ఆంధ్రప్రదేశ్‌కు వీఐపీ హోదా | Andhrapradesh, VIP, Stats | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌కు వీఐపీ హోదా

Published Sun, Sep 11 2016 6:44 PM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM

తిరుపతి ఐఐటీలో ప్రొఫెసర్లతో సమీక్ష నిర్వహిస్తున్న కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ - Sakshi

తిరుపతి ఐఐటీలో ప్రొఫెసర్లతో సమీక్ష నిర్వహిస్తున్న కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌

–హోదాకు మించి నిధులు
–కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేవకర్‌
–ప్యాకేజీని తిరుమల లడ్డూతో పోల్చిన మంత్రి
యూనివిర్సిటీక్యాంపస్‌: ఆంధప్రదేశ్‌కు కేంద్రం ఇచ్చింది ప్రత్యేకహోదా కాదని, విఐపీ హోదాగా గుర్తించాలని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు మించి నిధులు ఇచ్చామని అన్నారు. తిరుపతిలోని ఐఐటీలో ఆదివారం ఐఐటీ, ఐషర్, ఇతర విద్యాసంస్థల అధ్యాపకులతో  ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు 2.25 లక్షల కోట్ల రూపాయల నిధులు ఇచ్చామన్నారు. ఏపీ ఎక్కువ మొత్తంలో నిధులు ఇవ్వడం పట్ల ఇతర రాష్ట్రాల నుంచి వ్యతిరేఖత వస్తున్నప్పటికీ, రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఏపీ అభివద్దికి కంకణబద్దులై ఉన్నామన్నారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే 2,500 కోట్ల రూపాయలను ఇచ్చామని, మిగతా వేయి కోట్ల రపాయలను సమయానుకూలంగా అందచేస్తామన్నారు. ఏపీకి 11 జాతీయ విద్యాసంస్థలను కేటాయించామని, ఇందులో 9 సంస్థలను ఇప్పటికే ప్రారంభించామన్నారు. నెల్లూరు జిల్లాలో తీరప్రాంత విశ్వవిద్యాలయం, విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం, అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఏపీలో ఏర్పాటు చేసిన విద్యాసంస్థల ఏర్పాటుకు పదివేల కోట్ల రపాయలు అవసరమవుతాయన్నారు. 3 లేదా 4 సంవత్సరాల్లో వీటిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో 14వ ఆర్థిక సంఘం నిధుల్లో కేంద్ర పన్నుల వాటా క్రింద ఏపీకి ఐదు సంవత్సరాల్లో 2.06 వేల కోట్ల రూపాయలు వస్తాయన్నారు. అమరావతిని ఆకర్షణీయ నగరాల జాబితాలో చేర్చడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు 1.93 లక్షల గహాలను కేటాయించామన్నారు. ఏపీలో  పారిశ్రామిక అభివద్దికి  అధిక మొత్తంలో నిధులు మంజూరు చేయడానికి కేంద్రం కతనిశ్చయంతో ఉందన్నారు.
–అవి తిరుమల లడ్డూలు:
ఏపీకి ప్రత్యేక  ప్యాకేజీ పేరిట  కేంద్రం ఇచ్చింది పాచిన లడ్డూలన్న జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ వాఖ్యలపై మంత్రి స్పందిస్తూ అవి పాచిన లడ్డూలు కావని, తిరుమల లడ్డూలని పేర్కొన్నారు. తిరుమల లడ్డూలు ఎంతో పవిత్రమైనవని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement