నూతన భవనాలు ఏర్పాటు చేయాలి
నూతన భవనాలు ఏర్పాటు చేయాలి
Published Tue, Sep 6 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM
యాదగిరిగుట్ట : మండలంలోని పెద్దకందుకూర్‌లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరాయని, నూతన భవనాలను ఏర్పాటు చేయాలని కోరుతూ యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డికి మంగళవారం ఎస్‌ఎంసీ చైర్మన్లు, గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్లు విప్‌తో మాట్లాడుతూ వర్షాలు కురిసినప్పుడు విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డమీది స్వప్నరవీందర్‌గౌడ్, ఎస్‌ఎంసీ చైర్మన్లు జుట్టు బాలమణి, దర్శనం శ్రీనివాస్, సీస నర్సింహులుగౌడ్, శంకర్‌గౌడ్, పత్తి సుజాత, దర్శనం స్వామి, ఆజ్మీర శ్రీనివాస్, సావిత్రి, మంజుల, సుశీల, భాస్కర్, క్రిష్ణ, రాజు, వెంకటేష్‌గౌడ్, మహేష్ తదితరులున్నారు.
Advertisement
Advertisement