death threat
-
షారుఖ్‌కి చంపేస్తామని బెదిరింపు కాల్.. నిందితుడి అరెస్ట్!
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ఖాన్ని చంపేస్తానంటూ బెదిరింపులకు దిగిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 50 లక్షలు ఇవ్వకపోతే షారుఖ్‌ని చంపేస్తానని ఓ వ్యక్తి ముంబై పోలీసులకు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. నిందితుడు రాయఫూర్కి చెందిన ఫైజల్ ఖాన్‌గా తేలింది. మంగళవారం ఛతీస్గడ్కి వెళ్లిన పోలీసులు..అక్కడ ఫైజల్‌ని అదుపులోకి తీసుకున్నారు.నా పేరు హిందుస్తానీడబ్బుల కోసం నిందుతుడు ఈ పథకం వేసినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున డబ్బు కావాలని ఇలాంటి బ్లాక్ మెయిల్ కాల్స్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ‘నవంబర్ 7న ఓ కొత్త నెంబర్ నుంచి కాల్ చేసి ‘షారుఖ్ ఖాన్ నాకు రూ.50 ఇవ్వకపోతే చంపేస్తా అని ఓ వ్యక్తి చెప్పారు. మీ పేరు ఏంటని అడిగితే.. ‘అది అనవసరం. మీకు నా పేరే ముఖ్యమని అనిపిస్తే.. ‘హిందుస్తాని’ అని రాసుకోండి’అని చెప్పి కాల్ కట్ చేశాడు’ అని ముంబై పోలీసులు తెలిపారు.బిగ్ ట్విస్ట్షారుఖ్ని చంపేస్తామని కాల్ రావడంతో ముంబై పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కాల్ గురించి ఆరా తీయగా అది ఛత్తీస్‌గఢ్‌కి చెందిన ఫైజన్ ఖాన్ అనే వ్యక్తి పేరుపై రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. మంగళవారం ఓ బృందం ఛత్తీస్‌గఢ్‌కి వెళ్లి నిందితుడుని అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు మాత్రం ఆ కాల్ చేసింది తాను కాదని చెబుతున్నాడు. \తన ఫోన్ ఎవరో దొంగిలించారని.. దీనిపై తాను పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని రాయ్ పూర్ ఎస్పీ అజయ్ కుమార్ కూడా దృవీకరించారు. ‘నవంబర్ 2న ఫైజన్ ఖాన్ పోలీసు స్టేషన్‌కి వచ్చిన తన ఫోన్ పోయిందని ఫిర్యాదు ఇచ్చాడు. ముంబై పోలీసులకు కూడా విషయాన్ని చెప్పారు. దానికి సంబంధించిన డ్యాక్యుమెంట్స్ కూడా ముంబై పోలీసులకు అందించాడు’అని రాయ్‌పూర్ ఎస్పీ మీడియాకు తెలిపారు.షారుఖ్‌కి భద్రత పెంపుషారుక్కి గతేడాదిలో కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం షారుక్‌కి Y+ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికీ షారుఖ్‌కి వై ప్లస్(Y+) సెక్యూరిటీనే కొనసాగుతుంది. కాగా, బాలీవుడ్ మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కి కూడా వరుసగా ఇలాంటి బెదిరింపులే వస్తున్నాయి. సల్మాన్‌ని చంపేస్తామని గత కొన్ని రోజులుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు కాల్స్ చేస్తునే ఉంది. దీంతో సల్మాన్‌కి కూడా భద్రతను పెంచారు. ఇలా స్టార్ హీరోలందరికి బెదింపు కాల్స్ రావడం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. -
సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు.. రూ.2 కోట్లు ఇవ్వకపోతే
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కి బెదిరింపు కాల్స్.. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య జరిగిన దగ్గర నుంచి బెదిరింపులు మరీ ఎక్కువైపోతున్నాయి. మొన్నటికి మొన్న రూ.5 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని ఓ మెసేజ్ రాగా.. ఇప్పుడు రూ.2 కోట్లు డిమాండ్ చేస్తూ ముంబై ట్రాఫిక్ పోలీసులకు మరో వాట్సాప్స్ మెసేజ్ వచ్చింది.(ఇదీ చదవండి: హత్య కేసులో స్టార్ హీరో దర్శన్‌కి మధ్యంతర బెయిల్)ఈ క్రమంలోనే వర్లీ పోలీసులు.. గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి, దర్యాపు చేపట్టారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చేతిలో హత్యమైన బాబా సిద్దిఖీ కొడుకు జీషన్ సిద్దిఖీని కూడా చంపేస్తామని బెదిరించాడు. ఇలా చేసిన 20 ఏళ్ల గుఫ్రన్ని అరెస్ట్ చేసిన కాసేపటికే సల్మాన్‌కి బెదిరింపులు రావడం హాట్ టాపిక్ అయిపోయింది.అప్పుడెప్పుడో కృష్ణజింకలని వేటాడిన కేసు ఇప్పటికీ సల్మాన్‌ఖాన్ వెంటాడుతూనే ఉంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. పలుమార్లు చంపుతామని బెదిరిస్తూనే ఉన్నారు. బిష్ణోయిల మందిరానికి వెళ్లి క్షమాపణలు చెబితే వదిలేస్తామని కూడా అన్నారు. కానీ భద్రత పెంచుకోవడం తప్పితే సల్మాన్ నుంచి క్షమాపణ గురించి స్పందన లేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి క్రేజీ సినిమా.. కండోమ్ కంపెనీపై కేసు పెడితే?) -
చంపేస్తామని బెదిరిస్తున్నారు: టీఎంసీ ఎంపీ
తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ సౌగతా రాయ్ బుధవారం తనకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు పేర్కొన్నారు. అరెస్టయిన పార్టీ నాయకుడు జయంత్ సింగ్‌ను త్వరగా విడుదల చేయకపోతే తనను చంపేస్తానని ఫోన్లో బెదిరించారని తెలిపారు. ఫోన్ చేసిన వ్యక్తి బెదిరించడమే కాకుండా.. తనను అసభ్య పదజాలంతో దుర్భాషలాడాడని సౌగతా రాయ్ పేర్కొన్నారు.కాగా పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని అరియాదాహా ప్రాంతానికి చెందిన టీఎంసీ నాయకుడు జయంత్ సింగ్‌ను జూన్ 30న జరిగిన ఓ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా పోలీసులు గత వారం అరెస్టు చేశారు. అరియాదాహ.. డమ్ డమ్ లోక్‌సభ నియోజకవర్గం కిందకు వస్తుంది. ఈ స్థానానికి సౌగతా రాయ్ గత నాలుగు పర్యాయాలు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.అయితే గుర్తు తెలియని నెంబర్ నుంచి రెండు ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు రాయ్ పేర్కొన్నారు. అరియాదాహకు వెళితే చంపేస్తానని కూడా కాల్ చేసిన వ్యక్తి చెప్పాడని తెలిపారు. తర్వాత తాను బరాక్‌పూర్ పోలీస్ కమిషనర్‌ను సంప్రదించి నంబర్‌ను ట్రాక్ చేయమని కోరినట్లు చెప్పారు. అనంతరం తాను కూడా పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.టీఎంసీ నేత జయంత్ సింగ్‌పై కేసు ఏంటి?జూన్ 30న కళాశాల విద్యార్థిని, అతని తల్లిపై దాడి చేసిన కేసులో జయంత్ సింగ్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. ఇందులో కొంతమంది వ్యక్తులు ఇద్దరు వ్యక్తులను కొట్టడం కనిపించింది.అరియాదాహాలో ఒక బాలికపై కొంతమంది వ్యక్తులు దాడి చేసినట్లు చూపుతున్న పాత వీడియో ఆధారంగా పోలీసులు సింగ్‌పై సుమోటో కేసు నమోదు చేశారు. మంగళవారం ఈ ఘటనకు సంబంధించి సింగ్ సన్నిహితుడు పట్టుబడ్డాడు. , ఈ కేసులో ఇప్పటి ముగ్గురిని అరెస్ట్ చేశారు.2023లో మరో కేసులో అరెస్టయి, ఇకపై ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా హామీ ఇచ్చి బాండ్‌తో బెయిల్‌పై బయటకు వచ్చాడు జయంత్. ఆ షరతును ఇప్పుడు ఉల్లంఘించినందుకు ఆయన తాజా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. -
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
జైపూర్: లోక్‌సభ ఎన్నికల వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌కు చెందిన మంత్రి బాబులాల్ ఖరాడీను చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. దీంతో, పోలీసులు అప్రమత్తమయ్యారు.వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వంలో బాబులాల్ ఖరాడీ గిరిజన శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా(ఇన్స్‌స్టాగ్రామ్) వేదికగా మంత్రి బాబులాల్‌కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఈ మేసేజ్‌లో బాబులాల్‌ను చంపేస్తానని దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. Babulal Kharadi Receives Death Threat: बाबूलाल खराड़ी को सोशल मीडिया पर मिली धमकी | Udaipur | BJP#RajasthanWithFirstIndia #BabulalKharadi #BJP #Udaipur #RajasthanNews #RajasthanPolitics #DeathThreats pic.twitter.com/s7iL3WY7Gc— First India News (@1stIndiaNews) May 4, 2024 ఈ నేపథ్యంలో మంత్రి బాబులాల్ కుమారుడు.. ఈ మెసేజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. మూడు రోజుల క్రితం ఈ బెదిరింపులు వచ్చినట్లు తెలిపారు. అయితే, గిరిజనులను హిందూ మతంలోకి మారుస్తున్నారని ఆరోపిస్తూ మంత్రిని చంపేస్తానని గుర్తు తెలియని వ్యక్తి బెదిరించినట్లు చెప్పారు. ఈ మేరకు సదరు వ్యక్తిపై ఉదయ్‌పూర్‌లోని కొద్దా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. -
ఫేక్ వీడియోకున్న విలువ.. సీఎం జగన్ ప్రాణానికి లేదా?
హైదరాబాద్, సాక్షి: చంద్రబాబు పబ్లిక్‌గా ఏపీ సీఎం జగన్‌ను చంపుతా అంటున్నారని, ఎన్నికల వేళ ఫేక్ వీడియోల గురించి తీవ్రంగా స్పందిస్తున్నవాళ్లు.. ఇంత సీరియస్ ఇష్యూపై స్పందించకపోవడం బాధాకరమని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్, YSRCP నేత పోసాని కృష్ణమురళి ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం ఉదయం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎన్నో రోజులుగా సీఎం జగన్‌ను చంపేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ‘రేపే నిన్ను(సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ..) చంపితే ఏం చేస్తారు’ అని చంద్రబాబు అడుగుతున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే మీరే చేపించుకున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. ఇది దుర్మార్గం కాదా?. దీనిపై ఎవరూ స్పందించరా?. ఒక ఫేక్ వీడియోకి ఉన్న విలువ సీఎం జగన్ ప్రాణానికి లేదా?.. సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ఆర్థిక నేరస్తులు. ఈ విషయం అందరికీ తెలుసు. అసలు సుజనా చౌదరి బీజేపీలోకి ఎందుకు మారారు? బీజేపీలో ఉంటే వేల కోట్లు తినొచ్చా? అక్రమాలు చేసిన వాళ్లు బీజేపీలో ఉంటే శిక్ష పడదా?. మోదీగారు మీరు నిజాయితీవంతమైన నాయకులు. ఇలాంటి వారిని ప్రొత్సహించి మీ ఇమేజ్ను దెబ్బ తీసుకోకండి’’ అని పోసాని అన్నారు. -
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ మరోసారి బెదిరింపులు
ఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను ఈ రిపబ్లిక్ డే రోజు హత్య చేస్తానని బెదిరింపులు చేశాడు. జనవరి 26న భగవంత్ మాన్‌పై గ్యాంగ్స్టర్లు ఏకమై దాడికి దిగాలని పన్నూ కోరారు. గ్యాంగ్స్టర్లపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నదని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. పన్నూ బెదిరింపులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సిక్కు ఫర్ జస్టిస్ (SFJ) వ్యవస్థాపకుడు పన్నూ గతంలో భారతీయ సంస్థలు, అధికారులపై అనేకమార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. గత నెల, డిసెంబర్ 13న భారత పార్లమెంటుపై దాడి చేస్తానని వీడియోను విడుదల చేశాడు. అదే క్రమంలో పార్లమెంట్‌పై డిసెంబర్ 13న ఆగంతకులు కలర్ బాంబు షెల్స్‌తో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ మరొక బెదిరింపు వీడియో ఇటీవల బయటపడింది. నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో వెళ్లాలనుకుంటున్న ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని బెదిరింపులు చేశాడు. ఎయిరిండియా బెదిరింపు వీడియోపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పన్నూపై కేసు నమోదు చేసింది. ఇదీ చదవండి: కృష్ణ జన్మభూమి కేసు: మసీదు సర్వేపై సుప్రీంకోర్టు స్టే -
ఆ ఫోటోలు డిలీట్ చేయకపోతే చంపేస్తాం... ఉర్ఫికి బెదిరింపులు!
సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారనే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకుంది బాలీవుడ్ భామ ఉర్ఫీ జావెద్. విచిత్రమైన వేషధారణతో ఫోటో షూట్ చేసి..వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. అయితే కొన్నిసార్లు అవి వివాదానికి దారి తీస్తుంటాయి. తాజాగా ఈ బిగ్‌బాస్ భామకు హత్యా బెదరింపులు వచ్చాయి. సోషల్ మీడియాలో ఫోస్ట్ చేసిన ఫోటోలు డిలీట్ చేయకపోతే.. చంపేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఉర్ఫీనే ఎక్స్ వేదికగా చెప్పింది. అసలేం జరిగింది? విచిత్ర వేషధారణతో ట్రెండింగ్‌లో నిలిచే మోడల్, నటి ఉర్ఫీ జావేద్. నిత్యం ఏదో ఒక విచిత్రమైన డ్రెస్‌తో ఫోటోషూట్ చేసి వాటిని తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయడం ఆమెకు అలవాటు. అలా తాజాగా భూల్ భులయ్యలోని ఛోటా పండిత్ క్యారెక్టర్ డ్రెస్ ధరించి.. ఫోటోషూట్ చేసింది. అంతేకాదు అదే గెటప్‌లో ఓ పార్టీకి కూడా హాజరైంది. దీంతో ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. చంపేస్తామని బెదరింపులు వింత ఫ్యాషన్‌తో విమర్శలకు కేంద్రబిందువుగా మారే ఉర్పీకి ఛోటా పండిత్ గెటప్ లేనిపోని తలనొప్పిని తెచ్చిపెట్టింది. ఛోటా పండిత్ గెటప్‌లో పార్టీకి హాజరవ్వడం పట్ల ఓ వర్గం ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ మతాన్ని కించపరిచేలా చేస్తున్నావని, ఇలాగే కంటిన్యూ చేస్తే చంపేస్తామని కొంతమంది ఆమెను బెదరిస్తున్నారట. అంతేకాదు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలను డిలీట్ చేయలని, లేదంటే చంపడం తమకు పెద్ద పనే కాదంటూ బెదిరింపు మెయిల్స్ పంపిస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఉర్ఫీనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే ఉర్ఫీకి ఇలాంటి బెదిరింపులు రావడం పరిపాటే. గతంలో కూడా అనేకసార్లు ఉర్ఫీకి ఈ తరహా బెదిరింపులు వచ్చాయి. I’m just shocked and appalled by this country mahn , I’m getting death threats in recreating a character from a movie where as that character didn’t get any backlash :/ pic.twitter.com/pOl9FvTYzT — Uorfi (@uorfi_) October 30, 2023 -
శరద్ పవార్ కు బెదిరింపులు.. వ్యక్తి అరెస్టు
ముంబై: ఇటీవల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ ను చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు విషయమై ఆయన కుమార్తె సుప్రియా సూలే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. విచారణ చేపట్టిన ముంబై పోలీసులు ఈ చర్యకు పాల్పడింది సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సాగర్ బర్వేగా గుర్తించి సోమవారం అతడిని అరెస్టు చేశారు. అదే గతి పడుతుంది.. కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ను చంపేస్తామంటూ ఒక వార్నింగ్ ప్రత్యక్షమైంది. ఆ బెదిరింపులో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన నరేంద్ర దభోల్కర్ కు ఎదురైన పరిస్థితి అతి త్వరలో శరద్ పవార్ కు కూడా ఎదురవుతుందని, 2013లో నరేంద్ర దభోల్కర్ ను ఇద్దరు ఆగంతకులు బైక్ మీద వచ్చి కాల్చి చంపినట్టే ఈయనను కూడా చంపుతామని పోస్ట్ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ పోస్ట్ చేసిన వ్యక్తిని కనుగొనేందుకు విచారణ చేపట్టారు. ఆమెతో పాటు ఎన్సీపీ కార్యకర్త ఒకరు లోకమాన్య తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఎలా పట్టుకున్నారంటే.. ఈ వార్నింగ్ ఏ ఐపీ అడ్రస్ నుండి వచ్చిందన్న కోణంలో ఎంక్వైరీ చేయగా ఆ ఐపీ అడ్రస్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సాగర్ బర్వేకు చెందినదని గుర్తించారు పోలీసులు. సాగర్ ఓ ప్రయివేటు కంపెనీలో డేటా ఫీడింగ్ అండ్ అనలిటిక్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. నిందితుడి వివరాలు తెలిసిందే తడవు వెంటనే సాగర్ బర్వేను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచి రిమాండుకు తరలించారు పోలీసులు. శరద్ పవార్ ఇటీవల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఆయన కుమార్తె సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ లను ప్రకటించిన విషయం తెలిసిందే. నాయకత్వం చేతులు మారి పార్టీ కార్యాచరణ ముమ్మరం చేస్తున్న ఇదే సమయంలో ఆయనను చంపేస్తామంటూ బెదిరింపులు రావడంతో ఆందోళనలో ఉన్నాయి పార్టీ వర్గాలు. ఎట్టకేలకు వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి అరెస్టుతో ఎన్సీపీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఇది కూడా చదవండి: అలిగిన అజిత్ పవార్.. మరోసారి అసంతృప్తి? -
‘టిప్పూలాగే చేయాలి’.. సిద్ధూకు ప్రాణహానీ? పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు..
సాక్షి, బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించింది ఆ రాష్ట్ర కాంగ్రెస్. ఈ మేరకు బెదిరింపులకు పాల్పడిన మాజీ మంత్రి అశ్వత్ నారాయణ్ పై మైసూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉరి గౌడ, నంజేగౌడలు టిప్పు సుల్తాన్‌ను అంతం చేసినట్లే.. సిద్ధరామయ్యను సైతం చంపేయాలని పబ్లిక్ మీటింగ్‌లో అశ్వత్ నారాయణ్ మాట్లాడినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. అశ్వత్ నారాయణ్‌ను అరెస్టు చేయాలని పోలీసులను కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) ప్రతినిధి ఎమ్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. 18 వ శతాబ్దానికి చెందిన మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్. బ్రిటీషర్ల పోరాటంలోనూ టిప్పు సుల్తాన్ మరణించలేదు. కానీ ఒక్కలిగ జాతికి చెందిన ఉరి గౌడ, నంజె గౌడల చేతిలో చనిపోయాడు. 'టిప్పు మద్దతుదారుడు సిద్ధరామయ్య ఇప్పుడు పరిపాలనలోకి వచ్చాడు. మీకు టిప్పు కావాలా? లేక హిందుత్వాన్ని కాపాడిన సావర్కర్ కావాలా?. నంజెగౌడ ఎం చేశారు?. అదే విధంగా సిద్ధరామయ్యను కూడా చేయాలి' అని పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడే క్రమంలో సిద్ధరామయ్యను టిప్పుతో పోల్చుతూ మాజీ మంత్రి అశ్వత్ నారాయణ్ అన్నారు. (అక్కడ ఐక్యత చూశా.. విపక్షాల బాయ్‌కాట్ నిర్ణయంపై ప్రధాని చురకలు!) నేనొస్తే టిప్పు సుల్తాన్ వచ్చినట్టే అశ్వత్ నారాయణ్ వ్యాఖ్యలపై సిద్ధరామయ్య స్పందించారు. తనపై ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. 'నన్ను అంతం చేయనిస్తారా?. నేను అధికారంలోకి వచ్చానంటే టిప్పు అధికారంలోకి వచ్చినట్టే. టిప్పు సుల్తాన్, కిట్టుర్ రాణి చెన్నమ్మ, సంగోళి రాయన్న అంటే నాకు ఎంతో గౌరవం' అని పబ్లిక్ ర్యాలీలో అన్నారు. అయితే ఫిబ్రవరిలోనే మాజీ మంత్రి అశ్వత్ నారాయణ్ వ్యాఖ్యలపై సిద్ధరామయ్య ఫిర్యాదు చేశారు. కానీ అతనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం పోలీసులకు కాంగ్రెస్ మరోసారి ఫిర్యాదు చేసింది. నేనలా అనలేదు ఈక్రమంలో తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని మాజీ మంత్రి అశ్వత్ నారాయణ్ చెప్పారు. ఎన్నికల్లో ఓడించాలనే ఉద్దేశంలో ఆ వ్యాఖ్యలు చేశానని అన్నారు. 'నేను సిద్ధరామయ్యను టిప్పు సుల్తాన్‌తో పోల్చాను. సిద్ధరామయ్యకు టిప్పు సుల్తాన్‌పై ఉన్న ప్రేమ గురించి మాట్లాడాను. సిద్ధరామయ్యపై నేనేమీ అవమానకరంగా మాట్లాడలేదు. రాజకీయ, భావజాల వైరుధ్యాలే తప్ప సీఎంపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి క్షక్షపూరిత ఆలోచనలు లేవు. నా వ్యాఖ్యలు ఏవైనా ఆయన మనోభావాలను దెబ్బతీస్తే అందుకు చింతిస్తున్నాను' అని అసెంబ్లీలో మాజీ మంత్రి అశ్వత్ నారాయణ్ చెప్పుకొచ్చారు. (మనిషి చనిపోయేది రెండు వారాల ముందే తెలుస్తుందా?.. పరిశోధనలు ఏం చెప్తున్నాయి!) -
నా ప్రాణానికి ముప్పు.. మోదీ, అమిత్‌షాకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో నెలకొన్న పరిస్థితులతో తనకు, తన కుటుంబానికి ఉగ్రవాద సంస్థల నుంచి ప్రాణహాని ఉందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాలకు గురువారం లేఖలు రాశారు. హైదరాబాద్ వ్యాప్తంగా అల్లర్లు సృష్టించడం, తనపై, తన కుటుంబంపై మానవ బాంబులతో దాడులు జరిపేందుకు కుట్రలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందిందని పేర్కొన్నారు. దేశ విదేశాల నుంచి తనకు పలు బెదిరింపు కాల్స్ రావడంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. తనకు, తన కుటుంబానికి భారీ భద్రత కలి్పంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: ఎవరు ఉద్యమం చేసినా కేసీఆర్ భయపడుతున్నారు: బండి సంజయ్ -
సీఎం యోగిని చంపేస్తానని వచ్చిన బెదిరింపు కాల్లో ప్రేమకోణం..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తానని బెదిరింపు కాల్ రావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో ప్రేమ కోణం ఉన్నట్లు విచారణలో తేలింది. తాను ప్రేమించిన యువతి తండ్రిపై కోపంతో ఓ యువకుడు అతని ఫోన్ దొంగిలించి సీఎంకు చంపేస్తానని కాల్ చేశాడని పోలీసులు తెలిపారు. ప్రేయసి తండ్రిని తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపాలని పథకం పని యువకుడు ఈ పని చేసినట్లు వెల్లడించారు. అతడిపై ఫోన్ చోరీ కేసు కూడా నమోదు చేశారు. నిందితుడ్ని 18 ఏళ్ల అమీన్‌గా గుర్తించారు. ఏం జరిగిందంటే..? మంగళవారం ఉదయం 112 నంబర్‌కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తానని బెదిరింపు కాల్ చేశాడు. యూపీ పోలీసుల హెల్ప్ లైన్ వాట్సాప్ నంబర్‌కు కూడా ఈ సందేశాన్ని పంపాడు. దీంతో అప్రమత్తమైనా పోలీసులు ఆ నంబర్‌ను ట్రేస్ చేశారు. లక్నోలో ఉంటున్నాడని తెలిసి వెంటనే అతని వద్దకు చేరుకున్నారు. అయితే తన ఫోన్‌ను రెండు రోజుల క్రితమే ఎవరో దొంగిలించారని, ఈ కాల్ తాను చేయలేదని సజ్జాద్ హుస్సేన్ పోలీసులకు చెప్పాడు. దీంతో పొరుగింటి వారిని పోలీసులు వాకబు చేశారు. అప్పుడే అమీన్ గురించి వాళ్లు చెప్పారు. హుస్సేన్‌ను ఇరికేందుకు అతడే ఈ పని చేసి ఉంటాడని పేర్కొన్నారు. వెంటనే పోలీసులు అమీన్ వద్దకు చేరుకుని అరెస్టు చేశారు. హుస్సేన్ కూతుర్ని తాను ప్రేమించానని, ఆయన తమ ప్రేమకు ఒప్పుకోలేదనే ఇలా చేసినట్లు విచారణలో తెలిపాడు. హుస్సేన్‌పై ప్రతీకారంతోనే ఫోన్ దొంగిలించి సీఎం యోగిని చంపేస్తానని బెదిరింపు కాల్ చేసినట్లు అంగీకరించాడు. చదవండి: షిండేకు ఊహించని షాకిచ్చిన బీజేపీ.. సీఎంగా తప్పుకోవాలని హుకుం.. కొత్త ముఖ్యమంత్రి ఎవరంటే..? -
Yogi Adityanath Death Threat: సీఎం యోగిని హత్య చేస్తానంటూ బెదిరింపులు
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ను హత్య చేస్తానంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు దిగాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ వ్యక్తిని ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు. లక్నోకు చెందిన ఓ వ్యక్తి యూపీ ఎమర్జెన్సీ నెంబర్ 112కి మెసేజ్ చేశాడు. సీఎం యోగిని త్వరలో చంపుతానంటూ సందేశంలో పేర్కొన్నాడు. దీంతో 112 ఆపరేషన్ కమాండర్ విషయాన్ని సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఐపీసీ సెక్షన్లు 506, 507, ఐటీ యాక్ట్ 66 ప్రకారం కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ కేరళ పర్యటన వేళ ఆయన ఆత్మాహుతి బాంబు దాడిలో చంపుతామంటూ ఓ వ్యక్తి బెదిరించడం కలకలం రేపింది. కొచ్చికి చెందిన జేవియర్ అనే వ్యక్తి ఈ మేరకు కేరళ బీజేపీ చీఫ్ సురేంద్రన్‌కు లేఖ పంపాగా.. ఆయన దానిని పోలీసులకు అందజేశారు. అయితే వారం తర్వాత ఆ లేఖ గురించి మీడియాకు సమాచారం పొక్కింది. దీంతో గోప్యంగా ఉంచాల్సిన విషయాన్ని బయటపెట్టారంటూ బీజేపీ, కేరళ పోలీసులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఇక ప్రధాని కేరళ రెండో రోజుల పర్యటన కోసం భారీగా పోలీసులను మోహరించారు. -
చంపుతామని బెదిరించినప్పుడు సల్మాన్ డబ్బులు ఆఫర్ చేశాడు:గ్యాంగ్‌స్టర్
ముంబై: గతేడాది మేలో జరిగిన పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇది తమ పనేనంటు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో అతని పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అయితే సిద్ధూ హత్య జరిగిన కొన్ని గంటల తర్వాత బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను చంపుతామని ఓ బెదిరింపు లేఖ ఆయనకు చేరింది. సిద్దూ మూసేవాలను చంపినట్లే నిన్నూ హత్య చేస్తాం అని అందులో ఉంది. లేఖపై పేరు లేకపోయినప్పటికీ ఇది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనే అని అందరికీ అర్థమైంది. కొన్నేళ్ల క్రితమే కృష్ణ జింకలను వేటాడినందుకు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని ఇతడు బెదిరించడం తీవ్ర దుమారం రేపింది. అయితే సల్మాన్‌ను చంపేందుకు రూ.4లక్షలు పెట్టి తుపాకీ కూడా కొన్నట్లు లారెన్స్ బిష్ణోయ్ చెప్పాడు. ఆయన తమ సమాజాన్ని అమమానించాడని, అందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. లేదంటే సల్మాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. అలాగే సల్మాన్‌ను బెదిరించినప్పుడు ఆయన తమకు భారీగా డబ్బు కూడా ఆఫర్ చేశాడని, కానీ తాము తిరస్కరించామని తెలిపాడు. 'సల్మాన్ ఖాన్‌పై మా సమాజంలో తీవ్ర ఆగ్రహం ఉంది. ఆమన మమ్మల్ని అవమానించాడు. అతనిపై ఓ కేసు కూడా ఉంది. కానీ ఇప్పటివరకు క్షమాపణలు చెప్పలేదు. ఇప్పటికీ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. నాకు ఎవరి సాయం అవసరం లేదు. సల్మాన్‌పై నాకు చిన్నప్పటి నుంచే కోపం ఉంది. ఆయన అహాన్ని అతి త్వరలో లేదా ఆ తర్వాత దెబ్బతీస్తా. ఆయన మా పవిత్ర దేవాలయానికి వచ్చి క్షమాపణలు చెప్పాలి. అప్పుడు మా సమాజం క్షమిస్తే.. నేను ఏమీ అనను..' అని లారెన్స్ బిష్ణోయ్ ఓ వార్త సంస్థతో మాట్లాడుతూ చెప్పాడు. WATCH | अपना नाम बड़ा करने के लिए सलमान खान को धमकी देता है लॉरेंस बिश्नोई ? जानिए क्या बोला @RubikaLiyaquat | @akhileshanandd | @jagwindrpatial LIVE - https://t.co/4StwkoboMD#OperationDurdantOnABPNews #LawrenceBishnoi #SalmanKhan pic.twitter.com/OaTqFxdNC9 — ABP News (@ABPNews) March 14, 2023 చదవండి: 'మేడం చాలా క్యూట్‌గా ఉన్నావ్..' అంటూ మహిళా పోలీస్‌ను వేధించిన ఆకతాయి.. -
ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు బెదిరింపులు.. మళ్లీ అతడే..!
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌కు బెదిరింపులు వచ్చాయి. మహారాష్ట్ర ముంబైలోని సిల్వర్ ఓక్లో పవార్ నివాసానికి ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. షూట్ చేసి చంపేస్తానని హెచ్చరించాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడ్ని గుర్తించారు. ఫోన్ చేసిన వ్యక్తి బిహార్‌కు చెందిన వాడని పోలీసులు వెల్లడించారు. ఇతను గతంలోనూ ఓసారి పవార్‌ను చంపేస్తానని బెదిరించాడని పేర్కొన్నారు. అయితే అప్పుడు అరెస్టు చేసి వదిలేశామని తెలిపారు. ఇప్పుడు అదే వ్యక్తి మళ్లీ బెదిరింపు కాల్ చేయడంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. అతని కోసం వెతుకుతున్నామని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని వివరించారు. చదవండి: ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు.. 24 గంటల్లోపే అరెస్ట్ -
'ఇండోర్‌లో అడుగుపెడితే చంపేస్తాం..' రాహుల్ గాంధీకి బెదిరింపులు
ఇండోర్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర మరో రెండు రోజుల్లో మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో ఆయనను చంపేస్తామని బెదిరింపులు రావడం పార్టీ శ్రేణులకు ఆందోళన కల్గిస్తోంది. మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్ జుని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్వీట్ షాపు ముందు ఈ బెదిరింపు లేఖ ప్రత్యక్షమైంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇండోర్‌లో అడుగు పెట్టగానే బాంబులేసి చంపేస్తామని లేఖలో ఉంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. ఈ లేఖ ఎవరి పని అయి ఉంటుందా? అని ఆరా తీస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితుడిపై తీవ్ర అభియోగాలు మోపి విచారణ చేపట్టారు. వీర్ సావర్కర్ ప్రాణభయంతో బ్రిటిషర్లను క్షమాభిక్ష కోరిన వ్యక్తి అని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించిన తరుణంలో ఈ బెదిరింపు లేఖ ప్రత్యక్షం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది. శుక్రవారం యాత్రలో మహాత్మ గాంధీ మునివనవడు తుషార్ గాంధీ.. రాహుల్‌తో పాటు పాదయత్రలో పాల్గొన్నారు. నవంబర్ 20న మహారాష్ట్రలో యాత్ర ముగించుకుని మధ్యప్రదేశ్‌లోకి రాహుల్ అడుగుపెట్టనున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సావర్కర్ మనవడు మహారాష్ట్రలో కేసు పెట్టారు. స్వతంత్ర సమరయోధుడైన తన తాతను రాహుల్ అమమానించారని మండిపడ్డారు. చదవండి: నెహ్రూ మునిమనవడితో గాంధీ మునిమనవడు.. వీడియో వైరల్ -
సిద్ధూ మూసేవాలా తండ్రిని చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు
చండీగఢ్: సిద్ధూమూవేవాలా తండ్రి బాల్కౌర్ సింగ్‌ను చంపుతానని బెదిరించిన వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడ్ని రాజస్థాన్ జోధ్‌పూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పంజాబ్ మాన్సా కోర్టులో ప్రవేశపెట్టి ఐదు రోజులు రిమాండ్‌లోకి తీసుకున్నారు. నిందితుడి పేరు మహిపాల్ అని పోలీసులు తెలిపారు. ఈమెయిల్ ద్వారా ఇతడు సిద్ధూ తండ్రిని చంపేస్తానని బెదిరించాడు. అంతేకాదు సిద్ధూ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏజే లారెన్స్ బిష్ణోయ్ పేరుతో సోషల్ మీడియాలో పేజీ కూడా క్రియేట్ చేశాడు. ఫాలోవర్లను పెంచుకోవాలనే ఉద్దేశంతోనే సిద్ధూ తండ్రికి మహిపాల్ బెదిరింపు మెయిల్ పంపినట్లు పోలీసులు పేర్కొన్నారు. సిద్ధూ హత్యకు సంబంధించి కెన్యాలో అన్మోల్ బిష్ణోయ్, అజర్బైజాన్లో సచిన్ తాపన్ను అదుపులోకి తీసుకున్నట్లు కేంద్రం సెప్టెంబర్ 1న ధ్రువీకరించింది. స్థానిక అధికారులతో టచ్‌లో ఉన్నట్లు చెప్పింది. చదవండి: థర్డ్ ఫ్రంట్ కాదు.. మెయిన్ ఫ్రంట్.. 2024లో సరికొత్త చరిత్ర -
సల్మాన్ ఖాన్‌ను మా వర్గం ఎప్పటికి క్షమించదు: గ్యాంగ్‌స్టర్ లారెన్స్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను తమ వర్గం ఎప్పటికి క్షమించదని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. పంజాబి సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యా కేసులో లారెన్స్ బిష్ణోయ్ జైలు శిక్ష ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింగర్ హత్యా కేసులో పోలీసులు ప్రస్తుతం అతడిన విచారిస్తున్నారు. ఈ సందర్భంగా లారెన్స్ పలు సంచలన విషయాలు వెల్లడించాడు. చదవండి: ఆస్పత్రి నుంచి హీరో విక్రమ్ డిశ్చార్జి.. పాత వీడియో వైరల్ చేస్తున్న ఫ్యాన్స్ ‘కృష్ణజింక హత్యకు సంబంధించి మా వర్గం ఎప్పటికీ సల్మాన్‌ను క్షమించదు. అతడు ఈ విషయంలో బహిరంగ క్షమాపణ చెబితేనే క్షమిస్తాం’ అని లారెన్స్ పేర్కొన్నట్లు ఢిల్లీ పోలీసలు చెప్పారు. కాగా జోధ్‌పూర్ అడవి సమీపంలో కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ దోషిగా తేలిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సల్మాన్‌కు కోర్టు జైలు శిక్ష విధించగా బెయిలుపై బయటకు వచ్చాడు. ఇప్పటికే ఈ కేసులో విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ కేసులో సల్మాన్‌ను చంపేందుకు లారెన్స్ గ్యాంగ్ 2018లో ప్రయత్నించింది. చదవండి: ది వారియర్ షూటింగ్లో దర్శకుడితో కాస్త ఇబ్బంది పడ్డా: కృతిశెట్టి అంతేకాదు ఇటీవల సల్మాన్ ఖాన్ తండ్రితో పాటు ఆయన తరపు లాయర్‌కు కూడా లారెన్స్ గ్యాంగ్ నుంచి హత్యా బెదిరింపు లేఖలు వచ్చాయి. ఇద్దరికీ సిద్ధూ మూసేవాలా గతే పడుతుందని హెచ్చరిక లేఖల్లో పేర్కొన్నారు. ఈ బెదిరింపులపై ఢిల్లీ పోలీసులు లారెన్స్‌ను ప్రశ్నించగా, అతడు ఈ విషయాలు వెల్లడించినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా లారెన్స్ బిష్ణోయ్ కమ్మునిటీలో కృష్ణ జింకను దైవంగా భావిస్తారట. ఈ నేపథ్యంలో బిష్ణోయ్, సల్మాన్‌ను టార్గెట్ చేశాడు. -
Swara Bhaskar: చంపేస్తామంటూ స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ
ముంబై: బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి చంపేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. మహారాష్ట్రలోని వెర్సోవాలో ఉన్న తన నివాసానికి స్పీడ్ పోస్ట్ ద్వారా లేఖను పంపారు. బెదిరింపు లేఖపై నటి స్వర భాస్కర్ వెర్సోవా పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీర్ సావర్కర్‌ను అవమానిస్తే దేశ యువత సహించబోదంటూ హిందీలో ఉన్న ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా సోషల్ మీడియాలో తరచూ పలు అంశాలపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో ఉంటుంది స్వర భాస్కర్. 2017లో ఆమె వీరసావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసింది. తనను జైలు నుంచి విడిపించాలంటూ బ్రిటీష్ ప్రభుత్వాన్ని వేడుకున్నాడని, అది వీరత్వం ఎలా అవుతుందంటూ ట్వీట్ చేసింది. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. చదవండి: (కాలికి గాయం, నడవలేని స్థితిలో నిత్యామీనన్!) -
చంపేస్తామంటూ బెదిరింపులు.. గోల్డీ ఎవరో తెలియదన్న సల్మాన్
ముంబై: పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా మాదిరిగా చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపులపై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ స్పందించారు. ఈ వ్యవహారంలో తనకు ఎవరిపైనా అనుమానాలు లేవని పోలీసులకు చెప్పారు. ‘‘నాకెవరితోనూ శత్రుత్వం లేదు. చదవండి: అడవి బాట... బాక్సాఫీస్ వేట సిద్ధూను చంపినట్టు చెప్పుకుంటున్న కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఎవరో నాకు తెలీదు. నా తండ్రి మార్నింగ్ వాక్ చేస్తుండగా బెదిరింపుల లేఖ వచ్చింది’’ అని చెప్పారు. సిద్ధూ కేసులో విచారిస్తున్న గ్యాంగ్ లీడర్ లారెన్స్ బిష్ణోయ్ గురించి తనకు తెలుసన్నారు. కృష్ణజింకను వేటాడిన కేసులో 2018లో అతని నుంచి తనకు చంపేస్తానన్న బెదిరింపులు వచ్చాయని తెలిపారు. చదవండి: పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన నటుడు ఆర్కే -
చంపేస్తామని బెదిరిస్తున్నారు: కంగనా రనౌత్
ముంబై: సాగు చట్టాల రద్దుకు రైతులు చేస్తున్న ఉద్యమంపై సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించిన తన అభిప్రాయాలను కొందరు తీవ్రంగా వ్యతిరేకించి, చంపేస్తామని బెదిరిస్తున్నారని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మంగళవారం వెల్లడించారు. ఈ తరహా హెచ్చరికలు ఎక్కువైపోయాయని, చర్యలు తీసుకోండంటూ పంజాబ్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. పంజాబ్‌లోని బటిందాకు చెందిన ఒక వ్యక్తి తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని, సంబంధిత ఎఫ్ఐఆర్ ప్రతిని కంగన తన ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘దేశానికి ద్రోహం చేసే వారికి వ్యతిరేకంగా మాట్లాడతా. అమాయక జవాన్లను చంపేసే నక్సలైట్లనూ వ్యతిరేకిస్తా. తుక్డే తుక్డే గ్యాంగ్‌లనూ విమర్శిస్తా. విదేశాల్లో కూర్చుని భారత్‌లో ఖలిస్తాన్ ఏర్పాటు కోసం కలలు కనే ఉగ్రవాదులనూ తప్పుబడతా. అయితే, ఇలాంటి బెదిరింపులకు నేను భయపడను. నన్ను చంపేస్తానని ఓ వ్యక్తి పంజాబ్‌లో బహిరంగంగా ప్రకటించాడు ’ అని కంగనా పోస్ట్‌చేశారు. ‘ సోనియా గాంధీజీ మీరూ ఒక మహిళే. మీ అత్తగారు ఇందిర గాంధీ ఇదే ఉగ్రవాదులపై తుదిశ్వాస వరకూ పోరాడారు. నన్ను బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పంజాబ్‌లోని మీ(కాంగ్రెస్) ముఖ్యమంత్రికి సూచించండి’ అని కంగన విజ్ఞప్తిచేశారు. -
సజీవదహనం చేస్తామంటూ ఆప్ ఎంపీకి బెదిరింపులు
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌కు బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయి. హిందూ వాహినికి చెందిన గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌చేసి చంపుతామంటూ సంజయ్ సింగ్‌పై బెదిరింపులకు పాల్పడ్డారు.దీంతో అప్రమత్తమైన ఆయన నార్త్ ఎవెన్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'హిందూ వాహిని' నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించినట్లు సంజయ్‌సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. '7288088088 మొబైల్ నంబర్ నుంచి నాకు తెలియని వ్యక్తి నుంచి కాల్స్ వస్తున్నాయి. సోమవారం కూడా అదు నెంబర్ నుంచి నాకు ఫోన్ రావడంతో నా సహోద్యోగి అజిత్ త్యాగి ఫోన్‌కు మళ్లించాను. మధ్యాహ్నం 3.59 గంటలకు కాల్ తీసుకోగా.. కాల్ చేసిన వ్యక్తి తనను చంపేస్తానంటూ బెదిరించాడు. ఫోన్ చేసిన వ్యక్తి తనకు తానుగా హిందూ వాహిని నుంచి మాట్లాడుతున్నట్లు తెలిపాడు. కిరోసిన్ పోసి సజీవ దహనం చేస్తానంటూ బెదిరించాడని' ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా పోలీసులకు ఫిర్యాదు చేసిన కంప్లైంట్‌ను సంజయ్ సింగ్ తన ట్విటర్లో షేర్ చేశారు. -
నిన్ను చంపేస్తాం..
ముంబై: నగర మేయర్, శివసేన నాయకుడు కిషోరి ఫెడ్నెకర్ను చంపేస్తామని గుర్తుతెలియని దుండగులు ఆయనకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో మేయర్ ఫిర్యాదు మేరకు దుండగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. గతేడాది డిసెంబర్ 21న తన మొబైల్‌కు గుర్తుతెలియని ఓ వ్యక్తి ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించాడని, ఆ వ్యక్తి హిందీలో మాట్లాడుతున్నారని ఇటీవల దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన విలేకరులతో అన్నారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. 2019 నవంబర్‌లో ముంబై మేయర్‌గా ఫెడ్నెకర్ ఎన్నికయ్యారు. చదవండి: (కామాంధుల క్రూరత్వం: పక్కటెముకలు, కాలు విరిచి) -
నన్ను, నా ఫ్యామిలీని చంపేస్తామంటున్నారు
తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరిస్తున్నారని 'ఉడాన్' నటి మాల్వీ మల్హోత్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే నిర్మాత చేతిలో కత్తిపోట్లకు గురైన నటి తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు. తనను ఫ్యామిలీతో సహా చంపుతామని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. కాగా తనతో వివాహానికి అంగీకరించలేదన్న కోపంతో నిర్మాత యోగేశ్ మహిపాల్ సింగ్ అక్టోబర్ 26న మాల్వీపై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి జరిగిన మరుసటి రోజే పోలీసులు యోగేశ్‌ను అరెస్ట్ చేశారు. మరోవైపు కత్తిపోటు గాయాల నుంచి ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటుటున్నారు. ఇలాంటి సమయంలో చంపుతామని బెదిరింపులు రావడంతో నటి భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: విషాదం: నటుడి పుట్టినరోజు నాడే కొడుకు మృతి) దీని గురించి మాల్వీ మాట్లాడుతూ.. "నవంబర్ 18న రాత్రి 9 గంటలకు నేను, నా ఫ్యామిలీతో కలిసి ఇంటి పరిసరాల్లో వాకింగ్ చేస్తున్నాను. ఆ సమయంలో మాస్కు పెట్టుకున్న ఓ వ్యక్తి బైక్ మీద వచ్చి మా నాన్నను బెదిరించాడు. యోగేశ్‌కు త్వరలోనే బెయిల్ వస్తుంది. అప్పుడు మీ కుటుంబం అంతు చూస్తాం అని వార్నింగ్ ఇచ్చాడు. అప్పటి నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. మరో ఇంటికి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం" అని తెలిపారు.తన ఆరోగ్య పరిస్థితిని గురించి వివరిస్తూ.. 'పూర్తిగా నయమవలేదు. కేవలం వైద్య పరీక్షల కోసమే బయటకు వెళ్తున్నా. సాయంత్రం పూట నడవాలని వైద్యులు సూచించారు. కత్తిగాయాల వల్ల సరిగా నడలేకపోతున్నందుకు కొంత వ్యాయామం చేయాలన్నారు. తననీ స్థితికి తీసుకువచ్చిన యోగేశ్‌పై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా'నన్నారు. (చదవండి: బూడిద పూసుకొని నగ్నంగా తిరిగితే తప్పు లేదా..) -
‘నన్ను చంపుతామని బెదిరించారు’
దేశంలో ముస్లింలు, దళితులు, ఇతర మైనారిటీలపై మతం ఆధారంగా జరుగుతున్న మూకహత్యలు, దాడులపై సినీపరిశ్రమతో పాటు వేర్వేరు రంగాలకు చెందిన 49 మంది ప్రముఖులు గళమెత్తిన సంగతి తెలిసిందే. ఇలా సంతకం చేసిన వారిలో నటుడు కౌషిక్ సేన్ కూడా ఉన్నారు. అయితే మూక హత్యల గురించి మాట్లాడిన తనను చంపుతామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు కౌశిక్ సేన్. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. మూక హత్యల గురించి మరోసారి మాట్లాడితే.. చాలా తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుంది అంటూ బెదిరించడం ప్రారంభించాడు. అప్పుడు అతనితో నేను ‘చావడానికి కూడా సిద్ధమే కానీ నా ఆలోచనను మార్చుకోను. ఇలాంటి కాల్స్ నన్ను భయపెట్టలేవు’ అని స్పష్టం చేశాను’ అన్నాడు కౌశిక్ సేన్. అంతేకాక ఆ నంబర్‌ను పోలీసులకు ఇచ్చినట్లు తెలిపాడు. ‘అధిక వర్గాలకు జై శ్రీరాం పవిత్రమైనది.. దానిని అపవిత్రం చేయడం మానేయండి. దళితులు, క్రైస్తవులు, ముస్లింలపై జరుగుతున్న అమానుష ఘటనలను, ఊచకోతలను వెంటనే అరికట్టాలి. 2016లో ఇలాంటివి దాదాపు 840 కేసులు నమోదయిన విషయాన్ని నేర గణాంక సంస్థ(ఎన్సీఆర్బీ) తెలిపింది. ఇది చూసి మేము చాలా అశ్చర్యపోయాము. జై శ్రీరాం నినాదం ఇప్పుడు దేశంలో హింసాత్మకంగా మారింది. ఈ దీన స్థితికి మేము చింతిస్తున్నాము’ అని లేఖలో పేర్కొన్నారు. -
బుర్ఖా నిషేధం.. చంపేస్తామని బెదిరింపులు
తిరువనంతపురం: కేరళలోని ఓ ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ (ఎంఈఎస్) సంస్కరణలు పేరుతో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కోజికోడ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఎంఈఎస్ తమ విద్యా సంస్థల పరిధిలో ముస్లిం విద్యార్థినుల బుర్ఖా వాడకంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆదేశాలు జారీచేసిన సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఫజల్ గఫూర్ హత్యా బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. ఇస్లాం సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఎంఈఎస్ నిర్ణయం తీసుకుందని, దానిని వెనక్కి తీసుకోకపోతే చంపేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌కాల్ ద్వారా బెదిరింపులకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన సూచనలు మేరకు డ్రస్‌కోడ్‌ను నిర్ణయించుకునే హక్కు తమకు ఉందని, దానికి అనుగుణంగానే ఎంఈఎస్ విద్యాసంస్థల పరిధిలో బుర్ఖాని నిషేధించామని పోలీసులు వద్ద వాపోయారు. కాగా 2019-20 విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని కోరుతూ సొసైటీ ఫజల్ గఫూర్ దేశ వ్యాప్తంగా ఉన్న తమ విద్యాసంస్థల అధిపతులకు సర్క్యులర్ జారీచేసిన విషయం తెలిసిందే. విద్యార్థులతోపాటు బోధనా సిబ్బంది కూడా ఈ నిబంధనను తప్పక పాటించాల్సిందేనన్నారు. శ్రీలంకలో ఈస్టర్ సండే సందర్భంగా జరిగిన వరుస బాంబు పేలుళ్ల తర్వాత ఆ దేశ ప్రభుత్వం గత నెల 21న ముస్లిం మహిళల బురఖా వినియోగాన్ని నిషేధించిందని, కానీ తాము అంతకు ముందే నిషేధం విధించామన్నారు. ఇదిలా ఉంటే దీనిపై కేరళ జామియాథుల్ ఉలేమా అధ్యక్షుడు సయ్యద్ ముహమ్మద్ జిఫ్రీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బుర్ఖాను నిషేధించాలన్న వారి ఆదేశాలను ఇస్లాంకు, షరియత్ చట్టాలకు వ్యతిరేకంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.