
రాయదుర్గం, శంషాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో నూతనంగా నిర్మాణం చేసిన అయిదు భవనాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. రూ.81.27 కోట్ల వ్యయంతో నిర్మించిన స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్ అండ్ స్టాటస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, సరోజినీ నాయు డు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్(అనుబంధం)కు భవనాలతో పాటు లెక్చర్ హాల్ కాంప్లెక్స్–3 భవనాన్ని ఆదివారం మహబూబ్‌నగర్ నుంచి వర్చువల్‌గా పీఎం ప్రారంభించారు.
కేంద్ర విద్యాశాఖ, యూజీసీ మంజూరు చేసిన నిధులతో వీటి నిర్మాణం పూర్తి చేశారు. ఈ భవనాల నిర్మాణంతో ఆయా విభాగాల విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రావడమే కాకుండా సమావేశాల నిర్వహణ, తరగతుల నిర్వహణకు అవసరమైన లెక్చర్ హాల్–3 కూడా అందుబాటులోకి వచ్చింది.