Sandhya Theatre
-
పుష్ప 2 రికార్డు.. సంధ్య థియేటర్లో ఎంత రాబట్టిందంటే?
పుష్ప అంటే బ్రాండ్ అని మరోసారి రుజువైంది. ఇప్పటికే రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసిన పుష్పరాజ్ మరో అరుదైన రికార్డు అందుకున్నాడు. సింగిల్ స్క్రీన్‌లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ఘనత సాధించాడు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో.. ఒక సింగిల్ స్క్రీన్‌లో అత్యధిక కలెక్షన్స్ (గ్రాస్) రాబట్టిన చిత్రంగా పుష్ప 2 నిలిచిందని ట్వీట్ చేసింది. పుష్ప 2 రికార్డుహైదరాబాద్.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య 70 ఎంఎం స్క్రీన్‌లో 'పుష్ప రూల్' ఆల్‌టైం రికార్డ్ అందుకుందని తెలిపింది. 51 రోజుల్లో ఒక కోటి 89 లక్షల 75 వేల 880 రూపాయలు వసూలు చేసిందని పేర్కొంది. సంధ్య థియేటర్లో 206 షోలకు గానూ 1,04,580 మంది చూశారని తెలిపింది. ఇకపోతే నైజాంలో పుష్ప 2 సినిమాను మైత్రీమూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు.సినిమాపుష్ప 2 సినిమా విషయానికి వస్తే.. అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 5న విడుదలైంది. ఈ చిత్రం ఒక్క హిందీలోనే రూ.800 కోట్లకు పైగా వసూలు చేసింది. త్వరలోనే చైనాలోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.Records Breaking Rapa Rapa 🔥 #Pushpa2TheRule creates history with the highest ever gross in a single screen across Telugu states 💥🎥 Sandhya 70MM💪 206 Shows | 👥 1,04,580 Audience💰 Gross: ₹1,89,75,880 in just 51 days#HistoricIndustryHitPUSHPA2Nizam Release by… pic.twitter.com/wFTDzraAdp— Mythri Movie Distributors LLP (@MythriRelease) January 25, 2025 చదవండి: జైలుకు వెళ్లొచ్చిన హీరోయిన్‌కు సన్యాసమా? అంతా పబ్లిసిటీ కోసమే! -
డిప్రెషన్ లో అల్లు అర్జున్..?
-
సంధ్య థియేటర్ ఘటన: శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్
సాక్షి, హైదరాబాద్: హీరో అల్లు అర్జున్ బేగంపేటలోని కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లారు. సంధ్య థియేటర్ ఘటన (Sandhya Theatre Stampede)లో గాయపడ్డ శ్రీతేజ్‌ను మంగళవారం పరామర్శించారు. ఈ మేరకు రాంగోల్పేట్ పోలీసులకు ముందస్తు సమాచారమిచ్చారు. దీంతో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలుడిని పరామర్శించిన అల్లు అర్జున్ అతడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఆయన వెంట నిర్మాత దిల్ రాజు సైతం ఉన్నారు. అల్లు అర్జున్‌కు గడ్డు పరిస్థితితన సినిమా విజయం సాధిస్తే ఏ హీరో అయినా సంతోషపడిపోతాడు. రికార్డుల మీద రికార్డులు కొడుతుంటే సంబరాలు చేసుకుంటాడు. కానీ అల్లు అర్జున్‌కు ఆ సంతోషం లేకుండా పోయింది. ప్రమాదవశాత్తూ జరిగిన ఓ సంఘటన వల్ల అటు కేసులో ఇరుక్కోవడంతో పాటు మనోవేదనకు గురవాల్సి వస్తోంది.ఇంతకీ ఏం జరిగిందంటే?డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో పుష్ప 2 (Pushpa 2: The Rule) ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ సినిమా చూసేందుకు అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి వెళ్లారు. ఆ సమయంలో హీరోను చూసేందుకు జనాలు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాలతో ఆస్పత్రిపాలయ్యాడు. 35 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. బాధిత కుటుంబానికి అల్లు అరవింద్ రూ.1 కోటి, దర్శకుడు సుకుమార్ రూ.50 లక్షలు, మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. అయితే రేవతి భర్త భాస్కర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యంతోపాటు అల్లు అర్జున్‌పైనా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ను అరెస్ట్ చేయగా ఒకరోజు జైల్లో కూడా ఉన్నాడు.పుష్ప 2 రికార్డులుసుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. పాన్ ఇండియా లెవల్లో హిట్టయింది. రూ.350 కోట్లకు పైగా రాబట్టింది. మూడేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప 2 రిలీజైంది. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా శ్రీలీల స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఈ సారి మూడు పువ్వులు ఆరు కాయలు అన్న రీతిలో వసూళ్లు వస్తున్నాయి. నెల రోజుల్లోనే పుష్ప: ది రూల్ 1831 కోట్లు రాబట్టింది. ప్రథమ స్థానంఈ సారి మూడు పువ్వులు ఆరు కాయలు అన్న రీతిలో వసూళ్లు వస్తున్నాయి. నెల రోజుల్లోనే పుష్ప: ది రూల్ 1831 కోట్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో మాత్రం ‘పుష్ప 2: ది రూల్’ ప్రథమ స్థానంలో నిలిచింది. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించారు.ఇండియన్ సినీ చరిత్రలో..ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటివరకు ఆమిర్ ఖాన్ దంగల్ మాత్రమే రూ.2 వేల కోట్ల మార్కును దాటింది. ఆ తర్వాత ప్లేస్‌లో అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప- 2 ది రూల్ నిలిచింది. రాజమౌళి చిత్రం బాహుబలి -2 మూడో స్థానానికి, ఆర్ఆర్ఆర్ (రూ.1387 కోట్లు) నాలుగో స్థానానికి పరిమితమైంది.చదవండి: శుభవార్త చెప్పిన హీరోయిన్.. పట్టలేనంత సంతోషం, కొంత నిరాశ! -
అల్లు అర్జున్‌కు మరోసారి పోలీసుల నోటీసులు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు వెళ్లాలనుకుంటే తమకు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటీవలే చిక్కడపల్లి పీఎస్‌కు వెళ్లే సమయంలోనూ అల్లు అర్జున్ మేనేజర్‌కు రాంగోపాల్ పేట్ పోలీసులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై మరోసారి నోటీసులు అందజేశారు.అసలేం జరిగిందంటే..కాగా.. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప 2 విడుదలకు ముందు రోజు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన (Sandhya Theatre Stampede) జరిగింది. అక్కడకు వచ్చిన అల్లు అర్జున్ను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్‌తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.(ఇది చదవండి: అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు)అల్లు అర్జున్ అరెస్ట్..ఈ కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయాన్నే జూబ్లీహిల్స్‌లోని ఐకాన్ స్టార్ ఇంటికి వెళ్లిన పోలీసులు చిక్కడపల్లి పీఎస్‌కు తీసుకొచ్చారు. అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత బన్నీని నాంపల్లి కోర్టులో హాజరు పరచగా 14 రిమాండ్ విధించింది.మధ్యంతర బెయిల్‌పై విడుదల..అయితే అరెస్ట్ అయిన రోజే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్ న్యాయవాదులు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం అల్లు అర్జున్‌కు నాలుగువారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ అరెస్ట్ అయిన రోజు బెయిల్‌కు సంబంధించిన ప్రక్రియ ఆలస్యం కావడంతో బన్నీని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఆ రోజు రాత్రి అల్లు అర్జున్ జైలులోనే గడిపారు.(ఇది చదవండి: తొక్కిసలాట ఘటన: నాంపల్లి కోర్టుకు సంధ్య థియేటర్ యాజమాన్యం)ఉదయం రిలీజ్..బెయిల్ ప్రక్రియ పూర్తయిన వెంటనే మరుసటి రోజు ఉదయం బన్నీ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం నేరుగా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ ప్రముఖులంతా బన్నీని కలిసి పరామర్శించారు. ఆ తర్వాత అల్లు అర్జున్.. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఈ కేసు నమోదైన తర్వాత తొలిసారి చిరుతో భేటీ అయ్యారు.రేవతి కుటుంబానికి ఆర్థియసాయం..ఈ ఘటన తర్వాత రేవతి కుటుంబానికి పుష్ప టీమ్ ఆర్థిక సాయం అందించింది. అల్లు అర్జున్ తరఫున అల్లు అరవింద్ కోటీ రూపాయల చెక్ అందజేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు సైతం రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.పరామర్శించిన దిల్‌రాజు..సినీ ఇండస్ట్రీ తరఫున తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించారు. అమెరికా నుంచి వచ్చిన వెంటనే ఆస్పత్రి వెళ్లి ఆరా తీశారు. శ్రీతేజ్ ఫ్యామిలీకి అన్ని విధాలా సాయం చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని దిల్ రాజు వెల్లడించారు. -
అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్: సంధ్య థియేటర్ ఘటనలో హీరో అల్లు అర్జున్ (Allu Arjun)కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. పుష్ప2 సినిమా ప్రీమియర్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడంతో ఆయనపై బీఎన్ఎస్ 105 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నాంపల్లి కోర్టు బన్నీకి 14రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు.ఆపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఒకరాత్రి జైలులో గడిపిన ఆయన మరుసటిరోజు విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే, రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును అల్లు అర్జున్ ఆశ్రయించారు. బెయిల్ ఇవ్వొద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన కోర్టు అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ ఇస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించింది. రూ.50 వేలు, రెండు పూచీకత్తులు సమర్పించాలని బన్నీని ఆదేశించింది.ఏం జరిగింది?డిసెంబర్ 4న ‘పుష్ప2’ బెనిఫిట్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి మరణించగా ఆమె కుమారుడు ఇప్పటికీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. దీంతో వారి కుటుంబానికి అల్లు అర్జున్ పేరుతో అల్లు అరవింద్ భారీ సాయం ప్రకటించారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రూ. 1 కోటి సాయం ప్రకటించారు. డైరెక్టర్ సుకుమార్ రూ. 50 లక్షలు అందించగా.. మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. మొత్తం రూ. 2 కోట్ల రూపాయలు చెక్కులను తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్‌గా దిల్ రాజుకు చిత్ర యూనిట్ అందించింది.చదవండి: హీరోయిన్ను దబిడి దిబిడి ఆడేసుకున్న బాలకృష్ణ.. ఇదేం కర్మరా సామీ! -
A1 పెద్దరామిరెడ్డి, A2 చిన్న రామిరెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు
-
తొక్కిసలాట ఘటన: నాంపల్లి కోర్టుకు సంధ్య థియేటర్ యాజమాన్యం
సాక్షి, హైదరాబాద్: పుష్ప 2 ప్రీమియర్స్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన (Sandhya Theatre Stampede)పై సంధ్య థియేటర్ యాజమాన్యం నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. తొక్కిసలాట ఘటనలో A1, A2గా ఉన్న థియేటర్ యజమానులు పెద్దరామిరెడ్డి, చిన్న రామిరెడ్డి బెయిల్ కోసం శుక్రవారం నాడు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం చిక్కడపల్లి పోలీసులను ఆదేశించింది.తమకు గంట సమయం కావాలని కోరిన పోలీసులు మరికాసేపట్లో కౌంటర్ దాఖలు చేయనున్నారు. అనంతరం సంధ్య థియేటర్ యజమానుల తరపు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు. మరోవైపు అల్లు అర్జున్ (Allu Arjun) కూడా రెగ్యులర్ బెయిల్ కోసం ఇదే కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం దీనిపై విచారణ చేపడుతున్న న్యాయస్థానం మరికాసేపట్లో తీర్పు వెల్లడించనుంది.ఏం జరిగింది?డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో పుష్ప 2 (Pushpa 2 Movie) ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. అక్కడకు వచ్చిన అల్లు అర్జున్ను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరగ్గా ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు అటు అల్లు అర్జున్, అతడి టీమ్‌తో పాటు సంధ్య థియేటర్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం అల్లు అర్జున్ను అరెస్ట్ చేయగా మధ్యంతర బెయిల్‌పై అతడు జైలు నుంచి విడుదలయ్యాడు.చదవండి: అల్లు అర్జున్‌కు నేడు బెయిల్ లభించనుందా.. ? -
సంధ్య థియేటర్ ఘటన.. ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు!
అల్లు అర్జున్ (Allu Arjun) సంధ్య థియేటర్ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) స్పందించింది. థియేటర్ వద్ద లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. లాయర్ రామారావు దాఖలు చేసిన పిటిషన్ విచారణ చేపట్టాలని తెలంగాణ డీజీపీని కోరింది. ఈ ఘటనపై నాలుగు వారాల్లో పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని డీజీపీ జితేందర్‌కు ఆదేశాలు జారీ చేసింది.అసలేం జరిగిందంటే..డిసెంబర్ 4న తేదీన ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఉన్న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. పుష్ప-2 విడుదల సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్లో బెనిఫిట్ షో చూసేందుకు వెళ్లారు. ఆయనను చూసేందుకు ఫ్యాన్స్ పెద్దఎత్తున రావడంతో వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. అదే సమయంలో తొక్కిసలాట జరగడంతో రేవతి అనే మహిళ మృత్యువాత పడింది. ఆమె కుమారుడు సైతం తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం అతను కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.న్యాయవాది ఫిర్యాదుతో స్పందించిన ఎన్హెచ్ఆర్సీఅయితే ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు న్యాయవాది రామారావు ఫిర్యాదు చేశారు. పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం వల్లే తొక్కిసలాట జరిగిందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని తెలంగాణ డీజీపీని ఆదేశించింది. నాలుగు వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని కోరింది. -
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. జనవరి మూడో తేదీకి తీర్పును వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది. ఇక, ఈరోజు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. పుష్ప-2 బెనిఫిట్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద రేవతి మృతిచెందిన కేసులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. వాదనల సందర్బంగా అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తరపు వాదనలు వినిపించిన సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి. ఇదే సమయంలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని కోరిన పబ్లిక్ ప్రాసిక్యూషన్. ఈరోజు ఇరు వర్గాల వాదనల అనంతరం, తీర్పును వచ్చే నెల మూడో తేదీకి కోర్టు వాయిదా వేసింది. అల్లు అర్జున్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు..సంధ్యా థియేటర్ ఘటనకు అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదు..రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ పోలీసులు నమోదు చేసిన కేసు వర్తించదు..బీఎన్ఎస్ సెక్షన్ 105 అల్లు అర్జున్‌కు వర్తించదు.ఇప్పటికే ఈ కేసులో హైకోర్టు మధ్యంతర ఇచ్చింది.రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలి.పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు..రేవతి మృతికి అల్లు అర్జున్ ప్రధాన కారణం..అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగింది..ఆయనకు బెయిల్ ఇస్తే తన పలుకుబడితో సాక్షులను ప్రభావితం చేస్తాడు..బెయిల్ ఇస్తే పోలీసుల విచారణకు సహకరించడు..అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలి. ఇక, సంధ్యా థియేటర్ కేసు ఘటనలో ఇప్పటికే అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. ప్రస్తుతం హైకోర్టు బెయిల్‌తో చంచల్ గూడ జైలు నుండి విడుదల అయినా అల్లు అర్జున్. డిసెంబర్ 13వ తేదీన అల్లు అర్జున్‌కు హైకోర్టు.. నాలుగు వారాల మద్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. జనవరి పదో తేదీతో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పర్మిషన్ ముగియనుంది. -
45 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు: సంధ్య థియేటర్ యాజమాన్యం
పుష్ప 2 ప్రీమియర్స్‌లో భాగంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ కూడా కారణమని పోలీసులు ఇరువురిపైనా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో థియేటర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. థియేటర్ లైసెన్సు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులో కోరారు. దీనిపై సంధ్య థియేటర్ యాజమాన్యం ఆదివారం స్పందించింది. తమకు అన్ని అనుమతులు ఉన్నాయని పేర్కొంది. గత 45 ఏళ్లుగా థియేటర్ నడుపుతున్నామని ఎన్నడూ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని తెలిపింది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆ రోజు 80 మంది విధుల్లో పాల్గొన్నారంది. డిసెంబర్ 4, 5వ తేదీల్లో మైత్రీ మూవీస్ థియేటర్‌ను ఎంగేజ్ చేసుకుందని, గతంలో అనేక సినిమాల రిలీజ్ సందర్భంగా హీరోలు థియేటర్‌కు వచ్చారంది. తమ దగ్గర ద్విచక్రవాహనం, ఫోర్ వీలర్‌కు ప్రత్యేక పార్కింగ్ ఉందని వివరించింది. ఈ మేరకు ఆరు పేజీల లేఖను న్యాయవాదుల ద్వారా పోలీసులకు పంపించారు.చదవండి: చెల్లి పెళ్లి.. మొదట నా మనసు ఒప్పుకోలేదు: సాయిపల్లవి -
సంధ్య థియేటర్ ఘటన.. మరో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
సంధ్యా థియేటర్ ఘటన కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చిన పోలీసులు.. తాజాగా పుష్ప-2 చిత్ర నిర్మాణ సంస్థను కూడా చేర్చారు. ఈ కేసులో ఏ18గా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పేరును పోలీసులు ప్రస్తావించారు. ఆ రోజు ఏం జరిగిందంటే..ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. పుష్ప-2 ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్‌కు రాగా.. పెద్దఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో అభిమానులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. -
అల్లు అర్జున్ ఫోటోలు
-
సంధ్య థియేటర్ ఘటన.. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల సాయం
పుష్ప-2 మూవీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ యేర్నేని కీలక నిర్ణయం తీసుకున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను ఆయన పరామర్శించారు. అంతేకాకుండా ఆ కుటుంబానికి రూ.50 లక్షల చెక్కును అందజేశారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి బాలుడి చికిత్స గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.రాజకీయం చేయొద్దు: మంత్రి కోమటిరెడ్డిఇక ఈ విషయాన్ని ఇక రాజకీయం చేయవద్దని.. సినీ హీరోల ఇళ్లపై దాడులు చేయవద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. బాబు పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని దేవుడి దయవల్ల త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్లడం లేదని.. రూమర్స్ ఎవరు నమ్మొద్దని మంత్రి స్పష్టం చేశారు. ఎవరి పైనా దాడులు చేసినా చట్టం ఊరుకోదని కఠిన చర్యలు తప్పవని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు. -
అల్లు అర్జున్‌కు అండగా బండి సంజయ్
సాక్షి, ఢిల్లీ: తెలుగు సినిమా ఇండస్ట్రీపై పగ బట్టినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. ఇకనైనా రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని కామెంట్స్ చేశారు.కేంద్రమంత్రి బండి సంజయ్.. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కు బాసటగా నిలిచారు. తాజాగా బండి సంజయ్ మాట్లాడుతూ..‘అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం వ్యాఖ్యలున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీపై పగ బట్టినట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. సంధ్య థియేటర్ వద్ద ఘటనలో మహిళ మరణాన్ని ప్రతీ ఒక్కరూ ఖండించారు. శ్రీతేజ్ కోలుకోవాలని అందరూ కోరుకోవడంతోపాటు ఆ కుటుంబానికి బాసటగా నిలిచారు.సమస్య ముగిసిన తరువాత అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడిగించుకుని మరీ.. సినిమా లెవల్లో కథ అల్లి మళ్లీ సమస్యను సృష్టించడం సిగ్గు చేటు. ఎంఐఎంతో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం పవిత్రమైన అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేస్తోంది. ఎంఐఎం ఐరన్ లెగ్ పార్టీ. గతంలో బీఆర్ఎస్ పంచన చేరి ఆ పార్టీని నిండా ముంచింది. ఆ పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీకి అదే గతి పడుతుంది. మీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు చనిపోతుంటే ఏనాడైనా పరామర్శించారా?. హాస్టళ్లలో పురుగుల అన్నం తిని, పాముకాటుకు గురై విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే ఎవరైనా బాధ్యత వహించారా?. మీకో న్యాయం.. ఇతరులకు ఒక న్యాయమా?. ఇకనైనా రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. లేనిపక్షంలో బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
థియేటర్ ఘటన రాజకీయం చేయవద్దు: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిని అగౌరవపరిచే విధంగా అల్లు అర్జున్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇదే సమయంలో అల్లు అర్జున్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో, మరోసారి ఈ అంశం ఆసక్తికరంగా మారింది.ప్రముఖ నటుడు అల్లు అర్జున్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. ఈ క్రమంలో తాజాగా కోమటిరెడ్డి సాక్షితో మాట్లాడుతూ..‘సంధ్య ధియేటర్ వద్ద ఘటనకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి. పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చాడు. ప్రభుత్వానికి, సినిమా ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ లేదు. సంధ్య థియేటర్ వద్ద ఘటనను రాజకీయం చేయవద్దు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పరామర్శకు లీగల్ సమస్యలేంటి?. శ్రీతేజ్‌కు అయ్యే వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది?. సినీ ఇండస్ట్రీ శ్రీతేజ్‌ను ఎందుకు పరామర్శించ లేదు’ అని ప్రశ్నించారు. అంతకుముందు.. పుష్ప–2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తాను నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు వస్తున్న ఆరోపణలను హీరో అల్లు అర్జున్ తీవ్రంగా ఖండించారు. అవన్నీ నూటికి నూరు శాతం అబద్ధాలేనని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సాగుతున్న దుష్ప్రచారంగా అభివర్ణించారు.పోలీసుల అనుమతి లేకుండానే తాను థియేటర్‌కు వెళ్లినట్లు, తొక్కిసలాట అనంతరం పోలీసుల సూచనలు పెడచెవిన పెట్టినట్లు కొంత మంది చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తనను మానవత్వంలేని మనిషిగా చిత్రీకరించడం బాధించిందన్నారు. సమాచార లోపం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. సినిమా థియేటర్ నాకు గుడి లాంటిది. అక్కడ ప్రమాదం జరగడం నాకు చాలా బాధగా ఉంది. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఆ ఘటన తర్వాత నిర్మాత బన్నీ వాసు వెళ్లి బాధిత కుటుంబంతో మాట్లాడారు. నేను కూడా వస్తానంటే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెప్పి వారించారు. నాపై పోలీసులు కేసు నమోదు చేసినందున బాధిత కుటుంబాన్ని కలిస్తే చట్టపరంగా తప్పుడు సంకేతాలు వస్తాయని లీగల్ టీం సైతం గట్టిగా చెప్పడం వల్లే అక్కడికి వెళ్లలేకపోయా తెలిపారు. అనుమతి లేకపోతే పోలీసులు వెనక్కి పంపేవారు కదా.. థియేటర్లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనను అత్యంత దురదృష్టకరమైన ప్రమాదంగా హీరో అల్లు అర్జున్ అభివర్ణించారు. సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు పోలిసులు అక్కడ ఉన్నారని.. దాంతో తన రాకకు అనుమతి ఉందనే భావించినట్లు ఆయన చెప్పారు. తాను లోపలికి వెళ్లేందుకు వీలుగా తన వాహనాలకు దారి చూపింది పోలిసులేనని.. ఒకవేళ తన రాకకు పోలీసుల అనుమతి లేకుంటే వారు అప్పుడే వెనక్కి పంపేవారు కదా? అని అల్లు అర్జున్ ప్రశ్నించారు. -
సినిమా వాళ్లేమైనా ప్రత్యేకమా? పోలీసులు అనుమతి నిరాకరించినా అల్లు అర్జున్ రోడ్ షో చేశారు... అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు