Schools, Colleges Closed In Himachal Pradesh Due To Heavy Rains - Sakshi
Sakshi News home page

హిమాచల్‌లో వర్ష బీభత్సం.. నేడు, రేపు స్కూల్స్‌ బంద్‌

Published Wed, Aug 16 2023 7:28 AM | Last Updated on Wed, Aug 16 2023 8:39 AM

Educational Institutions Closed In Himachal Pradesh Due To Heavy Rains - Sakshi

సిమ్లా: ఈ ఏడాది ఉత్తరాదిలో వర్షాలు దండికొడుతున్నాయి. గతకొద్ది రోజులుగా హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు నెలలుగా ఆ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో పలు నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వరదల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. మరోవైపు.. ఉత్తరాఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, సిక్కిం, జార్ఖండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్ట ఐఎండీ హెచ్చరించింది. 

ఇదిలా ఉండగా.. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు హిమాచల్‌ ప్రదేశ్‌లో 55 మంది చెందారు. ఇక, వచ్చే 24 గంటల్లో మూడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పాటే, ఆరెంజ్‌ అలర్ట్‌ను కూడా విధించారు. ఈ నేపథ్యంలో కాంగ్రా జిల్లాలో నేడు(బుధవారం), రేపు(గురువారం) విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు.. హిమాచల్‌ రాజధాని సిమ్లాలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న 440 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. 

ఇదే సమయంలో, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ, నదులు మరియు కాలువల దగ్గరకు వెళ్లవద్దని డిప్యూటీ కమిషనర్ అందరినీ ఆదేశించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే జిల్లా విపత్తు నిర్వహణ కేంద్రంలోని టోల్ ఫ్రీ నంబర్ 1077కు సమాచారం అందించాలని ఆయన కోరారు.


ఇక, భారీ వర్షాల నేపథ్యంలో ఏడు ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో, అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. పలు ఇళ్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మండి, సిమ్లా, బిలాస్‌పూర్‌ జిల్లాల్లోని 621 రోడ్లపై రాకపోకలను నిలిపివేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇది కూడా చదవండి: హిమాచల్, ఉత్తరాఖండ్‌లో భీకర వర్షం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement