చిత్తూరు : చిత్తూరు జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని బహుదా నదీ ఉధృతంగా ప్రవహిస్తుంది. అలాగే శ్రీకాళహస్తి మండలం చిన్నకనపర్తి వద్ద తెలుగుగంగ కాల్వకు గండి పడింది. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో 150 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. మరో 655 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జిల్లాలోని 45 చెరువులకు గండి పడింది.
దీంతో 80 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. జిల్లావ్యాప్తంగా 50 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలకు డీఈవో సెలవు ప్రకటించారు.