New buildings
-
అద్భుత భవనాలపై ‘అగ్లీ’ ఏడుపు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ ప్రభుత్వానికి చేతకాదు. విభజిత రాష్ట్రానికి 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ.. ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సాగదీసి, స్వలాభం చూసుకోవడమే తప్ప, రాష్ట్రానికి చేసిన మంచి ఒక్కటీ లేదు. రాజధాని పేరుతో చేసిన విధ్వంసం, తాత్కాలిక సచివాలయాల పేరుతో నిర్మించిన నాసి రకం భవనాలు, పోలవరం ప్రాజెక్టులో తప్పులు.. ఇలా అన్నీ రాష్ట్రానికి తలవంపులు తెచ్చే పనులే. ఇప్పుడూ అదే చేస్తోంది టీడీపీ. రుషికొండపైన అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా, విశాఖ ఖ్యాతిని మరింతగా పెంచేలా అద్భుత భవనాలను నిర్మిస్తే, దానిపై వికృత రాజకీయం చేస్తోంది.ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే వాటిపై చేస్తున్న విష ప్రచారం ఆ పార్టీ సంస్కృతికి నిదర్శనం. తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు చేస్తున్న కపట నాటకం. రూ.700 కోట్లతో తమ ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక సచివాలయం చిన్న వర్షానికే లీకైపోయి, నీరంతా గదుల్లో ప్రవహించగా.. ఇప్పుడు కేవలం రూ. 400 కోట్లతో రుషికొండపై విశాఖకే కాక యావత్ రాష్ట్రానికే తలమానికంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన ఈ ఐకానిక్ భవనాలను చూసి తల ఎక్కడ పెట్టుకోవాలో టీడీపీ అధినేతలకే తెలియడంలేదు. అందుకే ఈ అగ్లీ (చెత్త)ఏడుపు. విశాఖపట్నంలోని బీచ్‌కి ఆనుకొని ఉన్న రుషికొండపై రాష్ట్ర పర్యాటక శాఖకు చెందిన హరిత రిసార్ట్స్ భవనాలు చాలా కాలం క్రితం నిర్మించినవి.అవి శిథిలమై ప్రమాదకరంగా మారడంతో వాటిని తొలగించి, కొత్త భవనాలు కట్టాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరిపింది. ప్రపంచ స్థాయిలో, 5 స్టార్ వసతులతో అత్యాధునికంగా, విశాఖ నగర ఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేసేలా డిజైన్లు రూపొందించింది. సీఆర్‌జెడ్ పరిమితులకు లోబడి నిర్మాణాలు ప్రారంభించింది. రుషికొండపై ఏ భవనాలు, ఎందుకు నిర్మిస్తున్నారో సమగ్ర వివరాల్ని 2021లోనే కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందజేసింది. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో ఫైవ్ స్టార్ పర్యాటక విడిది కేంద్రంగా మొత్తం రూ.412 కోట్లతో 7 బ్లాకుల్ని నిర్మించింది.రుషికొండ మొత్తం 61 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 9.88 ఎకరాల విస్తీర్ణంలోనే ఈ భవనాలు నిర్మించింది. గతంలో హరిత రిసార్టు 48 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేది. ప్రస్తుత భవనాలు 19,968 చ.మీ విస్తీర్ణంలో ఉన్నాయి. వీటన్నింటినీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు వీలుగా నిర్మించారు. ప్రెసిడెన్షియల్ సూట్, సూట్ రూమ్, బాంక్వెట్ హాల్‌తో విజయనగర బ్లాకు, ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్స్, సూట్ రూమ్స్, డీలక్స్ గదులు, బాంక్వెట్ హాల్‌తో కళింగ బ్లాక్ నిర్మించింది. సూట్ రూమ్‌లు, కాన్ఫరెన్స్ హాల్‌తో పల్లవ బ్లాక్, సమావేశ మందిరాలతో చోళ బ్లాక్, రిక్రియేషన్ లాంజ్, బిజినెస్ సెంటర్‌తో గజపతి బ్లాక్, ప్రైవేట్ సూట్ రూమ్‌లతో వేంగిబ్లాక్, రెస్టారెంట్స్, లాంజ్, కిచెన్, పార్కింగ్ సౌకర్యాలతో ఈస్ట్రన్ గంగా బ్లాక్‌లని నిర్మించింది. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తే.. విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా చేస్తే, రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వం తలంచింది. ఇందుకు ఏర్పాట్లూ ప్రారంభించింది. విశాఖలో పాలన ప్రారంభించడానికి అనువైన భవనాల పరిశీలనకు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీ విశాఖలోని పలు భవనాలను పరిశీలించింది. వీటిలో రుషికొండపై నిర్మించిన భవనాలు ప్రభుత్వ కార్యకలాపాలకు అనువైనవని తేల్చింది. ఇక్కడ సీఎం నివాసం, సీఎం కార్యాలయానికి ఇవి అనువుగా ఉంటాయని వెల్లడించింది. అప్పట్నుంచి ఈ భవనాల్లో సీఎం నివాసం, కార్యాలయానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేశారు.వాటిని నిర్మించింది ప్రభుత్వం. పనులు జరిగింది ఏపీటీడీసీ ఆధ్వర్యంలో. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు, అంతర్జాతీయ సదస్సులు ఇక్కడే నిర్వహించేందుకు వీలుగా అత్యద్భుతంగా ఫైవ్‌స్టార్ హోటల్స్‌ని తలదన్నేలా నిర్మాణం జరిగింది. సాగర తీరంలో అద్భుతంగా, రాష్ట్రానికి అంతర్జాతీయంగా పేరు తెచ్చేలా నిర్మించిన ఈ భవనాలను చూసి గర్వపడాలి కానీ.., ఎవరో సొంతగా భవనాలు కట్టేసుకొన్నట్లుగా టీడీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతల ఏడుపులు, పెడబోబ్బలు ఎందుకు? అవి ప్రభుత్వం నిర్మించిన భవనాలు. అనుమతి ఉన్న వారు ఎవరైనా వెళ్లొచ్చు. అయినా, టీడీపీ నేతలు ఏదో ఘనకార్యం చేసినట్లు ప్రభుత్వం భవనం లోపలికి వెళ్లి, ఫొటోలు దిగి, వీడియోలు తీసి చెడు ప్రచారం చేయడం నీచత్వానికి పరాకాష్టే. మంచి చేయడమే కాదు.. మరొకరు చేసిన మంచిని అంగీకరించడం కూడా చేతకాదని వారికి వారే నిరూపించుకోవడమే. -
ఉన్న వనరుల్నే వాడుకుంటాం : సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ భవనాలను సమర్థంగా వినియోగించుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్ హెచ్ఆర్డీ)లోని ఖాళీ స్థలాన్ని వినియోగించుకుంటామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం మీడియా చిట్ చాట్‌లో పాల్గొని కీలక విషయాలు వెల్లడించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలంలో ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్ నిర్మిస్తామని, కొత్తగా వాహనాలు కూడా కొనుగోలు చేయమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. శాసనసభ భవనాలను సమర్థంగా వినియోగించుకుంటామని అన్నారు. అధికారుల నియామకంలో ఫైరవీలు ఉండని అన్నారు. అధికారుల బదిలీలు ఉంటాయని, కానీ బదిలీ విషయంలో వారి వెంటపడమని సీఎం రేవంత్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 12, 14 గంటలకు మించి కరెంట్ ఇవ్వలేదన్నారు. అన్ని అంశాలపై, అందరితో చర్చించి శ్వేతపత్రాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు. రేపు(శుక్రవారం) బీఏసీలో సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా రాయదుర్గం-ఎయిర్పోర్ట్ మెట్రో ఉపయోగకరంగా ఉండదని, విమానాశ్రయానికి మరో మార్గంలో మెట్రోను ప్లాన్ చేస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు. చదవండి: ప్రజాభవన్‌లోకి భట్టి ఫ్యామిలీ గృహ ప్రవేశం -
హెచ్‌సీయూలో కొలువుదీరిన కొత్త భవనాలు
రాయదుర్గం, శంషాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో నూతనంగా నిర్మాణం చేసిన అయిదు భవనాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. రూ.81.27 కోట్ల వ్యయంతో నిర్మించిన స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్ అండ్ స్టాటస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, సరోజినీ నాయు డు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్(అనుబంధం)కు భవనాలతో పాటు లెక్చర్ హాల్ కాంప్లెక్స్–3 భవనాన్ని ఆదివారం మహబూబ్‌నగర్ నుంచి వర్చువల్‌గా పీఎం ప్రారంభించారు. కేంద్ర విద్యాశాఖ, యూజీసీ మంజూరు చేసిన నిధులతో వీటి నిర్మాణం పూర్తి చేశారు. ఈ భవనాల నిర్మాణంతో ఆయా విభాగాల విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రావడమే కాకుండా సమావేశాల నిర్వహణ, తరగతుల నిర్వహణకు అవసరమైన లెక్చర్ హాల్–3 కూడా అందుబాటులోకి వచ్చింది. -
పట్టణ ప్రజారోగ్యానికి జవసత్వాలు
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త భవనాలను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఉన్న యూహెచ్‌సీ భవనాలకు మెరుగులు దిద్దడంతో పాటు కొత్త సెంటర్ల ఏర్పాటు కోసం భవనాలను నిర్మిస్తోంది. అందుకనుగుణంగా పబ్లిక్ హెల్త్ అండ్ మునిసిపల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 528 భవనాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో 344 కొత్తగా నిర్మించే భవనాలు కాగా, మరో 184 భవనాలకు మరమ్మతులు చేయనున్నారు. ఈ పనుల కోసం రూ.293.60 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించగా, కొత్త భవనాలకు రూ.275.20 కోట్లు, పాత భవనాల పునరుద్ధరణ కోసం రూ.18.40 కోట్లు ఖర్చు చేయనున్నారు. కాగా ప్రస్తుతం పునరుద్ధరణ చేపట్టిన యూహెచ్‌సీలలో 182 భవనాల పనులు పూర్తవగా, మిగిలిన రెండు భవనాలను ఫిబ్రవరి 15 నాటికి అందుబాటులోకి తేనున్నారు. కొత్త భవనాలలో ఫిబ్రవరి చివరినాటికి అన్ని వసతులతో 105 కొత్త యూహెచ్‌సీ భవనాలను అందుబాటులోకి తేవాలని, మార్చి చివరినాటికి మొత్తం 344 కొత్త భవనాలను వినియోగంలోకి తెచ్చే లక్ష్యంతో పబ్లిక్ హెల్త్ అండ్ మునిసిపల్ ఇంజినీరింగ్ విభాగం పనులు చేస్తోంది. ప్రతి రెండు కి.మీ.కి ఒక భవనం రాష్ట్రంలోని అన్ని మునిసిపాటీల్లోనూ ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్‌ను నిర్మించి పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అందుబాటులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగా అధికారులు ఈ ఆరోగ్య కేంద్రాల నిర్మాణం చేపట్టారు. కొత్తగా ఒక్కో సెంటర్ భవన నిర్మాణానికి రూ.80 లక్షలు కేటాయించగా, పాత భవనాల పునరుద్ధరణ, మరమ్మతులకు రూ.10 లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నారు. -
తాళం తెరవలే..!
భద్రాచలం : భద్రాచలం ఏరియా ఆస్పత్రి ప్రాంగణంలో ఆధునిక హంగులతో నిర్మించిన నూతన భవనాలు నిరుపయోగంగా మిగిలాయి. నాలుగు రాష్ట్రాల కూడలిలో ఉన్న ఈ ఆస్పత్రిలో కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో రూ.18.14 కోట్లతో నిర్మించిన ఈ భవనాలను గత ఏడాది జూలైలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. కానీ ఇప్పటికీ ఆస్పత్రి తాళాలే తెరుచుకోలేదు. దీంతో ఇవి నిధులు ఖర్చు చేయడానికే తప్ప మరెందుకూ పనికి రావనే భావన వ్యక్తమవుతోంది. ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్న 100 పడకలకు తోడు మరో వంద పడకలు మంజూరైన నేపథ్యంలో నూతన భవనాలు నిర్మించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీసగఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న భద్రాచలం ఏరియా ఆస్పత్రి ప్రధానంగా గిరిజనులకు వైద్య సేవలు అందించటంలో పెద్ద దిక్కుగా ఉంది. ప్రస్తుతం ఇక్కడికి నిత్యం 450 – 550 మంది రోగులు వస్తుంటారు. 150 – 200 మంది ఇన్పేషెంట్లుగా సేవలు పొందుతున్నారు. నెలకు 350 – 450 వరకు కాన్పులు జరుగుతాయి. ఆస్పత్రి సూపరింటెండెంట్ కోటిరెడ్డి, ఇతర సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ మెరుగైన వైద్య సేవలందిస్తూ రాష్ట్రంలోనే ఉత్తమ ఆస్పత్రిగా ఖ్యాతి గడిచింది. ప్రత్యేక సౌకర్యాలున్నా.. ప్రయోజనం సున్నా కార్పోరేట్‌కు ధీటుగా రోగులకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన ఆప్పత్రి భవనాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రౌండ్ ప్లోర్లో గర్భణీ పరీక్షలు, యాక్సిటెండ్ విభాగం, క్యాజువాలటీ, చిన్నపిల్లల విభాగంల కోసం తగిన సౌకర్యాలను కల్పించారు. మొదటి అంతస్తులో క్లినిక్, పేథాలజీ, డెంటల్, ఈఎన్టీ, ఇన్‌పేషెంట్, ఆపరేషన్స్ విభాగం, ఐసీయూ విభాగాల కోసం, రెండో అంతస్తులో పరిపాలనకు ప్రత్యేక గదులు, డబ్బులు చెల్లించి అద్దెకు ఉండే రోగుల కోసమని 15 గదులు(స్పెషల్రూమ్స్) సిద్దం చేశారు. బర్నింగ్ కేసుల కోసమని 6 గదులను నిర్మించారు. ప్రసవాలు ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో లేబర్ రూమ్‌లో తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసమని 6 గదులు కేటాయించగా, ప్రతీ గదిలోనూ అటాచ్డ్ బాత్రూమ్స్, ఏసీ సౌకర్యం ఏర్పాటు చేశారు. కొత్త ఆసుపత్రిలో దాదాపుగా అన్ని వార్డులు, గదుల్లో కూడా ఏసీలను అమర్చారు. కానీ వీటిని వినియోగంలోకి తీసుకురాకపోవటంతో ప్రసుత్తం ఉన్న పాత ఆసుపత్రి భవనాల్లోనే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. డయాలసిస్ యూనిట్ మంజూరైంది. దీనికి సంబంధించిన అన్ని రకాల పరికరాలు కూడా వచ్చాయి. కానీ దీనిని ప్రస్తుతం ఉపయోగపడటంలేదు. ఆసుపత్రి ప్రాంగణంలో నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. వైద్యులు, సిబ్బంది భర్తీ కోసం ఎదురుచూపులు.. 100 పడకల ఆస్పత్రి నుంచి 200కు అప్‌గ్రేడ్ చేశారు. ఈ లెక్కన వైద్యులు, సిబ్బందిని కూడా అదనంగా నియమించాలి. 40 మంది వైద్యులు, 30 మంది స్టాఫ్ నర్సులు, సుమారు 100 మంది పారామెడికల్ సిబ్బందిని కేటాయించాలి. కానీ ఈ పోస్టులను భర్తీ చేయలేదు. స్పెషలిస్టు వైద్య నిపుణుల కొరత కూడా ఉంది. నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టు ఖాళీగా ఉండటంతో పర్యవేక్షణ కొరవడింది. రెండు హెడ్ నర్సు పోస్టులూ ఖాళీనే. 200 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌గా అయినందున ఆ స్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమిస్తేనే కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందనేది అక్షర సత్యం. వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ శివప్రసాద్ శుక్రవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రి పరిశీలన కోసం వస్తున్నందున, ఈ సమస్యలపై దృష్టి సారించాలని ఏజెన్సీ ప్రాంత వాసులు కోరుతున్నారు. -
రూ.17 కోట్లతో నూతన భవనాలు
జేఎన్టీయూ: జేఎన్టీయూ (అనంతపురం) పాలకమండలి సమావేశం సోమవారం ఇన్చార్జ్ వీసీ కె.రాజగోపాల్ అధ్యక్షతన వర్సిటీలో నిర్వహించారు. సమావేశంలో పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. సీమెన్స్ సెంటర్ భవన నిర్మాణానికి రూ. 13 కోట్లు కేటాయించారు. నూతనంగా బాయ్స్ హాస్టల్ నిర్మాణానికి రూ. 4 కోట్లు పాలకమండలి ఆమోదం తెలిపింది. ఓటీఆర్‌లోని ఫార్మసీ విభాగానికి ప్రత్యేకంగా ప్రిన్సిపాల్‌ను నియమించాలనే ప్రతిపాదనకు సమ్మతి తెలిపింది. ఇప్పటికే జరుగుతున్న భవన నిర్మాణం పనులకు ర్యాటిఫై చేశారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ సుబ్బారావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణయ్య, పాలకమండలి సభ్యులు బి. ప్రహ్లాదరావు, సి.శశిధర్, డాక్టర్ సీహెచ్ సత్యనారాయణ, రవీంద్ర సన్నారెడ్డి, రామానాయుడు, పి. సంగమేశ్వర రాజు, కెసి నాయుడు, ఏ.శ్రీకాంత్ గౌడ్, కె.మురళి పాల్గొన్నారు. -
కళ తప్పుతున్న హెచ్‌సీయూ
-
గృహాల నిర్మాణం త్వరగా చేపట్టండి
పెద్దారవీడు: ఎన్టీఆర్ పథకం ద్వారా మంజూరైన గృహాలను వెంటనే నిర్మంచుకోవాలని మార్కాపురం గృహా నిర్మాణశాఖ ఈఈ కె బసవయ్య పేర్కొన్నారు. మంగళవారం పెద్దోర్నాల, పెద్దారవీడు మండలాల్లో పలు గ్రామాల్లో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మించుకోని లబ్దిదారుల పేర్లను తొలగించి నిబంధనల ప్రకారం అర్హులైన కొత్త లబ్దిదారులకు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికి పెద్దదోర్నాల మండలంలో 45, పెద్దారవీడు మండలంలో 135 గృహాలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. మిగత లబ్దిదారులు వీలైనంత త్వరగా గృహా నిర్మాణాల పనులు చేపట్టాలని సూచించారు. ఎన్టీఆర్ పథకంలో మొత్తం రూ 1.50 లక్షలు, వీటిలో ఉపాధి హామీ పథకం రూ 58 వేలు, ఆ నిధులలో ప్రభుత్వం నుంచి 80 బస్తాలు సిమెంట్ ఇస్తుందని, లభ్ధిదారుని వాటా 18 వేలు లోను కట్టాల్సి ఉంటుందని, మిగత డబ్బులు పూర్తిగా సబ్సిడీ వర్తిస్తుందని, పిఎంజివై పథకంలో రూ 2 లక్షలు వాటిలో ఉపాధి హామీ పథకంలో రూ 61,260 వేలు, ఈ నిధులలో 100 బస్తాలు సిమెంట్ ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. బేస్మింట్ లెవెల్, రూప్ లెవెల్, రూఫ్ కాస్టెడ్, కంప్లీట్, మరుగుదొడ్డి దశల వారిగా బిల్లులు మంజూరు చేస్తామని, నిర్మించుకున్న లబ్దిదారులకు వెంటనే బిల్లులు చేస్తున్నమన్నారు. త్వరలో జన్మభూమిలో దరఖాస్తులు పెట్టుకున్న వారికి నియోజకవర్గానికి 2200 గృహాలు మంజూరు కావచ్చన్నారు. ఆయన వెంట పెద్దారవీడు ఏఈ నిరీక్షణబాబు ఉన్నారు. -
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే!
నిధులున్నా ముందుకు సాగని పంచాయతీ, అంగన్వాడీ భవనాల నిర్మాణం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, అంగన్వాడీ కేంద్రాలకు కొత్త భవనాల నిర్మాణ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా రూ.300 కోట్ల ఉపాధి హామీ నిధులను ప్రభుత్వం మంజూరు చేసి ఏడాదైనా దాదాపు ఏ జిల్లాలోనూ భవన నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. వాస్తవానికి ఒక్కో గ్రామ పంచాయతీ భవనానికి రూ.13 లక్షల చొప్పున మొత్తం వెయ్యిభవనాలకు రూ.130 కోట్లు, కొత్త అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం నిమిత్తం ఒక్కోదానికి రూ.5 లక్షల చొప్పున 2,263 భవనాలకు రూ.113.15 కోట్లు కేటాయించారు. నిర్మాణం ప్రారంభించి అసంపూర్తిగా వదిలేసిన 1,436 అంగన్వాడీ కేంద్రాలకూ ఒక్కోదానికి రూ.4లక్షల చొప్పున రూ.57.44 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తంగా రూ.300.59 కోట్ల నిధులున్నా, భవన నిర్మాణ పనులు అడుగు ముందుకు పడడం లేదు. కొన్ని ప్రభుత్వ శాఖల అధికారుల మధ్య సమన్వయం కొరవడటమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. నిధులున్నా పనులు సున్నా: అంగన్వాడీ కేంద్రాలకు నూతన భవన నిర్మాణాలకుగాను ఉపాధిహామీ నిధుల నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ ఒక్కో భవనానికి రూ.5లక్షలు కేటాయించగా, మహిళా శిశు సంక్షేమ శాఖ తన వాటాగా ఒక్కో కేంద్రానికి రూ.3 లక్షలు మంజూరు చేయాలి. నిధుల మంజూరులో గ్రామీణాభివృద్ధి శాఖ స్పందించిన రీతిలో మహిళా, శిశు సంక్షేమ శాఖ స్పందించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా ఆయా నిర్మాణ పనులను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభా గం చేయాల్సి ఉండగా, పర్యవేక్షణ బాధ్యతలను గ్రామ సర్పంచులకు అప్పగించారు. మొత్తంగా ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది సమష్టి్టగా బాధ్యత వహించకపోవడం, కొన్నిచోట్ల అధికారులు ముందుకు వచ్చినా స్థానికంగా రాజకీయ జోక్యం పెరగడంతో భవన నిర్మాణాలు పూర్తికాక ప్రభుత్వం ఆశించిన మేరకు ప్రయోజనం చేకూరడం లేదు. వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు ఈ విషయంపై దృష్టిసారించి భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ప్రకృతి కూడా ఫ్లాట్ అయిపోతుంది!
అపార్ట్మెంట్ పేరు చెప్పగానే... కొద్దిగా సైజు తేడాలతో ఒకదానిపై ఒకటిగా పేర్చిన అగ్గిపెట్టెలు గుర్తొస్తాయి మనకు. హంగుల్లో తేడాలు మినహాయిస్తే... అన్నిచోట్లా అపార్ట్మెంట్ల తీరు ఇదే. అయితే కాలం మారుతోందనేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక తార్కాణాలు కనిపిస్తున్నాయి. ప్రకృతితో మమేకమవుతూ పర్యావరణానికి కొద్దో గొప్పో మేలు చేసే కొత్త తరహా ఇళ్లకు ఆదరణ కూడా ఎక్కువే. ఈ కోవకే చెందుతుంది ఈ ఫొటోల్లో కనిపిస్తున్న ‘స్లూయిషుషీస్’. దీని ప్రత్యేకతలు ఒకటా రెండా? బోలెడు! అన్నింటి కన్నా ముందు చెప్పాల్సింది - ఇది ‘జీరో ఎనర్జీ’ అపార్ట్మెంట్ కాంప్లెక్స్. అంటే.. సౌర, పవన విద్యుత్తు వంటి సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తును మాత్రమే వాడతారన్నమాట. నెదర్లాండ్స రాజధాని ఆమ్స్టర్డ్యామ్ నగరంలో నిర్మాణం కానున్న ఈ భవనం మొత్తం ఐజే లేక్ అనే సరస్సుపై తేలియాడుతున్నట్లు ఉంటుంది. ఒక అపార్ట్మెంట్ నుంచి ఇంకోదాంట్లోకి వెళ్లేందుకు నడక మార్గంతోపాటు పడవమార్గం కూడా ఉండటం మరో విశేషం. ప్రతి ఇంటికీ తనదైన చిన్న పచ్చదనం ఉంటుంది. మొత్తం 46 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో, 380 అపార్ట్మెంట్లున్న ఈ కాంప్లెక్స్‌లో వాహనాల పార్కింగ్ మొత్తం భూగర్భంలోనే. అంతేకాదు.. ఒక రెస్టారెంట్, ఒక మ్యూజియం, సెయిలింగ్ స్కూల్ వంటి అదనపు హంగులున్నాయి. ఇంతెందుకు... స్థానిక ప్రభుత్వం చేపట్టిన ఈ భవనాన్ని బిగ్, బార్కోడ్ ఆర్కిటెక్చర్ సంస్థలు డిజైన్ చేశాయి. అన్నీ సవ్యంగా సాగితే 2018లో దీని నిర్మాణం మొదలుకానుంది. -
పంచాయతీలు, అంగన్వాడీ కేంద్రాలకు కొత్త భవనాలు
పి.గన్నవరం : జిల్లాలో 268 పంచాయతీలకు, 806 అంగన్వాడీ కేంద్రాలకు కొత్త భవనాలు నిర్మిస్తున్నట్టు జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు చెప్పారు. మంగళవారం ఆయన పి.గన్నవరంలో విలేకరులతో మాట్లాడుతూ 248 శ్మశాన వాటికల అభివృద్ధికీ నిధులు మంజూరయ్యాయని వివరించారు. ఒక్కొక్క పంచాయతీ భవనానికి రూ.13.5 లక్షలు, అంగన్వాడీ భవనానికి రూ.6.5 లక్షలు, శ్మశాన వాటికల అభివృద్ధికి కూ.10 లక్షల వంతున నిధులు మంజూరైనట్టు చెప్పారు. ఉపాధిహామీ పథకం, 14వ ఆర్థిక సంఘం మ్యాచింగ్ నిధులతో జిల్లాలో ఇప్పటికి 266 కి.మీ. మేరకు సీసీ రోడ్లు నిర్మించినట్టు తెలిపారు. వచ్చే మార్చి నాటికి 500 కి.మీ. మేర సీసీ రోడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు చెప్పారు. జిల్లాలో ఇప్పటికి 139 ఓడీఎఫ్ గ్రామాలు పూర్తయ్యాయన్నారు. డిసెంబర్ తర్వాత కొత్త ఓడీఎఫ్ గ్రామాలను గుర్తిస్తామని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించడంలో రాష్ట్రంలో మన జిల్లా ద్వితీయ స్థానంలో ఉందన్నారు. జిల్లాలోని 1,069 గ్రామాల్లో ‘చెత్త నుంచి సంపద సేకరణ’ యార్డుల నిర్మాణానికి స్థల సేకరణకు కృషి చేస్తున్నామని తెలిపారు. -
నూతన భవనాలు ఏర్పాటు చేయాలి
యాదగిరిగుట్ట : మండలంలోని పెద్దకందుకూర్‌లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరాయని, నూతన భవనాలను ఏర్పాటు చేయాలని కోరుతూ యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డికి మంగళవారం ఎస్ఎంసీ చైర్మన్లు, గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్లు విప్‌తో మాట్లాడుతూ వర్షాలు కురిసినప్పుడు విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డమీది స్వప్నరవీందర్‌గౌడ్, ఎస్ఎంసీ చైర్మన్లు జుట్టు బాలమణి, దర్శనం శ్రీనివాస్, సీస నర్సింహులుగౌడ్, శంకర్‌గౌడ్, పత్తి సుజాత, దర్శనం స్వామి, ఆజ్మీర శ్రీనివాస్, సావిత్రి, మంజుల, సుశీల, భాస్కర్, క్రిష్ణ, రాజు, వెంకటేష్‌గౌడ్, మహేష్ తదితరులున్నారు. -
సరస్వతీ కటాక్షమే!
గురుకులాలు, కళాశాలల ఏర్పాటు రూ.18 కోట్లతో అధునాతన భవనాల నిర్మాణం నిరుపేద విద్యార్థులకు వరం మెదక్: సరస్వతీ నిలయాలు రూపుదాల్చుకుంటున్నాయి. కేజీ నుంచి పీజీ వరకు ఒకేచోట తరగతి గదులు నిర్మిస్తామని గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఎట్టకేలకు నిలబెట్టుకుంది. ఏడాది కాలంగా ఒక్క మెదక్ పట్టణంలోనే సుమారు రూ.18కోట్ల పైచిలుకు వెచ్చించి నూతన భవనాలను నిర్మించారు. దీంతో పేద విద్యార్థులకు వసతి లభించింది. నిరుపేద విద్యార్థులు ఇంటర్‌తో విద్యాభ్యాసం ముగించకూడదనే ఉద్దేశంతో డిగ్రీ కళాశాలలను ఏర్పాటుచేస్తోంది. అంతేకాకుండా ఉచితంగా వసతి, భోజన సౌకర్యం సైతం కల్పిస్తున్నారు. మెదక్ పట్టణంలో రూ.6 కోట్లతో బాలికల వెలుగు పాఠశాల, కళాశాల, రూ.4కోట్లతో యూత్ ట్రైనింగ్ సెంటర్, రూ.కోటితో మినీ గురుకులం, రూ.1.50కోట్లతో ఎస్సీ కళాశాల, మైనార్టీ రెసిడెన్సియల్ స్కూల్, రూ.2కోట్లతో ఇంటిగ్రేటెడ్ వసతి గృహం నిర్మాణంలో ఉంది. అంతేకాకుండా బాలికల డిగ్రీ కళాశాల నిర్మాణానికి రూ.2కోట్లు మంజూరు చేశారు. రూ.10లక్షలతో బాల సదనంకు నూతన భవనం నిర్మించారు. రూ.4కోట్లతో నిర్మించిన యూత్ ట్రైనింగ్ సెంటర్లో ప్రస్తుతం ఎస్సీ మహిâýæ డిగ్రీ కళాశాలకోసం తాత్కాలికంగా వినియోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పక్కా భవనాల నిర్మాణానికి మరో రూ.30కోట్లు కేటాయించినట్లు ఇటీవల మెదక్‌కు వచ్చిన మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా సీఎం కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ గురుకులాలను ఇప్పటికే మెదక్ పట్టణంలో ఏర్పాటు చేయించారు. ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ఆంగ్ల మాధ్యమంలో బోధన నిర్మించి, విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేశారు. ఈ గురుకుల పాఠశాలల్లో కేవలం ఇంటర్ వరకే కాకుండా ఉన్నత విద్య అభ్యసించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. మినీగురుకుల పాఠశాలలతోపాటు ఎస్సీ మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 30 కళాశాలలను మంజూరుచేస్తూ గతనెల 2న ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే. రాష్ట్రస్థాయి సంక్షేమ గురుకుల విద్యాలయాలు సొసైటీల ఆధ్వర్యంలో కొనసాగనున్నాయి. మూడు రెసిడెన్షియల్ కళాశాలలు మంజూరు జిల్లాలో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేటలకు ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ కళాశాలలు మంజూరయ్యాయి. ఈ విద్యా సంవత్సరంలోనే వీటిని ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాత్కాలికంగా ఇతర భవనాల్లో కళాశాలలకు ఏర్పాట్లు కానిస్తున్నారు. ఒక్కో భవనం నిర్మాణంకోసం రూ.30కోట్ల చొప్పున మొత్తం రూ.90కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం మెదక్‌పట్టణంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఎస్సీ మహిళా రెసిడెన్సియల్ కళాశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
జిల్లా పరిశ్రమల కేంద్రాలకు కొత్త రూపు
♦ నూతన భవనాలు, మౌలికసౌకర్యాలకు నిధులు ♦ పరిశ్రమల శాఖ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా భారీ ప్రచారం సాక్షి, హైదరాబాద్: నూతన పారిశ్రామిక విధానంతో కేవలం పది నెలల కాలంలో రూ.30వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన పరిశ్రమల శాఖ.. సంస్థాగతంగా పనితీరును మెరుగు పరుచుకోవడంపై దృష్టి సారించింది. జిల్లా స్థాయి నుంచి పరిశ్రమల శాఖ కార్యాలయాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. కార్యాలయాల్లో మంచి పరిసరాలు, పనివాతావరణం ఉంటేనే పెట్టుబడులను ఆకర్షించడం మరింత సులభమవుతుందని పరిశ్రమల శాఖ భావిస్తోంది. జిల్లాల్లోని పారిశ్రామిక కేంద్రాలను (డీఐసీలు) సుమారు 25ఏళ్ల క్రితం నిర్మించారు. ఆ తర్వాత వాటి నిర్వహణపై దృష్టి సారించక, మరమ్మతులు లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. వరంగల్ జిల్లా పారిశ్రామిక కేంద్రం శిథిలావస్థకు చేరడంతో ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతోంది. మరోవైపు హైదరాబాద్‌లోని వాణిజ్య, పరిశ్రమల శాఖ కమిషనర్ కార్యాలయం కూడా శిథిలావస్థకు చేరుకుంది. ఇది వారసత్వ (హెరిటేజ్) భవనం కావడంతో దానిని పునరుద్ధరించి, వాడుకలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కమిషనర్ కార్యాలయాన్ని పునరుద్ధరించేందుకు రూ.6.78 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. జిల్లా స్థాయిలో డీఐసీలకు కొత్త రూపు ఇచ్చేందుకు రూ.5 కోట్లు, కమిషనరేట్ భవనం మరమ్మతులకు రూ.3.75 కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు కేంద్ర కార్యాలయంతో పాటు జిల్లా పరిశ్రమల కేంద్రాల్లో ఫర్నీచర్, కంప్యూటర్లు తదితరాలకు కాలం చెల్లినా... వాటినే వినియోగిస్తున్నారు. దీంతో కమిషనరేట్, డీఐసీల్లో నూతన ఫర్నీచర్, కంప్యూటర్లు ఇతర సామగ్రిని సమకూర్చడంతోపాటు, కార్యాలయాలకు ఆధునిక హంగులు అద్దాలని నిర్ణయించారు. అలాగే అన్ని కార్యాలయాల్లోనూ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రచారానికి రూ.50 కోట్లు! రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో అందుబాటులో ఉన్న మౌలిక సౌకర్యాలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించేందుకు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, రోడ్‌షోల ద్వారా పారిశ్రామిక రంగంలో రాష్ట్ర శక్తి సామర్థ్యాలకు ప్రాచుర్యం కల్పించాలని నిర్ణయించారు. పారిశ్రామిక ప్రదర్శనల్లో పాల్గొనడం, బ్రోచర్లు, కరపత్రాల ముద్రణ, ఫిల్మ్‌లు, అడ్వర్టయిజ్మెంట్లు ద్వారా.. పరిశ్రమల శాఖ బ్రాండ్ ఇమేజీని పెంచి.. పారిశ్రామిక అభివృద్ధికి ఊతం ఇవ్వాలని పరిశ్రమల శాఖ భావిస్తోంది. దీనికోసం రూ.50 కోట్ల మేర వెచ్చించనున్నారని తెలుస్తోంది. ఈ చర్యల ద్వారా రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగవంతమవుతుందని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. -
‘ఉస్మానియా’కు రాజకీయం జబ్బు
ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాలు కూడా ప్రకటనలకు పరిమితం కాకుంటే మంచిది. అదే ఆవరణలో, లేదా మరో అనువైన చోట మంచి భవన సముదాయాన్ని నిర్మించి అక్కడికి దానిని తరలించి, పాత భవనాలకు మరమ్మతులు చేసి నిజాం నిర్మించిన ఆ భవనాన్ని పర్యాటక స్థలంగా మారిస్తే ప్రభుత్వానికి పేరూ వస్తుంది, వివాదాలకూ తావుండదు. అయినా నిరంకుశ నిజాం ప్రభువును పొగిడినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మీద కన్నెర్ర చేసిన వారికి ఇప్పుడు ఆ నిజాం కట్టిన భవనాలను కూల్చేస్తామంటే అభ్యంతరమెందుకో? మనుషుల ప్రాణాలకు, అందులోనూ కదలలేని స్థితిలోని రోగుల ప్రాణా లకు ముప్పు ఉందనుకున్నప్పుడు, వారిని రక్షించడానికి ప్రభుత్వం ఎటు వంటి చర్యలు తీసుకున్నా అభినందించాల్సిందే. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని పేద రోగులకు ఉస్మానియా దవాఖానా ఎంతో కాలంగా పెద్ద దిక్కుగా ఉంది. హైదరాబాద్ చుట్ట్టు పక్కల నుంచేగాక, ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చే వేలాది మంది రోగులకు, ముఖ్యంగా పేదలు, మధ్య తరగతి జీవులకు అది ఎంతో ఉపయోగ పడుతోంది. ఇప్పుడు దానికే ‘జబ్బు’ చేసింది. ఇప్పుడో అప్పుడో కూలిపోయేట్టుగా ఉంది కాబట్టి, ఉస్మానియా ఆసుపత్రిని కూల్చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైద రాబాద్ సంస్కృతికి చిహ్నంగా నిలిచే ఆ భవనాలను ఎట్లా కూల్చే స్తారని ప్రతిపక్షాలు, పౌర సంఘాలు, కొందరు మేధావులూ ప్రశ్నిస్తున్నారు. కూల్చడానికి వీల్లేదని ఉద్యమమూ మొదలు పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోలేదనే అనుకుందాం. పాతదై, శిథిలావస్థలో ఉన్న ఉస్మానియా దవాఖానా భవనాలు... జరగరానిదే జరిగి, ఎప్పుడో కూలితే ఏమిటి పరిస్థితి? స్వయం రక్షణ చేసుకోలేని రోగుల గతి ఏం కాను? దురదృష్టవశాత్తూ నిజంగానే అలాంటి దుర్ఘటనేదైనా జరిగితే ప్రభు త్వం పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఉస్మానియాను ముట్టడానికి వీల్లేదంటున్న ప్రతిపక్షాలు, పౌర సంఘాలు, మేధావులు దాన్ని బతకనిస్తారా? అసలు ప్రభుత్వం ఉంటుందా? తెలంగాణ సంస్కృతంటే ఆ భవనాలేనా? ఉస్మానియా ఆసుపత్రి భవనాలను కూలగొట్టి అక్కడ జంట ఆకాశ హర్మ్యా లను (ట్విన్ టవర్స్) నిర్మించాలని ప్రభుత్వం అనుకుంటున్నది. ఇది ఎంత వరకు సబబు? ఇందులో వేరే మతలబులు ఏమయినా ఉన్నాయా? ప్రభుత్వ నిర్ణయం ప్రజలకు ఏ మేరకు ఉపయోగపడుతుంది? అన్న విషయాలను చర్చిస్తే మంచిది. ఇప్పటికైతే ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని కొంత కాలం పాటూ వాయిదా వేసుకున్నట్టు కనిపిస్తున్నది. నిపుణుల కమిటీ సిఫార్సుల కోసం వేచి చూస్తున్నట్టు వార్తలొచ్చాయి. మంచిదే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు నిజంగానే అవసరమైతే, ఆ భవనాలు పూర్తిగానే శిథిలమై ఇప్పుడో, అప్పుడో కూలే పెద్ద ఉపద్రవానికి అవకాశం ఉందంటే వద్దని ఎవరూ అనరు. అంటే అది మూర్ఖత్వమే అవుతుంది. అలాంటి వారిని ప్రభుత్వం లెక్క చెయ్యాల్సిన పనే లేదు. కానీ ఉస్మానియా దవాఖానా భవనాల విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. నిపుణులు సైతం పరస్పర విరుద్ధమైన అభిప్రా యాలను వ్యక్తం చేస్తున్నారు. వారిలో పురాతన కట్టడాల నాణ్యతను బేరీజు వెయ్యగల సంస్థలూ, వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ భవన సముదాయం ఇంకా ఎంతకాలం మనగలుగుతుంది? ఎప్పట్లోగా కూలిపోతుంది? అనే అంశాలపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఒకరు అయిదేళ్ళ కంటే ఉండదంటుంటే, మరొకరు మరమ్మతులు చేస్తే మరి కొన్ని వందల ఏళ్లపాటూ ఢోకా లేదం టున్నారు. ప్రభుత్వం ఏం చెయ్యాలి? ఎవరి మాట వినాలి? రోగులకు మెరు గైన సేవలు అందించడానికి, రోగులు, సిబ్బంది సురక్షితంగా ఉండటానికి ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా ఆహ్వానించాల్సిందే. ఉస్మానియా దవాఖానా భవనాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నాలేమీ కావు, వాటిని కూల్చేసినందు వల్ల తెలంగాణ సంస్కృతికి వచ్చే నష్టం ఏమీ ఉండదు అని ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిసున్నవారి వాదన. ఆ నిర్ణయాన్ని సమర్థించే మీడియాలోని ఒక వర్గం గాంధీ ఆస్పత్రి భవనాలను ముషీరాబాద్ జైలు ఆవరణకు తరలించిన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అప్పుడు మాట్లాడని వాళ్ళు ఇప్పుడు మాట్లాడటం ఏమిటి? అంటున్నారు. అప్పుడు మాట్లాడని వ్వనందుకే కదా తెలంగాణ కావాలంది. ఇప్పుడు కూడా మాట్లాడనివ్వం అంటే అప్పటికి, తెలంగాణ రాష్ర్టం సాధించాక ఇప్పటికి తేడా ఏమిటి? తరలింపుతో కాదు..ఏకపక్ష నిర్ణయంతోనే తంటా సరైన చోట లేదనుకుంటే, వైద్య సదుపాయాలకు అనువుగా లేదనుకుంటే, చికిత్స కోసం వచ్చే ప్రజలకు ఇబ్బందికరంగా ఉందనుకుంటే... ఏ ఆసుప త్రినైనా మరింత మెరుగైన చోటికి మారుస్తామంటే ఎవరూ అభ్యంతర పెట్టకూడదు. గాంధీ ఆసుపత్రి తరలింపును అలాగే చూడాలి. అంతేగానీ సమైక్య రాష్ర్టంలో తరలిస్తే తప్పు, తెలంగాణలో తరలిస్తే ఒప్పు అని వేర్వే రుగా ఉండదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నప్పటికి, ముషీరాబాద్ జైలు ఆవరణలోని కొత్త భవనాలకు మారినప్పటికీ గాంధీ ఆసుపత్రిలో ఎంత తేడా వచ్చిందో గమనించిన వారు ఉస్మానియాను మరో చోటికి మార్చడాన్ని వ్యతిరేకించరు. అసలు ముషీరాబాద్ జైలు తరలింపునే ఇంకొందరు తప్పు పడుతున్నారు. ఆ జైలుకో గొప్ప చరిత్ర ఉందంటున్నారు. ఈ వాదన చేస్తున్న వారు ఒకసారి చర్లపల్లి జైలును చూసి వస్తే బాగుంటుంది. అంతెందుకు, బేగంపేట విమానాశ్రయాన్ని శంషాబాద్‌కు తరలించినప్పుడూ ఊరి మధ్యలో నుంచి ఎక్కడికో దూరంగా తరలిస్తారా? అని విమర్శించిన వారు న్నారు. నగరం విస్తరిస్త్తున్నది, జనాభాతో బాటు అవసరాలూ పెరుగుతు న్నాయి. ఎన్నో మార్పులు, చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవసర మనుకుంటే ఉస్మానియా దవాఖానాను ఆ భవనాల నుంచి మార్చొచ్చు. అదే ఆవరణలోని ఖాళీ స్థలాల్లో కొత్త భవనాలను నిర్మించవొచ్చు. సరిపోదను కుంటే దగ్గరలోనే ప్రత్యామ్నాయ స్థలంలో కొత్త భవనాలను నిర్మించి శాశ్వతంగా ఉస్మానియా దవాఖానాను వాటిలోకి తరలించవొచ్చు. అందు కోసం ఇప్పుడున్న ఉస్మానియా దవాఖానా భవన సముదాయాన్ని శాశ్వ తంగా కూల్చేయనక్కర లేదు. మన ప్రభుత్వం ఎంతో అభిమానించే నిజాం రాజుల నజారానాను మర మ్మతులు చేసి పర్యాటకుల సందర్శన స్థలంగా ఉండనివ్వవచ్చు. ఎవరూ ఆక్షేపించరు. మరి ఎందుకీ వ్యతిరేకత? ఉస్మానియా దవాఖానా భవనాలు ప్రమాదకరస్థితిలో ఉన్నాయి, వాటిని మరమ్మతు చేయడానికి కూడా వీల్లేని పరిస్థితి ఉందని ప్రభుత్వం.. ప్రతిపక్షాలు, నిపుణులు సహా నలుగురితో చర్చించి ఈ నిర్ణయం తీసుకుని ఉండాల్సింది. ప్రభుత్వం అటువంటి పని చెయ్యకపోవడం వల్లనే సందే హాలు. పైగా ఏ నిమిషానికి ఏమి తోస్తే అది ప్రకటించేయడం ఈ ప్రభు త్వానికి అలవాటైందన్న అభి ప్రాయమూ ప్రజల్లో బలంగా ఉంది. ‘ఉస్మానియా’ కారాదు ఊహా సౌధం ఇప్పటికే తెలంగాణ రాష్ర్టం ఏర్పడి, కొత్త ప్రభుత్వం వచ్చాక బోలెడన్ని భవనాలను కూల్చేయడం, కొత్తవి కట్టేయడం అంటూ ఎన్నో ప్రతి పాదనలు వినీ ఉన్నాం. మరునాటికే అవి అటక ఎక్కడమూ చూశాం. సచివాలయాన్ని ఎర్రగడ్డకు మారుస్తామన్నారు. ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రి సముదాయాన్ని వికారాబాద్ దగ్గరి అనంతగిరికి తరలిస్తామన్నారు. రవీంద్ర భారతిని కూలగొట్టి, మరో కొత్త భారతిని నిర్మిస్తామన్నారు. హుస్సేన్ సాగర్‌లోని నీళ్లన్నీ తోడి. అవతల పారబోసి దాన్ని స్వచ్ఛమైన మంటి నీటి సరస్సుగా చేసేస్తామన్నారు. వినాయక నిమజ్జనం దగ్గరికొస్తున్నదిగానీ, అందుకోసం ఇందిరా పార్క్‌లో తవ్విస్తామన్న కొత్త సరస్సు ఊసే లేదు. ఇక సంజీవయ్య పార్క్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన టవర్స్‌ను నిర్మి స్తామన్నారు. ట్యాంక్ బండ్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు నిర్మించి హైదరా బాద్‌ను డల్లస్ నగరం చేస్తామన్నారు. ఈ ఏడాదికాలంలో ఇలాంటి ప్రకట నలు చాలానే వచ్చాయి. అన్నీ ఒక్క రోజులో అయిపోయేవి కావు నిజమే. కానీ అవి కనీసం ప్రతిపాదనల దశకైనా చేరక పోవడంతో ప్రభుత్వం నవ్వుల పాలవుతోంది. ఉస్మానియా దవాఖానాకు కొత్త భవనాలను సమకూర్చే పథకం కూడా వాటిలా ప్రకటనలకు పరిమితం కాకుంటే మంచిది. అదే ఆవరణలో, లేదా మరో అనువైన చోట మంచి భవన సముదాయాన్ని నిర్మిం చి అక్కడికి ఉస్మానియా దవాఖానాను తరలించి, పాత భవనాలకు మరమ్మ తులు చేసి ఒకప్పటి నిజాం నిర్మించిన దవాఖానాగా పర్యాటకుల సందర్శ నార్థం ఉంచితే ప్రభుత్వానికి మంచి పేరూ వస్తుంది, వివాదాలకూ తావుం డదు. చివరగా ఒక్క మాట నిరంకుశ నిజాం ప్రభువును పొగిడినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మీద కన్నెర్ర చేసిన వారికి ఇప్పుడు ఆ నిజాం కట్టిన భవనాలను కూల్చేస్తామంటే అభ్యంతరమెందుకో? datelinehyderabad@gmail.com - దేవులపల్లి అమర్ -
దత్తపుత్రుల కోసం ఓ ఇల్లు
నటి హన్సికది చాలా విశాల హృదయం అన్న విషయాన్ని మరోసారి నిరూపించుకోనున్నారామె. నటిగా కోలీవుడ్‌లో నెంబర్‌వన్ స్థానంలో దూసుకుపోతున్న ఈ ఉత్తరాది బ్యూటీ చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. అరణ్మణై, ఆంబల అంటూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న హన్సిక ప్రస్తుతం ఇళయదళపతి విజయ్ సరసన పులి చిత్రంలో నటిస్తున్నారు. ఈమెకు తల్లిగా రాణి పాత్రలో అతిలోక సుందరి శ్రీదేవి నటించడం విశేషం. తన ఒక్కో పుట్టిన రోజుకు ఒక్కరు చొప్పున అనాథలను దత్తత చేసుకుని వారి సంరక్షణ బాధ్యతలను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ 23 బాలల వరకు దత్తత తీసుకున్న హన్సిక తాజాగా వారి నివాసం కోసం ఒక అందమైన భవనాన్ని నిర్మించ తలపెట్టారున్నారన్నది తాజా సమాచారం. ఈ ముద్దుగుమ్మ చాలాకాలంగా ప్రశాంతమైన వాతావరణంలో విశాలమైన ఇంటిని నిర్మించుకోవాలని ఆశిస్తున్నారు. ఆ కోరిక కూడా ఇప్పుడు నెరవేర్చుకోనున్నారట. ముంబయి సమీపంలో ఒక ఎకరా స్థలాన్ని కొనుగోలు చేశారు. అక్కడ తన దత్త పుత్రుల కోసం అందమైన భవనాన్ని నిర్మించడానికి సిద్ధమవుతున్నారట. -
రూ.5.2 కోట్లతో కొత్త భవనాలు
చేవెళ్ల, న్యూస్‌లైన్: జిల్లాలోని చేవెళ్ల, వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయాలకు, వికారాబాద్, మహేశ్వరంలలో తహసీల్దార్ల కార్యాలయాల భవన నిర్మాణాలకు రూ.5 కోట్ల 20 లక్షలు మంజూరు చేయాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి అధికారులను ఆదేశించారు. చేవెళ్లలో సోమవారం ఆయన ఆర్డీఓ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో రఘువీరా మాట్లాడుతూ.. చేవెళ్ల చెల్లెమ్మ సబితమ్మ అడిగితే తప్పుతుందా అంటూ.. చేవెళ్ల ఆర్డీఓ భవన నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మహేశ్వరం తహసీల్దార్ కార్యాలయానికి కూడా రూ. 60 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఆ వెంటనే మంత్రి ప్రసాద్‌కుమార్ లేచి.. వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎప్పటినుంచో ప్రైవేటు భవనంలో కొనసాగుతోందని.. తహసీల్దార్ కార్యాలయం కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని చెప్పారు. దీంతో ఆయన అక్కడే ఉన్న వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలిని పిలిచి ఇది నిజమేనా అని అడిగారు. వికారాబాద్ ఆర్డీఓ ఆఫీసు నిర్మాణానికి రూ.2 కోట్లు, తహసీల్దార్ కార్యాలయానికి రూ.60 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నిధుల జీవోను రేపే (మంగళవారం) విడుదల చేయాలని సీసీఎల్ కమిషనర్ కృష్ణారావును ఆదేశించారు. పరిగిలో తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి మంత్రికి విన్నవించగా ఈ విషయాన్ని కూడా సాధ్యమైనంత త్వరగా పరిశీలించి నిధులు విడుదల చేయాలని రఘువీరారెడ్డి ఆదేశించారు. చేవెళ్ల ఆర్డీఓగా చంద్రశేఖర్‌రెడ్డి చేవెళ్ల ఆర్డీఓగా చంద్రశేఖర్‌రెడ్డిని నియమిస్తున్నట్లు మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. ఈ ఫైలు ముఖ్యమంత్రి సంతకం కోసం పంపిచామని, రెండు రోజుల లో చేవెళ్లకు నూతన ఆర్డీఓ వస్తారని పేర్కొన్నారు. ఫ్లెక్సీలో రత్నం ఫొటో లేదంటూ టీడీపీ నాయకుల ఆందోళన ఆర్డీఓ కార్యాలయ ప్రారంభోత్సవ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రత్నం ఫొటో లేదంటూ టీడీపీ నాయకులు శేరిపెంటారెడ్డి, రాంచంద్రయ్య, తదితరులు సభ ప్రారంభంలో ఆందోళనకు దిగారు. అధికారిక కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే ఫొటో పెట్టకపోవడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు. దీంతో జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబు కల్పించుకొని.. రత్నం ఫొటో ఎందుకు పెట్టలేదంటూ జిల్లా కలెక్టర్ శ్రీధర్‌ను ప్రశ్నించారు. పొరపాటు జరిగిందంటూ ఆయన సర్దిచెప్పారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని శ్రీధర్‌బాబు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం ఎమ్మెల్యే రత్నం మాట్లాడుతూ అధికారిక కార్యక్రమాల్లో తన ఫొటో పెట్టకపోవడం ఇప్పటికే చాలా సార్లు జరిగిందని, ఇకముందు జరిగితే సహించేదిలేదని హెచ్చరించారు. సభా ఏర్పాట్లు ఇలాగేనా.. ఆగ్రహించిన సబితారెడ్డి ముగ్గురు మంత్రులు వస్తున్న సందర్భంగా సభా ఏర్పాట్లు ఇలాగేనా చేసేది.. నీ పనితీరు ఏమీ బాగా లేదని స్థానిక ఎంపీడీఓ రత్నమ్మపై మాజీ హోంమంత్రి పి.సబితారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రులు రాకముందే చేవెళ్లకు చేరుకున్న ఆమె ఆర్డీఓ కార్యాలయ ప్రారంభోత్సవ వేదిక వద్దకు చేరుకున్నారు. ఐదారువందల మంది హాజరయ్యే సభ ఏర్పాట్లు ఇలాగేనా అంటూ ఎంపీడీఓను నిలదీశారు. ఏర్పాట్లను మీరైనా చూసుకోవచ్చు కదా అంటూ అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి అడిగారు. ఎంపీడీఓ, తహసీల్దార్ల పనితీరుపై సబితారెడ్డికి ఫిర్యాదు చేశారు.