9,19 తేదీల్లో సీఎం జిల్లాకు రాక | cm visit visaka | Sakshi
Sakshi News home page

9,19 తేదీల్లో సీఎం జిల్లాకు రాక

Published Tue, Aug 2 2016 12:20 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

cm visit visaka

సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 9,19 తేదీల్లో విశాఖ పర్యటనకు రానున్నారు. రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. 9న అరకులో జరగనున్న ఆదివాసీ దినోత్సవంలో పాల్గొంటారు. ఆరోజు రంపచోడవరంలో పర్యటన ముగించుకుని అరకు చేరుకుంటారు. తాను దత్తత తీసుకున్న పెదలగుడు గ్రామంలో పర్యటించే అవకాశం ఉంది. అలాగే 18,19 తేదీలలో విశాఖపట్నంలో రహదారి భద్రతపై జరగనున్న జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమానికి హజరు కానున్నారు. ఈ రెండు రోజుల సదస్సుకు కేంద్ర ఉపరితర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సైతం పాల్గొనున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement