visaka
-
తుపాను ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు..
విశాఖపట్నం: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఫెంగల్ తుపానుగా బలపడి తీవ్ర వాయుగుండం వెంటనే బలహీనపడింది. ఈ క్రమంలో మరింత బలహీనపడి రేపు మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.ఇక, తుపాను కారణంగా నేటి నుంచి ఏపీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కాగా, ఈనెల 30 నుంచి డిసెంబర్ 2 వరకు కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. -
AP: నేడు 13 జిల్లాలకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు(పోలింగ్ రోజు) కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది.కాగా, ఏపీ వివిధ ప్రాంతాల్లో రాబోయే అయిదు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే, నేడు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్టు తెలిపింది. Weather update 12th May,2023#AndhraPradesh & #Telangana:North AP , central AP -central,west TG will get scattered thunderstorms today.#TamilNadu : west & south interior TN and parts of Delta TN will get scattered thunderstorms, coastal TN will tomorrow early morning rains pic.twitter.com/KbLZe7L6Xg— Eastcoast Weatherman (@eastcoastrains) May 12, 2024 ఇక, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఆదివారం కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. -
9 నుంచి ఆడుదాం ఆంధ్రా ఫైనల్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్రా మెగా టోర్నీ తుదిఘట్టానికి చేరుకుంది. గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా ఐదుదశల పోటీల్లో దిగ్విజయంగా నాలుగింటిన దాటుకుని ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు విశాఖ వేదికగా విజయగీతిక మోగించనుంది. దేశచరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో 1.22 కోట్ల మంది క్రీడాకారులు, వీక్షకుల రిజి్రస్టేషన్లతో ఆడుదాం ఆంధ్రా రికార్డు సృష్టించింది. గ్రామ/వార్డు సచివాలయం, మండల స్థాయిలో ప్రతిభకు పెద్దపీట వేస్తూ నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలకు నగదు బహుమతులను అందిస్తోంది. 8 క్రీడా మైదానాల ఎంపిక ఆడుదాం ఆంధ్రా మెగా టోర్నీ ఫైనల్స్ కోసం విశాఖలో ఎనిమిది క్రీడా మైదానాలను తాత్కాలికంగా గుర్తించారు. క్రికెట్ పోటీలను రైల్వే స్టేడియం, ఆంధ్ర మెడికల్ కాలేజీ, జీవీఎంసీ ఇందిరాప్రియదర్శిని, డాక్టర్ వైఎస్సార్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని గ్రౌండ్–బి, బ్యాడ్మింటన్ పోటీలను జీవీఎంసీ ఇండోర్ స్టేడియం, వాలీబాల్ పోటీలను ఆంధ్ర యూనివర్సిటీ అవుట్డోర్, కబడ్డీని ఏయూ జిమ్నాస్టిక్స్ ఇండోర్ హాల్స్, ఖోఖోను ఏయూ జిమ్నాజియం అవుట్‌డోర్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వీటిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా పరిషత్ సీఈవో స్థాయి అధికారులను ఇన్‌చార్జీలుగా నియమించింది. పారదర్శకంగా నగదు బహుమతుల ప్రదానం 15 ఏళ్లకు పైబడిన పురుషులు, మహిళలను క్రికెట్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్ వంటి కాంపిటీటివ్ క్రీడలతోపాటు నాన్–కాంపిటీటివ్‌లో సంప్రదాయ మారథాన్, టెన్నీకాయిట్, యోగాలోను పోటీలు నిర్వహించారు. ఇప్పటివరకు 38,08,741 మంది క్రీడాకారులు (23,81,621 మంది పురుషులు, 14,27,120 మంది మహిళలు) నమోదు చేసుకున్నారు. ఇందులో గ్రామ/వార్డు స్థాయిలో మొత్తం 24,46,538 మంది క్రీడాకారులు (13,92,764 మంది పురుషులు, 10,53,774 మంది మహిళలు) పాల్గొన్నారు. వారిలో మండల స్థాయికి 17,10,456 మంది క్రీడాకారులు (8,55,228 మంది పురుషులు, 8,55,228 మంది మహిళలు) పోటీపడ్డారు. వారిలో 85,842 మంది క్రీడాకారులు (42,921 మంది పురుషులు, 42,921 మంది మహిళలు) నియోజకవర్గస్థాయిలో సత్తాచాటారు. నియోజకవర్గస్థాయిలో తొలి మూడుస్థానాల్లో నిలిచిన జట్లకు (51,164 మంది క్రీడాకారులు పాల్గొంటే 28,513 మంది విజేతలు) నగదు బహుమతులు పొందారు. జిల్లాస్థాయి పోటీల అనంతరం ఫైనల్స్‌కు 1,482 మంది పురుషులు, 1,482 మంది మహిళలు.. మొత్తం 2,964 మంది అర్హత సాధించారు. ఆయా క్రీడల్లో తొలి మూడుస్థానాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు పారదర్శకంగా వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు బహుమతులను జమచేసేందుకు శాప్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
విశాఖలో అత్యాధునికంగా విద్యుత్ వ్యవస్థ
విశాఖపట్నం నుంచి సాక్షి ప్రతినిధి: ఏదైనా ఒక రాష్ట్రం, ప్రాంతం ఆర్థిక స్థితిని అంచనా వేయడంలో విద్యుత్ వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. విశ్వ నగరంగా మారిన విశాఖ ఆర్థిక రాజధానిగా బలంగా ఎదిగేలా విద్యుత్ వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. భారీ పరిశ్రమలు, ఐటీ పార్కులు, డేటా సెంటర్లు, హోటళ్లు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, మాల్స్, ఆస్పత్రులు, ఇతర వాణిజ్య కార్యకలాపాల కోసం నిరంతరం, నాణ్యమైన విద్యుత్‌ను అందించేలా విశాఖలో అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగని విధంగా భూగర్భం నుంచి కేబుళ్ల ద్వారా విద్యుత్ పంపిణీ కానుంది. పారిశ్రామికవేత్తలు, పర్యాటకులను ఆకర్షించడంతోపాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విశాఖలో సిద్ధమవుతున్న ఆధునిక విద్యుత్ వ్యవస్థపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్ ఇదీ.. తుపాన్లకు తల వంచదు.. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం ఎంతోమంది ఉద్యోగాలు, వ్యాపారాల కోసం వచ్చి విశాఖలో స్థిరపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహాలను అందిపుచ్చుకుంటూ పలువురు పారిశ్రామికవేత్తలు సాగర నగరిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వ్యవస్థను మరింత అభివృద్ధి చేసేందుకు డిస్కమ్‌లు సిద్ధమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో పనులు కూడా మొదలయ్యాయి. తుపాన్లు లాంటి విపత్తుల సమయంలోనూ విశాఖ నగరం అంతటా విద్యుత్ వెలుగులకు ఆటంకం కలుగకుండా రూ.925 కోట్లతో భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే రూ.481.49 కోట్ల ఖర్చుతో 80,529 విద్యుత్ కనెక్షన్లను భూగర్భ విద్యుత్ వ్యవస్థలోకి తెచ్చారు. నగరం మొత్తం 2,449 కి.మీ. పొడవున అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేయనున్నారు. సముద్రాన్ని ఆనుకుని ఉన్న నగరం కావడంతో తుపాన్లు వచ్చినపుడు విద్యుత్ స్తంభాలు దెబ్బతింటున్నాయి. ఇకపై అలాంటి పరిస్థితి తలెత్తకుండా పాత స్తంభాల స్థానంలో సెంట్రిఫ్యూగల్లీ కాస్ట్ రీఇన్ఫోర్స్ కాంక్రీట్ స్తంభాలు (స్పన్‌పోల్స్) ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 3,266 స్పన్‌పోల్స్ ఏర్పాటు కాగా అందుకోసం రూ.15.36 కోట్లను వెచ్చించారు. నష్టాల తగ్గింపు, ఆధునికీరణ పనులను సుమారు రూ.1,722.02 కోట్లతో చేపట్టారు. ఇందులో భాగంగా 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు 16 నిర్మించనున్నారు. గత మూడు నెలల్లో 421 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. -
విశాఖ బీచ్ రోడ్ లో 22వ కార్గిల్ విజయ్ దినోత్సవం
-
విశాఖ మూడు ఉత్సవాల నిర్వహణకు ఆదేశాలు
-
విశాఖలో బొమ్మల కొలువు
-
విశాఖ మన్యంలో ఎడతెరిపి లేకుండా వర్షం
-
‘పశ్చిమ’ ప్రస్థానం
ఎన్నికల సంబరం మొదలైంది. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కోలాహలం కనిపిస్తోంది. రాజకీయంగా పశ్చిమకు ప్రత్యేక గుర్తింపు ఉంది. నగరంలోని ప్రముఖ నాయకులు ఇక్కడ నుంచే గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. పారిశ్రామికంగా ఈ నియోజకవర్గం నగరానికి ఆయువుపట్టు. ఉద్యోగులు, కార్మికులతో పాటు అన్ని వర్గాలు ప్రజలను నియోజకవర్గం కలిగి ఉంది. ప్రస్తుత ఎన్నికల వేళ పశ్చిమ ముఖచిత్రాన్ని ఓసారి పరిశీలిద్దాం. సాక్షి, గోపాలపట్నం: విశాఖ పశ్చిమ నియోజకవర్గం.. హిందుస్ధాన్ షిప్‌యార్డు, హెచ్‌పీసీఎల్, కోరమాండల్ తదితర పరిశ్రమల పుట్టినిల్లు. పెద్ద సంఖ్యలో వలస ప్రజలకు బతుకుపెడుతున్న గడ్డ ఇది. ఒకప్పటి పెందుర్తి నియోజకవర్గం, రెండో నియోజకవర్గంలో మహామహులు ఏలిన ప్రాంతం ఇది. ఎందర్నో చట్టసభలకు పంపిన రాజకీయ కేంద్రం పశ్చిమ. ఇంత వరకూ ఒకరికి మంత్రి యోగం కల్పించగా, ఇద్దరు మహిళామణులకు ఎమ్మెల్యే ఛాన్స్ ఇచ్చిన ప్రాంతం ఇది. నేతల పరంపర విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఏర్పాటు కాక పూర్వం అటు పెందుర్తి నియోజకవర్గంలోనూ, ఇటు రెండో నియోజకవర్గం నుంచి మహాహహులేలారు. బాజీ జంక్షన్, బుచ్చిరాజుపాలెం నుంచి కంచరపాలెం, జ్ఞానాపురం, అటు మాధవధార, దొండపర్తి, చినవాల్తేరు, పెదవాల్తేరు, ఎంవీపీ కాలనీ వరకూ రెండో నియోజకవర్గమే. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా వాసుదేవరావు (టీడీపీ), రాజాన రమణి (టీడీపీ), పల్లా సింహాచలం (టీడీపీ), పిన్నింటి వరలక్ష్మి (టీడీపీ), సూరెడ్డి (కాంగ్రెస్), రంగరాజు (కాంగ్రెస్) పని చేశారు. ఇంకోవైపు బాజీజంక్షన్ నుంచి గోపాలపట్నం, పెందుర్తి మండలం, అటు సింహాచలం, ఆరిలోవ, మధురవాడ వరకూ పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉండేవి. పెందుర్తి నియోజకవర్గం అప్పటి తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద నియోజకవర్గాల్లో రెండో స్ధానంలో ఉండేది. ఇక్కడ ఎమ్మెల్యేలుగా గుడివాడ అప్పన్న (కాంగ్రెస్), పెతకంశెట్టి అప్పలనరసింహం (టీడీపీ), ఆళ్ల రామచంద్రరావు(టీడీపీ), గుడివాడ గురునాథరావు(కాంగ్రెస్), మానం ఆంజనేయులు (సీపీఐ), గణబాబు(టీడీపీ), తిప్పలగురుమూర్తిరెడ్డి (కాంగ్రెస్) పని చేశారు. అసెంబ్లీలో అడుగుపెట్టాక ఇంత మందిలో ఒకరికే మంత్రి యోగం వరించింది. గుడివాడ గురునాథరావు సాంకేతిక విద్యాశాఖమంత్రిగా పని చేశారు. తర్వాత నుంచి ఎవరికీ ఆయోగం రాలేదు. ఓటర్ల వివరాలు మొత్తం ఓటర్లు 2,11,372 పురుష ఓటర్లు 1,09,899 మహిళా ఓటర్లు 1,01,469 పోలింగ్ బూత్‌లు 237 వార్డులు 13 ఇద్దరు మహిళలకు ఛాన్స్ పునర్విభజనకు ముందు రెండో నియోజకవర్గ ఎమ్మెల్యేల్లో ఇద్దరికి చట్టసభలో కూర్చునే ఛాన్స్ వరించింది. తొలిసారిగా టీడీపీ ఎమ్మెల్యేగా రాజాన రమణికి, తర్వాత కాలంలో పిన్నింటి వరలక్ష్మికి ఎమ్మెల్యేగా పని చేసే అవకాశం పొందారు. టీడీపీ ఎమ్మెల్యే గణబాబుకి రెండుమార్లు ఎమ్మెల్యేగా చేసే అవకాశం ఈ ప్రాంతం నుంచే వచ్చింది. ఒకప్పుడు పెందుర్తి ఎమ్మెల్యేగా, తర్వాత పశ్చిమ ఎమ్మెల్యేగా పని చేసే ఛాన్స్ పొందారు. పునర్విభజన తర్వాత.. పశ్చిమ నియోజకవర్గం పుట్టి పదేళ్లయింది. అంతకు ముందు ఈప్రాంతం పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉండేది. 2009లో తొలిఎన్నిక జరిగింది. తర్వాత 2014లో ఎన్నిక జరిగింది. తాజాగా 2019 ఎన్నికలకు సిద్ధం అయింది.. ఈ నియోజకవర్గం బీసీ రిజర్వేషన్‌గా ఉంది. ఒక సారి 2009లో తాజా ఎమ్మెల్యే గణబాబు అప్పట్లో పీఆర్పీ అభ్యర్థిగా (40,874 ఓట్లు వచ్చాయి). కాంగ్రెస్ అభ్యర్థి మళ్ల విజయప్రసాద్ (45,018 ఓట్లతో ) గెలుపొందారు. తర్వాత 2014లో టీడీపీ అభ్యర్థిగా గణబాబు 76,791 ఓట్లు సాధించారు. తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థి విజయప్రసాద్ (తాజా వైస్సార్ సీపీ) గెలుపొందగా ఇపుడు టీడీపీ ఎమ్మెల్యే గణబాబు అధికారంలో ఉన్నారు. ఇప్పటికి వరకూ అత్యధిక మెజారిటీ గణబాబే సాధించారు. వార్డుల వారీగా.. పశ్చిమ నియోజకవర్గంలో పోలింగ్ బూత్‌లు 237 ఉన్నాయి. కంచరపాలెం, గోపాలపట్నం, మల్కాపురంలు సమస్యాత్మక ప్రాంతాలు మారాయి. గోపాలపట్నం, ములగాడ మండలాలు. అందులో వార్డులు 36,40, 41 నుంచి 49 వార్డులు, 66 నుంచి 68వార్డులు నెలకొన్ని ఉన్నాయి. వలస జీవుల ఆవాసం పూర్వం కులాల వారిగా ఊళ్లు ఉండేవి. ఇప్పుడు వలసలు పెరిగిపోయాయి. స్థానికులతోపాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల జనం ఇక్కడ బతుకుదెరువు కోసం వచ్చి నివాసాలు ఉంటున్నారు. ఇక్కడి కొండవాలు మురికివాడల జనం, పారిశ్రామిక వాడలో వలస జనం, కార్మికులు, కూలీలు గెలుపోటములకు ప్రభావితం చూపుతారు. కాపు, గవర, యాదవ, తర్వాత వెలమ, మాల సామాజిక వర్గాల వారు అధికంగా ఉన్నారు. -
అంతర్రాష్ట్ర గంజాయి ముఠా సభ్యుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గంజాయి అంతరాష్ట్ర రవాణా ముఠాలోని ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నం నుంచి ఢిల్లీకి గంజాయిని సరఫరా చేస్తున్నఈ ముఠాలోని ఇద్దరు సభ్యులు రాపురోహిత్, ప్రేమ్‌కుమార్‌ను ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 30 కిలోల గంజాయి, ఒక కారు, రూ.12,000 నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను హయత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. కాగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. -
నల్లధనం వెలికితీసే అస్త్రాలు సిద్ధం
విశాఖ జోన్ ఇన్‌కంటాక్స్ కమిషనర్ ఓంకారేశ్వర్ భానుగుడి (కాకినాడ) : దేశంలో పన్ను పరిధిలోకి రాకుండా బ్లాక్‌మనీ రూపంలో చలామణిలో ఉన్న సొమ్ము రూ.14.5 లక్షల కోట్లని, అందులో రూ.ఎనిమిది లక్షల కోట్లు బ్యాంకు ఖాతాల్లో ఉండగా మిగిలిన నల్లధనాన్ని డిసెంబరు 30 నాటికి ఏ మూలనఉన్నా వెలికితీసేందుకు అస్త్రాలు సిద్ధంగా ఉన్నాయని విశాఖపట్నం జోన్ ఇన్‌కంటాక్స్ కమిషనర్ ఓంకారేశ్వర్ హెచ్చరించారు. సోమవారం స్థానిక మర్చంట్స్ అసోసియేషన్ భవనంలో వ్యాపార సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో నల్లకుబేరులకు పలు హెచ్చరికలు జారీచేశారు. 2017 జనవరి నుంచి జీఎస్టీ బిల్లు అమలు కానుందని, దాచుకున్న నల్లధనాన్ని బయటపెట్టకుంటే కటాకటాల పాలవ్వాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. లక్ష్యంగా పెట్టుకున్న సొమ్ములో రూ.7వేల కోట్లు ఉగ్రవాదుల వద్ద, రూ.700 కోట్లు ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లలో ఉన్న మావోయిస్టుల వద్ద ఉందని ఇది రికవరీ కాదన్నారు. మిగిలినదంతా ఏ రూపంలో ఉన్నా పన్ను పరిధిలోకి తెచ్చేలా చర్యలు ఉంటాయన్నారు. 25 కోట్ల పాన్‌కార్డులు జారీచేస్తే అందులో ఐదుకోట్ల మంది మాత్రమే వాడుతున్నారన్నారు. ప్రభుత్వం తీసుకొనే ప్రతి విధాన నిర్ణయానికి కొందరు మోకాలడ్డుతూ పన్ను ఎగవేద్దామనుకుంటున్నారని, రానున్న చట్టాలతో అడ్డులన్నీ తొలగిపోనున్నట్టు పేర్కొన్నారు. కెన్యాలో 80 శాతం లావాదేవీలన్నీ నగదు రహితమేనని, మున్ముందు మనదేశం యావత్తు అదే తరహా వ్యవస్థ ఏర్పాటు కానుందన్నారు. పన్ను చెల్లించకుండా దాచినది ఏదైనా ( బంగారం, భవనాలు, స్థలాలు) అది బ్లాక్‌మనీ లిస్టులోకే వస్తుందన్నారు. అలా దాచినవారెవరైనా కఠినశిక్షలు అనుభవించక తప్పదని ఓంకారేశ్వర్ హెచ్చరించారు. వ్యాపారస్తులు అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో 300 కోట్ల నగదు స్వాధీన పరుచుకున్న చరిత్ర ఉందన్నారు. ఇక అంతా బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరగనున్నందున దాచినవన్నీ బయటపెట్టి శిక్షల నుంచి తప్పించుకోవాలని సూచించారు. ఈ నగదు రహిత లావాదేవీల కారణంగా పేదప్రజలకు న్యాయం జరుగుతుందని, సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో అర్హులకు అందుతాయన్నారు. ఈ సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గ్రంధినారాయణరావు(బాబ్జీ), పలు వ్యాపార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
విశాఖపై నయీం నీడ
ప్రత్యేక దర్యాప్తు బందం వద్ద సమాచారం నిగ్గు తేల్చేందుకు నగరానికి వచ్చిన ‘సిట్’ ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులతో భేటీ ఫ్లాట్‌ఫారాల ఫుటేజీ స్వాధీనం గోదావరి, దురంతో రైళ్ల ఫస్ట్ ఏసీ ప్రయాణికుల జాబితాల పరిశీలన గ్యాంగ్‌స్టర్ నయీం తన వికృత క్రీడను విశాఖకూ విస్తరించాలని భావించాడా?.. ఇప్పటికే విస్తరించాడా??.. పలుమార్లు నగరానికి రాకపోకలు సాగించాడా???.. రాకపోకలు సాగించడం నిజమేనని ఇతని కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బందానికి లభించిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.. అయితే తన నేరసామ్రాజ్యాన్ని ఇక్కడ విస్తరించాడా లేక విస్తరించాలని భావించాడా.. అన్నది మాత్రం స్పష్టం కాలేదు. దాన్ని నిగ్గు తేల్చేందుకు సిట్ అధికారులు కొందరు విశాఖ వచ్చారని అత్యంత విశ్వసనీయ సమాచారం. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారాల ఫుటేజీ.. గత కొన్ని నెలల ప్రయాణికుల రిజర్వేషన్ చిట్టాలు సేకరించినట్లు.. ఆర్పీఎఫ్ అధికారులతో మాట్లాడి ఇతర వివరాలపై కూపీ లాగినట్టు సమాచారం. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఇటీవల పోలీస్ ఎన్కౌంటర్లో హతమైన కరడుగట్టిన నేరస్తుడు, గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో కూడా నేరసామ్రాజాన్ని విస్తరించాలని చూశాడని.. ఆ మేరకు గత రెండు, మూడు నెలల కాలంలో పలుమార్లు విశాఖ నగరానికి వచ్చి వెళ్లాడని నయీం అరాచకాలపై విచారణ చేపట్టిన సిట్ అధికారులకు కొన్ని ఆధారాలు లభించాయి. దాంతో వాటిని నిర్థారించుకునేందుకు ఆదివారం అత్యంత రహస్యంగా వారు విశాఖకు వచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడే ఉన్న అధికారులు ప్రధానంగా రైల్వేస్టేషన్లో దృష్టి సారించారు. ఆర్పీఎఫ్, రైల్వే పోలీసు, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. గత రెండు, మూడు నెలల కాలంలో నయీం పలుమార్లు విశాఖకు వచ్చాడన్న నిర్థారణకు వచ్చారు. అయితే ఇక్కడకు ఎందుకు వచ్చాడు.. ఏ పనిమీద ఎవరిని కలిసేందుకు వచ్చాడు.. అనే పక్కా సమాచారం కోసం కూపీలాగారు. విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే గోదావరి, దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్ల రిజర్వేషన్ జాబితాలు తీసుకున్నారు. ప్రధానంగా ఏసీ ఫస్ట్, సెకండ్ క్లాస్ బోగీల ప్రయాణికుల జాబితాలను పరిశీలించారు. వాటిలో నయీం, అతని అనుచరుల పేర్లు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించారు. సీసీ ఫుటేజీల స్వాధీనం గోదావరి, దురంతో రైళ్లు రాకపోకలు సాగించే ప్లాట్‌ఫారాల సీసీ ఫుటేజీని కూడా తీసుకువెళ్లారు. సీసీ కెమెరాల నుంచి తీసుకున్న వీడియో ఫుటేజీ ద్వారా నయీం, అతని అనుచరులు విశాఖ వచ్చి, వెళ్లిన సందర్భాల్లో వారిని కలుసుకునేందుకు స్టేషన్‌కు ఎవరెవరు వచ్చారనే విషయమై కూడా సిట్ ందం పరిశీలిస్తోంది. విశాఖ నుంచి హైదరాబాద్‌కు రైళ్లలో ప్రయాణించిన సందర్భాల్లో నయీం నేరుగా సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలో దిగకుండా ముందు స్టేషన్లలోనే దిగిపోయేవాడని సిట్ అధికారుల వద్ద సమాచారముంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఎక్కువగా నిఘా ఉంటుందన్న భావనతో ముందు స్టేషన్లయిన వరంగల్, జనగాం, ఘట్కేసర్లలోనే దిగిపోయేవారని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా స్టేషన్లలో హాల్ట్‌లు ఉన్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలులోనే నయీం ందం ఎక్కువసార్లు ప్రయాణించినట్టు భావిస్తున్నారు. విశాఖ ఎందుకొచ్చినట్టు? హైదరాబాద్ కేంద్రంగా నేరసామాజ్రాన్ని విస్తరించుకున్న నయీం అసలు విశాఖ ఎందుకొచ్చినట్టు.. నవ్యాంధ్ర ఆర్థిక రాజధానిగా మారిన మహానగరంలో ఏ సెటిల్మెంట్లు చేసేందుకు ఇక్కడకు వచ్చాడు.. ఏమైనా దందాలు చేశాడా.. ఇక్కడ పోలీసు అధికారులతో కూడా అతనికి పరిచయాలు ఉన్నాయా.. ఇక్కడ కూడా అతనికి అనుచరులు ఉన్నారా... అన్న కోణాల్లో సిట్ అధికారులు విచారణ చేపట్టినట్టు విశ్వసనీయ సమాచారం. -
9,19 తేదీల్లో సీఎం జిల్లాకు రాక
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 9,19 తేదీల్లో విశాఖ పర్యటనకు రానున్నారు. రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. 9న అరకులో జరగనున్న ఆదివాసీ దినోత్సవంలో పాల్గొంటారు. ఆరోజు రంపచోడవరంలో పర్యటన ముగించుకుని అరకు చేరుకుంటారు. తాను దత్తత తీసుకున్న పెదలగుడు గ్రామంలో పర్యటించే అవకాశం ఉంది. అలాగే 18,19 తేదీలలో విశాఖపట్నంలో రహదారి భద్రతపై జరగనున్న జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమానికి హజరు కానున్నారు. ఈ రెండు రోజుల సదస్సుకు కేంద్ర ఉపరితర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సైతం పాల్గొనున్నారు. -
విశాఖలో ఆక్టోపస్
ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో అప్రమత్తం వచ్చే నెల విశాఖలో సైబర్ క్రై మ్పై ప్రత్యేక సెమినార్ డీజీపీ ఎన్.సాంబశివరావు వెల్లడి సాక్షి, విశాఖపట్నం: పీఎల్‌జిఏ వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు హింసాత్మక చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నందున అప్రమత్తమయ్యామని డీజీపీ ఎన్.సాంబశివరావు అన్నారు. ఇందులో భాగంగా ఆయన బుధవారం విశాఖ మన్యంలో హెలికాఫ్టర్‌లో పర్యటించారు. అనంతరం గ్రేహౌండ్స్ అధికారులు, రూరల్ ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, ఇంటెలిజెన్స్ ఐజీ చంద్రశేఖరరావులతో విశాఖలోని గ్రేహౌండ్స్ కార్యాలయంలో ప్రత్యేకంగా చర్చించారు. నగర పోలీస్ కమిషనరేట్‌ను సందర్శించి కమిషనర్ టి,యోగానంద్‌తో పాటు ఉన్నతాధికారులతో నేర సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మావోయిస్టులు పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీలో భద్రతా ఏర్పాట్లు పరిశీలించి ఉన్నతాధికారులను, ప్రజా ప్రనితిధులను అప్రమత్తం చేశామన్నారు. మావోయిస్టుల ఉ ద్యమం 32 ఏళ్ల క్రితంతో పోల్చితే ఇప్పుడు ఏమంత లేదన్నారు. విశాఖలో గ్రే హౌండ్స్ ఇప్పటికే ఉండగా, ఆక్టోపస్ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నిస్తామన్నారు. సైబర్‌క్రై మ్స్, రాత్రివేళ గహల్లో దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఉన్నట్లు నగర నేర సమీక్షలో గుర్తించామన్నారు. త్వరలోనే కొన్ని కొత్త విధానాలు ప్రవేశపెట్టి వీటిని తగ్గించడానికి ప్రయత్నిస్తామన్నారు. మోసాలు చేసేవాళ్లు ఎక్కువయ్యారని, సాంకేతిక పరిజ్ఙానాన్ని వాడుకొని నేరాలకు పాల్పడుతుంటే అందుకు తగ్గట్టుగా నిందితులను పట్టుకోవడంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ బాగానే పోలీసులు పరిష్కరిస్తున్నారన్నారు. సైబర్ నేరాలను ఎలా అరికట్టాలనేదానిపై వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిపుణులను రప్పించి వర్క్‌షాప్ నిర్వహించున్నట్లు ఆయన వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణా అరికట్టడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని, కొద్ది రోజులుగా వస్తున్న ఆ మార్పు గమనించవచ్చని తెలిపారు. ఊహించని చోట్ల ప్రపంచంలో ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో వారి కదలికలను తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని సాంబశివరావు తెలిపారు. కృష్ణా పుష్కరాలకు 24వేల మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు. డిప్లొమా, ఇంటర్మీడియెట్ చదివిన వారికి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో అవకాశంపై పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. డీజీపీకి సాదర స్వాగతం గోపాలపట్నం : విశాఖ విమానాశ్రయంలో డీజీపీ సాంబశివరావుకు పోలీసు ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. హైదరాబాదు నుంచి వచ్చిన ఆయన్ని పోలీసు కమిషనర్ యోగానంద్, రూరల్ ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, సహాయ పోలీసు కమిషనర్ భీమారావు తదితర అధికారులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. -
విశాఖ స్టేడియానికి టెస్టు హోదా
ముంబై: విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ -వీడీసీఏ క్రికెట్ స్టేడియానికి టెస్టు హోదా కల్పిస్తూ బీసీసీఐ వార్షిక సభ్య సమావేశం (ఏజీఎం)లో నిర్ణయం తీసుకున్నారు. శశాంక్ మనోహర్ అధ్యక్షతన సోమవారం జరిగిన బీసీసీఐ వార్షిక సభ్య సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో కొత్తగా విశాఖతో పాటు రాంచీ, ఇండోర్, రాజ్ కోట్, పుణే స్టేడియాలకు టెస్టు హోదా కల్పించారు. దీంతో పాటు టీమిండియా డైరెక్టర్ గా ఉన్న రవిశాస్త్రిని ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) గవర్నింగ్ కౌన్సిల్ నుంచి తొలగించారు. ఐపీఎల్ చైర్మన్ గా ఉన్న రాజీవ్ శుక్లాను తిరిగి అదే స్థానంలో కొనసాగించాలని వార్షిక సర్వ సభ్య సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటివరకూ భారత జట్టు సెలెక్టర్లుగా ఉన్న రోజర్ బిన్నీ, రాజేందర్ సింగ్ లకు ఉద్వాసన పలకగా, వారి స్థానంలో సౌత్ జోన్ నుంచి ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ ఖోడాలను నియమించారు. బీసీసీఐ టెక్నికల్ కమిటీ చైర్మన్ గా అనిల్ కుంబ్లే స్థానంలో సౌరభ్ గంగూలీని నియమించారు. -
త్వరలోనే మార్కెట్లోకి ఆంధ్రా ఆపిల్
-
కొండంత అండ
-
విశాఖలో ఆటో ర్యాలీ