Telangana Rains
-
తెలంగాణకు అలర్ట్.. నేడు ఏడు జిల్లాలో గట్టి వానలు
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్ప పీడన ప్రభావంతో నేడు ఏడు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో బుధవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే, మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. Today's Forecast ⚠️⛈️Today will be another day of powerful thunderstorms in North, Central TG districts mainly during afternoon - midnight. Widespread storms aheadHyderabad will get a thunderstorm for 6th consecutive day again like yesterday during afternoon- night ⚠️ pic.twitter.com/c0bt720er9— Telangana Weatherman (@balaji25_t) September 25, 2024 ఇక, మంగళవారం అత్యధికంగా జనగామ జిల్లా దేవరుప్పులలో 11.5 సెం.మీ. వర్షం కురిసింది. నల్గొండ జిల్లా కామారెడ్డి గూడెంలో 10.9, తిమ్మాపూర్‌లో 9.9, శాలిగౌరారంలో 9.1, రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో 8.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో కూడా పలుచోట్లు మోస్తరు వర్షం కురిసింది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంది. Raining here at #Khajaguda Circle ⛈️#Hyderabadrains pic.twitter.com/ySDOSIj8f2— Hyderabad Rains (@Hyderabadrains) September 24, 2024ఇది కూడా చదవండి: యాదాద్రి రాజగోపురానికి బంగారు తాపడం -
చల్లటి కబురు: తెలంగాణకు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు అందించింది. ఈరోజు, రేపు తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఇక, ఇప్పటికే ఉత్తర తెలంగాణలో పలుచోట్ల వర్షం కురిసింది. కాగా, ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలో వాతావరణం కొంత చల్లబడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కొనసాగుతుండటం వల్ల రాగల 24 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రంలో మోస్తురు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ పేర్కొంది. మరోవైపు.. ఉత్తర తెలంగాణలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. కాగా, ఇప్పటికే ఆదిలాబాద్, కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, మెదక్‌లో ఈదురు గాలులతో వర్షం కురిసింది. కామారెడ్డిలో పిడుగుపాటు కారణంగా ఇద్దరు మృతిచెందినట్టు తెలుస్తోంది. Good Summer Rains ☔ in #Telangana . Thank God.@Rajani_Weather @balaji25_t pic.twitter.com/ED4qNYMsim — Mohd Abdul Sattar (@SattarFarooqui) March 16, 2024 #24HrWx North and adjoining West #Telangana districts most likely to see thunderstorms today. pic.twitter.com/BMGJt6h8uw — Weather@Hyderabad|TS|AP 🇮🇳 (@Rajani_Weather) March 16, 2024 Weather update!! #Telangana Now scattered thunderstorms rains going in North telangana Asifabad karimnagar bhupalpally Medak warangal will see heavy thunderstorms rains activity ⛈️ pic.twitter.com/Z9BLY4Isfy — Telangana state Weatherman (@tharun25_t) March 16, 2024 -
HYD: ఉధృతంగా మూసీ.. భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానతో రాజేంద్రనగర్ జంట జలాశయాలకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు ఎత్తివేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో.. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. ఒడ్డున ఉన్న కాలనీల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి వేయడంతో చాదర్ ఘాట్ మూసీ పరివాహక ప్రాంతాలలో ప్రజలను ఇళ్లు ఖాళీ చేసి వెళ్ళాలని అధికారులు ఆదేశించారు. అయితే తమకు పునరావాసం కేంద్రాలు ఏర్పాట్లు చేయకుండా.కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎక్కడికి వెల్లుతామని బాధితులు వాపోతున్నారు. #HyderabadRains కృష్ణానగర్ పూర్ణా టిఫిన్ గల్లీలో వరద భీభత్సం pic.twitter.com/ysY9c8D2nG — keshaboina sridhar (@keshaboinasri) September 5, 2023 ఇక.. ఇప్పటికే కురిసిన కుండపోత వానతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో నగరంలో ఏవైపు చూసినా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. బేగంపేట ప్రకాశ్ నగర్ దగ్గర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రగతి భవన్ ఎదురుగానూ భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. Water logging in several areas of #Hyderabad after hours of rains; these visuals from near #MoosapetMetro station; bike that was washed away in waters, got stuck in a manhole in #Borabanda & was retrieved #HyderabadRains @ndtv @ndtvindia pic.twitter.com/bgNdwV2aLe — Uma Sudhir (@umasudhir) September 5, 2023 పంజగుట్ట నుంచి బేగంపేట ఫ్లై ఓవర్ వైపు వాహనాలు నిలిచిపోయాయి. మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతంలోనూ భారీ సంఖ్యలో వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. మూసాపేట్ మెట్రో స్టేషన్ కింద భారీగా వరద నీరు నిలిచిపోవడంతో.. దాదాపు 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. శంషాబాద్‌లోనూ భారీగా ట్రాఫిక్ స్తంభించింది. భారీ వర్షంతో రోడ్లు నిండిపోయి.. నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. జీడిమెట్ల ఫస్ట్ ఎవెన్యూ కాలనీలో నీరు నిలిచింది. కూకట్‌పల్లిలో 14 సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదు అయ్యింది. కూకట్పల్లి దీన్‌దయాల్ నగర్లోకి వరద నీరు చేరింది. ఫతేనగర్ రోడ్లపైకి భారీగా నీరు వచ్చి చేరింది. నిజాంపేట ఈశ్వర విల్ల ఐదు అడుగుల మేర నీట మునిగింది. ఆల్వాల్ మచ్చబొల్లారంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. నార్సింగిలోని బాలాజీ నగర్ కాలనీ చెరువును తలపిస్తోంది. జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నా.. అధికార యంత్రాంగం స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Telangana: నేడు, రేపు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి. దీంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా బుధవారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గత 24 గంటల్లో కామారెడ్డి జిల్లా నాగరెడ్డిపేట్లో 7 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా పాపన్నపేటలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. మరోవైపు కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో 240 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, 41 మంది మృతి చెందారని హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే మరో 5 వేల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, దాదాపు 5,900 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పింది. హెలికాప్టర్ ద్వారా ఐదుగురిని రక్షించామని పేర్కొంది. వర్షాలు, వరదలు ఇంకా కొనసాగనున్న నేపథ్యంలో పూర్తి రక్షణ చర్యలు తీసుకున్నామని పేర్కొంది. -
Telangana: భారీ వర్షాలు, వరదల్లో 41 మంది మృతి..
సాక్షి, హైదరాబాద్: కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో 240 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, 41 మంది మృతి చెందారని హైకోర్టుకు ప్రభుత్వం సోమవారం నివేదిక సమర్పించింది. మరో 5 వేల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, దాదాపు 5,900 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పింది. హెలికాప్టర్ ద్వారా ఐదుగురిని రక్షించామని పేర్కొంది. వర్షాలు, వరదలు ఇంకా కొనసాగనున్న నేపథ్యంలో పూర్తి రక్షణ చర్యలు తీసుకున్నామని పేర్కొంది. జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈ మేరకు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. వరద నష్టాలపై ఇంకా సర్వే నడుస్తోందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. వరదలు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదంటూ డాక్టర్ చెరుకు సుధాకర్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్ ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. గత వారం ఇచ్చిన ఆదేశాల మేరకు నివేదిక సమర్పించామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరేందర్ తెలిపారు. అయితే, ఈ నివేదికపై పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం సమర్పించిన నివేదికను పరిశీలించాక తగిన ఆదేశాలు జారీ చేస్తామంటూ ధర్మాసనం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. చదవండి: HYD: గుడ్‌న్యూస్.. ఐటీ కారిడార్‌కు లేడీస్ స్పెషల్ బస్సులు -
ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గం భేటీ ముగిసింది. ఐదు గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలతో పాటు వరదల వల్ల జరిగిన జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ.. యుద్ధప్రాతిపదికన రోడ్లను పునరుద్ధిరించడానికి చేపట్టే అంశాలపై భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సభలో ప్రవేశపెట్టే పలు బిల్లుల గురించి కూడా కేబినెట్ చర్చించినట్లు సమాచారం. చదవండి: వరదల్లో బురద రాజకీయం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల వివాదం -
వరదల్లో బురద రాజకీయం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల వివాదం
తెలంగాణలో వర్షాలు, వరదలు తగ్గాయి. బురద రాజకీయాలకు తెరలేచింది. వరద బాధితులను ఆదుకునే బాధ్యత మీదంటే, మీదనే స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిందించుకుంటున్నాయి. వర్షం, వరదల నష్టంపై రాష్ట్రం సమాచారం ఇవ్వకపోయినా మానవతా దృక్పథంతో కేంద్ర బృందాలను పంపించి ఆదుకునే చర్యలు చేపట్టామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేయగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించి కేంద్రమంత్రి ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు. వర్షం వరదలు సృష్టించిన భీభత్సంపై రాజకీయ దుమారం నెలకొంది. వరదలు సృష్టించిన బీభత్సంతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. రాజకీయ పార్టీల నేతలు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి బురద రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం వరదల ధాటికి 31 మంది ప్రాణాలు కోల్పోగా నలుగురి ఆచూకీ లభించకలేదు. ఆపార నష్టం వాటిల్లింది. వరద నష్టాన్ని పరిశీలించి బాధితులకు భరోసా కల్పించే పనిలో ప్రభుత్వంతో పాటు రాజకీయ పార్టీల నేతలు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పార్టీ పరంగా సహాయం చేసే పనిలో నిమగ్నమయ్యారు. గ్రేటర్ వరంగల్, భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో కేంద్రమంత్రి బీజేపీ రాష్ట్ర అద్యక్షులు కిషన్ రెడ్డి పర్యటించి వర్షం వరదలు సృష్టించిన బీభత్సాన్ని పరిశీలించారు. పార్టీపరంగా నిత్యావసర సరకులు, దుప్పట్లు పంపిణీ చేసిన కిషన్ రెడ్డి వరద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద జాతీయ విపత్తు నిధులు రూ. 914 కోట్ల వరకు ఉన్నాయని, ప్రస్తుతం 2023-24 సంవత్సరానికి సంబంధించిన 197 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. యూసీ తీసుకువస్తే రాష్ట్రప్రభుత్వ అకౌంట్లో జమ చేస్తామన్నారు. వర్షం వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నివేదిక పంపకపోయినప్పటికి మానవతా దృక్పథంతో కేంద్ర ప్రభుత్వమే కేంద్ర బృందాలను పంపించిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతో వరద బాధితులకు ప్రతి కుటుంబానికి నాలుగు లక్షల చొప్పున ఇవ్వొచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల ఫసల్ బీమాను అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఇక నాలుగు నెలలు మాత్రమే ఉండే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పంటల పసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరద ప్రాంతాల్లో పర్యటించి అవగాహన లేకుండా అనవసర వ్యాఖ్యలు చేశారని మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రం పన్నుల రూపంలో చెల్లించే డబ్బులతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుందనే విషయాన్ని గమనించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ యాక్ట్ కింద కేంద్రం నిధులు ఇచ్చి ఖర్చు చేయకుండా అనేక నిబంధనలు పెడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచేలా మాట్లాడితే జాతీయ సమైక్యతకు ముప్పు వస్తుందని స్పష్టం చేశారు. దయచేసి రాజకీయాలు మాట్లాడకుండా ఏం చేద్దామో చెప్పండని కోరారు. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం సమంజసం కాదన్నారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో అందరికీ తెలుస్తుందని, నీళ్ళు, నిప్పును ఎవరు ఎదుర్కోలేరని తెలిపారు. వరద నష్టాన్ని అంచనా వేస్తున్నాం, వర్షం వరద నష్టంపై డిపిఆర్ తయారు చేస్తున్నామని స్పష్టం చేశారు. వరంగల్ మహానగరంలో రెండు రివర్ ఫ్రంట్ లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా కేంద్రంలో అధికారం ఉన్న బిజెపి రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ నేతలు మద్య విమర్శలు వరద బాధితులను ఆవేదనకు గురిచేస్తోంది. బురద రాజకీయాలు మానుకుని బాధితులను ఆదుకునే తక్షణం చర్యలు చేపట్టాలని జనం కోరుతున్నారు. -
మళ్లీ అలర్ట్.. నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి బలంగా గాలులు వీస్తున్నాయని వివరించింది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 0.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 35.31 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా... 55.91 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చదవండి: భద్రాచలం వద్ద తగ్గిన వరద ఉధృతి కాగా ఆదివారం సంగారెడ్డి జిల్లా జన్నారంలో 40.3 మిల్లీమీటర్లు, మేడ్చల్ 37.5, మెదక్ జిల్లా కాగజ్ మద్దూర్ 35, యాదాద్రి జిల్లా బీబీనగర్ 27.5, నిర్మల్ జిల్లా విశ్వనాథ్‌పూర్ 27, సంగారెడ్డి జిల్లా లక్ష్మిసాగర్ 26.8, మేడ్చల్ జిల్లా కేశవరం 26, ఆలియాబాద్ 25, బండ మాదారంలో 24.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. -
వందేళ్ల ముందుచూపు కావాలి..!
హైదరాబాద్ కొండాపూర్‌లోని మజీద్‌బండలో ఎనిమిదెకరాల కుడికుంట చెరువులోని చెత్తాచెదారాన్ని ‘సాహి’అనే ఎన్జీఓ సంస్థ ఇటీవల శుభ్రం చేసి ఇళ్ల నుంచి వచ్చే డ్రైనేజీ నీటిని మళ్లించి వందల ఏళ్ల నాటి ఈ చెరువుకు కొత్త వైభవం తీసుకొచి్చంది. అంతటితో ఆగకుండా ఇదే చెరువుతో పరిసరాల్లో వచ్చిన మార్పులపై ‘లాస్ట్ మైల్ ఫర్ వాటర్’అనే టైటిల్‌తో షార్ట్‌ఫిల్మ్ రూపొందించి యూఎన్ఓ బెస్ట్ సిటీస్‌పై నిర్వహించిన కాంపిటీషన్‌కు పంపితే అక్కడ బెస్ట్ కేటగిరీలో నిలబడింది. ప్రపంచం హైదరాబాద్ వైపు చూసేలా చేసింది. భూకంపాలు, రవాణా ఇబ్బందుల్లేని మహానగరాన్ని బహుళ జాతి సంస్థలు తమ వ్యాపార గమ్యస్థానంగా ఎంచుకుంటున్న సమయంలో, కొద్దిపాటి వర్షాలకే నగరం వరద ముంపు బారిన పడటం, ప్రజారవాణా ఇబ్బందులు, విద్యా సంస్థల మూత, ఐటీ కంపెనీలపై లాగౌట్ ఆంక్షలు.. హైదరాబాద్ సామర్థ్యంపై సరికొత్త సందేహాలను తెరపైకి తెస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు వరంగల్ నగరాలపై (అర్బన్ ఫ్లడ్స్) నిపుణులు ఇచి్చన నివేదికలపై తక్షణం కార్యాచరణ మొదలు పెట్టాలన్న డిమాండ్లను ముందుకు తెస్తున్నాయి. మూసీ, ఈసీ నదుల ఉగ్రరూపం 1908 సెపె్టంబర్ 28న హైదరాబాద్ మహానగరాన్ని గడగడలాడించి 15,000 మందిని బలి తీసుకుంది. మూసీలో 60 ఫీట్ల ఎత్తుతో ఎగిసిన వరద ఉధృతికి అఫ్జల్‌గంజ్, ముసల్లం, చాదర్‌ఘాట్ వంతెనలు నేలమట్టమయ్యాయి. 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ వరద ముప్పునకు శాశ్వత పరిష్కారం చూపాలనుకున్న ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ 1914లో సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డును ఏర్పాటు చేశారు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ నిపుణుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆధ్వర్యంలో వరద నివారణతో పాటు ఆధునిక నీటిపారుదల పథకాలకు రూపకల్పన చేయించారు. అందులో భాగంగానే ఎగువ భాగాన మూసీపై ఉస్మాన్‌సాగర్, ఈసీపై హిమాయత్‌సాగర్‌ల నిర్మాణంతో పాటు 24 గంటల్లో 24 సెంటీమీటర్ల వర్షం, వరదను తట్టుకునేలా విశ్వేశ్వరయ్య వందేళ్ల ముందుచూపుతో హైదరాబాద్‌ను పునరి్నరి్మంచారు. కానీ 1990 తర్వాత నగరంలో చెరువులు, నాలాల భారీ ఆక్రమణల ఫలితంగా 1994, 2000, 2009, 2016, 2020 సంవత్సరాలలో హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తాయి. ఓరుగల్లు ఉక్కిరి బిక్కిరి పది లక్షల జనాభా దాటిన వరంగల్ నగరాన్ని వరదలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక్కడ కూడా నాలాలు, చెరువుల ఆక్రమణలే సమస్యగా మారాయి. నగరంలో వరద నీటి కాలువలు లేకపోవటం వరంగల్‌కు ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ బొందివాగు నాలాతో హంటర్‌రోడ్డు సహా మరో పది కాలనీలు వర్షం నీరు వెళ్లే నాలాలు, కబ్జా ప్రదేశాలు, లోతట్టు ప్రాంతాల్లో కాలనీల నిర్మాణాలు నీట మునిగే పరిస్థితులు నెలకొన్నాయి. హనుమకొండ వడ్డెపల్లి, గోపాల్పూర్ చెరువులు నిండి పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. ఇక్కడ చేపట్టిన నాలా విస్తరణ పనులు నత్తకే నడకలు నేర్పుతుండటంతో ఏటా మునగటం కాలనీల వంతవుతోంది. ►మహానగరాన్ని వరద ముప్పు నుంచి తప్పించేందుకు కిర్లోస్కర్ కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాలి. జేఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణులు లక్ష్మణరావు నివేదికపై తక్షణ కార్యాచరణ చేపట్టాలి. ► చెరువులు›, కుంటలు, నాలాల నిర్వహణతో పాటు కబ్జాల నియంత్రణ కోసం ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలి. ► వరద నీటి నిల్వ, నియంత్రణలో ఉత్తమ ఫలితాలు కనబరిచే కమ్యూనిటీలను ఆస్తి పన్ను నుంచి మినహాయించాలి. ► ప్రస్తుతం కొనసాగుతున్న స్టెప్‌వెల్స్ (మెట్ల బావులు)కు మరమ్మతులు చేయాలి. బెంగళూరు తరహాలో భారీగా బావుల తవ్వకం చేపట్టాలి. ► మహానగరంలో చెల్లాచెదురైన æచెరువులను గొలుసుకట్టు పద్ధతిలో తక్షణం అనుసంధానం చేయాలి. నార్త్ ఈస్ట్ బేసిన్‌లోని నేరేడ్మెట్ ముక్కిడి చెరువు నుంచి మొదలయ్యే వరద దిగువన ఉన్న సఫిల్‌గూడ నదీం చెరువు, మల్కాజిగిరి బండచెరువుల నుంచి నాచారం పెద్ద చెరువు, ఉప్పల్ నల్లచెరువు మీదుగా సాఫీగా మూసీలోకి వెళ్లేలా చూడాలి. ►జీడిమెట్లలోని ఫాక్స్‌సాగర్ పూర్తిగా నిండిన తర్వాత అక్కడి నుంచి జీడిమెట్ల వెన్నెల చెరువు మీదుగా కూకట్పల్లి ఎల్లమ్మ చెరువు, మైసమ్మ చెరువు, పరికి చెరువుల మీదుగా బాలానగర్‌లోని అంబర్‌చెరువు, మూసాపేట కామునిచెరువు, కూకట్పల్లి రంగధామునికుంట, నల్లచెరువు వరకు వరద మూసీకి వెళ్లేలా ఆక్రమణలు తొలగించాలి. ► శేరిలింగంపల్లి ఖాజాగూడ పెద్దచెరువు నుంచి మొదలయ్యే వరద నీరు మణికొండ ఎల్లమ్మచెరువు, ఇబ్రహీంబాగ్ పెద్దచెరువు మీదుగా షేక్‌పేట శాతం చెరువు నుంచి గోల్కొండ సమీపంలోని లంగర్‌హౌస్ చెరువుకు చేరేలా చేయాలి. ఇక మియాపూర్ గురునాథ్ చెరువు నుంచి ప్రారంభమయ్యే గొలుసుకట్టు మదీనగూడ పటేల్ చెరువు, గంగారం పెద్దచెరువు, హఫీజ్‌పేట మేడికుంట, కాయిదమ్మకుంట, కొత్తకుంటల మీదుగా మదీనగూడ ఎర్రచెరువు, లింగంపల్లి గోపిచెరువు, చాకలివాని చెరువు, నల్లగండ్ల చెరువుల మీదుగా వరద వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. నాలుగేళ్ల క్రితమే నివేదిక హైదరాబాద్ మహానగరానికి ముంపు ముప్పు తప్పించేందుకు నాలుగేళ్ల క్రితమే జేఎన్యూటీ నుంచి నివేదిక ఇచ్చాం. కేవలం రూ.4,093 కోట్ల వ్యయంతో హైదరాబాద్‌ను వచ్చే వందేళ్ల వరకు సేఫ్‌గా ఉంచేలా నివేదికను ఇచ్చాం. ముఖ్యంగా క్లౌడ్ కంట్రోల్ చేస్తూనే వర్షం వల్ల వచ్చే వరదలను నివారించేందుకు మూడు మార్గాలు సూచించాం. అవి చేయకుండా ఆఫీసులు, విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. వరదల వల్ల ఏటా రూ.5 వేల కోట్లు వ్యయమయ్యే రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి, మరో రూ.5 వేల కోట్ల వరకు నగరవాసులు నష్టపోతున్నారు. వరదలకు శాశ్వత పరిష్కారం చూపకుండా తాత్కాలిక పద్ధతుల్లో వెళితే విశ్వనగరం దిశగా అడుగులేస్తున్న హైదరాబాద్ ఇమేజ్ మసకబారే ప్రమాదముంది. – డాక్టర్ కేఎం లక్ష్మణరావు, అర్బన్ ఫ్లడ్స్ నిపుణుడు, జేఎన్టీయూ ఇది నిజంగా దైన్యస్థితి హైదరాబాద్ అంటేనే గొలుసుకట్టు చెరువులు. 24 సెంటీ మీటర్ల వర్షం, వరదను తట్టుకునేలా డిజైన్ చేసిన వరద కాల్వలు మన నగరం సొంతం. కానీ రియల్ ఎస్టేట్ విస్తరణే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితమే నేడు హైదరాబాద్‌లో రెయినీ హాలిడేస్. వర్షం, వరద భయంతో ఐటీ, విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వటమనేది. ఇది నిజంగా దైన్యస్థితే. –లుబ్నా సర్వత్, సేవ్ అవర్ లేక్ సొసైటీ (సోల్) అందరం కలిస్తేనే బెటర్ హైదరాబాద్ హైదరాబాద్ ఈ రోజు చిరు జల్లులకే వణుకుతోందంటే..అందుకు అందరూ బాధ్యులే. చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలో అందరి బాధ్యత ఉన్నట్లు, వర్షం నీటి వృథా విషయంలోనూ ప్రతి ఇంటి బాధ్యత ఉంది. హైదరాబాద్‌లో ఈ పరిస్థితికి అందరూ బాధ్యులే. అందుకే అందరు కలిసి బెటర్ హైదరాబాద్ దిశగా ముందుకు సాగాలి. కుడికుంట చెరువు తర్వాత ఇప్పుడు శేరిలింగంపల్లి ప్రాంతంలో 30 చెరువుల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. – కల్పనా రమేశ్, సాహి ఎన్జీఓ -
భద్రాచలం వద్ద మహోగ్రం.. కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
రాష్ట్రవ్యాప్తంగా వానలు తెరిపించినా.. ఇప్పటికే చేరిన నీటితో ఉప నదు లు, వాగులు పరవళ్లు తొక్కుతుండటంతో గోదా వరి మహోగ్ర రూపం కొనసాగుతోంది. శనివారం రాత్రి 10గంటలకు భద్రాచలం వద్ద ప్రవాహం 16 లక్షల క్యూసెక్కులకు, నీటి మట్టం 56 అడుగులకు పెరిగింది. భారీగా వరద వస్తుండటంతో నీటి మ ట్టం మెల్లగా పెరుగుతూనే ఉంది. దీనితో అధికారు లు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నా రు. లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస శిబిరాల్లోనే ఉంచారు. మంత్రి పువ్వాడ అజయ్, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత తదితరులు సహాయక చర్యలను పరిశీలించి, బాధితులను పరామర్శించారు. శనివారం మధ్యా హ్నం 2 గంటల వరకు కూడా పునరావాస కేంద్రాల్లోని బాధితులకు భోజనం పెట్టకపోవడంతో వారంతా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఆర్డీఓ మాధవి దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు 3 గంటలకు భోజనం అందించారు. ఎగువ నుంచి తగ్గుతూ.. ఇక మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో వర్షాలు ఆగిపోవడంతో.. ఎగువన గోదావరిలో వరద తగ్గు తోంది. శ్రీరాంసాగర్‌లోకి ప్రవాహం 60వేల క్యూసెక్కులకు పడిపోవడంతో ప్రాజెక్టు గేట్లను మూసేశారు. ఎల్లంపల్లి వద్ద 2.95 లక్షలు, పార్వతి బ్యారేజీ వద్ద 3.01 లక్షలు, సరస్వతి బ్యారేజీ వద్ద 1.98 లక్షలు, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 10.80 లక్షల క్యూసెక్కులకు వరద తగ్గింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం నుంచి భద్రాచలం వద్ద గోదావరి శాంతించనుంది. భద్రాచలం నుంచి వెళ్తున్న భారీ వరద పోలవరం, ధవళేశ్వరం మీదుగా కడలిలోకి వెళ్లిపోతోంది. శ్రీశైలంలోకి 1.51 లక్షల క్యూసెక్కులు కృష్ణా ప్రధాన పాయ, తుంగభద్రలలోనూ వరద తగ్గుముఖం పట్టింది. ఎగువన కృష్ణాలో ఆల్మట్టిలోకి 1.30 లక్షల క్యూసెక్కులు, నారాయణ్‌పూర్‌లోకి 88,228 క్యూసెక్కుల వరద వస్తోంది. ఆ ప్రాజెక్టుల్లో కాస్త నీటిని నిల్వ చేస్తూ, మిగతా దిగువకు వదులుతున్నారు. జూరాలకు శనివారం ఉద యం నుంచి సాయంత్రందాకా 2.20 లక్షల క్యూసె క్కుల వరదరాగా.. సాయంత్రానికి 1,35,900 క్యూసెక్కులకు తగ్గింది. ఇక్కడ గేట్లు, విద్యుత్ సరఫరా ద్వారా కలిపి 1,48,875 క్యూసెక్కులను దిగు వకు విడుదల చేస్తున్నారు. దీనికి సుంకేశుల నుంచి 2,181 క్యూసెక్కులు కలిపి.. మొత్తం 1,51,056 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలంలోకి చేరుతోంది. శనివారం రాత్రి 9 గంటలకు ప్రాజెక్టులో నీటి నిల్వ 61.79 టీఎంసీలకు పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు. ప్రాజెక్టు నిండాలంటే మరో 157 టీఎంసీలు కావాలి. ఇక తెలంగాణలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో మూసీలో వరద తగ్గింది. పులిచింతల ప్రాజెక్టులోకి 11,949 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 30.78 టీఎంసీలకు చేరుకుంది. మరోవైపు తుంగభద్ర డ్యామ్‌లోకి 84,202 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి నిల్వ 69.23 టీఎంసీలకు పెరిగింది. -
తీరని కన్నీటి వ్యథ.. భద్రకాళి చెరువుకు గండి
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు మిగిల్చిన వ్యథ ఇప్పట్లో తీరే పరిస్థితి కనిపించడం లేదు. వరదల్లో తమవారిని కోల్పోయిన ఆవేదనలో కొందరు.. ఇళ్లు, సామగ్రి, పశువులు, పంటలు నష్టపోయిన ఆందోళనలో మరికొందరు.. ఎక్కడ చూసినా విషాదమే కనిపిస్తోంది. రోడ్లు, వంతెనలు దెబ్బతిని రాకపోకలు లేక, సరిగా సాయం అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూడు రోజులుగా విద్యుత్ సరఫరా లేక గ్రామాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. ముఖ్యంగా నీట మునిగిన వరంగల్ నగరంతోపాటు పూర్తిగా దెబ్బతిన్న మోరంచపల్లి, కొండాయి గ్రామాల్లో పరిస్థితి ఇంకా దారుణంగానే ఉంది. దీనికితోడు వరంగల్ నగరంలో శనివారం భద్రకాళి చెరువుకు గండిపడటం మరోసారి భయాందోళన రేపింది. అధికారులు సకాలంలో స్పందించి, దిగువన కాలనీలను ఖాళీ చేయించడంతో ప్రమాదం తప్పింది. భద్రకాళి చెరువుకు గండి ఇప్పటికే నీట మునిగి అతలాకుతలమైన వరంగల్‌లోని భద్రకాళి చెరువుకు శనివారం గండిపడింది. చెరువుకు ఒక్కసారిగా వరద పెరగడంతో.. పోతననగర్ వైపు కట్టకు కోతపడింది. దీంతో పోతననగర్, సరస్వతినగర్ కాలనీల జనం భయాందోళనకు గురయ్యా రు. విషయం తెలిసిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి.. ఈ రెండు కాలనీలతోపాటు కాపువాడ కాలనీ, రంగపేటల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గండిపడిన ప్రాంతంలో వెంటనే మరమ్మతులు చేపట్టారు. చెరువు గండిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్‌లు పరిశీలించారు. కాలనీల ప్రజలను ముందు జాగ్రత్తగా మాత్రమే తరలించామని.. చెరువు గండి కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. కాగా.. భద్రకాళి చెరువు శిఖం భూముల్లో ఆక్రమణలే ప్రస్తుత దుస్థితికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు. పాత రికార్డుల ప్రకారం భద్రకాళి చెరువు విస్తీర్ణం 621 ఎకరాలు అయి తే.. సుమారు41 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు చెప్తున్నారు. ఇంకా నీటిలోనే పలు కాలనీలు..: భారీ స్థాయిలో వరదలతో జలమయమైన వరంగల్ నగరంలో ఇంకా పలు కాలనీలు నీటిలోనే ఉన్నాయి. 33వ డివిజన్ సీఆర్‌నగర్, 34వ శివనగర్, 39వ డివిజన్ శాకరాసికుంట కాలనీ రోడ్లపై వరద నీరు పారుతూనే ఉంది. అక్కడి ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. ఖిలా వరంగల్ అగర్త చెరువుల మత్తడి నీరు మైసయ్యనగర్ మీదుగా శివనగర్‌లోని రహదారులపై పారుతోంది. ఇక మిగతా ప్రాంతాల్లోని కాలనీల్లో వరద తగ్గిపోవడంతో జనం ఇళ్లకు చేరుకుంటున్నారు. కానీ ఇళ్ల నిండా బురద ఉండటం, సామగ్రి అంతా తడిసిపోవడాన్ని చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్‌లో వరద నష్టం రూ. 414కోట్లు: వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో భారీ వర్షాలు, వరదలతో ఊహించని విధంగా ప్రాణ, ఆస్తినష్టం జరిగిందని.. బాధితులను అన్నివిధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.414 కోట్లు నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని మంత్రి తెలిపారు. వరంగల్, హన్మకొండ జిల్లా ల్లో 36 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని.. 38 రెస్క్యూ టీమ్‌ల ద్వారా 2,055 మందిని వివరించారు. 207 ఇళ్లు పూర్తిగా, 480 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించినట్టు తెలిపారు. బాధితులు ఆందోళన చెందవద్దని, త్వరలో పరిహారం అందజేస్తామని భరోసా ఇచ్చారు. -
తప్పించుకుందామనుకున్నారు.. తనువులు చాలించారు!
వరద ముంపు నుంచి తప్పించుకునేందుకు మరోచోటికి బయలుదేరారు. వారిలో భార్యాభర్తలు, తండ్రీ కొడుకులు, బంధువులు ఉన్నారు. మధ్యలో వాగు పొంగుతుండటంతో.. ఒకరి చేతులు పట్టుకుని మరొకరుగా 15 మంది నడుచుకుంటూ వెళ్తున్నారు. కానీ ప్రవాహం ధాటికి అంతా కొట్టుకుపోయారు. ఇందులో ఎనిమిది మంది మృతదేహాలు శుక్రవారం లభ్యమయ్యాయి. మిగతావారి ఆచూకీ కూడా ఇంకా దొరకలేదు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో జరిగిన విషాదం ఇది. కల్వర్టు ఉందనుకుని వెళ్తే.. భారీ వర్షాలతో గురువారం జంపన్నవాగు ఉప్పొంగి కొండాయి గ్రామాన్ని వరద చుట్టుముట్టింది. దీనితో 15 మంది పక్కనే ఉన్న మల్యాలలో తలదాచుకునేందుకు బయలుదేరారు. ఆ రహదారిలో ఉన్న వాగుపై ఇటీవలే పైపులు వేసి కల్వర్టు నిర్మించారు. వరద తాకిడికి పైపులు, కల్వర్టు కొట్టుకుపోయాయి. అక్కడ వరద నిండుగా ప్రవహిస్తోంది. కానీ కల్వర్టు ఉందన్న ఉద్దేశంతో ఈ 15 మంది ఒకరినొకరు చేతులు పట్టుకుని దాటడం మొదలుపెట్టారు. కొంతదూరం రాగానే వాగులో పడి కొట్టుకుపోయారు. వీరిలో శుక్రవారం కొండాయి గ్రామానికి చెందిన గిరిజన మహిళా దబ్బగట్ల సమ్మక్క(60), భార్యాభర్తలు ఎండీ రషీద్ (55), కరీమా(45), తండ్రీకొడుకులు ఎండీ షరీఫ్ (60), అజహర్ (25), భార్యాభర్తలు మజీద్‌ఖాన్ (65), లాల్‌బీ (60), మరో వ్యక్తి ఎస్కే మహబూబ్‌ఖాన్ (58) ఉన్నారు. వీరిలో సమ్మక్క మినహా మిగతా ఏడుగురు సమీప బంధువులే. గల్లంతైన మిగతా వారి కోసం బంధువులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. -
Telangana: 19 ప్రాణాలు.. 10 లక్షల ఎకరాలు.. వరదలతో అతలాకుతలం
భారీ వర్షాలు, వరదలు పలుచోట్ల తీవ్ర విషాదాన్ని నింపాయి. గత మూడు రోజుల్లో వాగులు, వరద నీటిలో పదుల సంఖ్యలో జనం గల్లంతుకాగా.. వారిలో కొందరి మృతదేహాలు గురు, శుక్రవారాల్లో బయటపడ్డాయి. దీనితో వారి కుటుంబాలన్నీ తీవ్ర విషాదంలో చిక్కుకున్నాయి. జిల్లాల నుంచి అందిన సమాచారం మేరకు శుక్రవారం రాత్రి వరకు 19 మంది మృతదేహాలను గుర్తించారు. గల్లంతైన వారి సంఖ్య ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉందని స్థానికులు చెప్తున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయిలో జంపన్నవాగు వరదలో గల్లంతైన 15మందిలో ఎనిమిది మంది మృతదేహాలు శుక్రవారం లభ్యమయ్యాయి. మిగతావారి కోసం గాలింపు కొనసాగుతోంది. భూపాలపల్లి జిల్లాలో హెలికాప్టర్ ద్వారా ఆహారం జార విడుస్తున్న ఐఏఎఫ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో గురువారం రాత్రి వరదలో గొర్రె ఓదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ దంపతులు, గడ్డ మహలక్ష్మి, గంగిడి సరోజన గల్లంతయ్యారు. వారి కోసం గ్రామస్తులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. శుక్రవారం రాత్రి వరకు కూడా వారి ఆచూకీ దొరకలేదు.సంగారెడ్డి జిల్లా కంది మండలం చిద్రుప్ప గ్రామ పెద్ద చెరువులో కృష్ణ అనే యువకుడు, మెదక్ జిల్లా హవేలీ ఘన్‌పూర్‌లో పడమంచి నర్సింహులు, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో రాములు చెరువులో చేపల వేటకు వెళ్లి మృతి చెందారు. ఖమ్మం రూరల్ మండలం జలగంనగర్‌కు చెందిన పెండ్ర సతీశ్ (23) గురువారం రాత్రి మున్నేటి వరదలో గల్లంతుకాగా. శుక్రవారం మృతదేహం లభ్యమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెంకు చెందిన ఎస్కే గాలీబ్ పాషా (33) ఈ నెల 26న భార్యతో గొడవ పడి బయటకు వెళ్లిపోయాడు. శుక్రవారం తిప్పనపల్లి వద్ద వాగులో ఆయన మృతదేహం లభించింది. భద్రాచలం వద్ద మహోగ్రంగా గోదావరి.. 53 అడుగులకు నీటిమట్టం బుధవారం భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం కుమ్మరిపాడులోని పాములేరు వాగులో కొట్టుకుపోయిన కుంజా సీత (60) మృతదేహం శుక్రవారం మామిళ్లగూడెం శివారులోని వాగులో బయటపడింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వివిధ చోట్ల వాగుల్లో గల్లంతైన నలుగురు మరణించారు. కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం తుంపెల్లి మొరంవాగులో రేకల కౌశిక్ (9), మోహన్ (40) కొట్టుకుపోయారు. ఆదిలాబాద్ జిల్లా సిరి కొండ మండలం వైపేట్కు చెందిన సంగం గంగాధర్ (45) స్థానిక వాగులో గల్లంతయ్యాడు. భూపాలపల్లి అర్బన్: మొత్తం 285 ఇళ్లు.. అందులో నాలుగు పూర్తిగా ధ్వంసమయ్యాయి.. మిగతావి పాక్షికంగా దెబ్బతిన్నాయి.. ఏ ఇంట్లో చూసినా పేరుకుపోయిన ఒండ్రుమట్టి.. చెల్లాచెదురుగా ఉన్న సామగ్రి.. బైక్‌లు, ఇతర వాహనాలు ఎక్కడున్నాయో తెలియదు.. తినటానికి తిండి లేదు.. తాగేందుకు నీరు లేదు.. కోళ్లు, పశువులు కొట్టుకుపోయాయి.. సర్వం కోల్పోయిన స్థితిలో జయశంకర్ జిల్లా మోరంచపల్లి గ్రామం బోరుమంటోంది. మరోవైపు గల్లంతైన నలుగురి ఆచూకీ దొరకక.. వారి కుటుంబాలు ఆవేదనలో కొట్టుమిట్టాడుతున్నాయి. గల్లంతైన గొర్రె ఓదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ దంపతులు, గడ్డ మహలక్షి్మ, గంగిడి సరోజనల ఆచూకీ కోసం గ్రామస్తులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. మంథనిలో పొలాలను ముంచిన గోదావరి ఏ ఆధారమూ లేని పరిస్థితిలో.. గురువారం తనను చుట్టేసిన మోరంచవాగు వరద ఉధృతికి మోరంచపల్లి గ్రామం సర్వం కోల్పోయింది. ఇళ్లలో సుమారు 3 నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు వరద నీరు చేరింది. ప్రతి ఇంట్లో బియ్యం, పప్పుల వంటి నిత్యావసరాల నుంచి టీవీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి ఎల్రక్టానిక్ పరికరాల దాకా వస్తువులన్నీ నీట మునిగిపోయాయి. కొన్ని వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. గ్రామంలో మొత్తం 285 ఇళ్లు ఉండగా 4 ఇళ్లు పూర్తిగా, 281 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒండ్రు మట్టి, ఇసుక మేట, చెత్తాచెదారంతో నిండిపోయాయి. శుక్రవారం వరద తగ్గాక గ్రామస్తులు ఇళ్లలో ఒండ్రుమట్టిని ఎత్తిపోస్తూ, తడిసిన వస్తువులను ఆరబెట్టుకుంటూ కనిపించారు. వరద తాకిడికి కొన్ని ఇళ్ల పునాదులు కూడా కదలడం, ఇంటి గోడలు, ప్రహరీలు కూలిపోవడం ఆందోళనకరంగా మారింది. అన్నీ కొట్టుకుపోయి.. మోరంచపల్లి గ్రామం పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. దాదాపు ప్రతి ఇంట్లో కుటుంబ పోషణ నిమిత్తం గేదెలు, కోళ్లు పెంచుకుంటున్నారు. వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు ఉన్నాయి. ట్రాక్టర్లు, కార్లు, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయి పొలాలు, చెట్లపోదల్లో చిక్కుకున్నాయి. కొన్నింటి ఆనవాళ్లు కూడా దొరకలేదు. మొత్తం 159 పశువులు, గేదెలు, 3 ఎద్దులు, 855 కోళ్లు, 3 బాతులు చనిపోయాయి. గ్రామ పరిసరాల్లో అక్కడక్కడా చనిపోయి ఉన్న గేదెలను అధికారులు శుక్రవారం జేసీబీల సహాయంతో గ్రామానికి దూరంగా తరలించి ఖననం చేశారు. వరద ముంపులో వరంగల్ గ్రామస్తులకు భరోసా.. తీవ్రంగా నష్టపోయిన మోరంచపల్లి గ్రామాన్ని మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, అధికారులు పరిశీలించారు. బాధితులతో మాట్లాడి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇక జీఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సోదరుడు గండ్ర భూపాల్‌రెడ్డి రూ.10 లక్షలను గ్రామ ప్రజలకు ఆర్థిక సాయంగా అందించారు. గల్లంతై.. కరెంటు తీగలపై వేలాడి.. మేడారం జంపన్నవాగులో గల్లంతైన యాచకుడి మృతదేహం శుక్రవారం వరద తగ్గిన తర్వాత ఇలా కరెంట్ తీగలకు చిక్కుకొని కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని కరెంట్ తీగలపై నుంచి తొలగించి పంచనామా నిర్వహించారు. -
జీహెచ్ఎంసీ ఆఫీసులోకి కాంగ్రెస్ నేతలు.. లోపల కూర్చుని నిరసన
Updates.. ► జీహెచ్ఎంసీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఆఫీసు లోపల బైఠాయించి నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వినతి పత్రం ఇస్తే జీహెచ్ఎంసీ కమిషనర్ అమర్యాదగా ప్రవర్తించారంటూ నిరసనలు తెలిపారు. ► జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆఫీసు వద్దకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ► జీహెచ్ఎంసీ ఆఫీసు ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. ► దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు, పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ► ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. వరదల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పూర్తిగా విఫలమైంది. మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. జీహెచ్ఎంసీ గేట్లు ఎక్కే ప్రయత్నం చేశారు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. పలుచోట్ల రికార్ఢు స్థాయిలో వర్షం కురువడంతో జనజీవనం అస్తవ్యస్థమైంది. ఇటు, భారీ వరదల కారణంగా చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో పలువురు గల్లంతు కాగా, కొంతమంది మృత్యువాతపడ్డారు. మరోవైపు.. హైదరాబాద్‌లో కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో వర్షాలపై అప్రమత్తం కానందుకు అధికార బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు(శుక్రవారం) జీహెచ్ఎంసీ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. వరద బాధితులకు రూ.10వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో, తెలంగాణ పోలీసులు శుక్రవారం ఉదయం నుంచే జీహెచ్ఎంసీ ఎదుట భారీగా మోహరించారు. జీహెచ్ఎంసీకి ఉన్న మూడు గేట్ల దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇది కూడా చదవండి: గోదావరి ఉగ్రరూపం.. అధికారులు అలర్ట్ -
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం.. ఆరుగురి మృతి
సాక్షి, వరంగల్: తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి సైతం వరదనీరు పోటెత్తడంతో నదులు, వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు, కాలనీలు, ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరిపోవడంతో ప్రజలు దిక్కుతోచని అయోమయ పరిస్థితులలో జీవిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరదల ప్రభావం మరీ దారుణంగా ఉంది. వర్షం, వరదలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరుగురు మృతి చెందగా.. 12 మంది గల్లంతయ్యారు. భూపాలపల్లి జిల్లాలో మోరంచ వాగులో సంజీవ్ అనే వ్యక్తి వరదలో కొట్టుకుపోయి మృతి చెందగా.. మరో నలుగురు గల్లంతయ్యారు. ములుగు జిల్లా మారేడుగొండ చెరువు కట్ట తెగి ఇల్లు కొట్టుకుపోయింది. ఈ క్రమంలో ఇంట్లో నివాసముండే సారయ్యతో పాటు ముగ్గురు గల్లంతయ్యారు. సారయ్య మృతదేహం లభ్యం. సారమ్మ, రాజమ్మ కోసం గాలిస్తున్నారు. చదవండి: Telangana Rains: మరో 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఏటూరు నాగారం మండలం కొండాయి వద్ద జంపన్న వాగులో ఆరుగురు గల్లంతయ్యారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి వద్ద అన్నదమ్ములు శ్రీనివాస్, యాకయ్య కొట్టుకుపోయి మృతిచెందారు. హనుమకొండలో ప్రేమ్ సాగర్ అనే వ్యక్తి కరెంట్ షాక్‌తో మృతిచెందారు. వేలేరు మండలం కన్నారం వద్ద వరద దాటుతూ బైకిస్టు మహేందర్ బైక్‌తో సహా కొట్టుకుపోయి మృతి చెందారు. కాగా చిట్యాల మండలం నైన్ పాక వద్ద వరదల్లో చిక్కుకున్న కాంట్రాక్టు వర్క్ చేసే ఆరుగురిని ఆర్మీ హెలికాప్టర్ కాపాడింది. కాటారం మండలం గంగారం వద్ద మానేరు వాగులో చిక్కుకున్న 4 గురు రైతులను డ్రోన్ కెమెరాతో సెర్చ్ చేసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడింది. చదవండి: తెలంగాణ చరిత్రలోనే రికార్డు వర్షపాతం.. నీట మునిగిన మేడారం -
Telangana Rains: మరో 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాలు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతకొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలతో రాష్ట్రమంతా తడిసి ముద్దవుతోంది. ఇప్పటికే పలు జిల్లాలు జల దిగ్భంధంలోకి వెళ్లిపోయాయి. వరదలతో ముప్పు తిప్పలు పడుతున్న రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ శాఖ తాజాగా మరో హెచ్చరిక చేసింది. నిన్నటి తీవ్ర అల్ప పీడనం నేడు అల్పపీడనంగా బలహీనపడినట్లు తెలిపింది. ప్రస్తుతం దక్షిణ ఒడిశా, పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ వద్ద అల్పపీడనం కొనసాగుతోందని పేర్కొంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణలో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, అసాధారణమైన వర్షపాతం 24 సెంటీమీటర్లకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీంతో రాష్ట్రలోని 8 జిల్లాలకు ఆరెంజ్, 14 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు, గంటకు 40 నుండి 50కిమీ వేగంతో వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. చదవండి: వరద బీభత్సం.. తెగిపోయిన వరంగల్-హన్మకొండ కనెక్టివిటీ భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆదిలాబాద్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. సోమవారం తెరుచుకోనున్న విద్యాసంస్థలు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. శనివారం మొహర్రం సెలవు కావడంతో ప్రభుత్వ విద్యాసంస్థలు అన్నీ ఇక సోమవారం తెరుచుకోనున్నాయి. చదవండి: తెలంగాణ చరిత్రలోనే రికార్డు వర్షపాతం.. నీట మునిగిన మేడారం -
తెలంగాణ చరిత్రలోనే రికార్డు వర్షపాతం.. నీట మునిగిన మేడారం
సాక్షి, వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా వర్ష బీభత్సం హడలెత్తిస్తోంది. అన్ని జిల్లాలలోని మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలపై పై వరుణుడు పగబట్టాడు. వర్షాలు, వరదల ధాటికి మ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు గల్లంతయ్యారు. వారికోసం గాలింపు చర్యలు ముమ్మరం కొనసాగుతున్నాయి. తెలంగాణ చరిత్రలోనే అత్యంత రికార్డు వర్షపాతం ములుగు జిల్లాలో నమోదైంది. గడిచిన 24 గంటల్లో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో 649.8 మిల్లీ మీటర్లు..అంటే 64 సెంటీ మీటర్ల వర్ష పాతం నమోదవడం గమనార్హం. లక్ష్మీదేవ్ పేట్ వద్ద 533.5 మిల్లీ మీటర్లు అంటే 53 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డయింది. గత 24 గంటల్లో ములుగు జిల్లాలోని 35 ప్రాంతాల్లో 20 సెంటీ మీటర్ల పైన వర్షం పడింది. చదవండి: పెద్దపల్లిలో నిలిచిన గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్.. తెగిపోయిన వరంగల్-హన్మకొండ కనెక్టివిటీ మునిగిన మేడారం.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తాడ్వాయి మండలంలోని మేడారం నీటమునిగింది. జంపన్న వాగు రెండు వంతెనల పై నుంచి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మేడారం పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. మేడారం జాతర ప్రాంగణంలోని సమ్మక్క, సారలమ్మ గద్దెలను జంపన్న వాగు తాకింది. 2 అడుగుల లోతు వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో సాయం కోసం గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు. ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మేడారం దగ్గర్లోని పడిగాపురం గ్రామాన్ని జంపన్న వాగు చుట్టుముట్టింది, దీంతో పడిగాపురం గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. #Telangana #Medaram 27-07-2023 pic.twitter.com/yPl9LzySXP — S Ramesh (@RameshTSIND) July 27, 2023 జలదిగ్భంధంలో గ్రామాలు ములుగు జిల్లా మంగపేట మండల వ్యాప్తంగా జులై 27వ తేదీ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రమణక్కపేట గ్రామంలో పలు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద చేరింది. దీంతో వరదలో చిక్కుకున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అటు జీవంతరావు పల్లి, పాలసావు పల్లి గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. గత మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజన్సీ గ్రామాలు చిగురుటాకుల వణికిపోతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండి మత్తడి పోతున్నాయి. దీంతో వరంగల్ నుంచి ఏటూరునాగారం 163 ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి గుండ్ల వాగు పొంగి పస్రా తాడ్వాయి మధ్య జాతీయ రహదారిపై గండి పడింది. దీంతో వరంగల్ వైపుకు వెళ్లే పరిస్థితి లేదు. ఏ క్షణమైనా రోడ్డు పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉంది. ఏటూరు నాగారం మండలంలోని జీడి వాగు పొంగి పార్లడంతో ఏటూరు నాగారం, బుర్గం పాడు జాతీయ రహదారి పై రాకపోకలు నిలిచిపోయాయి. మంగపేట మండలంలో వాగులు,వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువలు మత్తడి పోస్తున్నాయి. మంగపేట మండలంలో పంటపొలాలు నీట మునిగాయి. శనిగాకుంట వద్ద వాగు పొంగి పొర్లడం తో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు మండలంలో బొగత జలపాతం ఉదృతంగా ప్రవహిస్తుండటంతో అటవీశాఖ అధికారులు సందర్శన నిలిపివేపారు. #TelanganaRains Heartbreaking video of situation at #Medaram. Medaram hosts the sacred Sammakka &Saralamma Jatara. At least 1.5 crore ppl attend this annual fest -the BIGGEST tribal festival in the country! Today it is stranded in flood water. Video shared by temple priest pic.twitter.com/gju1f7rOkI — Revathi (@revathitweets) July 27, 2023 -
మున్నేరు వరదల్లో చిక్కుకున్న ఏడుగురు సురక్షితం
Updates.. ►భద్రాచలం వద్ద తగ్గుముఖం పడుతున్న గోదావరి. ► గురువారం రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్ద కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక ►ప్రస్తుతం 48 అడుగుల మేర ప్రవహిస్తున్న గోదావరి. ►దిగువకు 11లక్షల 50వేల క్యుసెక్కుల వరద నీరు గోదావరిలోకి విడుదల. ►ఏ సమయంలోనైన గోదావరి మళ్ళీ పెరిగే అవకాశం ఉందంటున్న అధికారులు. ప్రమాదకరంగా మున్నేరు నది ఖమ్మం నగరంలో మున్నేరు నది 30 అడుగుల ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇల్లోకి వరదనీరు చేరింది. మున్నేరు వద్దకు సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. NDRFతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పద్మావతి నగర్ వరద లో చిక్కుకున్న ఏడుగురు కుటుంబ సభ్యులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. మీడియాతో మంత్రి పువ్వాడ ధ్యాన మందిరంలో చిక్కుకున్న ఏడుగురు కుటుంబ సభ్యులు కాపాడినట్లు మంత్రి అజయ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతోనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఇక్కడికి పిలిపించామని.. వరదల్లో చిక్కుకున్న ఏ ఒక్కరి ప్రాణం పోకూడదనే ముఖ్యమంత్రి లక్ష్యమని పేర్కొన్నారు. ఖమ్మం మున్నేరు వరద ఉధృతితో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేపించి పునరావస కేంద్రలను ఏర్పాటు చేశామని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని.. ఇంకా అనేక ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్నారని ఫోన్లు వస్తున్నాయన్నారు. వరదల్లో చిక్కుకున్న అందరిని కాపాడే బాధ్యత తమదేన్నారు. పెద్దపల్లి జిల్లా. ►పార్వతి బ్యారేజ్‌లోకి కొనసాగుతున్న భారీ వరద నీరు. ►మొత్తం 74 గేట్లు కాగా అందులో 70 గేట్లు ఎత్తిన అధికారులు. ►ఇన్ ఫ్లో 5,90,256 క్యూసెక్కుల ►ఔట్ ప్లో 5,90,256 క్యూసెక్కుల ►బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 8.83 టీఎంసీలు. ►ప్రస్తుత నీటి సామర్థ్యం : నిల్ రాజన్న సిరిసిల్ల జిల్లా ►గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరులోకి వరద నీరు ►ఇన్ ఫ్లో 29781 క్యూసెక్కులు. ►ఔట్ ప్లో 29781 క్యూసెక్కులు. ►ప్రాజెక్ట్ సామర్థ్యం 2.20 టీఎంసీలు. ►ప్రస్తుత నీటి సామర్థ్యం 2.20 టీఎంసీలు. తెలంగాణలో అసాధారణ వర్షపాతం ►తెలంగాణలో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, అసాధారణమైన వర్షపాతం 24 సెంటీమీటర్లకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆదిలాబాద్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. మోరంచపల్లి గ్రామస్తులు సేఫ్ ►వరదల్లో చిక్కుకున్న మోరంచపల్లి గ్రామాస్థులు సురక్షితంగా బయటపడ్డారు. హెలికాఫ్టర్లు, బోట్ల ద్వారా గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్రామంలోని ప్రజలందరినీ సేఫ్‌జోన్‌కు చేర్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా మోరంచపల్లి గ్రామస్తులు అంతా సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ►భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అప్రతమతంగా ఉందని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. కడెం ప్రాజెక్టులో రెండు గేట్లు మొరాయించాయని, వాటికి వెంటనే మరమ్మతులు చేసి పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. డ్యామ్ ఎత్తు 700 అడుగులు అయితే.. 702 అడుగుల మేర నీటి ప్రవాహం ఉందని తెలిపారు. నీట మునిగిన వరంగల్ ►భారీ వర్షాలతో నీట మునిగిన వరంగల్ రైల్వే స్టేషన్ ► పూర్తిగా తెగిపోయిన వరంగల్-హన్మకొండ కనెక్టివిటీ ►శివనగర్ బస్తీల్లో పారుతున్న వరద నీరు ► వరంగల్‌లో పూర్తిగా నీట మునిగిన హంటర్ రోడ్డు, నయూం నగర్, శివనగర్ ► బిల్డింగ్‌లపై తలదాచుకున్న వరద బాధితులు ►హంటర్ రోడ్డుకు చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది ►సాయం చేయాలని బాధితుల ఆర్తనాదాలు ►వరద నీటిలో కొట్టుకుపోయిన వాహనాలు పట్టాలపై వరద.. పెద్దపల్లిలో నిలిచిన గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ►పెద్దపల్లి రైల్వే స్టేషన్లో మూడు గంటలకుపైగా గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. పట్టాలపై భారీగా వరదనీరు చేరడంతో సికింద్రాబాద్‌కు రావాల్సిన రైలును పెద్దపల్లిలో అధికారులు నిలిపేశారు. కాజీపేట వడ్డేపల్లి చెరువు ఉప్పొంగి ప్రవహించడంతో పెద్దపల్లి రైల్వే స్టేషన్లో గోరఖ్ పూర్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపవేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రయాణికులు వాహనాల్లో తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఖమ్మం జిల్లా ► భారీ వర్షాల నేపథ్యంలో మున్నేరు వరదల్లో ఏడుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. నగరంలోని పద్మావతి నగర్లో శ్రీరామ చంద్ర మిషన్ హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన మందిరంలో చిక్కుకున్న ఏడుగురుని కాపాడేందుకు రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. అయితే వరద ఉదృతితో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. సహాయక చర్యలను మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి, అదనపు కలెక్టర్ ప్రియాంక పర్యవేక్షిస్తున్నారు. ►మున్నేరు వరదలో చిక్కుకున్న ఏడుగురి కోసం రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు ఫోన్ చేశారు. మున్నేరు వరద ఉధృతి , సహాయ చర్యల పై మంత్రిని అడిగి తెలుసుకున్నారు. ఏడుగురిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని హుటాహుటిన ఖమ్మం తరలించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ►సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి పువ్వాడ భద్రాచలం నుంచి ఖమ్మం బయలుదేరారు. విశాఖ నుంచి భద్రాచలం వస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని మార్గమధ్యంలో ఖమ్మం మళ్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రత్యేక డ్రోన్ పంపించి ఇంట్లో చిక్కుకున్న ఏడుగురి పరిస్థితిని ఖమ్మం అధికారులు ఆరాతీస్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మున్నేరు వాగుప్రమాద స్థాయిలో పొంగి ప్రవహిస్తోంది. .ఖమ్మం కాల్వ ఒడ్డు వద్ద గరిష్టంగా 28 అడుగులు ప్రవహిస్తున్న మున్నేరు వరద ఉధృతిని రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ పరిశీలించారు. వరద ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటన ►రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో హైదరాబాద్ తాజా పరిస్థితిపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నుంచి పురపాలకశాఖ అధికారులు, అడిషనల్ కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అదే విధంగా హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. హుస్సేన్ సాగర్ వద్ద వరద ఉధృతిని మంత్రి పరిశీలించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రాథమిక ప్రాధాన్యతగా పని చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ సమీక్ష.. ► తెలంగాణలో ఎడతెరిపిలేని భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. ఎప్పటికప్పుడు తెలంగాణలో పరిస్థితిని కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో సహాయక చర్యల కోసం హెలికాప్టర్‌ను తరలించాలని కేసీఆర్ ఆదేశించారు. వరద బాధిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియామించాలని ఆదేశాలు జారీ చేశారు. ► తెలంగాణ చరిత్రలోనే భారీ వర్షం కురిసింది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో 649.8మిమీ వర్షం కురిసింది. అంతకుముందు.. ములుగు జిల్లా వాజేడులో 2013లో జూలై 19న 24 గంటల్లో 517.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు. ► ఇక, గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లపైన వర్షపాతం నమోదైంది. 200 కేంద్రాల్లో 10 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసింది. ► హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరో 24 గంటలు వర్షం ముప్పు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ► ఇక, భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంపీ హై అలర్ట్. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. ► కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 11 సెం.మీల వర్షపాతం నమోదైంది. ► బంగాళాఖాతంలో వాయుగుండం బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 48 గంటలు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ► తెలంగాణలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఇక, హైదరాబాద్‌లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ► భద్రాచలం వద్ద 51 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకుంది. దీంతో, రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. MLA Rekha Naik & other officials run away from #Kadem project after they realize that it is dangerous today morning. While project capacity is 700 ft, it is filled to 699.5 ft. Officials tried to open all 18 gates but 4 didn’t work! #NirmalDist #TelanganaRains #StaySafe pic.twitter.com/27AQxZJ6FH — Revathi (@revathitweets) July 27, 2023 ► హైదరాబాద్‌లో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ప్రధాన జంక్షన్లలో రోడ్లు జలమయమయ్యాయి. మరో మూడు గంటలపాటు నగరంలో వర్షం కురిసే అవకాశం ఉంది. అత్యవసరమైతే బయటకు రావాలని అధికారులు సూచించారు. జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ నెంబర్: 040-2111 1111, ఆర్డీఎఫ్ నెంబర్: 90001 13667. #Kadem Project@balaji25_t pic.twitter.com/hfvoSl8uGc — Shravan Pintoo (@ShravanPintoo) July 27, 2023 #Telangana A woman was washed away while crossing a water stream in Kothagudem. And the BRS govt has the audacity to implement this Telangana model across the country... And also KCR wanted to become the PM. pic.twitter.com/Uj3k2KSGJu — Gems Of KCR (@GemsOfKCR) July 27, 2023 ► భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. భద్రాచలం నుంచి దిగువకు 12.65 లక్షల క్యూసెక్కుల వరద వదులుతున్నారు. భద్రాద్రి రామాలయం చుట్టూ వరద నీరు చేరింది. నీటమునిగిన అన్నదాన సత్రం, విస్తా కాంప్లెక్స్. చర్లలోని లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలింపు. భద్రాచలం పట్టణంలోని 3 కాలనీల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలింపు. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ఏజెన్సీ ప్రాంత ప్రజలు. అత్యవసరమైతే ఫొటోలు, లోకేషన్లు పంపాలని జిల్లా ఎస్పీ సూచన. పోలీసు రెస్య్కూ కంట్రోల్ వాట్సాప్ నెంబర్ 87126 82128. In total 80 tourists who were stuck at #Muthyaladara waterfalls, #Mulugu, #Telangana were rescued by the DDRF & NDRF teams deployed. All are safe & sound. One minor boy was bitten by a scorpion, he was shifted to hospital for treatment. #Rains https://t.co/0ey898lYpK pic.twitter.com/RmhWS4v4UE — Sowmith Yakkati (@sowmith7) July 27, 2023 Due to heavy rains across Telangana State, citizens are advised to come out only for extremely important work at night times. Present situation is currently under control. #TelanganaPolice, from home guard officers to the DG level, are well-prepared, and every hour from each PS… pic.twitter.com/CWcLiypmB7 — DGP TELANGANA POLICE (@TelanganaDGP) July 26, 2023 ► మూసీ ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మూసీ ఇన్‌ఫ్లో 19వేలు, ఔట్‌ఫ్లో 17వేలు క్యూసెక్కులు. Water falling from 700 feet at #Mutyamdhara #waterfalls in Veerabhadravaram located in #Mulugu district’s #Vebkatapuram mandal.@telanganatouris @tstdcofficial @VSrinivasGoud @newstapTweets pic.twitter.com/TsGrw0mvbF — Saye Sekhar Angara (@sayesekhar) July 26, 2023 ► నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ డేంజర్ జోన్లో ఉంది. సామర్ధ్యానికి మించి వరద ప్రవహిస్తోంది. కడెం ప్రాజెక్ట్ సామర్థ్యం 3.50లక్షల క్యూసెక్కులే. కాగా, 6.04 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. కడెం ప్రాజెక్ట్ గేట్లపై నుంచి వరద ప్రవహిస్తోంది. 14 గేట్ల ద్వారా దిగువకు 2.18 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. రంగంలోకి దిగిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నిర్మల్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. Despite heavy #rains, a funeral procession had no option but to risk crossing a seasonal stream to perform the final rites of an elderly person. The incident happened couple of days ago in Cherial of #Siddipet district, #Telangana. pic.twitter.com/rD1utRTTvT — Krishnamurthy (@krishna0302) July 26, 2023 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. కుండపోత కారణంగా మోరంచ వాగు ప్రవాహం ప్రమాదకర స్థాయి దాటి మోరంచపల్లి గ్రామాన్ని ముంచెత్తింది. దీంతో కొందరు గ్రామస్తులు వర్షంలోనే బిల్డింగ్‌లపైకి ఎక్కి రక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని గ్రామస్తులు వణికిపోతున్నారు. ► వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. చాలామంది సెల్ఫోన్లు కూడా పని చేయడం లేదని.. దీంతో అధికారుల సాయం కోరేందుకు కూడా వీలుకావడం లేదని వాపోతున్నారు. మోరంచపల్లి గ్రామంలో 300 మంది.. వెయ్యి జనాభా దాకా ఉంది. వానాకాలం వచ్చినప్పుడల్లా మోరంచవాగు ప్రవాహంతో గ్రామం చుట్టూ నీరు చేరుతుంటుంది. అయితే ఈ దఫా గ్రామాన్ని వాగు పూర్తిగా ముంచెత్తడం గమనార్హం. సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా వర్షాలు భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు, వాతావరణ శాఖ రెండు రోజులపాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని.. దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. వర్షాలకు తోడు పలుచోట్ల గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రకటించింది.