
న్యూఢిల్లీ: పారదర్శకతను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థిర, చరాస్తుల వివరాలను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. గురువారం జరిగిన ఫుల్ కోర్టు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా సహా సుప్రీంకోర్టులోని 30 మంది జడ్జీలు ఆస్తులను ప్రకటించనున్నారు. అయితే, ఇది న్యాయమూర్తుల ఐచ్ఛికం మాత్రమేనని వెబ్‌సైట్ తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి సహా అందరు న్యాయమూర్తులు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గానీ, ఏదైనా గణనీయ స్థాయిలో ఆస్తి సముపార్జన జరిగినప్పుడు గానీ ఆ వివరాలను బహిర్గతం తెలియజేయాలని ఫుల్‌కోర్టు నిర్ణయించిందని వెబ్‌సైట్ తెలిపింది.