virtual
-
ఫ్రాంచైజ్ బిజినెస్‌పై నాట్స్ వెబినార్ ఔత్సాహికులకు దిశా నిర్దేశం
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ప్రాంచైజ్ బిజినెస్‌పై ఆన్లైన్ వేదికగా వెబినార్ నిర్వహించింది. అమెరికాలో ఉండే తెలుగువారి ఆర్థిక భద్రతకు, స్వశక్తితో ఎదిగేందుకు కావాల్సిన సహకారాన్ని అందించే విధంగా నాట్స్ ఈ వెబినార్‌కు శ్రీకారం చుట్టింది. 250 మందికి పైగా తెలుగువారు పాల్గొన్న ఈ కార్యక్రమంలో న్యూజెర్సీలో ప్రముఖ వ్యాపారవేత్త, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ టి.పి.రావు ఈ వెబినార్‌లో ప్రాంచైజీ బిజినెస్ పై అవగాహన కల్పించారు. తక్కువ పెట్టుబడితో స్థిరమైన వ్యాపారం ప్రాంచైజెస్‌ల వల్ల సాధ్యమవుతుందని తెలిపారు. మార్కెట్ పై అవగాహన పెంచుకోవడం, సరైన ప్రాంతాలను, ప్రాంచెజ్ పెట్టే ప్రదేశాలను ఎంపిక చేసుకోవడంలోనే సగం విజయం దాగుందని టి.పి.రావు వివరించారు. మిగిలిన వ్యాపారాలతో పోలిస్తే ప్రాంచైజ్‌స్‌లతో రిస్క్ తక్కువగా ఉంటుందని, కానీ ప్రాంచైజ్ ప్రారంభించిన తొలినాళ్లలో దాని నిర్వహణ, వ్యవస్థాగతంగా దాన్ని బలోపేతం చేయడంపై పూర్తిస్థాయిలో దృష్టి నిలిపితే చక్కటి లాభాలు ఉంటాయని తెలిపారు. ప్రాంచైజ్‌స్ పై అవగాహన కల్పించడంతో పాటు ప్రాంచైజస్ ఏర్పాటు తన వంతుగా చేతనైన సహకారం అందిస్తానని టి.పి. రావు వెబినార్‌లో పాల్గొన్న వారికి హామీ ఇచ్చారు. సమయం, ధనం వెచ్చించి పట్టుదలతో ముందుకు వచ్చే ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ప్రాంచైజస్ చక్కటి మార్గమని తెలిపారు. ఈ వెబినార్‌కు నాట్స్ నేషనల్ మార్కెటింగ్ కో ఆర్డినేటర్ కిరణ్ మందాడి అనుసంధానకర్తగా వ్యవహరించారు. చాలా మంది ఔత్సాహికులు ప్రాంచైజ్ నిర్వహణ, ప్రాంచైజస్ బిజినెస్‌లో వచ్చే ఇబ్బందుల గురించి తమ సందేహాలను టి.పి.రావుని అడిగి నివృత్తి చేసుకున్నారు. ప్రస్తుత యూఎస్ గవర్నమెంట్లోఉద్యోగుల డోలాయమాన పరిస్థితుల్లో ఇటువంటి వెబినార్స్ యువతకు ఎంతో సహాయకారకం గా ఉంటాయని నాట్స్ ఎక్సిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, బోర్డ్ డైరెక్టర్ చెబుతూ టి.పి.రావు ను అభినందించారు. ఆన్లైన్ ద్వారా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందు టి.పి.రావు,కిరణ్ మందాడిలను నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేకంగా అభినందించారు.(చదవండి: డల్లాస్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు) -
వర్చువల్ గలాక్సీ ఐపీవో బాట
న్యూఢిల్లీ: బీఎఫ్‌ఎస్‌ఐపై ప్రత్యేక దృష్టిపెట్టిన సాస్(ఎస్ఏఏఎస్) సేవల సంస్థ వర్చువల్ గలాక్సీ ఇన్ఫోటెక్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు వీలుగా స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ ఎమర్జ్‌కు ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది.ఐపీవోలో భాగంగా 66 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. నిధుల్లో రూ. 34 కోట్లు అదనపు అభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు, రూ. 19 కోట్లు ప్రస్తుత ప్రొడక్టుల ఆధునీకరణ, విస్తరణ తదితరాలకు వినియోగించనుంది. మరో రూ. 14 కోట్లు బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్ కార్యకలాపాలపై వెచ్చించనుంది.ఇదీ చదవండి: ఎన్ఎస్ఈ కొత్త యాప్.. తెలుగులోనూ వెబ్సైట్కాగా.. జులైలో ప్రీఐపీవో నిధుల సమీకరణలో భాగంగా సుప్రసిద్ధ ఇన్వెస్టర్ల నుంచి రూ. 21.44 కోట్లు సమకూర్చుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి ఆరు నెలల్లో(ఏప్రిల్–సెప్టెంబర్) రూ. 72 కోట్ల ఆదాయం, రూ. 19 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
'ఓ నాన్న ప్రేమ'..! దూరమైన కూతుర్ని ఏకంగా ఏఐ సాంకేతికతో..!
ఏఐ సాంకేతికత చాలా విప్లవాత్మకంగా దూసుకుపోతుంది. ఈ ఏఐ సంకేతికతో దూరమైపోయిన మన కుటుంబికులను మన కళ్లముందు ఉండేలా డిజటల్ ప్రపంచంలోకి తీసుకువెళ్తోంది. ఆయా వ్యక్తుల దూరమయ్యరనే బాధను పోగొట్టి శాంతిని చేకూరుస్తుంది. ఇలా కూడా ఉపయోగపడుతుందా? అనేలా కొంగొత్త ఆవిష్కరణలు మన ముందుకు వస్తున్నాయి. అలాంటి ఆవిష్కరణే ఓ తండ్రి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఓ 'తండ్రి ప్రేమ' ఎంతటి సాహస కృత్యమైనా చేయిస్తుందనేందుకు నిదర్శనగా నిలిచాడు ఈ 'నాన్న'! తైవాన్ నటుడు, గాయకుడు టినో బావో తనకు దూరమైన 22 ఏళ్ల కూతురు రూపాన్ని, గాత్రాన్ని కుత్రిమ మేధ ఏఐ సాంకేతికతో రూపొందించాడు. తన భార్యకు గర్భసోకాన్ని తీర్చాడు. చెప్పాలంటే ఆమెకు ఒక కొత్త ఆశను కల్పించాడు. తన కూతురు ఎక్కడికో వెళ్లిపోలేదు ఇక్కడే ఉందనే చిన్ని ఆశను రేకెత్తించాడు. ఈ 56 ఏళ్ల నటుడు టినో బావో తన కుమార్తె బావో రాంగ్ డిజిటల్ వెర్షన్ వీడియో క్లిప్‌ని నెట్టింట విడుదల చేశాడు. అందులో ఆమె తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ..ఐ మిస్ యూ డాడ్ అండ్ మామ్ అంటున్న మాటాలు వినిపిస్తాయి. అందులో ఆమె చక్కగా డ్యాన్స్ చేస్తున్నట్లు కూడా ఉంటుంది. ఇది చూసి ఆమె తల్లి చాలా భావోద్వేగానికి గురవ్వుతుంది. పైగా అచ్చం మన కూతురు బావో రాంగ్‌లా ఉందేంటీ అని ఉద్వేగంగా తన భర్త బావోని అడుగుతుంది. దానికి నటుడు బావో అది మన కూతురే కాబట్టి అని సమాధానమిస్తాడు. నిజానికి ఈ జంట కూతురు పోయిన దుఃఖంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే మానేశారు. ఏదైనా మాట్లాడితే కూతురు లేదనే విషయం గుర్తొచ్చి బాధపడాల్సి వస్తుందని మాట్లాడుకోవడమే మానేశారు ఆ దంపతులు. ఏఐ సాంకేతికతో రూపొందించిన ఈ డిజటల్ కుమార్తె వాళ్లిద్దర్నీ మళ్లీ తిరిగి మాట్లాడుకునేలా చేసింది. ఈ మేరకు బావో మాట్లాడుతూ.."నా కూతురు 22 ఏళ్ల వయసులో అరుదైన రక్త వ్యాధితో మరణించింది. నా కూతురు చివరి రోజుల్లో ట్రాచల్ ఇంట్యూబేషన్ కారణంగా గొంతును కూడా కోల్పోయింది. ఆమె చనిపోయేంత వరకు మాతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. ఈ ఘటనే తనను కూతురుని కళ్లముందు ఉండేలా చేయడం ఎల? అనే ఆలోచనకు తెరతీసింది. అదే అతడిని ఈ కృత్రిమ మేధస్సు ఏఐని అధ్యయనం చేసేందుకు దారితీసింది. తన ఏకైక బిడ్డను డిజిటల్‌గా పునరుద్ధరించాలనే లక్ష్యంతో ఇంతటి ఆవేదన మధ్య ఏఐలో పీహెచ్డీ చేశాను. ఆ తర్వాత నా కుమార్తెను డిజటల్‌గా రూపొందించేందుకు సూపర్ బ్రెయిన్ అనే మెయిన్‌ల్యాండ్ కంపెనీ బృందంలో పనిచేశాను. అయితే కుమార్తె చిత్రాన్ని డిజిటల్‌గా రూపొందించడంలో ఇబ్బంది లేదు ఎందుకుంటే ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఉన్నాయి. కేవలం ఆమె వాయిస్‌ని రూపొందించేందుకే శ్రమ పడ్డాను. ఎందుకంటే..? ఆమె ఆ వ్యాధి కారణంగా గొంతును కోల్పోయింది. దీంతో నా కూతురు ఆఖరి ఘడియల వరకు మాతో ఏం మాట్లాడలేకపోయింది. అందువల్ల నా కుమార్తె తన తల్లితో వీడియో కాల్ చేస్తున్నప్పుడు మాట్లాడిన మూడు ఆంగ్ల వాక్యాలను మాత్రమే ఉపయోగించి వాయిస్‌ని క్రియేట్ చేయడానికి కష్టపడాల్సి వచ్చింది. దాని ఫలితమే ఈ డిజటల్ కుమార్తె వీడియో క్లిప్. ఇది నన్ను నా భార్యను మళ్లీ దగ్గరకు చేసింది. ఈ ఐఏ సాంకేతికతో మా కూతుర్ని మళ్లీ పొందేలా చేసింది. కొంత ఉపశమనం కలిగించింది." అని భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు బావో. అయితే బావోకి కూతురంటే ఎంత ప్రేమంటే..ఆమెకు బావో జుట్టుని ముట్టుకోవడం ఇష్టం అందుకని ఆమె తాకిన జుట్టుని అలానే ఉంచాలన్న ఉద్దేశ్యంతో కత్తిరించుకోవడం మానేశాడు. అలాగే ఆమె మరణించిన తర్వాత ఆమె శరీరంలోని ఎముకను కూతురు గుర్తుగా మెడలో గొలుసుగా వేసుకున్నాడు. ప్రేమ ఎంతటి ఘనకార్యాన్నైనా చేయిస్తుందనడానికి ఈ నాన్న ప్రేమే ఉదహారణ కదూ!. (చదవండి: నో స్మోకింగ్ డే ఆ వ్యసనానికి చెక్‌పెట్టే ఆహార పదార్థాలివే!) -
తిరుపతి ఐఐటీ, ఐసర్, విశాఖ ఐఐఎం ప్రారంభం
రేణిగుంట/ఏర్పేడు (తిరుపతి జిల్లా)/ తిరుపతిసిటీ/ఆనందపురం(విశాఖ)/ పెద్దారవీడు/కర్నూలు కల్చరల్: రాష్ట్రంలో ఏర్పాటుచేసిన ప్రముఖ జాతీయ విద్యాసంస్థలైన తిరుç³తి ఐఐటీ, ఐసర్, విశాఖ ఐఐఎం శాశ్వత ప్రాంగణాలు, కర్నూలు ఐఐఐటీ డీఎమ్ను ప్రధాని మోదీ మంగళవారం వర్చువల్ విధానంలో ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. తిరుపతి జిల్లా ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో మంగళవారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్ విధానంలో పాల్గొని తిరుపతి ఐఐటీ బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు. కార్యక్రమంలో ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ, తిరుపతి ఎంపీ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏర్పేడు మండలం జంగాలపల్లి సమీపంలో శాశ్వత క్యాంపస్ ఏర్పాటుచేసుకున్న ఐజర్(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్)ను ప్రధాని మోదీ జమ్ము నుంచి వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఐజర్ డైరెక్టర్ శంతాను భట్టాచార్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ గురుమూర్తి, జిల్లా కలెక్టర్ లక్ష్మిశా పాల్గొన్నారు. ఎడ్యుకేషనల్ హబ్‌గా తిరుపతి తిరుపతి ఎడ్యుకేషనల్ హబ్‌గా పేరుపొందిందని ఎంపీ ఎం.గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మంగళవారం వర్చువల్ విధానం ద్వారా ప్రధాని ప్రారంభించిన పీఎం–యూఎస్‌హెచ్‌ఏ నిధుల మంజూరు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతో మంచి ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతోందని తెలిపారు. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ పథకం కింద కేంద్రం మహిళా వర్సిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించడం శుభపరిణామమన్నారు. ఐఐఎం శాశ్వత క్యాంపస్ ప్రారంభం విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం వద్ద 241 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) శాశ్వత భవనాలను ప్రధాని మోదీ మంగళవారం వర్చువల్ పద్ధతిలో జమ్మూ నుంచి ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్నారు. 2016లో ఐఐఎం ప్రారంభం కాగా.. అప్పటి నుంచి ఏయూలో తాత్కాలిక క్యాంపస్‌లో నిర్వహిస్తూ వస్తున్నారు. కాగా మొదట దశ భవనాలు అందుబాటులోకి రావడంతో విద్యాలయాన్ని శాశ్వత ప్రాంగణానికి మార్చారు. కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ మల్లికార్జున, ఐఐఎం డైరెక్టర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయం ప్రారంభించిన ప్రధాని.. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని రాజంపల్లి గ్రామం సమీపంలో కేంద్రీయ విద్యాలయాన్ని ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హైదరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ప్రభుదాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ స్నేహలత మాట్లాడుతూ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహకారంతో 8 ఏళ్ల కిందట తాత్కాలిక భవనాల్లో కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించారన్నారు. కేంద్రం రూ. 25 కోట్లు కేటాయించడంతో ప్రస్తుతం 16 ఎకరాల విస్తీర్ణంలో నూతనంగా కేంద్రీయ విద్యాలయ భవనాల సముదాయాన్ని నిర్మించినట్లు చెప్పారు. -
వర్చువల్ లోకం.. ‘కొంచెం వర్రీ.. కొంచెం వెర్రీ!’
వాస్తవం కన్నా కల్పనే అందంగా ఉంటుంది! ప్రాక్టికాలిటీ కన్నా భ్రమే ఆనందాన్నిస్తుంది! నిజానికి బంధనాలుంటాయి.. ఊహలకు ఆకాశం కూడా హద్దు కాదు! అందుకే వర్చువల్ వరల్డ్‌లో అందరూ హీరోలే.. అసలు ఆ కిక్కే వేరప్పా! కల చెదిరి.. స్పృహలోకొచ్చాక రియాలిటీ ఇచ్చే షాక్ కూడా వేరప్పా! వర్చువల్ ప్రభావాలు.. రియాల్టీ ప్రమాదాలు ఇప్పుడు చర్చనీయాంశాలు! పాతికేళ్ల కిందట.. మ్యాట్రిక్స్ అనే హాలీవుడ్ సినిమా ప్రపంచాన్ని ఊపేసింది. ఇంటెలిజెంట్ మెషిన్లు అందులో మనుషుల శరీరాలను ఎనర్జీ సోర్స్‌గా ఉపయోగించుకుని.. అచ్చంగా వారిని పోలిన రూపాలతో వర్చువల్ వరల్డ్‌ని రూపొందించి తామనుకున్న సంఘ వ్యతిరేక పనులు చేస్తుంటాయి. ఈ వర్చువల్ బాడీకి ఏదైనా ప్రమాదం జరిగితే దాని తాలుకు ప్రభావం ఎనర్జీ సోర్స్ రూపంలో ఉన్న అసలైన మనిషిపై కనిపిస్తుంటుంది. ఆఖరికి వర్చువల్ వరల్డ్ కారణంగా ఎనర్జీ సోర్సెస్ చనిపోతాయి కూడా! పన్నెండేళ్ల కిందట.. వచ్చిన ‘అవతార్’ సినిమా కూడా అలాంటిదే. పండోరా గ్రహంలో ఉన్న అపార సహజ వనరులపై కన్నేసిన మనుషులు వాటిని సొంతం చేసుకునేందుకు తమ శరీరాలను ఎనర్జీ సోర్స్‌గా ఉపయోగించుకుంటూ వర్చువల్ మనుషులను తయారు చేస్తారు. ఆ పండోరా గ్రహవాసులు, వర్చువల్ మనుషుల మధ్య ప్రేమానుబంధాలు, కుట్రకుతంత్రాలతో పండోరా మీద మనుషుల ఆధిపత్య పోరుతో సాగుతుంది సినిమా. ∙∙ తాజాగా.. ఓటీటీలో హల్చల్ చేస్తోన్న హారర్ కామేడీ.. ‘కంజూరింగ్ కన్నప్పన్’ అనే తమిళ సినిమా ‘డ్రీమ్ క్యాచర్’ పాయింట్ చుట్టూ తిరుగుతుంది. నిజ జీవితంలో సాధ్యంకాని విషయాలను కలలో సాధ్యం చేసుకోవడమనే అంశంపైనే ఈ సినిమా నడుస్తుంది. అయితే ఇందులోని క్యారెక్టర్స్‌కి ఆ కలలో అనుకోకుండా ఎదురయ్యే ప్రమాదాల వల్ల నిజ జీవితంలోనూ ముప్పు వాటిల్లుతుంది. చివరకు జీవితం భయానకం అవుతుంది. కలల మీద అంతకుముందే హాలీవుడ్లో ‘ఇన్సెప్షన్’ పేరుతో ఒక సినిమా వచ్చింది. పై చిత్రాలన్నీ ఫాంటసీ, సైన్స్‌ఫిక్షన్ ఆధారంగా ‘వర్చువల్ వరల్డ్’ కేంద్రంగా వచ్చినవే. మన జీవితాల్లో వర్చువల్ వరల్డ్ ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాలను కళ్లకుకట్టే ప్రయత్నం చేసినవే. అలా సిల్వర్స్క్రీన్కే పరిమితమైన వర్చువల్ వరల్డ్ మెల్లమెల్లగా రియల్ వరల్డ్‌లోకీ చేరింది. అందరూ ఊపయోగించే వాట్సాప్ నుంచి పబ్జీ వంటి గేమ్స్, స్నాప్‌చాట్ వంటి యాప్‌ల దాకా ప్రత్యేకంగా అవతార్లు పుట్టుకొస్తున్నాయి. ఆ యాప్‌లను వాడే కొద్దీ తమ రియల్ వరల్డ్‌లోని బాడీ కంటే యాప్‌లలో ఉపయోగించే అవతార్లనే మనుషులు మానసికంగా సొంతం చేసుకోవడం మొదలైంది. గంటల తరబడి వాటితోనే గడుపుతున్నారు, లక్షల కొద్ది డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఆఖరికి ఆ వర్చువల్ అవతార్‌కి ఏమైనా అయితే దాని తాలుకు లక్షణాలతో మనుషులు రియల్ వరల్డ్‌లో మంచం పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. అయితే ఇంగ్లండ్‌లో జరిగిన ఘటన వర్చువల్ వరల్డ్‌పై మరింత చర్చకు కారణమైంది. సరికొత్త ఐడెంటిటీ రియల్ వరల్డ్‌లో.. పుట్టిన ఊరు, కుటుంబం వంటి తదితర వివరాలతో సామాజికంగా మనుషులకు ఒక గుర్తింపు ఉంటుంది. ప్రభుత్వ పరంగా అయితే ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్‌తో వ్యక్తిగత గుర్తింపు లభిస్తుంది. కానీ డిజిటల్ వరల్డ్ దీనికి భిన్నం. నిర్ధారిత తనిఖీ, పరిశీలన, విచారణ వంటివేమీ లేకుండానే గుర్తింపును పొందే వీలుంటుంది. సోషల్ మీడియాలోని ఒక్కో ఫ్లాట్‌ఫామ్‌లో.. ఓక్కో యాప్‌లో ఒకే మనిషి పదుల సంఖ్యలో ఐడెంటిటీలు పొందవచ్చు. దీంతో డిజిటల్ వరల్డ్‌లో అసలైన ఊరు, పేరు తెలియకుండానే చలామణి కావొచ్చు. సామాజిక కట్టుబాట్లు, ఇంట్లో వాళ్ల ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా విహరించవచ్చు. ఈ వెసులుబాటు కారణంగానే యువతరం మొదలు పెద్దల వరకు అంతా డిజిటల్ ఐడెంటిటీ వైపు అడుగులు వేస్తున్నారు. నిజమైన గుర్తింపులేని ఈ తీరే మోసాలకు కారణమవుతోంది. డీపీలతో గిట్టని వ్యక్తులను అప్రతిష్ఠపాలు చేయడానికి ఫేక్ ఫొటోలతో ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి అభాసుపాలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ చర్యలు ముఖ్యంగా మహిళలను ఇబ్బందిపెడుతున్నాయి. అవమానాలకు గురిచేస్తున్నాయి. పరిచయస్తులు, మొన్నటి వరకు మనతో ఉన్న వాళ్లే.. స్పర్థల కారణంగా దూరమైతే చాలు టార్గెట్ మహిళల ఫొటోలు, ఫోన్ నంబర్లను పోర్న్ సైట్లలో పెడుతూ తీవ్రమైన మానసిక హింసకు పాల్పడుతున్నారు. లేదా ఫేక్ డీపీలతో చాటింగ్ చేస్తూ మోసాలకు దిగుతున్నారు. స్త్రీ, పురుష స్నేహాలతోనే కాకుండా మరోరకం నకిలీ ఖాతాలకూ ఫేస్బుక్ ప్లాట్‌ఫామ్‌గా మారింది. ఆ నకిలీ ఖాతాలు చక్కగా మనతో ఇన్‌బాక్స్ లేదా డైరెక్ట్ మెసేజెస్‌తోనే స్నేహాన్ని పెంచుకుంటాయి. హఠాత్తుగా.. చాలా అవసరం పడిందని.. ఫలానా అంత నగదు పంపాలంటూ వేడుకుంటాయి. తిరిగి చెల్లిస్తామని నమ్మబలుకుతాయి. నమ్మి నగదు పంపిన వెంటనే డిసపియర్ అయిపోతాయి. ఫేస్బుక్లో దాదాపు అందరూ ఈ నకిలీ ఖాతాలు – మనీ రిక్వెస్ట్‌లకు బాధితులుగా మారారు. దీన్ని అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా లాభం లేకుండాపోతోంది. నకిలీ గుర్తింపు ఆధారంగా మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. డీప్ ఫేక్‌తో ఇటీవల సినిమా నటి రష్మికా మందన్న డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గత నాలుగేళ్లుగా అమెరికా, యూరప్ దేశాల్లో ఈ డీప్ ఫేక్ వీడియోలు కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి సంబంధించి.. డీప్ ఫేక్ వీడియోలు కోకొల్లలుగా వచ్చాయి. రెండు వేర్వేరు వీడియోలను కలుపుతూ నిఖార్సైన నకిలీని క్రియేట్ చేయడంలో డీప్ ఫేక్‌లు ఆరితేరిపోయారు. దశబ్దాల కిందటే మార్ఫింగ్ అనేది ఉనికిలోకి వచ్చినా దాన్ని గుర్తించడం తేలికే. ఎక్కడో కంప్యూటర్ గ్రాఫిక్స్, వీఎఫెక్స్ వాడితే తప్ప సహజంగా అనిపించేది కాదు అది. కానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ.. చేతిలోని స్మార్ట్ ఫోన్‌తో ఫేక్‌ని క్రియేట్ చేయగలుగుతుండటంతో సమస్య తీవ్రమైంది. నకిలీ వర్సెస్ అవతార్ డిజిటల్ దునియా/వర్చువల్ వరల్డ్‌లో నకిలీ ఖాతాలను సృష్టించడం వెనుక కచ్చితమైన ఉద్దేశం అర్థమవుతోంది. ఆర్థికంగా దోచుకోవడం, పరువు ప్రతిష్ఠలను దెబ్బతీసి మానసికంగా కుంగదీయడం వాటి ప్రధాన లక్ష్యాలు. కొన్నిసార్లు ఎదుటి వారితో ఆడుకోవడానికీ నకిలీ ఖాతాలు వస్తున్నాయి. వీటిని సృష్టించే వారు తమకు సంబంధించిన వివరాలను ఆ ఖాతాలో పొందుపరచరు. ఇందుకు భిన్నం అవతార్. పూర్తిగా మనకు సంబంధించిన మరో రూపమే అవతార్ అన్నట్టుగా ఉంటుంది. మన అవతార్‌కు ఎలాంటి హెయిర్ స్టైల్ ఉండాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి, శరీరం రంగు ఎలా ఉండాలి.. వంటి అన్ని విషయాల్లో మన ఇచ్ఛకు తగ్గట్టుగా వర్చువల్ అవతార్‌ను రెడీ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ అవతార్తోనే సోషల్ మీడియా, డిజిటల్ ఫ్లాట్‌ఫామ్, ఆ¯Œ లై¯Œ గేమ్స్‌లో పాల్గొనవచ్చు. ఈ పాల్గొనడమే చెలరేగే స్థాయికి చేరితే వర్చువాలిటీ రియాల్టీకి మధ్య ఉండే గీత చెరిగిపోతుంది. ఆ తర్వాత వర్చువల్‌గా జరిగే విషయాలకు రియాల్టీలో నష్టపోవాల్సి వస్తుంది. మానసిక ఆనందం కోసం వచ్చిన వర్చువల్ వరల్డ్ చివరకు మానసిక వేదనకు దారి తీస్తోంది. ఇలా ఇబ్బందులకు గురవుతున్న వారిలో టీనేజర్లు, మహిళలే అధికంగా ఉండటం గమనార్హం. అసలు కంటే ఎక్కువ రియల్ వరల్డ్‌లో ఉన్న గుర్తింపు కంటే డిటిజల్ దునియాలో దక్కే గుర్తింపే ఎక్కువ అనుకునే వారు పెరుగుతున్నారు. ఉదాహరణకు మోస్ట్ పాపులర్ పబ్జీ గేమ్. ఈ గేమ్‌ను.. ఆన్లైన్ లో ఎవరికి వారు తమ ‘అవతార్’ను ఎంచుకుని ఏక కాలంలో ఆడుకునే వీలుంది. అవతార్ ధరించే డ్రెస్‌లు, వాడే ఆయుధాలకు ఇక్కడ రేట్ ఫిక్స్ అయి ఉంటుంది. ఒక్కో లెవెల్‌ను దాటుకుంటూ ఈ అవతార్లు గేమ్‌లో ముందుకు వెళ్తుంటాయి. ఆయా లెవెల్స్ ఆధారంగా ఆ ఆటగాడు ఎంతటి మొనగాడనే గుర్తింపును డిజిటల్ దునియా ఇస్తుంది. ఈ రికగ్నిషన్ ఇచ్చే కిక్ కోసం పరీక్ష ఫీజులు మొదలు.. తల్లిదండ్రుల అకౌంట్ల దాకా డబ్బును స్వైప్ చేయడానికి ఏ మార్గం దొరికినా వదలకుండా లక్షల రూపాయలను ఈ గేమ్స్ కోసం ధారపోసే గేమర్లు ఉన్నారంటే ఆశ్చర్యమూ అతిశయోక్తీ ఎంతమాత్రం లేదు.. కాదు. చిక్కులు వాస్తవ ప్రపంచంలో.. మనుషులు తప్పులో.. నేరాలో చేస్తే వాటిని అరికట్టేందుకు, శిక్షించేందుకు చట్టాలు, శిక్షాస్మృతులున్నాయి. కానీ రోజురోజుకూ విస్తరిస్తున్న డిజిటల్ దునియాలో జరుగుతున్న మోసాలు, నేరాలకు అడ్డుకట్ట వేసేదెలా అన్నదే అంతు చిక్కని ప్రశ్న. దీనిపై ఇప్పటికే కొన్ని దేశాలు చట్టాలను తయారుచేసుకున్నాయి. మరికొన్ని పకడ్బందీ చట్టాలను రూపొందించే పనిలో ఉన్నాయి. అయితే డిజిటల్ దునియాలో.. ప్రపంచంలోని ఓ మూలనున్న వారు మరో మూలనున్న వారిని మోసం చేసేందుకు, వేధించేందుకు అవకాశం ఎక్కువ. సైబర్ క్రైమ్‌కి సంబంధించిన చట్టాలు వేర్వేరు దేశాల్లో వేర్వేరుగా ఉంటాయి. దీంతో నేరాలు, మోసాలకు పాల్పడిన వారిని పట్టుకోవడమే కష్టం అనుకుంటే వారిని ఏ చట్టాల పరిధిలో శిక్షించాలనేది మరో తలనొప్పిగా మారింది. మెటావర్స్ డిజిటల్ దునియా కారణంగా ఇలాంటి సమస్యలు ఒకొక్కటిగా ముందుకు వస్తున్నా టెక్నోక్రాట్స్ మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయడంలేదు. సోషల్ మీడియా దిగ్గజం మార్క్ జుకర్‌బర్గ్.. మనం జీవిస్తున్న యూనివర్స్‌కి పోటీగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో మెటావర్స్‌ను అందుబాటులోకి తెస్తామని ఇప్పటికే ప్రకటించారు. రెండేళ్ల కిందట ఆయన మెటావర్స్‌ను పరిచయం చేశారు కూడా. అది ఆశించిన స్థాయిలో జనాల్లోకి చొచ్చుకుపోలేదు. అయితే మరింత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే యూనివర్స్‌కి పోటీగా మెటావర్స్ లేదా మరోవర్స్ రావొచ్చు. ఇలాంటి ప్రత్యామ్నయ ‘వర్స్’ల కారణంగా ఏర్పడే దుష్పరిణామాలకు ఎలా చెక్ పెట్టాలన్నది ఇటు టెక్నోక్రాట్స్, అటు దేశాధినేతల ముందున్న సవాల్. ఎప్పటి నుంచో నిజ జీవితంలో సాధ్యం కాని విషయాలను ఊహల్లో సాధ్యం చేసుకోవడం మనిషి పుట్టుక నుంచీ ఉన్నదే. దానికి కథలు, కవితలు ఇతర కళారూపాలను సాధనాలుగా మలచుకోవడం నాగరికత నేర్పిందే. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వర్చువల్ టెక్నాలజీ రూపంలో మనుషులకు కొత్త కొత్త అవతార్లను సృష్టించి ఇస్తోంది. ఆనందలోకంలో తిప్పుతోంది. కానీ క్రమంగా సీన్ రివర్స్ అవుతోంది. డిజిటల్ అవతార్ రూపంలో ఉన్న మనిషి ‘టార్గెట్’ అవుతున్నాడు. వర్చువల్ వరల్డ్‌లో జరిగిన సంఘటనలకు ఇచ్చే ప్రతి స్పందనలతో భౌతిక ప్రపంచంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాడు. వర్చువల్ వరల్డ్‌లో దాడికి గురైన వ్యక్తులు రియల్ వరల్డ్‌లో అసలైన బాధితులుగా మారుతున్నారు. ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నప్పుడు నిందితులను ఎలా పట్టుకోవాలి ? వారిని ఎలా శిక్షించాలి ? రియల్ వరల్డ్ తరహాలోనే వర్చువల్ వరల్డ్ విషయంలోనూ చట్టాలు తయారు చేయాలనే ప్రశ్నలు ఉత్నన్నమవుతున్నాయి. పరిష్కారమార్గాల అన్వేషణలో కాలయాపన తగదని ఇంగ్లండ్ అవతార్ రేప్ ఘటన చెబుతోంది. చట్టాల రూపకల్పన వేగంవంతం కావాలని హెచ్చరిస్తోంది. వర్చువల్ రేప్ ఇంగ్లండ్‌లో ఓ మైనర్ బాలిక ఆన్లైన్లో వర్చువల్ గేమ్‌కు బాగా అలవాటు పడింది. ఆ గేమ్‌లో తన అవతార్‌తో మమేకమైపోయింది. గ్రూప్‌గా ఆడే ఆ గేమ్‌లో కొందరు మగ అవతార్లు ఈ మైనర్ బాలిక అవతార్‌పై కన్నేశారు. గేమ్ ఆడుతూ ఆ బాలిక అవతార్‌పై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. గేమ్‌లో పూర్తిగా లీనమైపోయిన ఆ అమ్మాయి ఆ వర్చువల్ గ్యాంగ్ రేప్‌కు కంపించిపోయింది. వాస్తవంగానే తనపై లైంగికదాడి జరిగినట్టుగా ట్రామాలోకి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అమల్లో ఉన్న చట్టాల ద్వారా ఆ వర్చువల్ గ్యాంగ్ రేప్‌ని ఎలా నిర్ధారించాలి? దానికి కారణమైన నిందితులను ఎలా గుర్తించాలి? ఏ గ్రౌండ్ మీద వారిని శిక్షించాలనేది అంతుచిక్కని వ్యవహారంగా మారింది. మొత్తానికి విషయం వైరల్ అయింది. వర్చువల్ వరల్డ్‌కి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇంకా అలసత్వం తగదంటూ ఒకరకంగా ప్రపంచాన్ని హెచ్చరించిందీ సంఘటన. ఏకాభిప్రాయం ఉండాలి ఫేస్బుక్, యూట్యూబ్‌లో అసభ్య పదజాలంతో దూషించే వారిని పట్టుకుని శిక్షించడమే కష్టమవుతుంటే.. డిజిటల్ వరల్డ్‌లో వ్యక్తిగత గోప్యత, వ్యక్తిగత డిజిటల్ రైట్స్ అనే సమస్యలకు పరిష్కారం చూపడమనేది ఇంకా బాలారిష్టాలనే దాటలేకపోతుంటే.. వీటి తర్వాత లెవెల్లోని డిజిటల్ వరల్డ్, వర్చువల్ రియాల్టీలో జరుగుతున్న .. జరిగే అరచాకాలను అరికట్టడం సాధ్యమయ్యే పనేనా అనిపిస్తోంది. వాటిని నిలువరించే సమర్థవంతమైన వ్యవస్థలు, చట్టాలు ఇంకా రాలేదనే చెప్పాలి. ఇది అనేక సంక్లిష్టతలతో కూడుకున్నది. డిజిటల్ వరల్డ్, వర్చువల్ రియాల్టీలో క్రియేట్ అవుతున్న సమస్యలపై ప్రపంచ దేశాలు ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. ట్రోలింగ్, బులీయింగ్, డిఫమేషన్ వంటి అంశాలపై అందరికీ ఏకాభిప్రాయం ఉండాలి. నేరం/ఘటన ఎక్కడ జరిగినా అందుకు సంబంధించిన వ్యక్తులను పట్టుకోవడం, విచారణ చేయడంలో దేశాల మధ్య ఒప్పందాలు జరగాలి. అదేవిధంగా వర్చువల్ /డిజిటల్ వరల్డ్‌కి సంబం«ధించిన అంశాలపై సామాన్యులకూ అవగాహన కలిగేలా కెపాసిటీ బిల్డింగ్ జరగాలి. కనీసం అవతార్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీగా మారాలి. అప్పుడే జరగబోయే అనర్థాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. – అనిల్ రాచమల్ల, సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కలిగిస్తున్న సాంకేతిక నిపుణులు పేరెంట్స్ పైనే భారం ఇంటర్నెట్ వినియోగం నేడు అనివార్యమైపోయింది. చిన్నా, పెద్దా అందరికీ అత్యవసరం అయింది. అయితే అవసరానికి.. వ్యసనానికి మధ్య ఉన్న హద్దును అందరూ మరచిపోతున్నారు. ముందు తేరుకోవాల్సింది పెద్దలే. ఇంటర్నెట్నే ఇల్లులా భ్రమపడుతున్న పిల్లలను ఆ మాయజాలం నుంచి బయటకు తేవాల్సిన బాధ్యత పెద్దలదే. అవసరానికి.. వ్యసనానికి మధ్య ఉన్న గీత మీద అవగాహన కల్పించాలి. వ్యక్తిగత విషయాలకు సంబంధించిన గోపత్యను పాటించడం ఇప్పుడు చాలా అవసరం. అన్నీ గూగుల్లోనే ఉన్నాయిశ వేవ్‌లో పడిపోయిన నేటి తరం అంతర్జాలంలో తమ వ్యక్తిగత వివరాలను ప్రూవ్స్తోసహా (ఫొటోలు, వీడియోలు వగైరా) ఎంత తక్కువగా అప్ డేట్ చేస్తే అంత సేఫ్‌గా ఉండొచ్చనే ఫ్యాక్ట్‌ని బ్రెయిన్ చిప్‌లోకి ఎక్కించాలి. ‘వర్చువల్ వరల్డ్ అనేది ఒక భ్రాంతి.. అదొక కాలక్షేపం..’ అనే సత్యాన్నీ వీలైనన్ని సార్లు మెదడులో సేవ్ చేయించాలి. ఇదీ పేరెంటింగ్‌లో భాగం కావాలి. కేసులు పెరుగుతున్నాయి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం 2022లో.. సైబర్ క్రైమ్‌కి సంబంధించి దేవశ్యాప్తంగా 65,843 కేసులు నమోదు అయ్యాయి. వాటిల్లో అత్యధికంగా చీటింగ్ కేసులు 42,710 (64.8 శాతం) ఉండగా బెదిరింపులకు పాల్పడిన కేసులు 3,648 (5.5 శాతం) ఉన్నాయి. ఇక సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్‌కి సంబంధించి 3,434 (5.2 శాతం) కేసులు నమోదయ్యాయి. సైబర్ కేసుల పెరుగుదలను పరిశీలిస్తే 2012లో దేశవ్యాప్తంగా 3.693 కేసులు నమోదుకాగా 2022కి వచ్చేసరికి ఈ సంఖ్య 65,893కి చేరుకుంది. నమోదు కాని కేసులు సంఖ్య ఇంతకు నాలుగింతలు ఉండొచ్చని అంచనా. గత దశాబ్దకాలంగా స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ వాడకం పెరగడంతో అదే స్థాయిలో సైబర్ కేసుల తీవ్రతా పెరుగుతోంది. 2012లో దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నవారు 12.5 శాతం ఉండగా 2022 చివరికి అది 76.6 శాతానికి పెరిగింది. హై స్కూల్ పిల్లలు మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ మొబైల్ ఫోన్ ఉంటోంది. ప్రస్తుతమైతే సైబర్ నేరాల్లో ఆర్థిక నేరాలదే అగ్రస్థానం. సరైన జాగ్రత్తలు, నియంత్రణ లేని పక్షంలో లైంగిక వేధింపులు, మానసిక సమస్యలకూ డిజిటల్ దునియానే ప్రధాన కారణం కావడానికి అవకాశాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. -కృష్ణగోవింద్ -
వర్చువల్ ఎవరెస్ట్ జర్నీ
ఎవరెస్ట్ శిఖరం 360 డిగ్రీల కెమెరా వ్యూ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. వర్చువల్ జర్నీ రూపంలో సరికొత్త అనుభవాన్ని అందిస్తోంది. పర్వతారోహకులు ఎదుర్కొనే కఠినమైన వాతావరణ పరిస్థితులను అనుభవంలోకి తెచ్చేలా ఉంటుంది ఈ వర్చువల్ జర్నీ. స్కిల్డ్ మౌంటెనీర్స్ టీమ్ ఈ ఫుటేజీని కాప్చర్ చేసింది. ‘ఏ 360 డిగ్రీ కెమెరా వ్యూ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్’ కాప్షన్‌తో అష్రఫ్ జక్ర ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వేలాది వ్యూస్‌ను సొంతం చేసుకుంది. పర్వతారోహక బృందం ధైర్యసాహసాలకు, సాంకేతిక నైపుణ్యానికి నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘టాప్ ఆఫ్ ది వరల్డ్! థ్యాంక్‌ఫుల్ ఫర్ గాడ్స్ క్రియేషన్’... నెటిజనుల నుంచి ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి. -
కాంతులీననున్న కొత్త సబ్స్టేషన్లు
సాక్షి, అమరావతి : అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా రానున్న రోజుల్లో ఏపీ గణనీయమైన వృద్ధి, పట్టణీకరణ జరిగే క్రమంలో ఎదురయ్యే విద్యుత్ డిమాండ్‌ను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు వీలుగా విద్యుత్ రంగం బలోపేతంపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా.. రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి 28 సబ్స్టేషన్లకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ ట్రాన్స్‌కో) శ్రీకారం చుడుతోంది. వీటిలో 16 సబ్స్టేషన్ల శంకుస్థాపన, 12 సబ్స్టేషన్ల ప్రారంపోత్సవాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం వర్చువల్ విధానంలో చేయనున్నారు. రూ.3,100 కోట్ల వ్యయంతో కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, సత్యసాయి, ప్రకాశం, గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలోని 28 ప్రాంతాల్లో 132/33 కేవీ, 220/132 కేవీ, 400/220 కేవీ, 400/132 కేవీ సామర్థ్యాలతో ఈ సబ్స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి. రెండు సోలార్ ప్రాజెక్టులు కూడా.. ఇవికాక.. కడపలో 750 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, అనంతపురంలో 100 మెగావాట్ల మరో సోలార్ ప్రాజెక్టు నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. కడప జిల్లా మైలవరం మండలంలో 1,000 మెగావాట్ల సోలార్ పార్కు అభివృద్ధికి కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) ఆమోదం తెలిపింది. ఇందులో 250 మెగావాట్లను 2020 ఫిబ్రవరి 8న ప్రారంభించారు. మిగిలిన 750 మెగావాట్లను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ అఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) ద్వారా అభివృద్ధి చేయనున్నారు. ఈ 750 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్లు పెట్టుబడి అవుతుందని అంచనా. ఏడాదిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి 1,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్లాంట్ ఏటా 1,500 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిద్వారా సంవత్సరానికి 12 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని అంచనా. అలాగే.. శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లోని ఎన్.పీ.కుంట, గాలివీడు గ్రామాల వద్ద 1,500 మెగావాట్ల సోలార్ పార్క్‌కు ఎంఎన్ఆర్ఈ ఆమోదం తెలిపింది. వివిధ సోలార్ పవర్ డెవలపర్లు 1,400 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్రాజెక్టులను ఇప్పటికే పూర్తిచేశారు. మిగిలిన 100 మెగావాట్ల కోసం, హెచ్‌పీసీఎల్ ముందుకొచ్చింది. ఈ సోలార్ ప్రాజెక్టుకు రూ.400 కోట్లు పెట్టుబడి అంచనా వేయగా, ఏడాది నిర్మాణ కాలంలో 200 మందికి ఉపాధి లభించనుంది. ఈ ప్లాంట్ ఏటా 200 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. తద్వారా ఏటా 1.6 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చు. గడువులోగా ప్రాజెక్టులు పూర్తి విద్యుత్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్ణిత సమయానికి పూర్తి చేసేందుకు పక్కాగా ప్రణాళికలు రూపొందించాలని విద్యుత్ సంస్థలను ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కె. విజయానంద్ ఆదేశించారు. సీఎం కార్యక్రమం ఏర్పాట్లపై విద్యుత్ సౌధలో సోమవారం ఆయన అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి, అందుకు తగ్గట్లుగా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి రాష్ట్ర విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందించిన సహాయ సహకారాలతోనే వినియోగదారులకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్‌ను వినియోగదారులకు ఇవ్వగలుగుతున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జెన్కో ఎండీ, ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ జేఎండీ బి. మల్లారెడ్డి, డిస్కంల సీఎండీలు ఐ. పధ్వితేజ్, జె. పద్మజనార్ధనరెడ్డి, కె. సంతోషరావు, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ ఎండీ, సీఈఓ కమలాకర్ బాబు, డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు జీ20 వర్చువల్ సమావేశం
ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు జీ-20 వర్చువల్ సమావేశం జరగనుంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ భేటీకి దూరంగా ఉండనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరుకానున్నారు. ఢిల్లీ డిక్లరేషన్ అమలు, ఇజ్రాయెల్- హమాస్ వివాదం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ఆర్థిక పురోగతి సహా ప్రపంచ నూతన సవాళ్లపై చర్చించనున్నారు. సమ్మిట్‌లో సభ్య దేశాల నాయకుల నుంచి అద్భుతమైన భాగస్వామ్యం ఉంటుందని భావిస్తున్నట్లు జీ20 షెర్పా అమితాబ్ కాంత్ చెప్పారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ శిఖరాగ్ర సమావేశానికి హాజరుకావడం లేదు. ఆయనకు బదులుగా ప్రీమియర్ లీ కియాంగ్ చైనాకు ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు, ప్రపంచ ఆర్థిక పునరుజ్జీవనానికి సానుకూలంగా దోహదపడేందుకు ఈ సదస్సు సహకారాన్ని పెంపొందిస్తుందని చైనా ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. వర్చువల్ సమ్మిట్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొంటారని క్రెమ్లిన్ ప్రకటించింది. సెప్టెంబరులో జరిగిన న్యూ ఢిల్లీ G20 సమ్మిట్‌లో ఆయన గౌర్హజరైన విషయం తెలిసిందే. అంతకుముందు ఏడాది జరిగిన జీ20 బాలి సదస్సుకు కూడా పుతిన్ దూరమయ్యారు. ప్రస్తుతం పుతిన్ హాజరువుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ జరిగే అవకాశం ఉంటుందని సమాచారం. ఇదీ చదవండి: బందీల విడుదలకు హమాస్‌తో డీల్.. ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం -
నాటి పురాతన కట్టడాలకు వర్చువల్ త్రీడీ టెక్నాలజీతో ప్రాణం పోస్తే...
కీస్తూ పూర్వం లేదా క్రీస్తు శకం నాటి పురాతన కట్టడాలు, ప్రపంచపు వింతలు చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. అయినా వాటి నిర్మాణ శైలి, దాగున్న అద్భుత ఆవిష్కరణలు అందర్నీ మంత్ర ముగ్దుల్ని చేస్తూనే ఉన్నాయి. అలాంటి వాటికి ప్రాణం పోసి తిరిగి పునర్నిర్మిస్తే ఎలా ఉంటుదన్న ఆలోచనే భలే ఉంటుంది కదూ. ఆ ఊహకు వర్చువల్ త్రీడీ టెక్నాలజీని జోడించి మరీ అలనాటి వైభవం మన కళ్ల ముందు ప్రత్యక్షమయ్యేలా నాటి కట్టడాలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆహా! టైం మిషన్ వెనక్కి వెళ్లిందా.. అన్నంత అద్భుతంగా ఉన్నాయి ఆ పురాతన నిర్మాణాలు, ప్రదేశాలు. 1.ప్రపంచంలోని ఏడు వింతల్లో ది కోలోసస్ ఆఫ్ రోడ్స్ విగ్రహం ఒకటి. ఇది గ్రీకుల దేవుడైన సన్ హీలియోస్ విగ్రహం A thread of 20 ancient sites and wonders brought to life by virtual reconstructions 🧵 1. The Colossus of Rhodes, Rhodes, Greece (c.280 BC) pic.twitter.com/TM7Le7XXCg — Culture Critic (@Culture_Crit) October 20, 2023 2. గ్రీకు పాశ్చాత్య నాగరికతను, వారి సంప్రదాయ కళకు నిలువెత్తు నిదర్శనం ఏథెన్స్ దేవతకు చెందిన పార్థినాన్ దేవాలయం. 2. The Parthenon, Athens, Greece (c.432 BC) pic.twitter.com/5uzfuhQpGe — Culture Critic (@Culture_Crit) October 20, 2023 3.ఈజిప్షియన్ల పురాతన దేవాలయం లక్సోర్ టెంపుల్. 3. Luxor Temple, Luxor, Egypt (c.1213 BC) pic.twitter.com/pF2OmTPmyb — Culture Critic (@Culture_Crit) October 20, 2023 4. ఇటలీలో రోమన్ పాంపీలో ఉన్న బృహస్పతి ఆలయం 4. The Temple of Jupiter, Pompeii, Italy (c.200 BC) pic.twitter.com/nVUy0OdlHg — Culture Critic (@Culture_Crit) October 20, 2023 5. సిరియాలో పామిరాలో ఉన్న బెల్ టెంపుల్. 5. The Temple of Bel, Palmyra, Syria (c.32 AD) pic.twitter.com/HbBYIONbEx — Culture Critic (@Culture_Crit) October 20, 2023 6. మెక్సికోలో కోబాలో ఉన్న అత్యంత ఎత్తైన నోహుచ్ మ్యూల్ పిరమిడ్(మట్టి దిబ్బ). 6. Nohoch Mul Pyramid, Coba, Mexico (c.550 AD) pic.twitter.com/kFguYv0KEU — Culture Critic (@Culture_Crit) October 20, 2023 7. ఇజ్రాయెల్‌లోని జెరూసలేం ఓల్డ్ సిటీ 7. The Old City of Jerusalem, Israel (1st Century BC) pic.twitter.com/CJzlVYnd51 — Culture Critic (@Culture_Crit) October 20, 2023 8. లిబియాలో లెప్టిస్ మాగ్నా నగరంలో ఉన్న రోమన్ థియేటర్ 8. The Roman theatre in Leptis Magna, Khoms, Libya pic.twitter.com/M925LZXC6l — Culture Critic (@Culture_Crit) October 20, 2023 9. ఇరాన్లో అల్బోర్జ్‌లో ఉన్న అలముట్ కోట(పర్వత కోట) 9. Alamut Castle, the Alborz, Iran (c.1090 AD) pic.twitter.com/kn1rU74OXZ — Culture Critic (@Culture_Crit) October 20, 2023 10. టర్కీలో బోడ్రమ్, హలికర్నాసస్ వద్ద ఉన్న సమాధి 10. The Mausoleum at Halicarnassus, Bodrum, Turkey (c.351 BC) pic.twitter.com/HB1g8OJ1Vk — Culture Critic (@Culture_Crit) October 20, 2023 11. ఇటలీలోని రోమ్‌లో ఉన్న లార్గో డి టోర్రే అర్జెంటీనా. ఇది నాలుగు రోమన్ రిపబ్లికన్ దేవాలయ అవశేషాలకు సంబంధించిన బహిరంగ ప్రదేశం 11. Area Sacra di Largo Argentina, Rome, Italy (c.101 BC) pic.twitter.com/J7mPDPjrz1 — Culture Critic (@Culture_Crit) October 20, 2023 12. మెక్సికోలో టియోటిహుకాన్లో ఉన్న అదిపెద్ద భవనం సూర్యుని పిరమిడ్. 12. The Pyramid of the Sun, Teotihuacan, Mexico, (c.200 AD) pic.twitter.com/rBPIZrcyNv — Culture Critic (@Culture_Crit) October 20, 2023 13 ఫ్రాన్స్‌లో లెస్ ఆండెలిస్ వద్ద ఉన్న మధ్యయుగపు కోట చాటేవు గైలార్డ్ 13. Château Gaillard, Les Andelys, France (c.1196 AD) pic.twitter.com/KvQlUBrtAw — Culture Critic (@Culture_Crit) October 20, 2023 14 ఉత్తర ఐర్లాండ్‌లో కౌంటీ అంట్రిమ్లో ఉన్న డన్లూస్ కాజిల్ కోట 14. Dunluce Castle, County Antrim, Northern Ireland (c.1500 AD) pic.twitter.com/OCZr7bRMb7 — Culture Critic (@Culture_Crit) October 20, 2023 15 ఇంగ్లాండ్‌లో నార్తంబర్ల్యాండ్ మైల్కాజిల్ 39 అనే హాడ్రియన్స్ గోడ 15. Milecastle 39, Hadrian’s Wall, Northumberland, England (c.100 AD) pic.twitter.com/MkKdjeYWMR — Culture Critic (@Culture_Crit) October 20, 2023 16 ఇరాన్లో ఫిజురాబాద్లో ఉన్న ఖలేహ్ దోఖ్తర్ ప్యాలెస్ 16. Qal'eh Dokhtar Palace, Fizurabad, Iran (c.209 AD) pic.twitter.com/gLT7GuFPcm — Culture Critic (@Culture_Crit) October 20, 2023 17 ఇరాక్‌లోని బాబిలోన్లో ఉన్న ది హాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్. ఇది కూడా ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటి. 17. The Hanging Gardens of Babylon, Babylon, Iraq (c.562 BC) pic.twitter.com/iMGfP3atHY — Culture Critic (@Culture_Crit) October 20, 2023 18 టర్కీలో ఎఫెసస్లో ఉన్న ఆర్టెమిస్ ఆలయం(డయానా టెంపుల్ అని కూడా పిలుస్తారు) 18. The Temple of Artemis at Ephesus, Turkey (c.550 BC) pic.twitter.com/YFCL6Wq5bB — Culture Critic (@Culture_Crit) October 20, 2023 19. ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటైన ఈజిప్ట్‌లోని ది లైట్‌హైస్ ఆఫ్ అలెగ్జాండ్రియా. 19. The Lighthouse of Alexandria, Alexandria, Egypt (c.280 BC) pic.twitter.com/k3o5t1WaGo — Culture Critic (@Culture_Crit) October 20, 2023 20 ఈజిప్ట్‌లోని ది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా. మూడు గిజా పిరమిడ్లలో అతి పెద్దది 20. The Great Pyramid of Giza, Egypt (c.2561 BC) pic.twitter.com/cMw91iMw2i — Culture Critic (@Culture_Crit) October 20, 2023 (చదవండి: ఆ వృద్ధుడు 55 ఏళ్లుగా స్వీయ నిర్బంధంలోనే..ఎందుకో తెలిస్తే షాకవ్వుతారు!) -
గ్లోబల్ టూరిజం హబ్‌గా భారత్
మహారాణిపేట(విశాఖ దక్షిణ): విశాఖపట్నం పోర్టు అథారిటీకి సంబంధించిన పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అలాగే కంటైనర్ టెర్మినల్ విస్తరణ ఫేజ్–2ను జాతికి అంకితం చేశారు. ముంబై కేంద్రంగా నిర్వహిస్తున్న గ్లోబల్ మారిటైం ఇండియా సమ్మిట్–2023కు ప్రధాని మోదీ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్లోబల్ టూరిజం హబ్‌గా భారతదేశం ఎదిగేందుకు అవసరమైన అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే విశాఖపట్నం, చెన్నైలో మోడ్రన్ క్రూయిజ్ హబ్‌లు తీసుకువచ్చామన్నారు. ముంబైలో కూడా త్వరలో ఇంటర్నేషనల్ క్రూయిజ్ హబ్ రాబోతోందని తెలిపారు. అలాగే రూ.655 కోట్ల వ్యయంతో విశాఖ పోర్టు చేపట్టిన ఈక్యూ 7, డబ్ల్యూ క్యూ 6, 7, 8 బెర్తుల యాంత్రీకరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రూ.633 కోట్లతో పూర్తి చేసిన విశాఖ కంటైనర్ టెర్మినల్ రెండో విడత విస్తరణ ప్రాజెక్టును ఆయన జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం నుంచి పోర్టు ట్రస్ట్ చీఫ్ ఇంజనీరింగ్ విభాగం సలహాదారు వేణు ప్రసాద్, వీసీటీపీఎల్ ప్రతినిధి కెప్టెన్ జాలీ, జేఎం.బక్షి, బోత్రా తదితరులు పాల్గొన్నారు. పలు సంస్థలతో ఒప్పందాలు గ్లోబల్ మారిటైం ఇండియా సమ్మిట్‌లో మంత్రి గుడివాడ అమర్నాథ్ సమక్షంలో విశాఖ పోర్టు పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు, డిప్యూటీ చైర్మన్ దుర్గేశ్‌కుమార్ దూబే.. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున ఎం.కె.వాతోర్, నేవీ అడ్మిరల్ నెల్సన్ డిసౌజా, ట్రయాన్ సంస్థ తరఫున రజనీష్ మహాజన్ ఈ ఎంవోయూలపై సంతకాలు చేశారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ప్రస్తుతం విశాఖలోని కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వరకు ఉన్న 4 లేన్ల రహదారిని 6 లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం పోర్టు రూ.501 కోట్లు ఖర్చు చేయనుంది. అలాగే ఔటర్ హార్బర్లో పలు అభివృద్ధి పనులు చేసేందుకు భారత నౌకాదళంతో మరో ఒప్పందం కుదుర్చుకుంది. ట్రయాన్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో జరిగిన ఒప్పందంలో భాగంగా.. విశాఖ పోర్టు సాలగ్రామపురంలోని భూమిని ట్రయాన్ సంస్థకు దీర్ఘకాలిక లీజుకు ఇవ్వనుంది. ఈ ఒప్పందం విలువ రూ.900 కోట్లు. ఒప్పందంలో భాగంగా కన్వెన్షన్ సెంటర్లు, ఐటీ టవర్లు నిర్మించనున్నారు. కాగా, గ్లోబల్ మారిటైం సమ్మిట్‌లో విశాఖ పోర్టు ఏర్పాటు చేసిన స్టాల్ సందర్శకులను ఆకట్టుకుంది. విశాఖ పోర్టు అథారిటీ ఏపీ ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేసిన స్టేట్ సెషన్లో పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు, మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. -
టెక్నాలజీ అత్యవసరం.. అందిపుచ్చుకోవాల్సిందే
