Heavy Rain In Telangana Updates..
👉తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీగా వానలు పడుతున్నాయి. వర్షాల కారణంగా నదులు, చెరువులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. రహదారులపై నీరు చేరడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.
👉బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆది, సోమవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు 14 జిల్లాలకు రెడ్ అలర్ట్, పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
NEXT 24-48Hrs FORECAST!🚨
RED ALERT...!! for EAST, CENTRAL &SOUTH #TELANGANA 🌧️🚨⚠️⚠️#Hyderabad on Red Alert!! For the next 48Hrs, Let's Hope for the Best.
STAY ALERT!! pic.twitter.com/85ZKbRd3Z8— Hyderabad Rains (@Hyderabadrains) August 31, 2024
👉నల్లగొండ జిల్లాలోని వేములపల్లి మండలం బుగ్గవాయిగూడెం వద్దం నార్కెట్‌పల్లి- అద్దంకి హైవే పైకి నీరు చేరుకుంది. దీంతో, వాహనాల రాకపోకలకు స్వల్ప ఇబ్బందులు ఎదరవుతున్నాయి.
👉ఖమ్మం జిల్లాలో మున్నేరు నది ఉగ్రరూపం దాల్చింది. 15 అడుగులు దాటి మున్నేరు నది ప్రవహిస్తోంది. దీంతో, భయాందోళనలో మున్నేరు నది ప్రాంతం ప్రజలు. మరోవైపు.. నగరంలోని చెరువు బజార్, కవిరాజ్ నగర్, జెడ్పీ సెంటర్ ప్రగతి నగర్, ఖనాపురంలో భారీగా వరద నీరు చేరుకుంది.
👉ఖమ్మం నగరంలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బయటికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment