Movable assets
-
ఆన్లైన్లో సుప్రీం జడ్జీల ఆస్తుల వివరాలు
న్యూఢిల్లీ: పారదర్శకతను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థిర, చరాస్తుల వివరాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు. గురువారం జరిగిన ఫుల్ కోర్టు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా సహా సుప్రీంకోర్టులోని 30 మంది జడ్జీలు ఆస్తులను ప్రకటించనున్నారు. అయితే, ఇది న్యాయమూర్తుల ఐచ్ఛికం మాత్రమేనని వెబ్సైట్ తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి సహా అందరు న్యాయమూర్తులు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గానీ, ఏదైనా గణనీయ స్థాయిలో ఆస్తి సముపార్జన జరిగినప్పుడు గానీ ఆ వివరాలను బహిర్గతం తెలియజేయాలని ఫుల్‌కోర్టు నిర్ణయించిందని వెబ్సైట్ తెలిపింది. -
బిహార్ సీఎం నితీశ్ దగ్గర ఎంత డబ్బు ఉందో తెలుసా?
పాట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ తన ఆస్తుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరిచారు. వీటి ప్రకారం ఆయన వద్ద మొత్తం రూ.75.53 లక్షలు విలువ చేసే స్థిరాస్థులు చరాస్థులు ఉన్నాయి. గతేడాదితో పోల్చితే ఈ మొత్తం రూ.18,000 పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ వైబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం నితీశ్ కుమార్ వద్ద రూ.28,135 క్యాష్ ఉంది. బ్యాంకుల్లో మరో రూ.51,586 డిపాజిట్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను ప్రతి ఏటా డిసెంబర్ చివర్లో ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరచాలని సీఎం నితీశ్ కొత్త రూల్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు మంత్రులంతా తమ ఆస్తుల వివరాలను డిసెంబర్ 31న పొందుపరిచారు. అయితే సీఎం కంటే చాలా మంది మంత్రులు సంపన్నులుగా ఉన్నారు. డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వద్ద రూ.75వేల నగదు(మార్చి 31,2022 వరకు) ఉంది. ఆయన భార్య రాజశ్రీ వద్ద రూ.1.25లక్షల నగదు ఉంది. తేజస్వీ సోదరుడు, బిహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ వద్ద రూ.1.7 లక్షల క్యాష్ ఉంది. ఆయన స్థిరాస్థులు, చరాస్థుల విలువ మాత్రం రూ.3.2కోట్లుగా ఉంది. చదవండి: హై రిస్క్ దేశాల నుంచి వచ్చినవారికి అక్కడ వారం రోజుల క్వారంటైన్ -
భారీగా పెరిగిన ప్రధాని మోదీ ఆస్తులు.. ఎంతంటే?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్తులు గతంతో పోలిస్తే భారీగానే పెరిగాయి. ప్రస్తుతం ఆయన వద్ద రూ.2.23 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అందులో ఎక్కవ భాగం బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే ఉన్నాయి. అయితే, ఎలాంటి స్థిరాస్తులు లేవు. గాంధీనగర్‌లో గతంలో కొనుగోలు చేసిన భూమిని విరాళంగా ఇచ్చేశారు మోదీ. ఈ మేరకు తాజాగా వెల్లడించిన ఆస్తుల వివరాల్లో పేర్కొన్నారు మోదీ. మరోవైపు.. బాండ్స్, షేర్లు, మ్యూచ్యువల్ ఫండ్స్‌లోనూ పెట్టుబడి పెట్టలేదు. సొంతంగా కారు కూడా లేదు. అయితే, సుమారు రూ.1.73 లక్షల విలువైన మూడు బంగారు ఉంగరాలు ఉన్నాయి. ఏడాదిలో రూ.26 లక్షల నుంచి రూ.2 కోట్లకు.. ప్రధాని మోదీకి చెందిన చరాస్తులు ఏడాది క్రితం 2021, మార్చి 31 నాటికి రూ.26.13 లక్షలుగా ఉండేవి. రూ.1.1 కోట్లు విలువైన స్థిరాస్తి ఉంటే దానిని విరాళంగా ఇచ్చారు. 2022, మార్చి 31 నాటి డిక్లరేషన్ ప్రకారం ప్రస్తుతం మోదీ వద్ద ఆస్తులు రూ.2,23,82,504 ఉన్నాయి. ఈ మేరకు వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. 2022, మార్చి 31 నాటికి మోదీ చేతిలో రూ.35,350 నగదు ఉంది. అలాగే పోస్ట్‌ఆఫీస్‌లోని నేషనల్ సేవింగ్స్ సర్టిఫెక్ట్ విలువ రూ.9,05,105, జీవిత బీమా పాలసీల విలువ రూ.1,89,305గా ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు తమ ఆస్తుల వివరాలను ప్రకటించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వద్ద చరాస్తులు రూ.2.54 కోట్లు, స్థిరాస్తులు రూ.2.97 కోట్లు ఉన్నాయి. 29 కేంద్ర మంత్రుల్లో గత ఆర్థిక సంవత్సరంలోని తమ, తమపై ఆధారపడిన వారి ఆస్తుల వివరాలను వెల్లడించిన వారిలో ధర్మేంద్ర ప్రదాన్, జోతిరాదిత్య సింధియా, ఆర్కే సింగ్, హర్దీప్ సింగ్ పూరీ, పర్శోత్తమ్ రూపాలా, జీ కిషన్ రెడ్డి, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీలు ఉన్నారు. ఇదీ చదవండి: Akhilesh Yadav: నితీష్ రాజీనామా.. ‘బీజేపీ భగావ్’ అంటూ అఖిలేష్ షాకింగ్ కామెంట్స్ -
పట్టింపులు, పంతాలకు పోయి..
మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : అధికారాన్ని చేజిక్కించుకోవాలని, గెలుపు కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా ప్రత్యర్థులతో పోటీపడి ఎన్నికల్లో ఖర్చు పెట్టిన నేతలు ఇప్పుడు ఆ ఖర్చులు చూసి బెంబేలెత్తుతున్నారు. తెలిసిన వారి నుంచి కొంత, అధిక వడ్డీలకు మరికొంత అప్పులు తీసుకురాగా, ఎన్నికలు, ఫలితాల వెల్లడి తరువాత లెక్కలు వేసుకుంటే గెలిచిన అభ్యర్థులతోపాటు, ఓడిన అభ్యర్థుల కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఇంకొందరు స్థిరాస్తులు అమ్మి, బ్యాంక్ బ్యాలెన్స్‌లు ఖాళీ చేసుకున్నారు. వీరికి బాధ తక్కువగా ఉన్నప్పటికీ అప్పులు తెచ్చిపోటీ చేసిన వారి పరిస్థితి దారుణంగా ఉంది. అధికారంపై మనిషికి మమకారం పెరిగితే అది ఎంత వరకైనా తీసుకెళ్తుందని, ఏదైనా చేయిస్తుందంటూ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు తెలిసొచ్చింది. మనమే గెలుస్తామన్న ధీమాతో ఉన్నదంతా ఊడ్చి అప్పు తెచ్చి ఎన్నికల్లో నిలిచారు. అంచనాలు తలకిందులై చివరకు ఓటమి వరించడంతో బిక్క మొహాలు వేశారు. పట్టుదలకు, పంతాలకు పోయి అప్పుడు చేసిన ఖర్చులతో చేసిన అప్పులను ఎలా తీర్చాలోనంటూ తల పట్టుకుంటున్నారు. పరిమితికి మించి ఖర్చులు మున్సిపల్, పరిషత్, సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో చాలా మంది పట్టుదలకు పోయి ఓట్ల వేటలో విచ్చలవిడిగా ఖర్చు చేశారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో 1,095 మంది, 636 ఎంపీటీసీ స్థానాల్లో 2,710 మంది, 52 జెడ్పీటీసీలకు గాను 267 మంది, 10 అసెంబ్లీ స్థానాల్లో 107 మంది, 2 ఎంపీ స్థానాల్లో 25 మంది మొత్తంగా అన్ని ఎన్నికల్లో కలిపి 4,204 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో సగానికి పైగా అభ్యర్థులు పరిమితికి మించి ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు సమాచారం. పోటీ చేసిన వారిలో చాలా మంది మధ్య తరగతి వారే కావడంతో వారు అప్పులు చేయాల్సి వచ్చింది. చాలామంది అభ్యర్థులు ఉన్న ఆస్తులు అమ్ముకోవడంతోపాటు, వడ్డీలకు అప్పులు తెచ్చి ఎన్నికల్లో ఖర్చు చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు, యువజన సంఘాలకు, కుల సంఘాలను మచ్చిక చేసుకోవడానికి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడంతోపాటు, విందులు ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి రూ. 10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇక ఎంపీటీసీ ఎన్నికల్లో ఒక్కొక్కరు పోటీని బట్టి రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేశారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇతర పార్టీల అభ్యర్థులు ప్రలోభాలకు గురి చేస్తున్నారని తెలియడంతో, తమ వద్ద ఉన్న బంగారం, భూముల దస్తావేజులు, ఇళ్లను సైతం తాకట్టు పెట్టి డబ్బులు అప్పుగా తెచ్చుకున్నారు. మొదట అనుకున్న దానికంటే మూడు నుంచి పది రెట్లు అధికంగా డబ్బు ఖర్చు కావడంతో, ఇప్పుడు చేసిన అప్పులను తీర్చేందుకు అవసరమైన మార్గాలను అన్వేషిస్తున్నారు. గెలిచినా.. ఓడినా.. అప్పులే.. ఎన్నికల్లో అభ్యర్థులు ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా పట్టుదలకు పోయారు. వెనక్కు చూడకుండా ఖర్చు చేస్తూనే వెళ్లారు. ఎన్నికలు ముగిసిన తరువాత లెక్కలు చూసుకుని బిక్కముఖం వేశారు. జిల్లా వ్యాప్తంగా వేల మంది ఎన్నికల పుణ్యమా అని అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు తెలిసింది. ఎన్నికల్లో గెలుపొందిన వారు చేసిన అప్పులు ఏ విధంగా తీర్చాలని ఆలోచిస్తుండగా, ఓడిన వారు ఓటమి భారంతో ఒకవైపు, అప్పుల తిప్పలతో మరోవైపు ఇబ్బంది పడుతున్నారు. ఓడినా, గెలిచినా మిగిలింది అప్పులేనంటూ పోటీ చేసిన అభ్యర్థులు నిర్వేదం చెందుతున్నారు. ఓటరు మాత్రం ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా, నా ఓటు మీకేనంటూనే తన పని తాను కానిచ్చేశాడని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు.