![Schools Closed Due To Heavy Rains In AP](/styles/webp/s3/article_images/2024/07/22/HeavyRains-Schools-01.jpg.webp?itok=_Am5eHjr)
సాక్షి, విశాఖపట్నం/ అనకాపల్లి: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, అనకాపల్లిలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండటంతో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు అధికారులు.
కాగా, గత రెండు రోజులుగా విశాఖపట్నం, అనకాపల్లిలో భారీ వర్షాల కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. అలాగే, అనకాపల్లిలో భారీ వర్షాల నేపథ్యంలో నేడు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్. ఈ మేరకు అన్ని విద్యా సంస్థల యాజమన్యాలకు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment