సాక్షి, విశాఖపట్నం: ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు(పోలింగ్ రోజు) కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది.
కాగా, ఏపీ వివిధ ప్రాంతాల్లో రాబోయే అయిదు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే, నేడు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్టు తెలిపింది.
Weather update 12th May,2023#AndhraPradesh & #Telangana:
North AP , central AP -central,west TG will get scattered thunderstorms today.#TamilNadu : west & south interior TN and parts of Delta TN will get scattered thunderstorms, coastal TN will tomorrow early morning rains pic.twitter.com/KbLZe7L6Xg— Eastcoast Weatherman (@eastcoastrains) May 12, 2024
ఇక, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఆదివారం కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment