంతో రోగులు ఎవరి బెడ్లు వారే తెచ్చుకోవాలని అక్కడి సిబ్బంది సూచిస్తున్నారు. సెలైన్ పెట్టాలన్నా పడకలు ఖాళీ ఉండడంలేదు. మీరు తెచ్చుకుంటే సెలైన్ పెడతామంటూ సిబ్బంది తెలపడంతో పక్క గదుల్లో ఉన్న బెడ్లను వారే తెచ్చుకుని సెలైన్ పెట్టించుకుంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే 30 పడకల ఆసుపత్రిలోకి మార్చి వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభత్వ ఆసుపత్రిలో వసతులు కరువు వాకాడు: వాకాడులోని నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో రోగులు వెనుదిరుగుతున్నారు. మండలంలోని తీర ప్రాంత ప్రజలు కాన్పులు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవాలంటే వాకాడు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందిస్తారనే నమ్మకంతో పరుగులు తీస్తారు. సర్కారు ఆసుపత్రి పని తీరు దుర్భరంగా ఉండడంతో ప్రభుత్వాసుపత్రి అంటేనే భయపడిపోయి ప్రైవేట్ వైద్యశాలలకు వెళుతున్నారు. దీంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల సంఖ్య ఇక్కడ గణనీయంగా తగ్గిపోయింది. తాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, సరైన మంచాలు, రోగానికి తగిన మందులు, లైట్లు, రాత్రిపూట వాచ్మెన్ తదితర సదుపాయాలు లేవు. ఆసుపత్రి పాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారినా సంబంధిత అధికారులు,పాలకులు పట్టించుకున్న దాఖలాల్లేవు. వేసవితాపం తట్టుకోలేని గ్రామీణ ప్రాంత వృద్ధులు, మహిళలు, చిన్నారులు వడదెబ్బ తగిలి వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. గ్రామాల్లో ఏర్పాటుచేసిన ఆరోగ్య ఉపకేంద్రాలు తెరిచిన పాపాన పోలేదని, ఒక వేళ తెరిచినా వైద్య సిబ్బంది, మందులు ఉండవని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది విధులకు రావడం, రిజిస్టర్లో సంతకాలు చేయడం, ప్రతి నెలా జీతాలు తీసుకోవడం తప్ప ఆసుపత్రి అభివృద్దిపై దృష్టి సారించడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆ డబ్బుకు లెక్కల్లేవ్!
* సిద్ధార్థ అకాడమీలో రూ.3.8 కోట్లు స్వాధీనం * పొంతనలేని లెక్కలు చెప్పిన యాజమాన్యం సాక్షి, విజయవాడ: విజయవాడ సిద్ధార్థ అకాడమీలో ఎన్నికల అధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందం గా కేవలం రూ.3.8 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అకాడమీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో ఓటర్లకు అక్రమంగా పంపిణీ చేసేందుకు డబ్బు దాచిపెట్టారని సమాచారం రావడంతో ఎన్నికల అధికారులు, పోలీసులు, ఇన్‌కంటాక్స్ అధికారులు మంగళవారం దాడి చేసిన విషయం తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన తనిఖీలు బుధవారం వేకువజామున 4 గంటల వరకూ జరిగాయి. అకాడమీ కోశాధికారి వెంకటేశ్వరరావు తాళాలు లేవని చెప్పటంతో మూడు బీరువా(లాకర్లు)ల ను పగులగొట్టి రూ.3.8 కోట్లు మాత్రమే ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.3.77 కోట్లు నగదు కాగా, రూ.3 లక్షల విలువైన బంగారు డాలర్ల రూపంలో ఉన్నాయని కేంద్ర ఎన్నికల అధికారి సుబ్బారాయుడు చెప్పారు. సుమారు 200 కవర్లలో రెండు, మూడు వేలు రూపాయల వంతున పెట్టి ఉన్నాయని, అవి ప్రొఫెసర్లకు సిబ్బందికి ఇవ్వడానికి ఉంచామని చెప్పారని తెలిపారు. అయితే, కేవలం కేవలం రూ.3.80 కోట్లు మాత్రమే దొరికాయని చెప్పడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నగదుపై అకాడమీ యాజమాన్యం పొంతనలేని సమాధానాలు చెప్పింది. రూ. 50 లక్షలు సిబ్బం ది జీతాలకోసం, రూ. 80 లక్షలు స్థలం కొనుగోలు కోసం అకాడమీ చైర్మన్ ఇచ్చారని పేర్కొంది. కానీ సరైన ఆధారాలను చూపించలేకపోయారు. దీంతో మొత్తం సొమ్మును స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులకు అప్పగించారు. కాగా, పట్టుపడిన డబ్బు లెక్కింపుపై కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం తీరుపట్ల భన్వర్‌లాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని గదుల్లోనూ తనిఖీలు నిర్వహించి నివేదిక పంపాలని ఆదేశించారు. -
లారీ- కారు ఢీ: దంపతులు మృతి
కనగానపల్లి మండలం పర్వతదేవపల్లి వద్ద ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న వాహనం ఈ రోజు తెల్లవారుజామున బోల్తా పడింది. ఆ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిలో వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఎర్రచందన దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడిని కూడా అదే ఆసుపత్రికి తరలించారు. ఎర్రచందనం దుంగల అక్రమ రవాణపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదే జిల్లాలోని పామిడి మండలం గజరాంపల్లి సమీపంలో వేగంగా వెళ్తున్నలారీ, ఎదురుగా వస్తున్న కారుని ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో దంపతులు మరణించారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహలను స్వాధీనం చేసుకుని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మృతి చెందిన దంపతుల్లో భర్త సుబ్బరాయుడు రైల్వే అధికారి అని పోలీసులు తెలిపారు. అనంతరం లారీ డ్రైవర్ ను పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాని పుల్లంపేటలో హెచ్‌పీ గ్యాస్ గోడౌన్ వద్ద ఈ రోజు తెల్లవారుజామున లారీ - పాల వ్యాన్ ఢీ కొన్నాయి. ఆ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కడప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.