Gangster Lawrence Bishnoi Said They Are Not Forgive Salman Khan Over Blackbuck Case - Sakshi
Sakshi News home page

Salman Khan-Blackbuck Case: సల్మాన్‌ను మా వర్గం ఎప్పటికి క్షమించదు

Published Mon, Jul 11 2022 1:20 PM | Last Updated on Mon, Jul 11 2022 4:00 PM

Gangster Lawrence Bishnoi Said They Are Not Forgive Salman Khan Over Blackbuck Case - Sakshi

సల్మాన్‌ ఖాన్‌, గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ను తమ వర్గం ఎప్పటికి క్షమించదని గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. పంజాబి సింగర్‌ సిద్ధూ మూసేవాలా హత్యా కేసులో లారెన్స్‌ బిష్ణోయ్‌ జైలు శిక్ష ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింగర్‌ హత్యా కేసులో పోలీసులు ప్రస్తుతం అతడిన విచారిస్తున్నారు. ఈ సందర్భంగా లారెన్స్‌ పలు సంచలన విషయాలు వెల్లడించాడు.

చదవండి: ఆస్పత్రి నుంచి హీరో విక్రమ్‌ డిశ్చార్జి.. పాత వీడియో వైరల్‌ చేస్తున్న ఫ్యాన్స్‌

‘కృష్ణజింక హత్యకు సంబంధించి మా వర్గం ఎప్పటికీ సల్మాన్‪‌ను క్షమించదు. అతడు ఈ విషయంలో బహిరంగ క్షమాపణ చెబితేనే క్షమిస్తాం’ అని లారెన్స్ పేర్కొన్నట్లు ఢిల్లీ పోలీసలు చెప్పారు. కాగా జోధ్‌పూర్‌ అడవి సమీపంలో కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్‌ దోషిగా తేలిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సల్మాన్‌కు కోర్టు జైలు శిక్ష విధించగా బెయిలుపై బయటకు వచ్చాడు. ఇప్పటికే ఈ కేసులో విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ కేసులో సల్మాన్‌ను చంపేందుకు లారెన్స్ గ్యాంగ్ 2018లో ప్రయత్నించింది.

చదవండి: ది వారియర్‌ షూటింగ్‌లో దర్శకుడితో కాస్త ఇబ్బంది పడ్డా: కృతిశెట్టి

అంతేకాదు ఇటీవల సల్మాన్‌ ఖాన్‌ తండ్రితో పాటు  ఆయన తరపు లాయర్‌కు కూడా లారెన్స్‌ గ్యాంగ్‌ నుంచి హత్యా బెదిరింపు లేఖలు వచ్చాయి. ఇద్దరికీ సిద్ధూ మూసేవాలా గతే పడుతుందని హెచ్చరిక లేఖల్లో పేర్కొన్నారు. ఈ బెదిరింపులపై ఢిల్లీ పోలీసులు లారెన్స్‌ను ప్రశ్నించగా, అతడు ఈ విషయాలు వెల్లడించినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా లారెన్స్‌ బిష్ణోయ్‌ కమ్మునిటీలో కృష్ణ జింకను దైవంగా భావిస్తారట. ఈ నేపథ్యంలో బిష్ణోయ్‌, సల్మాన్‌ను టార్గెట్‌ చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement