
సాక్షి,కర్నూలు: జిల్లాలోని మెట్టుపల్లి గ్రామంలో 2015, డిసెంబర్ 5న జరిగిన సుబ్బారాయుడు దారుణ హత్య కేసును పోలీసులు తాజాగా ఛేదించారు. ఈ కేసులోని నలుగురు నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలను ఈ సందర్భంగా పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఇన్సూరెన్స్ డబ్బు కోసం తన వద్ద పనిచేస్తున్న సుబ్బారాయుడు అనే పనివాడిని.. అవుకు మండల టీడీపీ నాయకుడు సీ జే భాస్కర్ రెడ్డి హతమార్చినట్టు పోలీసులు తెలిపారు. సినీ ఫిక్కీలో పథకం ప్రకారం ఇన్సూరెన్స్ డబ్బును కాజేయడానికి ఈ హత్య చేశారని, మృతి చెందిన సుబ్బారాయుడిపై నిందితుడు అప్పటికే రెండు ఇన్సూరెన్స్ పాలసీలను చేశాడని, ఆ ఇన్సూరెన్స్ డబ్బును క్లెయిమ్ చేసుకోవడానికిగాను సుబ్బారాయుడిని దారుణంగా హతమార్చి యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని పోలీసులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment