విశాఖపై నయీం నీడ | Nayeem shadow in Visaka | Sakshi
Sakshi News home page

విశాఖపై నయీం నీడ

Published Tue, Aug 16 2016 1:21 AM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM

విశాఖపై నయీం నీడ - Sakshi

విశాఖపై నయీం నీడ

  • ప్రత్యేక దర్యాప్తు బందం వద్ద సమాచారం
  • నిగ్గు తేల్చేందుకు నగరానికి వచ్చిన ‘సిట్‌’
  • ఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారులతో భేటీ
  • ఫ్లాట్‌ఫారాల ఫుటేజీ స్వాధీనం
  • గోదావరి, దురంతో రైళ్ల ఫస్ట్‌ ఏసీ ప్రయాణికుల జాబితాల పరిశీలన
  • గ్యాంగ్‌స్టర్‌ నయీం తన వికృత క్రీడను విశాఖకూ విస్తరించాలని భావించాడా?.. ఇప్పటికే విస్తరించాడా??.. పలుమార్లు నగరానికి రాకపోకలు సాగించాడా???.. రాకపోకలు సాగించడం నిజమేనని ఇతని కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బందానికి లభించిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.. అయితే తన నేరసామ్రాజ్యాన్ని ఇక్కడ విస్తరించాడా లేక విస్తరించాలని భావించాడా.. అన్నది మాత్రం స్పష్టం కాలేదు. దాన్ని నిగ్గు తేల్చేందుకు సిట్‌ అధికారులు కొందరు విశాఖ వచ్చారని అత్యంత విశ్వసనీయ సమాచారం. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారాల ఫుటేజీ.. గత కొన్ని నెలల ప్రయాణికుల రిజర్వేషన్‌ చిట్టాలు సేకరించినట్లు.. ఆర్పీఎఫ్‌ అధికారులతో మాట్లాడి ఇతర వివరాలపై కూపీ లాగినట్టు సమాచారం.
     
    సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :
     
    ఇటీవల పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో హతమైన కరడుగట్టిన నేరస్తుడు, గ్యాంగ్‌స్టర్‌ నయీముద్దీన్‌ నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో కూడా నేరసామ్రాజాన్ని విస్తరించాలని చూశాడని.. ఆ మేరకు గత రెండు, మూడు నెలల కాలంలో పలుమార్లు విశాఖ నగరానికి వచ్చి వెళ్లాడని నయీం అరాచకాలపై విచారణ చేపట్టిన సిట్‌ అధికారులకు కొన్ని ఆధారాలు లభించాయి. దాంతో వాటిని నిర్థారించుకునేందుకు ఆదివారం అత్యంత రహస్యంగా వారు విశాఖకు వచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు  ఇక్కడే ఉన్న అధికారులు ప్రధానంగా రైల్వేస్టేషన్‌లో దృష్టి సారించారు. ఆర్‌పీఎఫ్, రైల్వే పోలీసు, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. గత రెండు, మూడు నెలల కాలంలో నయీం పలుమార్లు విశాఖకు వచ్చాడన్న నిర్థారణకు వచ్చారు. అయితే ఇక్కడకు ఎందుకు వచ్చాడు.. ఏ పనిమీద ఎవరిని కలిసేందుకు వచ్చాడు.. అనే పక్కా సమాచారం కోసం కూపీలాగారు. విశాఖ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే గోదావరి, దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రిజర్వేషన్‌ జాబితాలు తీసుకున్నారు.  ప్రధానంగా  ఏసీ ఫస్ట్, సెకండ్‌ క్లాస్‌ బోగీల ప్రయాణికుల జాబితాలను పరిశీలించారు. వాటిలో నయీం, అతని అనుచరుల పేర్లు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించారు. 
     
    సీసీ ఫుటేజీల స్వాధీనం
    గోదావరి, దురంతో రైళ్లు రాకపోకలు సాగించే ప్లాట్‌ఫారాల సీసీ ఫుటేజీని కూడా తీసుకువెళ్లారు. సీసీ కెమెరాల నుంచి తీసుకున్న వీడియో ఫుటేజీ  ద్వారా  నయీం, అతని అనుచరులు విశాఖ వచ్చి, వెళ్లిన సందర్భాల్లో వారిని కలుసుకునేందుకు స్టేషన్‌కు ఎవరెవరు వచ్చారనే విషయమై కూడా సిట్‌ ందం పరిశీలిస్తోంది. విశాఖ నుంచి హైదరాబాద్‌కు రైళ్లలో ప్రయాణించిన సందర్భాల్లో నయీం నేరుగా సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలో దిగకుండా ముందు స్టేషన్లలోనే దిగిపోయేవాడని సిట్‌ అధికారుల వద్ద సమాచారముంది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లో ఎక్కువగా నిఘా ఉంటుందన్న భావనతో ముందు స్టేషన్లయిన వరంగల్, జనగాం, ఘట్‌కేసర్‌లలోనే దిగిపోయేవారని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా స్టేషన్లలో హాల్ట్‌లు ఉన్న  గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలులోనే నయీం ందం ఎక్కువసార్లు  ప్రయాణించినట్టు  భావిస్తున్నారు.
     
    విశాఖ ఎందుకొచ్చినట్టు?
    హైదరాబాద్‌ కేంద్రంగా నేరసామాజ్రాన్ని విస్తరించుకున్న నయీం అసలు విశాఖ ఎందుకొచ్చినట్టు.. నవ్యాంధ్ర ఆర్థిక రాజధానిగా మారిన మహానగరంలో ఏ సెటిల్‌మెంట్లు చేసేందుకు ఇక్కడకు వచ్చాడు.. ఏమైనా దందాలు చేశాడా.. ఇక్కడ పోలీసు అధికారులతో కూడా అతనికి పరిచయాలు ఉన్నాయా.. ఇక్కడ కూడా అతనికి అనుచరులు ఉన్నారా... అన్న కోణాల్లో సిట్‌ అధికారులు విచారణ చేపట్టినట్టు విశ్వసనీయ సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement