మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
ప్రతి ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశం
సిటీ కోర్టులు (హైదరాబాద్): పుష్ప–2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటుడు అల్లు అర్జున్‌కు శుక్రవారం నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుతో పాటు, రూ.50 వేలతో రెండు పూచీకత్తులు కోర్టుకు సమర్పించాలని సూచించింది. ప్రతి ఆదివారం సంబంధిత పోలీస్‌స్టేషన్ (చిక్కడపల్లి)లో హాజరు కావాలని ఆదేశించింది.
డిసెంబర్ 5న జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కొడుకు చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఘటనపై రేవతి భర్త భాస్కర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్‌ను ఏ–11గా చేర్చిన పోలీసులు.. సెక్షన్ 105, 118(1), రెడ్‌విత్ 3(5) బీఎన్‌ఎస్ కింద కేసులు నమోదు చేశారు. డిసెంబర్ 13న అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజి్రస్టేట్ జడ్జి నిర్మల 14 రోజుల రిమాండ్ విధించారు.
కానీ హైకోర్టు ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ గడువు ఈనెల 10న పూర్తికానుండగా.. అల్లు అర్జున్ నాంపల్లిలోని 2వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో డిసెంబర్ 26న రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనల అనంతరం తీర్పును వాయిదా వేసిన జడ్జి వినోద్‌కుమార్.. శుక్రవారం తీర్పు వెలువరించారు. ఇదిలా ఉండగా హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై ఈనెల 21 వాదనలు ఉన్నాయని ఆయన తరఫు న్యాయవాదులు మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment