![Holiday For Schools In Hyderabad District On September 2](/styles/webp/s3/article_images/2024/08/31/schools.jpg.webp?itok=3nfMyHza)
సాక్షి,హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో సోమవారం(సెప్టెంబర్2)స్కూళ్లకు సెలవు ప్రకటించారు. వర్షాలు, వరదల పరిస్థితిని అంచనా వేసి జిల్లాల పరిధిలో స్కూళ్లకు సెలవు ప్రకటించే విషయంలో కలెక్టర్లదే నిర్ణయమని చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఆదేశాల మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ సోమవారం స్కూళ్లకు సెలవు దినంగా నిర్ణయించారు. రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది. తెలంగాణతో పాటు ఏపీకి ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment