Death threats case
-
షారుఖ్‌కి చంపేస్తామని బెదిరింపు కాల్.. నిందితుడి అరెస్ట్!
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ఖాన్ని చంపేస్తానంటూ బెదిరింపులకు దిగిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 50 లక్షలు ఇవ్వకపోతే షారుఖ్‌ని చంపేస్తానని ఓ వ్యక్తి ముంబై పోలీసులకు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. నిందితుడు రాయఫూర్కి చెందిన ఫైజల్ ఖాన్‌గా తేలింది. మంగళవారం ఛతీస్గడ్కి వెళ్లిన పోలీసులు..అక్కడ ఫైజల్‌ని అదుపులోకి తీసుకున్నారు.నా పేరు హిందుస్తానీడబ్బుల కోసం నిందుతుడు ఈ పథకం వేసినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున డబ్బు కావాలని ఇలాంటి బ్లాక్ మెయిల్ కాల్స్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ‘నవంబర్ 7న ఓ కొత్త నెంబర్ నుంచి కాల్ చేసి ‘షారుఖ్ ఖాన్ నాకు రూ.50 ఇవ్వకపోతే చంపేస్తా అని ఓ వ్యక్తి చెప్పారు. మీ పేరు ఏంటని అడిగితే.. ‘అది అనవసరం. మీకు నా పేరే ముఖ్యమని అనిపిస్తే.. ‘హిందుస్తాని’ అని రాసుకోండి’అని చెప్పి కాల్ కట్ చేశాడు’ అని ముంబై పోలీసులు తెలిపారు.బిగ్ ట్విస్ట్షారుఖ్ని చంపేస్తామని కాల్ రావడంతో ముంబై పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కాల్ గురించి ఆరా తీయగా అది ఛత్తీస్‌గఢ్‌కి చెందిన ఫైజన్ ఖాన్ అనే వ్యక్తి పేరుపై రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. మంగళవారం ఓ బృందం ఛత్తీస్‌గఢ్‌కి వెళ్లి నిందితుడుని అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు మాత్రం ఆ కాల్ చేసింది తాను కాదని చెబుతున్నాడు. \తన ఫోన్ ఎవరో దొంగిలించారని.. దీనిపై తాను పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని రాయ్ పూర్ ఎస్పీ అజయ్ కుమార్ కూడా దృవీకరించారు. ‘నవంబర్ 2న ఫైజన్ ఖాన్ పోలీసు స్టేషన్‌కి వచ్చిన తన ఫోన్ పోయిందని ఫిర్యాదు ఇచ్చాడు. ముంబై పోలీసులకు కూడా విషయాన్ని చెప్పారు. దానికి సంబంధించిన డ్యాక్యుమెంట్స్ కూడా ముంబై పోలీసులకు అందించాడు’అని రాయ్‌పూర్ ఎస్పీ మీడియాకు తెలిపారు.షారుఖ్‌కి భద్రత పెంపుషారుక్కి గతేడాదిలో కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం షారుక్‌కి Y+ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికీ షారుఖ్‌కి వై ప్లస్(Y+) సెక్యూరిటీనే కొనసాగుతుంది. కాగా, బాలీవుడ్ మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కి కూడా వరుసగా ఇలాంటి బెదిరింపులే వస్తున్నాయి. సల్మాన్‌ని చంపేస్తామని గత కొన్ని రోజులుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు కాల్స్ చేస్తునే ఉంది. దీంతో సల్మాన్‌కి కూడా భద్రతను పెంచారు. ఇలా స్టార్ హీరోలందరికి బెదింపు కాల్స్ రావడం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. -
రాధ కేసుపై ముమ్మరంగా దర్యాప్తు
తమిళసినిమా: నటి రాధపై హత్యా బెదిరింపులకు పాల్పడిందెవరన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుందరాట్రావెల్స్ చిత్రం నాయకి రాధ. ఈమె ఈ మధ్య వివాదాలు, కేసులు అంటూ తరచు వార్తల్లో నిలుస్తున్నారు. స్థానిక సాలి గ్రామంలోని లోకయ్య వీధిలో నివసిస్తున్న రాధ ఇటీవల పుళల్ జైల్లో ఉన్న ఖైదీ వైరవ్ ఫోన్ ద్వారా హత్యా బెదిరింపులు చేసినట్లు పోలీసులకు ఫోన్ కాల్ ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాధ ఫిర్యాదు మేరకు స్థానిక విరుగంబాక్కం పోలీస్ ఇన్స్పెక్టర్ సుబ్రమణి ఖైదీ వైరవ్, ఆమె మాజీ భర్త ఫైసల్, ఆమెతో సన్నిహితంగా మసలుతున్న మునివేల్ భార్య ఉమాలపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ముందుగా పుళల్ జైలులో ఉన్న ఖైదీ వైరవ్ను విచారించగా తాను ఎవరిని బెదిరించలేదన్న విషయాన్ని స్పష్టం చేశారట. అతను బెదిరింపు ఫోన్‌కాల్ చేసే అవకాశం లేదన్న నిర్ణయానికి వచ్చిన పోలీసులు నటి రాధ ఫోన్‌కు వచ్చిన కాల్ నెంబరును బట్టి అసలు నేరస్తుడెవన్నది దర్యాప్తు చేస్తున్నారట. అతనెవరో కూడా తెలిసిందని సమాచారం. అయితే పోలీసులు మాత్రం రాధపై హత్యా బెదిరింపులు చేసిన వ్యక్తి పేరును బయట పెట్టలేదు.దీంతో ఈ విషయం తెలిసిన ఆ అగంతకుడు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు త్వరలోనే అతన్ని పట్టుకుంటామని పోలీస్‌వర్గాలు తెలిపాయి. కాగా నటి రాధ తన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుసుకోవడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా ఆ హత్యా బెదిరింపులకు పాల్పడింది ఖైదీ వైరవ్ కాదని, అసలు నేరస్తుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారని సమాచారం.