schools holiday
-
బడుల్లో బురద మేట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు ప్రభుత్వ విద్యాసంస్థలను ముంచెత్తాయి. పలు జిల్లాల్లోని పాఠశాలల్లో బురద మేటలు వేసింది. కొన్నిచోట్ల విద్యార్థులు, ఉపాధ్యాయుల రికార్డులు తడిసి ముద్దవగా ఇంకొన్ని చోట్ల వరదలో రికార్డులు కొట్టుకుపోయాయి. ఖమ్మం పట్టణంలోని దాదాపు అన్ని స్కూళ్లకు వరద తీవ్రత ఎక్కువగా ఉంది. వర్షం తీవ్రత తగ్గినా వారంపాటు సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం కూడా సెలవు ప్రకటించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు డీఈవోలను ఆదేశించారు. అన్ని చోట్లా అదే పరిస్థితి ⇒ ఖమ్మం నయాబజార్ ప్రభుత్వ పాఠశాల మున్నే రుకు సమీపంలో ఉంటుంది. మున్నేరు ఉప్పొంగడంతో నీరంతా స్కూల్‌ను ముంచెత్తింది. ఆది వారం రాత్రి స్కూల్లోకి మోకాళ్లలోతు వరకు వర ద చేరినట్లు స్థానికులు చెప్పారు. దీంతో అడ్మినిస్ట్రేషన్ రూంలోని పలు రికార్డులు కొట్టుకుపోయినట్టు స్కూల్ టీచర్ ఒకరు పేర్కొన్నారు. ⇒ నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలోని సాయిమాధవ నగర్ కాలనీలోని మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాల పూర్తిగా జలదిగ్బంధమైంది. – హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి ప్రభుత్వ పాఠశాల చుట్టూ వరద చేరింది. గదుల్లోనూ వరదనీరు ఉండటంతో కొన్ని రోజులపాటు క్లాసుల నిర్వహణ కష్టమని టీచర్లు అంటున్నారు. ⇒ మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట ఉన్నత పాఠశాల ముందు వరదనీరు నిలిచింది. తరగతి గదుల్లోని గోడలకు చెమ్మ ఏర్పడింది. సాధారణ పరిస్థితి వచ్చే దాకా క్లాసులు నిర్వహించడం కష్టమేనని ఉపాధ్యాయులు అంటున్నారు. క్లాసులు నిర్వహించినా కొన్ని రోజులపాటు విద్యార్థులు హాజరుకావడం కష్టమేనని స్థానికులు చెబుతున్నారు. ⇒ సూర్యాపేట జిల్లాలోని పలు స్కూళ్లలోకి వరద తగ్గినా బురద కొన్ని రోజులు ఉండే వీలుంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులపాటు తరగతుల నిర్వహణ కష్టమని టీచర్లు అంటున్నారు.ఇంజనీరింగ్ స్పాట్‌కు మరోరోజు గడువు పెంపువరదలు ముంచెత్తిన నేపథ్యంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను మరోరోజు పొడిగించాలని అధికారులు నిర్ణయించారు. వాస్తవానికి సోమవారంతో స్పాట్ ముగించాల్సి ఉంది. ఇప్పటివరకు 2 వేల మంది విద్యార్థులు స్పాట్ అడ్మిషన్లు పొందారు. కొన్నిచోట్ల రహదారులు తెగిపోవడంతో విద్యార్థులు కాలేజీలకు రాలేని పరిస్థితి ఉన్నట్లు అధికారుల దృష్టికి తెచ్చారు. మరోవైపు ఉస్మానియా, జేఎన్టీయూహెచ్ పరిధిలో జరగాల్సిన పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. -
రేపు తెలంగాణలో అన్ని స్కూల్స్ బంద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం కారణంగా మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రేపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్టు అధికారులకు తెలిపారు. అలాగే, అన్ని ప్రభుత్వ విభాగాల్లో సెలవులు రద్దు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో ప్రజలను మంత్రి హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. అలాగే, రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో రేపు(సోమవారం) ఉస్మానియా యూనివర్సిటీలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఓయూ ఇంఛార్జ్ వీసీ దానా కిషోర్ తెలిపారు. -
భారీ వర్షాలు: హైదరాబాద్‌లో సోమవారం స్కూళ్లకు సెలవు
సాక్షి,హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో సోమవారం(సెప్టెంబర్2)స్కూళ్లకు సెలవు ప్రకటించారు. వర్షాలు, వరదల పరిస్థితిని అంచనా వేసి జిల్లాల పరిధిలో స్కూళ్లకు సెలవు ప్రకటించే విషయంలో కలెక్టర్లదే నిర్ణయమని చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు.ఈ ఆదేశాల మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ సోమవారం స్కూళ్లకు సెలవు దినంగా నిర్ణయించారు. రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది. తెలంగాణతో పాటు ఏపీకి ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. -
తెలంగాణ అంతటా భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు ప్రకటన
రంగారెడ్డి/హైదరాబాద్, సాక్షి: భారీ వర్షాల నేపథ్యంలో మంగళవారం రంగారెడ్డి జిల్లా గ్రేటర్ పరిధిలోని పాఠశాలలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. అలాగే.. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల భవనాల పరిస్థితి, అక్కడ వాతావరణాన్ని బట్టి మండల విద్యా శాఖ అధికారులు సెలవు ఇవ్వాలని డీఈవో ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు.. జీహెచ్ఎంసీలో పరిధిలోనూ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. చాలా చోట్ల స్కూళ్ల నిర్వాహకులు సెలవు ప్రకటిస్తూ తల్లిదండ్రుల మెబైల్స్కు మెసేజ్‌లు పంపుతున్నారు. ఇంకోవైపు.. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అధికార ప్రకటన ఇవ్వకున్నా.. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలని ఆదేశిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ అంతటా మరో మూడు నుంచి నాలుగు రోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. -
ఏపీలో భారీ వర్షాల ఎఫెక్ట్.. రెండు జిల్లాల్లో స్కూల్స్ బంద్
సాక్షి, విశాఖపట్నం/ అనకాపల్లి: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, అనకాపల్లిలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండటంతో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు అధికారులు.కాగా, గత రెండు రోజులుగా విశాఖపట్నం, అనకాపల్లిలో భారీ వర్షాల కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. అలాగే, అనకాపల్లిలో భారీ వర్షాల నేపథ్యంలో నేడు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్. ఈ మేరకు అన్ని విద్యా సంస్థల యాజమన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. -
హిమాచల్‌లో వర్ష బీభత్సం.. నేడు, రేపు స్కూల్స్ బంద్
సిమ్లా: ఈ ఏడాది ఉత్తరాదిలో వర్షాలు దండికొడుతున్నాయి. గతకొద్ది రోజులుగా హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు నెలలుగా ఆ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో పలు నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వరదల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. మరోవైపు.. ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్ట ఐఎండీ హెచ్చరించింది. The destruction happened in #HimachalPradesh and #Uttarakhand is unprecedented but the whole mainstream media is silent. This happened in Mandi #Himachal #HimachalDisaster #HimachalFloodspic.twitter.com/FENPh2efDR — Anis Hussain 🙋 (@Anis_Husain) August 16, 2023 ఇదిలా ఉండగా.. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు హిమాచల్ ప్రదేశ్‌లో 55 మంది చెందారు. ఇక, వచ్చే 24 గంటల్లో మూడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పాటే, ఆరెంజ్ అలర్ట్‌ను కూడా విధించారు. ఈ నేపథ్యంలో కాంగ్రా జిల్లాలో నేడు(బుధవారం), రేపు(గురువారం) విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు.. హిమాచల్ రాజధాని సిమ్లాలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న 440 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. A landslide has occurred in a part of the Indian state of Himachal Pradesh, causing multiple houses to collapse. pic.twitter.com/MpaVTY6Xu2 — Akin💯 (@ics923) August 16, 2023 ఇదే సమయంలో, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ, నదులు మరియు కాలువల దగ్గరకు వెళ్లవద్దని డిప్యూటీ కమిషనర్ అందరినీ ఆదేశించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే జిల్లా విపత్తు నిర్వహణ కేంద్రంలోని టోల్ ఫ్రీ నంబర్ 1077కు సమాచారం అందించాలని ఆయన కోరారు. बल्ह घाटी का मझ्याली नाला। घर, सामान और कुछ हद तक साहस....कुछ नहीं बचा।#HimachalPradesh#HimachalFloods pic.twitter.com/3FuadgwPIg — नवनीत शर्मा-Navneet Sharma (@nsharmajagran) August 14, 2023 ఇక, భారీ వర్షాల నేపథ్యంలో ఏడు ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో, అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. పలు ఇళ్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మండి, సిమ్లా, బిలాస్పూర్ జిల్లాల్లోని 621 రోడ్లపై రాకపోకలను నిలిపివేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. Monsoon damages have been enormous in ongoing #HimachalFloods. Old timers are saying they have never seen devastation of this scale. Below video of today's cloud burst at Sambhal Pandoh shared by an HP friend. Praying for safety & well being of all affected in HP & #Uttarakhand! pic.twitter.com/iE7SRgRvqo — jeevan (@jeevan13470725) August 15, 2023 ఇది కూడా చదవండి: హిమాచల్, ఉత్తరాఖండ్‌లో భీకర వర్షం -
AP: భారీ వర్షాల ఎఫెక్ట్.. పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు
సాక్షి, అమరావతి: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు జిల్లాల్లో(విశాఖ, నంద్యాల, ఏలూరు, ఎన్టీఆర్) విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. కుండపోత వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. ప్రధానంగా కోస్తా జిల్లాల్లో ఆకాశానికి చిల్లు పడినట్లు ఎడతెగని వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ విస్తారంగా వానలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా సగటున 2.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 10 జిల్లాలకు రెడ్.. 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అల్పపీడనం ప్రభావం గురువారం వరకు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలు ఈ జాబితాలో ఉన్నందున, అక్కడి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. వర్షాలతోపాటు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. శనివారం వరకు అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రం అలజడిగా ఉన్నందున రానున్న మూడు రోజులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. 2వ తేదీ నాటికి మరో అల్పపీడనం అల్పపీడనం కేంద్రీకృతమైన బంగాళాఖాతం నుంచి కోస్తా జిల్లాల వైపు నిరంతరాయంగా మేఘాలు వస్తూనే ఉండడం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీంతో తీవ్ర అల్పపీడనం ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాల మీదుగా వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా ఉన్నాయి. కాగా, బంగాళాఖాతంలో వచ్చే నెల 2వ తేదీ నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం మధ్య కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం బలహీనపడిన తర్వాత ఈ అల్పపీడనంపై స్పష్టత వస్తుందని ఏపీఎస్డీపీఎస్ అధికారులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: నేడు జగనన్న విదేశీ విద్యా దీవెన అమలు -
తెలంగాణలో విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవులు
-
తెలంగాణ లో మరో రెండు రోజులు స్కూళ్లకు సెలవు
-
భారత్‌లో కోవిడ్ భయాలు: స్కూళ్లు, కాలేజీలకు కరోనా సెలవులు! నిజమెంత?
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ వెలుగుచూసిన కారణంగా త్వరలో స్కూళ్లు, కాలేజీలు బంద్ చేస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. లాక్డౌన్ కూడా విధించే అవకాశం ఉందని వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వీటిపై స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పింది. ఇదంతా నిరాధారమైన ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది. స్కూళ్లు, కాలేజీలకు 15 రోజులు సెలవులు ప్రకటిస్తారనే బోగస్ వార్తలను ఎవరూ నమ్మవద్దని పేర్కొంది. వాస్తవాలు తెలుసుకోవాలని ప్రజలకు సూచించింది. ఈ మేరకు ఫ్యాక్ట్ చెక్ చేసి ట్విట్టర్లో పోస్టు చేసింది. మరోవైపు చలి తీవ్రత బాగా పెరగడంతో కాన్పూర్, నోయిడా లక్నో, బిహార్, జార్ఖండ్, పంజాబ్, ఢిల్లీలోని పలు పాఠశాలలను మూసివేశారు. పొగమంచు కారణంగా కొన్ని చోట్ల స్కూళ్ల సమయాన్ని మార్చారు. అంతేగానీ కరోనా కారణంగా సెలవులు ప్రకటించలేదు. చదవండి: భారత్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టడం ఎలా? सोशल मीडिया पर कई खबरों को शेयर करते हुए दावा किया जा रहा है कि #Covid19 के कारण देश में लॉकडाउन लगेगा और स्कूल/कॉलेज बंद रहेंगे। #PIBFactCheck ✅ ये सभी दावे फ़र्ज़ी हैं। ✅ कोविड से जुड़ी ऐसी किसी भी जानकारी को शेयर करने से पहले #FactCheck अवश्य करें। pic.twitter.com/jLcIeI9pBn — PIB Fact Check (@PIBFactCheck) January 4, 2023 -
ఆన్లైన్ చదువు కోసం ఆవు అమ్మకం
పాలంపూర్: తమ ఇద్దరు పిల్లల ఆన్లైన్ పాఠాల కోసం, కుటుంబానికున్న ఏకైక జీవనాధారమైన ఆవుని రూ.6,000కు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది జ్వాలాముఖిలోని గుమ్మర్ గ్రామానికి చెందిన కుల్దీప్ కుమార్‌కు. కుల్దీప్ పిల్లలు అన్నూ నాల్గవ తరగతి, డిప్పు రెండవ తరగతి చదువుతున్నారు. మార్చి నుంచి లాక్డౌన్ ప్రకటించడంతో పాఠశాలలు మూత పడ్డాయి. ఆన్లైన్ తరగతులు ప్రారంభం అయ్యాయి. చదువు కొనసాగించాలంటే స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాల్సిందేనని కుల్దీప్పై స్కూల్ యాజమాన్యం ఒత్తిడి తెచ్చింది. ఎవ్వరూ రుణం ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో విసిగిపోయిన కుల్దీప్ తన బిడ్డల చదువుకోసం తన ఏకైక జీవనాధారమైన ఆవుని ఆరువేల రూపాయలకు అమ్ముకొని, పిల్లలకు స్మార్ట్ ఫోన్ కొనిపెట్టారు. విషయం తెల్సి జ్వాలాముఖి ఎమ్మెల్యే రమేష్ దావ్లా విస్మయం వ్యక్తంచేశారు. తక్షణమే కుల్దీప్కి ఆర్థిక సాయం చేయాల్ సిందిగా స్థానిక బీడీఓ, తహసీల్దార్లను ఆదేశించారు. -
హజ్ యాత్రపై కోవిడ్ ప్రభావం
రియాద్/బీజింగ్/సియోల్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కోవిడ్ వైరస్ ప్రభావం హజ్ యాత్రపై పడింది. కోవిడ్ వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారిని ఈ ఏడాది జరగబోయే హజ్ యాత్రకు అనుమతించబోమని సౌదీ అరేబియా ప్రకటించింది. ఈ దేశాల నుంచి మక్కాకు వచ్చే యాత్రికులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సౌదీ విదేశీ వ్యవహారాల శాఖ గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. వారిని మక్కాలోకి అనుమతించబోమని తెలిపింది. కేవలం ఉమ్రా యాత్రికులనే కాకుండా మదీనాను సందర్శించే వారిని సైతం అనుమతించబోమని ప్రకటించింది. ఈ ఆంక్షలు ఎప్పటివరకు కొనసాగుతాయనే దానిపై మాత్రం సౌదీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. మక్కా యాత్రకు తాత్కాలిక బ్రేక్ శంషాబాద్: నిషేధం నేపథ్యంలో హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి గురువారం ఉమ్రా యాత్ర కోసం వచ్చిన 76 మంది ప్రయాణికులను ఇమిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. జపాన్‌లో పాఠశాలల మూసివేత టోక్యో: కోవిడ్ వైరస్ కారణంగా జపాన్‌లోని అన్ని పాఠశాలలను కొన్ని వారాలపాటు మూసివేయాలని ఆ దేశ ప్రధాని షింజో అబే ఆదేశించారు. మార్చి 2 నుంచి వసంత కాలం సెలవులు పూర్తయ్యే వరకు తాత్కాలికంగా పాఠశాలలను మూసివేయనున్నట్లు తెలిపారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో సంయుక్త సైనిక విన్యాసాలను వాయిదా వేస్తున్నట్లు దక్షిణ కొరియా, అమెరికా ప్రకటించాయి. శాంతిస్తున్న కోవిడ్ కోవిడ్ తీవ్రత క్రమేపీ నెమ్మదిస్తోంది. వైరస్ కారణంగా చైనాలో సంభవిస్తున్న రోజువారీ మరణాల్లో తగ్గుదల నమోదు అవుతూండటం దీనికి కారణం. చైనా ఆరోగ్య కమిషన్ గురువారం తెలిపిన దాని ప్రకారం బుధవారం కేవలం 29 మంది కోవిడ్‌కు బలయ్యారు. దీంతో ఇప్పటివరకూ ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2744కు చేరుకోగా, నిర్ధారిత కేసుల సంఖ్య 78,497కు చేరుకుంది. దేశంలోని మొత్తం 31 ప్రావిన్సుల్లోనూ అతితక్కువ మరణాలు నమోదు కావడం కొన్ని వారాల్లో ఇదే మొదటిసారి. చైనా చేపట్టిన చర్యల కారణంగా కరోనా వైరస్ ఉధృతి గత అంచనాల కంటే వేగంగా కట్టడి అయిందని డబ్ల్యూహెచ్ఓ వైద్య నిపుణుడు బ్రూస్ ఐల్వార్డ్ తెలిపారు. -
వేసవిలో పదో తరగతి పాఠాల బోధన
తొమ్మిదో తరగతి వరకు చదివిన విద్యార్థులు 10వ తరగతికి వేరే పాఠశాలకు వెళ్లిపోకుండా కట్టడి చేయడానికి కార్పొరేట్ యాజమాన్యాలు వేసవి సెలవుల్లో పదో తరగతి సిలబస్ బోధించడం మొదలుపెట్టాయి. తద్వారా విద్యార్థులకు వేసవి సెలవులు లేకుండా పోయాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కడైనా విహార యాత్రకు వెళ్లడానికి కూడా వీలు లేకుండా కార్పొరేట్ స్కూళ్లు వ్యవహరిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. తిరుపతి ఎడ్యుకేషన్ : ఉన్నత విద్యకు వారధి ఇంటర్. దీని తర్వాత ఇంజినీరింగ్, మెడిసిన్, ఇతర కోర్సుల్లో చేరేందుకు జేఈఈ, నీట్ వంటి పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇదే సాకుగా ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించకుండా కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు జేఈఈ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలతో పాటు బ్రిడ్జి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాయి. ఈ వింత పోకడ కాస్త స్కూళ్లకు పాకింది. వేసవిలో తరగతులు నిర్వహించకూడదన్న నిబంధనలను తుంగలో తొక్కి తరగతులు నిర్వహిస్తున్నాయి. తొమ్మిదో తరగతి ముగించుకున్న విద్యార్థులకు వేసవి సెలవుల్లో పదో తరగతి సిలబస్‌ను బోధిస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలలే కాకుండా సాధారణ పాఠశాలలు ఈ పంథాను అవలంబిస్తూ విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నాయి. తిరుపతి నగరంలో దాదాపుగా 160 వరకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలున్నాయి. పాఠశాలల మధ్య పోటీ పెరిగింది. ఈ పోటీని తట్టుకుని నిలబడేం దుకు కొన్ని పాఠశాలలు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నాయి. పాఠశాల విద్యాశాఖ రూపొందించిన షెడ్యూల్ ప్రకా రం కాకుండా ముందస్తుగానే పదో తరగతిలో సిలబస్‌ను పూర్తి చేయించి, విద్యార్థులకు పునఃశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నాయి. ఒక రకంగా ఇది విద్యార్థులకు మేలు చేకూరే అంశమే అయినప్పటికీ విద్యార్థుల హక్కులను కాలరాస్తూ వేసవిలో తరగతులు నిర్వహించడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. వేసవిలో పదో తరగతి సిలబస్ కార్పొరేట్ తరహాలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ వేసవి సెలవుల్లో పదో తరగతి సిలబస్‌ను బోధిస్తున్నాయి. విద్యాశాఖ నిబంధనలకు ఇది విరుద్ధం. ఏప్రిల్ 23 నుంచి జూన్ 12వ తేదీ వరకు పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 13న పునఃప్రారంభించాలి. ఈ నిబంధనలను కొన్ని పాఠశాలలు పాటించడం లేదు. చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖాధికారులు చోద్యం చూస్తున్నారంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పదికి 10 జీపీఏ కోసమేనంటూ పోటీ ప్రపంచానికి దీటుగా రాణించాలంటే చదువు తప్పనిసరి అంటూ పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తూ విద్యార్థులను వేసవి సెలవులకు దూరం చేస్తున్నాయి. పదో తరగతి ఫలితాల్లో పదికి 10 జీపీఏ సాధిం చాలంటే ఇప్పటి నుంచే చదవాలంటూ ఒత్తిడి తెస్తున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తున్నాయి. తిరుపతిలోనే కొన్ని పాఠశాలలు సెలవులు ఇవ్వకుండా తొమ్మిదో తరగతి విద్యార్థులకు తరగతులు యథేచ్ఛగా నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మార్కుల మాయలో ç తల్లిదండ్రులు సైతం అభ్యంతరం చెప్పకుండా ఊరకుంటున్నారు. తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు రావాలని, లేకుంటే పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది కలిగించిన వారమవుతామని మేధావులు హెచ్చరిస్తున్నారు. హక్కులను కాలరాయొద్దు కొన్ని విద్యాసంస్థలు విద్యాశాఖ నిబంధనలను పాటించకుండా విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నాయి. ఏడాది పొడవునా పుస్తకాలతో కుస్తీ పట్టిన పిల్లలకు వేసవి సెలవులు ఆటవిడుపునిస్తాయి. మానసికోల్లాసాన్ని కలిగి స్తాయి. ఒత్తిడి దూరమవుతుంది. అయితే మార్కుల పేరుతో వేసవి సెలవుల్లో తొమ్మిదో తరగతి ముగించుకున్న విద్యార్థులకు పదో తరగతి సిలబస్‌ను బోధిస్తున్నాయి. ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే ఊరుకోం.– వడిత్య శంకర్‌నాయక్, వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు, జీవీఎస్ కఠిన చర్యలు తీసుకుంటాం విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ 23 నుంచి జూన్ 12వ తేదీ వరకు వేసవి సెలవుల్లో ఎటువంటి తరగతులూ నిర్వహించకూడదు. ఇప్పటికే ఎంఈఓ, సీఆర్పీల ద్వారా వేసవిలో తరగతులు నిర్వహించకూడదంటూ అన్ని పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేశాం. నిబంధనలు అతిక్రమించి వేసవి తరగతులు నిర్వహిస్తే ఆయా పాఠశాలలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులకు సిఫా రసు చేస్తాం. అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటాం. – సీ విజయేంద్రరావు, ఉప విద్యాశాఖాధికారి, తిరుపతి -
చిత్తూరు జిల్లాలో పలు చోట్ల వర్షాలు
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని బహుదా నదీ ఉధృతంగా ప్రవహిస్తుంది. అలాగే శ్రీకాళహస్తి మండలం చిన్నకనపర్తి వద్ద తెలుగుగంగ కాల్వకు గండి పడింది. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో 150 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. మరో 655 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జిల్లాలోని 45 చెరువులకు గండి పడింది. దీంతో 80 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. జిల్లావ్యాప్తంగా 50 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలకు డీఈవో సెలవు ప్రకటించారు.