
పంచాయతీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కార్యకర్తలను కూడగట్టేందుకు ఆయన గురువారం కుప్పానికి విచ్చేశారు. మొదట గుడుపల్లె మండలంలో పర్యటించిన చంద్రబాబుకు ఊహించని దెబ్బ తగిలింది.
సాక్షి, తిరుపతి: కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం విచ్చేసి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అర్ధంతరంగా పర్యటన ముగించుకుని తిరుగుప్రయాణమయ్యారు. పార్టీ శ్రేణులు తూటాల్లా సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ముఖం చాటేశారని పలువురు కార్యకర్తలు బహిరంగంగా చెప్పుకోవడం కనిపించింది.
పంచాయతీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కార్యకర్తలను కూడగట్టేందుకు ఆయన గురువారం కుప్పానికి విచ్చేశారు. మొదట గుడుపల్లె మండలంలో పర్యటించిన చంద్రబాబుకు ఊహించని దెబ్బ తగిలింది. కార్యకర్తలకు మీరేం చేశారు అంటూ పలువురు పార్టీ నేతలు నిలదీయడంతో షాక్‌కు గురయ్యారు. ఆపై శుక్రవారం కూడా ఇదే అనుభవం ఎదురవడంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక మూడు రోజుల పర్యటనను మధ్యలోనే నిలిపేశారు. బాబు పర్యటనలో అడుగడుగునా జూనియర్ ఎన్టీఆర్ పేరు మార్మోగడం విశేషం.
చదవండి:
కనిపించని తమ్ముళ్లు.. టీడీపీ డీలా!
బాబు బూతు పురాణం: రెచ్చగొట్టి.. రచ్చచేసి!