
Heavy Rain Updates..
వరద ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఎరియల్ సర్వే
- శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన సీఎం రేవంత్
- సీఎంతో పాటు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్
- శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు గోదావరి జలాలు గుండె కాయ
- ఘోష్ నివేదికపై అసెంబ్లీ చర్చకు పెట్టాం
- మామ అల్లుడు ఎన్ని కుట్రలు చేసినా.. చేసిన పాపాలు పోవు
- కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపుతే గ్రామాలు కొట్టుకపోతాయి
- మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్ట్‌లో లోపాలు ఉన్నాయి
- కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో సాంకేతిక వైఫల్యం ఉంది.
- డిజైన్లు, నిర్మాణం, నిర్వహణ లోపం ఉంది
ఏరియల్ సర్వేకు బయల్దేరిన సీఎం రేవంత్‌రెడ్డి

- కాసేపట్లో కామారెడ్డి,మెదక్ జిల్లా సీఎం రేవంత్‌రెడ్డి ఏరియల్ సర్వే
- సీఎం రేవంత్‌తో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి,మహేష్ గౌడ్
- వరద ప్రభావిత పప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్న సీఎం రేవంత్
- ముందుగా ఎల్లంపల్లి సీఎం రేవంత్ ఏరియల్ సర్వే
- ఆ తర్వాత మెదక్‌కు వెళ్లనున్న తెలంగాణ సీఎం
- అనంతరం కామారెడ్డిలో వరదలతపై అధికారులతో సమీక్ష చేయనున్న సీఎం
వర్షాల ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు..
- భారీ వర్షాలు, వరదలతో పలు రైళ్లు రద్దు
- కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో పలు రైళ్లు రద్దు
- కొన్ని దారి మళ్లింపు, మరికొన్ని పాక్షికంగా రద్దు
- 36 రైళ్లు రద్దు, 25 రైళ్లు దారి మళ్లింపు, పాక్షికంగా 14 రైళ్లు రద్దు
- వివరాలు వెల్లడించిన దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్
Helpline Numbers provided at Kacheguda, Nizamabad, Kamareddi, Secunderabad Railway Stations in view of heavy trains for information on train operations
Kacheguda - 9063318082
NZB - 9703296714
KMC - 9281035664
SC - 040 277 86170@drmsecunderabad @drmhyb #HeavyRains #Telangana— South Central Railway (@SCRailwayIndia) August 28, 2025
రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం: ఐఎండీ
- రేపటి వరకు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు..
- ఇవాళ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ.
- నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ.
- హైదరాబాద్ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.
డీజీపీ జితేందర్ కామెంట్స్.
- వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు ఫోర్స్ అప్రమత్తంగా ఉంది.
- 24 గంటలుగా పోలీసు ఫోర్స్ రెస్య్కూ ఆపరేషన్లు చేస్తూనే ఉంది.
- బోట్స్, లైఫ్ జాకెట్లతో చాలా మందిని రక్షించగలిగాం.
- ఇప్పటి వరకు 1200 మందిని కాపాడాం.
- కామారెడ్డి, నిర్మల్, మెదక్, రామాయంపేటలో వరద తగ్గింది
- కంట్రోల్ రూమ్ నుంచి వరదలపై 24 గంటలు మానిటరింగ్ చేస్తున్నాం.
- కామారెడ్డిలో చాలా మందిని కాపాడగలిగాం.
- సకాలంలో ఎస్డీఆర్‌ఎఫ్ టీమ్స్ స్పాట్‌కి చేరుకోవడంతో ముప్పు తప్పింది.
- ఎస్డీఆర్‌ఎఫ్, స్థానిక పోలీసులు, ైఫైర్ సిబ్బంది కలిసి ెరెస్య్కూ ఆపరేషన్ చేశాం.
- అన్ని ప్రాంతాల్లో పోలీసు ఫోర్స్ అప్రమత్తంగా ఉంది.
జాతీయ రహదారి-44పై ట్రాఫిక్ మళ్లింపు
ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో పోలీసుల సూచనలు..
- తెలంగాణలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న NH-44 నాగ్‌పూర్ హైవే..
- ప్రజల భద్రత కోసం ట్రాఫిక్ డైవర్షన్ అమలు..
- హెవీ వెహికిల్స్ డైవర్షన్ ఇలా..
- హైదరాబాద్-ఆదిలాబాద్ వెళ్తున్న లారీలు మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద మళ్లింపు.
- మేడ్చల్-సిద్ధిపేట-కరీంనగర్-జగిత్యాల-కోరుట్ల-మెట్‌పల్లి-ఆర్మూర్-ఆదిలాబాద్ వెళ్ళాలి
- లైట్ వెహికిల్స్ డైవర్షన్ ఇలా..
- హైదరాబాద్-ఆదిలాబాద్ వెళ్తున్న కార్లు తూప్రాన్ వద్ద మళ్లింపు.
- మేడ్చల్-తూప్రాన్-సిద్ధిపేట-కరీంనగర్-జగిత్యాల-కోరుట్ల-మెట్‌పల్లి-ఆర్మూర్-ఆదిలాబాద్
- కామారెడ్డి-డిచ్‌పల్లి-ఆర్మూర్ మధ్య రహదారి వర్షంతో ప్రభావితం అయ్యింది..
- ఆదిలాబాద్ వెళ్లే ప్రయాణికులు ముందుగానే ప్రణాళిక చేసుకోవాలి: పోలీసులు
- హెవీ వెహికిల్స్ తప్పనిసరిగా డైవర్షన్ మార్గం పాటించాలి.
- ట్రాఫిక్ పోలీసులు, హైవే పెట్రోల్ సిబ్బంది డైవర్షన్స్ చూపుతారు.
🚦 TRAFFIC ADVISORY – NH44 (Nagpur Highway) 🚦
Due to heavy rains and road damage on NH44, traffic diversions are in effect to ensure safety and smooth movement.
📍 Diversion for Heavy Vehicles
From Hyderabad → Adilabad (NH44), traffic will be diverted at Medchal Checkpost.… pic.twitter.com/KseVIcc9X6— Cyberabad Traffic Police (@CYBTRAFFIC) August 28, 2025
రానున్న మూడు గంటల్లో భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక
@balaji25_t Kamareddy present situation.
At. Pedda cheruvu. Totally destroyed. #Kamareddy @Collector_KMR @revanth_anumula
. Situation may. Get worse. Due. Upcoming. Rains and flooding.. so .. Take. Responsibility all Departments @TelanganaCMO @TelanganaCOPs pic.twitter.com/wJqtqLMOSF— KALKI .& SALAAR. ✨ (@MRSANJUYT1) August 28, 2025
సిరిసిల్ల, కామారెడ్డిలో కేటీఆర్ పర్యటన
- బీఆర్‌ఎస్ నేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్
- భారీ వర్షాలు, వరదలపై కేటీఆర్ తీవ్ర ఆందోళన
- కార్యకర్త నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరూ సహాయ చర్యల్లో పాల్గొనాలి
- వర్షాల వల్ల నష్టపోయిన వారికి తక్షణ సహాయం అందించాలి
- తీవ్రమైన వరద ఉన్నచోట ఆహారం, తాగునీరు అందించాలి
- అవసరమైతే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి
- పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి, వ్యాధులు ప్రబలకుండా చూడాల
- సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్న కేటీఆర్
- వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో పర్యటన
- ముందుగా సిరిసిల్ల జిల్లా నర్మలలో పర్యటించనున్న కేటీఆర్
- నర్మల పర్యటన తర్వాత కామారెడ్డికి రాక.
Due to ongoing Massive rains, many parts of kamareddy district under flash floods, below 👇visuals of #Kamareddy to #Hyderabad route#KamareddyFloods #KamareddyRains pic.twitter.com/Uta0EdVzja
— Eastcoast Weatherman (@eastcoastrains) August 28, 2025
కామారెడ్డి పర్యటనకు బయల్దేరిన మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ
- భారీ వర్షాలు దృష్ట్యా కామారెడ్డిలో పరిస్థితిని పరిశీలించనున్న సీతక్క
- వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించనున్న మంత్రి సీతక్క
- ప్రజలకు అందుతున్న అత్యవసర సేవలపై సమీక్ష
పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు
- కొణిజర్లలో పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు
- ఖమ్మం జిల్లాలో పొంగుతున్న వాగులు..
- కొణిజర్ల మండలంలో నమోదై 120 మిల్లీమీటర్ల వర్షపాతం
- మండలంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పగిడేరు, నిమ్మ వాగు, జన్నారం ఏరు, రాళ్లవాగు
- పగిడేరు ఉద్ధృతితో నిలిచిన రాకపోకలు
భువనగిరి భారీ వాహనాల రాకపోకలకు అనుమతి
- భువనగిరి చిట్యాల మార్గంలో నాగిరెడ్డిపల్లి వద్ద కల్వర్టుపై నుంచి ఉద్ధృతంగా సాగుతున్న వరద ప్రవాహం
- బుధవారం నిలిపివేసిన వాహనాల రాకపోకలు
- ప్రవాహం తగ్గడంతో గురువారం ఉదయం నుంచి అనుమతించిన భారీ వాహనాల రాకపోకలు
ఇళ్లు ఖాళీ చేస్తున్న ప్రజలు
- కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో వచ్చిన వరదల వల్ల ఇళ్లు ఖాళీ చేస్తున్న ప్రజలు
- ఇళ్లు ఖాళీ చేస్తున్న డోంగ్లి మండలంలోని సిర్పూర్, పెద్దటాక్లీ గ్రామాల ప్రజలు
- మద్నూర్ మండలం మీర్జాపూర్‌లోని ఆలయంలో తలదాచుకుంటున్న వృద్ధులు, చిన్నారులు
- పొరుగు గ్రామంలోని బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్న సిర్పూర్ గ్రామస్థులు
- డోంగ్లికి వెళ్లిపోయిన పెద్దటాక్లీలోని కొన్ని కుటుంబాలు
- జలదిగ్బంధంలో పిట్ల మండలం కుర్తి గ్రామం
- నిజాంసాగర్, కౌలాస్‌నాలా జలాశయం గేట్లు ఎత్తి నీటి విడుదల
- నీటి విడుదలతో ఆందోళనలో ముంపు గ్రామాల ప్రజలు
మాజీ మంత్రి హరీష్ పర్యటన..
- మెదక్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో హరీష్‌రావు పర్యటన
- బూరుగుపల్లిలో తెగిపోయిన రహదారిని పరిశీలించిన హరీష్
- స్థానికులతో మాట్లాడిన మాజీ మంత్రి
- రాజాపేట, ధూప్‌సింగ్‌తండా వాసులను పరామర్శించిన హరీష్‌రావు బృందం
- నిన్నటి నుంచి జల దిగ్బంధంలో ఉన్న ధూప్‌సింగ్‌తండా
సీఎం రేవంత్ ఏరియల్ సర్వే వాయిదా..
సీఎం ఏరియల్ సర్వేకు వర్షం అడ్డంకి..
వాతావరణం అనుకూలించకపోవడంతో ఏరియల్ సర్వే వాయిదా
వర్షాలపై సీఎం సమీక్ష..
- రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్కతో సమావేశమైన సీఎం.
- వరద ప్రభావిత జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేయటంతో పాటు తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలపై సమీక్ష
- ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు
20 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- బిక్కనూర్ టోల్‌ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- బిక్కనూర్ టోల్‌ప్లాజా నుంచి కామారెడ్డి వరకు భారీగా ట్రాఫిక్ జామ్
- సుమారు 20 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- వాహనాలు భారీగా నిలవడంతో వాహనదారుల ఆందోళన
మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు..
- భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.
- నేడు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో హెలికాప్టర్‌ను అందుబాటులో ఉంచాం..
- నిరాశ్రయులైన ప్రజల కోసం ఆహారం, ఇతర వస్తువులు అందుబాటులో ఉంచాం..
- ఏరియల్ సర్వే ద్వారా పరిస్థితిని సీఎం సమీక్షిస్తారు.
- కామారెడ్డి జిల్లా అధికారులతో సమీక్ష చేస్తా.
- సాయంత్రం వరకు పంట, ప్రాణ, ఆస్తి నష్టంపై నివేదిక వస్తుంది.
భారీ వర్షాలపై కేసీఆర్ ఆందోళన..
- భారీ వర్షాలు, వరదలతో రాష్ట్ర ప్రజలకు ఇబ్బందుల పట్ల మాజీ సీఎం కేసీఆర్ ఆందోళన
- వరద ప్రభావిత ప్రాంతాల పార్టీ నేతలతో మాట్లాడిన కేసీఆర్
- తమ వంతుగా పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టేలా చూడాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆదేశం
తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్.. 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
- భద్రాద్రి, భూపాలపల్లి, ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్, నిర్మల్, కొమురంభీం,
- నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేశారు.
- ఈ ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలు, ఉరుములు, మెరుపులు వర్షాలు..
- తెలంగాణలో మొత్తం 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- 11 జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం
SEVERE RAINFALL WARNING ⚠️🌧️
NEXT 6HOURS FORECAST ⚠️
VERY HEAVY DOWNPOURS to continue in Kamareddy, Nizamabad, Nirmal, Jagitial. FLASH FLOOD WARNING for these districts ⚠️⚠️⚠️
HEAVY DOWNPOURS to continue in Karimnagar, Sircilla, Peddapalli, Adilabad, Asifabad Medak, Mulugu.…— Telangana Weatherman (@balaji25_t) August 28, 2025
వర్షాల ఎఫెక్ట్.. 11 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు
- తాజాగా నల్లగొండ, యాదాద్రి, కరీంనగర్, సిద్దిపేట్ల, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో విద్యాసంస్థలు బంద్
- ఇప్పటికే కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ఇచ్చిన అధికారులు.
- కరీంనగర్, జగిత్యాల జిల్లాలోని అన్ని పాఠశాలకు సెలవు
- కరీంనగర్, జగిత్యాల జిల్లాలోని అన్ని పాఠశాలకు ఇవాళ సెలవు
- భారీ వర్షాల దృష్ట్యా సెలవు ప్రకటించిన జిల్లా విద్యాధికారులు
NH-44 turns into a nightmare!
20 KM traffic jam in #Kamareddy as heavy flooding brings vehicles to a standstill. #Telangana #NH44 pic.twitter.com/atBXc2bhuI— Mubashir.Khurram (@infomubashir) August 28, 2025
NH-44పై భారీగా ట్రాఫిక్ జామ్..
- ఆదిలాబాద్ జిల్లా : భారీ వర్షాల దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవు
- అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దని కలెక్టర్ సూచన
- రాత్రి నుంచి ఏకధాటి వర్షానికి జలమయమైన లోతట్టు ప్రాంతాలు
- ఆదిలాబాద్ జిల్లా: వర్ష బీభత్సానికి విరిగిపడిన చెట్లు, తెగిన విద్యుత్ తీగలు
- భీంపూర్, తాంసి మండల్లోని 50 గ్రామాలకు రాత్రి నుంచి నిలిచిన విద్యుత్ సరఫరా
- ఎన్‌హెచ్-44పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
- లారీలు, వాహనాలు కిలోమీటర్ల మేర్ల బారులు తీరాయి.
TELANGANA & HYDERABAD Update | 28 AUG 8AM ⚠️
🔴 SEVERE DOWNPOURS Alert for Kamareddy, Medak, Sircilla, Karimnagar, Jagitial, Nizamabad, Nirmal, and Khammam districts.
Peak LPA Effect is going on now in the above-mentioned districts. The LPA impact is likely to end tonight…— Hyderabad Rains (@Hyderabadrains) August 28, 2025
పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
- ఉదయం 8 గంటలకు 34.9 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
#Kamareddy జిల్లాలోని సరంపల్లి గ్రామం దేవునిపల్లి పోలీస్ స్టేషన్ ఏరియాల లోని ST రెసిడెన్షియల్ విద్యార్థులు (300) జలదిగ్బంధంలో ఉన్న విషయం తెలుసుకొని వారిని కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. @TelanganaCOPs @TelanganaDGP @TelanganaCMO @Collector_KMR pic.twitter.com/hnAsa0E75Q
— SP Kamareddy (@sp_kamareddy) August 27, 2025
మానేరు ఉగ్రరూపం..
- మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో మానేరు ఉగ్రరూపం
- ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
- తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రజల అవస్థలు
- మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో మానేరు ఉగ్రరూపం
- పాల్వంచ వాగు, కూడవెల్లి వాగుల నుంచి మానేరులోకి భారీగా వరద
- రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మానేరువాగు
- నిండుకుండను తలపిస్తున్న నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు జలాశయం
- ఎగువ మానేరు జలాశయం నుంచి దిగువకు వరద విడుదల
- మానేరు ఉగ్రరూపంతో మిడ్ మానేరులోకి భారీగా వరద నీరు
- వచ్చే 2 గంటల్లో కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం,
- మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్, పెద్దపల్లిలో భారీ వర్షాలు
- వచ్చే 2 గంటల్లో సిద్దిపేట, మెదక్, జనగాం, యాదాద్రి, మంచిర్యాలలో మోస్తరు వర్షాలు
వరంగల్ అతలాకుతలం..
- ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు
- ములుగు జిల్లా తాడ్వాయిలో 15 సెం.మీ వర్షపాతం
- వెంకటాపూర్‌లో 12 సెం.మీ., గోవిందరావుపేటలో 11 సెం.మీ. వర్షపాతం
- ములుగు జిల్లా: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న జంపన్నవాగు
- మేడారం వద్ద బ్రిడ్జి ఆనుకుని పారుతున్న జంపన్నవాగు
- పసర నుంచి తాడ్వాయి మధ్యలో ఉన్న జలగలంచ వాగు ఉద్ధృతి
- పసర నుంచి తాడ్వాయి మధ్య వాహనాల రాకపోకల నిషేధం
- జలగలంచ వాగు ఉద్ధృతితో ప్రజలను పునరావాస కేంద్రానికి తరలింపు
- హనుమకొండ జిల్లాలో అలుగుపారుతోన్న కటాక్షపూర్ చెరువు
వర్షాల ఎఫెక్ట్.. రైళ్లు రద్దు..
- భారీ వర్షాల వల్ల పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
- రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
- భారీ వర్షాల కారణంగా పలు రైళ్ల మళ్లింపు, రద్దు, పాక్షిక రద్దు
- భారీ వర్షం కారణంగా పట్టాలపై నుంచి ప్రవహిస్తున్న వరద
- వరద దృష్ట్యా రైళ్ల దారి మళ్లింపు సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం
- ఇవాళ నడవాల్సిన అకోల- అకోట, కాచిగూడ- నాగర్‌సోల్ రైళ్లు రద్దు
- ఇవాళ నడవాల్సిన కాచిగూడ - కరీంనగర్, హెచ్.ఎస్ నాందేడ్ - మేడ్చల్ రైళ్లు రద్దు
- హైదరాబాద్-కామారెడ్డి మధ్య నిలిచిన పలు రైళ్ల రాకపోకలు
- భిక్కనూరు-తలమడ్ల స్టేషన్ల మధ్య పట్టాలపై చేరిన వర్షపు నీరు
- అక్కన్నపేట్-మెదక్ స్టేషన్ల మధ్య పట్టాలపై చేరిన వర్షపు నీరు
- కరీంనగర్- కాచిగూడ, మెదక్- కాచిగూడ, బోధన్- కాచిగూడ రైళ్లు రద్దు
- కాచిగూడ-మెదక్, నిజామాబాద్- తిరుపతి, ఆదిలాబాద్- తిరుపతి రైళ్లు రద్దు
- రేపటి కాచిగూడ - నర్కేర్ సర్వీస్‌ను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
- గజ్వేల్ - లక్డారం రైలు పట్టాలపై భారీగా ప్రహిస్తున్న వరద నీరు
- ఇవాళ, రేపు మల్కాజిగిరి- సిద్దిపేట సర్వీసు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
- ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే
- కాచిగూడ స్టేషన్‌లో 9063318082 నంబర్ ఏర్పాటు
- సికింద్రాబాద్ స్టేషన్‌లో 040- 27786170 నంబర్ ఏర్పాటు
- నిజామాబాద్ స్టేషన్‌లో 970329671 నంబర్ ఏర్పాటు
- కామారెడ్డి స్టేషన్‌లో 9281035664 నంబర్ ఏర్పాటు
Bulletin No.6 Cancellation/Diversions/Partial Cancellations of Trains due to heavy rains @drmhyb @drmsecunderabad @drmned pic.twitter.com/EIVsmpA2lU
— South Central Railway (@SCRailwayIndia) August 27, 2025
వర్షాల రెడ్ అలర్ట్..
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు
- ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అప్రమత్తమైన అధికారులు
- ఆదిలాబాద్: ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షం
- ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం జిల్లాల్లో పాఠశాలలకు సెలవు
- కడెం ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు
- కడెం ప్రాజెక్ట్ నాలుగు గేట్లు ఎత్తి 20వేల క్యూసెక్కుల నీరు విడుదల
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. ఎకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లోని పలు గ్రామాలు నీటి మునిగాయి. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో గురువారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. మరోవైపు భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణ వర్సిటీ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా పడ్డాయి. శుక్రవారం యథాతథంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వీసీ యాదగిరిరావు పేర్కొన్నారు.
ఇక, కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా 43.1 సెం.మీ వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా అక్కాపూర్‌లో 32.3 సెం.మీ, మెదక్ జిల్లా సర్దానలో 30.2 సెం.మీ, కామారెడ్డి పట్టణంలో 28.9 సెం.మీ, కామారెడ్డి జిల్లా భిక్‌నూర్‌లో 27.9 సెం.మీ, నిర్మల్ జిల్లా వడ్యాల్‌లో 27.9 సెం.మీ, కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో 27.5 సెం.మీ, మెదక్‌జిల్లా నాగాపూర్ గ్రామంలో 26.6 సెం.మీ, కామారెడ్డి జిల్లా పాత రాజంపేటలో 24.6 సెం.మీ, లింగంపేటలో 22.5 సెం.మీ, దోమకొండలో 20.2 సెం.మీ, నిర్మల్ జిల్లా విశ్వనాథ్‌పేట్‌లో 24.1 సెం.మీ, ముజిగిలో 23.1 సెం.మీ, మెదక్ జిల్లా చేగుంటలో 20.2 సెం.మీల వర్షం పాతం నమోదైంది.