అల్లు అర్జున్ (Allu Arjun) సంధ్య థియేటర్ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) స్పందించింది. థియేటర్ వద్ద లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. లాయర్ రామారావు దాఖలు చేసిన పిటిషన్ విచారణ చేపట్టాలని తెలంగాణ డీజీపీని కోరింది. ఈ ఘటనపై నాలుగు వారాల్లో పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని డీజీపీ జితేందర్‌కు ఆదేశాలు జారీ చేసింది.
అసలేం జరిగిందంటే..
డిసెంబర్ 4న తేదీన ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఉన్న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. పుష్ప-2 విడుదల సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్‌లో బెనిఫిట్ షో చూసేందుకు వెళ్లారు. ఆయనను చూసేందుకు ఫ్యాన్స్ పెద్దఎత్తున రావడంతో వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. అదే సమయంలో తొక్కిసలాట జరగడంతో రేవతి అనే మహిళ మృత్యువాత పడింది. ఆమె కుమారుడు సైతం తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం అతను కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.
న్యాయవాది ఫిర్యాదుతో స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్సీ
అయితే ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు న్యాయవాది రామారావు ఫిర్యాదు చేశారు. పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం వల్లే తొక్కిసలాట జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని తెలంగాణ డీజీపీని ఆదేశించింది. నాలుగు వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment