సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా వాతావరణం చల్లబడింది. ప్రజలు వేసవి ఎండ నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు.. అకాల వర్షాల కారణంగా పంట నష్టంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మరో కీలక ప్రకటన చేసింది.
తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదే సమయంలో ఎన్నికలు జరిగే మే 13వ తేదీన కూడా ఏపీ, తెలంగాణలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ పేర్కొంది.
7-day forecast(Morning) of Telangana state based on 0000 UTC issued at 1000 Hrs IST Dated : 09/05/2024@CEO_Telangana @TelanganaCMO @SpokespersonECI @ECISVEEP @TelanganaCS @DCsofIndia @IASassociation @TelanganaDGP @CommissionrGHMC @HYDTP @IasTelangana @tg_weather #ECISVEEP pic.twitter.com/8L03NcJSOq
— IMD_Metcentrehyd (@metcentrehyd) May 9, 2024
ఇదే సమయంలో రాబోయే 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల నుంచి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక, మంగళవారం ద్రోణి ప్రభావంతో భారీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. కాగా, వచ్చే నాలుగు రోజులు వాతావరణం చల్లగా ఉండి, అక్కడక్కడ మోస్తరు వర్షం పడే అవకాశం ఉందన్నారు.
REALISED WEATHER OVER TELANGANA DATED:08.05.2024@CEO_Telangana @TelanganaCMO @SpokespersonECI @ECISVEEP @TelanganaCS @DCsofIndia @IASassociation @TelanganaDGP @CommissionrGHMC @HYDTP @IasTelangana @tg_weather #ECISVEEP pic.twitter.com/PrzDH17gFu
— IMD_Metcentrehyd (@metcentrehyd) May 9, 2024
Comments
Please login to add a commentAdd a comment