పాట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ తన ఆస్తుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్లో పొందుపరిచారు. వీటి ప్రకారం ఆయన వద్ద మొత్తం రూ.75.53 లక్షలు విలువ చేసే స్థిరాస్థులు చరాస్థులు ఉన్నాయి. గతేడాదితో పోల్చితే ఈ మొత్తం రూ.18,000 పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ వైబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం నితీశ్ కుమార్ వద్ద రూ.28,135 క్యాష్ ఉంది. బ్యాంకుల్లో మరో రూ.51,586 డిపాజిట్ చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను ప్రతి ఏటా డిసెంబర్ చివర్లో ప్రభుత్వ వెబ్‌సైట్లో పొందుపరచాలని సీఎం నితీశ్ కొత్త రూల్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు మంత్రులంతా తమ ఆస్తుల వివరాలను డిసెంబర్ 31న పొందుపరిచారు.
అయితే సీఎం కంటే చాలా మంది మంత్రులు సంపన్నులుగా ఉన్నారు. డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వద్ద రూ.75వేల నగదు(మార్చి 31,2022 వరకు) ఉంది. ఆయన భార్య రాజశ్రీ వద్ద రూ.1.25లక్షల నగదు ఉంది. తేజస్వీ సోదరుడు, బిహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ వద్ద రూ.1.7 లక్షల క్యాష్ ఉంది. ఆయన స్థిరాస్థులు, చరాస్థుల విలువ మాత్రం రూ.3.2కోట్లుగా ఉంది.
చదవండి: హై రిస్క్ దేశాల నుంచి వచ్చినవారికి అక్కడ వారం రోజుల క్వారంటైన్
Comments
Please login to add a commentAdd a comment