ఏపీకి భారీ వర్షసూచన.. ఈ జిల్లాల్లో గట్టి వానలు.. | Heavy Rain Forecast To Andhra Pradesh, Moderate To Heavy Rains For Next Two Days In Many Areas | Sakshi
Sakshi News home page

AP Rainfall Update: ఏపీకి భారీ వర్షసూచన.. ఈ జిల్లాల్లో గట్టి వానలు..

Apr 4 2025 9:05 AM | Updated on Apr 4 2025 9:57 AM

Heavy Rain Forecast To Andhra Pradesh

సాక్షి, విశాఖ: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. అకాల వర్షం తెలంగాణను అతలాకుతలం చేసింది. భారీ వర్షం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు.. ఏపీలో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.

ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కొన్ని చోట్ల పిడుగులు పడతాయని, గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులూ వీయొచ్చని పేర్కొంది. కర్నూలు, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. నిన్న కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. వర్షాల అనంతరం, ఆదివారం నుంచి ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఈదురుగాలులతో ప్రారంభమైన వర్షం.. ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లతో విరుచుకుపడింది. భారీ వర్షం కారణంగా జన జీవనం స్తంభించింది. ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లో దాదాపు అన్ని డివిజన్లలో కురిసిన భారీ వర్షానికి నగర జీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా పిడుగుపాట్లు, గోడకూలిన ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. హైదరాబాద్‌లో రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. లోతట్టు ‍ప్రాంతాలు జలమయం అయ్యాయి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement