సాక్షి, హైదరాబాద్: వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు అందించింది. ఈరోజు, రేపు తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఇక, ఇప్పటికే ఉత్తర తెలంగాణలో పలుచోట్ల వర్షం కురిసింది.
కాగా, ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలో వాతావరణం కొంత చల్లబడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కొనసాగుతుండటం వల్ల రాగల 24 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రంలో మోస్తురు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ పేర్కొంది. మరోవైపు.. ఉత్తర తెలంగాణలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. కాగా, ఇప్పటికే ఆదిలాబాద్, కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, మెదక్‌లో ఈదురు గాలులతో వర్షం కురిసింది. కామారెడ్డిలో పిడుగుపాటు కారణంగా ఇద్దరు మృతిచెందినట్టు తెలుస్తోంది.
Good Summer Rains ☔ in #Telangana . Thank God.@Rajani_Weather @balaji25_t pic.twitter.com/ED4qNYMsim
— Mohd Abdul Sattar (@SattarFarooqui) March 16, 2024
#24HrWx
— Weather@Hyderabad|TS|AP 🇮🇳 (@Rajani_Weather) March 16, 2024
North and adjoining West #Telangana districts most likely to see thunderstorms today. pic.twitter.com/BMGJt6h8uw
Weather update!! #Telangana
— Telangana state Weatherman (@tharun25_t) March 16, 2024
Now scattered thunderstorms rains going in North telangana
Asifabad karimnagar bhupalpally
Medak warangal will see heavy thunderstorms rains activity ⛈️ pic.twitter.com/Z9BLY4Isfy
Comments
Please login to add a commentAdd a comment