
విశాఖపట్నం: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఫెంగల్ తుపానుగా బలపడి తీవ్ర వాయుగుండం వెంటనే బలహీనపడింది. ఈ క్రమంలో మరింత బలహీనపడి రేపు మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
ఇక, తుపాను కారణంగా నేటి నుంచి ఏపీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కాగా, ఈనెల 30 నుంచి డిసెంబర్ 2 వరకు కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
