
సాక్షి, హైదరాబాద్: సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. జనవరి మూడో తేదీకి తీర్పును వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది. ఇక, ఈరోజు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు.
పుష్ప-2 బెనిఫిట్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద రేవతి మృతిచెందిన కేసులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. వాదనల సందర్బంగా అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తరపు వాదనలు వినిపించిన సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి. ఇదే సమయంలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని కోరిన పబ్లిక్ ప్రాసిక్యూషన్. ఈరోజు ఇరు వర్గాల వాదనల అనంతరం, తీర్పును వచ్చే నెల మూడో తేదీకి కోర్టు వాయిదా వేసింది.
అల్లు అర్జున్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు..
- సంధ్యా థియేటర్ ఘటనకు అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదు..
- రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ పోలీసులు నమోదు చేసిన కేసు వర్తించదు..
- బీఎన్‌ఎస్ సెక్షన్ 105 అల్లు అర్జున్‌కు వర్తించదు.
- ఇప్పటికే ఈ కేసులో హైకోర్టు మధ్యంతర ఇచ్చింది.
- రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలి.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు..
- రేవతి మృతికి అల్లు అర్జున్ ప్రధాన కారణం..
- అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగింది..
- ఆయనకు బెయిల్ ఇస్తే తన పలుకుబడితో సాక్షులను ప్రభావితం చేస్తాడు..
- బెయిల్ ఇస్తే పోలీసుల విచారణకు సహకరించడు..
- అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలి.

ఇక, సంధ్యా థియేటర్ కేసు ఘటనలో ఇప్పటికే అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. ప్రస్తుతం హైకోర్టు బెయిల్‌తో చంచల్ గూడ జైలు నుండి విడుదల అయినా అల్లు అర్జున్. డిసెంబర్ 13వ తేదీన అల్లు అర్జున్‌కు హైకోర్టు.. నాలుగు వారాల మద్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. జనవరి పదో తేదీతో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పర్మిషన్ ముగియనుంది.
Comments
Please login to add a commentAdd a comment