gangstar
-
గోల్డీని ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ: కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ సతీందర్‌జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్‌ను కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఉగ్రవాద వ్యతిరేక ఉపా చట్టం కింద అతడిని ఉగ్రవాది ప్రకటిస్తున్నట్లు హోం శాఖ సోమవారం తెలిపింది. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇతడు మాస్టర్ మైండ్‌గా ఉన్నాడు. పాకిస్తాన్ దన్నుతో కార్యకలాపాలు సాగిస్తున్న ఇతడికి పలు హత్య కేసులతో సంబంధం ఉందని హోం శాఖ నోటిఫికేషన్లో తెలిపింది. పంజాబ్‌లోని శ్రీముక్త్సర్ సాహిబ్‌కు చెందిన బ్రార్ ప్రస్తుతం కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉంటున్నాడు. ఇతడిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. -
ఇది యోగి మార్క్.. గ్యాంగ్‌స్టర్ భూమిలో పేదల కోసం ఇళ్లు
ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ గత ఏప్రిల్‌లో హత్యకు గురైన విషయం విదితమే. కాగా ప్రభుత్వం అతని నుంచి స్వాధీనం చేసుకున్న భూమిలో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఈ ఇళ్లను లాటరీ ద్వారా అర్హులకు కేటాయించారు. ప్రయాగ్‌రాజ్: గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన అతీక్ అహ్మద్ నుంచి స్వాధీనం చేసుకున్న భూమిలో పేదల కోసం నిర్మించిన 76 ఫ్లాట్ల కేటాయింపునకు సంబంధించి లాటరీ తీశారు. ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగింది. ఈ లాటరీలో ఎన్నికైనవారికి ఫ్లాట్లను అప్పగించనున్నారు. ప్రయాగ్‌రాజ్ డెవలప్మెంట్ ఆథారిటీ(పీడీఏ) ఉపాధ్యక్షుడు అరవింద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అలహాబాద్ మెడికల్ అసోసియేషన్‌కు చెందిన హాలులో పేదలకు ఫ్లాట్లను కేటాయించేందుకు లాటరీ తీశామన్నారు. మొత్తం దరఖాస్తు చేసుకున్న 6,030 మందిలో నుంచి 1590 మందిని లాటరీలో పాల్గొనేందుకు అర్హులుగా గుర్తించామన్నారు. లబ్ధిదారులకు 41 స్క్వేర్ మీటర్లలో నిర్మితమైన ఫ్లాట్ రూ. 3 లక్షల 50 వేలకు అందజేయనున్నామన్నారు. 2021లో శంకుస్థాపన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రెండు గదులు కలిగిన ఈ ఫ్లాట్‌లో ఒక వంటగది, టాయిలెట్ ఉంటుందన్నారు. ఈ ఫ్లాట్ ఖరీదు రూ. 6 లక్షల రూపాయలని తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌లోని లూకర్‌గంజ్ పరిధిలోని అతీక్ నుంచి స్వాధీనం చేసుకున్న 1731 స్క్యేర్ మీటర్ల భూమిలో సరసమైన గృహ నిర్మాణ ప్రాజెక్టుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2021 డిసెంబరు 26న శంకుస్థాపన చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)కింద ఈ ప్రాజెక్టు చేపట్టింది. చదవండి: మహారాష్ట్ర రాజకీయంలో కలకలం UP: Flats built on land confiscated from slain gangster Atiq Ahmed allotted to poor in Prayagraj Read @ANI Story | https://t.co/VwutaCV8NN#Prayagraj #atiqahmad #UttarPradesh pic.twitter.com/y0fCo4mhGn — ANI Digital (@ani_digital) June 9, 2023 ముఖ్యమంత్రి యోగి చేతుల మీదుగా.. ఈ ప్రాంతంలో రెండు బ్లాకులుగా మొత్తం 76 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం పూర్తయ్యాక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అర్హులైన పేదలకు ఈ ఇళ్లను అప్పగించనున్నారు. అతీక్ అహ్మద్ 2005లో జరిగిన బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే రాజూపాల్ హత్య, ఈ కేసులో ప్రత్యక్ష్య సాక్షి ఉమేష్ పాల్ హత్య కేసులలో ప్రధాన నిందితుడు. కాగా అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్‌లను ఈ ఏడాది ఏప్రిల్ 15న రాత్రి విలేకరుల రూపంలో వచ్చిన ఆగంతకులు తుపాకీతో కాల్చి చంపారు. అతీక్ అహ్మద్‌ను పోలీసులు వైద్య పరీక్షల కోసం తీసుకెళుతుండగా ఈ ఘటన జరిగింది. చదవండి: విదేశాల్లోని భారతీయులకు ఓటుహక్కు! -
టిల్లుపై కత్తులతో దాడి చేసిన ఖైదీలు
-
Umesh Pal kidnapping case: గ్యాంగ్‌స్టర్ అతిక్‌ని దోషిగా తేల్చిన కోర్టు!
2006 ఉమేష్‌పాల్ కిడ్నాప్ కేసులో గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్‌ను ప్రయాగ్‌రాజ్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. అతిక్‌తోపాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ కేసులో అతిక్ అహ్మద్ సోదరుడు ఖలీద్ అజీమ్ అలియాస్ అష్రఫ్ సహా మరో ఏడుగురిని నిర్ధోషులుగా ప్రకటించింది. 2006లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో కీలక సాక్షి ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో కీలక నిందితులుగా ఉన్న అతిక్, అతని సోదరుడిని నేడు ప్రయాగ్‌రాజ్ కోర్టు ముందు హజరు పరిచారు. కాగా యూపీ పోలీసు కస్టడీలో తన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆరోపిస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిని అత్యున్నత ధర్మాసనం తిరస్కరించింది. ఇది ఈ కోర్టు జోక్యం చేసుకునే కేసు కాదని తేల్చి చెప్పింది. దీనికోసం కావాలంటే హైకోర్టుని ఆశ్రయించమని చెప్పింది. ఈ మేరకు అతిక్ అహ్మద్, అతని సోదరుడిని భారీ భద్రత మధ్య ప్రయాగ్‌రాజ్‌లోని నైని సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు యూపీ పోలీసులు. భారీ బందోబస్తు నడుమ అతిక్ అహ్మద్‌ను ప్రయాగ్‌రాజ్‌లోని కోర్టుకు తరలించారు. ఇదిలా ఉండగా, 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు తానే సాక్షినని ఉమేష్‌పాల్ పోలీసులను ఆశ్రయించాడు. 2006లో ఉమేష్ పాల్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోమంటూ అతిక్ ఒత్తిడి చేశాడు. అందుకు నిరాకరించడంతో కిడ్నాప్ చేసేందుకు యత్నించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఉమేష్. ఐతే అతను కిడ్నాప్ కేసు విచారణ రోజే పట్టపగలే అనూహ్యంగా హత్యకు గురయ్యాడు. దీంతో ఈ కేసు విషయమై అతిక్ అహ్మద్, అతని సోదరుడి తోసహా మరో నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. (చదవండి: జైలు నుంచి రాను..ఆ శిక్ష ఏదో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విధించండి) -
స్టార్ హీరోకు మరోసారి బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ ఖాన్‌కు గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ నుంచి బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. తాజాగా వచ్చిన బెదిరింపులపై సల్మాన్ ఖాన్ బృందం ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి ప్రస్తావించిన సల్మాన్ ఖాన్ సన్నిహితుడు ప్రశాంత్ గుంజాల్కర్‌కు శనివారం బెదిరింపు మెయిల్ వచ్చింది. అందులో నటుడిని చంపడమే తన జీవిత లక్ష్యమని గ్యాంగ్‌స్టర్ పేర్కొన్నాడు. ఈ-మెయిల్‌కు సంబంధించిన బెదిరింపులపై గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ-మెయిల్లో ఏముంది? సల్మాన్ ఖాన్ సన్నిహితుడు ప్రశాంత్ గుంజాల్కర్‌కు బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తి రోహిత్ గార్గ్ అని తేలింది. తాజా బెదిరింపులతో గార్గ్, గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్‌లపై సల్మాన్ ఖాన్ బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సల్మాన్ ఖాన్‌తో మాట్లాడాలనుకుంటున్నాడని ఈ-మెయిల్లో పేర్కొన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అందులో సల్మాన్ ఖాన్‌ను చంపడమే తన జీవిత లక్ష్యమని చెప్పారని ప్రస్తావించారు. గతంలోనూ బెదిరింపుల లేఖ గతంలో సల్మాన్ ఖాన్‌కు ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలా హత్య కేసులో ప్రధాన నిందితుడైన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. అప్పట్లో మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో సల్మాన్ భద్రతను కూడా పెంచింది. తాజాగా బెదిరింపులతో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. కృష్ణజింకల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్‌ఖాన్‌ని హత్య చేస్తానంటూ 2018లో కోర్టు ఆవరణలోనే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రకటించాడు. గతంలో సల్మాన్ హత్యకు కుట్ర పన్నారని వార్తలు కూడా వచ్చాయి. సింగర్ సిద్ధూ హత్య తర్వాత కొందరు దుండగులు సల్మాన్ ఖాన్‌తోపాటు ఆయన తండ్రి సలీం ఖాన్‌ను చంపేస్తామని లేఖ ద్వారా బెదిరించారు. -
‘రూ.కోటి సిద్ధం చేసుకో లేదా..’ గ్యాంగ్‌స్టర్ ఫోన్.. చివర్లో అదిరే ట్విస్ట్!
చండీగఢ్: అపరిచితులు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసే సంఘటనలు చాలా సినిమాల్లో కనిపిస్తుంటాయి. అదే విధంగా ఓ గ్యాంగ్‌స్టర్ ఓ వ్యక్తికి ఫోన్ చేసి రూ.1 కోటి సిద్ధం చేసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని బెదిరించాడు. చిరు వ్యాపారం చేసుకునే ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించటంతో అసలు విషయం బయటపడింది. ఆ వ్యక్తికి కాల్ చేసింది అతడి మనవడే. ఈ సంఘటన పంజాబ్‌లోని పటాన్‌కోట్‌లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఫిర్యాదు దారు తన దుకాణం నుంచి ఇంటికి తిరిగి వచ్చి రాత్రి 8.50 గంటల ప్రాంతంలో టీవీ చూస్తుండగా ఫోన్ కాల్ వచ్చింది. తాను ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నానని, తనకు ‘ఖోఖా’ (రూ.1కోటి) ఇవ్వాలని లేదా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని బెదిరించాడు. ఆ మాట విని ఆందోళన చెందిన పెద్దాయన వెంటనే ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేశాడు. దీంతో భయాందోళన చెందిన ఆ వృద్ధుడు కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారి ప్రోత్సాహంతో షాపుర్ కండీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘నేను ఆశ్చర్యపోయా, నేను పెద్ద వ్యాపారవేత్తను కాదు. నాకు భూములు, ఇతర ఆస్తులు లేవు. గ్యాంగ్ స్టర్ నాకేందుకు ఫోన్ చేశాడని ఆశ్చర్యమేసింది.’ అని బాధితుడు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్ నంబర్ ఆధారంగా గ్యాంగ్‌స్టర్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. అతడు బాధితుడి మనవడే అని తేలింది. తన తాతను బెదిరించేందుకు కొత్త సిమ్ కొనుగోలు చేసినట్లు గుర్తించామని డిప్యూటీ సబ్ ఇన్స్పెక్టర్ రాజిందర్ మంహాస్ తెలిపారు. నిందితుడిపై పలువు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఇదీ చదవండి: పెళ్లింట విషాదం: రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి.. వరుడి పరిస్థితి విషమం -
సల్మాన్ ఖాన్‌కు భద్రత మరింత పెంపు.. ఆ బెదిరింపులే కారణం..!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు పోలీసుల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. తాజాగా ఆయనకు వై+ కేటగిరీలో ముంబై పోలీసులు భద్రత కల్పించారు. గతంలో సల్మాన్ ఖాన్‌కు ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలా హత్య కేసులో ప్రధాన నిందితుడైన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు లేఖ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో సల్మాన్ భద్రతను మరింత పటిష్ఠం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. (చదవండి: జెనీలియా మూవీపై దర్శకుడు సంచలన ఆరోపణలు.. !) సిద్ధూ మూసేవాలా హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కృష్ణజింకల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్‌ఖాన్‌ని హత్య చేస్తానంటూ 2018లో కోర్టు ఆవరణలోనే ఈ గ్యాంగ్‌స్టర్ ప్రకటించాడు. గతంలో సల్మాన్ హత్యకు కుట్ర పన్నారని వార్తలు కూడా వచ్చాయి. సింగర్ సిద్ధూ హత్య తర్వాత కొందరు దుండగులు సల్మాన్ ఖాన్‌తోపాటు ఆయన తండ్రి సలీం ఖాన్‌ను చంపేస్తామని లేఖ ద్వారా బెదిరించారు. లేఖను సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు ఆయనకు భద్రతను మరింత పెంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు సల్మాన్ ఇంటి వద్ద అదనపు సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. -
సల్మాన్ ఖాన్‌ను మా వర్గం ఎప్పటికి క్షమించదు: గ్యాంగ్‌స్టర్ లారెన్స్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను తమ వర్గం ఎప్పటికి క్షమించదని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. పంజాబి సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యా కేసులో లారెన్స్ బిష్ణోయ్ జైలు శిక్ష ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింగర్ హత్యా కేసులో పోలీసులు ప్రస్తుతం అతడిన విచారిస్తున్నారు. ఈ సందర్భంగా లారెన్స్ పలు సంచలన విషయాలు వెల్లడించాడు. చదవండి: ఆస్పత్రి నుంచి హీరో విక్రమ్ డిశ్చార్జి.. పాత వీడియో వైరల్ చేస్తున్న ఫ్యాన్స్ ‘కృష్ణజింక హత్యకు సంబంధించి మా వర్గం ఎప్పటికీ సల్మాన్‌ను క్షమించదు. అతడు ఈ విషయంలో బహిరంగ క్షమాపణ చెబితేనే క్షమిస్తాం’ అని లారెన్స్ పేర్కొన్నట్లు ఢిల్లీ పోలీసలు చెప్పారు. కాగా జోధ్‌పూర్ అడవి సమీపంలో కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ దోషిగా తేలిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సల్మాన్‌కు కోర్టు జైలు శిక్ష విధించగా బెయిలుపై బయటకు వచ్చాడు. ఇప్పటికే ఈ కేసులో విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ కేసులో సల్మాన్‌ను చంపేందుకు లారెన్స్ గ్యాంగ్ 2018లో ప్రయత్నించింది. చదవండి: ది వారియర్ షూటింగ్లో దర్శకుడితో కాస్త ఇబ్బంది పడ్డా: కృతిశెట్టి అంతేకాదు ఇటీవల సల్మాన్ ఖాన్ తండ్రితో పాటు ఆయన తరపు లాయర్‌కు కూడా లారెన్స్ గ్యాంగ్ నుంచి హత్యా బెదిరింపు లేఖలు వచ్చాయి. ఇద్దరికీ సిద్ధూ మూసేవాలా గతే పడుతుందని హెచ్చరిక లేఖల్లో పేర్కొన్నారు. ఈ బెదిరింపులపై ఢిల్లీ పోలీసులు లారెన్స్‌ను ప్రశ్నించగా, అతడు ఈ విషయాలు వెల్లడించినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా లారెన్స్ బిష్ణోయ్ కమ్మునిటీలో కృష్ణ జింకను దైవంగా భావిస్తారట. ఈ నేపథ్యంలో బిష్ణోయ్, సల్మాన్‌ను టార్గెట్ చేశాడు. -
మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ ఆటకట్టించిన పోలీసులు..
పట్నా: గత కొంత కాలంగా బిహర్ పోలీసులకు కంటిమీదకునుకు లేకుండా చేసిన గ్యాంగ్‌స్టర్ మున్న మిశ్రాను బిహర్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. యూపీకి చెందిన మిశ్రాను దేవోరియా ప్రాంతంలో యూపీ, బిహర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిందితుడిపై ఇప్పటికే అనేక హత్యలకు సంబంధించిన కేసులు, కిడ్నాప్‌లు, లూటీ కేసులు ఉన్నాయని తెలిపారు. మున్న మిశ్రా ఆచూకీని తెలియజేస్తే యాభైవేలు ఇస్తామని గతంలోనే యూపీ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, విశ్వసనీయ సమాచారం మేరకు.. యూపీలోని దియోవరియా ప్రాంతంలోని ఒక ఇంట్లో మున్న మిశ్రా ఉన్నట్లు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత దాడిచేసి అతడిని అదుపులోని తీసుకున్నామని యూపీ పోలీసులు పేర్కొన్నారు. నిందితుని దగ్గర నుంచి ఏకే 47 రైఫిల్ గన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా, యూపీలోనే మరొక గ్యాంగ్‌స్టర్ బదన్ సింగ్‌కు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగిన మరుసటి రోజే మిశ్రాను పట్టుకున్నామని అధికారులు పేర్కొన్నారు. బదన్ సింగ్‌పై కూడా ఒక లక్ష రూపాలయల రివార్డు ఉందని తెలిపారు. కాగా, పోలీసులు ఆగ్రా, రాజస్థాన్ బార్డర్లో తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అనుమానస్పదంగా ఉండటాన్ని గమనించారు. వారి వద్దకు చేరుకునేలోపే.. పోలీసులుపై కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు కాల్పులలో నిందితులు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ క్రమంలో వారిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారని అధికారులు తెలియజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యూపీ పోలీసులు తెలిపారు. -
పిట్టల్లా కాల్చేసిన గ్యాంగ్‌స్టర్: రెండు ప్రాణాలు బలి
న్యూఢిల్లీ: పెరోల్ మీద విడుదల అయిన ఓ రౌడీ షీటర్ కాల్పులకు పాల్పడ్డాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే తన భార్యతో పాటు మరొకరిని దారుణంగా తుపాకీతో కాల్చి హత్య చేశాడు.ఈ ఘటనలో ఓ నిండు గర్భిణి, యువకుడు మృతి చెందాడు. ఈ దారుణ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని దక్షిణ నిజాముద్దీన్ ప్రాంతానికి చెందిన డ్రగ్ డీలర్ షరాఫత్ షేక జైలుకు వెళ్లాడు. మూడు రోజుల కిందట పెరోల్‌పై విడుదల అయ్యాడు. వచ్చి రాగానే తన భార్య ఎక్కడుందో ఆచూకీ తెలుసుకుని ఆమె దగ్గరకు వెళ్లాడు ఈ క్రమంలో మంగళవారం భార్య ఉంటున్న ఇంటికి వెళ్లాడు షెరాఫత్. బయట కూర్చున్న భార్య షైనాతో కొద్దిసేపు మాట్లాడి ఆ వెంటనే తనతో తెచ్చుకున్న తుపాకీతో మొదట కాల్చాడు. అయితే పక్కన ఉన్న ఆమె సహాయకుడు వెంటనే షఫత్‌ను నిలువరించే ప్రయత్నం చేశాడు. దీంతో షఫత్ అతడిపై కూడా కాల్పులు జరిపాడు. అనంతరం భార్యపై మళ్లీ నాలుగు, ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆమె చనిపోయేదాక తుపాకీతో పేలుస్తూనే ఉన్నాడు. అడ్డుకోబోయిన వారిని తుపాకీతో బెదిరించాడు. తుపాకీ తూటాలకు బలయిన భార్య షైనా నిండు గర్భిణి. ఇంత కర్కషంగా.. విచక్షణా రహితంగా గర్భిణి అయిన తన భార్యను హతమార్చడం కలకలం రేపింది. అయితే కాపాడేందుకు వచ్చిన వారంతా ప్రాణభయంతో వెనక్కి తిరిగారు. వారిద్దరినీ కాల్చిన అనంతరం దర్జాగా అతడు వెళ్లిపోయాడు. ఇదంతా ఆ ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమరాలో రికార్డయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: మే 2 తర్వాతనే కరోనాపై కేంద్రం కఠిన నిర్ణయం? చదవండి: ‘బరాత్’లో పీపీఈ కిట్‌తో చిందేసిన అంబులెన్స్ డ్రైవర్ -
2కోట్లు వసూలు..ఢిల్లీ పోలీసు అరెస్ట్
న్యూఢిల్లీ : బిల్డర్ నుంచి డబ్బులు లాగేందుకు ఏకంగా గ్యాంగ్‌స్టర్ సహాయాన్ని తీసుకొని కటకటాలపాలయ్యాడు ఏ పోలీసు అధికారి. గతంలో ఈయన ధైర్యసాహసాలకు రాష్ట్రపతి పురస్కారం సహా పలు అవార్డులు అందుకున్నారు. వివరాల ప్రకారం ఢిల్లీకి చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రాజ్బీర్ సింగ్ (48) ఓ బిల్డర్‌ను బెదిరించి 2 కోట్లు వసూలు చేయాలని ప్రణాళిక రచించారు. వెంటనే బిల్డర్ ఫోన్ నెంబర్‌ను గ్యాంగ్‌స్టర్ కాలాకు పంపి ప్లాన్ అమలు చేయమని కోరాడు. బిల్డర్ డబ్బులు ఇవ్వకపోతే అతని కొడుకు కారుపై దాడిచేయమని డెరెక్షన్ కూడా ఇచ్చాడు. కాల్ ఉదంతాన్ని బిల్డర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఐదు నెలల అనంతరం రాజ్బీర్ సింగ్ వ్యవహారం బయటపడింది. దీంతో సింగ్‌తోపాటు గ్యాంగ్‌స్టర్, మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. (33 కేసులు.. 22 సార్లు జైలు.. ) 2005లో రాజ్బీర్ సింగ్ రాష్ట్రపతి పురస్కారంతో పాటు, ఏడుసార్లు అసాధారన్ కార్య పురస్కార్ అవార్డులు అందుకున్నారు. 2015లో అవుట్-ఆఫ్-టర్న్ ప్రమోషన్ కూడా పొందారు. అయితే తాజా వ్యవహారంతో పతకాలు వెనక్కి తీసుకోవాలని పరిశీలిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ అతుల్ కుమార్ ఠాకూర్ అన్నారు. ఇప్పటికే సింగ్‌ను పదవి నుంచి తొలిగించామన్నారు. ఫోన్‌డేటా ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశామని, ఇప్పటికే వారి నుంచి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గ్యాంగ్‌స్టర్ కాలాకు రాజ్బీర్ సింగ్‌తో గత పది, పన్నెండేళ్లుగా పరిచయం ఉన్నట్లు విచారణలో బయటపడిందని పేర్కొన్నారు. అయితే తనపై చేస్తున్న ఆరోపణల్ని రాజ్బీర్ సింగ్ ఖండించారు. తాను నేరం చేశానని నిరూపించడానికి తగిన ఆధారాలు లేవని తెలిపాడు. (200 మీటర్ల సొరంగం; ఆత్మాహుతి దాడికి యత్నం! ) -
వికాస్ దూబే జీవితం ఆధారంగా వెబ్‌సిరీస్
ముంబై: ఇటీవలే ఉత్తర ప్రదేశ్ పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురైన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే జీవితం ఆధారం ఓ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. థ్రీల్లర్ నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్‌కు బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా దర్శకత్వం వహించనున్నాడు. అత్యంత కరుడుగట్టిన నేరస్థుడు వికాస్ దూబే నిజ జీవిత కథ ఆధారంగా చిత్రీకరిస్తున్నందున ఈ సినిమాను తెరకెక్కించేందుకు నిర్మాత శైలేష్ ఆర్ సింగ్ అధికారిక అనుమతులు కూడా పొందినట్లు తెలుస్తోంది. (చదవండి: ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమైన దూబే?!) దీనిపై దర్శకుడు హన్సల్ మెహతా మాట్లాడుతూ... తాము తీయబోయే ఈ థ్రీల్లర్ వెబ్ సిరీస్ అంత్యంత ఆసక్తికరంగా ఉండబోతుందన్నారు. గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఉదంతంలో ఓ పొలిటికల్ థ్రిల్లర్ పాయింట్ ఉందని, దానిని మేము ఈ సినిమాలో చూపించబోతున్నట్లు చెప్పాడు. అది అందరికి ఆశ్చర్యం కలిగిస్తుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. అంతేకాదు ఇది ప్రస్తుత సమాజాన్ని కూడా చూపిస్తుందన్నాడు. ఇటీవల యూపీ పోలీసుల చేతిలో హతమైన వికాస్ దూబే ఎన్కౌంటర్ వార్త సంచలనమైన విషయం తెలిసిందే. ఎనిమిది మంది పోలీసులను కాల్చి చంపిన రోజుల వ్యవధిలోనే పోలీసుల తూటాకు వికాస్ దూబే బలయ్యాడు. (చదవండి: ‘జీపులో ఉన్న అందరిని చంపుతాను’) -
వికాస్ దుబే నెల సంపాదనెంతో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే కేసు విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటకొస్తున్నాయి. దుబే, నెలకు కోటి రూపాయల వరకు సంపాదించేవాడని ఈడీ వర్గాలు తెలిపారు. అయితే ఆ డబ్బులు ఎలా ఖర్చు చేసేవాడు అనే విషయాల మీద ఈడీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. దుబే కి తాగే అలవాటు కూడా లేదు. అంతే కాకుండా అతను చాలా సాధారణమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడేవాడు. ఆడంబరమైన దుస్తులను కూడా ధరించేవాడు కాదు. అంతే కాకుండా విదేశీ ప్రయాణాలు కూడా దుబే చేసేవాడు కాదు. ఇలా అన్ని రకాలుగా చూసిన దుబే అంత డబ్బును ఖర్చు చేయలేడు. మరి ఆ డబ్బంతా ఏమైనట్టు అనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. చదవండి: వికాస్ దుబే వెనుకున్న వారెవరు? దుబే, బ్యాంక్ ఖాతాలో కూడా ఎక్కడ ఎక్కువ డబ్బు ఉన్నట్లు తెలియలేదు. దుబే బ్యాంక్ ఖాతాతో పాటు ఆయన సన్నిహితుల బ్యాంక్ ఖాతాలను కూడా ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో పాటు దుబే ఆ డబ్బుతో ఏమైనా బిజినెస్ చేశారా అనే కోణంలో కూడా ఆయనకు సన్నిహితంగా ఉండే బిజినెస్‌మ్యాన్‌లను కూడా ఆరా తీస్తున్నారు. ప్రతి నెల 90 లక్షల నుంచి 1.2 కోట్ల వరకు సంపాదించే దుబే, ఆ డబ్బును ఏం చేస్తున్నారో తెలియాలంటే ఈడీ విచారణ పూర్తవ్వాల్సిందే. కాన్పూర్‌లో 8 మంది పోలీసులను చంపిన కేసుతో పాటు అనేక కిడ్నాప్‌లు, మర్డర్ల కేసులో కూడా దుబే నిందితుడు. దుబేను జూలై 10వ తేదీన ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: రిపోర్టర్లపై దుబే భార్య ఆగ్రహం -
వికాస్ దూబే మృతి : విచారణకు మాయావతి డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ : పోలీస్ ఎన్కౌంటర్లో గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే మరణించిన ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఈ కేసుపై సర్వోన్నత న్యాయస్ధానం పర్యవేక్షణలో పూర్తిస్ధాయిలో విచారణ జరపాలని ఆమె కోరారు. కాన్పూర్‌లో ఎనిమిది మంది పోలీసులను గ్యాంగ్‌స్టర్ బృందం కాల్చిచంపిన క్రమంలో వారి కుటుంబాలకు న్యాయం జరిగేలా మొత్తం వ్యవహారంపై ఉన్నతస్ధాయి విచారణ చేపట్టాలని మాయావతి డిమాండ్ చేశారు. సమగ్ర దర్యాప్తుతోనే పోలీసులు, నేరస్తులు, రాజకీయ నేతలు కుమ్మక్కైన తీరు బయటకువస్తుందని, దోషులకు శిక్ష పడుతుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలతోనే యూపీ నేరరహిత రాష్ట్రంగా మారుతుందని ఆమె ట్వీట్ చేశారు.మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గురువారం పట్టుబడ్డ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను శుక్రవారం ప్రత్యేక వాహనంలో కాన్పూర్‌కు తరలిస్తుండగా.. పోలీసుల ఎస్కార్ట్‌లోని ఆ వాహనం బోల్తా పడింది. దీనిని అదునుగా తీసుకున్న వికాస్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో గాయపడిన అతడిని కాన్పూర్ ఆస్పత్రికి తరలించగా అతడు మరణించాడు. చదవండి : ‘వికాస్ దూబే హతం : మాకు పండుగ రోజే’ -
దూబే హతం: ‘మాకు పండుగ రోజే’
లక్నో : గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే మరణ వార్తను విన్న ఆయన స్వస్థలం కాన్పూర్‌కు సమీపంలోని బిక్రూ గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వికాస్ దూబే అరాచకాలకు ఇప్పటికి తెరపడిందని వారు సంబరపడుతున్నారు. తమకు కంటిమీద కునుకు లేకుండా చేసిన గ్యాంగ్‌స్టర్ పోలీసుల చేతిలో మరణించాడని తెలుసుకుని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే గ్రామంలో తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన ఎనిమిది మంది పోలీసులను గ్యాంగ్‌స్టర్ దూబే, ఆయన సహచరులు పొట్టనపెట్టుకోవడాన్ని గ్రామస్తులు, సైనికులు గుర్తుచేసుకున్నారు. దూబే అరాచకాలకు తామంతా బాధితులమేనని స్ధానికులు, ఇరుగుపొరుగు వారు వాపోయారు. గతంలో గ్యాంగ్‌స్టర్ వేధింపులపై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని 2013లో ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాసినా ఎలాంటి ఫలితం లేదని స్ధానికులు చెప్పుకొచ్చారు. (వికాస్ దూబే ఎన్కౌంటర్: అనేక అనుమానాలు!) వికాస్ దూబే నేరసామ్రాజ్యం బలహీనపడటం తాము ఎన్నడూ చూడలేదని.. పలువురు రాజకీయ నేతలు ఆయనకు సహకరించేవారని గుర్తుచేసుకున్నారు. ఓ మాజీ మహిళా ఎమ్మెల్యే దూబేకు రాఖీ కట్టి ఆయన తనకు సోదరుడని చెప్పుకున్నారని తెలిపారు. దూబే చిన్నపాటి విషయాలకే తమ తండ్రులు, బంధువులను దారుణంగా కొట్టేవారని, గ్యాంగ్‌స్టర్ ఆయన మనుషులు తమ వీధి వెంట వెళ్లే సమయంలో తాము తలపైకి ఎత్తరాదని, వారికి నమస్తేలు పెట్టడం తప్పనిసరని స్ధానికులు చెప్పుకొచ్చారు. గ్యాంగ్‌స్టర్ పీడ విరగడైన ఈ రోజు తమకు పండుగ రోజు కంటే తక్కువేమీ కాదని సంతోషం వ్యక్తం చేశారు.చివరికి అరాచక శకం ముగిసిందని, భగవంతుడు తమ ప్రార్ధనలను విన్నాడని అన్నారు. రౌడీషీడర్‌పై తాము పోలీసులు, మంత్రులకు ఇచ్చిన ఫిర్యాదులు, వినతిపత్రాల కాపీలను వారు ఓ జాతీయ వెబ్‌సైట్‌కు చూపారు. గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గురువారం పట్టుబడ్డ అతడిని ఈరోజు ప్రత్యేక వాహనంలో కాన్పూర్‌కు తరలిస్తుండగా.. పోలీసుల ఎస్కార్ట్‌లోని ఆ వాహనం బోల్తా పడింది. దీనిని అదునుగా తీసుకున్న వికాస్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో గాయపడిన అతడిని కాన్పూర్ ఆస్పత్రికి తరలించగా అతడు మరణించాడు. వికాస్ దూబేపై హత్య కేసులు సహా మొత్తం 60 క్రిమినల్ కేసుల్లో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నాడని పోలీసులు చెప్పారు. 20 ఏళ్ల కిందట పోలీస్ స్టేషన్లో బీజేపీ ఎమ్మెల్యేను హత్య చేసిన కేసులో వికాస్ దూబే నిందితుడు కాగా ఆధారాలు లేకపోవడంతో ఆ కేసు నుంచి గ్యాంగ్‌స్టర్ బయటపడ్డాడు. చదవండి : గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే హతం -
లండన్‌కి బై బై
సెటిల్మెంట్లు, దందాలు చేయడం కోసం గ్యాంగ్‌స్టర్‌గా లండన్ వెళ్లారు ధనుష్. అక్కడ పనులన్నీ చక్కబెట్టి తిరిగి ఇండియా బయలుదేరారు. మరి.. సెటిల్మెంట్స్ను ధనుష్ ఏ స్టైల్లో సెటిల్ చేశారో వచ్చే ఏడాది వెండి తెరపై చూపిస్తాం అంటున్నారు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. ధనుష్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా చిత్రీకరణ ప్యాచ్ వర్క్ మినహా పూర్తయింది. ఇందులో ధనుష్ గ్యాంగ్‌స్టర్ పాత్ర చేశారు. ఆ మధ్య ఈ సినిమా చిత్రీకరణ యూకేలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ‘‘నాన్‌స్టాప్‌గా 64 రోజులు లండన్‌లో షూట్ చేశాం. చిత్రీకరణ ముగిసింది’’ అని పేర్కొన్నారు నిర్మాత శాష్. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు జేమ్స్ కాస్మో ఓ కీలక పాత్ర పోషించారు. -
ఆసక్తికర ప్రేమకథ
న్యూఢిల్లీ: సినిమాకు ఏమాత్రం తీసిపోని ప్రేమకథ ఇది. రౌడీకి, మహిళా కానిస్టేబుల్ మధ్య కోర్టు ప్రాంగణంలో చిగురించి ప్రేమ చివరకు పెళ్లితో సుఖాంతమైంది. ఈ ప్రేమ పెళ్లి గ్రేటర్ నోయిడాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. 30 ఏళ్ల రాహుల్ థాస్రానా 2014, మే 8న వ్యాపారి మన్మోహన్ గోయల్ హత్య కేసులో అరెస్టయ్యాడు. అప్పటికే అతడిపై డజనుకుపైగా కేసులు ఉన్నాయి. కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పాయల్‌తో రాహుల్‌కు సూరజ్‌పూర్ కోర్టులో పరిచయం ఏర్పడింది. విచారణ కోసం కోర్టుకు వచ్చినప్పుడల్లా వీరిద్దరూ కలుసుకునేవారు. జైలు నుంచి విడుదలైన వెంటనే వీరిద్దరూ పెళ్లిచేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. రాహుల్ నేరచరిత్ర నేపథ్యంలో భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో రహస్య ప్రాంతంలో వీరు నివసిస్తున్నారు. పాయల్ మాత్రమే అప్పుడప్పుడు తన అత్తగారింటికి వచ్చి వెళుతోంది. పెళ్లైన తర్వాత రాహుల్ ఎవరికీ కనబడలేదు. పెళ్లి చేసుకునే నాటికి గౌతమ్‌బుద్ధ పీఎస్‌లో పాయల్ పనిచేస్తోంది. గ్యాంగ్‌స్టర్‌ను ఆమె పెళ్లి చేసుకున్న విషయం తమకు తెలియదని, నిజంగా అలా చేసినట్టు రుజువైతే చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్పీ రణ్విజయ్ సింగ్ తెలిపారు. ఆటో డ్రైవర్‌గా పనిచేసిన రాహుల్ డబ్బు, హోదాతో పాటు పాపులర్ కావాలన్న కోరికతో 2008లో అనిల్ దుజానా గ్యాంగ్‌లో చేరాడు. ‘గోయల్ కేసులో జైలు శిక్ష అనుభవించిన తర్వాత రాహుల్ గ్యాంగ్‌స్టర్‌గా మారిపోయాడు. 2016, మే నెలలో పంచాయతీ ఎన్నికల్లో తన తల్లికి ఓటు వేయకపోతే చంపేస్తానని గ్రామస్తులను బెదిరించడంతో అతడు తమ గమనంలోకి వచ్చాడ’ని రణ్విజయ్ సింగ్ వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో మాబుపురా ప్రాంతంలో నాటకీయ పరిణామాల నేపథ్యంలో అతడు బుల్లెట్ గాయాలకు గురయ్యాడు. -
గ్యాంగ్‌స్టర్ ఈజ్ కమింగ్
గ్యాంగ్‌స్టర్ ఎక్కడైనా చెప్పాపెట్టకుండా అటాక్ చేస్తాడు. కానీ ఈ గ్యాంగ్‌స్టర్ డేట్ చెప్పి మరీ వస్తున్నాను అంటున్నాడు. జూలై 6న థియేటర్స్‌లో రఫ్ ఆడిస్తానని చెబుతున్నారు. సుధీర్‌వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఓ గ్యాంగ్‌స్టర్ చిత్రం తెరకెక్కింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై పీడీవీ ప్రసాద్, నాగవంశీ నిర్మించారు. కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్ కథానాయికలు. ఇందులో శర్వానంద్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది. యంగ్ లుక్‌లో ఒకటి, గ్యాంగ్‌స్టర్‌గా ఓల్డ్ లుక్ మరోటి. ఈ సినిమాను జూలై 6న రిలీజ్ చేయాలనుకుంటున్నారని తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరోవైపు శర్వా‘96’ రీమేక్‌తో బిజీగా ఉన్నారు. -
పోలీస్ శాఖలో కలకలం..!
సాక్షి, యాదాద్రి : డీసీపీ రామచంద్రారెడ్డితో పాటు భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ను రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సీపీ నిర్ణయం తీసుకోవడంతో జిల్లా పోలీస్ శాఖలో ఒక్కసారిగా కలకలం రేపింది. గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరుల ఆగడాలను అదుపుచేయలేకపోవడంతో ఇతర ఆరోపణలు రావడంతోనే వేటు వేశారని తెలుస్తోంది. ఏకంగా ఉన్నతాధికారిపైనే చర్యలు తీసుకోవడంతో పోలీస్ యంత్రాం గంలో ప్రకంపనలు సృష్టించింది. నిఘా కఠినతరం పోలీస్ అధికారుల పనితీరుపై రాచకొండ సీపీ నిఘా కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. ఇంటలిజెన్స్ విభాగం ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి తప్పు చేసిన వారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. సిట్, ఇంటలిజెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే భువనగిరి జోన్ డీసీపీ రామచంద్రారెడ్డిని రాచకొండ కమిషనరేట్ కార్యాలయానికి, భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ వెంకన్నగౌడ్‌ను రాచకొండ సీపీ కార్యాలయానికి అటాచ్ చేశారని సమాచారం. భూ వివాదాల్లో జోక్యం, సెటిల్మెంట్లు..! జిల్లాలో భూముల ధరల విపరీతంగా పెరగడంతో వివాదాలు తలెత్తుతున్నాయి. భూ వివాదాల్లో తలదూరుస్తున్న పోలీసులు సెటిల్మెంట్లు చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. భువనగిరి శివా రులోని ఆర్డీఓ కోర్టులో గల సర్వే నంబర్ 730లో 5.20 ఎకరాల భూమిని నయీమ్ అనుచరులైన పాశం శ్రీను, ఎండీ నాసర్ భువనగిరి రిజిష్ట్రేషన్ కార్యాలయంలో ఇటీవల అక్రమ రిజిష్ట్రేషన్‌కు రంగం సిద్ధం చేశారన్న ఫిర్యాదులు బాధితులనుం చి ఉన్నతస్థాయికి వెళ్లాయి. దీంతో మళ్లీ నయీమ్ అనుచరుల ఆగడాలు ప్రారంభమయ్యాయన్న సమాచారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. మరో వైపు ఇటీవల జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న పలువురు ఎస్‌ఐలపైనా ఫిర్యాదులు రావడంతో వారిపై బదిలీ వేటు వేశారు. ఇద్దరు ఏసీపీ స్థాయి అధికారుల బదిలీపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాదగిరిగుట్టలో నయీమ్ బాధితులకు సహకరించకుండా వారినే దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన ముగ్గురు పోలీస్ అధికారులను సీపీ మందలించినట్లు సమాచారం. అలాగే యాదగిరిగుట్ట సబ్ డివిజన్లో ఒక ఎస్ఐ విధి నిర్వహణపై ఫిర్యాదులు రావడంతో ఆయన్ను కూడా మందలించి పంపించారని తెలుస్తోంది. సీపీకి అందిన ఫిర్యాదులు! నయీమ్ అనుచరులకు కొందరు పోలీసులు సహకరిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో సీపీ సీరియస్‌గా పరిగణించి చర్యలు తీసుకున్నాడని తెలుస్తోంది. డీసీపీ తన కింది ఉద్యోగులు కొందరితో కలిసి నయీమ్ అనుచరుల భూ సెటిల్మెంట్లను చూసీ చూడనట్లు వ్యవహరించి వారికి సహకరిస్తున్నాడన్న ఫిర్యాదులు అందాయి. భువనగిరి శివారులోగల సర్వే నంబర్ 730లో ఎ5.20గుంటల భూమి అక్రమ రిజిస్ట్రేషన్ కోసం ఇటీవల నయీమ్ అనుచరులు పాశం శ్రీను, అ బ్దుల్ నాసర్ మరికొందరు కలిసి భువనగిరి రిజి స్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ సహకారంతో నయీమ్‌కు సంబంధించిన బినామీ ఆస్తులను ఇతరుల పేరున రిజిస్ట్రేషన్ చేయించేందుకు సిద్ధం అయ్యారు. ఒకరి పేరుమీద స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ కోసం వెళ్లారు. అయితే పట్టాదారు పాస్ పుస్తకాలు తెస్తేనే రిజిస్టర్ చేస్తామని అక్కడ అధికారులు చెప్పడంతో త్వరలో తెస్తామని చెప్పి స్టాంప్ డ్యూటీ చెల్లించామని రిజిస్టర్ చేయమని డాక్యుమెంట్ రైటర్ ద్వారా ఒత్తిడి తెచ్చారు. దీంతో సబ్‌రిజిస్ట్రార్ డాక్యుమెంట్‌ను పెండింగ్‌లో ఉంచారు. నయీమ్ అనుచరుల నుంచి తీవ్రమైన ఒత్తిడులు రావడంతో అనుమానం వచ్చిన రిజిస్ట్రేషన్ కార్యాలయం అధికారులు పెండింగ్‌లో ఉన్న డాక్యుమెంట్‌ను రద్దు చేశారు. ఈ విషయంపై ఆ భూమికి సంబంధించిన బాధితులు సీపీ మహేశ్ భగవత్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తమకు అన్యాయం జరుగుతుందని పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తక్షణమే సీపీ స్పందించి వెంటనే సిట్ విచారణకు ఆదేశించారు. దీంతో శనివారం సిట్,స్పెషల్ ఇంటలిజెన్స్ అధికారులు భువనగిరికి వచ్చి రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని తనిఖీ చేశా రు. హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్‌ను విచారించారు. ఇంట లిజెన్స్ అధికారులు స్థానికంగా సేకరించిన విషయాలను సీపీకి వివరించడంతో అయన డీసీపీతో సహ భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్పై చర్యలకు ఉపక్రమించారు. అంతేకాకుండా నయీ మ్ అనుచరులైన పాశం శ్రీను, అబ్దుల్ నాసర్ ఇళ్లలోనూ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. కొనసాగుతున్న విచారణ బినామీ ఆస్తుల అక్రమ రిజిస్ట్రేషన్‌కు పాల్పడుతు న్నట్లు అందిన ఫిర్యాదు మేరకు నయీమ్ అను చరులపై పోలీసులు భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిం దే. ఈ విషయమై విచారణ కొనసాగుతోంది. పుట్టగూడెంలో ఏం జరిగింది ? మరోవైపు రాజాపేట మండల పుట్టగూడెంలో రేషన్ బియ్యం అక్రమంగా డంప్ చేశారన్న సమాచారంతో శనివారం రాత్రి గ్రామానికి వెళ్లిన ఎస్ఓటీ పోలీస్‌లపై గిరిజనులు దాడి చేశారు. బియ్యంతో పాటు పోలీస్ వాహనానికి నిప్పు పెట్టారు. అయితే స్థానిక పోలీస్‌లకు మామూళ్లు ఇస్తున్నామని, దాడి చేయడానికి మీరు ఎవరని ఆగ్రహంతో ఎస్ఓటీ పోలీస్‌లపై దాడి చేసినట్లు సమాచారం. ఇటీవల ఇక్కడి ఎస్ఐని బియ్యం మామూళ్లకు సంబంధించి ఆరోపణలు రావడంతోనే బదిలీ చేసినట్లు చర్చ జరుగుతోంది. -
ఢిల్లీలో భారీ ఎన్కౌంటర్
న్యూఢిల్లీ: ఢిల్లీలో శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తర్‌పూర్‌లో జరిగిన ఈ కాల్పుల్లో పోలీసులు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ రాజేశ్ భారతీ సహా నలుగురు నేరస్తుల్ని కాల్చిచంపారు. గాయపడ్డ మరో నేరస్తుడిని ఆస్పత్రిలో చేర్చారు. ఛత్తర్పూర్ దగ్గర్లోని చందన్‌హోలా గ్రామంలోని ఫామ్‌హౌస్‌లో రాజేశ్ గ్యాంగ్ భేటీకానుందని పక్కా సమాచారం అందిందని ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఘటనాస్థలికి చేరుకున్న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు.. ఫామ్‌హౌస్‌ను చుట్టుముట్టి లొంగిపోవాలని గ్యాంగ్ సభ్యుల్ని హెచ్చరించారు. అయినా, నేరస్తులు పోలీసులపై కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో రాజేశ్, విద్రోహ్, ఉమేశ్, భీకూ, కపిల్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని ఆస్పత్రికి తరలించగా రాజేశ్‌తో పాటు మరో ముగ్గురు నేరస్తులు మార్గమధ్యంలో చనిపోయారు. రాజేశ్ గ్యాంగ్ జరిపిన కాల్పుల్లో 8 మంది పోలీసులు గాయపడ్డారు. వీరిలో హెడ్‌కానిస్టేబుల్ గిర్ధర్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలం నుంచి రెండు .30 బోర్ తుపాకులు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్లో హతమైన రాజేశ్, విద్రోహ్‌లపై రూ.లక్ష, ఉమేశ్‌పై రూ.50 వేల రివార్డు ఉంది. ఈ నేరస్తులపై హత్య, బెదిరింపులు, కార్ల హైజాకింగ్, దోపిడీ వంటి 25 కేసులు ఉన్నాయి. -
పసిడి పురి...ఊపిరి పీల్చుకో
గ్యాంగ్‌స్టర్ సునీల్ పేరు చెబితే.. ప్రొద్దుటూరు వాసులు గడగడలాడే వారు... ఇక ఆయన నుంచి ఫోన్ వచ్చిందంటే వణికిపోయే వారు... ఎందుకంటే అతడి అరాచకాలు అలా ఉండేవి... డబ్బు కోసం శ్రీమంతుల్ని బెదిరించేవాడు... ఇవ్వకపోతే వారి కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసే వాడు... అప్పటికీ ఇవ్వని పక్షంలో చంపేసే వాడు... దీంతో చాలా మందికి కంటి మీద కునుకు ఉండేది కాదు... ఈ క్రమంలో సునీల్ చనిపోవడంతో వారంతా ప్రశాంతంగా ఉంటున్నారు. ప్రొద్దుటూరు క్రైం : రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో సునీల్.. పేరు మోసిన నేరస్తుడు. అతను ఇంటర్మీడియట్‌ను మధ్యలో వదిలేశాడు. జులాయిగా తిరిగే యువకులతో బ్యాచ్ ఏర్పాటు చేసుకుని.. పెద్ద నెట్వర్క్ నడిపాడు. మారుమూల గ్రామం నుంచి జిల్లా కేంద్రం వరకు ప్రతి చోట తన అనుచరులను ఏర్పాటు చేసుకున్నాడు. మధ్యలో చదువు మానేసిన వారే ఎక్కువగా ఉండే వారు. మందు, బిరియాని, ఖరీదైన వస్తువులను కొనిస్తూ వారిని ఆకర్షించాడు. ముఖ్య అనుచరులైన వారిని హైదరాబాద్‌కు తీసుకెళ్లి సినీ రంగుల ప్రంపంచాన్ని కూడా చూపించాడు. ఇలా యువకులను ఆయుధంగా చేసుకొని సునీల్ తన నేర సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు. యువకులే ఆయుధంగా.. ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన మండ్ల వెంకట సునీల్‌కుమార్ తల్లి కొన్నేళ్ల క్రితం చనిపోయారు. తండ్రి, చెల్లెలు ఉన్నారు. సునీల్ కొన్ని నెలలు ఆటో డ్రైవర్‌గా పని చేశాడు. ఆటో నడుపుకునే సమయంలోనే ఎర్రచందనం స్మగ్లర్లతో పరిచయం ఏర్పడింది. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ కొన్ని సార్లు పోలీసులకు దొరికాడు. స్టేషన్‌కు వెళ్లడం.. బయటికి రావడం షరామామూలే అయింది. కొందరు పోలీసు అధికారులు, సిబ్బందికి లంచాలు ఇచ్చి.. వారి నుంచి సహకారం పొందే వాడు. క్రమేణ కిడ్నాప్‌లకు శ్రీకారం చుట్టాడు. ఈ క్రమంలోనే ఇంజినీరింగ్, డిగ్రీ చదువుతున్న, మానేసిన యువకులను చేరదీశాడు. వీరి ద్వారా కిడ్నాప్‌లు చేయడం ప్రారంభించాడు. ప్రొద్దుటూరులోనే 50 మంది దాకా అనుచరులను ఏర్పరుచుకున్నాడు. సీమ వ్యాప్తంగా స్థానికంగా ఉన్న బ్యాచ్‌లతో పరిచయాలు పెంచుకుని.. వారిని తన గ్యాంగ్‌లో కలుపుకొన్నాడు. ఇలా దాదాపు 400 మందితో తన గ్యాంగ్‌ను విస్తరింప చేశాడు. శ్రీమంతులపై కన్ను సునీల్ టార్గెట్ అంతా డబ్బున్న వారే. వారిని బెదిరించి, వేధింపులకు గురి చేసే వాడు. సీమ వ్యాప్తంగా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వాడు. అతడిది ప్రొద్దుటూరే కావడం.. ఈ ప్రాంతంలో శ్రీమంతులు అధికంగా ఉండటంతో ఎక్కువగా దృష్టి సారించాడు. సునీల్ దందాలను కర్నూలు జిల్లా జలదుర్గానికి చెందిన అప్పటి ఎస్ఐ జయన్న బయట పెట్టగలిగారు. ఆయన విచారణలోనే ప్రొద్దుటూరులోని పలువురు వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలను కిడ్నాప్ చేయాలని సునీల్ వ్యూహ రచన చేసినట్లు తెలిసింది. ఆ ఎస్ఐ ఇచ్చిన సమాచారంతో ప్రొద్దుటూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రొద్దుటూరులోని ప్రముఖ బంగారు వ్యాపారితోపాటు ఆయన కుమారుడ్ని కిడ్నాప్ చేయడానికి స్కెచ్ వేశాడు. హైదరాబాద్‌తోపాటు ప్రొద్దుటూరులోని ఆయన ఇంటి వద్ద పలుమార్లు ప్రయత్నించి, విఫలమయ్యాడు. ఈ విషయం పోలీసుల విచారణలో తేలింది. ప్రొద్దుటూరుతోపాటు జిల్లాలో సునీల్ బాధితులు చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాణ భయంతో వీరు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సునీల్ ఆత్మహత్య వార్త తెలియడంతో వీరంతా ఊపిరి పీ ల్చుకున్నారు. ప్రొద్దుటూరులోని వన్‌టౌన్‌లో మూడు కేసులు, త్రీటౌన్‌లో మూడు, రూరల్ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు సునీల్‌పై నమోదయ్యాయి. సీమ వ్యాప్తంగా 19 కేసులు నమోదయ్యాయి. సునీల్ దందాలు బయట పడిందిలా.. ప్రొద్దుటూరుకు చెందిన వాసురాంప్రసాద్ తాడిపత్రిలోని వంశీ మెడికల్ స్టోర్ నిర్వహిస్తుండే వాడు. వాసురాంప్రసాద్ తండ్రికి సునీల్ ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఆయన పట్టించుకోక పోవడంతో 2013 ఫిబ్రవరిలో జలదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో వాసురాంప్రసాద్‌ను హత్య చేశారు. ఈ కేసును ఎస్ఐ జయన్న చాలెంజ్‌గా తీసుకున్నారు. అప్పటికే ప్రొద్దుటూరులో డాబాపై దాడి చేసిన కేసు సునీల్‌పై నమోదైంది. వాటి ఆధారంగా ఎస్ఐ జయన్న.. సునీల్ ముఠా సభ్యులపై ఆరా తీశారు. డాబా కేసులో ఇద్దరు యువకులు ప్రొద్దుటూరు సబ్జైల్లో ఉంటూ బెయిల్‌పై బయటికి రావడంతో ఎస్ఐ వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వాసూరాం ప్రసాద్‌ను హత్య చేసినట్లు వారు అంగీకరించారు. ఈ కేసులో మరో 10 మంది ముఠా సభ్యులు ఉన్నట్లు పోలీసులు గ్రహించారు. వారంతా హైదరాబాద్‌లో ఉన్నట్లు టవర్ లొకేషన్న్ద్వారా తెలుసుకొని పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడ సునీల్‌తోపాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకొని కర్నూలుకు తరలించారు. 10 కిడ్నాప్‌లు చేసినట్లు హైదరాబాద్ నుంచి కర్నూలుకు వచ్చేలోపే సునీల్ ఎస్ఐకి వివరించాడు. జలదుర్గం ఎస్ఐ దర్యాప్తు ఫలితంగా గ్యాంగ్‌లీడర్, కిడ్నాపర్ సునీల్ దందాలు బయట పడ్డాయి. వాసురాంప్రసాద్‌ను హత్య చేసిన కేసులో సునీల్‌కు జీవిత ఖైదు పడింది. ఈ శిక్షను కడప సెంట్రల్ జైలులో అనుభవిస్తున్న సునీల్ శుక్రవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రొద్దుటూరులోని శ్రీమంతుల్లో భయం వీడింది. మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు రాయచోటి అర్బన్: కడప సెంట్రల్ జైలులో జీవిత ఖైదును అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ సునీల్‌కుమార్‌ను అధికారులే పథకం ప్రకారం అంతమొందించారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఓపీడీఆర్ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి.ఈశ్వర్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఆదివారం ఫిర్యాదు చేశారు. నేరాలకు పాల్పడుతున్న సునీల్‌కు.. చాలా మంది పోలీస్ అధికారులు సహకరించి అతడి ద్వారా లబ్ధి పొందారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి స్థాయి విచారణ జరిగితే తమ పాత్ర వెలుగులోకి వస్తుందని భావించి.. వారే తుదముట్టించినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. -
'నా భూములు నాకు ఇప్పించండి'
-
విశాఖపై నయీం నీడ
ప్రత్యేక దర్యాప్తు బందం వద్ద సమాచారం నిగ్గు తేల్చేందుకు నగరానికి వచ్చిన ‘సిట్’ ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులతో భేటీ ఫ్లాట్‌ఫారాల ఫుటేజీ స్వాధీనం గోదావరి, దురంతో రైళ్ల ఫస్ట్ ఏసీ ప్రయాణికుల జాబితాల పరిశీలన గ్యాంగ్‌స్టర్ నయీం తన వికృత క్రీడను విశాఖకూ విస్తరించాలని భావించాడా?.. ఇప్పటికే విస్తరించాడా??.. పలుమార్లు నగరానికి రాకపోకలు సాగించాడా???.. రాకపోకలు సాగించడం నిజమేనని ఇతని కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బందానికి లభించిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.. అయితే తన నేరసామ్రాజ్యాన్ని ఇక్కడ విస్తరించాడా లేక విస్తరించాలని భావించాడా.. అన్నది మాత్రం స్పష్టం కాలేదు. దాన్ని నిగ్గు తేల్చేందుకు సిట్ అధికారులు కొందరు విశాఖ వచ్చారని అత్యంత విశ్వసనీయ సమాచారం. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారాల ఫుటేజీ.. గత కొన్ని నెలల ప్రయాణికుల రిజర్వేషన్ చిట్టాలు సేకరించినట్లు.. ఆర్పీఎఫ్ అధికారులతో మాట్లాడి ఇతర వివరాలపై కూపీ లాగినట్టు సమాచారం. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఇటీవల పోలీస్ ఎన్కౌంటర్లో హతమైన కరడుగట్టిన నేరస్తుడు, గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో కూడా నేరసామ్రాజాన్ని విస్తరించాలని చూశాడని.. ఆ మేరకు గత రెండు, మూడు నెలల కాలంలో పలుమార్లు విశాఖ నగరానికి వచ్చి వెళ్లాడని నయీం అరాచకాలపై విచారణ చేపట్టిన సిట్ అధికారులకు కొన్ని ఆధారాలు లభించాయి. దాంతో వాటిని నిర్థారించుకునేందుకు ఆదివారం అత్యంత రహస్యంగా వారు విశాఖకు వచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడే ఉన్న అధికారులు ప్రధానంగా రైల్వేస్టేషన్లో దృష్టి సారించారు. ఆర్పీఎఫ్, రైల్వే పోలీసు, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. గత రెండు, మూడు నెలల కాలంలో నయీం పలుమార్లు విశాఖకు వచ్చాడన్న నిర్థారణకు వచ్చారు. అయితే ఇక్కడకు ఎందుకు వచ్చాడు.. ఏ పనిమీద ఎవరిని కలిసేందుకు వచ్చాడు.. అనే పక్కా సమాచారం కోసం కూపీలాగారు. విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే గోదావరి, దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్ల రిజర్వేషన్ జాబితాలు తీసుకున్నారు. ప్రధానంగా ఏసీ ఫస్ట్, సెకండ్ క్లాస్ బోగీల ప్రయాణికుల జాబితాలను పరిశీలించారు. వాటిలో నయీం, అతని అనుచరుల పేర్లు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించారు. సీసీ ఫుటేజీల స్వాధీనం గోదావరి, దురంతో రైళ్లు రాకపోకలు సాగించే ప్లాట్‌ఫారాల సీసీ ఫుటేజీని కూడా తీసుకువెళ్లారు. సీసీ కెమెరాల నుంచి తీసుకున్న వీడియో ఫుటేజీ ద్వారా నయీం, అతని అనుచరులు విశాఖ వచ్చి, వెళ్లిన సందర్భాల్లో వారిని కలుసుకునేందుకు స్టేషన్‌కు ఎవరెవరు వచ్చారనే విషయమై కూడా సిట్ ందం పరిశీలిస్తోంది. విశాఖ నుంచి హైదరాబాద్‌కు రైళ్లలో ప్రయాణించిన సందర్భాల్లో నయీం నేరుగా సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలో దిగకుండా ముందు స్టేషన్లలోనే దిగిపోయేవాడని సిట్ అధికారుల వద్ద సమాచారముంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఎక్కువగా నిఘా ఉంటుందన్న భావనతో ముందు స్టేషన్లయిన వరంగల్, జనగాం, ఘట్కేసర్లలోనే దిగిపోయేవారని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా స్టేషన్లలో హాల్ట్‌లు ఉన్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలులోనే నయీం ందం ఎక్కువసార్లు ప్రయాణించినట్టు భావిస్తున్నారు. విశాఖ ఎందుకొచ్చినట్టు? హైదరాబాద్ కేంద్రంగా నేరసామాజ్రాన్ని విస్తరించుకున్న నయీం అసలు విశాఖ ఎందుకొచ్చినట్టు.. నవ్యాంధ్ర ఆర్థిక రాజధానిగా మారిన మహానగరంలో ఏ సెటిల్మెంట్లు చేసేందుకు ఇక్కడకు వచ్చాడు.. ఏమైనా దందాలు చేశాడా.. ఇక్కడ పోలీసు అధికారులతో కూడా అతనికి పరిచయాలు ఉన్నాయా.. ఇక్కడ కూడా అతనికి అనుచరులు ఉన్నారా... అన్న కోణాల్లో సిట్ అధికారులు విచారణ చేపట్టినట్టు విశ్వసనీయ సమాచారం. -
అది నయీమ్ డెన్
2008–2011 మధ్యలో ఇక్కడికి నయీమ్, ఫయీం..? ఇంటిని పరిశీలించిన వైరా డీఎస్పీ భూక్యా రాంరెడ్డి సిట్‌కు సమాచారం అందించామని వెల్లడి సాక్షిప్రతినిధి, ఖమ్మం: పక్కాగా అది నయీమ్ డెన్.. ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత ఏసీలు, ఖరీదైన బెడ్లు, ప్రతి రూమ్‌కు అటాచ్డ్ బాత్రూమ్.. కింద పాలరాతి బండలు.. ఆ ఇంట్లో దొంగతనం జరిగిన తర్వాత సుల్తానాబేగం మాయం. ఆ తర్వాత ఇవన్నీ తొలగించడం.. మళ్లీ 2014లో బీబమ్మ ప్రత్యక్షం. ఇంట్లో ఉంటున్న రహీం కుటుంబీకులకు మీరే ఉండాలని చెప్పడం.. ఇదంతా చూస్తే.. నయీమ్ ఐదేళ్ల క్రితం గాంధీనగర్ కాలనీలోని ఇంటిని డెన్‌గా ఉపయోగించుకున్నట్లు అర్థమవుతోంది. మిర్యాలగూడలో వారం రోజుల క్రితం అరెస్ట్ అయిన నయిమ్ అత్తే ఇక్కడి సుల్తానా అని పోలీసులు, నిఘా విభాగాలు పసిగట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా నయీమ్ ఇక్కడ డెన్‌ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ నుంచి ఏంచేశాడనే దానిపై నిఘా వర్గాలు లోతుగా శోధిస్తుండగా.. దీనిపై ఇప్పటి వరకు ఉన్న సమాచారం సిట్‌కు కూడా పంపినట్లు తెలిసింది. డెన్‌కు పలుమార్లు నయీమ్.. ఖమ్మం నగరానికి సమీపంలోని విజయవాడ వెళ్లే రాష్ట్రీయ రహదారి పక్కన ఉన్న గాంధీనగర్ కాలనీలో డెన్ కోసమే నయీమ్ ఇంటిని కొనుగోలు చేశాడని తెలుస్తోంది. ఇక్కడ డెన్ ఏర్పాటు చేసుకుంటే.. ఇటు హైదరాబాద్‌కు, అటు ఆంధ్రా ప్రాంతానికి వెళ్లే సమయంలో సేఫ్‌జోన్‌గా ఉపయోగపడుతుందని భావించినట్లు సమాచారం. అందుకే ఇక్కడ ఎటువంటి కార్యకలాపాలు చేయకుండా కేవలం అతను వచ్చి వెళ్లేలా షెల్టర్‌జోన్‌గా ఉపయోగించుకున్నాడా..? లేక ఇక్కడ కూడా ఏమైనా సెటిల్మెంట్లు చేశాడా..? అని నిఘా విభాగాలు లోతుగా పరిశీలిస్తున్నాయి. అయితే 2008–2011 మధ్యలో నయీమ్ తన సోదరుడు ఫయీమ్ మరికొంతమంది అనుచరులు పలుమార్లు వచ్చినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఇల్లు కొనుగోలు, ఆంజనేయస్వామి దేవాలయానికి విరాళం ఇచ్చిన బీబమ్మ అలియాస్ సుల్తానాబేగం నయీమ్ అత్తనే అని ప్రస్తుతం ఆ ఇంట్లో ఉన్న వారు చెప్పే వివరాలను బట్టి స్పష్టమవుతోంది. రెండేళ్ల తర్వాత గాంధీనగర్ కాలనీకి బీబమ్మ.. 2011లో బీబమ్మ ఇంట్లో దొంగతనం జరిగిన తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆ ఇంటిని ఖమ్మం కోర్టులో బెంచ్ క్లర్కుగా పనిచేసే రహీంకు అద్దెకు ఇచ్చింది. అయితే తన తండ్రి రహీమ్‌కు బీబమ్మ మేనత్త అవుతుందని వైరా డీఎస్పీ ఆ ఇంటిని పరిశీలించినప్పుడు రహీమ్ కుమారుడు పోలీసులకు వివరించాడు. 2011లో వెళ్లిన బీబమ్మ 2014లో ఒకసారి ఇంటికి వచ్చి.. ఇంట్లో మీరే ఉంటున్నారా..? ఇంటిని సరిగా చూసుకోవాలని, ఇంట్లో మీరే ఉండాలని చెప్పి.. పది నిమిషాల్లోనే వచ్చిన కారులో వెళ్లిపోయిందని రహీం భార్య కూడా చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. వారం రోజుల క్రితం మిర్యాలగూడలో నయీమ్ అత్త సుల్తానాతోపాటు అతని బావమరుదులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా 400 పత్రాలను, ఓ పిస్తోలును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాల్లో గాంధీనగర్ కాలనీ ఇంటి ఒప్పంద పత్రాలు కూడా ఉన్నట్లు సమాచారం. రహీం ఆ ఇంట్లో ఎప్పటి నుంచి ఉంటున్నాడు. ఇంకా ఎవరెవరు వచ్చేవారని పోలీసు నిఘా విభాగాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. బంగారు నగలతో ఖరీదైన కార్లలో.. గాంధీనగర్ కాలనీలో సుమారు 600 కుటుంబాల వరకు ఉన్నా.. ఆ ఇంటికే ఖరీదైన కార్లలో.. బంగారు ఆభరణాలు ధరించిన మహిళలు వచ్చేవారని స్థానికులు పేర్కొంటున్నారు. ఎవరితో మాట్లాడేవారు కాదని, ఇంట్లోనే రెండు,మూడు రోజులు ఉండి.. వెళ్లిపోయే వారని, ఆ తర్వాత బీబమ్మే కనిపించేదని, ఆమె కూడా ఎవరితో పెద్దగా ముచ్చటించేది కాదని చెబుతున్నారు. ఆంజనేయస్వామి దేవాలయానికి భారీగా విరాళం ఇవ్వడంతో అక్కడ ప్రార్థనామందిరం కడుతున్న మరో వర్గం వారు విరాళం ఇవ్వాలని బీబమ్మతోపాటు అక్కడికి వచ్చిన కొందరిని అడిగినా.. స్పందించలేదని చెబుతుండటంతో ఇక్కడకు వచ్చింది నయీమ్, ఫయీమ్ అయి ఉంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆ ఇంటి సమీపంలోనే మరో ప్లాట్.. నయీమ్ తన తల్లిదండ్రుల పేరుతో కొనుగోలు చేసిన ఇంటి సమీపంలోనే మరో ప్లాట్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంట్లో కూడా ఇల్లు నిర్మించాలని బీబమ్మ అనుకున్నట్లు స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతేకాకుండా బీబమ్మకు దగ్గరగా ఉండే ఓ మహిళకు బంగారు ఆభరణాలు బహుమతిగా ఇచ్చినట్లు కాలనీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏదైనా సహాయ సహకారాల కోసం బీబమ్మను కలవాలంటే ముందుగా ఆ మహిళను కలిసి చెబితే.. ఆమె బీబమ్మకు తెలిపేదని.. ఆమె చెప్పిన సమాధానాన్ని మళ్లీ వీరికి చేరవేసేదని చెబుతున్నారు. ప్రకాశంను ఆరాతీసిన ఇంటెలిజెన్స్.. ఈ ఇంటిని విక్రయించిన నేలకొండపల్లి మండలం చెరువుమాదారం వీఆర్ఏ ప్రకాశంను ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఇల్లు ఎప్పుడు విక్రయించారు..? ఎందుకు విక్రయించారు..? కొనుగోలు చేసినప్పుడు ఎంతమంది వచ్చారు..? ఎక్కడినుంచి వచ్చారు..? తదితర అంశాలను ప్రకాశంను అడిగినట్లు సమాచారం. ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని, ఫోన్ ఎత్తాలని, గ్రామంలోనే ఉండాలని సూచించారు. సిట్‌కు ‘సాక్షి’ కథనం.. నయీమ్ అత్త సుల్తానాబేగం గాంధీనగర్ కాలనీలో ఇల్లు కొనుగోలు చేసిందని.. ఇక్కడికి నయీమ్, అతని అనుచరులు పలుమార్లు వచ్చి ఉంటారన్న అనుమానాలను వ్యక్తంచేస్తూ ‘సాక్షి’లో ‘నయీమ్ నీడ’ పేరుతో వచ్చిన కథనాన్ని జిల్లా పోలీస్ అధికారులు సిట్‌కు పంపించినట్లు సమాచారం. ఈ కథనం ఆధారంగానే అతి త్వరలో సిట్ బృందం సభ్యులు ఇక్కడికి రానున్నట్లు తెలుస్తోంది. ‘సాక్షి’లో వచ్చిన వివరాలు.. వాస్తవ పరిస్థితులపై ఏఎస్పీ సాయికృష్ణ, వైరా డీఎస్పీ భూక్యా రాంరెడ్డి, సీఐ వి.చేరాలు సమావేశమై సమీక్షించారు. అనుమానం ఉంది.. డీఎస్పీ భూక్యా రాంరెడ్డి గాంధీనగర్ కాలనీలో నయీమ్ ఇంటిని కొనుగోలు చేశాడనే వార్తలతో వైరా డీఎస్పీ భూక్యా రాంరెడ్డి వైరా సీఐ చేరాలు శనివారం మధ్యాహ్నం ఆ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న రహీం కుమారులను మీ నాన్న ఎక్కడికి వెళ్లాడు..?ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు..? సుల్తానాబేగం ఏమవుతుందని ప్రశ్నించారు. డీఎస్పీ ప్రశ్నలకు.. రహీం కుమారుడు.. సుల్తానాబేగం తన తండ్రికి మేనత్త అవుతుందని, ఆమె చాలాకాలంగా ఇక్కడకు రావడం లేదన్నారు. ఇంటిపైన ఖాళీగా ఉన్న గదులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నయీమ్ తల్లిదండ్రుల పేరుతో ఇల్లు కొనుగోలు, దేవాలయానికి విరాళం ఇవ్వడం, సుల్తానాబేగం మిర్యాలగూడకు చెందిన వారు కావడంతో నయీమ్ ఆనవాళ్లపై అనుమానం ఉందని పేర్కొన్నారు. మొత్తంగా ఈ విషయాన్ని ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులకు వివరించామని, సిట్‌కు కూడా తెలిపామని చెప్పారు. -
నయీం బెడ్ రూంలో సిట్ సోదాలు
-
తవ్వేకొద్దీ వేలకోట్లు
-
నయీమ్ చుట్టూ ‘గడాఫీ’ సైన్యం!
-
మరో నయీంను సృష్టిస్తారా?
డేట్లైన్ హైదరాబాద్ నక్సలైట్లను చంపాక, పౌర హక్కుల వాళ్ల మీద, పోలీసులూ, రాజకీయ నాయకుల మీదా పడ్డాడు నయీం. ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల వ్యవస్థలను సృష్టించిన ఘనత మన ప్రభుత్వాలది, పోలీసు పెద్దలదే. నయీంలను సృష్టించి, ఏకు మేకు అయ్యే దాకా చూసి, మట్టుబెట్టడం ఎందుకు? ఈ ప్రశ్న మన పోలీసు పెద్దలు వేసుకోవాలి. మాకే సంబంధమూ లేదని కొట్టిపారేయొచ్చు. కానీ ఫియర్ వికాస్ నుంచి గ్రీన్టైగర్ల దాకా గత 30 ఏళ్లుగా పోలీసు పెద్దల మద్దతుతోనే నయీంలాంటి వాళ్లు బలపడి సమాజాన్ని పీడిస్తున్నారు. గ్రేహౌండ్స్ అనే ప్రత్యేక పోలీసు విభాగం ఏర్పాటుకు వ్యూహకర్తయైన కేఎస్ వ్యాస్‌ను హత్య చేసిన అప్పటి నక్సలైట్ నయీముద్దీన్ 23 ఏళ్ల తరువాత అదే గ్రేహౌండ్స్ చేతుల్లో మొన్న హతం అయ్యాడు. ప్రజలకూ, పౌరహక్కుల కార్యకర్తలకూ, తీవ్రవాద ఉద్యమానికీ తలనొప్పిగా మారిన నయీం లాంటి వారు తమకు కూడా తలనొప్పి తెప్పిస్తుంటే తప్ప మన ప్రభుత్వాలు వారిని ఈ లోకం నుంచి తప్పించవు. అందుకు నయీం ఒక్కడే కాదు చాలా ఉదాహరణలున్నాయి. ఉపయోగపడతాడు అనుకుంటే, వాడు ఎంత కరడుగట్టిన నేరస్తుడయినా రక్షణ వలయం ఏర్పాటు చేసి కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఎన్ని దుర్మార్గాలు చేసినా చిద్విలాసంగా చూస్తుం టారు. అక్రమంగా ఆస్తులూ, లెక్కలేనంత డబ్బు కూడగట్టుకోడానికి అనుమ తించడమే కాదు తమవంతు సాయం కూడా చేస్తుంటారు. ఒక పోలీసు అధికారిని హత్య చేసిన నేరానికి జైలు జీవితం గడిపి బయటికి వచ్చిన ఒక సాధారణ కుటుంబానికి చెందిన యువకుడు నయీం వేలాది కోట్ల ఆస్తులను సంపాదించడానికి వెనక చాలా కథ ఉంది. నక్సలైట్ల అణచివేతకు అష్టావక్ర మార్గం ఈ దేశంలో తీవ్రవాద ఉద్యమాన్ని కేవలం శాంతి భద్రతల సమస్యగానే చూస్తూ వచ్చిన ప్రభుత్వాలు ఆ ఉద్యమాన్ని అదే పద్ధతిలో అణచివేయబోయి సాధ్యం కాక ఎన్నో వక్ర మార్గాలను ఎంచుకున్నాయి. ఆ ఉద్యమాల సైద్ధాం తిక పునాది ఎంత బలంగా ఉంది, ప్రజలపట్ల వారి నిబద్ధత ఎంత అనేవి ఇక్కడ చర్చనీయాంశాలు కావు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి విధుల్లోకి వచ్చే వ్యవస్థలు ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి ఎంచుకున్న వక్రమార్గా లను గురించి మాట్లాడాలి. ఆ వక్రమార్గాలలోకెల్లా మరీ అష్టావక్ర మార్గం కోవర్ట్‌లు. కత్తుల సమ్మయ్య, జడల నాగరాజు, బయ్యపు సమ్మిరెడ్డి, సోమల నాయక్, గోవింద రెడ్డి, నయీం వంటి వాళ్లంతా ఈ వక్రబుద్ధికి పుట్టిన కుక్క మూతి పిందెలే. ఒక దశలో తీవ్రవాద ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్న వీళ్లంతా ఆ తరువాత పోలీసుల చేతిలో పావులుగా మారి ఆ ఉద్యమకారు లను చంపడం, చంపడానికి సహకరించడంతో మొదలుపెట్టారు. ఆ తదుపరి పౌర హక్కుల నేతలనూ, కార్యకర్తలను మట్టుబెట్టడం, ప్రజలను హింసిం చడం, దౌర్జన్యాలు సాగించడంతో ఆగక రాజకీయ నాయకత్వాన్ని కూడా గుప్పిట పెట్టుకోడానికి వారు చెయ్యని ప్రయత్నం లేదు. నయీం కూడా అట్లా పెరిగిన వాడే. ఎందరో పోలీసు అధికారులు, మరెందరో రాజకీయ నాయకులూ నయీంతో స్నేహం చెయ్యడానికి తహతహలాడిన వారే. నయీం ఇచ్చిన నజరానాలను సంతోషంగా స్వీకరించిన వారే. సోమవారం నయీంను ఎన్కౌంటర్లో చంపేసిన తరువాత పోలీసుల సోదాల్లో చాలా విషయాలు బయటపడే ఆస్కారం గల డాక్యుమెంట్లు బోలెడు దొరికాయి. అవన్నిటినీ బహిరంగపరిస్తే సమాజంలోని చాలామంది పెద్ద మనుషుల బతుకులు బజారునపడటం ఖాయం. అందులో పోలీసులు, రాజకీయ నాయకులూ, వ్యాపారులూ ఇంకా ఎవరయినా ఉండొచ్చు. భస్మాసుర హస్తం సృష్టికర్తలు 1993 జనవరిలో హైదరాబాద్ ఫతెహ్ మైదాన్ స్టేడియంలో ఐపీఎస్ అధికారి వ్యాస్‌ను హతమార్చిన తరువాత జైలుకు వెళ్ళిన నయీం... ఏడేళ్ల తరువాత పోలీసుల ఆశీస్సులతో బయటికి వచ్చి అదే స్టేడియం పక్కన ఉన్న బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో పత్రికా గోష్టి నిర్వహించి తాను ఎవరెవరిని చంపబోతు న్నాడో హిట్ లిస్ట్ చదివి వినిపించాడు. తీవ్రవాద ఉద్యమాన్ని అంతం చేస్తాననీ, అవసరం అయితే ఆనాటి పీపుల్స్‌వార్ కేంద్ర కార్యదర్శి గణపతిని కూడా హతమారుస్తాననీ ప్రకటించాడు. ఆనాటి పోలీసు బాస్‌లకు ఇది నచ్చింది. నక్సలైట్ ఉద్యమాన్ని అణచివేసే పనిని నయీం వంటి వాళ్లకు అప్పగించి తాము నిశ్చింతగా ఉండొచ్చు అనుకున్నారు. కానీ ఇటువంటి వారు చివరికి తమ పాలిటి భస్మాసుర హస్తాలు అయ్యే ప్రమాదం ఉందని చెపితే విన్నారా? ‘‘ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని చిలక పలుకులు పలికే, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ధర్మపన్నాలు వల్లించే పోలీ సులు, ప్రభుత్వ నేతలూ గమనించవలసిన విషయం ఒకటుంది. రేపు వీళ్లు (నయీం తదితరులు) నక్సలైట్లను చంపుతారు సరే తరువాత ఏమిటి? ఇలాంటి నేర ప్రపంచాన్ని పెంచి పోషిస్తున్న పోలీసులకూ ప్రభుత్వానికీ అది భస్మాసుర హస్తంగా మారకుండా ఎవరరుునా ఆపగలరా?’’అని ప్రజాతంత్ర వారపత్రికలో ( 2000 ఆగస్ట్‌లో) రాస్తే పోలీసు పెద్దలకు రుచించలేదు. ఒక పోలీసు అధికారిని నా దగ్గరకు పంపించి ‘‘మీకు అటువంటి సందేహం అక్కర లేదు. ఎక్కడికి పోతారు వీళ్లు, మా అవసరం తీరాక వీళ్లను అడ్డు తొలగించుకోవడం మా చేతిలో పని, అయినా నయీం దుర్మార్గుడు, వాడితో ఎందుకు పెట్టుకుంటారు అని నాకు ఒక ఉచిత సలహా కూడా చెప్పించారు. బెడిసి కొట్టే వరకు పోలీసు పహారా పదహారేళ్ల నాటి నా ప్రశ్నకు నయీం చేసిన దుర్మార్గాలే పెద్ద సమాధానం. నక్సలైట్లను చంపాక, పౌర హక్కుల వాళ్ల మీద, ఆ తరువాత పోలీసులూ, రాజకీయ నాయకుల మీదా పడ్డాడు నయీం. ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల వ్యవస్థలను కొన్నిటిని సృష్టించిన ఘనత కచ్చితంగా మన ప్రభుత్వా లది, పోలీసు పెద్దలదే. హత్యా నేరాలు మోస్తున్న కత్తుల సమ్మయ్యకు పాస్‌పోర్ట్, వీసాలూ ఇప్పించి దేశం దాటించ చూస్తే అతను కొలంబోలో విమాన ప్రమాదంలో చనిపోయాడు. లేకపోతే విదేశాల్లో ఎక్కడో హాయిగా స్థిరపడి ఉండేవాడు. అనుమానంతో అమాయకులను వేధించి ఒక్కోసారి వాళ్ల జీవితాలు నాశనం కావడానికి కూడా కారణం అయ్యే పోలీసులు కత్తుల సమ్మయ్య వంటి కరడుకట్టిన నేరస్తులను క్షేమంగా దేశం దాటించేస్తారు. ఎందుకంటే అతను నక్సలైట్లను చంపాడు. బయ్యపు సమ్మిరెడ్డి అనే మరో కోవర్ట్ సొంత గొడవల్లో హత్యకు గురయ్యాడు. గోవిందరెడ్డి, జడల నాగరాజు ఏమయ్యారు? చాలా కాలం జడల నాగరాజు కూడా మన పోలీసు పెద్దల ముద్దుల అతిథే. ఒకసారి సిద్ధిపేట దాబాల దగ్గర నిలబడి చాయ్ తాగుతుంటే ఆరు జీపుల నిండా సాయుధులు హైదరాబాద్ వైపు దూసుకు పోతూ కనిపించారు. ఎవరని ఆరా తీస్తే వాళ్లంతా మాజీ నక్సలైట్ జడల నాగరాజు సెక్యూరిటీ అని తెలిసింది. ముందు జీపులో ఉన్న అతనికి రక్షణగా ఈ బలగాలు. వారిలో కొందరు మఫ్టీలోని పోలీసులు. అవును మరి, నక్సలైట్ల శత్రువులను కాపాడటం మన పోలీసు వ్యవస్థ పనే కదా. నేరస్త ముఠాల కోసం లెక్కలు లేని నిధులు నయీముద్దీన్ వంటి నేరస్తుల జీవితాలకు ముగింపు ఇంతకంటే భిన్నంగా ఉండదు. అరుుతే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే నయీంలను, కత్తుల సమ్మయ్య లనూ మనమే సృష్టించి, ఏకు మేకు అయ్యే దాకా చూసి, మనమే ఎందుకు మట్టుబెట్టడం? అని. ఈ ప్రశ్న మన పోలీసు పెద్దలు వేసుకోవాలి. మాకే సంబంధమూ లేదు, ఇదంతా గిట్టని వాళ్లు, పోలీసు వ్యతిరేకులూ, అభివృద్ధి నిరోధకులూ చేసే ఆరోపణ అని ప్రభుత్వం, పోలీసులు కొట్టి పారేయొచ్చు. 1986లో ఫియర్ వికాస్ నుంచి ఈనాటి గ్రీన్టైగర్ల దాకా ఈ 30 ఏళ్లలో పోలీసు పెద్దల ప్రత్యక్ష, పరోక్ష మద్దతుతోనే నయీం లాంటి వాళ్లు బలవం తులై సమాజాన్ని పీడిస్తున్నారు. వాళ్లు నక్సలైట్లను వ్యతిరేకిస్తారు, చంపు తారు కాబట్టి వాళ్లకు మా మద్దతు అన్నది పోలీసుల ధోరణి. 1986లో నాటి కరీంనగర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలో జరిగిన పత్రికా గోష్టిలో నాటి ఎస్పీ అశోక్ ప్రసాద్ సమక్షంలోనే ఫియర్ వికాస్ నాయకుడు, హుస్నాబాద్ వాస్తవ్యుడు అన్నెబోయిన మల్లయ్య ఆ సంస్థ ఆవిర్భావాన్ని, దాని లక్ష్యాలను వివరించాడు. అక్కడి నుంచి మొదలై జన రక్షణ సంస్థ, క్రాంతి సేన, గ్రీన్ టైగర్స్, రెడ్ టైగర్స్ వంటి అనేక సంస్థలు పోలీసుల ఆశీర్వాదంతోనే పుట్టాయి, ప్రజల ఆగ్రహానికి అంతరించాయి. ఇట్లాంటి వ్యక్తులు, సంస్థలను చేరదీసి, బలోపేతం చెయ్యడానికి లెక్కకురాని పోలీసు ఎస్ఆర్ అమౌంట్ కోట్లలో ఉంటుందట. ఎస్పీల అధీనంలో ఉండే ఆ నిధు లకు ఆడిటింగ్ వంటి చట్టపరమైన నిబంధనలు వర్తించవనీ చెబుతుంటారు. దాదాపు ఒకటిన్నర దశాబ్దంపాటు నయీం తన దుర్మార్గాలను కొన సాగించడానికి, యథేచ్ఛగా జనాన్ని హింసించడానికి తోడ్పడిన ఉన్నత స్థాయి పోలీసు అధికారులు కొందరు పదవీ విరమణ చేశారు, కొందరు రాష్ట్ర విభజన అనంతరం అవతల రాష్ట్రానికి వెళ్లారు. కొంతకాలంగా నయీం ఆట ముగియనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పుడయితే అధికార పక్షానికే చెందిన కొనపురి రాములును హత్య చేశాడో, ఎప్పుడయితే అధికార పక్షానికే చెందిన కొందరు ప్రజా ప్రతినిధులను వారి వారి నియోజకవర్గాలకు వెళ్ల కుండా నిలువరించాడో, ఎప్పుడయితే వారి నుంచి సైతం కోట్లాది రూపా యలు డిమాండ్ చేశాడో అప్పుడే నయీం కథ ముగియబోతున్నదని అర్థ మైంది. సోమవారం అదే జరిగింది. మంచిదే కానీ, మరో నయీం పుట్టడన్న, పుట్టించబోమన్న హామీ మన పోలీసు పెద్దలు ఇవ్వగలరా? దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
తవ్వేకొద్దీ వేలకోట్లు
► నయీమ్ నేర సామ్రాజ్యంలో వెలుగుచూస్తున్న అక్రమ ఆస్తులు ► కట్టలుకట్టలుగా భూ లావాదేవీలు, బినామీ దందాల పత్రాలు ► నగర శివారుల్లోనే వేల కోట్ల ఆస్తులు? ► నల్లగొండ జిల్లా బొమ్మలరామారంలో ఒక్కచోటే 500 ఎకరాలు ► 150 డాక్యుమెంట్లలోని ఆస్తుల విలువ రూ.1,500 కోట్లు ► విస్తుపోతున్న అధికారులు సాక్షి, హైదరాబాద్/నల్లగొండ/మహబూబ్‌నగర్: తవ్వే కొద్దీ కట్టలు కట్టలుగా బయటపడుతున్న డాక్యుమెంట్లు.. లెక్కలు తీసే కొద్దీ కళ్లు చెదిరే అస్తులు.. అక్కడా ఇక్కడా అని తేడా లేదు.. ఎక్కడ పడితే అక్కడ ఎకరాల కొద్దీ భూములు.. ప్లాట్లు.. బంగ్లాలు.. విలువైన ఆభరణాలు..! బినామీలు, బంధువుల పేరిట లెక్కలేనన్ని ఆస్తులు..!! రెండు దశాబ్దాలుగా నయీమ్ నిర్మించుకున్న నేరసామ్రాజ్యంలో అక్రమాస్తుల పుట్టలు పగులుతున్నాయి. ఒక్కో పుట్టలోంచి వందల కోట్ల ఆస్తులు బయటపడుతున్నాయి. బహిరంగ మార్కెట్లో వీటి విలువ వేల కోట్ల దాకా ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతాలతోపాటు పాటు నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలో నయీమ్ ఇబ్బడిముబ్బడిగా ఆస్తులు కూడబెట్టినట్టు వెల్లడైంది. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోనే నయీమ్ భూదందా రూ.వెయ్యి కోట్లకు చేరినట్లు సమాచారం. సంపన్నులు ఉండే జూబ్లీహిల్స్ మొదలుకొని కొండాపూర్, షేక్‌పేట, అత్తాపూర్, రామాంతపూర్, సరూర్‌నగర్, ఘట్కేసర్, బైరామల్‌గూడ, సైదాబాద్‌లలో నయీమ్ పేరిట భూములు, ఫ్లాట్లు ఉన్నట్టు తేలింది. నగర శివార్లలోని అల్కాపురి టౌన్షిప్లో ఉన్న నయీమ్ ఇంటి నుంచి నార్సింగి పోలీసులు ఒరిజినల్, జిరాక్సులు కలిపి మొత్తం 210 పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో అత్యధికం స్థలాలకు సంబంధించినవే ఉన్నాయి. వీటిలో ఉన్న 175 ఒరిజినల్ డాక్యుమెంట్లు నయీమ్‌కు చెందిన బినామీ ఆస్తులని, మిగిలినవి సెటిల్మెంట్ల కోసం అతడి వద్దకు వచ్చిన వారిచ్చిన జిరాక్సులని పోలీసులు భావిస్తున్నారు. ఇక భువనగిరి దగ్గర్లో ఉన్న టీచర్స్ కాలనీలో నయీమ్, బినామీల పేరిట 350 ప్లాట్లు రిజిస్టర్ అయినట్లు సోదాల్లో దొరికిన డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది. భువనగిరి చుట్టుపక్కల దాదాపు అన్ని మండలాల్లో ప్లాట్లున్నాయి. భువనగిరి శివార్లలో నయీమ్ పేరిట 26 ఎకరాలు రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. బొమ్మలరామారం మండలంలో ఒక్కచోటే 500 ఎకరాల భూమి ఈ డాన్ పేరిట ఉన్నట్లు సమాచారం. మిర్యాలగూడలోని నయీమ్ అత్తగారింట్లో జరిపిన సోదాల్లో 360కిపైగా డాక్యుమెంట్లు, 100 సెల్ఫోన్లు, తపంచా స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు. అందులో 150 డాక్యుమెంట్లలో ఉన్న ఆస్తుల విలువే రూ.1,500 కోట్లకు పైగా ఉందని అధికారులు లెక్క కట్టినట్టు సమాచారం. రెడీగా బినామీలు నయీమ్ కూడగట్టిన ఆస్తుల్లో ఎక్కువ భాగం బినామీ పేర్లతోనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు బినామీలను వెతుక్కోవడం కష్టం కావడంతో ముందే ప్రణాళిక ప్రకారం సిద్ధం చేసుకుని కథ నడిపాడని పోలీసులు చెప్తున్నారు. అల్కాపురిలోని నయీమ్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో ఆయుధాలు, పత్రాలతో పాటు భారీగా గుర్తింపు కార్డులు, పాస్‌పోర్ట్ ఫొటోలు కూడా ఉన్నాయి. మొత్తం 158 మందికి చెందిన పాస్‌పోర్ట్ ఫొటోలు, వివిధ రకాలైన గుర్తింపు కార్డులు దొరికాయి. వీటి ద్వారానే నయీమ్ బినామీ పేర్లతో ఆస్తుల్ని రిజిస్టర్ చేయించుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరంతా ఎవరు? ఇవన్నీ నయీమ్‌కు ఎక్కడ్నుంచి వచ్చాయి? వారికి నయీమ్‌తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? తదితర అంశాలపై దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. వీరంతా నల్లగొండ జిల్లాకు చెందిన వారు కావొచ్చని భావిస్తున్నారు. గతేడాది నవంబర్ 16న ‘భువనగరి టీచర్స్ కాలనీలో మొదటి పాన్ ప్లాటింగ్ వాళ్ల నుంచి మనం రిటర్న్ కొన్న ప్లాట్స్’ అంటూ చేతి రాతతో ఉన్న నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది దేనికి సంబంధించినది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. జాగా నచ్చితే అంతే.. హైదరాబాద్‌తోపాటు పాటు చుట్టపక్కల ఉన్న జిల్లాల్లోనూ నయీమ్ భారీ స్థాయిలో సెటిల్మెంట్లు చేశాడు. నయీమ్ ఇంటి నుంచి వివిధ ప్రాంతాల్లోని స్థలాలు, పొలాలకు చెందిన 35 జిరాక్సు ప్రతుల్నీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెటిల్మెంట్ కోసం ఎవరైనా వచ్చినప్పుడు వారి నుంచి జిరాక్సు ప్రతుల్ని తీసుకునేవాడని పోలీసులు చెప్తున్నారు. ఎదుటి వారిని బెదిరించి సెటిల్ చేయడంతో భారీగా కమీషన్లు తీసుకోవడం నయీమ్ దందాల్లో ప్రధానమైంది. ఇలా సెటిల్మెంట్ కోసం తన వద్దకు వచ్చిన స్థలాల్లో ఏదైనా నచ్చితే దాన్ని అతడే సొంతం చేసుకునే వాడు. నయీమ్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న జిరాక్సు ప్రతుల్లో హైదరాబాద్, సైబరాబాద్, నల్లగొండ, మెదక్, కరీంనగర్‌లతో పాటు ఏపీలోని గుంటూరు జిల్లా పెదకాకానికి చెందినవి కూడా ఉన్నాయి. మొత్తం 35 జిరాక్సు ప్రతుల్లో సరూర్‌నగర్, ఘట్కేసర్ మండలంలోని ఔషాపూర్, రామాంతపూర్, భువనగిరి, గౌలిపుర, ఎన్టీఆర్ నగర్, గుంటూరు జిల్లా చినకాకానిలోని శ్రీగాయత్రి, అత్తాపూర్, కొండాపూర్‌లోని 9 ఎకరాలు 37 గుంటలు, మెదక్‌లోని అమీర్పుర, మన్సూరాబాద్, జూబ్లీహిల్స్‌లోని 1365 చదరపు గజాలు, తార్నాక, సైదాబాద్, రంగారెడ్డి జిల్లా కీసరలోని నాగారం, బైరామల్‌గూడ, కరీంనగర్‌లోని నగ్మూర్లో ఉన్న ప్లాట్, ఫ్లాట్లకు సంబంధించినవి ఉన్నాయి. వీటి విలువ రూ.120 కోట్ల వరకు ఉండచ్చని భావిస్తున్నారు. ఎన్కౌంటర్ తర్వాత షాద్‌నగర్‌లో నయీమ్ ఇంట్లో సోదా చేసిన పోలీసులకు కూడా దాదాపు 140కి పైగా భూములు, ఆపార్ట్‌మెంట్లకు సంబంధించిన పత్రాలు దొరికినట్టు సమాచారం. విస్తుపోతున్న ఐటీ అధికారులు! నయీమ్ హైదరాబాద్ తర్వాత భువనగిరిలో పెద్దమొత్తంలో ఆస్తులు కూడబెట్టాడు. ఈ ప్రాంతంలోని అనుపానులన్నీ అతనికి తెలిసి ఉండడంతో పాటు పెద్దఎత్తున అనుచరగణం ఉండడంతో ఇక్కడ భారీ స్థాయిలో భూములు కొనుగోలు, కబ్జాలు చేశాడని అంటున్నారు. మిర్యాలగూడలోని నయీమ్ అత్తగారింట్లో జరిపిన సోదాల్లో భూ లావాదేవీలకు సంబంధించిన ఈ విలువైన పత్రాలు దొరికాయి. భువనగిరిలో నయీమ్ బంధువులు, అనుచరుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగాయి. ఈ సోదాలన్నింటిలో బయటపడుతున్న డాక్యుమెంట్లు చూసి ఆదాయపు పన్ను శాఖ అధికారులే విస్తుపోతున్నారని సమాచారం. గుర్తించకుండా విగ్గులు, మేకప్ కిట్లు.. భద్రత విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటాడో నయీమ్ ఇళ్లు, సంబంధీకుల ఇళ్లలో దొరికిన మేకప్ కిట్ల ద్వారా తెలుస్తోంది. దాదాపు 30 విగ్గులు, 15 మేకప్ కిట్లు లభించాయి. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు పెట్టుకున్న విగ్గు పెట్టుకునేవాడు కాదు. అలాగే దాదాపు 250కి పైగా సెల్ఫోన్లు కూడా వినియోగించాడని పోలీసుల సోదాల్లో వెలుగుచూసింది. దుస్తులు, బూట్ల కొనుగోలులోనూ నయీమ్ ప్రత్యేకత కనబరుస్తాడని తెలుస్తోంది. ఒకేసారి 20-30 జతల షూలు, 30-50 జతల దుస్తులు కొంటాడని సమాచారం. నయీమ్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 35 జిరాక్సు పత్రాల్లోని కొన్ని భూ లావాదేవీల వివరాలివీ.. ► హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో 35 ఎకరాల 20 గుంటల భూమి. ఇక్కడ గజానికి 20వేలపై మాటే. విలువ దాదాపు రూ.348.48 కోట్లు! ► కొండాపూర్‌లో 9 ఎకరాల 35 గుంటలు. ఇక్కడ గజానికి రూ.50వేలపైనే ఉంది. విలువ దాదాపు 242 కోట్లు. ► సరూర్‌నగర్‌లో ఐదు ఎకరాల భూమి. విలువ 73 కోట్లు. ► అత్తాపూర్, షేక్‌పేట, బైరామ్గూడ, ఘట్కేసర్ ఔషన్పూర్, జూబ్లీహిల్స్, సైదాబాద్, బైరామల్ గూడలలో కూడా అనేక భూములున్నాయి. అక్కడ గజానికి 15 వేల నుంచి 25 వేల మధ్య ధర పలుకుతోంది. -
టెన్షన్.. టెన్షన్!
షాద్‌నగర్ పట్టణంలో రెడ్ అలర్టు నయీం మృతదేహనికి పోస్టుమార్టం షాద్‌నగర్ / షాద్‌నగర్ రూరల్: మాజీ మావోయిస్టు నేత, గ్యాంగ్‌స్టర్ నయీం(50) ఎన్‌కౌంటర్‌తో సోమవారం ఉదయం ఒక్కసారిగా షాద్‌నగర్ పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏం జరుగుతుందో తెలియక పట్టణవాసులు అయోమయానికి గురయ్యారు. పోలీసు వాహనాలు రయ్.. మంటూ పరుగులు తీయడంతో ఏం జరిగిందోనని ఆసక్తిగా గమనించారు. పోలీసులు ఎక్కడికక్కడే వాహనాలను ఆపి దారిమళ్లించారు. పట్టణ శివారులోని మిలీనియం టౌన్షిప్లో నయీం ఎన్‌కౌంటర్‌కు గురికావడంతో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఈ వార్త పట్టణంలో దావానలంలా వ్యాపించడంతో అతడి మృతదేహాన్ని చూసేందుకు పట్టణవాసులు పెద్దఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసు బలగాలు భారీఎత్తున అక్కడికి చేరుకుని ప్రజలు, మీడియాను దూరంగా నిలిపివేశారు. మిలీనియం టౌన్షిప్ పాత జాతీయ రహదారికి సమీపంలోనే ఉండటంతో రోడ్డుపై భారీసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఉగ్రవాదులు హతమయ్యారంటూ.. ఒకసారి నలుగురు, మరోసారి ఇద్దరు, మరోసారి ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారంటూ పట్టణంలో ప్రచారం జరిగింది. ఎన్కౌంటర్ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. పోలీసులు ముందే రెడ్ఎలర్ట్ ప్రకటించి వాహనాలను బైపాస్ రహదారిలో దారిమళ్లించారు. మరికొందరు మావోయిస్టులు తప్పించుకున్నారని పుకార్లు వ్యాపించడంతో పోలీసులు పట్టణం నలుమూలల తనిఖీలను విస్తృతం చేశారు. కారులు, జీపులు, ఇతర వాహనాలను ఆపి సోదాలు నిర్వహించారు. భారీ వాహనాలను సంఘటన స్థలం నుంచి రెండు కిలోమీటర్ల మేర నుంచే దారిమళ్లించారు. తహసీల్దార్ చందర్రావు సమక్షంలో.. షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలోనే నయీం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు పోలీసుల ఎన్కౌంటర్లో మృతిచెందగా సాయంత్రం ఐదుగంటల వరకు సంఘటన స్థలంలోనే ఉంచారు. తహసీల్దార్ చందర్రావు సమక్షంలో పోలీసులు పంచనామా నిర్వహించి షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. రాత్రి తొమ్మిది గంటలకు భారీ పోలీసు బందోబస్తు నడుమ నయీం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అంతకుముందు ఆయన బంధువులకు సమాచారమిచ్చారు. వారెవరూ రాకపోవడంతో ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి మార్చురీలో భద్రపరిచారు. మృతదేహాన్ని మంగళవారం ఉదయం వరకు బంధువులు తీసుకెళ్లే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ఒకవేళ తీసుకెళ్లకుంటే ఏమి చేయాలనేది రాష్ట్ర ఉన్నతాధికారులతో సంప్రందించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కారు ఎవరిది? గ్యాంగ్‌స్టర్ నయీం ఉపయోగిస్తున్న కారు ఎవరిదనేది సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫోర్డు ఎండివర్ కారు (నం. ఏపీ28 డీఆర్ 5859) ను 2013లో వడ్డేపల్లి నర్సింగ్‌రావు పేరిట రిజిష్టర్ అయినట్టుగా ఆర్టీఏ రికార్డు ప్రకారం తెలుస్తోంది. భూదందా, కబ్జాలు చేసిన నయీం వినియోగించిన కారు ఆయన పేరిట లేకపోవడం చర్చనీయాంశమైంది. దీనిని ఎవరైనా బహుమతిగా ఇచ్చారాననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజులుగా అతను ఇదే వాహనంలో షాద్‌నగర్‌కు రాకపోకలు సాగిస్తున్నట్లు కాలనీవాసులు చెబుతున్నారు. అందులో రివాల్వర్ బుట్ట దొరికింది. అనంతరం క్రేన్‌సాయంతో కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆచూకీ చెప్పిన ఫోన్ సిగ్నల్ నయీం కదలికలపై పోలీసులు అడుగడుగునా నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిసింది. నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లికి చెందిన ఓ వ్యాపారికి న యీం ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు నయీం కదిలికలపై నిఘాను ముమ్మరం చేశారు. ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఏ ప్రాంతాల్లో తిరుగుతున్నాడో పోలీసులు నిఘా ఏర్పాటు చేసుకున్నారు. షాద్‌నగర్ పట్టణ శివారులోని మిలీనియం టౌన్షిప్ నుంచి ఫోన్ సిగ్నల్ రావడాన్ని పసిగట్టిన వారు రెండు రోజులుగా ఈ ప్రాంతంలో నిఘాను ముమ్మరం చేశారు. సోమవారం ఉదయం నయీం తన డ్రైవర్‌తో కలిసి మిలీనియం టౌన్షిప్లో నుంచి ఫోర్ట్ ఎండివర్ వాహనంలో వెళుతుండగా ప్రత్యేక పోలీసులు వాహనాన్ని ఆపడానికి యత్నించారు. దీంతో డ్రైవర్ భయంతో పోలీసులపై కాల్పులు జరిపారు. ఒక్కసారిగా పోలీసులు అప్రమత్తమై ఎదురుకాల్పులు జరిపారు. డ్రైవర్ పారిపోగా నయీం అక్కడికక్కడే మృతి చెందాడు. నయీం సెటిల్మెంట్, భూదందాలకు సంబంధించి లక్ష్యంగా చేసుకున్న వారికి షాద్‌నగర్ ప్రాంతం నుంచే ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతుండేవాడు. సాధారణంగా బెదిరింపులపైనే దృష్టి సారించిన పోలీసులు ఏ ప్రాతంలో ఉంటున్నాడనే దానిపై పెద్దగా దృష్టి సారించలేకపోయారు. చివరకు డిచ్పల్లికి చెందిన రియల్టర్ పోలీసులపై ఒత్తిడి తేవడంతో సెల్ టవర్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. అదే నయీం ఎన్‌కౌంటర్‌కు కీలక ఆధార మైంది. షాద్‌నగర్‌లో ఇంత స్థాయిలో ఆశ్రయం ఏర్పరుచుకోవడానికి, గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలు చేయడానికి సహకరిస్తున్న స్థానికులెవరో పోలీసులు ఆరా తీస్తున్నారు. బిక్కుబిక్కుమన్న కాలనీవాసులు ఏమి జరుగుతుందో తెలియక కాలనీవాసులు బిక్కుబిక్కుమంటూ మధ్యాహ్నం వరకు ఇళ్లలోనే గడిపారు. సోమవారం ఉదయం కాలనీకి చేరుకున్న ప్రత్యేక పోలీసులు కాలనీవాళ్లను బయటకు రావద్దంటూ హెచ్చరికలు చేశారు. అనంతరం చుట్టుపక్కల ఇళ్లకు బయట నుంచి గడియ పెట్టారు. -
ఎప్పుడు ఏమి జరిగింది?
షాద్‌నగర్ : సంచలనం సృష్టించిన షాద్‌నగర్‌లో నయీం ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సోమవారం ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పది గంటల వరకు వివిధ పరిణామాలు సంభవించాయి. – ఉదయం 7.50 గంటలకు మిలీనియంటౌన్‌షిప్ కాలనీకి పోలీసులు చేరుకున్నారు – 8 గంటలకు నయీం నివాసగృహానికి ఎస్పీ రెమా రాజేశ్వరీ, ఏఎస్పీ కల్మేశ్వర్ రాక – 8.05కు కాలనీవాసులు బయటకు రావద్దంటూ ఆదేశాలు –8.10కు నయీం నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు – 8.15కు పోలీసుల కదలికలతో కార్లో పారిపోయేందుకు యత్నించి కాల్పులు జరిపిన డ్రైవర్, నయీం. ప్రతిగా కాల్పులు జరిపిన పోలీసులు. 15నిమిషాల పాటు కొనసాగిన ఎదురు కాల్పులు –8.17కు పారిపోయిన కారు డ్రైవర్ –8.17 నుంచి 8.30 వరకు పోలీసులకు నయీంకు మధ్య ఎదురుకాల్పులు. – 8.35కు కాలనీలోని పార్క్‌వద్ద మృతదేహం గుర్తింపు – 8.35 నుంచి పది గంటల వరకు సంఘటన స్థలానికి సమీపంలోని నివాస గృహంలో సోదాలు. నయీం భార్యాపిల్లలతోపాటు ప్రధాన అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు – 10.30కు సంఘటన స్థలానికి చేరుకున్న హైద్రాబాద్ రేంజ్ డీఐజీ అకూన్‌సబర్వాల్ – 11.30 వరకు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఎన్కౌంటర్ పూర్వపరాలను తెలుసుకున్న డీఐజీ – 11.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా పోలీసు బలగాల తరలింపు. – ఒంటి గంటకు మీడియాకు నయీం ఎన్కౌంటర్లో మృతి చెందాడని అధికారికంగా ప్రకటించిన ఎస్పీ రెమా రాజేశ్వరి – మధ్యాహ్నం 1.30 నుంచి రెండు వరకు నయీం ప్రయాణించిన కారు పరిశీలన. సంఘటన స్థలంలో లభించిన ఆధారాలను భద్రపరిచిన పోలీసులు – 2.30 నుంచి 3.30 వరకు మృతదేహాన్ని పంచనామా కోసం సంఘటన స్థలాన్ని పరిశీలించిన తహసీలార్ – మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 4.30 వరకు సంఘటన స్థలంలో పడి ఉన్న ఏకే–47 తుపాకీ, నయీం ఉపయోగించిన బుల్లెట్లను భద్రపరిచిన పోలీసులు – ఐదు గంటలకు మృతదేహానికి పంచనామా. 5.30 గంటలకు పోస్టుమార్టం కోసం షాద్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలింపు – రాత్రి తొమ్మిది గంటల వరకు ఆస్పత్రిలోనే మృతదేహం – నయీం బంధువులకు పోస్టుమార్టం కోసం సమాచారమిచ్చిన పోలీసులు – 9.30 వరకు ఎవరూ రాకపోవడంతో పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు – 10 గంటల నుంచి మార్చురీలోనే నయీం మృతదేహం -
గ్యాంగ్‌స్టర్ అయూబ్‌ఖాన్‌పై లుకవుట్ నోటీస్
హైదరాబాద్: కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అయూభ్ ఖాన్‌పై హైదరాబాద్ పోలీసులు సోమవారం లుకవుట్ నోటీస్ జారీ చేశారు. అయూబ్‌ఖాన్‌పై హైదరాబాద్ పరిధిలో ఎన్నో కేసులు నమోదై ఉన్నాయి. ఖాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతడిపై రౌడీషీట్ నమోదై ఉంది. ఈ నేపథ్యంలో లుకవుట్ నోటీస్ జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.