
చిన్నశంకరంపేట(మెదక్): ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిన్నశంకరంపేట మండలం మడూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నారాయణ గౌడ్ కథనం మేరకు.. మండలంలోని మడూర్ గ్రామానికి చెందిన శివరాజ్(24)కు కొద్ది రోజులుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ ఎక్కడా సంబంధం కుదరడంలేదు. దీంతో మానోవేదనకు గురయ్యాడు. గురువారం రాత్రి పొలం వద్దకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు.
అర్థరాత్రి అవుతున్నా ఇంటికి రాకపోవడంతో తండ్రి యాదగిరి, మరో రైతు సత్యనారాయణతో కలిసి పొలం వద్దకు వెళ్లి చూశారు. అప్పటికే పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తండ్రి యాదగిరి శుక్రవారం పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
భార్యతో గొడవపడి భర్త..
పటాన్‌చెరు టౌన్: భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుభాష్ సాకేత్(27) బతుకుదెరువు కోసం పటాన్‌చెరుకు వచ్చాడు. మండల పరిధిలోని పెద్ద కంజర్ల గ్రామంలో గల అరబిందో వెంచర్‌లో మేస్త్రీ వద్ద కూలీగా పని చేస్తూ అక్కడే షెడ్‌లో ఉంటున్నాడు. గురువారం రాత్రి ఫోన్‌లో భార్యతో గొడవ పడ్డాడు.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి వెంచర్‌లోనే ఓ చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించి మృతుడి సోదరుడు విశాల్ ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment