రాధ కేసుపై ముమ్మరంగా దర్యాప్తు
తమిళసినిమా: నటి రాధపై హత్యా బెదిరింపులకు పాల్పడిందెవరన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుందరాట్రావెల్స్ చిత్రం నాయకి రాధ. ఈమె ఈ మధ్య వివాదాలు, కేసులు అంటూ తరచు వార్తల్లో నిలుస్తున్నారు. స్థానిక సాలి గ్రామంలోని లోకయ్య వీధిలో నివసిస్తున్న రాధ ఇటీవల పుళల్ జైల్లో ఉన్న ఖైదీ వైరవ్ ఫోన్ ద్వారా హత్యా బెదిరింపులు చేసినట్లు పోలీసులకు ఫోన్ కాల్ ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
రాధ ఫిర్యాదు మేరకు స్థానిక విరుగంబాక్కం పోలీస్ ఇన్‌స్పెక్టర్ సుబ్రమణి ఖైదీ వైరవ్, ఆమె మాజీ భర్త ఫైసల్, ఆమెతో సన్నిహితంగా మసలుతున్న మునివేల్ భార్య ఉమాలపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ముందుగా పుళల్ జైలులో ఉన్న ఖైదీ వైరవ్‌ను విచారించగా తాను ఎవరిని బెదిరించలేదన్న విషయాన్ని స్పష్టం చేశారట. అతను బెదిరింపు ఫోన్‌కాల్ చేసే అవకాశం లేదన్న నిర్ణయానికి వచ్చిన పోలీసులు నటి రాధ ఫోన్‌కు వచ్చిన కాల్ నెంబరును బట్టి అసలు నేరస్తుడెవన్నది దర్యాప్తు చేస్తున్నారట.
అతనెవరో కూడా తెలిసిందని సమాచారం. అయితే పోలీసులు మాత్రం రాధపై హత్యా బెదిరింపులు చేసిన వ్యక్తి పేరును బయట పెట్టలేదు.దీంతో ఈ విషయం తెలిసిన ఆ అగంతకుడు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు త్వరలోనే అతన్ని పట్టుకుంటామని పోలీస్‌వర్గాలు తెలిపాయి. కాగా నటి రాధ తన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుసుకోవడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా ఆ హత్యా బెదిరింపులకు పాల్పడింది ఖైదీ వైరవ్ కాదని, అసలు నేరస్తుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారని సమాచారం.