మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్, కౌన్సెలింగ్ కన్వీనర్ సుబ్బారాయుడు తెలిపారు. ఈ నెల 17 నుంచి 21 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. అదే విధంగా ఈ నెల 20 నుంచి 24 వరకు ఆప్షన్ల ఎంపిక ప్రక్రి య కొనసాగుతుందని పేర్కొన్నారు. డిగ్రీలో 50శాతం మార్కులు కలిగిన ఓసీలు, 45శాతం మార్కులు గల ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాత్రమే అర్హులని తెలిపారు. ఓసీ, బీసీలకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.600, ఎస్సీ, ఎస్టీలకు రూ.300 ఉంటుందన్నారు.
ఈ కౌన్సెలింగ్‌లో ఎంబీఏ, ఎంసీఏ విభాగాలకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. మొదటి రోజు 1నుంచి 25వేల ర్యాంకు వరకు కౌన్సిలింగ్ ఉంటుందన్నారు. విద్యార్థులు 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, విద్యార్హతకు సంబంధించిన అన్ని పత్రాలకు చెందిన 2 సెట్ల జిరాక్స్ కాపీలతో పాటు ఒరిజినల్స్ కూడా వెంట తీసుకురావాలన్నారు. కాగా జిల్లాలో ఒక్కటే కౌన్సెలింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
నేటి నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
Published Tue, Sep 16 2014 11:42 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement