తదుపరి విచారణ జనవరి 10కి వాయిదా
రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు.. సోమవారానికి వాయిదాపడ్డ విచారణ
హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ప్రమేయంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో అల్లు అర్జున్ శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టు ఎదుట వర్చువల్‌గా హాజరయ్యా రు. ఈ కేసులో ఏ–11గా ఉన్న ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించగా హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే.
జ్యుడీషియల్ రిమాండ్ గడువు శుక్రవారం ముగియడంతో ఆయన కోర్టు కు నేరుగా హాజరుకావాల్సి ఉంది. కానీ కోర్టు ప్రాంగణానికి భారీగా అభిమానులు రావొచ్చని అంచనా వేసిన పోలీసులు.. ఆయన్ను వర్చువల్‌గా కోర్టు విచారణకు హాజరుకావాలని సూచించారు. దీంతో ఆయన వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను జడ్జి నిర్మల జనవరి 10కి వాయిదా వేశారు.
మరోవైపు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ నాంపల్లిలోని 2వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో ఆయన తరఫు న్యా యవాదులు నిరంజన్‌రెడ్డి, అశోక్‌రెడ్డి శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. అయితే విచారణ వాయిదా వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ కోరడంతో అంగీకరించిన జడ్జి వినోద్‌కుమార్ విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment