షారుఖ్‌కి చంపేస్తామని బెదిరింపు కాల్‌.. నిందితుడి అరెస్ట్‌! | Shah Rukh Khan Death Threat Case: Mumbai Police Arrest Faizan Khan | Sakshi
Sakshi News home page

రూ.50 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరింపులు.. నిందితుడు అరెస్ట్‌!

Nov 12 2024 11:57 AM | Updated on Nov 12 2024 5:37 PM

Shah Rukh Khan Death Threat Case: Mumbai Police Arrest Faizan Khan

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ఖాన్‌ని చంపేస్తానంటూ బెదిరింపులకు దిగిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు.  రూ. 50 లక్షలు ఇవ్వకపోతే షారుఖ్‌ని చంపేస్తానని ఓ వ్యక్తి ముంబై పోలీసులకు ఫోన్‌ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. నిందితుడు రాయఫూర్‌కి చెందిన ఫైజల్‌ ఖాన్‌గా తేలింది. మంగళవారం ఛతీస్‌గడ్‌కి వెళ్లిన పోలీసులు..అక్కడ ఫైజల్‌ని అదుపులోకి తీసుకున్నారు.

నా పేరు హిందుస్తానీ
డబ్బుల కోసం నిందుతుడు ఈ పథకం వేసినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున డబ్బు కావాలని ఇలాంటి బ్లాక్‌ మెయిల్‌ కాల్స్‌ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ‘నవంబర్‌ 7న ఓ కొత్త నెంబర్‌ నుంచి కాల్‌ చేసి ‘షారుఖ్‌ ఖాన్‌ నాకు రూ.50 ఇవ్వకపోతే చంపేస్తా అని ఓ ‍వ్యక్తి చెప్పారు. మీ పేరు ఏంటని అడిగితే.. ‘అది అనవసరం. మీకు నా పేరే ముఖ్యమని అనిపిస్తే.. ‘హిందుస్తాని’ అని రాసుకోండి’అని చెప్పి కాల్‌ కట్‌ చేశాడు’ అని ముంబై పోలీసులు తెలిపారు.

బిగ్‌ ట్విస్ట్‌
షారుఖ్‌ని చంపేస్తామని కాల్‌ రావడంతో ముంబై పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్‌ కాల్‌ గురించి ఆరా తీయగా అది ఛత్తీస్‌గఢ్‌కి చెందిన ఫైజన్‌ ఖాన్‌ అనే వ్యక్తి పేరుపై రిజిస్టర్‌ అయినట్లు గుర్తించారు. మంగళవారం ఓ బృందం ఛత్తీస్‌గఢ్‌కి వెళ్లి నిందితుడుని అరెస్ట్‌ చేశారు. అయితే నిందితుడు మాత్రం ఆ కాల్‌ చేసింది తాను కాదని చెబుతున్నాడు. \

తన ఫోన్‌ ఎవరో దొంగిలించారని.. దీనిపై తాను పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని రాయ్‌ పూర్‌ ఎస్పీ అజయ్‌ కుమార్‌ కూడా దృవీకరించారు. ‘నవంబర్‌ 2న ఫైజన్‌ ఖాన్‌ పోలీసు స్టేషన్‌కి వచ్చిన తన ఫోన్‌ పోయిందని ఫిర్యాదు ఇచ్చాడు. ముంబై పోలీసులకు కూడా విషయాన్ని చెప్పారు. దానికి సంబంధించిన డ్యాక్యుమెంట్స్‌ కూడా  ముంబై పోలీసులకు అందించాడు’అని రాయ్‌పూర్‌ ఎస్పీ మీడియాకు తెలిపారు.

షారుఖ్‌కి భద్రత పెంపు
షారుక్‌కి గతేడాదిలో కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం షారుక్‌కి Y+ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికీ షారుఖ్‌కి వై ప్లస్‌(Y+) సెక్యూరిటీనే కొనసాగుతుంది. కాగా, బాలీవుడ్‌ మరో స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌కి కూడా వరుసగా ఇలాంటి బెదిరింపులే వస్తున్నాయి. సల్మాన్‌ని చంపేస్తామని గత కొన్ని రోజులుగా లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌  బెదిరింపు కాల్స్‌ చేస్తునే ఉంది. దీంతో సల్మాన్‌కి కూడా భద్రతను పెంచారు. ఇలా స్టార్‌ హీరోలందరికి బెదింపు కాల్స్‌ రావడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement