VIP
-
విసుగెత్తిస్తున్న వీఐపీలు
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో వివిధ పదవుల్లో ఉండే నాయకులు, అధికారంలో లేకపోయినా ప్రముఖ రాజకీయ నాయకులు, సినిమా, వ్యాపారం సహా పలు రంగాల్లో అత్యంత ప్రముఖులు.. ఇలా మన దేశంలో వీఐపీ (వెరీ ఇంపార్టెంట్ పర్సన్)లకు కొదవ లేదు. వీళ్లు కాలు తీసి కాలు పెట్టినా.. అత్యంత ప్రాధాన్యం కోరుకుంటారు. ఇది కొన్ని సందర్బాల్లో శ్రుతి మించుతోంది కూడా. ఇటీవల ఝాన్సీ పట్టణంలోని ఒక ఆసుపత్రిలో జరిగిన ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు చనిపోవడం తెలిసిందే. ఆ చిన్నారుల తల్లిదండ్రులు మృతదేహాల కోసం ఎదురు చూస్తుండగా.. ఓ మంత్రి పరామర్శకు ఆసుపత్రికి వస్తున్నారని సిబ్బంది రోడ్ల వెంట సున్నంతో లైన్లు కొట్టి ఏర్పాటు చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దేశంలో ఈ వీఐపీ సంస్కృతిపై విమర్శలు మొదలయ్యాయి. దేశంలో వీఐపీ సంస్కృతిపై లోకల్ సర్కిల్స్ సంస్థ దేశవ్యాప్తంగా 362 జిల్లాల్లో నిర్వహించిన సర్వేలో 45 వేల మంది అభిప్రాయాలు సేకరించింది. ఆ సర్వేలో పాల్గొన్న ప్రతి ముగ్గురిలో ఇద్దరు.. వీఐపీ సంస్కృతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 64 శాతం మంది దేశంలో వీఐపీ సంస్కృతి తగ్గడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రధానంగా రోడ్లపై వెళ్తున్నప్పుడు, టోల్ ప్లాజాల వద్ద నిరీక్షణ, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో మితిమీరిన జోక్యం వంటి అంశాలను వారు ఉదహరించారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేయడం, బెదిరింపులకు పాల్పడడం, ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌ల కోసం డబ్బు వసూలు.. ఇలా ఎన్నో విషయాల్లో వీఐపీల ధోరణిని వారు సర్వేలో లేవనెత్తారు. సర్వేలో పలు అంశాలపై అడిగిన ప్రశ్నలకు వచి్చన సమాధానాలివి. -
Bihar: వీఐపీ అధినేత తండ్రి హత్య
బీహార్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) అధినేత ముఖేష్ సాహ్ని తండ్రి జితన్ సాహ్ని హత్యకు గురయ్యారు. ఈరోజు (మంగళవారం) ఉదయం దర్భంగా జిల్లాలోని బిరౌల్లోని ఆయన నివాసంలో ఆయన మృతదేహం కనిపించింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఎఫ్ఎస్ఎల్ బృందాన్ని పిలిపించారు. ఎస్డీపీఓ మనీష్ చంద్ర చౌదరి కేసు దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి హత్య జరిగిన సమయంలో వీఐపీ అధినేత ముఖేష్ సాహ్ని ముంబైలోని తన కార్యాలయంలో ఉన్నారు. విషయం తెలియగానే ఆయన దర్భంగాకు బయలుదేరారు.మాజీ మంత్రి ముఖేష్ సాహ్నీకి ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ముఖేష్ సాహ్ని తండ్రి జితన్ సాహ్ని ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఈ హత్య గురించి బీజేపీ నేత అజయ్ అలోక్ మాట్లాడుతూ జరిగిన ఘటన అత్యంత ఘోరమని అన్నారు. 72 గంటల్లో హంతకుడిని పట్టుకుంటామన్నారు. నేరాలను ఎలా అరికట్టాలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసని ఆయన పేర్కొన్నారు. -
ఫ్లిప్‌కార్ట్ గుడ్‌న్యూస్.. ఇక హైదరాబాద్‌లోనూ కొత్త ఆఫర్!
హైదరాబాద్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇటీవల బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలలో ప్రారంభించిన వీఐపీ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ను ఇప్పుడు హైదరాబాద్‌కు విస్తరించింది. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న కస్టమర్లు ఉచిత డెలివరీ, తగ్గింపు వంటి ఆఫర్లను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ వీఐపీ (Flipkart VIP) సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ను కొత్తగా హైదరాబాద్‌తోపాటు అహ్మదాబాద్, భువనేశ్వర్, కోయంబత్తూర్, గౌహతి, పాట్నా, పూణే, రాంచీలలో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. కస్టమర్లు సంవత్సరానికి రూ. 499 చెల్లించి ఫ్లిప్‌కార్ట్ వీఐపీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలు ఈ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్ లక్షలాది ఉత్పత్తులపై 48-గంటల ఉచిత డెలివరీ, అన్ని ఉత్పత్తులపైనా చెల్లింపుల కోసం సూపర్ కాయిన్స్‌ను ఉపయోగించి 5 శాతం అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. క్లియర్‌ట్రిప్‌లో ఒక్క రూపాయికే ఫ్లైట్ క్యాన్సిల్ లేదా రీషెడ్యూల్ చేసుకోవచ్చు. క్లియర్‌ట్రిప్ హోటల్ బుకింగ్‌లపై అదనపు ఆఫర్లు, 48 గంటలలోపు రిటన్ పికప్. షాపింగ్ ఫెస్టివల్స్‌కు ముందస్తు యాక్సెస్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఇలా ఎలా నమోదు చేసుకోండి.. ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్ లేదా యాప్‌ని సందర్శించండి మీ వివరాలతో లాగిన్ చేయండి. ఒకవేళ మీరు ప్లాట్‌ఫామ్‌కు కొత్త అయితే, మీ వివరాలను అందించి అకౌంట్‌ను క్రియేట్ చేసుకోండి. వీఐపీ ల్యాండింగ్ పేజీకి స్క్రోల్ చేసి, 'గెట్ వీఐపీ బెనిఫిట్స్' బటన్‌పై నొక్కండి చెల్లింపు, తుది ప్రక్రియ కోసం 'కంనిన్వ్యూ' క్లిక్ చేయండి మీకు అనువైన మోడ్ ద్వారా చెల్లింపు వివరాలను నమోదు చేసి ఆర్డర్‌ను కన్ఫర్మ్ చేఏయండి విజయవంతంగా నమోదు చేసుకున్న తర్వాత, వెబ్సైట్ లేదా యాప్‌లో కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. -
చిన్నారిని చిదిమేసిన కారు.. శోకసంద్రంలో తల్లిదండ్రులు..
రాజన్న సిరిసిల్ల: మండలంలోని గాజులపల్లిలో ఆరేళ్ల చిన్నారిని అతివేగంగా వచ్చిన కారు చిదిమేసింది. ఈ ప్రమాదంలో చుట్టపుచూపుగా వచ్చిన చిన్నారి మృతితో గాజు లపల్లిలో విషాదం నిండింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణానికి చెందిన కొట్టెం పద్మ–రామారావు దంపతుల కూతురు స్వాతి(6)తో కలిసి గాజులపల్లిలో ఉంటున్న సమీప బంధువుల ఇంటికి ఆదివారం వచ్చారు. ఈ క్రమంలో మధ్యాహ్నం ఎల్లారెడ్డిపేటకు చెందిన ఓ ప్రముఖుడు తన కారులో సిరిసిల్ల నుంచి మండల కేంద్రానికి వస్తుండగా రోడ్డు దాటుతున్న స్వాతిని అతివేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తల పగిలిపోవడంతో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎస్సై రమాకాంత్ అక్కడికి చేరుకొని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం స్వాతి మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. న్యాయం చేయాలంటూ కుటుంబీకులు, గ్రామస్తులు సిరిసిల్ల–కామారెడ్డి రోడ్డుపై ధర్నా చేశారు. -
సురోవికిన్ కూడా వాగ్నర్ సభ్యుడే
న్యూయార్క్: రష్యాలో వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు ఘటన అక్కడి మిలటరీలో లుకలుకలను ఒకటొకటిగా బయట పెడుతోంది. తాజాగా, రష్యా టాప్ మిలటరీ కమాండర్ జనరల్ సెర్గెయ్ సురోవికిన్ వాగ్నర్ గ్రూప్‌లో రహస్య వీఐపీ సభ్యుడని తెలిపే కొన్ని పత్రాలు దొరికినట్లు సీఎన్ఎన్ పేర్కొంది. వాగ్నర్ వీఐపీ సభ్యుడిగా సురోవికిన్ పేరు 2018లో నమోదైనట్లు అందులో తెలిపింది. ఆయనతోపాటు మరో 30 మంది రష్యా సీనియర్ మిలటరీ, ఇంటెలిజెన్స్ అధికారులు కూడా వాగ్నర్ వీఐపీ సభ్యులని పేర్కొంది. వాగ్నర్ సభ్యుడిగా సురోవికిన్ ఉన్నారనేందుకు కచ్చితమైన ఆధారాలేవీ లేనప్పటికీ, రష్యా సైనిక బలగాల్లోని చాలా మంది సీనియర్ అధికారులు వాగ్నర్ గ్రూప్‌తో దగ్గరి సంబంధాలు సాగించేందుకు అవకాశం ఉందని సీఎన్ఎన్ కథనం పేర్కొంది. ఇలాంటి దగ్గరి సంబంధాల వల్లే వాగ్నర్ కిరాయి సైనికులు రొస్తోవ్‌లోని కీలక మిలటరీ బేస్‌నుæ శ్రమ లేకుండా స్వాధీనం చేసుకోగలిగారన్న అనుమానా లున్నాయి. తిరుగుబాటు అనంతరం సురోవికిన్ కనిపించకుండా పోయారు. ప్రిగోజిన్ తిరుగుబాటు విషయం ఆయనకు తెలుసునంటూ న్యూయార్క్‌టైమ్స్ కథనం పేర్కొంది. ప్రిగోజిన్‌ను తిరుగుబాటు ఆపేయాలంటూ విడుదల చేసిన వీడియోలో సురోవికిన్ తడబడుతూ మాట్లాడుతున్నట్లు కనిపించారు. దీంతో, ఆయన మానసిక ఆరోగ్యంపైనా అనుమానాలున్నాయి. జనర ల్ ఆర్మగెడ్డాన్గా పిలుచుకునే సురోవికిన్ అధ్యక్షుడు పుతిన్‌కు నిన్నటిదాకా నమ్మినబంటు. తాజా పరిణామాలతోనూ ఆయన్ను పుతిన్ నమ్ముతారా అన్నది తేలాల్సి ఉంది. -
సోలో ఫ్లైట్ జర్నీ.. రూ.13 వేలకే ప్రైవేట్ జెట్ లాంటి ప్రయాణం!
ప్రైవేట్ జెట్ అంటే విలాసవంతమైన విమానం. పెద్ద పెద్ద సెలబ్రిటీలు, బడా వ్యాపారవేత్తలకు రూ.కోట్ల ఖరీదైన ప్రైవేట్ జెట్ విమానాలు ఉంటాయి. అందులో వారు ఏకాంతంగా ప్రయాణిస్తుంటారు. అలాంటి అనుభూతి ఓ సాధారణ ప్రయాణికుడికి రూ.13వేలకే దక్కింది. అయితే అది ప్రైవేట్ జెట్ కాదు కానీ ఓ విమానానికి అంతటికీ అతనొక్కడే ప్రయాణికుడు. (Mahindra Thar: మహీంద్రా థార్ కావాలంటే మరో రూ.లక్ష కావాలి!) న్యూయార్క్ పోస్ట్ ప్రచురించిన కథనం ప్రకారం... యూకేకు చెందిన 65 ఏళ్ల పాల్ విల్కిన్సన్ ఉత్తర ఐర్లాండ్ నుంచి తన కుటుంబాన్ని కలవడానికి పోర్చుగల్‌కు బయలుదేరాడు. విమానం ఎక్కేందుకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న పాల్‌కు గేట్ వద్ద ప్రయాణికులు ఎవరూ కనిపించలేదు. దీంతో విమానం రద్దయిందేమో అనుకుని ఆరా తీయగా మొత్తం విమానానికి తాను ఒక్కడినే ప్రయాణికుడని తెలిసింది. (ఐఫోన్ మేడ్ ఇన్ ఇండియా! చైనా కంటే అధికంగా భారత్‌లో ఉత్పత్తి) ఎయిర్పోర్ట్, విమాన సిబ్బంది విల్కిన్సన్‌ను వీఐపీ అతిథి, కింగ్ పాల్ అంటూ సంబోధిస్తూ విమానంలోకి స్వాగతం పలికారు. విల్కిన్సన్ విమానంలో తనకు నచ్చిన సీటు ఎంచుకుని కూర్చుని ప్రైవేట్ జెట్ లాంటి ప్రయాణాన్ని ఆస్వాదించారు. ఈ ప్రయాణానికి అతనికి అయిన ఖర్చు కేవలం 162 డాలర్లు (సుమారు రూ. 13,000) మాత్రమే. (New GST Rule: జీఎస్టీ కొత్త రూల్.. మే 1 నుంచి అలా కుదరదు!) -
హీరో ధనుష్‌కు హైకోర్టులో ఊరట
సాక్షి, చెన్నై: నటుడు ధనుష్ కథానాయకుడుగా నటించిన చిత్రం వేలై ఇల్లా పట్టాదారి(వీఐపీ). ఆ చిత్రానికి ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ నిర్మాతలుగా వ్యవహరించారు. కాగా, ఈ సినిమాలో పొగతాగే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిపై టుబాకో నియంత్రణ కమిటీ 2014లో ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. పొగతాగే సన్నివేశాలను ప్రచారం చేయటం చట్ట ప్రకారం నేరమని, ఈ మూవీలో అలాంటి సన్నివేశాలను పొందుపరిచారని ఆరోపించింది. ప్రభుత్వ హెచ్చరికలు పొందుపరిచలేదని ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌లపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆరోగ్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ స్థానిక సైదాపేట కోర్టులో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌లపై పిటిషన్ దాఖలు చేశారు. సైదాపేట కోర్టు ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్లకు ప్రత్యక్షంగా, హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ఐశ్వర్య రజనీకాంత్ హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. అదేవిధంగా ధనుష్ కూడా హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం న్యాయమూర్తి సతీష్ కుమార్ సమక్షంలో విచారణకు వచ్చింది. ధనుష్ తరపు న్యాయవాది విజయన్ సుబ్రమణియన్ హాజరై ధనుష్ సైదాపేట కోర్టుకు హాజరవడంపై స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయమూర్తి ధనుష్‌ను సైదాపెట కోర్టులో హాజరవడంపై స్టే విధిస్తూ తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు. చదవండి: భూవివాదం కేసు.. కోర్టుకు హాజరైన రానా -
వీఐపీల మ్యాప్ వచ్చేసింది.. టక్కున సమాధానం
ఈ ప్రశ్నకు మీరు బదులిచ్చినా ఇవ్వకున్నా ఒక ఆన్లైన్ ఇంటరాక్టివ్ మ్యాప్ (ప్రపంచ పటం) మాత్రం టక్కున సమాధానం చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందిన వ్యక్తులు పుట్టిన ప్రాంతాలను చిటికెలో చూపిస్తోంది. ఉదాహరణకు లండన్‌లో పుట్టిన అత్యంత ప్రముఖ వ్యక్తి ఎవరు? అని యూజర్లు అడిగితే చార్లీ చాప్లిన్ పేరును మ్యాప్ సూచిస్తోంది. అమెరికాలోని హోనలులులో పుట్టిన గొప్ప వ్యక్తి ఎవరంటే మాజీ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా పేరు వస్తోంది. అలాగే భారత్ నుంచి టిప్పుసుల్తాన్, ఔరంగజేబు వంటి నాటి రాజులు మొదలు మహాత్మాగాంధీ, నెహ్రూ, రాజీవ్‌గాంధీ వంటి నేతల వరకు ఆయా వ్యక్తులు పుట్టిన ప్రాంతాలనుబట్టి మ్యాప్ చూపుతోంది. మీ ప్రాంతంలోని ప్రముఖుల వివరాల కోసం ఈ లింక్‌ను tjukanovt.github.io/notable-people క్లిక్చేయండి. గుర్తించేది ఇలా.. వికీపీడియా, వికీడేటాలోని సమాచా రం ఆధారంగా ప్యారిస్ వర్సిటీకి చెందిన పరిశోధకులు వివిధ రంగాల వ్య క్తుల ప్రాముఖ్యతను ఇటీవల లెక్కగట్టారు. దీని ఆధారంగా ప్రముఖ భూ గోళ శాస్త్రవేత్త, వార్తావెబ్సైట్లు, సంస్థలకు ఆన్లైన్ మ్యాప్లందించే మ్యాప్ బాక్స్ కంపెనీ సీనియర్ డిజైనర్ టోపీ జుకనోవ్ ఇంటరాక్టివ్ మ్యాప్‌ను రూ పొందించారు. వికీపీడియాలో నమోదైన ఎంట్రీలు, వాటి పొడవు, 2015 నుంచి 2018 మధ్య వికీపీడియాలో ఒక్కో ప్రముఖ వ్యక్తికి లభించిన సగ టు వ్యూయర్షిప్ తదితరాలను పరిగణనలోకి తీసుకొని ఈ మ్యాప్‌ను రూ పొందించినట్లు జుకనోవ్ చెప్పారు. సంస్కృతి, శాస్త్ర పరిశోధన, నాయకత్వం, క్రీడలు లేదా ఆటలు అనే నాలుగు రంగాలకు చెందిన వ్యక్తుల వివరాలను ఇందులో పొందుపరిచినట్లు చెప్పారు. -
కోటిశ్వరులే టార్గెట్ గా చికొటి ప్రవీణ్ క్యాసినో దందా
-
పంజాబ్ ముఖ్యమంత్రి మరో సంచలన నిర్ణయం..
చండీగఢ్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరోగ్యశాఖ మంత్రిని పదవి నుంచి బర్తరఫ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 424 మంది ప్రముఖులకు సెక్యురిటీ రద్దు చేశారు. ప్రముఖులకు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించుకుంటున్నట్టు శనివారం సంచలన ప్రకటన చేశారు. గత నెలలో కూడా 184 మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కేటాయించిన భద్రతను రద్దు చేస్తూ భగవంత్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వాళ్ల అవసరం లేదు.. రాష్ట్ర ప్రభుత్వం భద్రత ఉపసంహరించిన వారిలో అకాల్ తక్త్ జాటేదార్గా వ్యవహరిస్తున్న జ్ఞాని హర్‌ప్రీత్ సింగ్ కూడా ఉన్నారు. ఆయనకు ఇదివరకు 6 మంది అంగరక్షకులు ఉండగా.. సీఎం నిర్ణయంతో ముగ్గురు సేవల నుంచి వెనుదిరిగారు. ఈ విషయమై హర్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయంతో తనకు ఇబ్బందేమీ లేదని అన్నారు. మిగతా ముగ్గురిని కూడా వెనక్కి పంపిస్తానని చెప్పారు. తనకు రక్షణ కల్పించేందుకు పంజాబ్ యువకులు చాలునని స్పష్టం చేశారు. మరోవైపు హర్‌ప్రీత్ సింగ్ సెక్యురిటీ ఉపసంహరణపై విమర్శల నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. వెనక్కి పిలిచిన ముగ్గురు బాడీ గార్డులను తిప్పి పంపిస్తామని తెలిపింది. అయితే, దీనిని హర్‌ప్రీత్ సింగ్ తిరస్కరించినట్టు తెలిసింది. With its decision & flip flop on the withdrawal of official security to the highly respected Jathedar Sahiban of Khalsa Panth's venerated Takhts, including Sri Akal Takht Sahib, @AAPPunjab govt has merely exposed itself as a stooge of anti-Punjab & anti-Panth @ArvindKejrival.1/3 pic.twitter.com/cc1Mpg3dKB — Sukhbir Singh Badal (@officeofssbadal) May 28, 2022 -
ఆ 10 రోజులు సిఫారసు లేఖలు పంపొద్దు
తిరుమల: జనవరి 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 22వ తేదీ అర్ధరాత్రి వరకు 10 రోజుల పాటు కల్పించే వైకుంఠ ద్వార దర్శనం కోసం సిఫారసు లేఖలు పంపవద్దని వీఐపీలకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం విజ్ఞప్తి చేశారు. 10 రోజుల పాటు చైర్మన్ కార్యాలయంలో కూడా సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేశారు. కోవిడ్ కారణంగా తిరుమలలో గదుల మరమ్మతులు చేపట్టడంతో వైకుంఠ ఏకాదశి రోజున ప్రజాప్రతినిధులకు తిరుమలలోని నందకం, వకుళ ఆతిథి గృహాల్లో వసతి కల్పిస్తున్నామని, తిరుమలలో వసతి సరిపోకపోతే తిరుపతిలోనే బస పొందేందుకు సిద్ధపడి రావాలన్నారు. తిరుపతిలోని మాధవం, శ్రీనివాసం, శ్రీ పద్మావతి నిలయం, ఎస్వీ గెస్ట్ హౌస్‌లలో శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళమిచ్చిన భక్తులు వసతి పొందాలని తెలిపారు. త్వరలో అన్నమయ్య మార్గానికి టెండర్లు శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడు తాళ్ళపాక అన్నమాచార్యులు నడిచిన మార్గం ద్వారా భక్తులు తిరుమలకు చేరుకునేలా రోడ్డు అభివృద్ధి చేస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్)ను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. మామండూరు నుంచి తిరుమల పార్వేట మండపం వరకు ఉన్న అన్నమయ్య మార్గాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం మేరకు వెంటనే సమగ్ర సర్వే చేసి అటవీశాఖ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. త్వరలోనే టెండర్లు పిలిచి ఈ మార్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. -
వైకుంఠ ద్వార దర్శనానికి వీఐపీలు సిఫారసు లేఖలు పంపద్దు: వైవీ సుబ్బారెడ్డి
-
మినీ విమానం వచ్చేసింది.. ఎగిరిపోవడానికి రెడీనా?
సాక్షి, వెబ్‌డెస్క్: ఇంతకాలం విదేశాల నుంచి విమానలు దిగుమతి చేసుకునే దశ నుంచి స్వంతంగా విమానాలు రూపొందించే స్థితికి భారత్ చేరుకుంది. ప్రభుత్వరంగ సంస్థ హిందూస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్(హాల్) మినీ విమానాన్ని తయారు చేసింది. ఉదాన్ పథకానికి ఉపయోగకరంగా ఉండటంతో పాటు ఇతర పనులు చేసేందుకు వీలుగా మినీ విమానం డిజైన్ చేసింది. హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశీయంగా రూపొందించిన హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) విమానం విశేషాలను హాల్ ప్రకటించింది. కాన్పూరులో ఉన్న హాల్ క్యాంపస్‌లో ఈ విమానాన్ని మీడియాకు పరిచయం చేసింది. ఈ విమానంలో 19 మంది ప్రయాణం చేయవచ్చు. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఈ మినీ విమానాన్ని హాల్ రూపొందించింది. ఇప్పటికే ఈ విమానం కమర్షియల్ ట్రావెల్‌కి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి అప్రూవల్ సాధించింది. ప్రైవేటు ఆపరేటర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విమానాలు అందిస్తామని హాల్ చెబుతోంది. ఉదాన్కి ఊతం భవిష్యత్తులో ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతందని కేంద్రం అంచనా వేస్తోంది. అందువల్లే వరంగల్, రామగుండం వంటి టైర్ టూ సిటీల్లో విమానయాన అవకాశాలు మెరుగుపరిచేందుకు ఉదాన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ నగరాలకు భారీ విమానాల కంటే తక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న విమనాలు మెరుగనే ఆలోచన ఉంది. ఇప్పుడు హాల్ మినీ విమానం అందుబాబులోకి తేవడంతో ఉదాన్ పథకానికి కొత్త రెక్కలు వచ్చే అవకాశం ఉంది. వరంగల్ ఎయిర్‌పోర్టకు సంబంధించి సాంకేతిక అనుమతులు సాధించేందుకు కేంద్రం, జీఎంఆర్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోంది. పలు రకాలుగా హాల్ రూపొందింన హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) విమానాన్ని ప్యాసింజర్ రవాణాకే కాకుండా పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఎయిర్ అంబులెన్స్, వీఐపీ ట్రాన్స్‌పోర్టు, క్లౌడ్ సీడింగ్, ఫోటోగ్రఫీ, అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫోటోగ్రఫీ, షూటింగ్ తదితర అవసరాలకు వినియోగించుకునేలా ఈ విమానం డిజైన్ చేసినట్టు తెలిపారు. త్వరలోనే ఈ విమానం ప్రజలకు అందుబాటులోకి రానుంది. -
వీఐపీలే ముఖ్యమా? సామాన్యులంటే లెక్కలేదా..?
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రశాసన్‌నగర్‌లోని ఎంపీ, ఎమ్మెల్యేల కాలనీతోపాటు వీఐపీలు నివసించే ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ అన్నీ బాగున్నాయి. జీహెచ్ఎంసీకి వీఐపీలే ముఖ్యమా? సామాన్య ప్రజలు తిరిగే రోడ్లను మాత్రం మరమ్మతులు చేయకుండా గాలికొదిలేశారు. అంటే సామాన్యుల ప్రాణాలు పోతున్నా పట్టదా? ఆస్తి పన్ను చెల్లించే వారంటే లెక్కలేదా? మేమూ హైదరాబాద్ పౌరులమే. రోడ్ల మీద వెళ్తున్నప్పుడు గుంతలతో మేమూ ఇబ్బందులు పడుతున్నాం’’అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం జీహెచ్ఎంసీ యంత్రాంగంపై మండిపడింది. వర్షాకాలం ఇప్పటికే ప్రారంభమైందని, రోడ్లకు మరమ్మతులు చేయడానికి ఇంకా ఎన్ని దశాబ్దాలు కావాలని ప్రశ్నించింది. హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని, ఇక్కడ వసతులు బాగుంటేనే పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ముందుకొస్తారని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి గంగాధర్ తిలక్ (73) తన కొచ్చే పెన్షన్ డబ్బులతో జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్లపై గుంతలను పూడ్చుతున్నాడంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని గతంలో సుమోటోగా విచారణకు స్వీకరించిన జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మరో సారి విచారించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 9,013 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయని, ఇందులో 6,176 కి.మీ. రోడ్లను కాంక్రీట్ రోడ్లుగా మార్చామని, మిగిలిన రోడ్లను త్వరలోనే కాంక్రీట్ రోడ్లుగా మారుస్తామని జీహెచ్ఎంసీ తరఫున సీనియర్ న్యాయ వాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. రోడ్లకు మరమ్మతులు చేసేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులు ప్రమాదాలబారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. వీటికి సంబంధించి గత సంవత్సరం తీసుకున్న చర్యలను వివరిస్తూ నివేదిక సమర్పించడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సంవత్సరం వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఏం చేశారో చెప్పమంటే గత ఏడాది చేసింది చెబుతున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. ఫిర్యాదుల కోసం యాప్ జీహెచ్ఎంసీ పరిధిలోని సమస్యల ఫిర్యాదుకు ‘మై జీహెచ్ఎంసీ యాప్’ను ఐదేళ్ల క్రితం అందుబాటులోకి తెచ్చామని నిరంజన్‌రెడ్డి వివరించారు. తమ ప్రాంతంలో ఉన్న సమస్యను ఫొటోతీసి యాప్‌లో అప్లోడ్ చేస్తే జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఐదేళ్లలో 28 వేల ఫిర్యాదులు రాగా, మెజారిటీ ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపారు. అనం తరం రోడ్ల మరమ్మతులకు తీసుకున్న చర్యలపై తాజాగా నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
నిమ్స్‌లో వీఐపీ కరోనా రోగులు
హైదరాబాద్: నిమ్స్‌లో కరోనాతో బాధపడుతున్న పలువురు ప్రముఖులు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒక ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. నిమ్స్ పాత భవనంలోని స్పెషల్ రూమ్‌లో చికిత్స పొందుతున్న వారిలో నిజామాబాద్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కె. సాంబశివరావు చికిత్స పొందుతున్నారు. నిమ్స్ వైద్యులు, ఉద్యోగులకే పరిమితమైన కోవిడ్ సేవలు రాష్ట్రంలోని ప్రముఖులకు సైతం అందుబాటులోకి వచ్చాయి. నిమ్స్‌లో పని చేస్తున్న వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపుగా మూడు వేల మందికి పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. -
‘ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తోనే ఉన్నారు’
జైపూర్: బహుజన సమాజ్‌వాది పార్టీ(బీఎస్పీ)కి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు చెందిన వారేనని ఆ పార్టీ ఎమ్మెల్యే రామ్‌నారయణ్ మీనా తెలిపారు. స్పీకర్ వారిని కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలుగా గుర్తించినట్లు చెప్పారు. ఎమ్మెల్యేల సభ్యత్వం గురించి మీనా మాట్లాడుతూ, ‘బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని స్పీకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గుర్తించారు. నేను ఎలాగైతే ఎమ్మెల్యేనో వారు కూడా అంతే. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు’ అని తెలిపారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి విప్ జారీ చేయడంపై ఆయన మాట్లాడుతూ, మాయావతి దళిత పార్టీ సమావేశాలకు హాజరుకారని, ఆమె కేవలం ఉపన్యాసాలు మాత్రమే ఇస్తారని అని విమర్శించారు. ఆమె అసలు నాయకురాలు కాదని, కాన్షీరామ్‌ను ఆమెలో చూసుకోవడం కారణంగా నాయకురాలిగా మారారని ధ్వజమెత్తారు. రాజస్తాన్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్‌కు మద్దతుగా తమ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేయకూడదని మాయావతి విప్ జారీ చేశారు. దీంతో రాజస్తాన్ రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. చదవండి: మాయావతి విప్ : గహ్లోత్ సర్కార్‌కు షాక్ -
‘ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి ఏపీలోనే’
సాక్షి, వైఎస్సార్ కడప: ధికారం చేపట్టిన కొద్దిరోజుల్లోనే దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఏపీలో జరుగుతుందని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కేవలం రెండు పేజీల్లో యూనిక్‌గా నవరత్నాల అమలకు.. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే నాంది పలికారని తెలిపారు. ఆదేవిధంగా జగన్మోహన్రెడ్డిని ప్రకృతి ఆశీర్వదించిదని, వాతావరణం పులకరించి.. అన్ని డ్యాంలు నిండు కుండలా ఉన్నాయన్నారు. కాగా తొట్టిగ్యాంగ్ పార్టీ అయిన టీడీపీ... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అన్నారు. ‘70 ఏళ్లు ఉన్నాయి. పెద్ద మనిషివి కొంచెం మైండ్ పెట్టు. పదేళ్ల వెనక్కి వెళ్లావు’ అంటూ పరోక్షంగా చంద్రబాబుపై కొరముట్ల విమర్శలు చేశారు. -
వినోదంలో యాప్‌లే ‘టాప్’
న్యూఢిల్లీ: బ్యాండ్‌విడ్త్ కోసం బెగ్గింగ్ చేసే రోజులు పోయాయిప్పుడు. ఒక వీడియోను డౌన్లోడ్ చేసుకుంటే డేటా ఖర్చయిపోతుందేమోననే భయాలు కూడా లేవిప్పుడు. అందుకే... పెన్‌డ్రైవ్‌లోకి డౌన్లోడ్ చేసుకుని దాన్నే అలా చేతులు మార్చుకునే రోజులిప్పుడు లేవు. డౌన్లోడ్ చేసుకుంటే స్పేస్ వృథా అవుతుందన్న కారణంతో అంతా తమ సొంత టీవీల్లోనో, మొబైల్లోనో వీడియోలను లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇదిగో... ఈ ధోరణి ఎంటర్టైన్మెంట్ రంగ రూపురేఖల్ని మార్చేస్తోంది. డిజిటల్ ఓవర్ ది టాప్ (ఓటీటీ) ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల టీవీ చానళ్లకు సంబంధించి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిబంధనలు అమల్లోకి వచ్చాక ఓటీటీ వేగం మరింత పెరిగింది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ– ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) సర్వే ప్రకారం మీడియా– వినోద రంగానికి సంబంధించి 2019లో తొలిసారిగా సినిమాను డిజిటల్ విభాగం అధిగమించనుంది. 2021 నాటికి ప్రింట్‌ను కూడా దాటేసి రూ.35,400 కోట్ల స్థాయికి చేరనుంది. ఈ విభాగంలో ఇంత భారీ స్థాయిలో అవకాశాలుండటంతో ఓటీటీ సంస్థలు కొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా 30 పైచిలుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇవి సినిమాలు, చానల్స్ ప్రసారంతో పాటు సొంతంగా సీరియళ్లు, సినిమాల్లాంటి కంటెంట్‌ను కూడా రూపొందిస్తూ వీక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. గతేడాది ఏకంగా 1,200 గంటల నిడివి ఉండే తాజా కంటెంట్‌ను ఓటీటీ సంస్థలు నిర్మించాయి. హాట్‌స్టార్, ఈరోస్ నౌ, సోనీ లైవ్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హంగామా, వూట్, ఆల్ట్‌బాలాజీ, జీ5, సన్‌నెక్ట్స్ తదితర సంస్థలు ఓటీటీ విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. దేశీ సంస్థలు అంతర్జాతీయంగానూ విస్తరిస్తున్నాయి. ఈరోస్ డిజిటల్ తాజాగా చైనా సంస్థతో జట్టు కట్టి భారత్, చైనాలో ఒక ప్రోగ్రామ్‌ను చిత్రీకరిస్తోంది. బ్రిటన్ లాంటి దేశాల్లో కూడా కో–మార్కెటింగ్ డీల్స్ కుదుర్చుకుంది. చౌకగా చార్జీలు.. ఓటీటీ సంస్థలు వీలైనంత చౌకగా కంటెంట్‌ను ఆఫర్ చేసేందుకు పోటీపడుతున్నాయి. ఉదాహరణకు హాట్‌స్టార్ అన్ని స్పోర్ట్స్, అమెరికన్ షోస్, సినిమాలకు వార్షికంగా రూ.999 చార్జీలు వసూలు చేస్తోంది. రూ.299కి నెలవారీ ప్యాకేజీ కూడా అందిస్తోంది. టీవీల్లో ప్రసారం కాకముందే స్పెషల్స్, సీరియల్స్ మొదలైనవి చూడాలనుకునేవారి కోసం హాట్‌స్టార్ వీఐపీ పేరుతో వార్షికంగా రూ.365 చార్జీలకు అందిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ చార్జీలు నెలకు రూ.500–800 స్థాయిలో ఉంటున్నాయి. అటు అమెజాన్ ప్రైమ్ వీడియో చార్జీలు నెలకు రూ.129, ఏడాదికి రూ.999 స్థాయిలో ఉన్నాయి. నెలవారీగానే కాక వారం వ్యవధికి పనిచేసే చిన్న ప్యాక్లనూ ఓటీటీ సంస్థలు అందుబాటులోకి తెచ్చాయి. సోనీలైవ్ 7 రోజులకు రూ.29 ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. ఐపీఎల్ క్రికెట్ సీజన్ నేపథ్యంలో హాట్‌స్టార్ కూడా కేవలం రూ.25 నెలవారీ చార్జీలతో స్పోర్ట్స్ ప్యాకేజీని అందిస్తోంది. జీ5 సైతం ఇదే కోవలో చౌక ప్యాకేజీలను ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉంది. సాధారణంగా బడ్జెట్ ప్యాక్‌లకు వ్యతిరేకంగా ఉండే నెట్‌ఫ్లిక్స్ కూడా భారత యూజర్లకు చౌక ప్యాక్‌లపై దృష్టి పెడుతోంది. వారానికి రూ.65కే సర్వీసులు అందించే ప్యాక్‌ను పరిశీలిస్తోంది. భారీ పెట్టుబడులు.. ఓటీటీ సంస్థలు భారీ స్థాయిలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈరోస్ నౌ సంస్థ దగ్గర ఇప్పటికే 12,000 పైచిలుకు సినిమాలున్నాయి. కొత్తగా మరింత కంటెంట్ కొనుగోలు, నిర్మాణం కోసం వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో 50–70 మిలియన్ డాలర్లు వెచ్చించబోతోంది. స్టార్ యూఎస్ హోల్డింగ్స్‌తో కలిసి స్టార్ ఇండియా తమ ఓటీటీ విభాగం హాట్‌స్టార్‌లో దాదాపు రూ.1,066 కోట్ల (153 మిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేస్తోంది. గతేడాది పెట్టిన రూ.516 కోట్ల పెట్టుబడులకు ఇది అదనం. ఇతర సంస్థలూ ఇదే స్థాయిలో పెట్టుబడులకు సిద్ధమవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా ఎనిమిది కొత్త సినిమాలు, 12 వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్నట్లు వెల్లడించింది. సేక్రెడ్ గేమ్స్ లాంటి బ్లాక్‌బస్టర్ సిరీస్ తరహాలోనే ఇవి కూడా హిట్ అవుతాయని ఆశిస్తోంది. దేశీ సంస్థ ఆల్ట్‌బాలాజీ కూడా 2019లో 30–40 షోలు నిర్మిస్తున్నట్లు తెలిపింది. ‘ప్రాంతీయ’ కంటెంట్‌పై దృష్టి.. సాధారణంగా యువ జనాభాలో ఎక్కువ శాతం వీక్షకులు బస్సులు, రైళ్లు, ట్యాక్సీల్లో ప్రయాణించేటప్పుడో లేదా లంచ్ బ్రేక్‌లోనూ చూసేందుకు అనువైన 10–15 నిమిషాల తక్కువ నిడివి ఉండే కంటెంట్‌ను ఇష్టపడుతున్నారని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోస్ నౌ లాంటి సంస్థలు ఇలాంటి కంటెంట్‌పై దృష్టిపెడుతున్నాయి. ఇక చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచీ వీక్షకుల సంఖ్య భారీగా పెరుగుతోందని ఓటీటీ సంస్థలు గుర్తించాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వీక్షకులకు మరింత చేరువయ్యే మార్గాలపై దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రాంతీయ భాషల్లోనూ కంటెంట్‌ను అందిస్తున్నాయి. వయాకామ్18కి చెందిన వూట్ సంస్థ తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ తదితర భాషల్లో కంటెంట్ రూపొందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ కూడా తెలుగు సహా తమిళం, హిందీ, మరాఠీ, బెంగాలీ, కన్నడ వంటి భాషల్లో ప్రోగ్రామ్స్ చేస్తోంది. ఓటీటీ జోరు ఇదీ...! ► 2018లో 32.5 కోట్ల మంది ఆన్లైన్ వీడియోలు వీక్షించారు. ఇది అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 25 శాతం అధికం. ► వచ్చే మూడేళ్లలో డిజిటల్ వీడియో వినియోగదారుల సంఖ్య 50–60 కోట్లకు చేరగలదన్న అంచనాలు నెలకొన్నాయి. ► 2017లో 70 లక్షలుగా ఉన్న సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 2018 నాటికి 1.2–1.5 కోట్లకు పెరిగారు. ► దేశీయంగా 34 కోట్లకు పైగా స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఉండగా, డేటా వినియోగం గతేడాది రెట్టింపయ్యింది. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
-
వైకుంఠ ఏకాదశికి తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు
తిరుమల: వైకుంఠ ఏకాదశికి తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఈ నెల 29న ఏకాదశి,30న ద్వాదశి రానుంది. ఏకాదశి శుక్రవారం రావటంతో శ్రీవారి దర్శనం నాలుగు గంటలు ఆలస్యం కానుంది. ఏకాదశి నాడు ఉదయం ఐదున్నర గంటలకు వీఐపీ దర్శనం,8 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుందని జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. డిసెంబర్ 28 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు దివ్య దర్శనం, ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు, సిఫార్సు లేఖలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. రాజ్యంగ బద్దంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఏకాదశినాడు ఆరు వీఐపీ దర్శన టికెట్లు, రాజ్యాంగేతర వీఐపీలకు నాలుగు వీఐపీ దర్శన టికెట్లు కేటాయిస్తామన్నారు. ఏకాదశి దర్శనానికి వచ్చే భక్తులను 28న ఉదయం 10 గంటలకు వైకుంఠం క్యూకాంప్లెక్స్లోకి అనుమతిస్తామని జేఈఓ చెప్పారు. తిరుమలలో అదనంగా ఆరు కిలొమీటర్ల క్యూలైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ద్వాదశి నాడు వీఐపీ దర్శనాలు రద్దు చేశామని, భక్తులకు నిరంతరం ఆహారం, నీరు అందిస్తామని జేఈఓ అన్నారు. -
శ్రీవారి సన్నిధిలో ఆర్కే రోజా
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామివారిని మంగళవారం ఉదయం వైఎస్సార్సీపీకి చెందిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న రోజా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు రోజాకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. -
వీఐపీ 3,4 సీక్వెల్స్ వస్తాయి
తమిళసినిమా: వీఐపీ చిత్రానికి మూడు, నాలుగు సీక్వెల్స్ తెరకెక్కించనున్నట్లు నటుడు ధనుష్ వెల్లడించారు. ఆయన నటించిన వీఐపీ( వేలై ఇల్లా పట్టాదారి) చిత్రం పెద్ద విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.ఆ చిత్రం రఘువరన్ బీటెక్ పేరుతో తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. కాగా వీఐపీకి సీక్వెల్‌గా వీఐపీ–2 చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నటుడు ధనుష్ కథ, మాటలు అందించి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో అమలాపాల్ నాయకిగా నటించారు. కాగా ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.థాను వి క్రియేషన్స్, ధనుష్ వండర బార్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సౌందర్యరజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి షాన్ రోల్డన్ సంగీతాన్ని అందించారు. వీఐపీ 2 చిత్రం ఈ నెల 28న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే చిత్ర ఆడియో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. చిత్ర ట్రైలర్‌ను 8 మిలియన్ల ప్రేక్షకులను అలరించి రికార్డు సాధించిందని చిత్ర వర్గాలు తెలిపారు. శనివారం సాయంత్రం స్థానిక రాయపేటలోని సత్యం సినిమామాల్లో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న నటుడు ధనుష్ మాట్లాడుతూ వీఐపీ చిత్రం గానీ, వీఐపీ–2 చిత్రం గానీ ఒక హీరోనో, హీరోయిన్నో ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిన చిత్రాలు కావన్నారు. ఈ రెండూ తల్లి ప్రేమానుబంధాలను ఆవిష్కరించే కథా చిత్రాలని తెలిపారు. వీఐపీ చిత్రం మాదిరిగానే వీఐపీ–2 చిత్రం కూడా జనరంజకంగా ఉంటుందని చెప్పారు. దీనికి 3,4 భాగాలు కూడా రూపొందుతాయని తెలిపారు. వీఐపీ చిత్రానికి, రెండవ భాగానికి వైవిధ్యం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రానికి షాన్ రోల్డన్‌ను సంగీతదర్శకుడిగా ఎంచుకున్నామని వివరించారు. ఇక ఇంతకు ముందు తన దర్శకత్వంలో చక్కని భావోద్రేకాలతో కూడిన కథా చిత్రంగా రూపొందిన పా.పాండి చిత్రానికి సీక్వెల్ చేస్తానని చెప్పారు. ఇకపై తమిళంలో నటిస్తా కాజోల్ మాట్లాడుతూ సుమారు 20 ఏళ్ల తరువాత మళ్లీ తమిళంలో వీఐపీ–2 చిత్రంలో నటించానన్నారు. వీఐపీ 2 చిత్రం వేరే కోణంలో ఉంటుందన్నారు. వీఐపీ 2ను సౌందర్యరజనీకాంత్ చాలా చక్కగా తెరకెక్కించారని ప్రశంసించారు. ప్రస్తుతం సినిమా ఆధునికం వైపు పరుగులు తీస్తోందని, దానితో పాటు మనం మారాలని అన్నారు. ఇకపై తమిళంలో వరసగా నటించాలని ఆశపడుతున్నానని, మంచి కథ, నిర్మాణ సంస్థలు అమరితే తమిళంలో నటిస్తానికి రెడీ అని పేర్కొన్నారు. ధనుష్ నాకు గురువు చిత్ర దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ మాట్లాడుతూ ధనుష్ తనకు గురువు అని పేర్కొన్నారు.తనకంటే సీనియర్ అని, ఆయనతో కలిసి పనిచేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పారు.ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పించిన ధనుష్‌కు, నిర్మాత థానుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కలైపులి ఎస్.థాను,సహ నిర్మాత పరంథామన్, సంగీతదర్శకుడు షాన్‌రోల్డన్, నటుడు సముద్రకని పాల్గొన్నారు. -
కటింగ్.. ఓన్లీ ఫర్ వీఐపీస్
► ఆదర్శం.. నారాయణ అంకితభావం ► సీఎంలు, సినీ హీరోలకు ఆయనే బార్బర్ ► సేవల కోసం విమాన టికెట్ల బుకింగ్ ► అట్టడుగు నుంచి ఉన్నతస్థాయికి పయనం నిబద్ధత, అంకితభావం ఉంటే మనిషి ఏ స్థాయికైనా ఎదగవచ్చని కొందరు నిరూపిస్తుంటారు. మాకు అవకాశం రాలేదే, మా బతుకులింతేనా అని నిట్టూర్చకుండా శ్రమనే నమ్ముకున్నారు. సేవ ద్వారానే ముందుకు నడిచారు. అలా కులవృత్తితోనే ఉన్నత శిఖరాలకు చేరుకున్నవారు తరచుగా కనిపిస్తుంటారు. ఆ కోవలోకి చెందిన వ్యక్తే ఏజీ నారాయణ. కేజీఎఫ్‌లో పేద కుటుంబంలో పుట్టిన ఆయన శ్రమతో రాతను మార్చుకుననారు. బెంగళూరులో పేరుమోసిన వీఐపీ క్షురకుల్లో ఒకరయ్యారు. ముఖ్యమంత్రులు, సినిమా సూపర్స్టార్లు ఆయన కోసం వేచి చూస్తారు. ఒద్దికగా కూర్చుంటారు. నారాయణ చక్కగా కటింగ్ చేసేస్తారు. శివాజీనగర(కర్ణాటక): వారు ఏ రంగంలో ప్రముఖులైనా, నెలకోసారి ఆయన వద్ద తలవంచాల్సిందే. ఎందుకంటే ఆయన చేయి తిరిగిన క్షురకుడు. ఆయనే ఏ.జీ.నారాయణ. వృత్తిపైనున్న మమకారంతో ఉన్నతస్థాయికి ఎదిగిన ఆయన ప్రముఖుల సరసన కూర్చుని విందులారగించే దశకు చేరారు. 69 ఏళ్ల నారాయణ 52 ఏళ్లుగా కులవృత్తిని నమ్ముకున్నారు. ఆ క్రమంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలకు, ముఖ్యమంత్రులు, మంత్రులకు, రాజకీయ నాయకులకు, సినీ హీరోలకు క్షురకునిగా మారారు. నేటికీ అనేకమంది ప్రముఖులు బార్బర్ షాప్‌కి వెళ్లాలంటే నారాయణ వద్దకే వెళ్తారు. గుండూరావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రతి నెలా నారాయణ కలిసేవారు. ఆ తరువాత ముఖ్యమంత్రులు ఎస్.ఆర్.బొమ్మయ్, వీరేంద్ర పాటిల్, రామకృష్ణహెగ్డే, ఇటీవలికాలంలో ధర్మసింగ్‌కు కూడా నారాయణ క్షౌ ర సేవలందించారు. చదువుకోలేక, ఉద్యోగం రాక... కోలార్ జిల్లా కేజీఎఫ్ స్వస్థలమైన నారాయణ పీయూసీ వరకు చదివి పై చదువులకు వెళ్లలేక పలు ఉద్యోగ ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. కులవృత్తికి సాటిరాదు గువ్వల చెన్నా అనే నానుడి మేరకు క్షురక కళ నేర్చుకున్నారు. సొంతూరిలో కొన్నాళ్లు చేసి బెంగళూరుకు చేరుకున్నారు. అదే సమయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న అశోక్ హోటల్లోని సెలూన్లో ఉద్యోగం లభించింది. అప్పట్లో ఆయన నెల జీతం రూ.10. హోటల్‌కు వచ్చే పలువురి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. దీంతో నారాయణ వృత్తి నైపుణ్యానికి గిరాకీ పెరిగింది. ప్రతి ఒక్కరూ నారాయణ ద్వారా తాము కటింగ్ చేయించుకోవాలని ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రముఖులంతా పిలిపించుకునేవారు. అంతే ఆయన పేరు ప్రముఖులందరికి నచ్చి నేటి వరకు అనేకులకు తన సేవలను అందిస్తూ ప్రస్తుతం బయటికి వెళ్లాలంటే లక్షలు విలువచేసే కారులోనే వెళ్లి తన కస్టమర్లకు సేవలందిస్తూ వస్తున్నారు. ప్రముఖులందరూ క్లయింట్లే ప్రముఖ సినీనటులు అమితాబచ్చన్, రజనీకాంత్,అంబరీష్, విష్ణువర్ధన్, చిరంజీవి, వెంకటేష్, కుమార బంగారప్ప, శ్రీనా థ్, జగ్గేశ్ ఆయన సేవలను అందుకున్నవారిలో ఉన్నారు. సినీ పరిశ్రమకు చెందినవారే కాకుండా బీపీఎల్ చైర్మన్ నంబియార్, ప్రిస్టేజ్ చైర్మన్‌తో పాటుగా ప్రముఖ రాజకీయ నాయకులు, మంత్రులు కూడా నేటికి నారాయణ సేవల కోసం ఫోన్లో సంప్రదిస్తున్నారు. ఆయన శివాజీనగర కన్నింగ్ హామ్ రోడ్డులో టచ్ ఆఫ్ క్లాస్ బ్యూటీ పార్లర్‌ను ప్రారంభించి 8 మందికి ఉపాధిని కల్పించారు. గత 20 సంవత్సరాల నుంచి పార్లర్ నడుస్తోంది. తన సేవలకు గాను 2000 సంవత్సరంలో అప్పటి గవర్నర్ రమాదేవి నుంచి అవార్డును పొందారు. ఇంకా పలు అవార్డులు వచ్చాయి. ప్రస్తుతం నారాయణతో పాటుగా ఆయన కుమారుడు రాజేశ్ బీకామ్ చదివి, తండ్రి బాటలోనే కులవృత్తిని చేపట్టారు. చేతినిండా ఆదాయం వస్తూ ఇతరులకు కూడా ఉపాధి కల్పించే అవకాశం ఉండటంతో వేరే ఉద్యోగం ఎందుకని ప్రశ్నిస్తారు. ఇంతటి గుర్తింపును ఊహించలేదు ‘ఇంతటి గుర్తింపు వస్తుందని ఊహించలేదు. హీరో రజనీకాంత్‌ను అందరూ ఒక్కసారైనా చూడాలని తపిస్తారు. నేను మూడుసార్లు ఆయనకు కటింగ్ చేశాను. దివంగత కన్నడ హీరో విష్ణువర్ధన్ ఒకసారి షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లిన సమయంలో నా కోసం విమానం టికెట్ బుక్ చేయించి పిలిపించారు. నా వృత్తిలో కుమారుడే కాకుండా కుమార్తె, మనవడు కూడా స్థిరపడి చేతినిండా సంపాదిస్తున్నారు. వృత్తిని గౌరవించి శ్రద్ధతో పనిచేస్తే ఏ రంగంలోనైనా అనుకున్నది సాధించవచ్చు, నేటి యువత దీనిని గుర్తించాలి’ – నారాయణ -
ప్రతి ఒక్కరూ వీఐపీనే!
వీఐపీ భావనను తొలగించేందుకే ఎర్రబుగ్గలకు నో చెప్పాం ► పౌరులంతా ముఖ్యమే అన్న భావన గొప్ప శక్తినిస్తుంది ► మాసాంతపు మన్ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: కొందరు వ్యక్తుల మనస్సుల్లోంచి వీఐపీ (వెరీ ఇంపార్టెంట్ పర్సన్) అనే భావన తీసేసేందుకే వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆదివారం మాసాంతపు మన్‌కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వీఐపీ స్థానంలో ఈపీఐ – ఎవ్రీ పర్సన్ ఇంపార్టెంట్ (ప్రతి ఒక్కరూ ముఖ్యమే) అనే భావనను చేర్చనున్నట్లు వెల్లడించారు. దేశంలో ఎర్రబుగ్గ ఉన్న వాహనంలో వెళ్లటం కొందరి మనసుల్లో పాతుకుపోయిన వీఐపీ సంస్కృతిని పారదోలేందుకే మే 1 నుంచి కొత్త నిబంధనలను అమలుచేస్తామన్నారు. దేశంలోని 125 కోట్ల మందిలో ప్రతి ఒక్కరికీ సమాన విలువ, ప్రాముఖ్యత ఉందన్నారు. ‘దేశంలో వీఐపీ సంస్కృతిపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ భావన వేళ్లూనుకుపోయింది. ఎర్రబుగ్గ వాహనాల్లో తిరిగే వారు మేమంతా వీఐపీలం అనే మైండ్‌సెట్‌తో ఉన్నారు. అందుకే ఇటీవలే మా ప్రభుత్వం.. ఎంతటివారైనా సరే తమ వాహనాలపైనుంచి ఎర్రబుగ్గలు తొలగించాల్సిందేనని నిర్ణయం తీసుకుంది’ అని తెలిపారు. మే 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిషేధం తనతోపాటుగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సీఎంలు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులందరికీ వర్తిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ‘నవభారతం’ అనే ఆలోచన.. వీఐపీ అనే భావనను పక్కనపెట్టి ప్రతి ఒక్కరూ ముఖ్యమే (ఈపీఐ)ననే భావనకు మరింత ప్రాముఖ్యత కల్పించేందుకేనన్నారు. ‘దేశంలోని 125 కోట్ల మంది ప్రజల ప్రాముఖ్యతను మనం గౌరవించాలి. ఈ భావన ప్రజల కలలను నిజం చేసే దిశగా దేశానికి గొప్ప శక్తినిస్తుంది. మనమంతా సంయుక్తంగా దీన్ని సాధించాలి’ అని చెప్పారు. డిజిటల్ చెల్లింపుల దిశగా.. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ లావాదేవీల నిర్ణయానికి మద్దతుగా.. భీమ్ యాప్‌ను విరివిగా వినియోగించాలని, ఇతరులకు భీమ్ యాప్‌ను ప్రతిపాదించటం ద్వారా రివార్డులు పొందాలని యువతను కోరారు. అక్టోబర్ 14 వరకే ఈ పథకం ఉంటుందని.. దీని వల్ల కలిగే లాభాలను యువత అందుకోవాలన్నారు. ‘మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం మీకో గొప్ప అవకాశాన్ని కల్పించింది. కొత్త తరం దాదాపు నగదు రహిత లావాదేవీలకే మొగ్గుచూపుతోంది. డిజిటల్ చెల్లింపులకే విశ్వాసం చూపుతోంది. అందుకే మీరు రోజుకు 20 మందికి భీమ్ యాప్‌ను వాడటాన్ని సూచిస్తే.. మీరు ఆరోజు రూ. 200 సంపాదించినట్లే. దీని వల్ల మీకు లాభం కలగటంతోపాటు డిజిటల్ ఇండియాకు సహాయం చేసినట్లవుతుంది’ అని మోదీ సూచించారు. బుద్ధుని బోధనల అమలు అవసరం త్వరలో శ్రీలంకలో తన పర్యటన, ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన ‘వేసాక్ డే’ కార్యక్రమం గురించీ మాట్లాడారు. ప్రపంచంలో హింస, యుద్ధం, విధ్వంసం, ఆయుధ పోటీ పెరుగుతున్న నేపథ్యంలో బుద్ధుడి బోధనలు చాలా అవసరం అన్నారు. వాతావరణ నియమాలు మారుతున్నాయని.. గతంలో మే, జూన్లలో కనిపించే ఎండలు ఈసారి మార్చి, ఏప్రిల్‌లోనే భయపెడుతున్నాయన్నారు. వేసవికాలంలో ..పక్షులు, జంతువులపై మానవత్వం చూపించాలన్నారు. వరండాల్లో చిన్న తొట్లలో పక్షుల కోసం నీళ్లుంచాలని సూచించారు. ఈ వేసవి సెలవుల్లో విద్యార్థులు.. ఆటో డ్రైవింగ్, ఇతర భాషలోని కొత్త పదాలు నేర్చుకోవటం వటి కొత్త నైపుణ్యాలు ఒంటబట్టించుకునేందుకు ప్రయత్నించాలని ఆయన అన్నారు. సార్క్ దేశాలకు అమూల్య కానుక మే 5న దక్షిణాసియా ఉపగ్రహాన్ని భారత్ ఆవిష్కరించనున్నట్లు వెల్లడించిన ప్రధాని.. ఇది ఇరుగుపొరుగు దేశాలకు అమూల్యమైన కానుకని పేర్కొన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్ ఆలోచనలో భాగంగానే ఇరుగు, పొరుగు దేశాలకూ మేలు జరుగుతుందన్నారు. 8 సార్క్ దేశాల్లో 7(శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, అఫ్గానిస్తాన్) ఈప్రాజెక్టులో చేరేందుకు అంగీకరించగా.. పాకిస్తాన్ ‘ఈ గిఫ్ట్ మాకొద్ద’ని తిరస్కరించింది. ‘ఇరుగుపొరుగుకు సహకారం కావాలి. వారూ అభివృద్ధి చెందాలి’ అని ప్రధాని అన్నారు. ‘దక్షిణాసియా విషయంలో మా చిత్తశుద్ధికి ఇదే సరైన ఉదాహరణ’ అని పేర్కొన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: తిరుమలలో శ్రీవారిని పలువురు ప్రముఖులు శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఏపీ డీజీపీ సాంబశివరావు సతీసమేతంగా ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కూడా కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అలాగే తమిళ నటుడు ఎస్.వి.శేఖర్ స్వామివారిని దర్శించుకున్నారు.