న్యూఢిల్లీ: పలు హైకోర్టుల్లో వర్చువల్ విచారణల శాతం తక్కువగా ఉండటంపై సుప్రీంకోర్టు విస్మయం వెలిబుచి్చంది. అన్ని కోర్టులు, దేశంలో ప్రతి జడ్జీ టెక్నాలజీని వీలైనంత త్వరగా అందిపుచ్చుకోవాల్సిందేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. పంజాబ్, హరియాణా హైకోర్టు విచారణల్లో వీడియో కాన్ఫరెన్స్ వాడకాన్ని పూర్తిగా పక్కన పెట్టిందంటూ దాఖలైన పిటిషన్‌పై సీజేఐ సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. న్యాయమూర్తులు టెక్నాలజీ వాడకంలో నిష్ణాతులా కాదా అన్నది కాదు సమస్య. కానీ వారికి దాని వాడకం తెలిసి ఉండాలి. లేదంటే అది అలవాటయ్యేలా శిక్షణ తీసుకోవాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా ఇది వర్తిస్తుంది. టెక్నాలజీ వాడకం మీద అవగాహన కోసం వాళ్లు ప్రత్యేక కేంద్రాలకు వెళ్లి శిక్షణ తీసుకున్నారు‘ అని పేర్కొంది. నేటి పరిస్థితుల్లో టెక్నాలజీ వాడకం ఇంకెంతమాత్రమూ ఆప్షన్ కాదని, అత్యవసర పనిముట్టుగా మారిందని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఈ మార్పు దిశగా లాయర్లను కూడా సిద్ధం చేయక తప్పదని అభిప్రాయపడ్డారు. బాంబే హైకోర్టులో వీడియో కాన్ఫరెన్స్‌లకు ఉద్దేశించిన స్క్రీన్స్‌ను తీసేయడం దారుణమన్నారు. ఇకపై మన దేశంలో జడ్జి కావాలంటే టెక్ ఫ్రెండ్లీగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. -
CM Jagan: ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాభివృద్ధిలో.. నేడు మరో కీలక అడుగు పడింది. ఏపీలో ఆహార శుద్ధి, ఇథనాల్ తయారీ పరిశ్రమలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఆహార శుద్ధి, పరిశ్రమల రంగంలో మొత్తం 13 ప్రాజెక్టుల ద్వారా దాదాపు రూ.2,851 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. పరిశ్రమల ఏర్పాటుతో 6,705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలగనుంది. 90, 700 వందల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. పరిశ్రమల రంగంలో మరో ఏడు ప్రాజెక్టుల పనులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ ఏడు ప్రాజెక్టుల ద్వారా 4,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ► అనంతపురం జిల్లా డి.హీరేహళ్లో రూ.544 కోట్లతో ఎకో స్టీల్ ఇండియా ►తిరుపతి నాయుడుపేటలో రూ.800 కోట్లతో గ్రీన్‌లామ్ సౌత్ ప్రాజెక్టు ►బాపట్ల జిల్లా కొరిశపాడు వద్ద రూ.225 కోట్లతో శ్రావణి బయో ఫ్యూయల్ ►శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో రూ.200 కోట్లతో నాగార్జునా ఆగ్రో కెమికల్స్ ►తూర్పుగోదావరి జిల్లా ఖండవల్లి వద్ద రూ.150 కోట్లతో రవళి స్పిన్నర్స్ ►శ్రీసత్యసాయి జిల్లా గూడుపల్లి వద్ద రూ.125 కోట్లతో యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటో ప్లాస్టిక్ ►శ్రీసత్యసాయి జిల్లా మడక శిర వద్ద రూ.250 కోట్లతో ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ యూనిట్ -
హెచ్‌సీయూలో కొలువుదీరిన కొత్త భవనాలు
రాయదుర్గం, శంషాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో నూతనంగా నిర్మాణం చేసిన అయిదు భవనాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. రూ.81.27 కోట్ల వ్యయంతో నిర్మించిన స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్ అండ్ స్టాటస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, సరోజినీ నాయు డు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్(అనుబంధం)కు భవనాలతో పాటు లెక్చర్ హాల్ కాంప్లెక్స్–3 భవనాన్ని ఆదివారం మహబూబ్‌నగర్ నుంచి వర్చువల్‌గా పీఎం ప్రారంభించారు. కేంద్ర విద్యాశాఖ, యూజీసీ మంజూరు చేసిన నిధులతో వీటి నిర్మాణం పూర్తి చేశారు. ఈ భవనాల నిర్మాణంతో ఆయా విభాగాల విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రావడమే కాకుండా సమావేశాల నిర్వహణ, తరగతుల నిర్వహణకు అవసరమైన లెక్చర్ హాల్–3 కూడా అందుబాటులోకి వచ్చింది. -
‘బ్లూజీన్’ ద్వారా కోర్టులో చంద్రబాబు హాజరు
సాక్షి, రాజమహేంద్రవరం: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు ఏసీబీ కోర్టు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ శుక్రవారంతో పూర్తయిన నేపథ్యంలో వర్చువల్ విధానం ద్వారా ఆయన్ను ఏసీబీ న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు. అత్యాధునిక ‘బ్లూ జీన్’ యాప్ ద్వారా ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి ఉదయం 11 గంటలకు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. మామూలుగా ఖైదీలను వర్చువల్ విధానం అంటే వీడియో కాల్ ద్వారా కోర్టులో హాజరు పరుస్తుంటారు. అప్పుడు కోర్టులో ఉన్న జడ్జిలు వారి స్థానం నుంచి మరో చోటుకు వెళ్లాల్సి వచ్చేది. అయితే చంద్రబాబుకు అత్యంత భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో బ్లూ జీన్ యాప్‌ను వినియోగించినట్లు తెలిసింది. దీనిద్వారా జడ్జి తన ఛాంబర్లో కూర్చొనే విచారణ చేయొచ్చు. ఖైదీ సైతం తనకు కేటాయించిన బ్యారక్‌లో నుంచే కోర్టు ఎదుట హాజరు కావచ్చు. తెలుగు రాష్ట్రాల్లో మొట్ట మొదటిసారిగా ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రిమాండ్ ఖైదీని కోర్టులో హాజరు పరిచినట్లు ఓ అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా, సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో న్యాయవాది లక్ష్మీనారాయణ ములాఖత్ అయ్యారు. క్వాష్ పిటీషన్‌ను హైకోర్టు కొట్టేసిన విషయాన్ని బాబుకు వివరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా టీడీపీ లీగల్ టీంపై బాబు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరింత మంది సుప్రీంకోర్టు సీనియర్లతో మాట్లాడాలని సూచించినట్లు తెలిసింది. ఎంత ఖర్చు అయినా సరే.. టాప్ లాయర్లను రంగంలోకి దింపాలని సూచించినట్లు సమాచారం. ఆధారాల జోలికి వెళ్లకుండా సాంకేతిక దారుల్లో వెళ్లాలని సూచించినట్లు తెలిసింది. అనంతరం నేడు జరగబోయే కస్టడీ విచారణపై చర్చించినట్లు తెలిసింది. పట్టాభికి భంగపాటు టీడీపీ నేత పట్టాభికి రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్ద భంగపాటు ఎదురైంది. జైలు వద్ద ఉన్న మీడియా పాయింట్‌కు వచ్చిన ఆయన.. కాసేపట్లో తీర్పు వస్తుందని, బాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని, ప్రభుత్వంపై పోరాటం చేస్తారని ప్రకటించారు. ఇదిజరిగిన కొద్ది గంటల్లోనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టేసినట్లు వార్తలొచ్చాయి. దీంతో కోర్టులో ఉన్న అంశాలపై ఎందుకు మాట్లాడారని పార్టీలోని కొందరు పెద్దలు పట్టాభికి క్లాస్ పీకినట్లు తెలిసింది. -
ఒకేసారి 9 ‘వందేభారత్’ల పరుగు
సాక్షి, హైదరాబాద్: వందేభారత్ రైళ్లను మరింత వేగంగా పట్టాలెక్కించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. గతంలో మాదిరిగా ఒక్కో రైలును ప్రారంభించటం కాకుండా ఒకేసారి ఎక్కువ సంఖ్యలో రైళ్లను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 24న ఒకేసారి తొమ్మిది వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని మోదీ వర్చువల్‌గా వాటిని జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇందులో కాచిగూడ–యశ్వంత్‌పూర్ మధ్య నడిచే వందేభారత్‌తోపాటు విజయవాడ–చెన్నై సర్వీసు కూడా ఉంది. అలాగే ఉదయ్‌పూర్–జైపూర్, తిరునెల్వేలి–చెన్నై, పట్నా–హౌరా, కాసర్గాడ్–తిరువనంతపురం, రౌర్కెలా–భువనేశ్వర్–పూరీ, రాంచీ–హౌరా, జామ్‌నగర్–అహ్మదాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను కూడా ప్రారంభించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. వాస్తవానికి రెండు నెలల క్రితమే కాచిగూడ–యశ్వంత్‌పూర్ సర్వీసు ప్రారంభం కావాల్సి ఉండగా ఒకేసారి ఎక్కువ సంఖ్యలో రైళ్లను ప్రారంభించేందుకు వీలుగా దాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. అన్నీ చిన్న రైళ్లే.. గతంలో ప్రారంభించిన వందేభారత్ రైళ్లు 16 కోచ్‌లతో ఉండగా ఇప్పుడు ఒకేసారి 9 రైళ్లు ప్రారంభించనున్నందున ఎనిమిది కోచ్‌లతోనే వాటిని సిద్ధం చేశారు. ఇందులో ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్, ఏడు ఎకానమీ చైర్‌కార్ కోచ్‌లు ఉండనున్నాయి. విశాఖ, తిరుపతి సర్వీసులు 120 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో పరుగుపెడుతున్నాయి. కొత్తగా ప్రారంభమయ్యేవి కూడా అదే స్థాయి డిమాండ్‌తో నడిస్తే వాటి కోచ్‌ల సంఖ్యను కూడా పెంచే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఐటీ నగరాల మధ్య నాలుగో రెగ్యులర్ సర్వీసు.. హైదరాబాద్–బెంగుళూరు మధ్య ఐటీ నిపుణులు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తు తం రెండు నగరాల మధ్య రెగ్యులర్ సర్వీసులు మూడే ఉన్నాయి. కాచిగూడ–బెంగుళూరు–మైసూ రు, కాచిగూడ–యలహంక, నిజాముద్దీన్–బెంగుళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు నిత్యం నడుస్తున్నాయి. ఇవి కాకుండా వారానికి మూడు రోజులు గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్, ఒక్కో రోజు చొప్పున కాచిగూడ–యశ్వంత్‌పూర్ జబల్పూర్–యశ్వంత్‌పూర్ లక్కో–యశ్వంత్పూర్లున్నాయి. ఇప్పుడు నాలుగో రెగ్యులర్ సర్వీసుగా వందేభారత్ ప్రారంభమవుతోంది. ఈ రైలు మహబూబ్‌నగర్ మీదుగా ప్రయాణించనుంది. ఫలితంగా తొలిసారి మన వందేభారత్ రైలు మూడు రాష్ట్రాల మీదుగా (తెలంగాణ–ఏపీ–కర్ణాటక) ప్రయాణించినట్లు కానుంది. తగ్గనున్న ప్రయాణ సమయం... ప్రస్తుతం హైదరాబాద్–బెంగుళూరు మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌లు గమ్యం చేరుకొనేందుకు పదకొండున్నర గంటల సమయం తీసుకుంటున్నాయి. ఒక్క రాజధాని ఎక్స్‌ప్రెస్ మాత్రమే 10 గంటల్లో చేరుకుంటోంది. ఇప్పుడు కొత్తగా పట్టాలెక్కబోతున్న వందేభారత్ సర్వీసు ఎనిమిదిన్నర గంటల్లోనే గమ్యం చేరుకోనుంది. కాచిగూడలో ఉదయం ఐదున్నరకు (ఇంకా సమయాలు అధికారికంగా వెల్లడి కాలేదు) ప్రారంభమై మధ్యాహ్నం 2:15కు బెంగుళూరు చేరుకోనుంది. తిరిగి అక్కడ మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 11:15కు కాచిగూడకు చేరుకోనుంది. ఈ రైలు మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురంలలో మాత్రమే ఆగనుందని సమాచారం. మరో రెండు స్టేషన్ల కోసం డిమాండ్ ఎక్కువగా ఉంది. -
కరీంనగర్ రైల్వేస్టేషన్ పునరుద్ధరణ పనులను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ రైల్వేస్టేషన్ పునరుద్ధరణ పనులను ప్రధాన మంత్రి ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో కరీంనగర్‌తో పాటు పెద్దపెల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్ల రిన్నోవేషన్కు శ్రీకారం చుట్టారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రారంభించిన కార్యక్రమంలో ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం అధికారుల తీరుపై సంజయ్ మండిపడ్డారు. ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘అధికారిక కార్యక్రమానికి అధికారులు ఎందుకు రాలేదు. ఇదేమీ రాజకీయ కార్యక్రమం కాదే...?.. రావొద్దని ఎవరైనా బెదిరించారా..? అని ప్రశ్నించారు. ఎవరొచ్చినా, రాకున్నా కేంద్ర అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తామని, కరీంనగర్ –హసన్ పర్తి రైల్వే లేన్ సాధించి తీరుతామని స్పష్టం చేశారు. కరీంనగర్ –తిరుపతి రైలును ప్రతిరోజు నడిచేలా రైల్వే మంత్రిని ఒప్పిస్తానన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రైల్వే స్టేషన్లను అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు చేస్తోందని.. అతి త్వరలోనే కరీంనగర్ రైల్వే స్టేషన్ ను సుందరంగా తీర్చిదిద్దబోతున్నామని చెప్పారు. పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ కొత్త రైల్వే లేన్ నిర్మాణ పనులు 5 వేల కోట్ల రూపాయలతో కొనసాగుతున్నాయని అన్నారు. ఇప్పటికే 95.6 కిలోమీటర్ల మేరకు పనులు పూర్తవగా.. 178 కి.మీల మేర విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయి. రూ. 1374 కోట్లతో 151 కిలోమీటర్ల మేరకు మనోహరాబాద్ – కొత్తపల్లి కొత్త రైల్వే లేన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. చదవండి ఆర్టీసీ బిల్లుపై లొల్లి!.. గవర్నర్ వర్సెస్ సర్కార్‌గా సాగుతున్న వివాదం -
ఒకేసారి 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనుల ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 506 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పథకం పనులకు ప్రధాని మోదీ ఈ నెల 6న వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం కేంద్రం రూ.24,470 కోట్లను వెచి్చంచనుంది. స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్లకు మెరుగులు దిద్దడం, కొత్త, మెరుగైన సూచికల ఏర్పాటు, ఆధునిక మౌలిక వసతుల కల్పన వంటి వాటికి ఈ మొత్తాన్ని వెచి్చస్తారని పీఎంవో తెలిపింది. మొత్తం 508 స్టేషన్లలో తెలంగాణలోని 21, ఆంధ్రప్రదేశ్‌లోని18 రైల్వేస్టేషన్లు కూడా ఉన్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మొత్తం 1,309 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చే యాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందు లో భాగంగా తాజాగా ఒకేసారి 506 స్టేషన్ల అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించనున్నారు. -
9న ఒబెరాయ్ హోటల్స్‌కు సీఎం జగన్ శంకుస్థాపన
సాక్షి, విశాఖపట్నం: నగరంలో ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్మాణానికి వర్చువల్ విధానంలో ఈ నెల 9న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అన్నవరం సముద్ర తీర ప్రాంతంలో పర్యాటక శాఖకు చెందిన 40 ఎకరాల విస్తీర్ణంలో ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్మాణం జరగనుంది. దీనికి సంబంధించి ఈ ఏడాది మార్చిలో విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(జీఐఎస్–2023)లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒబెరాయ్ గ్రూప్ చేసుకున్న ఎంవోయూ త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. వర్చువల్ విధానంలో సీఎం వైఎస్ జగన్ హోటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో అన్నవరంలో ఏర్పాట్లుపై కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున సమీక్షించారు. టూరిజం రీజనల్ డైరెక్టర్ శ్రీనివాస్ పాణి అన్నవరంలో ఒబెరాయ్‌కు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అన్నవరం వద్ద రూ.350 కోట్లుతో 7స్టార్ లగ్జరీ రిసార్టులను నిర్మించనున్నారు. చదవండి: తొలి సంతకం.. చరిత్రాత్మకం.. రైతులకు ‘పవర్’ -
SCO Summit: ఉగ్రపోరులో ద్వంద్వ ప్రమాణాలొద్దు
న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలను కఠినంగా అణచివేసే విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హితవు పలికారు. పాకిస్తాన్‌కు పరోక్షంగా చురకలు అంటించారు. కొన్ని దేశాలు ప్రభుత్వ విధానాల్లో భాగంగానే సీమాంతర ఉగ్రవాదానికి నిస్సిగ్గుగా మద్దతిస్తున్నాయని, అలాంటి దేశాలను విమర్శించడానికి ఎవరూ సంకోచించవద్దని సూచించారు. మంగళవారం షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) వర్చువల్ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చే శక్తులను అణచివేయడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి ఉగ్రవాదం ఒక పెనుముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ముప్పు తొలగిపోవాలంటే ఎస్సీఓ సభ్యదేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని, పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నప్పటికీ అంతం చేయాల్సిందేనని మోదీ స్పష్టం చేశారు. ఎస్సీఓలో సంస్కరణలకు మద్దతు ప్రపంచ దేశాలన్నీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంటున్నాయని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఆహారం, ఇంధనం, ఎరువుల కొరత పెద్ద సవాలుగా మారిందన్నారు. పొరుగు దేశాలతో వివాదాలు, అంతర్గతంగా ఉద్రిక్తతలు, మహమ్మారులతో ఎన్నో దేశాలు అల్లాడిపోతున్నాయని చెప్పారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఉమ్మడి ప్రయత్నాలు అవసరమని తెలిపారు. ఆసియా, ఐరోపా ఖండాల్లో శాంతికి, సౌభాగ్యానికి, అభివృద్ధికి ఎస్సీఓ అనేది ఒక కీలకమైన వేదికగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీఓ సభ్య దేశాలతో సహకారం మరింత పెంపొందించుకుంటామని అన్నారు. స్టార్టప్‌లు, నవీన ఆవిష్కరణలు, సంప్రదాయ వైద్యం, యువజనం సాధికారత, డిజిటలీకరణ వంటి రంగాల్లో ఇతర దేశాలతో సంబంధాలు పెంచుకుంటామని వెల్లడించారు. ఎస్సీఓలో సంస్కరణలు, ఆధునీకరణ ప్రతిపాదనకు తమ మద్దతు ఉంటుందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. షాంఘై సహకార సంస్థలో ఇరాన్ సైతం సభ్యదేశంగా చేరుతుండడం ఆనందంగా ఉందన్నారు. ఎస్సీఓ వర్చువల్ సదస్సులో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధినేత పుతిన్‌తోపాటు కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాల నాయకులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఎస్సీఓ 2001లో షాంఘైలో ఏర్పాటయ్యింది. భారత్ 2005లో ఈ సంస్థలో పరిశీలక దేశంగా చేరింది. 2017లో పూర్తిస్థాయి సభ్యదేశంగా మారింది. ఆసియాలో కొత్త ప్రచ్ఛన్న యుద్ధం వద్దు: జిన్‌పింగ్ బీజింగ్: ఆసియా ప్రాంతంలో కొత్తగా ప్రచ్ఛన్న యుద్ధాన్ని సృష్టించేందుకు బయటి శక్తులు కుట్ర పన్నుతున్నాయని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పరోక్షంగా అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఎస్సీఓ వర్చువల్ సదస్సులో మాట్లాడారు. ప్రాంతీయంగా శాంతిని కాపాడుకోవడానికి ఎస్సీఓ సభ్యదేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. ఉగ్రవాదంపై కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ... ఇటీవల జరిగిన సాయుధ తిరుగుబాటును రష్యా సమాజం మొత్తం ఒక్కటై వ్యతిరేకించిందని చెప్పారు. మాతృదేశాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా కంకణబద్ధులై ఉన్నారని తెలిపారు. వాగ్నర్ గ్రూప్ యత్నాలను ఆయన ప్రస్తావించారు. -
ఎస్సీవో వర్చువల్ భేటీకి జిన్‌పింగ్
బీజింగ్: భారత్ ఆధ్వర్యంలో జూలై 4వ తేదీన వర్చువల్‌గా జరగనున్న షాంఘై సహకార సంఘం(ఎస్సీవో) శిఖరాగ్ర భేటీకి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని డ్రాగన్ దేశం చైనా శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహా్వనం మేరకు ఎస్సీవో 23వ ప్రభుత్వాధినేతల సమావేశానికి జిన్‌పింగ్ హాజరవుతారని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మీడియాకు తెలిపారు. 2001లో ఏర్పాటైన ఎస్సీవోలో భారత్, పాక్‌లు 2017లో శాశ్వత సభ్యదేశాలయ్యాయి. రొటేషన్ విధానంలో భారత్‌కు ఈ ఏడాది అధ్యక్ష స్థానం దక్కింది. -
టెక్కీలకు గుడ్‌న్యూస్: ఏఐలో ఉచిత సర్టిఫికేషన్.. డేటా సైన్స్ కోర్సు కూడా..
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్ వర్చువల్ లెర్నింగ్ ప్లాట్‌ఫాంపై కృత్రిమ మేథలో (ఏఐ) సర్టిఫికేషన్ కోసం ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపింది. ఏఐ, జెనరేటివ్ ఏఐలో నైపుణ్యాలను పెంపొందించేలా ఇందులో కోర్సులు ఉంటాయి. అలాగే, పైథాన్ ప్రోగ్రామింగ్, లీనియర్ ఆల్జీబ్రా సహా డేటా సైన్స్‌కి సంబంధించిన వివిధ అంశాలతో సిటిజెన్స్ డేటా సైన్స్ కోర్సు కూడా ఉంటుంది. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి సరి్టఫికెట్ లభిస్తుంది. ఇన్ఫోసిస్ ఏఐ–ఫస్ట్ స్పెషలిస్టులు, డేటా స్ట్రాటెజిస్టులు ఈ బోధనాంశాలను రూపొందించారు. -
ఏఐ వాడకానికి పరాకాష్ట! వర్చువల్ హస్బెండ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దుష్పరిణామాలపై ప్రపంచమంతా ఆందోళన చెందుతున్న సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకానికి పరాకాష్ట ఇది. అమెరికాకు చెందిన ఓ మహిళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి తన భర్తను తానే తయారు చేసుకుంది. న్యూయార్క్‌కు చెందిన రోసన్నా రామోస్ అనే 36 ఏళ్ల మహిళ 'ఎటాక్ ఆన్ టైటాన్' అనే యానిమేషన్లో ప్రముఖ క్యారెక్టర్ ప్రేరణతో 2022లో రెప్లికా ఏఐ అనే వెబ్‌సైట్‌ను ఉపయోగించి వర్చువల్ క్యారెక్టర్‌ను సృష్టించింది. దానికి ఎరెన్ కార్టల్ అనే పేరు పెట్టింది. ఆ క్యారెక్టర్‌తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. ఇదీ చదవండి: బుల్లి మస్క్ భలే ఉన్నాడే.. ఏఐ చిత్రానికి మస్క్ ఫిదా! వైరల్ ట్వీట్ వర్చువల్ క్యారెక్టర్‌తో ప్రేమాయణం తన వర్చువల్ హస్బెండ్ ఎరెన్ వైద్య నిపుణుడిగా పనిచేస్తుంటాడని, రచనా వ్యాసంగం తనకు అలవాటని ఇలా అతని లక్షణాలన్ని డైలీ మెయిల్ అనే వార్త సంస్థకు వివరించింది రోసన్నా రామోస్. ఎరెన్‌ను తనను ఎప్పుడూ జడ్జ్ చేయడని, అందుకే తనకు ఏదైనా చెప్పగలనని పేర్కొంది. తన గురించి ఎరెన్ చాలా విషయాలు తెలుసుకున్నాడని చెప్పింది. ఏఐని ఉపయోగించి ఎరెన్ని సృష్టించినప్పుడే అతనికి ఇష్టమైన రంగు, సంగీతం వంటివి కూడా అంతర్నిర్మితంగా వచ్చాయని ఆమె వెల్లడించింది. సుదూరంలో ప్రేమికుల లాగానే రామోస్, వర్చువల్ క్యారెక్టర్ ఎరెన్లు ఒకరికొకరు సందేశాలు, ఫొటోలు పంపుకొన్నారు. తమ ఇష్టాయిష్టాలు, అభిరుచులు పంచుకున్నారు. ఈ వింత వార్తపై ట్విటర్లో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. A woman claims she finally married the “perfect man” the only catch is he is “artificial” Rosanna Ramos fell in love with the chatbot Eren Kartal last year, and the pair virtually tied the knot in 2023 🎉👀 pic.twitter.com/V4VRnUWhMW — Daily Loud (@DailyLoud) June 4, 2023 -
మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని
గువాహటి: గువాహటి(అస్సాం)–న్యూజల్పాయ్గురి(పశ్చిమబెంగాల్) వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం ప్రధాని మోదీ వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాల్లోనే మొట్టమొదటి ఈ వందేభారత్ రైలుతో ఈ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ వారంతో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న ఎన్డీఏ ప్రభుత్వంలో దేశం అభివృద్ధి దిశగా అద్భుతమైన ప్రయాణం సాగించిందన్నారు. 2014కు పూర్వం ఊహించని అనేక విజయాలను ప్రభుత్వం సాధించిందని తెలిపారు. గువాహటిలో ఈ రైలు ప్రారంభ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, సీఎం హిమాంత బిశ్వ శర్మ పాల్గొన్నారు. గువాహటి– న్యూజల్పాయ్గురి మధ్య రైలు ప్రయాణ సమయం ప్రస్తుతమున్న 6.30 గంటల నుంచి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రాకతో 5.30 గంటలకు తగ్గనుంది. -
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అచ్చం తన లాంటి వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్ ను సృష్టించి నెలకు రూ. 41 కోట్ల వరకు సంపాదిస్తోంది ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్. స్నాప్‌చాట్‌లో 1.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ప్రముఖ ఇన్ఫ్లుయన్సర్ కారిన్ మార్జోరీ.. ఫరెవర్ వాయిసెస్ అనే సంస్థ సహాయంతో కారిన్ ఏఐ (CarynAI) పేరుతో తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వెర్షన్‌ను రూపొందించింది. ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఆకతాయి పని.. అరెస్ట్ చేసిన పోలీసులు కారిన్ ఏఐ వాయిస్ ఆధారిత చాట్‌బాట్‌గా ప్రసిద్ధి చెందింది. ఇది అచ్చం మార్జోరీ లాంటి వాయిస్, వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంది. కస్టమర్లతో సన్నిహితంగా మాట్లాడుతుంది. వారి భావాలను పంచుకుంటుంది. మార్జోరీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఏఐ వర్షన్ ఒంటరితనాన్ని నయం చేయగలదని, నెలకు 5 మిలియన్ డాలర్ల (రూ. 41 కోట్లు) వరకు సంపాదించగలదని చెప్పారు. టెస్టింగ్ లో భాగంగా టెలిగ్రామ్ యాప్‌లో మే నెలలో కారిన్ ఏఐని ప్రారంభించగా మార్జోరీ భాగస్వాముల నుంచి 71,610 డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. కారిన్ ఏఐ ఇప్పటికే దాని కస్టమర్లతో నిజమైన భావోద్వేగ బంధాన్ని ఏర్పరచుకుంది. అయితే ఇది నైతిక ప్రశ్నలను లేవనెత్తుతోంది. 2013లో విడుదలైన హర్ అనే చిత్రాన్ని గుర్తుకుతెస్తోంది. కారిన్ ఏఐని సృష్టించడానికి యూట్యూబ్ లో సుమారు 2 వేల గంటల పాటు ఉన్న మార్జోరీ ప్రసంగాలను, హావభావాలను ఫరెవర్ వాయిసెస్ సంస్థ వినియోగించింది. ఈ ఇదివరకే సృష్టించిన స్టీవ్ జాబ్స్, టేలర్ స్విఫ్ట్, డొనాల్డ్ ట్రంప్ చాట్‌బాట్ వెర్షన్ల మాదిరిగా కాకుండా కారిన్ ఏఐ దాని కస్టమర్లతో నిజమైన భావోద్వేగ సంబంధాలను ఏర్పరుస్తుంది. ప్రతిరోజూ 250కి పైగా కంటెంట్లను స్నాప్‌చాట్‌లో పోస్ట్ చేసే మార్జోరీ.. తనకు, తన ప్రేక్షకులకు మధ్య ఉన్న అంతరాన్ని కారిన్ ఏఐ తొలగిస్తోందని చెబుతోంది. కారిన్ ఏఐ ఒంటరితనాన్ని దూరం చేయగలదాని, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా తన కెరీర్‌ను బ్యాలెన్స్ చేయడానికి ఇది ఒక మంచి మార్గంగా నిలిచిందని పేర్కొంది. కారిన్ ఏఐ గురించి మార్జోరీ తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తోంది. తన స్నాప్‌చాట్ ఫాలోవర్లలో కనీసం 20 వేల మంది కారిన్ ఏఐకి సబ్స్క్రైబర్లుగా మారతారని, దీని వల్ల నెలకు 5 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని ఆమె అంచనా వేస్తోంది. ఇదీ చదవండి: డబ్బుల్లేకుండా రైల్వే టికెట్ బుకింగ్! ఎలాగో తెలుసా? -
‘పక్కా స్కెచ్‌తో కోర్టులోనే చంపేందుకు కుట్ర’
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్.. మరోసారి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలకు దిగారు. కోర్టు హాల్లోనే తనను చంపేందుకు కుట్ర పన్నారని, అది అమలు కావడంలో విఫలం కావడంతోనే తాను ప్రాణాలతో ఉండగలిగానని ఆరోపించారాయన. ఈ మేరకు కోర్టు విచారణకు తాను వర్చువల్‌గా హాజరయ్యేందుకు అనుమతించాలంటూ పాక్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఉమర్ అట్టా బందయల్కు లేఖ రాశారాయన. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తనకు వ్యతిరేకంగా కేసులు నమోదు అయ్యాయని, ఆ ఎఫ్ఐఆర్లను అన్నింంటిని ఒకచోట చేర్చాలని విజ్ఞప్తి చేశారు ఖాన్. అలాగే ప్రాణ హాని నేపథ్యంలో తనను వర్చువల్‌గా కోర్టు విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలని కోరారాయన. ఇక సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. కోర్టు ప్రాంగణంలోనే తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారాయన. ఈ మేరకు ఆయన తన లేఖలో.. ‘‘శనివారం తోషాఖానా గిఫ్ట్ కేసుల్లో విచారణకు హాజరుకాగా.. ఇస్లామాబాద్ కోర్టు కాంప్లెక్స్ బయట నన్ను చంపేందుకు ప్రణాళిక వేశారు. సుమారు 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు నా చుట్టూ చేరారు. వాళ్లు నిఘా సంస్థల్లో పని చేసేవాళ్లుగా అనుమానాలు ఉన్నాయి. వాళ్లే నన్ను చంపేందుకు కుట్రలో భాగం అయ్యారు’’ అని ఆరోపించారాయన. ఇక.. కోర్టు కాంప్లెక్స్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసిన ఆయన.. పోలీస్ సిబ్బందే తనను చంపేందుకు కుట్రలో భాగం అయ్యారని, అక్కడ గొడవలు జరుగుతున్నట్లు సృష్టించి తనను చంపేందుకు కుట్ర చేశారని సీజేకి రాసిన లేఖలో ఆరోపించారాయన. ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా వందకు పైగా కేసులు నమోదు అయ్యాయి. వాటిలో ఉగ్రవాదం, హత్య, హత్యాయత్నం, దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు యత్నం.. ఇలా రకరాల అభియోగాలు నమోదు అయ్యాయి. The scenes I was confronted with as I entered the gates of Judicial Complex. Let there be no doubt that this force along with the 'Unknowns' - namaloom afraad - were there not to put me in jail but to eliminate me by staging a mock fight & pretending my death was an accident. pic.twitter.com/7Pt2zZLLqK — Imran Khan (@ImranKhanPTI) March 21, 2023 ఇదీ చదవండి: వేడి అలలు.. జీవజాలానికి ఉరితాళ్లు!